
ఫోర్బ్స్ జాబితాలో మహేంద్ర సింగ్ ధోని
న్యూయార్క్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. దేశంలోని అత్యధిక ఆర్జన గల ఆటగాడిగా ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదనతో తొలి వంద స్థానాల్లో నిలిచిన క్రీడాకారులతో కూడిన జాబితాను ఫోర్బ్స్ వెబ్ సైట్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకూ ధోని సంపాదన రూ.177 కోట్లు. దీనిలో క్రికెట్ ఆడడం ద్వారా లభించినవి రూ. 23.5 కోట్లు అయితే ఎండార్స్‌మెంట్ల ద్వారా సంపాదించినివి 153.5 కోట్లు.
ఈ వంద మంది క్రీడాకారుల జాబితాలో ధోనికి 22 వ స్థానం లభించగా, అమెరికా బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ ఏడాది కాలంలోనే రూ. 621 కోట్లు సంపాదించి అగ్రస్థానంలో నిలిచాడు. గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ రూ. 591 కోట్లతో రెండో స్థానం పొందాడు. ఇక ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఫుట్‌బాల్ ఆటగాళ్లలో క్రిస్టియానో రొనాల్డో రూ. 473 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.