సైనసైటిస్ కు శాశ్వత పరిష్కారం ఉందా? | homeo counceling for sinusitis and Diabetes | Sakshi
Sakshi News home page

సైనసైటిస్ కు శాశ్వత పరిష్కారం ఉందా?

Published Tue, Sep 20 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

సైనసైటిస్ కు శాశ్వత పరిష్కారం ఉందా?

సైనసైటిస్ కు శాశ్వత పరిష్కారం ఉందా?

నా స్నేహితుడి వయసు 24 ఏళ్లు. అతడు గత ఆర్నెల్లుగా తీవ్రమైన తలనొప్పి, ముక్కుదిబ్బడ, తుమ్ములు, ముక్కుకారడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘సైనసైటిస్’ అన్నారు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా?
- నిశాంత్, రాజమండ్రి

 మన కపాలంలో గాలితో నిండిన ఖాళీప్రదేశాలు (క్యావిటీస్) ఉంటాయి. వాటిని సైనస్‌లు అంటారు. వాటిని మ్యూకస్ అనే పొర కప్పి ఉంటుంది. ఈ మ్యూకస్ పలచటి ద్రవాన్ని స్రవిస్తుంది. సైనస్‌లలో వచ్చే ఇన్ఫెక్షన్స్‌ను సైనసైటిస్ అంటారు. అన్ని రకాల శ్వాసకోశ వ్యాధులు, అంటువ్యాధులు ఈ సైనస్‌లపైన ప్రభావం చూపుతాయి.

 కారణాలు:  ముక్కులో వచ్చే ఇన్ఫెక్షన్స్  సైనస్‌లకు దగ్గరగా ఉండే ఎముకలు విరగడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్  దంతాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్  వాతావరణం చల్లగా ఉండటం  పౌష్టికాహారం లోపించడం  డయాబెటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుండటం.

 లక్షణాలు: తల బరువుగా ఉండటం, ముక్కు కారడం, ముక్కుదిబ్బడ   కొద్దిగా నడిచినా ఆయాసం   జ్వరం   నిద్రపట్టకపోవడం   తలనొప్పి  తుమ్ములు  ఆకలి తగ్గడం

 రకాలు: 
మాక్సిల్లరీ సైనసైటిస్: ఈ సైనస్‌లు ముక్కుకు ఇరువైపులా ఉంటాయి. ఈ భాగంలో నొప్పి, దంతాల నొప్పి, తలనొప్పి ఉంటాయి.

  ఫ్రంటల్ సైనసైటిస్: నుదుటి మధ్య భాగం, కనుబొమల పైభాగాలలో ఇవి ఉంటాయి. ఈ సమస్య ఉన్నవారు ఈ భాగంలో నొప్పితో బాధపడుతుంటారు.

  ఇతిమాయిడ్ సైనసైటిస్: ముక్కు మొదటి భాగంలో ఇరువైపులా కంటికీ, ముక్కుకీ మధ్య భాగంలో ఈ సైనస్‌లు ఉంటాయి. కళ్లలో నొప్పి, ఒత్తిడి, తలనొప్పి, ముక్కుపై భాగంలో నొప్పి వస్తుంటాయి.

  స్ఫీనాయిడల్ సైనసైటిస్: ఇది తల లోపల ఉండే సైనస్. దీనితో తలనొప్పి, తల వెనుక భాగంలోనూ, తలపై భాగంలో నొప్పి, తల బరువుగా అనిపించడం వంటివి ఉంటాయి.

 నిర్ధారణ: వ్యాధి లక్షణాలను తెలుసుకోవడం  సైనస్ ఎక్స్‌రే  సీబీపీ.

 నివారణ:  అలర్జీ కలిగించే వస్తువులకు దూరంగా ఉండాలి  ఇన్ఫెక్షన్స్/శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి  శ్వాసకోశ వ్యాధులతో ఎక్కువ రోజులు బాధపడకుండా చూసుకోవడం  పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం

 చికిత్స: హోమియో విధానంలో క్రమంగా రోగనిరోధక శక్తిని పెంచుతూ ఈ సమస్య తీవ్రతను తగ్గిస్తూ, నయం చేయడం సాధ్యమవుతుంది.

చిన్న పాపకూ డయాబెటిస్..?!
మా పాప వయసు ఏడేళ్లు. మంచినీళ్లు చాలా ఎక్కువగా తాగుతుండటం, చర్మంపై ర్యాష్ రావడంతో ఇటీవల డాక్టర్‌కు చూపించాం. కొన్ని వైద్య పరీక్షలు చేసి చక్కెరవ్యాధి ఉందని చెప్పారు. ఇంత చిన్నవయసులో కూడా డయాబెటిస్ వస్తుందా? మా పాప విషయంలో తగిన సలహా ఇవ్వండి. - ధరణి, మంచిర్యాల

 మీ పాపకు ఉన్న కండిషన్‌ను జ్యూవెనైల్ డయాబెటీస్ అంటారు. దీన్నే టైప్ వన్ డయాబెటీస్ అని కూడా పేర్కొంటారు. ఇది నెలల పిల్లలకు సైతం రావచ్చు. డయాబెటీస్ రావడానికి అనేక కారణాలుంటాయి. జన్యుపరంగా సంక్రమించడం ఒక కారణం. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. అయితే అంతవూత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. చక్కెరను ఎప్పుడూ నియుంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే వీళ్లు కూడా మిగతా అందరు పిల్లల్లాగానే పెరిగి తవు ప్రతిభాపాటవాలు చూపగలుగుతారు. ఇలాంటి పిల్లల్లో మందుల ద్వారా, ఆహారం ద్వారా డయూబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.

పిల్లల్లోనే ఇలా డయూబెటిస్ రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు... కొన్ని రసాయునాలు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు కారణం అవుతారుు. ఇలాంటి పిల్లలకి ఇన్సులిన్ వాడటం తప్పనిసరి. దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌లు చేరుుంచడం, ఆహారంలో నియమాలు పాటించేలా చేయాలి. డయాబెటీస్ ఉన్న పిల్లల విషయంలో... తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్, షుగర్ లెవల్స్ చెక్ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. డయూబెటిస్ ఉన్న పిల్లలరుుతే వాళ్లలో సాధారణంగా బరువు పెరగకపోవడం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచు వాంతులు కావడం, డీ-హైడ్రేషన్, చర్మంపై రాషెస్ వంటివి లక్షణాలు కనిపిస్తాయి.

ఇలాంటి పిల్లల్లో చక్కెర నియుంత్రణ లేకపోతే పోను పోనూ రక్తపోటు పెరగడం, వుూత్రపిండాలు, కంటికి సంబంధించిన రుగ్మతలు, కరోనరీ గుండె సవుస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ ద్వారా కాకుండా నోటిద్వారా లేదా ఇన్‌హేలేషన్ (పీల్చడం) ద్వారా ఇచ్చే ప్రక్రియులు అందుబాటులోకి రానున్నారుు. అలాంటి చికిత్స వూర్గాలు అందుబాటులోకి వస్తే ఈ పిల్లలకు చికిత్స ప్రక్రియులు వురింత సులువవుతారుు. మీరు పిడియూట్రిషియున్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం తప్పనిసరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement