చలికాలంలో చర్మ సమస్యలు సాధారణం. వీటిలో పాదాల పగుళ్లు, ట్యాన్, తిమ్మిర్లు,పాదాల నుంచి వేడి ఆవిర్లు కమ్మినట్లు అనిపించడం వంటివి ఎదుర్కొంటూ ఉంటాం. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పాదాలచర్మాన్ని కాపాడుకోవచ్చు.మృదువుగానూ మార్చుకోవచ్చు.
తిమ్మిర్లు తగ్గడానికి...
∙ఈ కాలం ఎక్కువసేపు కుర్చీ, సోఫాలో కూర్చునే వారికి తిమ్మిర్ల సమస్య ఎక్కువ. అలాంటప్పుడు గ్లాసు వేడినీళ్లలో స్పూన్ వెనిగర్ కలిపి, దానిలో దూదిముంచి, దాంతో రెండు పాదాలు పూర్తిగా తుడవాలి. దీనివల్ల తిమ్మిర్లు,పాదాల చర్మం ΄÷డిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. కాటన్ సాక్సులు వేసుకుంటే కాళ్ల తిమ్మిర్లు తగ్గుతాయి.
పగుళ్ల నివారణకు...
పాదాల చర్మం భరించగలిగేంత వేడినీటిలో రాళ్ల ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. స్పూన్ అలోవెరా జెల్, స్పూన్ గ్లిజరిన్, విటమిన్ – ఇ క్యాప్సుల్, కొంచెం రాక్ సాల్ట్... ఇవన్నీ బాగా కలపాలి. పాదాల పగుళ్లుపైన ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత పాలిథిన్ కవర్‌తోపాదం మొత్తం మూసేయాలి. 10 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత కవర్ తీసేయాలి. దీనివల్ల పాదాల వేడి, నెమ్మదిగా పగుళ్లు తగ్గుతాయి.
ట్యాన్ ఏర్పడితే...
∙చలికాలం క్రీములు, లోషన్లు పాదాలకు ఎక్కువ రాస్తుంటాం. బయటకు వెళ్లినప్పుడు దుమ్ము, ఎండవల్ల ట్యాన్ ఏర్పడుతుంది. ఈ సమస్య నివారణకు.. స్పూన్ టమోటా రసంలో స్పూన్ బంగాళ దుంప రసం, స్పూన్ వెనిగర్, శనగపిండి లేదా కాఫీ పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్నిపాదాలకు అప్లై చేసి, పదిహేను నిమిషాలు ఉంచి, వాటర్ స్ప్రే చేసి, కాటన్ క్లాత్‌తో తుడిచేయాలి. వారానికి 2–3 సార్లు చేసుకుంటే ట్యాన్ తగ్గిపోతుంది.
శుభ్రమైన గోళ్లు
పాదాల గోళ్లు శుభ్రంగా ఉండాలంటే పెట్రోలియం జెల్లీని కొద్దిగా కరిగించి, దాంట్లో విటమిన్– ఇ క్యాప్సుల్, గ్లిజరిన్, రోజ్‌వాటర్ కలిపి రాత్రి పడుకునే ముందు గోళ్లచుట్టూ అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
మృదువైన చర్మానికి...
రోజ్‌వాటర్, రోజ్‌మెరీ ఆయిల్, నీమ్ ఆయిల్, అలోవెరా ఆయిల్ అన్నీ సమపాళ్లలో కలిపి స్ప్రే బాటిల్‌లో పోయాలి. ఈ మిశ్రమాన్ని రోజూ పడుకునే ముందు పాదాలకు స్ప్రే చేయాలి. ఇలా చేస్తే పాదాల చర్మం మృదువుగా అవుతుంది.
– సంతోష్ కుమారి, బ్యూటీషియన్
Comments
Please login to add a commentAdd a comment