sinusitis
-
పెరుగుతోన్న చలి తీవ్రత.. రోగాల బారిన పడకుండా ఉండాలంటే..
చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. అయితే చలిగాలులు అనేక రకాల వ్యాధులను కూడా మోసుకొస్తున్నాయి. ఈ సీజన్లో ప్రజల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలిగాలులు శరీరంలోకి వెళ్లడంతో వైరస్లు మరింత వృద్ధి చెందే ప్రమాదం ఉందని అంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చలితీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు కూడా పేర్కొంటున్నారు.సమస్యలు.. ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.లక్షణాలు.. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు.. చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది. ఎవరైనా వాతావరణాన్ని అంచనా వేసుకుని బయటకు రావాలి. మరీ చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది. ము ఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇన్హేలర్లను వాడుతుండాలి.ఎవరికి ఇబ్బంది.. చలి తీవ్రత నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు వేడివేడిగా సరైన ఆహారం తీసుకోవాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. చలిగాలులు ఉన్నప్పుడు చిన్నారులను బయట తిప్పకూడదు. ఎక్కువరోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తం రావటం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చలిగాలుల్లో ఆరు బయట పనిచేసే కార్మికులు, వీధుల్లో గడిపే నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలి.చదవండి: ఈ డివైజ్‌తో మొటిమలలు, మచ్చలు ఇట్టే మాయం..!కారణాలు.. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వైరస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో శరీరంలో వైరస్ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఈ వాతావరణంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఫ్లూ వ్యాప్తి చెందుతుంది.వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవాలి.. చలికాలంలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. దీంతో పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. విపరీతమైన చలికి జాగ్రత్తలు తీసుకోకపోతే, అవయవాల్లో గాయాలై మరణాలు సంభవించవచ్చు. – డాక్టర్ ఎం.రాజీవ్, పల్మనాలజిస్ట్, టీజీఎంఎస్ సభ్యుడు -
Health Tips: సైనస్ ఇన్ఫెక్షన్ ఉందా? ఇలా చేశారంటే..
మీకు సైనస్ ఇన్ఫెక్షన్ ఉందా? తలనొప్పి మరియు జలుబు తగ్గడం లేదా? ఆయుర్వేదంలో ఏం పరిష్కారాలున్నాయి? సైనస్ సమస్య ఉంటే ఏకాగ్రత ఉండదు. సరైన నిద్ర ఉండదు. కొన్ని సందర్భాల్లో అయితే సరిగా గాలి కూడా పీల్చుకోలేము. శాశ్వతంగా కాదు గానీ, కొన్ని పద్దతుల ద్వారా ఉపశమనం మాత్రమే లభిస్తుంది. సైనస్... ►తరచుగా పార్శ్య తలనొప్పి ►ముక్కు కొద్దిగా వంకరగా ఉండటం ►మన రెండు కళ్ళు చూసే రెండు వేర్వేరు విషయాలను కలపడంలో మెదడు ఇబ్బంది పడడం వల్ల నొప్పి ►ముక్కు దూలం కొంచెం వంగి ఉండటం ►ముక్కులో సైనస్ గ్రంధులు దుమ్ము వల్ల ఉబ్బడం ఎలాంటి చికిత్సలున్నాయి? ►ముక్కు శస్త్ర చికిత్స ►ముక్కులో సైనస్ గ్రంధులు తొలగింపు ►ప్రాణాయామంలో అనులోమ విలోమ పద్దతి ►హోమియో లో ఎస్ ఎస్ మిక్చర్ అనే మందు రోజూ రాత్రి పూట నిద్రపోయే ముందు తీసుకోవడం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? 1. వీలైనంత వరకు ఘాటైన వాసనలకు, కాలుష్యానికి దూరంగా ఉండడం 2. చలి గాలికి, వర్షంలో తడవకుండా జాగ్రత్త తీసుకోవడం 3. జీర్ణశక్తి మెరుగుపరచుకోవడం, మలమూత్రాదులు ఏ రోజుకా రోజు క్రమ పద్ధతిలో శరీరంనుంచి బయటకు పూర్తిగా వెడలిపోయేలా చూసుకోవడం. అంటే అజీర్తి అనే సమస్యను లేకుండా చేసుకోవడం. ఆయుర్వేదంలో ఏం పరిష్కారాలున్నాయి? 1. వేపపొడి నీటిలో కలిపి పరగడుపున త్రాగడం వల్ల శరీర శుద్ధి జరుగుతుంది. తద్వారా ఇలాంటి సమస్యలు అదుపులో ఉంటాయి. 2. తుమ్ములు, జలుబు లాంటివి బాగా ఎక్కువగా ఉంటే ముక్కులో వేపనూనె ఓ రెండు చుక్కలు వేయడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. (కానీ వేపనూనె వల్ల కలిగే మంట కొన్ని నిముషాలు నరకం చూపిస్తుంది.) 3. నీటిలో వేపనూనె లేదా పసుపు లాంటివి వేసి, బాగా మరగబెట్టాక వచ్చే ఆవిరిని పట్టడం. దీనికి మంచి వ్యాపరైజర్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 4. మందు బిళ్ళలు, యాంటీబయాటిక్ లాంటివి తక్కువగానే వాడడం మేలు. ఎందుకంటే అవి సమకూర్చే సౌకర్యాల కంటే తెచ్చిపెట్టే ఇబ్బందులే ఎక్కువ. 5. గొంతు గరగరలు ఎక్కువగా ఉంటే తేనె, కషాయం, గోరువెచ్చని నీటితో గార్గ్లింగ్ లాంటివి ఉపశమనం కలిగిస్తాయి. 6. సరిపడినంత నిద్ర, తగినంత నీరు త్రాగడం 7. పెరుగు, వేరుశనగపప్పు, కాఫీ లాంటి వాటి వాడకం తగ్గించడం 8. నిత్యం వ్యాయామం, నడక 9. సూర్యనమస్కారాలు, ప్రాణాయామం లాంటివి చేస్తే అధికంగా తయారయ్యే మ్యూకస్ తొలగిపోయే అవకాశం ఉంది. 10. జలనేతి కూడా మంచి సాధనమే. ఒక ముక్కులోనుంచి పంపిన ఉప్పు నీరు మరో ముక్కునుంచి బయటకు వచ్చేలా చేయడం. తదనంతరం గట్టిగా గాలి వదులుతూ ముక్కులు పొడిగా అయ్యేట్లు చేయడం. ఇక్కడ ఉదహరించినవి అన్నీ స్వయంగా ప్రయత్నించి ఫలితాలను వరుసక్రమంలో బేరీజు వేసుకుని చెప్పినవే. మీరు వాడే ముందు మీ శరీర ధర్మాలను బట్టి అనుసరిస్తే మేలు. అందరికీ ఒకేలా పని చేస్తాయని చెప్పలేం కదా! ఇవేవీ శాశ్వతంగా సమస్యను దూరం చేయలేవు. కేవలం కాలంతోపాటు మన శరీర ధర్మాలు, రోగనిరోధకశక్తి మారే తీరు మాత్రమే ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించగలదు. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయర్వేద వైద్యులు చదవండి: Steamed Food- Health Benefits: ఆవిరిపై ఉడికించిన ఆహారం తరచుగా తిన్నారంటే! How To Control BP: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇవి తగ్గిస్తే.. -
సతమతం చేసే సైనసైటిస్ నుంచి ఇలా ఉపశమనం పొందండి..
Sinusitis Home Remedies: ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం అని లేకుండా చాలా మందిని పీడించే సమస్య సైనసైటిస్. తరచూ ముక్కులు మూసుకుపోతూ శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం సైనసైటిస్ లో కనిపించే సమస్యల్లో ప్రధానమైనది. చికిత్స తీసుకున్నా తరచు తిరగబెట్టే ఈ సమస్యకు నివారణ మార్గాలు తెలుసుకుందాం. వైరస్, బాక్టీరియా, ఫంగస్ కారణంగా వచ్చే సైనస్ వ్యాధి వల్ల ముక్కుతోపాటు గొంతు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. తలనొప్పి కూడా వస్తుంది. కొన్ని రోజులపాటు పట్టి పీడించే ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు చిన్న చిన్న చిట్కాలు ఎంతగానో దోహదపడతాయి. ఉల్లి, వెల్లుల్లి రేకులను తింటే సైనసైటిస్ బాధ తగ్గుతుంది. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిపాయలను విరివిగా వాడితే మంచిది. మామిడి పండ్లు లభించే కాలంలో వాటిని బాగా తినాలి. వీటిలోని ‘ఎ’ విటమిన్‌తో మిగతా ఔషధ గుణాలు సైనసైటిస్ వంటి ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. టీ స్పూన్ జీలకర్రను వేయించి పొడిచేసి, అందులో రెండు స్పూన్ల తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. జీలకర్రను పల్చని కాటన్ వస్త్రంలో కట్టి వాసన పీల్చాలి. 250 మిల్లీ లీటర్ల నీటిలో టీ స్పూన్ మెంతులను వేసి బాగా మరిగించి కషాయం కాయాలి. ఈ కషాయాన్ని రోజుకు నాలుగుసార్లు తీసుకోవాలి. 300 మిల్లీ లీటర్ల క్యారట్ రసంలో 200 మిల్లీ లీటర్ల పాలకూర రసం కలిపి రోజుకు ఒకసారి తాగాలి. దీర్ఘకాలంగా ఉండే సైనసైటిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు.. అయితే కారం టీ సైనస్ నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. ఓ కప్పు మరిగించిన నీళ్లలో అర టీస్పూను కారం, రెండు టీస్పూన్ల తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి గోరువెచ్చగా రోజుకి రెండుసార్లు తాగితే సైనస్ నుంచి ఉపశమనం కలుగుతుందట. -
Garlic: శీతాకాలంలో ఉదయాన్నే వెల్లుల్లి తింటున్నారా? అయితే..
Health Benefits Of Garlic In Telugu: చలికాలం వచ్చేసింది! ఈ కాలంలో ఇమ్మునిటీ సిస్టం బలంగా లేకపోతే జలుబు, దగ్గు.. ఇతర సీజనల్ రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఐతే ఈ సీజన్లో ప్రత్యేక పోషణనిచ్చే ఆహారాలను తప్పక తీసుకోవాలి. ప్రాచీనకాలం నుంచి ప్రతి వంటగదిలో తప్పకుండా ఉండే మూలిక వెల్లుల్లి. దీని సువాసన, రుచి ఎన్నో రుగ్మతలకు విరుగుడుగా పనిచేస్తుంది. అంతేకాకుండా వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా మెండే. వెల్లుల్లిలో విటమిన్ ‘బి, సి’, ఫోలేట్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి. యూఎస్డీఏ ప్రకారం వంద గ్రాముల వెల్లుల్లిలో 150 కేలరీలు, 33 గ్రాముల పిండి పదార్థాలు, 6.36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. శీతాకాలంలో వెల్లుల్లిని ఆహారాంలో భాగం చేస్తే చేకూరే ఆరోగ్య ప్రయోజనాలుమిటో తెలుసుకుందా... జలుబు, దగ్గు నివారిస్తుంది ఈ కాలంలో జలుబు, దగ్గు మామూలుగానే వస్తుంది. ఈవిధమైన సమస్యలకు వెల్లుల్లి చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధుల నుంచి వెల్లుల్లి రక్షణ కల్పిస్తుందనే నానుడి ఎప్పటినుంచో ఉంది. సైనసైటిస్, జలుబు, ఫ్లూతో బాధపడేవారు వేడి వంటకాలు, పులుసులు, సూప్‌లలో వెల్లుల్లిని చేర్చి తినాలి. ఐతే ఉడికించిన వెల్లుల్లి కంటే.. పచ్చిగా ఉన్నప్పుడు తింటేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని ఢిల్లీకి చెందిన ప్రముఖ హెల్త్ అండ్ వెల్నెస్ నిపుణులు డా. శిఖా శర్మా సూచిస్తున్నారు. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! బరువు తగ్గడానికి దివ్యౌషధం చలికాలంలో బరువుతగ్గడం ఓ పెద్ద టాస్క్ లాంటిదే! ఐతే వెల్లుల్లి రెబ్బలు సులువుగా బరువుతగ్గడానికి సహాయపడతాయి. సహజంగానే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే వెల్లుల్లి మన శరీరంలోని హానికారకాలను బయటికి పంపడానికి, ఆరోగ్యకరమైన జీవక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా దీనిలోని పోషకాలు బరువుతగ్గడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఉదయాన్నే పరగడుపున 5 పచ్చి వెల్లుల్లి రెబ్బలు, తేనెతో కలిపి తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శ్వాస సమస్యలు దూరం వెల్లుల్లిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు ఉపిరితిత్తుల ఆరోగ్యానికి జీవం పోస్తాయి. చలికాలంలో తరచూ వచ్చే జ్వరం, కఫం, గొంతు నొప్పి సమస్యలకు వెల్లుల్లి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ►వెల్లుల్లి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుపచడానికి సహాయపడుతుంది. ►వెల్లుల్లి రెబ్బలు తరచూ తినడం మూలంగా గుండె జబ్బులను నివారించవచ్చు. చదవండి: Supai Village Story: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! -
సైనసైటిస్ కు శాశ్వత పరిష్కారం ఉందా?
నా స్నేహితుడి వయసు 24 ఏళ్లు. అతడు గత ఆర్నెల్లుగా తీవ్రమైన తలనొప్పి, ముక్కుదిబ్బడ, తుమ్ములు, ముక్కుకారడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘సైనసైటిస్’ అన్నారు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? - నిశాంత్, రాజమండ్రి మన కపాలంలో గాలితో నిండిన ఖాళీప్రదేశాలు (క్యావిటీస్) ఉంటాయి. వాటిని సైనస్‌లు అంటారు. వాటిని మ్యూకస్ అనే పొర కప్పి ఉంటుంది. ఈ మ్యూకస్ పలచటి ద్రవాన్ని స్రవిస్తుంది. సైనస్లలో వచ్చే ఇన్ఫెక్షన్స్ను సైనసైటిస్ అంటారు. అన్ని రకాల శ్వాసకోశ వ్యాధులు, అంటువ్యాధులు ఈ సైనస్లపైన ప్రభావం చూపుతాయి. కారణాలు: ముక్కులో వచ్చే ఇన్ఫెక్షన్స్ సైనస్లకు దగ్గరగా ఉండే ఎముకలు విరగడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ దంతాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వాతావరణం చల్లగా ఉండటం పౌష్టికాహారం లోపించడం డయాబెటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుండటం. లక్షణాలు: తల బరువుగా ఉండటం, ముక్కు కారడం, ముక్కుదిబ్బడ కొద్దిగా నడిచినా ఆయాసం జ్వరం నిద్రపట్టకపోవడం తలనొప్పి తుమ్ములు ఆకలి తగ్గడం రకాలు: మాక్సిల్లరీ సైనసైటిస్: ఈ సైనస్‌లు ముక్కుకు ఇరువైపులా ఉంటాయి. ఈ భాగంలో నొప్పి, దంతాల నొప్పి, తలనొప్పి ఉంటాయి. ఫ్రంటల్ సైనసైటిస్: నుదుటి మధ్య భాగం, కనుబొమల పైభాగాలలో ఇవి ఉంటాయి. ఈ సమస్య ఉన్నవారు ఈ భాగంలో నొప్పితో బాధపడుతుంటారు. ఇతిమాయిడ్ సైనసైటిస్: ముక్కు మొదటి భాగంలో ఇరువైపులా కంటికీ, ముక్కుకీ మధ్య భాగంలో ఈ సైనస్‌లు ఉంటాయి. కళ్లలో నొప్పి, ఒత్తిడి, తలనొప్పి, ముక్కుపై భాగంలో నొప్పి వస్తుంటాయి. స్ఫీనాయిడల్ సైనసైటిస్: ఇది తల లోపల ఉండే సైనస్. దీనితో తలనొప్పి, తల వెనుక భాగంలోనూ, తలపై భాగంలో నొప్పి, తల బరువుగా అనిపించడం వంటివి ఉంటాయి. నిర్ధారణ: వ్యాధి లక్షణాలను తెలుసుకోవడం సైనస్ ఎక్స్‌రే సీబీపీ. నివారణ: అలర్జీ కలిగించే వస్తువులకు దూరంగా ఉండాలి ఇన్ఫెక్షన్స్/శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి శ్వాసకోశ వ్యాధులతో ఎక్కువ రోజులు బాధపడకుండా చూసుకోవడం పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం చికిత్స: హోమియో విధానంలో క్రమంగా రోగనిరోధక శక్తిని పెంచుతూ ఈ సమస్య తీవ్రతను తగ్గిస్తూ, నయం చేయడం సాధ్యమవుతుంది. చిన్న పాపకూ డయాబెటిస్..?! మా పాప వయసు ఏడేళ్లు. మంచినీళ్లు చాలా ఎక్కువగా తాగుతుండటం, చర్మంపై ర్యాష్ రావడంతో ఇటీవల డాక్టర్‌కు చూపించాం. కొన్ని వైద్య పరీక్షలు చేసి చక్కెరవ్యాధి ఉందని చెప్పారు. ఇంత చిన్నవయసులో కూడా డయాబెటిస్ వస్తుందా? మా పాప విషయంలో తగిన సలహా ఇవ్వండి. - ధరణి, మంచిర్యాల మీ పాపకు ఉన్న కండిషన్‌ను జ్యూవెనైల్ డయాబెటీస్ అంటారు. దీన్నే టైప్ వన్ డయాబెటీస్ అని కూడా పేర్కొంటారు. ఇది నెలల పిల్లలకు సైతం రావచ్చు. డయాబెటీస్ రావడానికి అనేక కారణాలుంటాయి. జన్యుపరంగా సంక్రమించడం ఒక కారణం. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. అయితే అంతవూత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. చక్కెరను ఎప్పుడూ నియుంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే వీళ్లు కూడా మిగతా అందరు పిల్లల్లాగానే పెరిగి తవు ప్రతిభాపాటవాలు చూపగలుగుతారు. ఇలాంటి పిల్లల్లో మందుల ద్వారా, ఆహారం ద్వారా డయూబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. పిల్లల్లోనే ఇలా డయూబెటిస్ రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు... కొన్ని రసాయునాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు కారణం అవుతారుు. ఇలాంటి పిల్లలకి ఇన్సులిన్ వాడటం తప్పనిసరి. దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్లు చేరుుంచడం, ఆహారంలో నియమాలు పాటించేలా చేయాలి. డయాబెటీస్ ఉన్న పిల్లల విషయంలో... తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్, షుగర్ లెవల్స్ చెక్ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. డయూబెటిస్ ఉన్న పిల్లలరుుతే వాళ్లలో సాధారణంగా బరువు పెరగకపోవడం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచు వాంతులు కావడం, డీ-హైడ్రేషన్, చర్మంపై రాషెస్ వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లల్లో చక్కెర నియుంత్రణ లేకపోతే పోను పోనూ రక్తపోటు పెరగడం, వుూత్రపిండాలు, కంటికి సంబంధించిన రుగ్మతలు, కరోనరీ గుండె సవుస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ ద్వారా కాకుండా నోటిద్వారా లేదా ఇన్హేలేషన్ (పీల్చడం) ద్వారా ఇచ్చే ప్రక్రియులు అందుబాటులోకి రానున్నారుు. అలాంటి చికిత్స వూర్గాలు అందుబాటులోకి వస్తే ఈ పిల్లలకు చికిత్స ప్రక్రియులు వురింత సులువవుతారుు. మీరు పిడియూట్రిషియున్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం తప్పనిసరి. -
వేసవిలోనూ సైనసైటిస్ సమస్య..!
కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. నేను ఉద్యోగరీత్యా చాలా దూర ప్రయాణాలు చేస్తుంటాను. ఇప్పటివరకు నాకెలాంటి ఆరోగ్య సమస్యా రాలేదు. కానీ గత రెండు మూడు నెలల నుంచి దూరప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత నా రెండు కాళ్లు వాస్తున్నాయి. అలాగే మూత్రం నురగగా వస్తోంది. అంతేకాకుండా రాత్రిళ్లు ఎక్కువగా మూత్రం వస్తోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది. ఇప్పటివరకు ఈ సమస్యపై ఏ డాక్టర్‌నూ కలవలేదు. దయచేసి నా అనుమానాలను నివృత్తి చేయండి. - గోపాల్, హైదరాబాద్ మూత్రపిండాల సమస్యలో ఐదు దశలు ఉంటాయి. మొదటి దశ, రెండో దశలో అసలు వ్యాధి లక్షణాలు కనిపించవు. మూడో దశలో ఆకలి మందగించడం, నీరసం, ముఖం వాచినట్లుగా ఉండటం, కాళ్లలో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నాలుగో దశ, ఐదో దశలో కన్ను చుట్టూ వాపు రావడం, జబ్బు ఎక్కువవుతున్న కొద్దీ వాపు ఎక్కువవుతుండటం, మూత్రం తగ్గిపోవడం, ఫిట్స్ రావడం, కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఐదో దశ వచ్చేసరికి కిడ్నీ పనితీరు బాగా తగ్గిపోతుంది. దురదృష్టవశాత్తు చాలామందిలో వ్యాధి ఈ దశకు చేరుకున్న తర్వాతనే వైద్యులను సంప్రదిస్తున్నారు. వ్యాధి ఐదో దశకు చేరిన తర్వాత మళ్లీ దానిని సాధారణ స్థితికి తీసుకురాలేము. అందువల్ల క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ చికిత్స కొనసాగించడం ఒక్కటే మార్గం. అయితే మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చేస్తుంటే మీ కిడ్నీలో ఏవో అసాధారణ మార్పులు చోటుచేసుకుటున్నాయని చెప్పవచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించండి. మీకు తగిన పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తారు. ఆలస్యం చేయకూడదు. గుండెజబ్బులాగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కూడా సమయమే అత్యంత కీలకం. వ్యాధి మొదటి దశలో ఉంటే మీకు సులువుగా చికిత్స నిర్వహించే అవకాశం ఉంది. అలాగే మీ కిడ్నీ కూడా పదిలంగా ఉంటుంది. అలా కాకుండా పరీక్షలలో ఏదైనా సివియారిటీ కనిపిస్తే కూడా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య ప్రక్రియలతో మీ కిడ్నీ సంబంధిత వ్యాధులను సమూలంగా పరిష్కరించే అవకాశం ఉంది. న్యూరో కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నేను గత మూడు నెలలుగా నడుము నొప్పితో బాధపడుతున్నాను. పదిరోజులుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను. ఎటూ కదలలేకుండా అవుతోంది. నడుము నుంచి పాదాల వరకు తిమ్మిర్లు వస్తున్నాయి. మూడు రోజులుగా మూత్రం కూడా ఆగి, ఆగి వస్తోంది. ఎమ్మారై స్కానింగ్ చేయించాను. కొంతమంది సర్జరీ అవసరమని, మరి కొంతమంది వద్దంటున్నారు. సర్జరీ చేయించుకుంటే కాలు పడిపోవచ్చని మా కొలీగ్స్ భయపడుతున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - నరేంద్రనాథ్, రాజమండ్రి మీరు ఎల్5 /ఎస్ 1 ర్యాడికులోపతి అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నొప్పి మాత్రమే ఉన్నవారిలో, నముడుకు బెల్ట్ వేసుకోవడం, మందులు తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడంతో ఈ సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. దాదాపు 80 శాతం మందిలో ఇలా తగ్గించడం సాధ్యమవుతుంది. మిగతా వారిలో సర్జరీ అవసరం పడవచ్చు. కాళ్లకి సంబంధించిన నరాలు, మలవిసర్జన, మూత్ర విసర్జనకు అవసరమైన నరాలు అన్నీ నడుము నుంచే కిందికి వెళ్తాయి. అయితే నడుము ఎముకలు అరిగినప్పుడు డిస్క్‌లు జారి, నరాలు ఒత్తుకోవడం వల్ల నడుము నొప్పి, తిమ్మిర్లు, మూత్రంలో ఇబ్బంది రావచ్చు. ఒక్కోసారి కాళ్లలో బలం తగ్గిపోయినా, మూత్రవిసర్జనలో ఇబ్బంది ఎదురైనా వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం. సమయం గడుస్తున్నకొద్దీ పరిస్థితి మరింత జటిలం అవుతుంది. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి న్యూరోసర్జన్ చేత మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మైక్రోస్కోప్ ద్వారా కేవలం గంట కంటే తక్కువ సమయంలోనే సర్జరీ చేయించుకోవచ్చు. మూడు రోజులలో నడుచుకుంటూ ఇంటికి కూడా వెళ్లిపోవచ్చు. అయితే అన్ని వసతులు, వైద్య సౌకర్యాలు ఉన్న హాస్పిటల్లోనూ, నిపుణులు, అనుభవజ్ఞులైన న్యూరోసర్జన్ చేత మీరు ఆపరేషన్ చేయించుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తదు. హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. ఎండ వేడికి తట్టుకోలేక ఇంట్లో కూలర్ వాడుతున్నాం. శీతల పానియాలూ ఎక్కువగానే తాగాను. దాంతో జలుబు వచ్చింది. తల అంతా భారంగా ఉంది. ఎంతకీ తగ్గడం లేదు. హోమియోలో చికిత్స ఉందా? - సురేశ్‌కుమార్, ఖమ్మం కొన్ని రకాల వ్యాధులు సాధారణంగా కొన్ని కాలాలలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటిలో సైనసైటిస్ ఒకటి. గతంలో వానాకాలం, చలికాలంలో ఉద్ధృతమయ్యే ఈ సమస్య కొందరిలో వేసవిలోనూ కనిపిస్తోంది. ఇందుకు వాతావరణంతో పాటు జీవనశైలిలోని మార్పులూ కారణమవుతున్నాయి. మన తలలో ముక్కు పక్కన, నుదుటి దగ్గర ఉండే నాలుగు జతల గదులను ై‘సెనస్’లు అంటారు. ముఖంలోని గాలి గదుల్లో వచ్చే వాపునే వైద్యపరిభాషలో సైనసైటిస్ అంటారు. ఈ వాపే కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్లలో ‘అక్యూట్ సైనసైటిస్’, ‘క్రానిక్ సైనసైటిస్’ అనే రెండు రకాలు ఉంటాయి. రెండో రకంలో సమస్య దీర్ఘకాలంపాటు ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా జలుబు చేసినప్పుడు మందులు వాడి, దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు జలుబు మందులతో తగ్గిపోవచ్చు లేదా తగ్గినట్లే తగ్గి మళ్లీ తిరగబెట్టవచ్చు. ఇలా పదే పదే జలుబు వేధిస్తుంటే సైనసైటిస్ ఉన్నట్లుగా భావించవచ్చు. ప్రస్తుతం వేసవిలో కూడా సైనసైటిస్ ఎక్కువగానే బాధిస్తున్న కేసులు వస్తున్నాయి. కాలుష్యం, దుమ్ము, పొగ వంటి అంశాలతో ఇది వేసవి సీజన్లోనూ కనిపిస్తోంది. వేసవిలో సైనసైటిస్‌కు కారణాలు : అలర్జిక్ తత్వం ఉన్నవారు వేసవిలో కూల్‌డ్రింక్స్, చల్లటి ఫ్రిజ్ నీళ్లు తాగడం వల్ల అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ సైనసైటిస్‌కు గురయ్యే అవకాశం ఉంది. వేసవిలో వర్షాలు కురిసినప్పుడు ఉష్ణోగ్రతల్లో చోటు చేసుకునే విపరీతమైన మార్పుల వల్ల కూడా సైనస్‌లు ప్రభావితమవుతాయి వేసవి సీజన్లో ఈతకొలనులలో ఎక్కువసేపు గడపడం జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో (సినిమా థియేటర్లు, కళ్యాణమండపాలు) ఎక్కువగా గడపడం కూడా సైనసైటిస్ వ్యాప్తికి కారణమే వేసవిలో ఎయిర్‌కూలర్స్ వాడటం, వాటిలోని నీళ్లను మార్చకపోవడం, నిల్వ నీటినే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండటం వల్ల ఆ నీళ్లు కలుషితం కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. అలాగే కూలర్స్లోని మ్యాట్స్‌లో ఉండే ఫంగస్ చేరి ఫంగల్ సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు : కనురెప్పల వాపు వాసనలు తెలియకపోవడం తరచూ వచ్చే జ్వరం తలనొప్పి ముక్కుదిబ్బడ చిక్కటి పసుపుపచ్చ / ఆకుపచ్చ రంగులో ముక్కుస్రావాలు నోటి దుర్వాసన వ్యాధి నిర్ధారణ : సైనస్ ఎండోస్కోపీ, నోటి పరీక్ష, ఊపిరితిత్తుల పరీక్ష, ఎక్స్-రే, సీటీ స్కాన్, సైనస్ కల్చర్ వంటి పరీక్షలు సమస్య నిర్ధారణకు తోడ్పడతాయి. చికిత్స : సైనసైటిస్‌కు హోమియోలో అద్భుతమైన చికిత్స అందుబాటులో ఉంది. మందుల ద్వారా నివారణ మాత్రమే గాక... వ్యాధి నిరోధక శక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా చేయవచ్చు. సైనసైటిస్‌కు హోమియోలో కాలి సల్ఫ్, హెపార్ సల్ఫ్, మెర్క్‌సాల్, సాంగ్యునేరియా, లెమ్నా మైనర్, స్పైజీలియా వంటి మందులు మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. -
పుష్కరాల్లో సైనసైటిస్ నివారణ ఎలా..?
ఈఎన్టి కౌన్సెలింగ్ నేను చాలాకాలంగా సైనస్‌తో బాధపడుతున్నాను. రాబోయే పుష్కరాలకు మేము పుష్కరస్నానాలకు వెళ్దామనుకుంటున్నాం. ఒక సైనస్ పేషెంట్‌గా నేను ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి? - రామలక్ష్మి, ఏలూరు ముఖంలోని గాలి గదులలో వచ్చే వాపును వైద్యపరిభాషలో సైనసైటిస్ అంటారు. ఈ వాపే కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లుగా మారే అవకాశాలు ఉన్నాయి. వేలాదిమందితో కలిసి ఒకేసారి నదిలో మునిగి స్నానం చేయడం వల్ల నీరు కలుషితం అయి, సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువే. కలుషితమైన నీరు ముక్కులోకి చేరడం వల్ల సైనస్‌కు ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీంతో సైనసైటిస్ విడవకుండా బాధిస్తుంది. కొన్ని సందర్భాల్లో అది న్యుమోనియాకు దారితీసే అవకాశాలూ లేకపోలేదు. అలాగే పుష్కరాల కోసం తరలివచ్చే భారీ జనసమూహాల మధ్య తిరగడం వల్ల క్రాస్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. ఇవి ఒకరి నుంచి మరొకరికి తేలిగ్గా సోకుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే... పుష్కరస్నానంలో భాగంగా నదిలో మునగకుండా చెంబుతో నదీజలాలను తలపై పోసుకొని స్నానమాచరించడం మంచిది. అలాగే వేలాది మంది ఒకేసారి స్నానం చేసే పుష్కరఘాట్ల వద్ద కాకుండా జనసమ్మర్థం అంతగా లేకుండా నీరు స్వచ్ఛంగా ఉండే చోట (అది సురక్షితమైన స్థలం కూడా అయి ఉండాలి) స్నానం చేయడం శ్రేయస్కరం. నదీస్నానం పూర్తి చేసుకొని, ఇంటికి లేదా హోటల్‌కు లేదా మీ బసకు తిరిగి వచ్చాక వెంటనే మళ్లీ మంచినీటితో తలస్నానం చేయాలి. అనంతరం తప్పనిసరిగా ముక్కుకు ఆవిరిపట్టాలి. దీనివల్ల సైనస్ తెరచుకొని, వాటిలో చేరిన కఫం ముక్కుద్వారా బయటకు వచ్చేస్తుంది. అలాగే దుమ్ము, ధూళి, వైరస్ల నుంచి రక్షణ కోసం ముక్కుకు మాస్క్ ధరించాలి. చల్లని వాతావరణం, ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. నేను తరచూ జలుబుతో బాధపడుతున్నాను. వెంటనే దగ్గర్లోని మెడికల్ షాపుకు వెళ్లి ఉపశమన మందులు వాడుతున్నాను. దీనివల్ల రిలీఫ్ తాత్కాలికంగానే ఉంటోంది. మళ్లీ జలుబు తిరగబెడుతోంది. ఇది చీటికీమాటికీ రాకుండా నివారించే మార్గం ఏమైనా ఉందా? - ఆనందరావు, హైదరాబాద్ జలుబు నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించే మందుల వల్ల నష్టమే ఎక్కువ. సాధారణంగా జలుబు చేయగానే చాలామంది ఓవర్ ద కౌంటర్ మందులు వేసుకుంటారు. ఈ మందుల వల్ల కఫం చిక్కబడి, గొంతు పొడిబారిపోతుంది. జలుబు చేసినప్పుడు కఫం పలచబడి తేలిగ్గా వెలుపలికి వచ్చేయాలేగానీ, చిక్కబడి ఎండిపోయేలా చేసే మందులు వాడకూడదు. కఫం లోపల నిల్వ ఉండిపోతే ఇన్ఫెక్షన్ మరింతగా పెరిగిపోతుంది. తరచూ జలుబుతో బాధపడేవారు సొంతవైద్యంతో ఏ మందులు పడితే అవి వాడటం మున్ముందు మరింత ప్రమాదానికి దారితీస్తుంది. అలాంటివారు ముందుగా సొంతవైద్యం మాని వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, ఆయన పర్యవేక్షణలోనే మందులు వాడాలి. ఎక్కువసార్లు ఆవిరిపట్టడం వల్ల వీళ్లకు ఎంతో ఉపశమనం ఉంటుంది. రోజులో ఎక్కువసేపు ఆవిరిపట్టడం కంటే తక్కువ వ్యవధితో ఎక్కువసార్లు ఆవిరి పట్టడం వల్ల ముక్కులోని సైనస్ తెరుచుకొని అక్కడ చేరిన కఫం పలచబడి కరిగిపోయి ముక్కుద్వారా బయటకు వచ్చేస్తుంది. ఆవిరిపడుతున్నా జలుబు విడవకుండా పీడిస్తుంటే మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ కేవీఎస్ఎస్ఆర్కె శాస్త్రి, సీనియర్ ఈఎన్టి, హెడ్ అండ్ నెక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
సైనసైటిస్ హోమియో చికిత్స
వాతావరణ మార్పులు జరిగే వర్షాకాలం, శీతాకాలం ప్రవేశించినప్పుడు సైనస్ అనే మాటను, ఆ వెంటే... సైనసైటిస్ వస్తే ఇక ఆపరేషనే శరణ్యం అని తరచు వింటూ వుంటాం. అయితే ఆపరేషన్ తరువాత కూడా ఇది మరల మరల వచ్చి దీర్ఘకాలికంగా బాధిస్తుందని దీని బారిన పడినవారు అంటూ వుంటారు. ఒక్క యూఎస్‌లోనే 24 మిలియన్ కు పైన దీనిబారిన పడుతుంటారు. దీనిని మూడు విభాగాలుగా మనం చూడవచ్చు. Acute వచ్చి ఒకవారం రోజులు ఉంటుంది Sub acute 48 వారాలు ఉంటుంది. Chronic- దీర్ఘకాలిక సైనసైటిస్. ఇది 8-10 వారాల పైన ఉంటుంది. సైనసైటిస్... ఇది 90 శాతంమందిలో కనిపించే సాధారణ సమస్య. దాదాపుగా ప్రతిమనిషి జీవనకాలంలో దీని బారిన పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ సైనసైటిస్ ఇన్ఫెక్షన్ వలన, వైరస్, బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. ముఖ్యంగా స్టైప్టోకోకస్ నిమోనియా, ఇన్ఫ్లుయెంజా వలన వస్తుంది. ఈ సైనసైటిస్‌కు హోమియోలో అద్భుత చికిత్స ఉంది. పూర్తిగా మందుల ద్వారా నివారించడమే కాకుండా వ్యాధినిరోధకశక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా నిరోధించవచ్చు. ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగంలో ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగం ఇన్ఫెక్షన్లతో వాచిపోవడాన్ని ‘సైనటైసిట్’ అంటారు. సైనస్ రకాలు... ఫ్రంటల్ పారానాసల్ ఎత్మాయిడల్ మాగ్జిలరీ స్ఫినాయిడల్. ఇవి కుడి, ఎడమగా రెండు జతలుంటాయి. కారణాలు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శ్వాసకోశ వ్యాధులు ముక్కులో దుర్వాసన ముక్కులో దుర్వాసన పెరుగుదల అలర్జీ పొగ విషవాయువుల కాలుష్యం వాతావరణ కాలుష్యం అకస్మాత్తుగా వాతావరణ మార్పులు చలికాలం, వర్షాకాలం గాలిలో తేమ ఎక్కువగా ఉండే సమయం మంచు ప్రదేశాలు: కొడెకైనాల్, ఊటీ, జమ్ముకాశ్మీర్, మనాలి, ముస్సోరి వంటి చోట్లకు వెళ్లడం నీటిలో ఈదటం జలుబు, గొంతునొప్పి పిప్పిపన్ను టాన్సిల్స్ వాపు రోగనిరోధకశక్తి తగ్గటం. వ్యాధి లక్షణాలు ముఖంలో భారంగా ఉండటం, తలనొప్పి, బరువు, ముఖంలో వాపు, సైనస్ భాగంలో నొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కు దురద, నీరు కారటం, గొంతులోనికి ద్రవం కారటం, గొంతు గరగర, దగ్గు, జలుబు, చెవిలో చీము, కోపం, మానసిక స్థైర్యం కోల్పోవటం, అలసట, విసుగు పనిపై శ్రద్ధ లేకుండటం, హోరు, దగ్గు. వ్యాధి నిర్ధారణ ఎక్స్‌రే ముఖ్యంగా ఇతర వ్యాధులతో కలిసి సైనసైటిస్ రావచ్చు. సైనస్ భాగంలో నొక్కితే నొప్పి సీటీ స్కాన్ ఇతర దుష్పరిణామాలు దీర్ఘకాలికంగా సైనసైటిస్ వ్యాధితో బాధపడేవాళ్లలో కనురెప్పల వాపు, కనుగుడ్లు పక్కకు జరిగినట్లుండటం, కంటినరం దెబ్బతిని, తద్వారా చూపు కోల్పోవటం, వాసనలు తెలియకపోవటం, తరచు వచ్చే జ్వరం, ఎదుగుదల లోపాలు రావచ్చు. మానసికంగా ధైర్యం కోల్పోవటం జరగవచ్చు. సైనసైటిస్‌ను ఇలా నివారించవచ్చు నోటిని తరచు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండడం. అలర్జీకి సంబంధించిన దుమ్ము, ధూళికి దూరంగా ఉండి, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని చుట్టూ నీరు, బురద లేకుండా ఉంచుకోవడం. ఈత కొలనులో ఎక్కువ సమయం కేటాయించవద్దు. ఎందుకంటే అది ముక్కు లోపలి దళసరి చర్మాన్ని దెబ్బతీస్తాయి. చల్లని పదార్థాలు తీసుకోవద్దు. చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవటం, వేడి ఆవిరి పట్టడం వలన కొంతవరకు నివారించవచ్చు. హోమియో చికిత్స హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా మంచి మందులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కాలిబైక్, కాలిసల్ఫ్, హెపర్‌సల్ఫ్, మెర్క్‌సాల్, సాంగ్ న్యురియా, లెమ్నా మైనర్, స్పైజిలియా వంటి మందులు ఉన్నాయి. హోమియోపతి ద్వారా ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా సైడ్ఎఫెక్ట్స్ లేకుండా సమూలంగా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స ఉంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ అలర్జీ సెంటర్ ద్వారా ఎన్నో కేసుల్లో పూర్తిగా స్వస్థత కలిగించాం. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 9030081875 / 903000 8854