Garlic: శీతాకాలంలో ఉదయాన్నే వెల్లుల్లి తింటున్నారా? అయితే.. | Surprising Proven Benefits Of Eating Garlic In Winter Diet In Telugu | Sakshi
Sakshi News home page

Garlic For Winters: సైనసైటిస్, జలుబు, ఫ్లూతో బాధపడేవారు ఉదయాన్నే వెల్లుల్లి తింటే..

Nov 11 2021 12:46 PM | Updated on Nov 12 2021 1:20 PM

Surprising Proven Benefits Of Eating Garlic In Winter Diet In Telugu - Sakshi

ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఉదయాన్నే పరగడుపున 5 పచ్చి వెల్లుల్లి రెబ్బలు, తేనెతో కలిపి తింటే బరువు తగ్గడానికి..

Health Benefits Of Garlic In Telugu: చలికాలం వచ్చేసింది! ఈ కాలంలో ఇమ్మునిటీ సిస్టం బలంగా లేకపోతే జలుబు, దగ్గు.. ఇతర సీజనల్‌ రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఐతే ఈ సీజన్‌లో ప్రత్యేక పోషణనిచ్చే ఆహారాలను తప్పక తీసుకోవాలి. ప్రాచీనకాలం నుంచి ప్రతి వంటగదిలో తప్పకుండా ఉండే మూలిక వెల్లుల్లి. దీని సువాసన, రుచి ఎన్నో రుగ్మతలకు విరుగుడుగా పనిచేస్తుంది.

అంతేకాకుండా వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా మెండే. వెల్లుల్లిలో విటమిన్ ‘బి, సి’, ఫోలేట్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి. యూఎస్‌డీఏ ప్రకారం వంద గ్రాముల వెల్లుల్లిలో 150 కేలరీలు, 33 గ్రాముల పిండి పదార్థాలు, 6.36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. శీతాకాలంలో వెల్లుల్లిని ఆహారాంలో భాగం చేస్తే చేకూరే ఆరోగ్య ప్రయోజనాలుమిటో తెలుసుకుందా...

జలుబు, దగ్గు నివారిస్తుంది
ఈ కాలంలో జలుబు, దగ్గు మామూలుగానే వస్తుంది. ఈవిధమైన సమస్యలకు వెల్లుల్లి చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. ఇన్‌ఫెక్షన్లు, ఇతర వ్యాధుల నుంచి  వెల్లుల్లి రక్షణ కల్పిస్తుందనే నానుడి ఎప్పటినుంచో ఉంది. సైనసైటిస్, జలుబు, ఫ్లూతో బాధపడేవారు వేడి వంటకాలు, పులుసులు, సూప్‌లలో వెల్లుల్లిని చేర్చి తినాలి. ఐతే ఉడికించిన వెల్లుల్లి కంటే.. పచ్చిగా ఉన్నప్పుడు తింటేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని ఢిల్లీకి చెందిన ప్రముఖ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ నిపుణులు డా. శిఖా శర్మా సూచిస్తున్నారు.

చదవండి: గుడ్‌న్యూస్‌.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..!

బరువు తగ్గడానికి దివ్యౌషధం
చలికాలంలో బరువుతగ్గడం ఓ పెద్ద టాస్క్‌ లాంటిదే! ఐతే వెల్లుల్లి రెబ్బలు సులువుగా బరువుతగ్గడానికి సహాయపడతాయి. సహజంగానే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే వెల్లుల్లి మన శరీరంలోని హానికారకాలను బయటికి పంపడానికి, ఆరోగ్యకరమైన జీవక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా దీనిలోని పోషకాలు బరువుతగ్గడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఉదయాన్నే పరగడుపున 5 పచ్చి వెల్లుల్లి రెబ్బలు, తేనెతో కలిపి తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

శ్వాస సమస్యలు దూరం
వెల్లుల్లిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కారకాలు ఉపిరితిత్తుల ఆరోగ్యానికి జీవం పోస్తాయి. చలికాలంలో తరచూ వచ్చే జ్వరం, కఫం, గొంతు నొప్పి సమస్యలకు వెల్లుల్లి ఉపశమనం కలిగిస్తుంది.

వెల్లుల్లి ఇతర ఆరోగ్య ప్రయోజనాలు
►వెల్లుల్లి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుపచడానికి సహాయపడుతుంది.
►వెల్లుల్లి రెబ్బలు తరచూ తినడం మూలంగా గుండె జబ్బులను నివారించవచ్చు.

చదవండి: Supai Village Story: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement