Winter Care
-
చలికాలంలో చుండ్రు బాధ, ఒళ్లు పగులుతుంది ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే!
ఈ ఏడాది నవంబరు మాసం వచ్చినా కూడా సాధారణంగా ఉండేంత చలి వణికించకపోయినా, మిగతా సీజన్లతో పోలిస్తే చలి కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. చలిగాలులు సోకకుండా ఉన్ని,ఊలు దుస్తులను ధరించడంతోపాటు, రోగనిరోధక శక్తిని కాపాడుకునేలా ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి.చలికాలంలో శ్వాసకోస వాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అ ప్రమత్తంగా ఉండాలి. శరీరం వేడిగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. స్వెట్లర్లు, సాక్సులు, మంకీ క్యాప్‌లు విధింగా ధరించేలా చూడాలి. లేదంటే జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తాజా పండ్లు, ఆకుకూరలతో పాటు, తృణధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని మన ఆహారంలో చేర్చుకోవాలి. నిల్వచేసిన, ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారానికి బదులుగా ఎప్పటికప్పుడు వేడిగా తినడం మంచిది. అలాగే చలిగా ఉంది కదా అని మరీ వేడి నీటితో స్నానం చేయకూడదు. తల స్నానానికి కూడా గోరు వెచ్చని నీరు అయితే మంచిది. చుండ్రు సమస్య రాకుండా ఉండాలంటే, చలికాలంలో జుట్టును శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. మైల్డ్ షాంపూ వాడాలి. చలికాలంలో వేడి నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. గొంతు నొప్పి లాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.ముఖ్యంగా విటమిన్ సీ, ఏ, లభించేలా చూసుకోవాలి. అలాగే చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డీ అందేలా చూసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇలా అనేక రకాల సీజనల్ వ్యాధులను, ఇన్ఫెక్షన్ల ప్రమాదం నుంచి ఇది కాపాడతాయి. కొవ్వు చేపలు, కోడిగుడ్డు,మష్రూమ్స్, సోయా మిల్క్ వంటి వాటిలో డీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.రోగనిరోధక శక్తిని పెంచేలా విటమిన్ సీ లభించే సిట్రస్ పండ్లను తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బ్రోకలీ, బెర్రీ, వివిధ రకాల సిట్రస్ పండ్లపై దృష్టిపెట్టాలి. నట్స్, సీడ్స్, కోడిగుడ్లు, గుమ్మడి గింజలు, చేపలు వంటివి తీసుకోవాలి.విటమిన్ ఏ ఎక్కువగా లభించే క్యారెట్లు, చిలగడ దుంపలు, పాలకూర, పాలు, చీజ్ బీఫ్ లివర్, క్యాప్సికం, గుమ్మడి కాయ కూరగాయలను తీసుకోవాలి. విటమిన్ ఏ చర్మానికి, కంటి ఆరోగ్యానికి మంచిది. వీటితోపాటు, శరీరానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన బీ 12,బీ6ను తీసుకోవాలి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులనుంచి రక్షిస్తాయి. సాల్మన్ చేపలు, టునా ఫిష్, చికెన్, కోడిగుడ్లు, పాలు వంటి పదార్థాల్లో విటమిన్ బి 12 లభిస్తుంది. చలికాలంలో చర్మంపై కూడా చాలా ప్రభావం ఉంటుంది. పగలడం, ఎండిపోయినట్టు అవ్వడం చాలా సాధారణంగా కనిపించే సమస్యు. అందుకే దాహంగా అనిపించకపోయినా, సాధ్యమైనన్ని నీళ్లను తాగుతూ ఉండాలి. దీంతో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా, తేమగా ఉంటుంది. రాగుల జావ, తాజా పండ్ల రసాలు తీసుకోవాలి.డ్రై స్కిన్ ఉన్న వారికి చిట పటలాడం, మంట పెట్టడం, దురద పెట్టడం లాంటి ఇబ్బందులు మరీ ఎక్కువగా వస్తాయి. అలాంటి వారు ఖ వింటర్ సీజన్ లో మాయిశ్చ రైజింగ్ క్రీములు వాడాలి. చర్మ సంరక్షణ కోసం రసాయన సబ్బులకు బదులుగా ప్రకృతిసిద్ధంగా లభించే వాటితో తయారు చేసుకున్న సున్ని పిండి వాడితే ఉత్తమం. లేదా ఆయుర్వేద, లేదా ఇంట్లోనే తయారు చేసుకున్న సబ్బులను వినియోగించాలి. లేదంటే గ్లిసరిన్ సబ్బులను ఎంచుకోవాలి. విటమిన్ ఇ లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. -
Winter: స్నానానికి వేణ్ణీళ్లా? చన్నీళ్లా? ఆహారం తిన్న వెంటనే స్నానం చేయొద్దా?
Winter Care Tips: స్నానానికి వేణ్ణీళ్లా? చన్నీళ్లా? ఇదేం ప్రశ్న లేదా పనికి మాలిన సందేహం? ఎవరికి ఎలా ఇష్టం అయితే అలా స్నానం చేస్తారు అని ముఖం చిట్లించకండి. ఎందుకంటే స్నానానికి ఎప్పుడూ వేడినీళ్లకే లేదా ఎప్పుడూ చన్నీళ్లకే ప్రాధాన్యత ఇవ్వడం కొందరికి అలవాటు. అది ఒకందుకు మంచిదే. అయితే, ఎంత చలికాలం అయినా, చన్నీళ్లతోనే స్నానం చేయడం లేదా ఎంత వేసవిలో అయినా వేడినీళ్లతోనే స్నానం చేయడం అంత మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు. మరయితే ఏ నీటితో స్నానం చేయడం మంచిదో తెలుసుకుందామా? రెండూ అపోహలే దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు చన్నీళ్ల స్నానమే మంచిదంటారు. మరికొందరు వేడివేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల అలసట తీరిపోయి హాయిగా అనిపిస్తుందంటారు. నిజానికి ఈ రెండూ సరయినవి కావు. రెండూ అపోహలే. స్నానానికి నీళ్లు మరీ చల్లగా ఉండకూడదు. మరీ వెచ్చగా ఉండకూడదు. గోరువెచ్చని నీళ్లతో చేసే స్నానమే ఒంటికి ఆరోగ్యకరం. ఇక బలహీనంగా ఉన్నవాళ్లు, వయసుపైబడిన వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో కానీ స్నానం చేయవద్దు. అవి వేణ్ణీళ్లయినా, చన్నీళ్లయినా... వీలయినంత వరకు పొద్దున్నే ఏమీ తినకముందే స్నానం చేయడం మంచిది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల స్నానానికి ముందే తినాల్సివచ్చినా... కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు. ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత కనీసం అర్ధగంట అయినా వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది. ఒకవేళ మీరు చిన్నప్పట్నుంచీ చన్నీళ్ల స్నానమే చేస్తూ వస్తున్నారా? లేదా మీ వృత్తిరీత్యా వేరే ఊళ్లలో ఉండటం వల్ల వేణ్ణీళ్లు పెట్టుకోవడం సాధ్యం కావడం లేదా? ఇలా మరీ చన్నీళ్ల స్నానమే చేయడం తప్పకపోతే... స్నానం వ్యవధిని వీలైనంత కుదించండి. నీళ్లు ఎంత చల్లగా ఉంటే... స్నానం వ్యవధి అంతగా తగ్గాలన్నమాట. చన్నీళ్లతో లేదా వేణ్ణీళ్లతో స్నానం చేశాక ఒకవేళ తలనొప్పి లేదా జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే... అవి (చన్నీళ్లు / వేణ్ణీళ్లు) మీకు అంతగా సరిపడవని గుర్తించి, ఆ మేరకు గోరువెచ్చని నీటికి షిఫ్ట్ అవ్వండి. చదవండి: Hema Malini: మొహానికి అరోమా ఆయిల్‌తో మసాజ్.. నా బ్యూటీ సీక్రెట్ అదే! Saina Nehwal: తన మొహం కూడా చూడనంటూ పెదవి విరుపులు! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా.. -
Health Tips: ఈ జిగురుతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు! రోజూ ఇలా చేస్తే
Winter Care- Health Tips: చాలామందికి నిద్ర నుంచి లేవగానే నరాలు పట్టేస్తాయి. అవి రిలీఫ్ అయ్యేంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. నరాలు, మెడ, పాదాలు, నడుమునొప్పికి పరిష్కారం ఏముంది? అన్నింటికంటే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మానసికంగా కృంగి పోయినప్పుడు కూడా మెడ నరాలు పట్టేస్తాయి. మానసిక రోగాలు శారీరక రోగాలుగా మారతాయి. అందువల్ల మానసిక అరోగ్యం సాధించండి. ఒక్కోసారి కనిపించే లక్షణాలు 1. కాళ్ళు చేతులు మన ఆధీనములో ఉండవు, చలికి వణికినట్టు కంపిస్తాయి. 2. మెడ నరాలు పట్టినప్పుడు మెడకింద తవ్వ పెట్టుకుని, నేల మీద పడుకుంటే, విశ్రాంతిగా ఉంటుంది. చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. 3. కీళ్ల నొప్పి ఎక్కువ ఉంటే వేడి నీళ్ళ కాపడం పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. 4. ఆవ నూనె, లేదా యూకలిప్టస్ నూనె వ్రాయండి. తరువాత ,కాపడం పెట్టుకోవాలి. 5. వీలయితే తలను గుండ్రంగా తిప్పండి. కూడా నుండి, ఎడమకు, ఎడమ నుండి కుడికి . 6. సమయానికి భోజనము, విశ్రాంతి, సరైన వేళలలో నిద్ర పోవడము అలవరచుకోవాలి 7. మద్యపానం, ధూమపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి మోకాలు, కీళ్ల నొప్పుల నివారణకు కోసం ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి సహజంగానే ఎప్పటికప్పుడు నొప్పులు వస్తుంటాయి. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ అధిక బరువు ఉన్నట్టయితే తగ్గడానికి ప్రయత్నించాలి ►అలొవెరా (కలబంద)ను అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అలొవెరాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. ఇందుకు గాను కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని నేరుగా సంబంధిత ప్రదేశంలో రాయాలి. ►శల్లకి అనే వృక్షానికి చెందిన జిగురుతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇందులోనూ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. దీన్ని తెలుగులో ధూపము, గుగ్గిల వృక్షం అని పిలుస్తారు. దీని జిగురును నిత్యం 1 గ్రాము మోతాదులో తీసుకోవచ్చు. దీని వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శల్లకి మనకు మార్కెట్లో ట్యాబ్లెట్లు, క్రీముల రూపంలోనూ లభిస్తుంది. ►నీలగిరి ఆకుల తైలాన్ని 15 చుక్కల మోతాదులో తీసుకుని దానికి 2 టేబుల్ స్పూన్ల బాదం నూనె నొప్పిగా ఉన్న దగ్గర మాలిష్ చేయాలి కొంత వరకు రిలీఫ్ అవుతుంది -డా. నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు చదవండి: Heart Healthy Foods: గుండెకు మేలు చేసే ఆహార పదార్థాలు ఇవే! అయితే ప్రతి రోజూ ఓట్స్ తినడం వల్ల.. Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్, షుగర్ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా.. -
చంపుతున్న చలి.. గుండె జబ్బులున్నవారు వాకింగ్ చేస్తున్నారా!
తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దినదినం రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వణికించే చలి కారణంగా వ్యాధులు చుట్టుముట్టే అవకాశముంది. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం, గుండె జబ్బులున్నవారికి ప్రమాదం పొంచి ఉంది. ఉదయం, రాత్రివేళలో బయటకు వెళ్తే చర్మం పొడి బారి బిగుసుగా మారనుంది. కాళ్ల మడిమలు, పాదాలు పగులుతాయి. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి అధిగవిుంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. చర్మ సంరక్షణ ఇలా.. చలికాలంలో శరీరానికి మాయిశ్చరైజర్లు తప్పనిసరి. క్రీమ్ టేస్ట్ మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. చలికి పెదాలు పగిలి రక్తం కారకుండా వ్యాజిలిన్, లిప్‌బామ్ రాసుకోవాలి. చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండేందుకు గ్లిజరిన్ సబ్బులు వాడాలి. స్నానానికి ముందు ఆలీవ్ ఆయిల్, కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకొని గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఖర్చు తగ్గించుకోవాలనుకునేవారు ఇంట్లోనే అందుబాటులో ఉండే శనగపిండితో స్నానం చేయాలి. వివిధ పనుల కోసం బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా ఉన్ని దస్తులు ధరించాలి. బైక్‌పై వెళ్లేవారు మంకీ క్యాప్, కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌస్లు వాడాలి. ఎండకు వెళ్లాలనుకుంటే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. రాత్రివేళ నిద్రించే ముందు మోచేతులు, మోకాళ్లు పగలకుండా నూనె, లేపనం రాసుకుంటే మంచిది. థైరాయిడ్ తరహా సమస్యలున్నవారు పైజాగ్రత్తలతో పాటు ఇంట్లో సాక్స్‌లు ధరించడం మేలు. దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం ఉంటే ఇంటి వ ద్దనే విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. మధుమేహం, గుండెజబ్బులున్నవారు శరీరంపై గీతలు పడకుండా జాగ్రత్తపడాలి. చదవండి: Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే.. పాదాలు పగిలితే.. చలికాలంలో చాలామందికి పాదాలు పగులుతాయి. ఉప్పునీరు కలిసిన గోరు వెచ్చని నీటిలో పది నిమిషాల పాటు పాదాలు ఉంచాలి. ఆ తర్వాత సబ్బుతో శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతో తుడవాలి. పగిలిన చోట మాయిశ్చరైజర్ రాయాలి. విటమిన్–ఈ క్రీమ్ రాస్తే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సలహాలు పాటించాలి. అస్తమా ఉంటే.. చలికాలంలో అస్తమా ఉన్నవారు నిత్యం వాడే మందులను అందుబాటులో ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలి. గాలికి తిరగవద్దు. డాక్టర్ సలహా మేరకు మందులు, ఇన్హేలర్, నెబ్యులైజర్ లాంటివి వాడాలి. గుండె జబ్బులుంటే.. చలికాలంలో గుండెజబ్బులున్న వారు, గుండె ఆపరేషన్ చేయించుకున్నవారు వాకింగ్ చేయవద్దు. చలిలో ఎక్కువగా తిరిగితే రక్త నాళాలు సంకోచించి గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. బీపీ, షుగర్ ఉన్న వారు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఆహారంలో మార్పులు అవసరం చలికాలంలో సమతుల ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా జామ, దానిమ్మ, బొప్పాయి, సంత్ర, అరటిపండ్లు ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ ‘సీ’ ఉన్న పండ్లు జలుబు, ఫ్లూ వంటి జబ్బుల నుంచి కాపాడుతాయి. మరీ పచ్చిగా ఉన్నవి, బాగా పండినవి కాకుండా మధ్యస్తంగా ఉన్న పండ్లు ఎంపిక చేసుకోవాలి. చలికాలంలో సహజంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు, వంటివి త్వరగా వస్తాయి. ఆహారం అరుగుదల తక్కువగా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. మనిషి శరీరానికి యాంటీ యాసిడ్స్ ఎంతో అవసరం. గుడ్లు, చేపల్లో ఇవి అధికంగా లభిస్తాయి. జింక్ ఉండే బాదం వంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. రోగకారక క్రిములతో పోరాడే పెరుగును తీసుకోవడం ఉత్తమం. వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. మార్కెట్లో లభిస్తున్న నల్లద్రాక్ష చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది. వీటిలో విటమిన్ ఏ, బీ1, బీ2 ఉంటాయి. పిల్లల్లో కడుపునొప్పికి నివారణిగా పని చేస్తాయి. జాగ్రత్తలు తప్పనిసరి చలికాలంలో శరీరానికి వేడిచేసే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అల్కహాలి క్ పానీయాలను స్వీకరించొద్దు. పొడి దుస్తులను ధరించాలి. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా చూడాలి. సూర్యోదయం తర్వాతే జాగింగ్, వ్యా యామం చేయాలి. ఏదైన ఆరోగ్య సమ స్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – రత్నాకర్, జనరల్ ఫిజీషియన్, నిర్మల్ జిల్లా ఆస్పత్రి -
Health: అలర్జీలు.. అలసత్వం వహిస్తే ప్రాణాంతకం కూడా! ఆహారంలో పీతలు, సోయా.. ఇంకా
Winter Care- Health Tips: మడిసన్నాక కాసింత కళాపోషణుండాల అనే సినిమా డైలాగ్‌లా మనిషన్నాక జీవితంలో ఏదో ఒక దశలో అలర్జీ కలగక మానదు. బాధించకుండానూ ఉండదు. ఇందుకు మనం పీల్చే గాలి, తీసుకునే ఆహారం, ప్రేమతో పెంచుకునే జంతువులు, వాడే సుగంధ ద్రవ్యాలు లేదా తీసుకునే మందులు కూడా కారణం కావచ్చు. అలర్జీ అంత ప్రమాదకరం కాకపోయినా, అలసత్వం వహిస్తే ప్రాణాంతకం కూడా కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలర్జీల విజృంభణకు శీతాకాలం అనువైన సమయం. అందువల్ల మనం సాధారణంగా ఎదుర్కొనే కొన్ని రకాల అలర్జీలు, కారణాలు, నివారణలపై అవగాహన కోసం.. అలర్జీ అంటే ఏదో పెద్ద వ్యాధి అని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ, అది కరెక్ట్ ఆలోచన కాదు. అలర్జీ అంటే శరీరం ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అన్నమాట. అంటే, మనం తీసుకునే ఆహారం లేదా గాలి శరీరంలోకి వెళ్లినప్పుడు, మన శరీరం స్పందించాల్సిన దానికంటే ఎక్కువగా స్పందిస్తుంది. ఈ విధంగా మోతాదు కంటే ఎక్కువగా స్పందిస్తే దాన్ని అలర్జీ లేదా హైపర్ సెన్సిటివిటీ అంటారు. దీనిమూలంగా రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఆహారపరమైన అలర్జీ మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు ఆహార సంబంధమైన అలర్జీలకు దారితీస్తాయి. సాధారణంగా ఫుడ్ అలర్జీలు గుడ్లు, పాలు, వేరుశెనగ, చేపలు, రొయ్యలు, పీతలు, సోయా, కొన్ని రకాల నట్స్ (ఆక్రోట్స్, బాదం, బ్రెజిల్ నట్స్), గోధుమ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వస్తాయి. శరీరానికి ఈ పదార్థాలు సరిపడకపోతే దురద, చర్మంపై దద్దుర్లు, వాంతులు లేదా కడుపులో అసౌకర్యం, శ్వాస సరిగా అందకపోవటం, గురక, దగ్గు, గొంతునొప్పి, పల్స్ పడిపోవడం, చర్మం నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఫుడ్ అలర్జీల నిర్ధారణకు చర్మ పరీక్షతోపాటు రక్త పరీక్షలు(ఐజీఈ యాంటీబాడీస్) కూడా చేయాల్సి ఉంటుంది. దుమ్మెత్తే అలర్జీ దుమ్ము, ధూళి వల్ల, వాటిలోని సూక్ష్మజీవుల వల్ల వచ్చే అలర్జీని డస్ట్ అలర్జీ అంటారు. వైద్య పరిభాషలో వీటిని డస్ట్ మైట్స్ అంటారు. శ్వాస తీసుకునే క్రమంలో ఈ డస్ట్ మైట్స్ శరీరంలోకి ప్రవేశించి శ్వాసనాళాల వ్యాకోచం లేదా వాపునకు కారణమవుతాయి. దీనివల్ల తుమ్ములు, ముక్కు కారడం, కంటిలో దురద, కళ్ళలో నుంచి జిగట నీరు, ఒళ్లంతా దురద, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. మన ఇళ్లలో ఉండే తేమ, దుమ్ము, మురికి ఈ డస్ట్ మైట్స్‌కు ఆవాసాలు. కాబట్టి దుప్పట్లు, దిండు గలీబులు, టవల్స్, కార్పెట్లు, ఇతర సామగ్రిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. డస్ట్ అలర్జీ కారకాలను గుర్తించడానికి కొన్ని రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఫలితాలను బట్టి ఏయే పదార్థాలు మనకు సరిపడటం లేదో, ఆయా పదార్థాలకు దూరంగా ఉండమని లేదా వాటికి తగిన మందులను సూచిస్తారు వైద్యులు. డస్ట్ అలర్జీతో బాధపడేవారు 80 శాతం మంది ఆస్తమా రోగులుగా మారుతున్నారు. కంటి అలర్జీ సాధారణంగా కంటి అలర్జీలు పుప్పొడి, డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువుల చర్మ కణాలు వంటి వాటి వల్ల సంభవిస్తాయి. వీటివల్ల కళ్లలో దురద, వాపు, మంట, జిగట నీరు కారడం, ఎరుపెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి అంటువ్యాధులు కావు. కంటి అలర్జీలకు ప్రత్యేకమైన నిర్ధారణ పరీక్షలు ఏవీ ఉండవు. కంటి అలర్జీకి కారకాలేమిటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటమే నివారణ. అలర్జీ వస్తే ఏం చేయాలంటే..? శరీరంలో అలర్జీ లక్షణాలు కనిపించిన వెంటనే అలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. డాక్టర్ తో మీ ఫ్యామిలీ హిస్టరీ, జీవనశైలి, ఇతర జబ్బులకు వాడుతున్న మందులు తదితర వివరాలను తెలియజేస్తే, దానికి తగిన నిర్ధారణ పరీక్షలను సూచిస్తారు. ముందుగా ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, ఎక్స్‌రే వంటి పరీక్షలు నిర్వహించి ఆ తరువాత మీ అలర్జీ కారకాలను గుర్తించడానికి చర్మ పరీక్షలు, ప్యాచ్ లేదా రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల నివేదికల ఆధారంగా మీరు ఏరకమైన అలర్జీ లతో బాధపడుతున్నారో నిర్ధారించుకొని తగిన చికిత్సను సిఫార్సు చేస్తారు. చికిత్స ఏమిటి? అలర్జీలకు సరైన చికిత్సను నిర్ధారణ పరీక్షల ఆధారంగానే కాకుండా బాధితుడి మెడికల్ హిస్టరీ, లక్షణాల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఇవ్వవలసి ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. దీన్ని ఏదో ఒక చికిత్సా విధానం ద్వారా అదుపులో ఉంచుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే! చదవండి: Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే.. -
శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే ఇది ఎక్కువగా తినాలి..!
సైనస్, కీళ్ల నొప్పులు, అజీర్తి, జలుబు, దగ్గు.. శీతాకాలంలో పొంచి ఉండే రుగ్మతలు. వీటి నుంచి బయటపడేందుకు మీ వంటిట్లోనే చక్కని పరిష్కారం ఉంది. హాస్పిటల్ల చుట్టూ తిరగకుండా.. మీ ఆరోగ్యాన్ని మరింత పదిలంగా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. పసుపు అవును.. ఆహారంలో పసుపు తీసుకోవడంవల్ల చేకూరే మేలు అంతాఇంతా కాదు. పాలు, టీ వంటి పానీయాల్లో చిటికెడు పసుపును జోడించడం వల్ల చలికాలపు రుగ్మతల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. మీ ఆహారంలో పసుపును భాగం చేస్తే చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. చదవండి: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం.. పసుపును ‘హాలిడే వెయిట్’ అని కూడా అంటారు. కొంతమంది సెలవురోజుల్లో ఆరోగ్యానికి హాని తలపెట్టే ఆల్కహాల్ వంటివి సేవించడం పరిపాటి. ఫలితంగా లివర్ దెబ్బ తినడం జరుగుతుంది. ఐతే పసుపులోని యాంటీఆక్సిడెంట్స్ మీ శరీరానికి లోపల్నుంచి చికిత్సనందిస్తుంది. శీతాకాలపు చలిని తట్టుకోవడానికి కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఐతే కొంతమంది వేడి పానీయాలను అధికంగా తీసుకుంటారు. ఇవి జీర్ణవ్యవస్థను ఇబ్బందిపెడతాయి. పసుపు ఆహారానికి రుచిని జోడించడమేకాకుండా, జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాదు తరచుగా ఆహారంలో పసును తీసుకోవడం వల్ల మీ చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపు కూడా వనకూరుతుంది. పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో అనేక వ్యాధుల నివారణలో పసుపు వినియోగించబడుతోందనే విషయం తెలిసిందే. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చక్కని మందు మన వంటిటి పసుపే! కాబట్టి దీనిని తీసుకోవడం మర్చిపోకండే..! చదవండి: Depression: ఆ సమయంలో ఈ నాలుగూ మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి.. జాగ్రత్త!! -
Beauty Tips: ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తొలగించేందుకు.. ఆనప ఫేస్ ప్యాక్!
Winter Skin Care Tips In Telugu: వాతావరణం మారినప్పుడల్లా ఆ ప్రభావం సున్నితమైన చర్మంపై పడుతుంది. ఫలితంగా ముఖం మీద ట్యాన్ పేరుకు పోవడం, కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడటం.. వెరసి ముఖం పొడిబారి గ్లో తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, పోషణ అందించే ప్యాక్‌లు వాడటం ద్వారా పోయిన గ్లోను తిరిగి తెస్తాయి. ►సొరకాయ (ఆనప కాయ) గుజ్జులో పావు టీస్పూను తేనె, టీస్పూను అలోవెరా జెల్, టీస్పూను రోజ్ వాటర్, విటమిన్ ఈ క్యాప్సూల్ వేసి పేస్టులా కలుపుకోవాలి. ►ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. తరువాత పదినిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. ►ముఖాన్ని శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు వేసుకోవడం వల్ల నల్లని మచ్చలు, ట్యాన్ తొలిగి ముఖం నిగారింపును సంతరించుకుంటుంది. చదవండి: Weight Loss Diet: ఆ హార్మోన్ వల్లనే బరువు పెరుగుతారు..! యాలకులు, వెల్లుల్లి, కరివేపాకు, తేనె, మజ్జిగ.. -
రుచులూరే వేడివేడి వింటర్ సూప్స్ తయారు చేయండిలా..
చలికాలం మొదలైపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటేనే హాయిగా అనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సూప్‌లు అయితే శరీరానికి వెచ్చదనంతోపాటు పోషకాలనూ అందిస్తాయి. వేడివేడి సూప్‌లను రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... బీట్రూట్ చికెన్ సూప్ కావల్సిన పదార్ధాలు చికెన్ – పావుకేజీ వెల్లుల్లి రెబ్బలు – ఆరు అల్లం – అరంగుళం ముక్క ఉల్లిపాయలు – రెండు బీట్రూట్ – రెండు మిరియాల పొడి – టీ స్పూను బటర్ – రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా కొత్తిమీర తరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు స్ప్రింగ్ ఆనియన్ తరుగు – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►పాత్రను తీసుకుని.. శుభ్రంగా కడిగిన చికెన్, ఒక ఉల్లిపాయను ముక్కలు తరిగి వేయాలి. మూడు వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, లీటరు నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. ►ఉడికించిన మిశ్రమం నుంచి చికెన్, స్టాక్‌ను వేరుచేసి పక్కనబెట్టుకోవాలి. చికెన్‌ను చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ►స్టవ్ మీద పాన్ వేడెక్కిన తరువాత బటర్ వేయాలి. ►మిగిలిన వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేయాలి. మిగిలిన ఉల్లిపాయను ముక్కలు తరిగి వేసి వేయించాలి. ►ఇవి రెండూ వేగిన తరువాత చికెన్ స్టాక్, బీట్రూట్ ముక్కలు మరికొన్ని నీళ్లు పోసి మరిగించాలి. ►పది నిమిషాలు మరిగాక చికెన్ ముక్కలు వేసి మరో ఇరవై నిమిషాలు మరిగించి కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ తరుగుతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్‌చేయాలి. చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. స్వీట్ కార్న్ వెజ్ సూప్ కావల్సిన పదార్ధాలు పేస్టు కోసం: స్వీట్‌కార్న్ గింజలు – అరకప్పు నీళ్లు – రెండు టేబుల్ స్పూన్లు సూప్: ఆయిల్ – మూడు టీస్పూన్లు వెల్లుల్లి రెబ్బలు – రెండు అల్లం – అంగుళం ముక్క స్ప్రింగ్ ఆనియన్ తరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు స్వీట్ కార్న్ గింజలు – పావు కప్పు క్యారెట్ తరుగు – పావు కప్పు బీన్స్ తరుగు – పావు కప్పు నీళ్లు – మూడు కప్పులు ఉప్పు – రుచికి సరిపడా మిరియాలపొడి – టీ స్పూను వెనిగర్ – టీస్పూను కార్న్‌ఫ్లోర్ – టీస్పూను (పావు కప్పు నీటిలో కలిపి పెట్టుకోవాలి) తయారీ విధానం ►ముందుగా అల్లం, వెల్లుల్లిలను సన్నగా తరగాలి. ►బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి వెల్లుల్లి, అల్లం తరుగు వేసి దోరగా వేయించాలి. ►తరువాత స్ప్రింగ్ ఆనియన్ తరుగు, పావు కప్పు స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్ తరుగును వేసి ఐదునిమిషాలు ఉడకనివ్వాలి. ►ఇప్పుడు పేస్టుకోసం తీసుకున్న స్వీట్‌కార్న్‌ను రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ►ఈ పేస్టును ఉడుకుతున్న సూప్ మిశ్రమంలో వేసి రెండు నిమిషాలు వేయించాలి. ►ఇప్పుడు మూడు కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి 15 నిమిషాలు మరిగించాలి. ►మరిగాక కార్న్‌ఫ్లోర్ మిశ్రమం వేసి కలుపుకోవాలి. ►సూప్ మిశ్రమం చిక్కబడిన తరువాత మిరియాల పొడి, వెనిగర్, స్ప్రింగ్ ఆనియన్ వేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
అందుకే చలికాలంలో చర్మం పొడిబారిపోతుంది! ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే..
సీజన్ మారింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఏటా వచ్చే ఈ మార్పును వాతావరణ శాఖ అధికారికంగా నమోదు చేస్తుంది. కానీ అంతకంటే ముందే మన దేహం సంకేతాలను జారీ చేస్తుంది. దుప్పటి పక్కకు తోసేసే పిల్లలు ఒద్దికగా దుప్పటిలో తమను తాము ఇముడ్చు కుంటారు. సాక్స్ వేసుకునేటప్పుడు సాఫీగా సాగిపోకుండా పాదాల చర్మానికి తగులుకోవడం, దారాలు లేవడం మరో సంకేతం. పెద్ద బైట్ తీసుకుందామని నోరు అమాంతం తెరిస్తే పొడిబారిన పెదవులు సహకరించవు. ఆరు నెలలుగా డ్రెస్సింగ్ టేబుల్ డ్రాల్లో ఉండిపోయిన లిప్‌బామ్‌లు, బాడీ లోషన్లు బయటకు వస్తాయి. కాలం మారింది... అందుకే లైఫ్ స్టైల్ కూడా మారి తీరాలి మరి. దేహం రాజీ పడదు చలికాలం దాదాపుగా అందరూ చేసే ప్రధానమైన పొరపాటు నీరు తక్కువగా తీసుకోవడం. ‘దాహం వేయలేదు కాబట్టి తక్కువగా తాగాం, దేహానికి అవసరమైతే దాహం వేస్తుంది కదా’ అని సౌకర్యవంతమైన సమాధానం చెప్పుకుంటే కుదరదు. చల్లటి నీటికి బదులు నార్మల్ వాటర్ లేదా గోరువెచ్చటి నీటిని ఎప్పటిలాగానే రెండు ముప్పావు నుంచి మూడు ముప్పావు లీటర్ల వరకు తీసుకోవాలి. మజ్జిగ, పండ్ల రసాల వంటి ద్రవాలను ఎక్కువ తీసుకున్నప్పుడు నీటి పరిమాణాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు. ‘యూఎస్ నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్’ సూచన మేరకు సగటున ఒక మహిళ రోజుకు 2.7 లీటర్లు, మగవాళ్లు 3.7 లీటర్లు ద్రవాలు (నీరు, ఇతర ద్రవాహారం కలిపి) దేహానికి అవసరమని సూచించింది. ఏ కాలమైనా సరే... దేహంలోని వ్యర్థాలను బయటకు పంపించడానికి దేహక్రియలకు అవసరమైన ద్రవాలు దేహానికి అంది తీరాలి. అప్పుడే చర్మం పొడిబారకుండా, నిర్జీవంగా మారిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది. దేహంలోని వ్యర్థాలు విసర్జితం కాకుండా చర్మం మీద ఎన్ని లోషన్లు రాసినా దేహక్రియలు మెరుగుపడవు, చర్మఆరోగ్యం కూడా మెరుగవదనే విషయాన్ని మర్చిపోకూడదు. చదవండి: 23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!! వెచ్చ‘టీ’లు ఈ సీజన్లో బాలెన్స్డ్ డైట్ తప్పని సరి. పగలు పుదీనా టీ, తులసి టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ, లెమన్ టీ, తాజా నిమ్మరసం తీసుకోవాలి. అందుబాటులో ఉంటే కొబ్బరి నీరు కూడా తాగచ్చు. కొబ్బరి నీరు ఎండాకాలంలో మాత్రమే తాగాలనుకోవడం కేవలం అపోహ మాత్రమే. వర్షాకాలమైనా, శీతాకాలమైనా కొబ్బరి నీరు ఆరోగ్యకరమే. రాత్రి భోజనానికి ముందు వెజిటబుల్ సూప్‌లు తాగాలి. పొట్టుతో కూడిన ధాన్యాలు, పప్పులు, నట్స్, మంచి నెయ్యి రోజువారీ ఆహారంలో ఉండాలి. మాంసాహారులైతే ఈ కాలంలో మ మటన్‌కు బదులు తేలిగ్గా జీర్ణమయ్యే చేపలు, చికెన్, గుడ్లు తీసుకోవచ్చు. వాల్నట్, అవిసె గింజలు తీసుకోవాలి. అలాగే బొప్పాయితోపాటు బత్తాయి, కమలాపండ్లు రోజూ తీసుకుంటే మంచిది. ఇక కూరల్లో ఈ సీజన్లో పండే అన్ని రకాల కూరగాయలు, క్యాలిఫ్లవర్, బ్రోకలి వారంలో ఒకసారైనా తీసుకుంటుంటే చర్మానికి మాయిశ్చర్ సహజంగా అందుతుంది. చదవండి: ఆ ఫొటోలు తీసినందుకు దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు.. ఎమోషనల్ ఈటింగ్ వద్దు ఆహార విహారాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరిలో వారికి ఉన్న ఇతర ఆరోగ్యకారణాల రీత్యా ఈ కాలంలో విటమిన్ డీ 3, బీ12 లోపం ఏర్పడుతుంటుంది. బీ 12 లోపం మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది. ప్రతి చిన్న విషయానికీ విపరీతమైన భావోద్వేగాలకు లోనవుతుంటారు. ఈ మానసిక అలజడి నుంచి సాంత్వన పొందడానికి ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఈ ఎమోషనల్ ఈటింగ్ చాలా సందర్భాల్లో ఓవర్ ఈటింగ్‌కు దారి తీస్తుంది. కాబట్టి దేహంలో బీ12, డీ3 విటమిన్ స్థాయులు తగ్గకుండా చూసుకోవాలి. అవసరం అనిపిస్తే విటమిన్ లెవెల్స్ టెస్టులతో నిర్ధారించుకుని తదనుగుణంగా జీవనశైలి మార్పులు చేసుకోవచ్చు. ఎండ మంచిదే! రోజూ కనీసం అరగంట సమయం అయినా సూర్యరశ్మి ఒంటి మీద పడాలి. అప్పుడే దేహంలో సెరోటోనిన్ స్థాయులు, మెలటోనిన్ స్థాయులు సక్రమంగా ఉంటాయి. అవి మంచి నిద్రకు, హార్మోన్స్ సమతుల్యతకు దోహదం చేస్తాయి. కాబట్టి ఈ విధమైన జీవనశైలితో దేహంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. చలికాలంలో దేహ సాధారణ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడంతోపాటు రెండేళ్లుగా భయపెడుతున్న కరోనా వ్యాధిని, భౌతికదూరం వంటి జాగ్రత్తలను మర్చిపోకూడదు. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. -
Garlic: శీతాకాలంలో ఉదయాన్నే వెల్లుల్లి తింటున్నారా? అయితే..
Health Benefits Of Garlic In Telugu: చలికాలం వచ్చేసింది! ఈ కాలంలో ఇమ్మునిటీ సిస్టం బలంగా లేకపోతే జలుబు, దగ్గు.. ఇతర సీజనల్ రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఐతే ఈ సీజన్లో ప్రత్యేక పోషణనిచ్చే ఆహారాలను తప్పక తీసుకోవాలి. ప్రాచీనకాలం నుంచి ప్రతి వంటగదిలో తప్పకుండా ఉండే మూలిక వెల్లుల్లి. దీని సువాసన, రుచి ఎన్నో రుగ్మతలకు విరుగుడుగా పనిచేస్తుంది. అంతేకాకుండా వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా మెండే. వెల్లుల్లిలో విటమిన్ ‘బి, సి’, ఫోలేట్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి. యూఎస్డీఏ ప్రకారం వంద గ్రాముల వెల్లుల్లిలో 150 కేలరీలు, 33 గ్రాముల పిండి పదార్థాలు, 6.36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. శీతాకాలంలో వెల్లుల్లిని ఆహారాంలో భాగం చేస్తే చేకూరే ఆరోగ్య ప్రయోజనాలుమిటో తెలుసుకుందా... జలుబు, దగ్గు నివారిస్తుంది ఈ కాలంలో జలుబు, దగ్గు మామూలుగానే వస్తుంది. ఈవిధమైన సమస్యలకు వెల్లుల్లి చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధుల నుంచి వెల్లుల్లి రక్షణ కల్పిస్తుందనే నానుడి ఎప్పటినుంచో ఉంది. సైనసైటిస్, జలుబు, ఫ్లూతో బాధపడేవారు వేడి వంటకాలు, పులుసులు, సూప్‌లలో వెల్లుల్లిని చేర్చి తినాలి. ఐతే ఉడికించిన వెల్లుల్లి కంటే.. పచ్చిగా ఉన్నప్పుడు తింటేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని ఢిల్లీకి చెందిన ప్రముఖ హెల్త్ అండ్ వెల్నెస్ నిపుణులు డా. శిఖా శర్మా సూచిస్తున్నారు. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! బరువు తగ్గడానికి దివ్యౌషధం చలికాలంలో బరువుతగ్గడం ఓ పెద్ద టాస్క్ లాంటిదే! ఐతే వెల్లుల్లి రెబ్బలు సులువుగా బరువుతగ్గడానికి సహాయపడతాయి. సహజంగానే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే వెల్లుల్లి మన శరీరంలోని హానికారకాలను బయటికి పంపడానికి, ఆరోగ్యకరమైన జీవక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా దీనిలోని పోషకాలు బరువుతగ్గడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఉదయాన్నే పరగడుపున 5 పచ్చి వెల్లుల్లి రెబ్బలు, తేనెతో కలిపి తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శ్వాస సమస్యలు దూరం వెల్లుల్లిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు ఉపిరితిత్తుల ఆరోగ్యానికి జీవం పోస్తాయి. చలికాలంలో తరచూ వచ్చే జ్వరం, కఫం, గొంతు నొప్పి సమస్యలకు వెల్లుల్లి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ►వెల్లుల్లి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుపచడానికి సహాయపడుతుంది. ►వెల్లుల్లి రెబ్బలు తరచూ తినడం మూలంగా గుండె జబ్బులను నివారించవచ్చు. చదవండి: Supai Village Story: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! -
సిటీజనులు గజగజలాడుతున్నారు....
వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు చోటు చేసుకుంది. మహానగరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. చలితో సిటీజనులు గజగజలాడుతున్నారు. రాత్రి వేళల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. కోర్ సిటీతో పోలిస్తే శివార్లతో చలి తీవ్రత కొంత ఎక్కువగా ఉంది. ఉదయం ఐదు గంటలకే నిద్రలేచే నగరం ఎనిమిదైనా ముసుగు తీయడం లేదు. వాతావరణంలో వస్తున్న మార్పులకు శరీరం తట్టుకోలేకపోతోంది. వాయు కాలుష్యంతో పాటు చలి తీవ్రతకు అస్తమా రోగులు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు. జుట్టు రాలడంతో పాటు హృద్రోగ సమస్యలు రెట్టింపవుతాయి. డిసెంబర్, జనవరి నెలల్లో చలి మరింత ముదిరే అవకాశమున్నందున ఈ కాలంలో వచ్చే సమస్యలకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. – సాక్షి,సిటీబ్యూరో సాక్షి : చలికాలంలో దాని తీవ్రతకు కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడడం సర్వసాధారణం. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పును దేహం స్వీకరించే స్థితిలో ఉండదు. ఈ క్రమంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు శ్వాస నాళాలు మూసుకుపోయి, చెవి, గొంతు వంటి ఆరోగ్య సంబంధ సమస్యలతో పాటు ఇన్ఫెక్షన్లు రెట్టింపవుతుంటాయి. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు త్వరగా ఫ్లూ భారిన పడే ప్రమాదముంది. ప్రస్తుత వాతావరణం ‘హెచ్1ఎన్1’ స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌కు అనుకూలంగా ఉండడంతో అది మరింత విజృంభించే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆ వైరస్ గాలిలోకి ప్రవేశిస్తుంది. చర్మం జాగ్రత్త ఐటీ అనుబంధ రంగాల ఉద్యోగులు చలి తీవ్రత ఎక్కువగా ఉండే రాత్రి వేళల్లో పనిచేస్తుంటారు. వీరిలో చాలా మంది టూ వీలర్‌పైనే ప్రయాణిస్తుంటారు. ఉదయం చలితో పాటు దట్టమైన పొగమంచు ఉంటుంది. ఈ కాలంలో ఉదయం విధులకు వెళ్లేవారు కాళ్లు, చేతులు, ముఖానికి చలిగాలులు తాకడం వల్ల చర్మం దెబ్బతింటుంది. కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడతాయి. దురద పుట్టి గోకినప్పుడు పగుళ్లు పుండ్లుగా మారే ప్రమాదం ఉంది. జుట్టు రాలిపోవడంతో పాటు చుండ్రు సమస్య తలెత్తవచ్చు. ఇప్పటికే సోరియాసిస్ వంటి చర్మ రోగాలతో బాధపడుతున్న వారు ఈ సీజన్లో మరింత ఇబ్బంది పడుతుంటారు. చలికాలంలో శరీరంలో ‘కార్టిసో’ హార్మోన్ ఉత్పత్తి అయ్యి రక్త నాళాల సైజు తగ్గి, బ్లడ్ క్లాట్‌కు కారణమవుతుంది. నీరు అధికంగా తాగాలి రాత్రి వేళ శరీరానికి మాయశ్చర్ క్రీములు రాసుకోవడం ద్వారా చర్మ పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ కాలంలో పెదాలు తరచూ ఆరిపోతుంటాయి. ఉపశమనం కోసం ఉమ్మితో తడుపుతూ చిగుళ్లను పంటితో కొరుకుతుంటారు. దాంతో చర్మం చిట్లిపోయి రక్తం కారుతుంది. ఇలా చేయకుండా పెదాలకు లిప్‌గార్డ్ వంటివి రుద్దడం ద్వారా కాపాడుకోవచ్చు. ఈ సీజన్లో నీరు సమృద్ధిగా తాగాలి. లేదంటే బాడీలో నీటి శాతం తగ్గి స్కిన్గ్లో తగ్గిపోతుంది. సోరియాసిస్ బాధితులు స్నానానికి ముందు ఒంటికి ఆయిల్ అప్లయ్ చేసుకోవాలి. చల్లటి నీరు కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. పిల్లలకు కాళ్లు, చేతులు బయటికి కనిపించకుండా ఉన్ని దుస్తులు వేయాలి. సాధ్యమైనంత వరకు హృద్రోగ బాధితులు చలిలో తిరగక పోవడమే ఉత్తమం. ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారు సూర్యోదయం తర్వాత కాస్త ఎండ వచ్చాక వాకింగ్ చేయడం మంచిది. – డాక్టర్ మన్మోహన్, డెర్మటాలజిస్ట్ ఆయిల్ ఫుడ్డ్ దూరం.. చలికాలంలో త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం తీసుకోవడమే మంచిది. మజ్జిగ, కాయకూరలు, సీజనల్‌గా లభించే పండ్లు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు మద్యం, మాంసాహారాన్ని దూరం పెట్టాలి. ఆయిల్ ఫుడ్, మసాల వేపుళ్లకు సాధ్యమైంతన తినకపోవడమే మంచిది. నిల్వ చేసిన ఆహార పదార్థాలకు బదులు వేడివేడి పదార్థాలే తినాలి. దాహం వేయకలేదని చాలా మంది నీరు తాగరు. కానీ ఈ కాలంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తీసుకోవాలి. గోరువెచ్చని నీరు తాగడం చాలామంచిది. – డాక్టర్ మధుసూదన్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఏది పడితే అది తినొద్దు చలికాలంలో వేడివేడి వంటకాలను ఇష్టపడుతుంటారు. ఆయిల్ వేపుడు చేసిన ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకుంటారు. శరీర ఉష్ణోగ్రతలను పెంచుకునేందుకు మద్యం, మాంసం తింటుంటారు. దాంతో ఫ్యాటీలివర్ వంటి సమస్యలతో పాటు రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. సరిపడు నీరు తాగక పోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదముంది. ఆయిల్ ఫుడ్డు ఎక్కువ తీసుకోవడం వల్ల అల్సర్, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. పొట్ట బిగుసుకు పోయి ఇబ్బందిగా మారుతుంది. ఛాతిలో భరించలేని మంట ఏర్పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చెవి, ముక్కు, గొంతు భద్రం గ్రేటర్ పరిధిలో చిన్నాపెద్దా కలిపి దాదాపు 50 వేల పరిశ్రమలు ఉండగా.. 55 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో కలుస్తున్నాయి. ఈ కాలుష్యానికి చలి తీవ్రత తోడయింది. వాతావరణంలో ‘రెస్పిరబుల్ సస్పెండెడ్ పర్టిక్యులేట్ మ్యాటర్’ (ఆర్‌ఎస్‌పీఎం) నిర్ణీత ప్రమాణాలకు మించి నమోదవుతోంది. సాధారణంగా వాతావరణంలో ఇది క్యూబిక్ మీటరు గాలిలో 60 మైక్రో గ్రాముల వరకు ఆర్‌ఎస్‌పీఎం ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ దీపావళి తర్వాత వాతావరణ కాలుష్యంతో పాటు చలి తీవ్రత మరింత పెరిగింది. సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బన్ మోనాక్సైడ్ వంటి రసాయనాలు పొగమంచులో కలిసిపోతున్నాయి. శ్వాస తీసుకున్నప్పుడు గాలితో పాటు నేరుగా అవి ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస సంబంధ సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ రసాయానాలు పరోక్షంగా చెవి, ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్లను తెచ్చిపెడుతున్నాయి. తలెత్తే ఇబ్బందులు ఇవీ.. ► శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ► మెదడుపై ఒత్తిడి పెరుగుతోంది ► రాత్రి వేళల్లో నిద్రపట్టక పోవడం, ఉబ్బసం వంటి సమస్యలు ► గ్గు, జలుబు, తలనొప్పి, చెవి నొప్పి వంటి సమస్యలు ► చికాకుతో పాటు శరీరంపై దద్దుర్లు, ఇతర సమస్యలు కనిపిస్తుంటాయి ► చలికి చర్మం కమిలిపోవడంతో పాటు పగుళ్లు ఏర్పడుతుంటాయి ముందు జాగ్రత్తలే మందు ► శ్వాస నాళాల పనితీరును నాడీశోధన ద్వారా మెరుగుపర్చుకోవచ్చు ► రాత్రిపూట ఏసీ ఆఫ్ చేసి, తక్కువ స్పీడ్‌లో తిరిగే ఫ్యాను కిందే గడపాలి ► సిమెంటు, సున్నం, బొగ్గు, ఇతర రసాయన పదార్థాలకు దూరంగా ఉండాలి ► మంచు కురిసే సమయంలో ఆరుబయట తిరగడం, వ్యాయమం వంటి చేయరాదు ► ప్రస్తుత చలి వాతావరణంలో ఫ్లూతో పాటు రకరకాల బ్యాక్టీరియా విస్తరించి ఉంటుంది. బయటికు వెళ్లాల్సి వస్తే ముక్కుకు మాస్క్ ధరించడం మర్చిపోవద్దు లక్షణాలను ఇలా గుర్తించవచ్చు.. ♦ సాధారణ ఫ్లూ జ్వరాలలో కనిపించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. ♦ ప్రధానంగా ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు ♦ కళ్లవెంట నీరు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి ♦ కొందరికి వాంతులు, విరేచనాలు కూడా అవుతుంటాయి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ⇒జనసమూహం ఎక్కువగా ఉండే తీర్థయాత్రలు, ⇒పర్యాటక ప్రాంతాలు, ఎగ్జిబిషన్లకు ఈ సీజన్లో వెళ్లకపోవడమే ఉత్తమం ⇒అనివార్యమైతే ముక్కుకు విధిగా మాస్కు ధరించాలి ⇒తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి ⇒వీలైనంత ఎక్కువసార్లు నీళ్లు తాగాలి ⇒పౌష్టికాహారం కాయకూరలు, పండ్లు, ⇒డ్రైఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి ⇒బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు ⇒ఇతరులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం వంటి వాటికి తాత్కాలికంగా స్వస్తి చెప్పాలి ⇒పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు ⇒ఆరోగ్యంలో మార్పులు కనిపించినా.. అనుమానం వచ్చినా వ్యాధి నిర్థారణ కోసం పరీక్షలు చేయించుకోవాలి. -
చలికాలంలో రక్షణ ఇలా..!
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసుకోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. జీవామృతాన్ని 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10-15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఆచ్ఛాదన: కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులు: టమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్‌ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్‌ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నే మసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండిపోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామర పురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసం పీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలు రసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయాన్ని (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7-10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి. వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బుపొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ప్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు. రసం పీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే? రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి. - డా. గడ్డం రాజశేఖర్ (83329 45368), సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్