ఫోర్బ్స్ జాబితాలో ధోని | Dhoni in Forbes list of world’s highest paid athletes | Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్ జాబితాలో ధోని

Published Fri, Jun 13 2014 2:25 AM | Last Updated on Fri, Oct 5 2018 8:51 PM

Dhoni in Forbes list of world’s highest paid athletes

 ఏడాదిలో రూ. 177 కోట్ల ఆర్జన
 న్యూయార్క్: భారత క్రికెట్  కెప్టెన్ ధోని.. దేశంలోకెల్లా అత్యధిక ఆర్జన గల క్రీడాకారుడిగా ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదనతో తొలి 100 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులతో ఫోర్బ్స్ వెబ్‌సైట్ జాబితా రూపొందించింది.
 
 గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ దాకా 12 నెలల కాలంలో ధోని రూ. 177 కోట్లు ఆర్జించి ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి ఈ జాబితాలో నిలిచిన ఏకైక క్రీడాకారుడు ధోనియే.  ఈ  జాబితాలో అమెరికా బాక్సర్ మేవెదర్ ఏడాది కాలంలోనే రూ. 621 కోట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. టైగర్ వుడ్స్ రూ. 591 కోట్లతో రెండో స్థానం పొందాడు.  ఫుట్‌బాల్ ఆటగాళ్లలో  రొనాల్డో (పోర్చుగల్) రూ. 473 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement