Homeopathic treatment
-
వేప చెట్లకు హోమియో చికిత్స
Homeopathy Treatment For Neem Trees: వేప చెట్లు డై బ్యాక్ అనే శిలీంద్ర సంబంధమైన తెగులుతోపాటు టీ మస్కిటో అనే దోమ దాడికి గురవుతున్నాయి. కొన్ని చోట్ల చిగుర్లు ఎండిపోతే, మరికొన్ని చోట్ల నిలువునా వేప చెట్లు ఎండిపోతున్నాయి. సేంద్రియ, పకృతి వ్యవసాయంలో చీడపీడల నియంత్రణలో కీలకపాత్ర నిర్వహించే వేప చెట్లను కోల్పోతే భవిష్యత్‌లో భారీ నష్టాలుంటాయి. ఈ సమస్య నివారణకు హోమియో మందులు ఉపయోగపడతాయని ప్రసిద్ధ హోమియో వైద్యులు డా. అంబటి సురేంద్ర రాజు, భువనగరి సమీపంలోని రామచంద్రాపురంలోని అమేయ కృషి వికాస కేంద్రం రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి తెలిపారు. వేప చెట్లను రక్షించుకోవడానికి ఈ కింది రెండు మందులను వేర్వేరుగా పిచికారీ చేయాలి. రెంటినీ కలిపి చల్లకూడదు. క్యూప్రమ్ మెట్ 200 (CUPRUM METALLICUM 200) ద్రవ రూప హోమియో మందును, ఈ కింద చెప్పిన విధంగా ఆ మోతాదులో, పిచికారీ చేస్తే టీ మస్కిటో దోమ నశిస్తుంది. దీన్ని పిచికారీ చేసిన రెండు రోజుల తర్వాత కొక్సీనెల్లా 200 (COCCINELLA SEPTEMPUNCTATA 200) అనే ద్రవ రూప హోమియో మందును, ఈ కింద చెప్పిన విధంగా ఆ మోతాదులో, నీటిలో కలిపి వేప చెట్లపై పిచికారీ చేయడం లేదా చెట్టు మొదలు చుట్టూ పాదు చేసి పొయ్యొచ్చు. ముందుగా చెట్టు చుట్టూ పాదును మామూలు నీటితో నిండుగా తడిపిన తర్వాత.. మందు కలిపిన నీరు చెట్టుకు పది లీటర్లయినా సరిపోతుంది. చెట్టు మరీ పెద్దదైతే ఇరువై లీటర్ల వరకూ పోసుకోవచ్చు. ఒక దఫా ఈ రెండు మందులు వాడిన తర్వాత.. 8 రోజులు వేచి చూడండి. అవసరం అనుకుంటే మరోసారి వాడండి. హోమియోపతి మందు వాడే విధానం 20 లీటర్ల నీటికి 2.5 మిల్లీ లీటర్ల (ఎం.ఎల్.) మోతాదులో హోమియో మందును కలిపి వాడాలి. ఒక లీటరు సీసా లేదా ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని అందులో సగం వరకు నీరు నింపుకోవాలి. అందులో 2.5 మిల్లీలీటర్ల (ఎం.ఎల్.) మందు కలిపి, మూత బిగించి, 50 సార్లు గట్టిగా కుదుపుతూ ఊపాలి. ఆ తర్వాత ఆ మందును స్ప్రేయర్ ట్యాంకులో పోసుకొని, 20 లీటర్ల నీరు నింపి, పిచికారీ చేసుకోవాలి. -
మెడనొప్పి చేతులకూ పాకుతోంది..?
నా వయసు 52 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. మందులు వాడుతున్నంత కాలం బాగానే ఉన్నా అవి ఆపేస్తే మాత్రం మళ్లీ నొప్పి వస్తోంది. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? వివరంగా చెప్పగలరు. వయసు పెరగడం వల్ల వచ్చే మెడ నొప్పికి పూర్తి పరిష్కారం లభించదని చాలామంది అనుకుంటుంటారు. కానీ హోమియోచికిత్స ద్వారా ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది. మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దీనినే సర్వైకల్ స్పైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. దాదాపు 85 శాతానికి పైగా ఇది 60 ఏళ్ల వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ►క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ►డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ►వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ►ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ►ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్వు సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ►ఎత్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ►మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ►సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ►నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ►మెడ బిగుసుకుపోవడం ►తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ►నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ►చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ►నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్–రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కళ్లు పచ్చగా ఉన్నాయి...పరిష్కారం చెప్పండి నా వయసు 35 ఏళ్లు. నా కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. మూత్రం కూడా పసుపురంగులో వస్తోంది. ఈ లక్షణాలు చూసి నాకు ఆందోళనగా ఉంది. నా సమస్య ఏమిటి? దీనికి హోమియోలో మంచి చికిత్స ఉందేమో దయచేసి వివరించండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు కామెర్లు సోకినట్లు తెలుస్తోంది. ఇది దీర్ఘకాలంలో కాలేయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మానవ శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన భాగం. ఈ అవయవానికి వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్ సోకితే ఎన్నో సమస్యలు మొదలవుతాయి. కాలేయం ప్రభావం చూపే వైరస్లలో ముఖ్యమైనవి హెపటైటిస్–బి, హెపటైటిస్–సి. ఈ వైరస్లు సోకగానే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొంతకాలం పాటు ఆ వైరస్ వారి శరీరాల్లో నిద్రాణంగా ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా కాలేయాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రాణాంతకంగా మారుతుంది. లివర్ క్యాన్సర్ సిర్రోసిస్, వైరల్ హెపటైటిస్ వ్యాధులు రావడానికి కారణమవుతుంది. లక్షణాలు: హెపటైటిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లక్షణాలు బయటకేమీ కనిపించవు. అవి కనిపించడానికి చాలా ఏళ్లు పడుతుంది. కొంతమందిలో వైరస్ సోకిన కొద్దిరోజులకే కామెర్లు వస్తాయి. దీన్ని ఎక్యూట్ స్టేజ్‌గా చెప్పవచ్చు. ఈ దశలో వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. కొంతమందిలో ఈ వైరస్ తొలగిపోకుండా, శాశ్వతంగా శరీరంలోనే నివాసం ఏర్పరచుకొని బలం పెంచుకుంటూ పోతుంది. దీనిని క్రానిక్ స్టేజ్ అంటారు. ఈ దశలోనే కాళ్లవాపు, పొట్ట ఉబ్బరం, వాంతులు, ఆకలి తగ్గిపోవడం, మూత్రం పచ్చగా రావడం, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స: రోగి శారీరక మానసిక లక్షణాలను పరిశీలించి చికిత్స అందించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. మీరొకసారి హోమియో వైద్యుడిని సంప్రదించండి. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు వాడితే భవిష్యత్తులో కాలేయానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా పూర్తిగా కాపాడుకోవచ్చు. డా‘‘ కె. రవికిరణ్, మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్ -
చర్మంపై తరచూ దద్దుర్లు... తగ్గుతాయా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 21 ఏళ్లు. నాకు తరచూ చర్మం మీద ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటికి అవి తగ్గుతున్నాయి. అయితే ఎలాంటి హానీ లేకపోయినా... దద్దుర్లు భయంకరంగా కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘అర్టికేరియా’ అన్నారు. మందులు వాడుతున్నప్పుడు తగ్గినట్లు తగ్గినా... ఆ తర్వాత ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. హోమియో చికిత్స ద్వారా సమస్య పూర్తిగా నయమవుతుందా? – కె. ముని కృష్ణ, చిత్తూరు అర్టికేరియా చాలా సాధారణంగా కనిపించే చర్మ సమస్య. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఏ వయసు వారికైనా కనిపించవచ్చు. కొందరిలో ఈ సమస్య 24 గంటల్లో దానంతట అదే తగ్గుతుంది. కానీ మరికొందరిలో ఇది దీర్ఘకాలం కొనసాగుతూ తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. దీన్ని రెండురకాలుగా విభజించవచ్చు. అవి... అక్యూట్ అర్టికేరియా: సమస్య ఆరు వారాల కంటే తక్కువ రోజులు ఉన్నట్లయితే దాన్ని అక్యూట్ అర్టికేరియా అంటారు. సమస్యను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు ఇది కలుగుతుంది. క్రానిక్ అర్టికేరియా: ఆరువారాలకు పైబడి కొనసాగితే దాన్ని క్రానిక్ అర్టికేరియా అంటారు. ఇలా దీర్ఘకాలిక సమస్యగా మారడానికి కారణాలు ఇంకా స్పష్టంగా లభించలేదు. అయితే మన ఒంట్లో అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, లూపస్ వంటి వాటి వల్ల ఆర్టికేరియా కనిపించవచ్చు. కారణాలు: మన శరీరానికి సరిపడని పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిస్పందనగా మన ఒంట్లో హిస్టమైన్స్ అనే పదార్థంలో పాటు కొన్ని రకాల రసాయనాలు రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. వాటి ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. ఇదే సమస్య మన రోగ నిరోధక శక్తి మనపైనే దుష్ప్రభావం చూపినప్పుడు కూడా కనిపిస్తుంది. అర్టికేరియాను ప్రేరేపించే అంశాలు: నొప్పి నివారణకు ఉపయోగించే మందులు కీటకాలు, పరాన్నజీవులు ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, వైరస్లు అధిక ఒత్తిడి, సూర్యకాంతి మద్యం, కొన్ని సరిపడని ఆహార పదార్థాలు అధిక లేదా అల్ప ఉష్ణోగ్రతలు జంతుకేశాలు, పుప్పొడి రేణువులు వంటి చాలా అంశాలు అర్టికేరియాను ప్రేరేపిస్తాయి. లక్షణాలు: చర్మంపై ఎరుపు లేదా డార్క్ కలర్లో దద్దుర్లు ఏర్పడటం విపరీతమైన దురదగా అనిపించడం దద్దుర్లలో మంట, నొప్పి కూడా అనిపించడం కళ్లచుట్టూ, చెంపలు, చేతులు, పెదవులపై కూడా అవి ఏర్పడవచ్చు గొంతులో వాపు ఏర్పడి అది వాయునాళాలకు అడ్డుగా పరిణమించి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు దద్దుర్ల పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ వాటిని ప్రేరేపించే అంశాలకు గురైనప్పుడు కనిపిస్తూ... ఆ తర్వాత అదృశ్యమవుతూ ఉండవచ్చు. చికిత్స: హోమియో ప్రక్రియ ద్వారా కాన్స్టిట్యూషన్ పద్ధతుల్లో అత్యంత సునిశితమైన పరిశీలనతో తగిన మందులు ఇవ్వవచ్చు. వాటి వల్ల రోగనిరోధక కణాలను బలోపేతం చేయడం వల్ల అవి అర్టికేరియాను సమర్థంగా ఎదుర్కొంటాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
సైనసైటిస్ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 34 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్‌తో బాధపడుతున్నాను. ముక్కుతో గాలి పీల్చుకోవడం కష్టం కావడంతో పాటు తలనొప్పితో బాధపడుతుంటాను. చాలా రకాల మందులు వాడాను. వాడినప్పుడు కొద్దిపాటి ఉపశమనమేగానీ సమస్య తగ్గడం లేదు. హోమియోలో శాశ్వత చికిత్స ఉందా? – రవిందర్, కరీంనగర్ సైనస్ అంటే గాలి గది. మన ముఖంలోని ఎముకల మధ్యల్లో నాలుగు జతలుగా ఖాళీగా ఉండే గాలి గదులు ఉన్నాయి. సైనస్ల లోపలివైపున మ్యూకస్ మెంబ్రేన్ అనే లైనింగ్‌పొర ఉంటుంది. సైనస్‌లు అన్నీ ఆస్టియం అనే రంధ్రం ద్వారా ముక్కులోకి తెరచుకుంటాయి. మనం పీల్చుకునే గాలి వేడిమిని మన శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా చేయడానికి సైనస్‌లు ఉపయోగపడతాయి. సైనస్‌లలోకి అంటే... ఖాళీ గదుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అది సైనసైటిస్‌కు దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఫ్యారింగ్స్ లేదా టాన్సిల్స్‌కు వ్యాపిస్తే ఫారింజైటిస్, టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఒకవేళ చెవికి చేరితే ఒటైటిస్ మీడియా అనే చెవి ఇన్ఫెక్షన్ వస్తుంది. సైనసైటిస్ వచ్చిన వారికి ∙తరచూ జలుబుగా ఉండటం ∙ముక్కుద్వారా గాలిపీల్చుకోవడం కష్టం కావడం ∙ముక్కు, గొంతులో కఫం లేదా చీముతో కూడిన కఫం చేరడం ∙కొందరిలో ఈ కఫం చెడువాసన రావడం ∙నుదుటి పైభాగంలో లేదా కళ్లకింద, కనుబొమల మధ్య తలనొప్పి రావడం ∙తల ముందుకు వంచినప్పుడు లేదా దగ్గినప్పుడు తలనొప్పి ఎక్కువ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు సైనస్ల నుంచి ఇతర భాగాలకు అంటే... గొంతు, శ్వాసనాళాలకు ఇన్షెక్షన్ వ్యాపించవచ్చు. ఎక్స్–రే, సీటీస్కాన్ వంటి పరీక్షల ద్వారా సైనసైటిస్‌ను నిర్ధారణ చేస్తారు. సైనస్ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే ఎలాంటి ఆపరేషన్ లేకుండానే హోమియో మందుల ద్వారా సమర్థంగా నివారించవచ్చు. హోమియో ప్రక్రియలో రోగి వ్యక్తిగత ఆహార అలవాట్లు, ఆలోచన విధానం, నడవడిక, వ్యాధి లక్షణాలు... ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మందులు సూచిస్తారు. ఈ వ్యాధికి వాడే కొన్ని ముఖ్యమైన మందులివి... హెపార్ సల్ఫూరికమ్: అతికోపం, చికాకు ఉండేవారిలో, చల్లగాలికి తిరిగే సైనస్ లక్షణాలు ఎక్కువయ్యే వారికి ఇది మంచి మందు. మెర్క్‌సాల్: రక్తహీనత ఉండి, అతినీరసం, అల్సర్లు త్వరగా మానకపోవడం, నోటిపూత, నోరు తడిగా ఉన్నప్పటికీ దాహంగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు మేలు. ఈ మందులేగాక... మరిన్ని రకాల మందులను వ్యక్తుల శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా ఇస్తారు. ఇందులో ఫాస్ఫరస్, ఆర్సినికమ్ ఆల్బ్, కాలీ కార్బ్, సైలీషియా, రస్టక్స్ మొదలైనవి ఉన్నాయి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు తీసుకోవాలి. వాళ్లు రోగిని చూసి తగిన మందును, మోతాదును నిర్ణయిస్తారు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? బ్లడ్ క్యాన్సర్ కౌన్సెలింగ్ మా అమ్మగారికి వయసు 45 ఏళ్లు. ఈమధ్య ఆమెకు కొన్ని పరీక్షలు చేయించినప్పుడు ఆమెకు బ్లడ్‌క్యాన్సర్ అని తెలిసింది. దాంతో షాక్ అయ్యాము. బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలు చెప్పండి. – మాధురి, నల్లగొండ రక్తకణాల ఉత్పత్తి సక్రమమైన తీరులో జరగకపోవడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. ఇది ప్రధానంగా బోన్ మ్యారో (ఎముకమజ్జ /మూలగ)లో ప్రారంభమవుతుంది. ఇక్కడే మూలకణాలు వృద్ధిచెంది... అవి ఎర్ర, తెల్ల కణాలుగానూ, ప్లేట్లెట్స్గానూ తయారవుతాయి. బ్లడ్ క్యాన్సర్ వచ్చినవారిలో తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా అనియంత్రితంగా రక్తకణాలు పెరగడాన్ని బ్లడ్‌క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. ఇలా నియంత్రణ లేకుండా పెరిగిన కణాలు మిగతా వాటిని పనిచేయనివ్వవు. ఫలితంగా రోగనిరోధక శక్తి కోల్పోతారు. బ్లడ్ క్యాన్సర్స్‌లో ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. అవి... 1) లుకేమియా 2) లింఫోమా 3) మైలోమా లక్షణాలు: బ్లడ్‌క్యాన్సర్‌లో పరిపక్వం కాని తెల్లరక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతుంటాయి. వీటి వల్ల గాయాలైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులలో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా దద్దుర్లు కనిపిస్తుంటాయి. వ్యాధి కారక సూక్ష్మజీవులతో పోరాడుతూ ఉండే తెల్లరక్తకణాల పనితీరు దెబ్బతింటుంది. దాంతో తమ విధులను అవి సక్రమంగా నెరవేర్చలేవు. పైగా అవి విపరీతంగా పెరగడం వల్ల ఎర్రరక్తణాలు తగ్గిపోయి, రోగికి రక్తహీనత రావచ్చు. ఫలితంగా వాళ్లకు ఆయాసం కూడా రావచ్చు. ఇతర జబ్బులలో కూడా ఈ లక్షణాలు ఉండవచ్చు. అందుకే కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు బోన్‌మ్యారో పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఇతర లక్షణాలు: జ్వరం, వణుకు, రాత్రుళ్లు చెమటలు పోవడం, ఇన్ఫ్లుయెంజా, అలసట, ఆకలి లేకపోవడం, చిన్నగాయం నుంచి అధిక రక్తస్రావం ∙తలనొప్పి, కాలేయం, స్పీ›్లన్, ఎముకల నొప్పి. సాధారణంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారికి ప్రధానంగా మందులతో (కీమోథెరపీ) చికిత్స చేస్తారు. మీ అమ్మగారి విషయంలో మీ డాక్టర్ చెప్పిన సూచనలు పాటించి, తగిన చికిత్స అందించండి. శైలేశ్ ఆర్. సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్ సెంచరీ హాస్సిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
జుట్టు రాలడం తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. గత కొంతకాలంగా జుట్టు విపరీతంగా రాలిపోతోంది. ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. పైగా వెంట్రుకలు పలుచబారడంతో బట్టతల వస్తుందేమోనని చాలా ఆందోళనగా ఉంది. హోమియో చికిత్స ద్వారా నా సమస్య తగ్గే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. – రవికుమార్, టెక్కలి ఈమధ్యకాలంలో జుట్టు రాలే సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. అధిక మానసిక ఒత్తిడికి లోనవ్వడం, పోషకాహార లోపం, కొన్ని రకాల హార్మోన్ల సమస్యలు, కలుషిత వాతావరణం వంటి అంశాలన్నీ ఈ సమస్యకు కారణాలు. జుట్టు రాలే సమస్యకు హోమియోలో పరిష్కారం ఉంది. జుట్టు పెరగడంలో మూడు దశలు ఉంటాయి. అవి... 1) అనాజెన్ : ఇది మొదటి దశ, జుట్టు బాగా పెరిగే దశ. ఇది 2 నుంచి 6 ఏళ్లు ఉంటుంది; 2) కెటజెన్ : ఇది రెండో దశ. ఈ దశలో జుట్టు పెరగకుండా ఆగిపోతుంది. ఇది 2 నుంచి 3 వారాలు ఉంటుంది; 3) టిలోజెన్ : ఈ మూడో దశ 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. ఈ దశలో జుట్టు ఊడటం జరుగుతుంది. జుట్టు రాలే సమస్యను నాలుగు రకాలుగా విభజించవచ్చు. 1) పురుషులలో జుట్టు రాలడం : కొందరు పురుషులలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దీని వల్ల ముఖం మీద, నుదురు భాగంలో ఉండే జుట్టు సరిహద్దు క్రమంగా పలచబడి వెనక్కు వెళ్తుంది. పురుషుల్లో జుట్టు రాలడానికి వంశపారంపర్యత, డై హైడ్రాక్సీ టెస్టోస్టెరాన్ (డీహెచ్‌టీ) హార్మోన్, మానసిక ఒత్తిడి, ఆందోళన, చుండ్రు, తలలో సోరియాసిస్, పొగతాగడం, టైఫాయిడ్, థైరాయిడ్ సమస్యలు, జుట్టుకు రంగు వేసుకోవడం వంటి కారణాలను ప్రధానంగా చెప్పవచ్చు. 2) స్త్రీలలో జుట్టు రాలడం : స్త్రీలలో ముఖ్యంగా తలస్నానం చేసిన తర్వాత దువ్వుకునేటప్పుడు ఎక్కువగా చిక్కుబడిపోయి జుట్టు ఊడటం జరుగుతుంది. ఇది ఎక్కువై జుట్టు పలుచబడి తల ముందు భాగం పూర్తిగా జుట్టు లేకుండా అవుతుంది. స్త్రీలలో జుట్టు రాలడానికి హార్మోన్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, పీసీఓడీ, నెలసరి సమస్యలు, రక్తహీనత, ప్రసవం తర్వాత వాడే కొన్ని మందులు కారణమవుతాయి. నెలసరి ఆగిపోయే సమయంలో, మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. 3) పేనుకొరకడం : కొందరిలో తల లేదా మీసం, గడ్డంలో జుట్టు వృత్తాకారంలో ఊడిపోతుంటుంది. దీనికి మానసిక ఒత్తిడి, శరీర రక్షణ వ్యవస్థ సొంత జుట్టుపై ప్రతికూలంగా పనిచేయడం, దాడిచేయడం వంటివి కారణాలు. 4) జుట్టు మొత్తం ఊడిపోవడం : కొందరిలో తలపైన ఉండే జుట్టు, కనుబొమలు, కనురెప్పలు సహా జుట్టు మొత్తం ఊడిపోతుంది. దీనికి కచ్చితమైన కారణాలు తెలియదు. కానీ మానసిక ఒత్తిడి, ఆటోఇమ్యూన్ కారణాల వల్ల ఇలా జరుగుతుందని అనుకోవచ్చు. హోమియో చికిత్స : హోమియో వైద్యవిధానాలలో అనుసరించే చికిత్స ప్రక్రియలో జుట్టు రాలడానికి గల కారణాన్ని గుర్తించి మందులు ఇస్తారు. అయితే మందు ఇచ్చే మందు రోగి శారీరక, మానసిక తత్వాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఔషధాలను ఇస్తారు. పురుషులలో మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్కూ కారణమైన హార్మోన్ల అసమతౌల్యతలను సరిచేయడం, మహిళల్లో వచ్చే ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్కు గల కారణాలను కనుగొని వాటిని సరిచేయడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారింపజేసి, హెయిర్ఫాలికిల్ను తిరిగి దృఢంగా చేసి, జుట్టు రాలడాన్ని అదుపు చేస్తారు. ఇక దాదాపు 80 శాతం మందిలో రాలడం ద్వారా కోల్పోయిన జుట్టునైనా తిరిగి వచ్చేలా చేయవచ్చు. మీరు అనుభవజ్ఞులైన హోమియో నిపుణులను సంప్రదించండి. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
ఆటిజమ్ నయమవుతుందా?
హోమియో కౌన్సెలింగ్ మా అబ్బాయికి ఐదేళ్లు. మాటలు సరిగా రావడం లేదు. పలికినవే పలుకుతున్నాడు. డాక్టర్‌కు చూపిస్తే ఆటిజమ్ అంటున్నారు. హోమియోలో చికిత్స ఉందా? – ఎమ్. జగన్మాథరావు, తెనాలి మాటలు సరిగా రాకపోవడం అన్నది ఆటిజమ్ ఉన్నపిల్లల్లోని ఒక లక్షణం. వారిలో చాలా ఇతర సమస్యలు కూడా కనిపిస్తాయి. అందుకే ఆటిజమ్ నిర్ధారణ చేయాలంటే ఇతర సమస్యలు ఉన్నాయేమో చూడాలి. ఆటిజమ్ లక్షణాల తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో ఈ లక్షణాలు స్పష్టంగా, నిర్దిష్టంగా ఉంటాయి. దాన్ని క్లాసికల్ ఆటిజమ్ అంటారు. కొందరిలో లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటుంది. అది వారి జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపించదు. దీన్ని మైల్డ్ ఆటిజమ్, ఆస్పర్జర్ సిండ్రోమ్ అని అంటారు. తీవ్రల ఎలా ఉన్నా ఆటిజమ్ ఉన్న పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవి... ►మాట్లాడటం, భావవ్యక్తీకరణలో, ఏకాగ్రతను చూపలేకపోవడం, అందులో ఇబ్బందులు ఎదుర్కోవడం ∙పిల్లలు స్నేహితులను చేసుకులేకపోవడం ∙ఎదుటివారి మనోభావాలను అర్థం చేసుకోలేకపోవడం ∙నలుగురిలో కలవలేకపోవడం; ఆనందాలను, బాధలను పంచుకోలేకపోవడం ∙ఒకేమాటను పదే పదే ఉచ్చరించడంలేదా అడిగిన ప్రశ్ననే మళ్లీ తిరిగి అడగటం దీనిని ‘ఇకోలేలియా’ అంటారు ∙ఎప్పుడూ రొటీన్‌నే కోరుకోవడం... అంటే ఒకేరకమైన ఆహారం లేదా దుస్తులు వేయమని అడగడం. వయసుకు తగినంత మానసిక పరిపక్వత చూపలేకపోవడం ∙చేతులు, కాళ్లు విచిత్రంగా ఆడించడం, కదపడం, చుట్టూ తిరగడం, గజిబిజిగా నడవడం, శరీరంలో జర్క్ ఇచ్చినట్లుగా కదలికలు ఉండటం. ఇవన్నీ ‘ఆటిజమ్’ను గుర్తించడానికి బాగా తోడ్పడతాయి. కారణాలు: ఆటిజమ్ అన్నది మెదడు, నాడీ వ్యవస్థ సరిగా ఎదగకపోవడం వల్ల పుట్టుకతో వచ్చే సమస్య అయినా కొంతమంది పిల్లల్లో దీన్ని పిల్లలకు మూడో ఏడు వచ్చే వరకూ గుర్తించలేకపోవచ్చు. ►తల్లి గర్భవతిగా ఉన్న సమయంలో వచ్చే రుబెల్లా, సైటోమెగాలో వైరస్ వంటి ఇన్ఫెక్షన్లు రావడం ∙గర్భంతో ఉన్న సమయంలో తల్లి మాదక ద్రవ్యాలు, మద్యం వంటి అలవాట్ల వల్ల ∙గర్భం దాల్చిన సమయంలో అధిక రక్తస్రావం, థైరాయిడ్, డయాబెటిస్ వంటి జబ్బులు ఉన్నా పిల్లలకు ఆటిజమ్ వచ్చే అవకాశం ఎక్కువ ∙పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రకాల అలర్జీల వల్ల, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావడం కారణంగా, కొన్ని మందులు వాడటం వల్ల కూడా ఆటిజమ్ వచ్చే అవకాశం ఉంది ∙బాల్యంలో తీవ్రమైన మానసిక సంఘర్షణ అనుభవించి, తల్లిదండ్రుల నుంచి సరైన ఆప్యాయతా, అనురాగాలు పొందలేని పిల్లల్లో కూడా ఈ సమస్య రావచ్చు. క్లాసికల్ ఆటిస్టిక్ డిజార్డర్ ఉన్న పిల్లలు బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా పదే పదే ఒకేపనిని చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పిల్లలు చిన్న శబ్దాలకు, వాసనలకు అవసరమైన దానికంటే ఎక్కువగా స్పందిస్తారు. మానసిక ఎదుగుదల, తెలివితేటల విషయంలో ఒకరి నుంచి మరొకరికి తేడా ఉంటుంది. అయితే యాస్పర్జర్ డిజార్డర్ ఉన్న పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, పదే పదే చేసే పని వల్ల అందులో మంచి నైపుణ్యం కనబరుస్తారు. అయితే ఈ పిల్లల్లో భావవ్యక్తీకరణ శక్తి తక్కువగా ఉంటుంది. రెట్స్ సిండ్రోమ్ అనే మరొకరకం ఆటిజమ్ ఆడపిల్లల్లో ఎక్కుగా కనిపిస్తుంది. ఈ పిల్లల శరీరం చిక్కిపోయినట్లుగా ఉండి, మానసిక వైకల్యానికి గురువుతారు. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. మాటలు రాని వారికి స్పీచ్ థెరపీ ఉపయోగపడుతుంది. బిహేవియరల్ థెరపీ వంటి చికిత్స ప్రక్రియల వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. హోమియోలో పిల్లల లక్షణాలు, కారణాల వంటి అనేక అంశాను పరిగణనలోకి తీసుకుని ఔషధాలను సూచిస్తారు. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ మాటిమాటికీ కామెర్లు..! పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా అబ్బాయికి రెండున్నర ఏళ్లు. కేవలం ఆర్నెల్ల వ్యవధిలో అతడికి మూడు సార్లు కామెర్లు వచ్చాయి. దీంతో మా ఊళ్లో డాక్టర్‌కు చూపించి చికిత్స చేయించాం. గత వారం రోజుల నుంచి మళ్లీ కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. మా వాడికి ఎందుకు ఇలా జాండీస్ పదే పదే వస్తున్నాయి. ఇక్కడ స్థానికంగా ఉన్న డాక్టర్‌కు చూపించి కొన్ని పసరు మందులు, ఇంగ్లిష్ మందులు వాడుతున్నాం. చాలా మంది డాక్టర్లను సంప్రదించాం. ప్రయోజనం కనిపించడం లేదు. ఇలా ఇవి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మాకు తగిన సలహా ఇవ్వండి. – సుదర్శన్, చౌటుప్పల్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ అబ్బాయికి దీర్ఘకాలిక కామెర్లు ఉన్నాయని చెప్పవచ్చు. పసిపిల్లల నుంచి వివిధ వయసుల వారిలో వచ్చే దీర్ఘకాలిక కామెర్లకు అనేక కారణాలుంటాయి. వీటిలో కొన్ని చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం కూడా ఉంది. పిల్లల్లో కొన్ని ఎంజైమ్ లోపాలు, నాటుమందులు వాడటం, వైరల్ హెపటైటిస్, థలసేమియా వంటి రక్తానికి సంబంధించిన జబ్బులు, కాపర్ మెటబాలిజమ్‌లో లోపం, కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా కామెర్లు రావచ్చు. కొన్నిసార్లు హెపటో బిలియరీ సిస్టమ్‌లోని కొన్ని అనటామికల్ (శరీర నిర్మాణపరమైన లోపాలతో వచ్చే) సమస్యల వల్ల కూడా జాండీస్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబు దీర్ఘకాలిక జాండీస్‌కు కారణం ఇదీ అని నిర్ధారణగా చెప్పడం కష్టమే. కాబట్టి మీరు కొన్ని ప్రాథమిక రక్తపరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు, ఎంజైమ్ పరీక్షలు చేయించాలి. దానితో పాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం, ఇతర మెటబాలిక్ సమస్యలను కనుగొనేందుకు అవసరమైన పరీక్షలు చేయించడం ప్రధానం. ఎందుకంటే పైన పేర్కొన్న కొన్ని మెడికల్ కండిషన్స్‌కు అవసరమైతే లివర్ బయాప్సీ వంటి పరీక్షలు చేసి తక్షణమే తగు చికిత్స చేయాల్సి ఉంటుంది. థైరాయిడ్ లేదా కొన్ని ఆటోఇమ్యూన్ సమస్యల కారణంగా వచ్చే కాలేయ వ్యాధులకు పరిష్కారం ఒకింత తేలిక. వాటిని సరైన చికిత్సతో పూర్తిగా విజయవంతంగా పరిష్కరించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో తీవ్రమైన లివర్ సమస్యల పురోగతిని నియంత్రించడంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లివర్ ఫెయిల్ కాకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే అదృష్టవశాత్తు మీ అబ్బాయికి లివర్ ఫెయిల్యూర్ సూచనలు ఏమీ కనిపించడం లేదు. కాబట్టి మీరు మీ అబ్బాయి విషయంలో తక్షణం మీ పిల్లల వైద్యనిపుణుడితో పాటు పీడియాట్రిక్ గాస్ట్రో ఎంటరాలజిస్ట్ నేతృత్వంలో పూర్తి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్,విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
గ్యాస్ట్రైటిస్ అంటే ఏమిటి?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నేను ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. నేను కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతోను బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియో చికిత్స ద్వారా నయమబవుతుందా? – రమేశ్‌కుమార్, హైదరాబాద్ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడంతో గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల అందరిలోనూ నెలకొంటున్న తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం అనే అంశం దీనికి ఆజ్యం పోస్తోంది. శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఇటీవల చాలామంది గ్యాస్ట్రైటిస్ సమస్య బారిన పడుతున్నారు. గ్యాస్ట్రైటిస్ అంటే: జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు: దాదాపు 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. → తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం n కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం n పైత్య రసం వెనక్కి ప్రవహించడం n కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు → శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో n ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: కడుపు నొప్పి, మంట n కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం n అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు n ఆకలి తగ్గిపోవడం n కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: n సమయానికి ఆహారం తీసుకోవాలి n కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి n పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి n ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స: హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కిడ్నీ వ్యాధులను నివారించడమెలా? కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. మా ఇంట్లో మా అమ్మగారు, వారి తండ్రిగారు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మరణించారు. జన్యుపరమైన అంశాలు కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణమవుతాయని ఇటీవలే చదివాను. అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. కిడ్నీ వ్యాధి రాకుండా ఉండటానికి ఏవైనా ముందస్తు పరిష్కార మార్గాలున్నాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – నిత్యానంద ప్రసాద్, ఖమ్మం మూత్రపిండాలను కబళించే జబ్బుల్లో అతి పెద్దది డయాబెటిస్. మూత్రపిండాల వ్యాధులు రావడానికి సుమారు 40 నుంచి 40 శాతం వరకు ఇదే ప్రధాన కారణం. దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తపోటు కూడా కిడ్నీలను దెబ్బతీస్తుంది. ఇవేకాకుండా వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు మిగతా ఇతర జబ్బుల కారణంగా కూడా కిడ్నీలు చెడిపోతాయి. కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే అది రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. కిడ్నీ వ్యాధులలో పరిస్థితి చాలా తీవ్రతరం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. అందుకే కిడ్నీ జబ్బులను సైలెంట్ కిల్లర్స్‌గా పేర్కొంటారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి మూత్రపరీక్ష, సీరమ్ క్రియాటనిన్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఈ పరీక్షలలో ఏమైనా అసాధారణంగా కనిపిస్తే మరింత లోతుగా సమస్యను విశ్లేషించేందుకు జీఎఫ్ఆర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు తోడ్పడతాయి. డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయంతో బాధపడుతున్నవారు, కుటుంబలోగానీ, వంశంలో గానీ కిడ్నీ సంబంధిత జబ్బులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్, బీపీని నియంత్రణలో ఉంచుకుంటూ తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఆకలి మందగించడం, నీరసం, మొహం వాచినట్లు ఉండటం, కాళ్లలో వాపు, రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్రం రావడం, తక్కువ మూత్రం రావడం, మూత్రం నురగ ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే మూత్రపిండాల వ్యాధులలో సమయమే కీలకపాత్ర పోషిస్తుంది. చికిత్స ఆలస్యం అయ్యేకొద్దీ మూత్రపిండాల సమస్య తీవ్రతరమవుతుంది. ఎక్కువగా నీళ్లు తాగడం, బరువును అదుపులో ఉంచుకోవడం, మాంసాహారం మితంగా తీసుకోవడం, సాధ్యమైనంతవరకు జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్కు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తాజాపండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
కడుపులో మంట... ఉబ్బరం... తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 43 ఏళ్లు. నేను ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్రై్టటిస్ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? – దిలీప్‌కుమార్, వరంగల్ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అధిక పని ఒత్తిడి వల్ల, దూరాభారాలు ప్రయాణాలు చేస్తూ ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న నేపథ్యంలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో చాలామంది గ్యాస్రై్టటిస్ సమస్యతో ఇప్పుడు బాధపడుతున్నారు. జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర వాపునకు గురికావడాన్ని గ్యాస్రై్టటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై, కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే ఎక్యూట్ గ్యాస్రై్టటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్రై్టటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు: 20 నుంచి 50 శాతం ఎక్యూట్ గ్యాస్రై్టటిస్లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్ డిసీజ్), కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్రై్టటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం lకొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స: హోమియో వైద్య విధానంలో గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ చిన్న చిన్న వస్తువులను ముక్కులో పెట్టుకుంటే ఏంచేయాలి? పీడియాట్రిక్ కౌన్సెలింగ్ పిల్లలు తమ ఆటల్లో భాగంగా ముక్కులో అవీ ఇవీ పెట్టుకుంటుంటారు. ఇటీవల మా చిన్నాన్నగారమ్మాయి ఇలాగా చిన్న బలపం ముక్క పెట్టుకుంది. ఇలా జరిగినప్పుడు ఏమి చేయాలో వివరంగా తెలపగలరు. – సుష్మిత, హుజూర్నగర్ సాధారణంగా పిల్లలు... గింజలు, పెన్సిల్ ముక్కలు, చిన్న గోలీల వంటి వాటిని ముక్కులో పెట్టుకుంటారు. అలాంటప్పుడు ముక్కులో ఇరుక్కున్న వస్తువును మనమే తీయడానికి ప్రయత్నించినా లేదా ఆ గింజ వంటి వస్తువు గాలిని పీల్చుకునే గొట్టం లోపలి భాగంలోనికి వెళ్లి శ్వాస ప్రక్రియకు అడ్డం పడ్డా అది చిన్నారికి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల వాటిని బయటకు తీయడానికి మనంతట మనమే ప్రయత్నించకూడదు. ఈ ప్రయత్నంలో తమకు తెలియకుండానే ముక్కుకు కూడా మనం హాని చేసినవాళ్లమవుతాం. ఈ సమయంలో బిడ్డను కంగారు పెట్టకుండా అవతలి ముక్కు రంధ్రాన్ని మూసి, ఏ ముక్కు రంధ్రంలో గింజ పెట్టుకుందో అక్కడి నుంచి వేగంగా గింజ బయటకు వచ్చేలా బిడ్డ చేత గట్టిగా తుమ్మించాలి. అదృష్టవశాత్తు గింజ బయటకు వచ్చేసినా కూడా ఒకసారి ఈఎన్టీ వైద్యులను సంప్రదించాలి. ఒకవేళ గింజ బయటకు రాకపోతే అప్పుడు తప్పనసరిగా ఈఎన్టీ వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. హాస్పిటల్‌కు వెళ్లే దారిపొడవునా చిన్నారి తలను కాస్త ముందుకు ఒంగి ఉంచేలా చూడాలి. హాస్పిటల్లో వైద్యులు ఫోర్సెప్స్తో జాగ్రత్తగా ఆ గింజను తీసేస్తారు. ఒక్కోసారి పిల్లలు ముక్కులో గింజలూ, అవీ పెట్టుకొని తల్లిదండ్రులకు చెప్పరు. ఎప్పుడైనా ఒక ముక్కు రంధ్రం నుంచి ఎక్కువగా చీమిడి కారుతున్నా, శ్వాసతీసుకునే సమయంలో శబ్దం ఎక్కువగా వస్తున్నా వెంటనే ఈఎన్టీ వైద్యనిపుణులను సంప్రదించాలి. లేకపోతే ఇరుక్కున్న గింజల వల్ల చీముపట్టడం, జ్వరం రావడం, మరిన్ని ఇతర సమస్యలు తలెత్తవచ్చు. చంటిపిల్లలు పాలు తాగిన తర్వాత వాంతులు చేసుకుంటారు. దీనికి పరిష్కారం? – చంద్రిక, నడిగూడెం చంటిపిల్లలు పాలు తాగిన తర్వాత కాసేపటికి వాంతి చేసుకోవడం సహజం. దీనికి మనం ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు. బిడ్డ ఎదుగుదల బాగుండి, ఈ చిన్న వాంతుల వల్ల దగ్గుగానీ, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు కానీ, నెమ్ము పట్టడం వంటి సమస్యలు రానంతవరకు మనం ఆదుర్దా పడక్కర్లేదు. బిడ్డ పెరిగేకొద్దీ లేదా ఘనాహారం మొదలుపెట్టాక సమస్య దానంతట అదే తగ్గుతుంది. పాలు తాగించేటప్పుడు, తాగించాక కనీసం అర్ధగంట సేపు బిడ్డ తల వైపు భాగం కాస్త ఎత్తుగా ఉండేటట్లు చూసుకుంటే ఈ సమస్య చాలావరకు నివారించవచ్చు. పాలు తాగించాక తేన్పు తెప్పించడం ముఖ్యం. కొంతమంది చంటి పిల్లలు వాంతులు ఎక్కువగా చేసుకుంటారు. దానివల్ల సరిగా బరువు పెరగరు. కొంతమందికి ఈ వాంతుల వల్ల పొలమారి (పొరబోయి) మాటిమాటికీ నెమ్ముపడుతుంది. లేదా ఒక్కోసారి పొరబోయి గొంతులో అడ్డంపడి ఊపిరి అందక ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. కొంతమంది పిల్లలకు వాంతుల సమస్య రెండో నెలలో మొదలు కావచ్చు. కష్టపడి వాంతులు చేస్తున్నట్లు పెద్ద వాంతులు చేస్తారు. బరువు సరిగా పెరగకపోవచ్చు. అయితే కొందరు మామూలుగానే బరువు పెరగవచ్చు. పైలోరిక్ స్టెనోసిస్ అనే కండిషన్ వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి సమస్యకు ఆపరేషన్ తప్పనిసరి. ఏదిఏమైనా పిల్లలు మాటిమాటికీ వాంతులు చేసుకుంటుంటే మాత్రం పిల్లల డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. డాక్టర్ శివరంజని హెచ్ఓడీ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ మాక్స్‌క్యూర్ షియోషా, మాదాపూర్, హైదరాబాద్ -
ఎగ్జిమా నయమవుతుంది!
హోమియో కౌన్సెలింగ్ మా పాప వయసు నాలుగేళ్లు. తనకు తరచూ బుగ్గలపై చర్మం ఎర్రగా మారుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఎగ్జిమా అని చెప్పారు. మందులు వాడుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు. శీతాకాలంలో సమస్య మరింత అధికమవుతోంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్య పోతుందా? తగిన సలహా ఇవ్వగలరు. – వెంకటేశ్, నల్లగొండ చలికాలంలో ఈ సమస్య చాలా ఎక్కువ. ఇందులోనూ అనేక రకాలు ఉన్నప్పటికీ అటోపిక్ డర్మటైటిస్ అనేది ప్రధానమైనది. ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అయితే చిన్నపిల్లల్లో మరింత ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతుంటారు. కారణాలు : ఎగ్జిమా కనిపించడానికి కచ్చితమైన కారణాలు తెలియదు. కానీ వంశపారంపర్యత, వాతావరణ మార్పులు వంటి అంశాలు దీనికి కొంతవరకు కారణం కావచ్చు. ఎగ్జిమాను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు మన శరీర రోగ నిరోధక వ్యవస్థ... సాధారణ స్థితికి మించి ఎక్కువగా ప్రతిక్రియను కనబరుస్తుంది. దాంతో ఎగ్జిమా లక్షణాలు కనిపిస్తాయి. ఎగ్జిమాను ప్రేరేపించే అంశాలు : పొడి చర్మం ఉన్నవారిలో ఎగ్జిమా ఎక్కువగా వస్తుంది. దుమ్ము, ధూళి, వాతావరణ మార్పులు, పూల మొక్కల నుంచి వచ్చే పుప్పొడి, జంతుకేశాలు, సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలు, డియోడరెంట్లు కొన్ని ఆహార పదార్థాలు (గుడ్లు, పాల ఉత్పత్తుల వంటివి), కాస్మటిక్స్, చేతి గడియారాలు, కొన్ని ఆభరణాలు, డైపర్స్, ఉన్ని వస్త్రాలు, దురదను ప్రేరేపించే దుస్తులు ఎగ్జిమాను ప్రేరేపిస్తాయి. కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, మానసిక సమస్యలు, హార్మోన్ సమస్యలు ఎగ్జిమాను తీవ్రతరం చేస్తాయి. లక్షణాలు : ఎగ్జిమా లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. ఎగ్జిమాలో కనిపించే ప్రధాన లక్షణం దురద. ఆ తర్వాత చర్మం ఎర్రగా మారి, వాపుతో కూడిన పొక్కులు ఏర్పడతాయి. క్రమేపీ ఇవి నీటి బుడగలుగా మారి, అక్కడి స్రావాలు కనిపిస్తాయి. కొంతకాలం తర్వాత ఆ ప్రాంతమంతా నల్లగా మారుతుంది. చర్మంపై ఎక్కడైనా ఏర్పడే ఎగ్జిమా... ముఖ్యంగా తల, మోకాలు వెనక భాగంలో, మెడపైన, మోచేయి, మణికట్టు, చర్మం మడతలు, చెవి వెనకభాగం, కాలి మడమలపైన, పాదాలపై ఎక్కువగా కనిపిస్తుంది. శిశువుల్లో మొదట బుగ్గలపై దద్దుర్లుగా ఇవి కనిపిస్తాయి. కొన్ని నెలలకు ఈ దద్దుర్లు చేతులు, కాళ్లతో పాటు ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తాయి. చికిత్స : ßోమియో మందులతో రోగనిరోధక శక్తిని పెంచి çకణాలకు పునరుజ్జీవం కల్పించి, దుష్ఫలితాలు లేకుండా ఎగ్జిమాను పూర్తిగా నయం చేయవచ్చు. ఇలా చికిత్స చేసే సమయంలో రోగి మానసిక, శారీరక లక్షణాలతో పాటు శరీర నిర్మాణం, వ్యక్తిగత అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని నిపుణులైన డాక్టర్లు మందులను సూచిస్తారు. హోమియో విధానం ద్వారా ఎగ్జిమాను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కొవ్వుల నియంత్రణ లో వ్యాయామంతో డబుల్ బెనిఫిట్! లైఫ్‌సై్టల్ కౌన్సెలింగ్ వ్యాయామం వల్ల చెడు కొలెస్ట్రాల్ వంటి చెడు కొవ్వులు తగ్గడంతో పాటు మనకు మేలు చేసే కొవ్వు కూడా పెరుగుతుందని మా ఫ్రెండ్ చెబుతున్నాడు. కొవ్వుల్లోనూ మంచి, చెడు కొవ్వులు ఉంటాయా? వ్యాయామం కొవ్వును తగ్గించాలి కదా, మరి మంచి కొవ్వును ఎలా పెంచుతుంది. ఈ విషయమై తగిన అవగాహన కల్పించండి. – సుధీర్ కుమార్, వరంగల్ మీ ఫ్రెండ్ చెబుతున్నది నిజమే. కొలెస్ట్రాల్ అనే కొవ్వులో మంచి, చెడు ఉంటాయి. ఎల్డీఎల్ అనే రకాన్ని చెడు కొలెస్ట్రాల్‌గా చెబుతారు. సాధారణంగా రక్తనాళాలు ఒక మంచి రబ్బర్ ట్యూబ్‌లా ఎటుపడితే అటు ఒంగేలా ఎలాస్టిసిటీతో ఉంటాయి. కానీ ఈ ఎల్డీఎల్ అనేది రక్తనాళంలోపల గారలాగా పట్టేస్తూ ఉంటుంది. దాంతో ఎటుపడితే అటు తేలిగ్గా ఒంగ గలిగే రక్తనాళం బిరుసుగా మారడమేగాక లోపలి సన్నబారుతుంది. ఈ కండిషన్‌ను అథెరోస్కి›్లరోసిస్ అంటారు. దీని వల్ల గుండెకు రక్తం అందక గుండెపోటు రావచ్చు. కానీ ఇందులోనే మరో రకం కొలెస్ట్రాల్ ఉంది. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఇది మంచి కొలెస్ట్రాల్ అన్నమాట. ఇది రక్తనాళంలోపల గారలా పేరుకుపోతున్న చెడుకొలెస్ట్రాల్‌ను తొలుచుకుంటూ, ఒలుచుకుంటూ పోతుంటుంది. అంటే రక్తనాళాల్లోని పూడికను తొలగించే పనిచేస్తుందన్నమాట. అందుకే హెచ్‌డీఎల్ పాళ్లు పెరుగుతున్నకొద్దీ గారలా పేరుకునే చెడుకొలెస్ట్రాల్‌ను చెక్కినట్లుగా తీసేస్తుంటుంది. అందుకే ఇది గుండెపోటు రాకుండా చూసే కొలెస్ట్రాల్ అన్నమాట. ఇక కొవ్వుల్లో మరో రకం కూడా ఉన్నాయి. వాటిని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. మనం తిన్న ఆహారంలో ఎక్కువ శక్తిని నిల్వ చేసుకునే ప్రక్రియలో ఈ రకం కొవ్వు పుడుతుంది. అది మళ్లీ రక్తనాళాలు సన్నబడటానికి కారణం అవుతుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైనది. ఇది కేవలం ఆహారపు శక్తిని నిల్వచేసే సమయంలోనే గాక... మన శరీర బరువు పెరిగినా, స్థూలకాయం వచ్చినా, తగినంత శారీరక శ్రమ చేయకపోయినా, సిగరెట్లు, మద్యం తాగినా పెరుగుతుంది. కాబట్టి ఈ కొవ్వు మంచిది కాదు. ఇక మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకూ, మన గుండెను హార్ట్ఎటాక్ రిస్క్‌నుంచి తప్పించుకునేందుకు చేయాల్సిన పని ఏమిటంటే... మనం తీసుకునే ఆహారంలో ఎల్డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూసుకోవాలి. అలాగే హెచ్‌డీఎల్ అనే మంచి కొవ్వును పెంచుకోవాలి. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించుకొని, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవాలంటే కరిగే పీచు ఎక్కువగా ఉండే సోయాప్రోటీన్ల వంటి ఆహారంతో తీసుకుంటూనే... వారానికి కనీసం 150 నిమిషాలు (రోజుకు అరగంట చొప్పున ఐదు రోజులు) వ్యాయామం చేయాలి. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డీఎల్ పెరుగుతుంది. మరోవైపు అదే వ్యాయామం చెడుకొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్‌లన్నీ ఒకేలాంటివి కావని గ్రహించడంతో పాటు... వ్యాయామం చేయడం అనే ఒకే చర్య అటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందనీ, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని గ్రహించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌సై్టల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
సంతాన సాఫల్యం చేకూరుతుందా?
సంతానలేమి సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? - ఒక సోదరి మన జీవనశైలిలో వచ్చిన మార్పుల ప్రభావం ప్రత్యుత్పత్తిపై కూడా పడుతోంది. మహిళల విషయానికి వస్తే... సాధారణంగా సంతానం పొందడానికి 18 నుంచి 30 ఏళ్ల వయసు చాలా అనుకూలమైనది. కానీ ఇటీవల అనేక కారణాల వల్ల పెళ్లిలు ఆలస్యం కావడంతో సంతానం పొందడం అన్నది 30 - 40 ఏళ్ల వయసులో చాలా ఎక్కువగా జరుగుతోంది. ఇలా ఆలస్యం అవుతున్న కొద్ది ప్రత్యుత్పత్తి సమస్యలు ఎక్కువ కావచ్చు. సంతాన లేమికి కారణాలు: హార్మోన్ల అసమతౌల్యత... మహిళల్లో కనిపించే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, ఎఫ్ఎస్హెచ్, ఏఎమ్‌హెచ్ వంటి హార్మోన్ల అసమతౌల్యం, మెదడులోని పిట్యుటరీ గ్రఃతి సరిగా పనిచేయకపోవడం. గర్భాశయ కారణాలు: ఫైబ్రాయిడ్, పాలిప్స్, అడినోమయొసిస్ లేదా ఎండోమెట్రియాసిస్ వల్ల రుతుక్రమంలో అధిక రక్తస్రావం, మధ్యలో చుక్కల మాదిరిగా స్రావం, రుతుక్రమాల మధ్య నిడివి తక్కువ కావడం వంటి సమస్యలు అండాశయ కారణాలలో పీసీఏడి వంటి సమస్యలు, వయసు పెరుగుతున్న కొద్ది అండాశయాలలోని అండం ప్రామాణికత (సైజ్, క్వాలిటీ) తగ్గడం, అండాశయాలు కుంచించుకుపోవడం, అండాల సంఖ్య తగ్గడం ట్యూబ్లలో సమస్య: పీఐడీ లేదా టీబీ వంటి వ్యాధుల వల్ల ట్యూబ్స్ మూసుకుపోవడం క్రోమోజోమల్/జెనెటిక్ కారణాలు. లక్షణాలు: రుతుక్రమం సరిగా రాకపోవడం, మధ్యలో రక్తస్రావం కనిపించడం, రెండు పీరియడ్స్ మధ్య నిడివి తగ్గడం, పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి గర్భనిరోధక మాత్రలు మానేసిన 6 -10 నెలల తర్వాత కూడా రుతుక్రమం సరిగా రాకపోవడం పీసీఓడీ వల్ల కలిగే అధిక బరువు, అవాంఛిత రోమాలు, 2 - 3 నెలల్లో రుతుక్రమాలు ఆగిపోవడం... ఈ లక్షణాలు కనిపించిన వారు ఆలస్యం చేకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. చికిత్స: హార్మోన్ల అసమతౌల్యత నుంచి మొదలుకొని లక్షణాలను బట్టి జన్యుపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియోలో సంతానలేమి సమస్యకు చికిత్స చేయవచ్చు. -
ఆటిజమ్ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ మా అబ్బయి ఐదేళ్లు. మాటలు సరిగా రావడం లేదు. డాక్టర్‌కు చూపిస్తే ఆటిజమ్ అంటున్నారు. హోమియోలో చికిత్స ఉందా? - నాగేశ్వర్రావు, తెనాలి మాటలు సరిగా రాకపోవడం అన్నది ఆటిజమ్ ఉన్నపిల్లల్లోని ఒక లక్షణం. వారిలో చాలా ఇతర సమస్యలు కూడా కనిపిస్తాయి. అందుకే ఆటిజమ్ నిర్ధారణ చేయాలంటే ఇతర సమస్యలు ఉన్నాయేమో చూడాలి. కేవలం పిల్లల లక్షణాలను బట్టి ఆటిజమ్ అని నిర్ధారణకు రాకుండా వైద్యులకు చూపించుకున్న తర్వాతే దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆటిజమ్ఉన్న పిల్లలలో ఆరోగ్యంగా ఉన్న పిల్లలలో తేడాను కనిపెట్టడం అంత సులభం కాదు. ఆటిజమ్ లక్షణాల తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో ఈ లక్షణాలు స్పష్టంగా, నిర్దిష్టంగా ఉంటాయి. దాన్ని క్లాసికల్ ఆటిజమ్ అంటారు. కొందరిలో లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటుంది. అది వారి జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపించదు. దీన్ని మైల్డ్ ఆటిజమ్, ఆస్పర్జర్ సిండ్రోమ్ అని అంటారు. తీవ్రత ఎలా ఉన్నా ఆటిజమ్ ఉన్న పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవి... మాట్లాడటం, భావవ్యక్తీకరణలో, ఏకాగ్రతను చూపలేకపోవడం, అందులో ఇబ్బందులు ఎదుర్కోవడం. (ఆటిజమ్ ఉన్న 40 శాతం మందిలో మాటలే రాకపోవచ్చు) పిల్లలు స్నేహితులను చేసుకోలేకపోవడం ఎదుటివారి మనోభావాలను అర్థం చేసుకోలేకపోవడం నలుగురిలో కలవలేకపోవడం; ఆనందాలను, బాధలను పంచుకోలేకపోవడం ఒకేమాటను పదే పదే ఉచ్చరించడమో లేదా అడిగిన ప్రశ్ననే మళ్లీ తిరిగి అడగటమో చేస్తుంటారు. ఎప్పుడూ రొటీన్‌నే కోరుకోవడం... అంటే ఒకేరకమైన ఆహారం లేదా దుస్తులు వేయమని అడగడం. వయసుకు తగినంత మానసిక పరిపక్వత చూపలేకపోవడం చేతులు, కాళ్లు విచిత్రంగా ఆడించడం, కదపడం, చుట్టూ తిరగడం, గజిబిజిగా నడవడం, శరీరంలో జర్క్ ఇచ్చినట్లుగా కదలికలు ఉండటం- ఇవన్నీ ‘ఆటిజమ్’ను గుర్తించడానికి బాగా తోడ్పడతాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. మాటలు రాని వారికి స్పీచ్ థెరపీ ఉపయోగపడుతుంది. బిహేవియరల్ థెరపీ వంటి చికిత్స ప్రక్రియల వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. హోమియోలో పిల్లల లక్షణాలు, కారణాల వంటి అనేక అంశాను పరిగణనలోకి తీసుకుని ఔషధాలను సూచిస్తారు. హోమియో చికిత్సలో ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. సరైన హోమియో మందులను, తగిన మోతాదులో అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడటం వల్ల పిల్లల్లో ఆటిజమ్ చాలావరకు నయమవుతుంది. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్ పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ లింఫోమా అంటే ఏమిటి? లింఫోమా క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. గత కొద్ది రోజులుగా నేను ప్లీహం (స్ల్పీన్) పెరగడం వల్ల బాధపడుతున్నాను. పొట్టలో నొప్పి, గజ్జలలో వాపు, జ్వరం-చలి, రాత్రిపూట చెమటలు పట్టడం లక్షణాలు కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను కలిసి ఈ లక్షణాలను చెబితే, కొన్ని పరీక్షలు నిర్వహించి నేను లింఫోమా వ్యాధితో బాధపడుతున్నాని నిర్ధారణ చేశారు. లింఫోమా అంటే ఏమిటి, దానికి చికిత్స ఏమిటో చెప్పండి. - విశ్వేశ్వరరావు, వైజాగ్ లింఫోమా అనేది లింఫోసైట్స్ (తెల్ల రక్త కణాలను) ఉత్పత్తి చేసి, నిల్వ చేసి, తీసుకెళ్లే కణజాలాల వ్యవస్థలో కలిగే క్యాన్సర్. ఇది ప్రాథమికంగా రెండు రకాలుగా ఉంటుంది. 1) హాడ్జ్కిన్స్ లింఫోమా 2) నాన్-హాడ్జ్కిన్స్ లింఫోమా లింఫోమా లక్షణాలు నొప్పి లేకుండా మెడలో, చంకలో, గజ్జల్లో వాపు ప్లీహం (స్ప్లీన్) పెరగడం, పొట్టనొప్పి, అసౌకర్యం జ్వరం చలి లేదా రాత్రిళ్లు చెమటలు పట్టడం నిస్సత్తువగా అనిపించడం. రోగ నిర్ధారణ పరీక్షలు రక్త పరీక్షలు బయాప్సీ ఎముక మూలుగ పరీక్ష సెరిబ్రో స్పినల్ ఫ్లుయిడ్స్ మాలిక్యులార్ రోగ నిర్ధారణ పరీక్షలు ఎక్స్‌రే, సీటీ స్కాన్, పెట్ స్కాన్ అనే ఇమేజింగ్ పరీక్షలు. వైద్య పరీక్షలను క్షుణ్ణంగా చేశాక మీ శరీరంలో లింఫోమా ఏ దశలో ఉందో మీ వైద్యుడికి తెలుస్తుంది. ఆ తర్వాత మీకు ఎలాంటి చికిత్స అందించాలన్న అంశం మూడు ప్రధాన విషయాలపై ఆధారపడి ఉంటుంది. అవి... మీకు ఏ రకరమైన లింఫోమా ఉంది మీకు ఉన్న లింఫోమా ఏ దశలో ఉంది (అంటే లింఫోమా వల్ల ఏయే అవయవాలు దెబ్బతిన్నాయి) మీ సాధారణ ఆరోగ్యాన్నీ చూస్తారు. లింఫోమా తర్వాతి జీవితం పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి,. అయితే ఒకేసారి ఎక్కువగా భోజనం చేయకూడదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి మీ నోట్లో ఏదైనా పుండు వంటిది ఉంటే మెత్తటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, బత్తాయి పండ్ల రసం తీసుకోకూడదు ద్రవాహారం పుష్కలంగా తీసుకోండి మీ డాక్టర్ సలహా మేరకు సింపుల్ స్ట్రెచింగ్ వ్యాయామాలు, కొద్ది పాటి నడక వంటి ఎక్సర్సైజ్లు చేయాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి, కంటి నిండా నిద్రపోవాలి తాజా గాలి బాగా పీల్చాలి కుంగుబాటు లేకుండా జీవించాలి ఒకవేళ కుంగుబాటు ఎక్కువ కాలం ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. లింఫోమాను కనుగొన్న తర్వాత మీ లిపిడ్లను, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాలను క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకుంటూ ఉండటం ముఖ్యం. అవేగాక మరికొన్ని పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. డాక్టర్ సోనాలి సదావర్తి కన్సల్టెంట్ హెమటో ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్ మాటిమాటికీ నిద్ర... ఏం చేయాలి? స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడూ, తింటున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీని వల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి. - నవీన్, హైదరాబాద్ మీరు చెబుతున్న దాన్ని బట్టి మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ. కనుపాపలు వేగంగా కలిదే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి. నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. అయితే ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. ఇక మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది. అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాట కూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీ డిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో దీనికి చికిత్స చేయవచ్చు. డాక్టర్ రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
సైనస్‌కు సమర్థమైన చికిత్స
హోమియో కౌన్సెలింగ్ నా వయస్సు 22 ఏళ్లు. గత 7 ఏడేళ్లుగా సైనసైటిస్ వ్యాధితో బాధపడుతున్నాను. రెండేళ్ల క్రితం సమస్య తీవ్రతరమవడంతో శస్త్ర చికిత్సను కూడా చేయించుకోవడం జరిగింది. తరువాత కొన్ని నెలల వరకు బాగానే వున్నా, వ్యాధి మళ్లీ మొదలవుతుండడంతో వాతావరణ మార్పులు ఏర్పడినప్పుడల్లా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. నా ఈ సమస్య హోమియో చికిత్స ద్వారా మళ్లీ తిరగబెట్టకుండా సంపూర్ణంగా నయమయ్యే అవకాశం ఉందా? - భాస్కర్, మంగళగిరి సైనసైటిస్ దీర్ఘకాలికంగా వేధించే శ్వాసకోశ సంబంధిత వ్యాధి. చల్లని వాతావరణం ఏర్పడిందంటే, దీని బారిన పడినవారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. శస్త్రచికిత్స చేయించిన తరువాత కూడా ఇది మళ్లీ తిరగబెట్టే అవకాశముంటుంది. అయితే హోమియో చికిత్స ద్వారా ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది సైనస్‌లోని శ్లేష్మపు పొర శోదమునకు లేదా వాపునకు గురవడాన్ని సైనసైటిస్ అని అంటారు. కారణాలు: తరచూ జలుబు చేయడం, ఎలర్జీ సమస్యలు, డిఎన్ఎస్ - ముక్కు రంధ్రాల మధ్య గోడ పక్కకు మరలడం, నాజల్ పాలిస్, ఏదైనా దెబ్బ తగలడం వలన సైనస్ ఎముకలు విరగడం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం,ఆస్తమా మొదలైన సమస్యలు దీనికి ప్రధాన కారణాలు. లక్షణాలు: - ముక్కు దిబ్బడ, సైనస్ ప్రభావిత భాగాలలో నొప్పి, ముక్కు ద్వారా చీముతో కూడిన ద్రవాలు బయటకు రావడం, తల నొప్పి. పంటి నొప్పి, దగ్గు, జ్వరం, నీరసం, నోటి దుర్వాసన వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: శ్వాసకోశ ఇబ్బందులన్నింటిలోకి ప్రధానమైన సమస్య అయిన సైనసైటిస్ వ్యాధికి హోమియోలో పత్యేక రీతిలో సమర్థమైన చికిత్స వుంది. అధునాతమైన జెనెటిక్ కాన్స్టిట్యుషనల్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరచి,సైనసైటిస్‌ని సంపూర్ణంగా నివారింపచేయడం పూర్తిగా సాధ్యమవుతుంది. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
చిన్నప్పట్నుంచీ అలర్జీ.. తగ్గేదెలా?
నాకు అలర్జీ సమస్య ఉంది. హోమియోలో దీనికి మందులు ఉన్నాయా. నాకు ఈ సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? - అనిల్‌కుమార్, నిజామాబాద్ అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. ఈ తరహా రుగ్మతలను హోమియో వైద్యచికిత్సా విధానం ద్వారా తేలిగ్గా తగ్గించవచ్చు. లక్షణాలను బట్టి వాటికి కన్స్టిట్యూషన్ పద్ధతిలో వాడే మందులివి... యాంట్ టార్ట్: జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆర్స్ ఆల్బ్: దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువవుతుంది. ఈ లక్షణాలు మధ్యరాత్రి ఎక్కువ. హెపార్‌సల్ఫ్: చాలా చలిగా అనిపిస్తుంది. చలిని ఏమాత్రం తట్టుకోలేరు. చల్లని-పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంది. కూర్చుని తలవాల్చి పడుకుంటే ఉపశమనంగా ఉంటుంది. సోరియమ్: ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకుని కూర్చుంటారు. ప్రతి చలికాలంలోనూ ఆయాసం తిరగబెడుతుంటుంది. నేట్రమ్ సల్ఫ్: నేలమాళిగలు, సెలార్స్లోకి ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కఫం పచ్చరంగులో ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతుంటారు. ఫాస్: మెత్తటి స్వభావం. ఎవరు ఏ సాయం అడిగినా చేస్తారు. భయంగా ఉంటారు. క్షయ వ్యాధి ఉన్నా ఈ మందు వాడవచ్చు. రోడో: వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే ఈ మందును సూచించవచ్చు. వీళ్లకు మెరుపులంటే భయం ఎక్కువగా ఉంటుంది. కాలీ ఎస్: ఆయాసం ఎక్కువగా ఉంటుంది. మెర్క్‌సాల్: వీళ్లు చాలా నిదానంగా ఉంటారు. ఎవరినీ నమ్మరు. సమాధానాలు సైతం చాలా నింపాదిగా చెబుతారు. గట్టిగా పట్టుదలగా ఉండలేరు. కుడివైపు తిరిగి నిద్రపోలేరు. కఫం పచ్చగా పడుతుంది. ⇒ పైన పేర్కొన్న మందులన్నీ హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి వ్యక్తిగత, శారీరక, మానసిక లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులను వాడాలి. వాటిని తగిన పొటెన్సీలో ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే మీరు నిపుణులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ సమస్యను విపులంగా చర్చించి, మీకు తగిన మందును తీసుకోండి. -
సైనసైటిస్ కు శాశ్వత పరిష్కారం ఉందా?
నా స్నేహితుడి వయసు 24 ఏళ్లు. అతడు గత ఆర్నెల్లుగా తీవ్రమైన తలనొప్పి, ముక్కుదిబ్బడ, తుమ్ములు, ముక్కుకారడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘సైనసైటిస్’ అన్నారు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? - నిశాంత్, రాజమండ్రి మన కపాలంలో గాలితో నిండిన ఖాళీప్రదేశాలు (క్యావిటీస్) ఉంటాయి. వాటిని సైనస్‌లు అంటారు. వాటిని మ్యూకస్ అనే పొర కప్పి ఉంటుంది. ఈ మ్యూకస్ పలచటి ద్రవాన్ని స్రవిస్తుంది. సైనస్లలో వచ్చే ఇన్ఫెక్షన్స్ను సైనసైటిస్ అంటారు. అన్ని రకాల శ్వాసకోశ వ్యాధులు, అంటువ్యాధులు ఈ సైనస్లపైన ప్రభావం చూపుతాయి. కారణాలు: ముక్కులో వచ్చే ఇన్ఫెక్షన్స్ సైనస్లకు దగ్గరగా ఉండే ఎముకలు విరగడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ దంతాలలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వాతావరణం చల్లగా ఉండటం పౌష్టికాహారం లోపించడం డయాబెటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుండటం. లక్షణాలు: తల బరువుగా ఉండటం, ముక్కు కారడం, ముక్కుదిబ్బడ కొద్దిగా నడిచినా ఆయాసం జ్వరం నిద్రపట్టకపోవడం తలనొప్పి తుమ్ములు ఆకలి తగ్గడం రకాలు: మాక్సిల్లరీ సైనసైటిస్: ఈ సైనస్‌లు ముక్కుకు ఇరువైపులా ఉంటాయి. ఈ భాగంలో నొప్పి, దంతాల నొప్పి, తలనొప్పి ఉంటాయి. ఫ్రంటల్ సైనసైటిస్: నుదుటి మధ్య భాగం, కనుబొమల పైభాగాలలో ఇవి ఉంటాయి. ఈ సమస్య ఉన్నవారు ఈ భాగంలో నొప్పితో బాధపడుతుంటారు. ఇతిమాయిడ్ సైనసైటిస్: ముక్కు మొదటి భాగంలో ఇరువైపులా కంటికీ, ముక్కుకీ మధ్య భాగంలో ఈ సైనస్‌లు ఉంటాయి. కళ్లలో నొప్పి, ఒత్తిడి, తలనొప్పి, ముక్కుపై భాగంలో నొప్పి వస్తుంటాయి. స్ఫీనాయిడల్ సైనసైటిస్: ఇది తల లోపల ఉండే సైనస్. దీనితో తలనొప్పి, తల వెనుక భాగంలోనూ, తలపై భాగంలో నొప్పి, తల బరువుగా అనిపించడం వంటివి ఉంటాయి. నిర్ధారణ: వ్యాధి లక్షణాలను తెలుసుకోవడం సైనస్ ఎక్స్‌రే సీబీపీ. నివారణ: అలర్జీ కలిగించే వస్తువులకు దూరంగా ఉండాలి ఇన్ఫెక్షన్స్/శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి శ్వాసకోశ వ్యాధులతో ఎక్కువ రోజులు బాధపడకుండా చూసుకోవడం పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం చికిత్స: హోమియో విధానంలో క్రమంగా రోగనిరోధక శక్తిని పెంచుతూ ఈ సమస్య తీవ్రతను తగ్గిస్తూ, నయం చేయడం సాధ్యమవుతుంది. చిన్న పాపకూ డయాబెటిస్..?! మా పాప వయసు ఏడేళ్లు. మంచినీళ్లు చాలా ఎక్కువగా తాగుతుండటం, చర్మంపై ర్యాష్ రావడంతో ఇటీవల డాక్టర్‌కు చూపించాం. కొన్ని వైద్య పరీక్షలు చేసి చక్కెరవ్యాధి ఉందని చెప్పారు. ఇంత చిన్నవయసులో కూడా డయాబెటిస్ వస్తుందా? మా పాప విషయంలో తగిన సలహా ఇవ్వండి. - ధరణి, మంచిర్యాల మీ పాపకు ఉన్న కండిషన్‌ను జ్యూవెనైల్ డయాబెటీస్ అంటారు. దీన్నే టైప్ వన్ డయాబెటీస్ అని కూడా పేర్కొంటారు. ఇది నెలల పిల్లలకు సైతం రావచ్చు. డయాబెటీస్ రావడానికి అనేక కారణాలుంటాయి. జన్యుపరంగా సంక్రమించడం ఒక కారణం. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. అయితే అంతవూత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. చక్కెరను ఎప్పుడూ నియుంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే వీళ్లు కూడా మిగతా అందరు పిల్లల్లాగానే పెరిగి తవు ప్రతిభాపాటవాలు చూపగలుగుతారు. ఇలాంటి పిల్లల్లో మందుల ద్వారా, ఆహారం ద్వారా డయూబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. పిల్లల్లోనే ఇలా డయూబెటిస్ రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు... కొన్ని రసాయునాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు కారణం అవుతారుు. ఇలాంటి పిల్లలకి ఇన్సులిన్ వాడటం తప్పనిసరి. దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్లు చేరుుంచడం, ఆహారంలో నియమాలు పాటించేలా చేయాలి. డయాబెటీస్ ఉన్న పిల్లల విషయంలో... తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్, షుగర్ లెవల్స్ చెక్ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. డయూబెటిస్ ఉన్న పిల్లలరుుతే వాళ్లలో సాధారణంగా బరువు పెరగకపోవడం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచు వాంతులు కావడం, డీ-హైడ్రేషన్, చర్మంపై రాషెస్ వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లల్లో చక్కెర నియుంత్రణ లేకపోతే పోను పోనూ రక్తపోటు పెరగడం, వుూత్రపిండాలు, కంటికి సంబంధించిన రుగ్మతలు, కరోనరీ గుండె సవుస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ ద్వారా కాకుండా నోటిద్వారా లేదా ఇన్హేలేషన్ (పీల్చడం) ద్వారా ఇచ్చే ప్రక్రియులు అందుబాటులోకి రానున్నారుు. అలాంటి చికిత్స వూర్గాలు అందుబాటులోకి వస్తే ఈ పిల్లలకు చికిత్స ప్రక్రియులు వురింత సులువవుతారుు. మీరు పిడియూట్రిషియున్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం తప్పనిసరి. -
ఒంటిపైన దద్దుర్లు.. కారణమేమిటి?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 25 ఏళ్లు. నాకు కొంతకాలంగా అప్పుడప్పుడు చర్మం మీద ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయి. మర్నాటికి అవి తగ్గిపోతున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘అర్టికేరియా’ అన్నారు. మందులు వాడుతున్నా ఫలితం కనిపించడం లేదు. హోమియో చికిత్స ద్వారా సమస్య పూర్తిగా నయమయ్యేలా చేయవచ్చా? సలహా ఇవ్వగలరు. - ప్రసన్న లక్ష్మి, ఆదిలాబాద్ అర్టికేరియా చాలా సాధారణంగా కనిపించే చర్మ సమస్య. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఏ వయసు వారికైనా ఈ సమస్య కనిపించవచ్చు. కొందరిలో ఈ సమస్య 24 గంటల్లో దానంతట అదే తగ్గుతుంది. కానీ మరికొందరిలో ఇది దీర్ఘకాలం కొనసాగుతూ తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. దీన్ని రెండురకాలుగా విభజించవచ్చు. అక్యూట్ అర్టికేరియా: సమస్య ఆరు వారాల కంటే తక్కువ రోజులు ఉన్నట్లయితే దాన్ని అక్యూట్ అర్టికేరియా అంటారు. సమస్యను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు ఇది కలుగుతుంది. క్రానిక్ అర్టికేరియా: ఆరువారాలకు పైబడి కొనసాగితే దాన్ని క్రానిక్ అర్టికేరియా అంటారు. ఇలా దీర్ఘకాలిక సమస్యగా మారడానికి కారణాలు ఇంకా స్పష్టంగా లభించలేదు. అయితే మన ఒంట్లో అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, లూపస్ వంటి వాటి వల్ల ఆర్టికేరియా కనిపించవచ్చు. కారణాలు మన శరీరానికి సరిపడని పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిస్పందనగా మన ఒంట్లో హిస్టమైన్స్ అనే పదార్థంలో పాటు కొన్ని రకాల రసాయనాలు రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. వాటి ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. ఇదే సమస్య మన రోగ నిరోధక శక్తి మనపైనే దుష్ర్పభావం చూపినప్పుడు కూడా కనిపిస్తుంది. అర్టికేరియాను ప్రేరేపించే అంశాలు నొప్పి నివారణకు ఉపయోగించే మందులు కీటకాలు, పరాన్నజీవులు ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, వైరస్లు అధిక ఒత్తిడి, సూర్యకాంతి మద్యం, కొన్ని సరిపడని ఆహార పదార్థాలు అధిక లేదా అల్ప ఉష్ణోగ్రతలు జంతుకేశాలు, పుప్పొడి రేణువులు వంటి చాలా అంశాలు అర్టికేరియాను ప్రేరేపిస్తాయి. లక్షణాలు చర్మంపై ఎరుపు లేదా డార్క్ కలర్లో దద్దుర్లు ఏర్పడటం విపరీతమైన దురదగా అనిపించడం దద్దుర్లలో మంట, నొప్పి కూడా అనిపించడం కళ్లచుట్టూ, చెంపలు, చేతులు, పెదవులపై కూడా అవి ఏర్పడవచ్చు గొంతులో వాపు ఏర్పడి అది వాయునాళాలకు అడ్డుగా పరిణమించి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు దద్దుర్ల పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ వాటిని ప్రేరేపించే అంశాలకు గురైనప్పుడు కనిపిస్తూ... ఆ తర్వాత అదృశ్యమవుతూ ఉండవచ్చు. చికిత్స హోమియో ప్రక్రియ ద్వారా కాన్స్టిట్యూషన్ పద్ధతుల్లో అత్యంత సునిశితమైన పరిశీలనతో తగిన మందులు ఇవ్వవచ్చు. వాటి వల్ల రోగనిరోధక కణాల్లో పునరుజ్జీవనం కలిగి అవి అర్టికేరియాను సమర్థంగా ఎదుర్కొంటాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ అవాంఛిత రోమాలతో పాప ఇబ్బంది పడుతోంది! పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా అమ్మాయికి పదిహేనేళ్లు. అన్ని విధాలా ఆరోగ్యంగానే ఉంది. కానీ ఈమధ్య ఒంటి మీద జుట్టు ఎక్కువగా పెరుగుతోంది. దాంతో అమ్మాయి ఆందోళన పడుతోంది. పైగా ఈ వయసులో మరీ ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొంటోంది. తగిన సలహా ఇవ్వండి. - రేణుక, హైదరాబాద్ పిల్లల్లో వెంట్రుకలకు సంబంధించిన రుగ్మతలు (హెయిర్ డిజార్డర్స్) అన్నవి వెంట్రుకల్లోనే అంతర్గత పెరుగుదల వల్ల, జీవరసాయనాల్లో ఒడిదుడుకుల వల్ల, జీవక్రియల్లో (మెటబాలిక్) మార్పుల వల్ల, ఇన్ఫెక్షన్స్తో వచ్చే వ్యాధుల వల్ల వస్తుంటాయి. వెంట్రుకలు అసాధారణంగా పెరగడాన్ని హైపర్ ట్రైకోసిస్ అంటారు. అలాగే ఆడవాళ్లలో పురుషుల మాదిరిగా వెంట్రుకలు పెరగడాన్ని ‘హిర్సుటిజమ్’ అంటారు. మీరు చెప్పిన లక్షణాలను చూస్తుంటే మీ పాపకు ఉన్న కండిషన్ ‘హిర్సుటిజమ్’ అని చెప్పవచ్చు. ఇలాంటి కండిషన్ ఉన్నవారిలో ముఖంతో పాటు, గడ్డం, వీపు, రొమ్ము మీద కూడా వెంట్రుకలు పెరుగుతుంటాయి. దాదాపు 10 శాతం మంది ఆడవాళ్లలో ఈ కండిషన్ కనిపిస్తుంటుంది. అదేమీ తీవ్రమైన జబ్బుకు సూచన కానప్పటికీ యుక్తవయసు (ప్యూటర్టీ)కు ముందుగా ఈ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం తప్పనిసరిగా దీనికి కారణాన్ని తెలుసుకోవాలి. మామూలుగానైతే హిర్సుటిజమ్ లక్షణాలు కనిపించడాన్ని అంత సీరియస్ సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ మీరు పేర్కొన్న లక్షణాలతో పాటు రుతు సంబంధమైన సమస్యలుగాని, డయాబెటిస్ లేదా స్థూలకాయం గాని, చాలా కొద్ది సమయంలోనే రోమాల పెరుగుదల విపరీతంగా జరుగుతుంటే కూడా దాన్ని కాస్త సీరియస్‌గా పరిగణించాలి. హిర్సుటిజమ్ కనిపించేవారిలో ముఖం మీద మొటిమలు (యాక్నే) ఎక్కువగా కనిపించడం, గొంతు బరువుగా, లోతుగానూ, కండరాలు బలంగా మారడం వంటి లక్షణాలూ ఉండవచ్చు. అలాంటప్పుడు అది వాళ్లలో హార్మోన్లకు సంబంధించిన సమస్యగా గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటివారిలో ఇతర ఎండోక్రైన్ సమస్యలు.. అంటే థైరాయిడ్, ఒవేరియన్ గ్రంథుల సమస్య, ఎడ్రినల్ ట్యూమర్స్, పీసీఓఎస్ సమస్యలతో పాటు కొన్ని జన్యుపరమైన సమస్యలూ ఉన్నాయేమో చూడాలి. అయితే కొన్ని మందులు.. ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడటం వల్ల కూడా రోమాల పెరుగుదల ఎక్కువగా ఉండవచ్చు. ఇక మీ అమ్మాయి విషయంలో ఈ సమస్య ఫలానా కారణంతో అని నిర్దిష్టంగా చెప్పలేకపోయినప్పటికీ ఇది యాండ్రోజెన్ ఎక్కువగా స్రవించడం వల్ల కావచ్చు. దీనికి చికిత్సగా కొన్ని మందులు వాడటంతో పాటు సింపుల్ డర్మటలాజికల్ ప్రొసిజర్స్ అవసరం కావచ్చు. అవి... షేవింగ్, వ్యాక్స్, కొన్ని క్రీములు, ఎలక్ట్రాలసిస్ లేజర్ వంటివి. ఈ ప్రక్రియల ద్వారా ఆ అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మీరు ఒకసారి మీ పాపను గైనకాలజిస్ట్ లేదా ఎండోక్రైనాలజిస్ట్లకు చూపించడం అవసరం. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, -
ఇంకా పక్క తడుపుతున్నాడు..!
హోమియో కౌన్సెలింగ్ మా బాబు వయసు 13 ఏళ్లు. చిన్న వయసు నుంచి రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటు ఉంది. ఈ సమస్య వల్ల బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్గారిని సంప్రదించి చికిత్స అందిస్తున్నాము. కానీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించే అవకాశం ఉందా? - సరళ, అమలాపురం మీ బాబు రాత్రుళ్లు నిద్రలో పక్క తడిపే ఈ అలవాటును వైద్యపరిభాషలో నాక్చర్నల్ ఎన్యురెసిస్ అంటారు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు, వారి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఈ సమస్య చిన్న పిల్లల్లోనే గాక కొంతమంది పెద్దల్లోనూ ఉంటుంది. సాధారణంగా పిల్లల్లో రాత్రి సమయంలో మూత్రవిసర్జనపై అదుపు అన్నది రెండు నుంచి ఐదేళ్ల వయసులో వస్తుంటుంది. కానీ ఐదు శాతం మంది పిల్లల్లో పదేళ్ల వయసు తర్వాత కూడా మూత్రవిసర్జనపై అదుపు సాధించడం జరగకపోవచ్చు. ఐదేళ్ల వయసు తర్వాత కూడా తరచూ పక్కతడిపే అలవాటు ఉండటాన్ని ప్రైమరీ ఎన్యురెసిస్ అంటారు. సాధారణంగా ఇది కొన్నాళ్లలోనే తగ్గిపోతుంది. ఎదుగుదల సమయంలో వచ్చే లోపం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. అయితే కొంతమంది పిల్లలు పక్కతడపడం మానివేశాక, మళ్లీ ఆర్నెల్ల తర్వాత సమస్య తిరగబెట్టవచ్చు. ఇంతకుముందు పక్కతడపకుండా ప్రస్తుతం మళ్లీ పక్కతడపడం మొదలుపెట్టినట్లయితే ఈ పరిస్థితిని ‘సెకండరీ ఎన్యురెసిస్’ అంటారు. కారణాలు నాడీ వ్యవస్థ ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలు (ముఖ్యంగా డౌన్‌సిండ్రోమ్), ఇన్ఫెక్షన్లు, మూత్రాశయం సమస్యలు, కొందరిలో వంశపారంపర్య కారణాల వల్ల ఈ సమస్య కనిపిస్తుండవచ్చు. ఇంకొంతమంది పిల్లల్లో కండరాలు ఎక్కువ సార్లు అనియంత్రితంగా సంకోచం చెందడం వంటి కారణాలతోనూ ఈ సమస్య కనిపించవచ్చు. టైప్-1 డయాబెటిస్, మలబద్దకం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడటం వల్ల, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది పిల్లల్లో మానసిక ఒత్తిడి, భయం వల్ల కూడా రాత్రివేళలో తమకు తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోవచ్చు. పక్క తడిపే పిల్లలను తిట్టడం, వాళ్లకు శిక్షలు విధించడం వల్ల పిల్లలు మరింత కుంగిపోయి సమస్య మరింత జటిలం అవుతుంది. ఇలా పిల్లలను మందలించడం వల్ల ప్రయోజనం చేకూరదు సరికదా... కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే హోమియో చికిత్సతో పిల్లల్లో ఈ అలవాటు పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ లివర్ సమస్య.. పరిష్కారం చెప్పండి లివర్ కౌన్సెలింగ్ నా వయసు 54 ఏళ్లు. నాకు మద్యం తాగే అలవాటు ఉంది. అయితే కొన్ని నెలల క్రితం నాకు ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో డాక్టర్ సలహాలతో మద్యం పూర్తిగా మానేశాను. అయితే అనారోగ్య సమస్యలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి ‘లివర్ ట్యూమర్’ కారణంగా లివర్ పాడైందనీ, అలాగే ‘అల్ఫా పెటోప్రొటీన్’ అత్యధికంగా లక్షకు మించిపోయిందని, దాంతో లివర్ సరిగా పనిచేయడం మానేసిందని తెలిపారు. అంతేకాకుండా లివర్ మార్పిడి చేసుకోకపోతే ఇక బతకడం కష్టమని కూడా తేల్చి చెప్పారు. కుటుంబ పెద్దగా బాధ్యతలు ఉన్న నేను ఈ పరిస్థితుల్లో నాకు తగిన సలహా ఇవ్వండి. - గుప్తా, హైదరాబాద్ మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ లివర్ కండిషన్ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పవచ్చు. లిక్కర్ అనేది లివర్‌కు ప్రధాన శత్రువు. అతిగా మద్యం సేవించే అలవాటు వల్ల లివర్ పూర్తిగా డ్యామేజీ అవుతుంది. లివర్ క్యాన్సర్ లేదా లివర్ సిర్రోసిస్ బారిన పడుతుంది. మీరు మద్యాన్ని మానివేసే సమయానికే మీ కాలేయం బాగా పాడైపోయి ఉండవచ్చు. కాలేయం క్షీణత అనేది మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశ (చైల్డ్ గ్రేడ్-ఏ)లో లివర్‌పై ట్యూమర్లు దాడి చేసినట్టు గుర్తించి, సరైన చికిత్స అందిస్తే దాదాపు 70 శాతం వరకు దానిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికే ట్యూమర్లు మళ్లీ తిరగబడినా, లివర్‌కు మాత్రం ఐదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. రెండోదశలో ట్యూమర్ల పరిమాణం పెరిగి చికిత్సకు ఇబ్బందిగా మారుతుంది. అప్పుడు కేవలం కాలేయ మార్పిడి ద్వారానే పేషెంట్‌ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ట్యూమర్లు ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ సైజులో ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఫలితం దాదాపు 70 - 80 శాతం మేరకు ఉంటుంది. ఇక చివరిదైనా మూడోదశకు వస్తే... లివర్ ట్రాన్స్‌ప్లాంట్ తప్ప వేరే మార్గమే లేదు. పరిస్థితిలో పేషెంట్‌కి వివిధ స్టేజెస్‌లో, రకరకాల చికిత్స విధానాల్ని అవలంబించాల్సి వస్తుంది. ట్యూమర్ల కారణంగా లివర్ పూర్తిగా చెడిపోవడం జరిగింది. కాబట్టి దాని చుట్టుపక్కల కూడా వాటి ప్రభావం ఉంటుంది. అలాగే ట్యూమర్ల వ్యాధిని కూడా నియంత్రించాలి. ఇందుకు పరిస్థితిని బట్టి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందే కీమోథెరపీ లేదా రేడియోథెరపీలు చేసి కాలేయానికి ఉన్న ట్యూమర్లను పూర్తిగా తొలగించి, వాటిని నిర్వీర్యం చేస్తారు. దాంతో పేషెంట్ శరీరం కాలేయ మార్పిడి చేసే పరిస్థితికి చేరుకుంటుంది. అప్పుడు శస్త్రచికిత్స నిర్వహించి రోగికి మ్యాచ్ అయిన లివర్‌ను అమర్చడం జరుగుతుంది. లివర్ లభ్యత రెండు విధానాలుగా ఉంటుంది. ఒకటి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ బ్లడ్గ్రూప్నకు సరిపోలిన వారు ముందుకు రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘లైవ్ డోనార్’ అని అంటారు. ఇది సురక్షితమైన విధానం. రెండోది ‘కెడావర్ డోనార్’ అంటారు. దీనికి దాతలపై ఆధారపడాల్సి వస్తుంది. అది లభించినప్పుడు డాక్టర్లు సర్జరీని నిర్వహిస్తారు. ఆలస్యం చేయకుండా ముందుగా మీరు నిపుణులైన వైద్యుడిని సంప్రదించి లివర్ ఏ స్టేజ్‌లో ఉందో పరీక్షల ద్వారా తెలుసుకొని వెంటనే తగిన చికిత్సను పొందండి. డాక్టర్ బాలచంద్రమీనన్ చీఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్. -
ఆస్తమాకూ ఆధునిక చికిత్స...
హోమియో కౌన్సెలింగ్ నా వయస్సు 65. నేను చాలా సంవత్సరాలుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. డాక్టరు గారి సూచనల మేరకు మందులు వాడుతున్నాను. వారు ఈ సమస్య పూర్తిగా తగ్గడానికి చికిత్స అందుబాటులో లేదని చెప్పారు. చల్లటి వాతావరణం ఏర్పడితే ఈ సమస్య తీవ్రతరం అయి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్య పూర్తిగా నయం అయే అవకాశం ఉందా? సలహా ఇవ్వగలరు. - పాలడుగు పుల్లయ్య, ఆదోని మీరు ఆందోళన చెందకండి. ఆస్తమా వ్యాధి హోమియో చికిత్స ద్వారా సంపూర్ణంగా నయం అవుతుంది. ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. సాధారణంగా మనం ఊపిరి పీల్చుకున్న గాలి వాయుద్వారాల ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. అదేవిధంగా బయటకు వెళ్లిపోతుంది. ఈ వాయుద్వారాలు శోధకు గురి అయి వాపు చెందడం ద్వారా అవి సన్నగా, ఇరుకుగా మారి ఎక్కువగా శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయటాన్ని ఆస్తమా అని అంటారు. మన శరీరానికి సరిపడని పదార్థాలు గాలి ద్వారా పీల్చుకున్నప్పుడు వాయుద్వారాలు వాటికి బలంగా స్పందిస్తాయి. ఇలా స్పందించిన వాయుద్వారాల కండరాలు బిగుసుకుపోతాయి. దీని వల్ల వాయుద్వారాలు కాస్త సన్నగా మారతాయి. అవి శోధకు గురయి వాపు చెందడం ద్వారా సాధారణ స్థాయికి మించి శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాంతో అవి మరింత ఇరుకుగా మారి గాలి ప్రసరణకు ఆటంకాలు ఏర్పరచడం వల్ల ఆస్తమా లక్షణాలు ఏర్పడతాయి. కారణాలు: ఆస్తమా కలగడానికి గల కారణాలలో ఇంతవరకు స్పష్టత లభించడం లేదు. కానీ జన్యుపరమైన అంశాలు, వంశపారంపర్యత, వాతావరణం వంటి అంశాల సమ్మేళనంతో ఈ వ్యాధి కలుగుతుందని భావిస్తున్నారు. ఆస్తమాని ప్రేరేపించే అంశాలు: ఇవి అందరిలోనూ ఒకేరకంగా ఉండవు. పూలమొక్కల నుండి వెలువడే పుప్పొడి రేణువులు, జంతుకేశాలు, దుమ్ము, బొద్దింకలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జలుబు, శారీరక శ్రమ, వ్యాయామాల వల్ల చల్లగాలి లేదా చల్లటి వాతావరణం, వాతావరణ కాలుష్యం, పొగతాగటం, కెమికల్స్, వృత్తిరీత్యా దుమ్ములో గడపవలసి రావటం, ఆస్పిరిన్, బీటా బ్లాకర్స్ వంటి మందులు, ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే ప్రిజర్వేటివ్స్, అధిక మానసిక ఒత్తిడి వంటివన్నీ ఆస్తమాను ప్రేరేపిస్తాయి. లక్షణాలు: ఇవి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వేర్వేరుగా ఉంటాయి. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఛాతీ బిగువుగా లేదా నొప్పిగా అనిపించటం, శ్వాస బయటకు వదిలినప్పుడు పిల్లికూతల వంటి శబ్దాలు వినిపించడం, దగ్గు. (ఆస్తమా వల్ల కలిగే దగ్గు రాత్రివేళలో, తెల్లవారు ఝామున అధికంగా ఉంటుంది). శ్వాస ఆడకపోవడం, దగ్గు వల్ల నిద్రకు ఇబ్బందికరంగా మారడం వంటివి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్ అందించే అధునాతనమైన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి శ్వాస సంబంధిత వ్యాధులనైనా సమర్థంగా నయం చేయడం జరుగుతుంది. రోగి మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందించడం ద్వారా వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. అంతేకాకుండా హోమియో మందుల ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం ద్వారా ఆస్తమా ప్రేరేపకాలు ఎదురైనప్పటికీ సమస్య మళ్లీ పునరావృతం కాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కిడ్నీ మార్పిడే ఉత్తమం నా వయసు 26 సంవత్సరాలు. ఈ మధ్య ఆకలి లేకపోవడం, నీరసంగా ఉంటే పరీక్షలు చేయించుకున్నాను. క్రియాటినిన్ 14 ఎంజీ, యూరియా 320 మి.గ్రా. ఉంది. స్కానింగ్‌లో సీకేడీవీ అని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని చెప్పారు. కిడ్నీ మార్పిడి కాకుండా ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాతలు ఎవరు ఉండవచ్చు? - రత్నకిశోర్, పామిడి మీ సమస్యకు కిడ్నీ మార్పిడి చేయించుకోవడమే ఉత్తమ పరిష్కారం. దాతలుగా తోబుట్టువులు లేదా తలిదండ్రులను తీసుకోవాల్సి ఉంటుంది. డోనర్స్‌కి అన్ని పరీక్షలూ చేయించి, ఒక కిడ్నీ డొనేట్ చేయడం వల్ల వారికి ఏ సమస్యా ఉండదని నిర్థారణ అయ్యాకే వారిని దాతలుగా అంగీకరిస్తారు. ఆ తర్వాత వారికి ఏ విధమైన సమస్యలూ ఉండవు. కిడ్నీ దాతలు, స్వీకర్తకు రక్తసంబంధీకులు లేదా దగ్గరి బంధువులు అయితేనే కిడ్నీ ఎక్కువ రోజులపాటు పని చేసే అవకాశం ఉంటుంది. కిడ్నీమార్పిడి చికిత్స తర్వాత కూడా రెగ్యులర్‌గా మందులు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ దాతలు లభ్యం కాకపోతే రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించాల్సి ఉంటుంది. హోమ్ డయాలసిస్ లేదా హాస్పిటల్ డయాలసిస్ చేయించుకుంటూ అవయవ మార్పిడికోసం నమోదు చేయించుకోవాలి. నా వయసు 32సంవత్సరాలు. మూత్రంలో మంట, జ్వరం తరచు వస్తోంది. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. మానేయగానే నెలలోపే తిరిగివస్తోంది. ఇలా జరక్కుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? -డి.కృష్ణబాబు, జనగామ మీరు రిక రెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఇలా మళ్లీ మళ్లీ రావడానికి కారణాలేమిటో పరివీలించాలి. సుగర్ ఉన్నట్లయితే కూడా ఇన్ఫెక్షన్ తరచు రావడానికి అవకాశాలున్నాయి. ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి, స్టోన్స్ కానీ, మూత్రనాళాల్లో వాపు గానీ ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకున్నా కూడా ఇన్ఫెక్షన్ మళ్లీ తిరగబెడుతుంది. ఏ కారణం లేకుండా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ వస్తుంటే మూడు నెలల వరకు తక్కువ డోసులో యాంటీబయాటిక్స్ వాడాలి. ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, నీరు ఎక్కువగా తీసుకోవాలి (రోజుకు రెండు నుంచి మూడులీటర్లకు తగ్గకూడదు). మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా వెంటనే విసర్జించాలి. నా వయసు 58. నాకు షుగర్ వల్ల కిడ్నీలు పని చేయడం లేదు. రెండు సంవత్సరాలుగా డయాలిసిస్ చేయించుకుంటున్నాను. ఇప్పటివరకు మూడుసార్లు ఫిస్టులా ఆపరేషన్ చేయించుకున్నాను. ఏదీ పని చేయడం లేదు. నాకు డయాలిసిస్ చేయించుకుంటున్నప్పుడు చలి వణుకు వస్తోంది. ప్రత్యామ్నాయ పద్ధతులేమైనా ఉన్నాయా? - నరసింహమూర్తి, పామూరు మీకు ఇప్పుడు ఉన్న కాథెటర్‌కు ఇన్ఫెక్షన్ ఉంది. మొదట ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి మందులు వాడాల్సి వుంటుంది. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత పీమ్ కాథ్ ద్వారా డయాలిసిస్ చేయించుకోవడం మంచిది. ఇలా ఫిస్టులా ఉన్నప్పుడు హోమ్ డయాలిసిస్ (సిఏపీడీ) చే యించుకోవడం మంచిది. సిఏపీడీ వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఇంట్లోనే చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా చేసుకునే జాబ్ కూడా చేసుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ లైప్ బాగుంటుంది. హోమ్ డయాలిసిస్ ఖర్చు కూడా హాస్పిటల్ డయాలిసిస్ కంటే తక్కువగానే ఉంటుంది. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
కాళ్ల పగుళ్లకు అవి కూడా ప్రధాన కారణాలు కావచ్చు
హోమియో కౌన్సెలింగ్ మా అబ్బాయికి పదిహేనేళ్లు. తరచు టాన్సిలైటిస్ సమస్యతో బాధపడుతున్నాడు. కొద్దిగా చల్లని పదార్థాలు తీసుకుంటే చాలు...గొంతు వాస్తుంది. ముద్ద మింగుడు పడదు. ఈ వ్యాధి మళ్లీ తిరగబెట్టకుండా హోమియో చికిత్స ద్వారా సంపూర్ణంగా నయమయే అవకాశం ఉందా? - భూక్యా స్వరూప, హైదరాబాద్ మీరు ఆందోళన చెందకండి. మీ బాబును వేధిస్తున్న ఈ టాన్సిలైటిస్ సమస్య హోమియో చికిత్స ద్వారా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. టాన్సిలైటిస్ అనేది చిన్న పిల్లలను తరచే వేధించే సమస్య. ఏ వయసు వారినైనా ప్రభావితం చేసే ఈ వ్యాధి ఎక్కువగా 6 నుంచి 12 సంవ్సరాల లోపు వయస్సు గల చిన్న పిల్లల్లో; 15 నుంచి 25 సంవత్సరాలలోపు యుక్తవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. గొంతులో నాలుక వెనక భాగంలో ఉండే లింఫ్ గ్రంథులను టాన్సిల్స్ అంటారు. ఇవి లింఫాటిక్ కణజాలంతో ఏర్పడతాయి. రోగనిరోధక వ్యవస్థలో భాగమైన ఈ గ్రంథులు యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా, నోటిద్వారా శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులను ఎదుర్కొని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి. టాన్సిలైటిస్ అంటే..? టాన్సిల్స్ వాపునకు గురవడాన్ని టాన్సిలైటిస్ అంటారు. సాధారణంగా ఈ సమస్య వారం రోజులలోపు తగ్గుతుంది. లక్షణాలు: గొంతునొప్పి, టాన్సిల్స్ ఎర్రగా వాచిపోవడం, టాన్సిల్స్‌పై తెల్లగా లేదా పసుప్పచ్చగా మచ్చలు ఏర్పడటం, దవడ ప్రాంతంలో నొప్పి, మింగేటప్పుడు బాధ, గొంతు బొంగురు పోవడం, ఆకలి మందగించటం, చలి, జ్వరం, చెవినొప్పి, వికారం, వాంతులు. దుష్ర్పభావాలు: దీర్ఘకాలికంగా స్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్లకు గురి కావడం వల్ల రుమాటిక్ జ్వరాలు, కిడ్నీ జబ్బులకు దారి తీస్తుంది. వైరస్ల వల్ల కలిగే దీర్ఘకాలిక టాన్సిలైటిస్ సమస్య పెరిటాన్సిలార్ ఆబ్సిస్కు దారితీస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే అది గొంతు వరకు వ్యాపించి వాయుద్వారాలకు అడ్డుపడటం వల్ల ప్రాణాంతక పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇది చెవికి వ్యాపించడం వల్ల ఒటైటిస్ మీడియా ఏర్పడి వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపించవచ్చు. నిర్ధారణ: రోగలక్షణాలు, నోటిని, గొంతును పరీక్షించడం, త్రోట్ స్క్వాబ్, స్ప్ట్రె టెస్ట్, స్ట్రెప్ట్ కల్చర్ వంటి పరీక్షల ద్వారా. హోమియోకేర్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో అందించే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సావిధానం ద్వారా రోగి మానసిక, శరీర లక్షణాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందించడం ద్వారా శరీరంలోని రోగనిరోధక శక్తి పెరిగి, ఇన్ఫెక్షన్లు పూర్తిగా నయం అవడంతోపాటు సమస్య పూర్తిగా నయం అవుతుంది. మళ్లీ తిరగబెట్టదు కూడా! డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ జనరల్ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. నా కాళ్లు తరచూ పగులుతున్నాయి. చలికాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా ప్రతికాలంలోనూ ఈ బాధ నన్ను ఇబ్బంది పెడుతోంది. కొన్నిసార్లు పగుళ్లు చాలా లోతుగా ఏర్పడి నొప్పిని కలిగిస్తున్నాయి. నీళ్లలో కూడా ఎక్కువగా ఉండటం లేదు. ఎన్ని క్రీములు వాడినా లాభం లేకుండా పోతోంది. అసలు ఆడవారికి మాత్రమే ఈ కాళ్ల పగుళ్లు ఎందుకు ఏర్పడతాయి? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - సారిక, హైదరాబాద్ కాళ్లకు పగుళ్లు కేవలం ఆడవారికి మాత్రమే వస్తాయని అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. మగవాళ్లకు కూడా కాళ్లలో పగుళ్లు ఉంటాయి. ఇక మీ విషయానికి వస్తే మీ కాళ్ల పగుళ్లకు చాలా కారణాలు ఉండవచ్చు. ఎండాకాలంలో శరీరానికి తగిన నీరు అందకపోతే కూడా కాళ్లకు పగుళ్లు ఏర్పడతాయి. అలాగే మీరు వాడే సబ్బు, మీరు తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్ శాతం తక్కువగా ఉండటం కూడా కారణం కావచ్చు. మీ కాళ్లకు పగుళ్లు చాలా లోతుగా ఏర్పడినట్లు చెబుతున్నారు. రక్తస్రావం జరుగుతున్నట్లయితే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాక్టీరియా గాని ఫంగల్ ఇన్ఫెక్షన్ గాని మీ కాళ్ల పగుళ్లకు కారణమైతే సమస్య తీవ్రంగా ఉన్నట్లు భావించాలి. అవి పగుళ్ల స్థాయి నుంచి పుండ్లుగా మారే అవకాశం ఉంది. డయాబెటిస్, థైరాయిడ్ లేదా ఒబేసిటీ లాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా కాళ్ల పగుళ్ల సమస్యకు లోనవుతుంటారు. మీరు ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారా లేదా అన్న అంశాన్ని ముందుగా నిర్ధారణ చేయాలి. అయితే ముందుగా మీ సమస్యకు ఉపశమనం పొందాలంటే కొన్ని సూచనలు పాటించండి. మంచినీటిని వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి కాళ్లను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం పొడిబట్టతో తడి లేకుండా తుడవాలి. మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండే క్రీములను కాళ్లకు రాసుకొని సాక్సులను ధరించండి. డా. సి.హేమంత్ సీనియర్ జనరల్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ ఎండోక్రైనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. గత కొద్ది రోజులుగా నా గొంతు భాగంలో వాపు రావడంతో డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన దానిని పరీక్షించిన తర్వాత అది గాయటర్ సమస్య అని వివరించారు. అసలు గాయిటర్ సమస్య అంటే ఏమిటి? వివరాలు తెలుపగలరు. - నందన్‌రావు, ఒంగోలు మన శరీరంలోని గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి అతి ముఖ్యమైనది. ఇది మెడ దగ్గర సీతాకోకచిలుక ఆకృతిలో శ్వాసనాళానికి రెండువైపులా ఉంటుంది. ఇది శరీరంలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్)ను విడుదల చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా పెరగడాన్ని గాయిటర్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డిఫ్యూస్ గాయిటర్, రెండోది నాడ్యులార్ గాయిటర్. సాధారణ పరిమాణం కంటే థైరాయిడ్ గ్రంథి ఉబ్బిపోయి ఇరువైపులా సమానంగా పెరగడాన్ని డిఫ్యూస్ గాయిటర్‌గా పరిగణిస్తారు. ఇక రెండోది నాడ్యులార్ గాయిటర్. ఇందులో థైరాయిడ్ గ్రంథికి ఒక భాగంలో... ఒకటి లేదా ఇంకా ఎక్కువ సంఖ్యలో గడ్డలు ఏర్పడతాయి. దీన్ని నాడ్యులార్ గాయిటర్ అంటారు. గాయిటర్ ఉత్పన్నమైన వారిలో కొంతమందిలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి విషయంలో ఎలాంటి మార్పులు కనిపించవు. మరి కొందరిలో థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువ లేదా తక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతాయి. హార్మోన్ల ఉత్పత్తి పాళ్లు పెరిగితే హైపర్ థైరాయిడిజం అని, తగ్గితే హైపోథైరాయిడిజమ్ అని పరిగణిస్తారు. ఇది శరీరంలో అయోడిన్ లోపం వల్ల సంభవిస్తుంది. అయితే ఈ సమస్యలు ఉన్నవారిలో మామూలుగా గొంతును పరీక్షించడంతో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలైన టీ3, టీ4, టీఎస్‌హెచ్, యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ వంటి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. వాటి ఫలితాలను బట్టి ఎండోక్రైనాలజిస్ట్ ఆధ్వర్యంలో చికిత్స చేస్తారు. మనలోని థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం ద్వారా శస్త్రచికిత్స అవసరం లేకుండానే థైరాయిడ్ గ్రంథి వాపు (గాయిటర్) సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. డా. వి.శ్రీనగేష్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఆకు కూరలతో రక్తహీనతకు చెక్!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 సంవత్సరాలు. ఇటీవల కొద్దికాలంగా మూత్రంలో మంట, చీము, రక్తం పడటం, నడుంనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్ని సంప్రదిస్తే కిడ్నీల ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఎన్నో మందులు వాడుతున్నాను కానీ, అంతగా ఫలితం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియో చికిత్స ద్వారా అయినా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - రామారావు, పాలకొల్లు మన శరీరంలో మూత్రపిండాలది కీలకమైన పాత్ర. సాధారణంగా రక్తప్రవాహం ద్వారా కానీ, మూత్రకోశ ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. కారణాలు: 80 శాతం వరకు బ్యాక్టీరియా, 15 శాతం, వైరస్లు మరికొంత శాతం ఫంగల్, కొన్ని పరాన్నజీవులు. మూత్రం ఎక్కువ సమయం విసర్జించకుండా ఉన్న సమయంలో బ్యాక్టీరియా అధికంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మూత్ర వ్యవస్థలో రాళ్లు మూత్రవిసర్జనకు అడ్డుగా నిలిచి ఈ సమస్య ఉత్పన్నం అయేలా చేస్తాయి. మూత్రకోశం ఇన్ఫెక్షన్లను స్త్రీలలోనే ఎక్కువగా గమనించవచ్చు. ముఖ్యంగా రజస్వల అయ్యే సమయంలోనూ, డెలివరీ అప్పుడు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ. వీటితోబాటు కృత్రిమ మూత్ర గొట్టాలు(క్యాథెటర్స్), స్టెంట్స్, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, హార్మోన్ల అసమతుల్యత మలబద్దకం వలన కూడా మూత్ర మార్గం ఇన్ఫెక్షన్లు క లుగుతాయి. లక్షణాలు: రోగికి తరచు జ్వరం, కడుపు నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు కడుపునొప్పి గజ్జలలోకి, అటుపైన తొడల వరకు కూడా పాకుతుంది. కొన్ని సందర్భాల్లో మూత్రంలో చీము, రక్తం కూడా పడుతుంటాయి. ఆకలి మందగించటం, ఒళ్ళు నొప్పులు, నీరసంతో పాటు మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన మంట వంటి సమస్యలూ ఉంటాయి. జాగ్రత్తలు: వ్యక్తిగత శుభ్రత పాటించ డం, ఎక్కువ నీరు తాగటం, మూత్రాన్ని నియంత్రించకుండా ఉండటం, కృత్రిమ గర్భనిరోధక సాధనాలు వాడేటప్పుడు జాగ్రత్త వహించడం, మలబద్ధకం లేకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా ఈ వ్యాధి కలగకుండా నియంత్రించుకోవచ్చు. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా వ్యాధి లక్షణాలతో పాటు రోగి మానసిక, శరీర సమస్యలను పరిగణనలోకి తీసుకుని, రోగనిరోధక శక్తిని ప్రేరేపించడం వల్ల ఇన్ఫెక్షన్ తాలూకు సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించబడతాయి. మీరు వెంటనే మంచి హోమియో నిపుణుని సంప్రదించండి. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా అమ్మకు 60 ఏళ్లు. తనకు కుడికాలు, చెయ్యి విపరీతంగా కొట్టుకుంటోంది. నిద్రపోయినప్పుడే అవి ఆగుతున్నాయి. మళ్లీ మెలకువ వచ్చినా ఆపలేనంతగా కొట్టుకుంటున్నాయి. పరిష్కారం చెప్పండి. - నవనీతమ్మ, గూడూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అమ్మగారు హెమీబాలిస్మస్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారిలో ఒక పక్క కాలు, చేయి ఆపలేనంతగా కొట్టుకుంటాయి. ఈ జబ్బు సాధారణంగా మెదడులో రక్తనాళం ముసుకుపోయి, నరాల కణాలు దెబ్బతినడం వల్ల వస్తుంది. మెదడులోని కణుతుల వల్ల కూడా రావచ్చు. మెదడులో రక్తస్రావం జరిగినా కూడా ఇది రావచ్చు. కొంతమంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో షుగర్ ఎక్కువగా కూడా ఇలా జరగవచ్చు. వీటిల్లో ఏ కారణం వల్ల మీ అమ్మగారికి ఇలా జరిగిందో రక్తపరీక్షల ద్వారానూ, బ్రెయిన్ స్కాన్ ద్వారానూ తెలుసుకోవచ్చు. కారణం తెలుసుకొని సరైన మందులు వాడటం ద్వారా మీ అమ్మగారి జబ్బును నయం చేయవచ్చు. నా వయసు 60 ఏళ్లు. నాకు పక్షవాతం వచ్చి నాలుగేళ్లు అయ్యింది. గత నెల రోజులుగా ఫిట్స్ వస్తున్నాయి. డాక్టర్ గారికి చూపిస్తే పెద్దాసుపత్రికి వెళ్లమని చెప్పారు. నాకు సరైన సలహా ఇవ్వగలరు. - అప్పారావు, విశాఖపట్నం మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ఇస్కిమిక్ సీజర్స్ అనే ఫిట్స్‌తో బాధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒకసారి పక్షవాతం వచ్చినవారిలో ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు సీటీస్కాన్, ఈఈజీ పరీక్షలు చేయించుకొని, కొన్ని కార్బమైజిపైన్ అనే మందు వాడటం ద్వారా ఫిట్స్‌ను తగ్గించవచ్చు. అయితే మీరు కనీసం మూడేళ్ల పాటు ఇది వాడాల్సి ఉంటుంది. కొంతమందికి జీవితాంతం కూడా వాడాల్సి రావచ్చు. డాక్టర్ మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్, బంజారా హిల్స్, హైదరాబాద్ అనీమియా కౌన్సెలింగ్ మా పాప వయసు పదకొండేళ్లు. గత మూడు నెలలుగా రక్తహీనతతో బాధపడుతోంది. దీనికి కారణాలు, లక్షణాలతో పాటు రక్తహీనత రాకుండా జాగ్రత్తలు తెలపండి. - సౌజన్య, ఒంగోలు మన శరీరంలో రక్తం ఎర్రగా ఉంటుంది. దీనికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఒకవేళ హీమోగ్లోబిన్ తగ్గితే రక్తహీనతతో బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు. రక్తహీనత (అనీమియా)కు గురైన వ్యక్తికి రక్తంలోని ఎర్రరక్తకణాల సంఖ్య (రెడ్ బ్లడ్ సెల్స్ లేదా ఆర్బీసీ లేదా ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గిపోతుంది. రక్తపరీక్ష ద్వారా రోగి రక్తంలో ఎర్ర రక్తకణాలు ఎన్ని ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. రక్తహీనత ఉన్న వ్యక్తిలో అవసరమైన స్థాయిలో ఎర్రరక్తకణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. దీనివల్ల రోగి అలసటగా ఫీల్ కావడం జరుగుతుంది. రక్తహీనత తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో శ్వాసతీసుకోవడం కూడా కష్టమవుతుంది. రక్తహీనత ముఖ్యంగా మూడు కారణాల వల్ల వస్తుంది. అవి... 1) పౌష్టికాహారలోపం - ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారంలోనూ ఎక్కువగా ఉంటాయి. అవి తగినంతగా తీసుకోకపోవడం. 2) రక్తం నష్టపోతుండటం - స్త్రీలలో రుతుస్రావం వల్ల, పిల్లల కడుపుల్లో నులి పురుగుల వంటి క్రిములు ఉండటం వల్ల. 3) రక్తం తయారీలో అవరోధం - ఏవైనా జబ్బుల (ఉదాహరణకు మలేరియా) వల్ల రక్తంలోని ఎర్రరక్తకణాలు ధ్వంసం అయి మరల పెరగకపోవడం. దీంతో రక్తం తయారవ్వక రక్తహీనత కనపడుతుంది. లక్షణాలు : తీవ్రమైన నిస్సత్తువ, సాధారణ పనులకే ఆయాసం రావడం, నాలుక, కనురెప్పల లోపలి భాగాలు పాలిపోవడం, అలసట, చికాకు, ఆకలి లేకపోవడం, మైకం, కళ్లు తిరగడం, అరచేతుల్లో చెమట, చేతుల గోళ్లు వంగి గుంటలు పడటం, పాదాలలో నీరుచేరడం, చిన్నపిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి. అనీమియాను అధిగమించడం ఇలా : తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం రక్తహీనత నివారణకు సులభమైన మార్గం. బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, మాంసం, కాలేయం వంటి పదార్థాలలో కూడా ఇనుము పుష్కలంగా ఉంటుంది. రోజూ తీసుకునే ఆహారంలో మొలకెత్తిన పప్పు ధాన్యాలు, విటమిన్-సి పాళ్లు ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం వల్ల కూడా రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్ -
వేళ్లు కట్ అయినా... అతికించవచ్చు!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 21. నాకు కొంతకాలంగా నెలసరి సరిగా రాకపోతుండడంతో డాక్టర్ని సంప్రదించాను. స్కానింగ్ తీయించి పీసీఓడీ అని చెప్పారు. మందులు వాడుతున్నంతకాలం నెలసరి సరిగానే వస్తోంది. మానేస్తే మళ్లీ మామూలే. వివాహానంతరం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే అది సంతానలేమికి కారణమవుతుందేమోనని మా అమ్మానాన్నా ఆందోళన చెందుతున్నారు. ఈసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియో చికిత్స ద్వారా దీనికి సరైన పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - ఒక సోదరి, ఆదిలాబాద్ మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వల్ల ఈ సమస్య ఎక్కువ మంది స్త్రీలను వేధిస్తుంటుంది. వివాహితులలో సంతానలేమికీ కారణమవుతుంది. మెచ్యూర్ ఫాలికిల్ (అపరిపక్వమైన అండం) గర్భాశయానికి ఇరువైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్ని పాలిసిస్టిక్ డిసీజ్ (పీసీఓడీ) అంటారు. సాధారణ రుతుచక్రం ఉన్న మహిళలలో నెలసరి అయిన 11-14 రోజుల మధ్యన రెండు అండాశయాలలో ఒక అండాశయం నుండి ఒక అండం విడుదలై ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది. కానీ పీసీఓడీ ఉన్న వారి అండాశయం నుండి అండం విడుదల కాకుండా, అపరిపక్వత కలిగిన అండాలు నీటిబుడగలుగా మారి అండాశయపు గోడలపై ఉండిపోతాయి. కారణాలు: హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, పిండి, కొవ్వు పదార్థాలు, జంక్ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, జన్యుపరమైన అంశాలు. లక్షణాలు: నెలసరి రాకపోవడం, ఒకవేళ వచ్చినా అండాశ యం నుండి అండం విడుదల కాకపోవడం, నెలసరిలో నాలుగైదు రోజులు కావలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులు కొనసాగడం, నెలసరి ఆగి ఆగి రావడం, రెండు రుతుచక్రాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, ముఖంపై, వీపుపై మొటిమలు రావడం, మెడచుట్టూ, మోచేతి మడతలలో, మోచేయి భాగాలలో చర్మం మందంగా, నల్లగా మారడం, ముఖం, ఛాతీపై మగవారి మాదిరిగా రోమాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు: జీవన విధానంలో మార్పులు చేసుకుని ఒత్తిడిని తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతులాహారాన్ని తీసుకోవడం వంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా ఉండవచ్చు. హోమియోకేర్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్ అందించే కాన్స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా రోగి మానసిక, శరీర తత్వాన్ని బట్టి హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేసి ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీ సమస్యను నయం చేయడమే కాకుండా ఎలాంటి కాంప్లికేషన్లు ఉన్నా వాటిని తప్పక తగ్గించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ప్లాస్టిక్ సర్జరీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. ఒక పరిశ్రమలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాను. ఏడాది క్రితం మెషిన్లో కుడి చేయి ఇరుక్కోవడంతో నాలుగు వేళ్లు సగానికి పైగా నలిగిపోయాయి. ఇవి మళ్లీ అతికించడానికి పనికిరావనీ, పైగా తీవ్ర రక్తస్రావం కూడా జరగడంతో ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. దాంతో నేను ఉద్యోగం కోల్పోయాను. పనిచేసే సామర్థ్యం, నైపుణ్యం ఉన్నప్పటికీ చేతివేళ్లు లేకపోవడంతో టెక్నికల్ పని చేయలేకపోతున్నా. నాపై ఆధారపడ్డ కుటుంబసభ్యులను పోషించలేక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మానసిక వేదనతో కుమిలిపోతున్నాను. నాకు తగిన పరిష్కారం చూపండి. - యాదగిరి, బాలానగర్ మన జీవనాధారానికి, రోజువారీ పనులకు చేతులు, వేళ్లు చాలా కీలకం. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చేతులు లేకపోతే మన పని మనమే చేసుకోలేం. ఒకవేళ చేతులు ఉన్నా వాటికి వేళ్లు లేకపోతే జీవనాధారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మీ విషయంలో కూడా అలాగే జరిగింది. అయితే మీరు ఏమాత్రం నిరాశపడవద్దు. మీ కుడిచేతికి సంబంధించి, ఏ వేళ్లుపోయాయో వాటిని మీరు తిరిగి పొందగలరు. ‘రీ కన్స్ట్రక్షన్ సర్జరీ’ ద్వారా మీ చేతివేళ్లను అతికించవచ్చు. అయితే మీ కాళ్లలో ఏది సెట్ అవుతుందో చూసి, దాన్ని తీసి సర్జరీ ద్వారా మీరు కోల్పోయిన చేతి వేళ్లను అమర్చవచ్చు. పనిచేయడానికి చేతులకు కావాల్సిన బొటనవేలు, చూపుడువేలితో పాటు చివరి రెండు వేళ్లూ ముఖ్యమైనవే. వాటిని తిరిగిపొందాలంటే మీరు నిపుణులైన ప్లాస్టిక్, వాస్క్యులార్ సర్జన్ల బృందాన్ని సంప్రదించాలి. వారు యాక్సిడెంట్‌కు గురైన మీ చేతిని పరీక్షించి శస్త్రచికిత్స చేసే వీలుని పరిశీలిస్తారు. సర్జరీ నిర్వహించిన వేలిని శరీరం స్వీకరించడం, ఎముకకు సరిగ్గా అతకడం, నరాలు, రక్తప్రసరణ వంటి విషయాలనూ డాక్టర్ల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆపరేషన్ చేసిన వేళ్లతో మీరు మునుపటిలాగే పనులు చేసుకోవచ్చు. ఒక్కోసారి మీరు కోల్పోయిన అన్ని వేళ్లకూ ఒకేసారి సర్జరీ చేసే అవకాశాలూ ఉన్నాయి. ఆపరేషన్ తర్వాత ఒక నెలరోజుల పాటు మీరు ఆ వేళ్ల విషయంలో జాగ్రత్తవహిస్తే మీరు మునుపటిలాగానే ఉద్యోగం చేస్తూ, మీ కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించగలుగుతారు. ఒకసారి ప్లాస్టిక్ సర్జన్స్, వాస్క్యులార్ సర్జన్స్ బృందం ఉన్న హాస్పిటల్‌ను సంప్రదించండి. డాక్టర్ శశికాంత్ మద్దు సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ యశోద హాస్పిటల్స్ సోమాజీగూడ హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. నాకు రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తోంది. దాదాపుగా ఏడాది నుంచి ఈ నొప్పి ఉంది. ఇది క్రమంగా పెరుగుతోంది. కుడి మోకాలి నొప్పి కాస్త భరించగలిగేట్లు ఉన్నా ఎడమ మోకాలిలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఎడమ మోకాలిలో తీవ్రమైన ఆర్థరైటిస్ ఉందనీ, కుడి మోకాలిలో దాని తీవ్రత ఒకింత తక్కువగా ఉందని అంటున్నారు. ఈ మోకాళ్లలోకి కందెనలాగా (ల్యూబ్రికెంట్ పనిచేసే) అత్యంత ఆధునికమైన ఇంజెక్షన్లు ఇస్తామని అంటున్నారు. దాంతో ఆర్థరైటిస్ నొప్పులూ, మోకాళ్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు దాదాపు రూ. 15,000 ఉంటుందంటున్నారు. అంత ఖరీదైన ఇంజెక్షన్స్‌ను భరించే స్తోమత నాకు లేదు. అందుకే నాకు తగిన సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి. - నవనీతరావు, హైదరాబాద్ మీరు చెప్పిన కందెనలా పనిచేసే ల్యూబ్రెకెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి ఆధునికమైనవేమీ కాదు. గత 20 ఏళ్లుగా డాక్టర్లు వాడుతున్నవే. అవి కేవలం చాలా తక్కువ నుంచి ఒక మోస్తరు ఆర్థరైటిస్ ఉన్నవారికి మాత్రమే ఉపకరిస్తాయి. పైగా అవి కేవలం లక్షణాల తీవ్రతను తగ్గించడం మాత్రమే చేయగలవు. అంతేకాదు... ఆర్థరైటిస్ పెరగడాన్ని ఒకింత తగ్గిస్తాయి. మిగతా కార్టిలేజ్‌ను బలం పుంజుకునేలా చూస్తాయి. అంతేగానీ వాటివల్ల శాశ్వత పరిష్కారం రాదు. పైగా తీవ్రమైన ఆర్థరైటిస్ ఉన్నవారికి వాటి వల్ల ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్ ఉన్నవారికి అప్పటికే కార్టిలేజ్ దెబ్బతిని ఉంటుంది కాబట్టి వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. మీ విషయానికి వస్తే అది కుడి కాలికి కొంత ప్రయోజనం చేకూర్చవచ్చు. ఎడమకాలికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. అందుకే దానివల్లనే అంతా చక్కబడుతుందని అనుకోవద్దు. మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన వైద్యసహాయం పొందండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్ హైదరాబాద్ -
కార్టిలేజ్ రీప్లేస్మెంట్ ... మోకాలి నొప్పులకు పరిష్కారం
హోమియో కౌన్సెలింగ్ ఈ చలికాలంలో కీళ్ల నొప్పులు వస్తున్నాయి. నాకు కారణాలు చెప్పి, హోమియోలో చికిత్స సూచించండి. - ధనలక్ష్మి, కందుకూరు మన శరీరంలోని కదలికూ కీళ్లే ప్రధాన కారణం. అవి వేళ్ల జాయింట్లు కావచ్చు. మణికట్టు కీళ్లు కావచ్చు. భుజం జాయింట్లు కావచ్చు. పాదాల, వేళ్ల కీళ్లు కావచ్చు ఈ కీళ్ల కదలికలో వచ్చే సమస్యలను ఆర్థరైటిస్ అంటారు ఇది కీళ్లలో సాధారణంగా వచ్చే. అతి పెద్ద సమస్య. లక్షణాలు : కీలు లోపల వాచిపోవడం కదపాలంటే తీవ్రమైన నొప్పి, బాధ కీలు కడుపుతున్నప్పుడు శబ్దం రావడం జాయింట్లు ఎర్రగా మారడం జాయింట్ల వద్ద తాకినప్పుడు వేడిగా ఉండడం ఆకలి సరిగా లేకపోవడం రక్తహీనత నిద్ర లేకపోవడం. కారణాలు : శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండటం జాయింట్ దగ్గర దెబ్బలు తగలడం వంశపారంపర్య కారణాలు జాయింట్లు అరిగిపోవడం శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌లో వచ్చే అసాధరణ లోపాలు సరైన పోషకాహారం తీసుకోలేకపోవడం మానసిక ఒత్తిడి. ఆర్థరైటిస్లోని రకాలు: ఎ. ఆస్టియో ఆర్థరైటిస్: కీలు అరిగిపోవడం వల్ల కీలు లోపలంతా వాచిపోయి కదపాలంటే నొప్పి, బాధ తీవ్రంగా ఉంటుంది ఇది ఎక్కువగా వయస్సు మళ్లిన వారిలో కనిపిస్తుంది జాయింట్‌కు ఏదైనా దెబ్బ తగలడం వల్ల కానీ, శరీర బరువు అధికంగా ఉండటం వల్ల కానీ వస్తుంది. బి. రుమాటాయిడ్ ఆర్థరైటిస్: స్పష్టమైన కారణమేది తెలియకుండానే ఆరంభమయ్యే అతిపెద్ద సమస్య ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లు ఎర్రగా వాచిపోయి, ఉదయం లేస్తూనే జాయింట్లు కదపడానికి సహకరించవు. తీవ్రమైన నొప్పి ఉంటుంది సాధారణంగా ఇది ఎక్కువగా చిన్న జాయింట్లకు వస్తుంది అంతేకాకుండా నిర్లక్ష్యం చేస్తే ఇది శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, కళ్ల వంటి ఇతరత్రా అవయవాలనూ ప్రభావితం చేస్తుంది. సి. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్: శరీరంలో ఎక్కడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ తలెత్తి అది కీళ్ల దగ్గరకు చేరడం వల్ల నొప్పులు వస్తాయి. దీనిని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. డి. సోరియాటిక్ ఆర్థరైటిస్: సోరియాసిస్ వంటి చర్మ వ్యాధితో పాటు, ఒక్కోసారి కీళ్లల్లో నొప్పులు, వాపులు రావడం జరుగుతుంది. ఇ. రియాక్టివ్ ఆర్థరైటిస్: మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నీళ్ల విరేచనాల తరువాత వచ్చే కీళ్ల వాపును. రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. ఎఫ్. వైరల్ ఆర్థరైటిస్: చికెన్ గున్యా వంటి వైరల్ వ్యాధుల్లో కూడా కీళ్ల నొప్పులు, వాపులు రావచ్చు. ఆర్థరైటిస్ నివారణ: ప్రతిరోజూ వ్యాయామం చేయాలి పాలు, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవాలి పండ్లు తీసుకోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నాకు 30 ఏళ్లు. కొంతకాలంగా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నాను. కూర్చున్నా లేచినా మెట్లు ఎక్కినా, దిగినా ఈ సమస్య ఉండేది. కానీ కొన్ని రోజులుగా నొప్పి అధికమవడంతో పాటు మోకాళ్లలో కాస్త వాపు కూడా వస్తోంది. మందులు, ఆయింట్మెంట్లు వాడినా పెద్దగా ఉపశమనం లభించడంలేదు. ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - సరోజ, హైదరాబాద్ ఒకప్పుడు పెద్ద వయసున్నవారికే మోకాళ్ల నొప్పుల సమస్య ఎక్కువగా వస్తుండేవి. కానీ ఇప్పుడు మధ్య వయస్సు వాళ్లు కూడా దీని బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, అధికబరువు, వ్యాయామం చేయకపోవడం లాంటి తదితర కారణాల వల్ల ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సాధారణంగా ఆర్థరైటిస్ సమస్యలో నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశలో కూర్చుని లేచినప్పుడు మోకాళ్లలో నొప్పులు రావడం, మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు మోకాళ్ల నొప్పి బాధించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండవ దశలో ఇంట్లో పనులు చేసుకోనీయకుండా మోకాళ్ల నొప్పులు పీడించడం. మూడో దశ వచ్చేసరికి ఈ సమస్య మరికాస్త ముదిరి కాళ్లలో వాపు రావడం, నొప్పి ఎక్కువవుతుండడం లాంటి లక్షణాలు బయటపడుతుంటుంటాయి. నాలుగో దశలో ఇక పేషెంట్ నిల్చోవడానికి కూడా త్రీవ ఇబ్బందులు పడుతుంటాడు. కీలులోని రెండు ఎముకల మధ్య రాపిడి తగ్గించే కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు కీళ్లనొప్పులు మొదలవుతాయి. ఇక మీ సమస్య విషయానికొస్తే... మీరు మూడో దశలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ దశలో కాళ్ల కార్టిలేజ్‌లో ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని పరీక్షల ద్వారా తెలుసుకుని... చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కార్టిలేజ్ అరుగుదల కొద్దిగానే ఉంటే నొప్పి నివారణకు సంబంధించిన మందులతో పాటు ఇంట్లో చేసుకునే విధంగా కొన్ని రకాల వ్యాయామాలు కూడా డాక్టర్ సూచిస్తారు. అంతేకాకుండా కార్టిలేజ్ మరింత దెబ్బతినకుండా ఉండేందుకు సైనోవియల్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ (ఎస్ఎఫ్ఆర్టీ) అనే ఇంజక్షన్ ఇస్తారు. కార్టిలేజ్ అరుగుదల బట్టి ఆరు నెలలకోసారి లేదా సంవత్సరానికి ఒకటి చొప్పున ఇలా రెండు సార్లు తీసుకుంటే మీ సమస్యను చాలావరకు అరికట్టవచ్చు. మీరు వెంటనే మంచి సీనియర్ ఆర్థోపెడిక్ని సంప్రదించండి. మీరు వెంటనే సీనియర్ ఆర్థోపెడిక్ని సంప్రదించండి. ఒకవేళ అరుగుదల మరీ ఎక్కువగా ఉండి సర్జరీ అవసరమని సలహా ఇస్తే మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కార్టిలేజ్ సర్జరీలో అత్యాదునిక ఆర్థోస్కోపీ విధానం అమల్లోకి వచ్చింది. కాబట్టి మీ సమస్యకు కచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ యశోద హాస్పిటల్స్, మలక్‌పేట హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 37 ఏళ్లు. నాకు చాలా చిన్న వయసులోనే గుండెజబ్బు వచ్చింది. గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఉందని స్టెంట్ వేయాలని చెప్పారు. ఇటీవల శరీరంలో కలిసిపోయే స్టెంట్స్ అందుబాటులోకి వచ్చాయని విన్నాను. వాటి గురించి వివరించండి? - సందీప్, భీమవరం మీరు తెలుసుకున్న విధంగా శరీరంలో కలిసిపోయేలా కొన్ని స్టెంట్లు అందుబాటులోకి వచ్చాయి. గుండెజబ్బు వచ్చినవారిలో రక్తనాళాల్లోని అడ్డంకులు తొలగించడం, మళ్లీ రక్తప్రసరణను యథావిధిగా ఉండేలా చేయడంతో పాటు, ఇది రక్తనాళాల్లోని కణజాలం పనితీరును నార్మల్‌గా ఉంచుతుంది. అయితే ఈ రకమైన బయో అబ్జార్బబుల్ వాస్క్కులార్ స్కాఫోల్డ్ (బస్) చికిత్స చాలా కొద్ది ప్రదేశాల్లోనే లభ్యమవుతోంది. చిన్న వయసులో గుండెజబ్బు బారిన పడ్డ రోగులు ఇది మంచి చికిత్స. స్టెంట్ ఎలాంటిది వేయించినా మీరు మంచి ఆహార నియమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ మళ్లీ జబ్బు తిరగబెట్టకుండా చూసుకోవడం అవసరం. నా వయసు 54 ఏళ్లు. ఈమధ్య కాళ్ల మంటలు, ఆకలి ఎక్కువగా ఉండి త్వరగా నీరసపడిపోతున్నాను. డాక్టర్‌కు చూపిస్తే మధుమేహం అని చెప్పారు. దీర్ఘకాలంగా మధుమేహం ఉంటే గుండెజబ్బులు, కిడ్నీజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని విన్నాను. డయాబెటిస్ ఉన్నవారికి గుండెజబ్బులు రావడానికి గల కారణాలు చెప్పండి. - నిహారిక రెడ్డి, వరంగల్ డయాబెటిస్ వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో అడ్డంకులు కలిగి, హార్ట్ ఎటాక్ గాని, ఏంజైనా గాని రావచ్చు. ఇదే కాకుండా రక్తంలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల గుండె కండరంపై ప్రభావం పడి, గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గి డయాబెటిక్ కార్డియోమయోపతి అనే గుండెజబ్బు రావచ్చు. అయితే షుగర్ వ్యాధిని మందులతో నియంత్రణలో ఉంచుకుని, ఆహార నియమాలు పాటిస్తూ షుగర్ మందులతో పాటు స్టాటిన్స్, ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ శ్రీనివాసకుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజెన్స్ హాస్పిటల్స్, శేరిలింగంపల్లి, హైదరాబాద్. -
మూత్రనాళ ఇన్ఫెక్షన్ను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలకు దెబ్బ!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 55 సంవత్సరాలు. నాకు బీపీ, షుగర్ ఉన్నాయి. వీటికి తోడు ఈ మధ్య భుజం నొప్పి తరచు బాధిస్తుండడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన ఎమ్మారై చేసి, పెరి ఆర్థరైటిస్ అని నిర్థారించారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? -బాలకృష్ణ, తెనాలి శరీరంలోని కీళ్లన్నింటిలోకీ ఎక్కువగా కదిలేది భుజంకీళ్లే. దాదాపు మనం చేతులతో చేసే ప్రతిపనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది. భుజం కీళ్లు కూడా మోకాలు, తుంటికీళ్లవంటివే. ఇలాంటికీళ్లను బంతిగిన్నె కీళ్లు అంటారు. ఈ కీళ్లను గుళిక అనే పల్చటి పొర కప్పి ఉంచుతుంది. కీళ్లు అటూ ఇటూ కదిలించడానికి కావలసిన కండరాలు ఈ గుళిక బయట ఉంటాయి. భుజంలో ఉండే ఎముకలను ఒకదానినొటి కలిపే లిగమెంట్లు ఉంటాయి. ఇవి భుజం ఎముకల చుట్టూ ఒక గుండ్రని పొరను ఏర్పాటు చేస్తాయి. ఈ ప్రదేశంలో వాపు వచ్చినప్పుడు భుజం ఎముకలని సులువుగా కదల్చలేము. అప్పుడు భుజం పనితనం తగ్గడంతోపాటు నొప్పి రావచ్చు. భుజ నిర్మాణం చూసినట్లయితే చేతిపై ఎముక చివరిభాగంలో కార్టిలేజ్ ఉంటుంది. ఇది భుజపు ఎముక చివరగా ఉండే ఒక సాకెట్‌లా ఉండే గ్లినాయిడ్‌లో అమరి ఉంటుంది. ఈ కప్ లాంటి అమరికలో చేతి కీలు అన్ని పక్కలకు సులువుగా కదులుతుంటుంది. ఈ నిర్మాణంలో భుజపుటెముక స్థిరంగా ఉండి కండరాలు, టాండన్స్ సహాయంతో చేతి కీలును గ ట్టిగా పట్టి ఉంచుతూ భుజం కదలికకు సహకరిస్తుంది. కారణాలు: భుజానికి దెబ్బ తగలడం, భుజం కప్ ప్రాంతంలో చీలిక రావడం, భుజపుటెముక ఇన్ఫెక్షన్కు గురికావడం, భుజంపై చేతికీళ్లలోని కార్టిలేజ్‌లో మార్పు రావడం, మెడ ఎముకలకు సంబంధించిన సమస్యలు, అతి మూత్ర వ్యాధి లేదా చక్కెర వ్యాధి, భుజానికి లేదా గుండెకు శస్త్ర చికిత్స జరగడం. లక్షణాలు: భుజంలో నొప్పి, భుజం కదలికలు తగ్గడం, భుజం బిగపట్టినట్లుగా ఉండటం, చేతిని పైకి ఎత్తలేకపోవటం, చేతిలో వస్తువులను పట్టుకోవాలన్నా, రాయాల న్నా, భుజం నొప్పి రావడం, సమస్య తీవ్రమైతే చేతిని తల వెనక భాగానికి ఆన్చడమూ కష్టమవుతుంది. వ్యాధి నిర్ధారణ: ఎమ్మారై స్కాన్, టీ3, టీ4, టీఎస్‌హెచ్, ఎఫ్బీఎస్, సుగర్ టెస్ట్, ఎక్స్‌రే, ఆర్బీఎస్. హోమియో చికిత్స: రోగి శారీరక, మానసిక తత్వాన్ని అనుసరించి లక్షణాలను బట్టి హోమియో చికిత్స ఉంటుంది. బెలడోనా, ఫై మెట్, రస్టాక్స్, లెడమ్పాల్, ఆర్నికా, సాంగ్యునేరియా, కాల్బికమ్లతో ఆపరేషన్ లేకుండా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 23. నాకు గత కొంతకాలంగా మూత్రవిసర్జన సమయంలో మంట వస్తోంది. గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వైద్యులను సంప్రదిస్తే మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి మందులు ఇచ్చారు. మూడు రోజుల పాటు మందులు వాడిన తర్వాత సమస్య పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు వైద్యులు రాసిచ్చిన మందులు ఇప్పుడు వాడవచ్చా? ఇప్పుడు మళ్లీ వైద్యులను సంప్రదించాలా? దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించండి. - ఒక సోదరి మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో మూత్రవిసర్జన సమయంలో మంట వస్తుంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి. చాలామంది ఇలాంటి సమస్య వచ్చినా ఎవరితో చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ వైద్యులను సంప్రదించకుండా అలాగే ఉంటారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రత పెరగవచ్చు. గతంలో వైద్యులు రాసిన మందులు ఇప్పుడు వాడకపోవడమే మంచిది. ఎందుకంటే మీకు గతంలో వచ్చిన సమస్యకు, ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యకు వ్యత్యాసం ఉండవచ్చు. కాబట్టి మీరు వైద్యులను సంప్రదించి, వారి సూచన మేరకు మందులు వాడండి. నా వయస్సు 54 సంవత్సరాలు. నాకు 10 సంవత్సరాలుగా షుగర్ ఉంది. ఈ మధ్యన కాస్త ప్రయాణం చేస్తే చాలు... కాళ్లు వాస్తున్నాయి. నా బ్లడ్ టెస్టులో క్రియాటినిన్ 10 మి.గ్రా./డెసిలీటర్ యూరియా 28 మి.గ్రా. డెసిలేటర్ ఉంది. యూరిన్ పరీక్షలో ప్రొటీన్ 3 ప్లస్ అని తెలిపారు. నాకు షుగర్ వల్ల కిడ్నీ సమస్య ఉందా? ఇప్పుడు ఎలా జాగ్రత్త పడాలి. - జి.వి.ఎల్.బి.రాజేశ్వరి, మాగులూరు మీకు యూరిన్‌లో ప్రొటీన్ ఎక్కువగా పోతోందని తెలుస్తోంది. (డైయూరిటిక్ నెఫ్రోపతి). మొదటిది షుగర్ వల్లా లేదా కిడ్నీ లేదా ఇతర కారణాల వల్ల తెలుసుకోవాలి. మీరు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ 140 మి.గ్రా. లోపు; తిన్న తరువాత 160 మి.గ్రా. ఉండేటట్లు చూసుకోవాలి. యూరిన్‌లో వెళ్లిపోయే ప్రొటీన్‌ని తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మీరు మందులు వాడాలి. ఇవి కాకుండా ఉప్పును తగ్గించాలి. రోజుకి రెండు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పును తీసుకోకూడదు. పొగతాగడానికి, మద్యానికి దూరంగా ఉండాలి.పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడకూడదు. డాక్టర్ ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ యశోద హస్పిటల్స్ సికింద్రాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నేను రోజూ ఆఫీసుకు బైక్ మీద వెళ్తుంటాను. నేను గమనించిన అంశం ఏమిటంటే... చలికాలంలో బైక్ కు ఉండే ముందు బ్రేక్స్‌కు, క్లచ్కూ నా వేళ్లు అనుకునే ప్రదేశంలోనూ, హ్యాండిల్ మీద నా అరచేయి అనుకునే చోటా చర్మం బాగా బిరుసుగా, గట్టిగా కాయలాగా మారిపోతోంది. ఆ ప్రదేశం మళ్లీ నునుపుగా మారేందుకు తగిన సలహా ఇవ్వగలరు. - మానస్, హైదరాబాద్ చలికాలంలో చర్మంలోని తేమ బయటకు వెళ్లిపోవడం వల్ల మీరు చెప్పినట్లుగా చర్మం కొన్నిచోట్ల బిరుసుగానూ, గరుకుగానూ మారిపోతుంది. ఇక చర్మం పైన కాస్తంత ఒత్తిడి పడటం, ఒరుసుకుపోతున్నట్లుగా ఉండే ప్రదేశాల్లో అది మందంగా మారిపోవడం కూడా మామూలే. ఇలా చర్మం మందంగా మారే ప్రక్రియను వైద్యపరిభాషలో ‘క్యలాసిటీ’స్ అంటారు. మామూలు వాడుక భాషలో దీన్నే కాయకాయడం అంటారు. ఇది తగ్గడానికి అనుసరించాల్సిన మార్గాలు చర్మంపై కాయ కాసే చోట తేమను సంరక్షించే షియా బటర్, గ్లిజరిన్, వైట్ సాఫ్ట్ పారఫిన్ వంటి వాటిలో దైనినైనా రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు రాయాలి. కార్టికో స్టెరాయిడ్స్, శాల్సిలిక్ యాసిడ్ కాంబినేషన్ పైపూత మందులను కాయ కాసిన చోట పది రోజుల పాటు రాయాలి. ఈ కాయలు (క్యలాసిటీస్) మరీ గట్టిగా ఉంటే ‘పేరింగ్’ అనే ప్రక్రియ ద్వారా వాటిని తొలగించవచ్చు. నా మడమలు విపరీతంగా పగులుతున్నాయి. మడమ నేలకు ఆనించాలంటేనే కష్టంగా ఉంటోంది. ఒక్కోసారి రక్తం కూడా వస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - రవికుమార్, నేలకొండపల్లి చలికాలంలో ఇది చాలా సాధారణ సమస్య. కొన్నిసార్లు ప్లాంటార్ సోరియాసిస్, హైపర్కెరటోసిస్తో పాటు కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా కాళ్లలో చాలా లోతైన పగుళ్లతో పాటు, రక్తస్రావమూ కనిపించవచ్చు. కాళ్లు పగిలి ఉన్న చోట క్రమం తప్పకుండా పారఫిన్ ఆయిల్, గ్లిజరిన్, స్క్వాలీన్ వంటివి రాయండి. క్లోబెటసాల్ ప్రాపియోనేట్, శాల్సిలిక్ యాసిడ్ కాంబినేషన్ క్రీములను రెండు వారాల పాటు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రాయండి. ప్రతిరోజూ సాక్స్ ధరించండి. పగుళ్లతో గరుకుగా మారిన చోట సున్నితంగా రుద్దండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి హైదరాబాద్ -
వినికిడి తగ్గిందా? బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 34 ఏళ్లు. నాకు తరచు గొంతునొప్పి వస్తూ, మింగడం కష్టం అవుతోంది. ఈ సమస్యతో ఫంక్షన్లకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. బయట ఎక్కడైనా గుక్కెడు మంచినీళ్లు తాగితే చాలు... తిప్పలు తప్పట్లేదు. దీనికి హోమియోపతిలో పరిష్కారం ఉంటే చెప్పగలరు. - కాంచన, నెల్లూరు గొంతులో తీవ్రమైన నొప్పి, దురద, అసౌకర్యం... ఈ సమస్యకు ఇంచుమించు అందరూ బాధితులే. సాధార ణంగా ఫారింజైటిస్ అంటే ముక్కు, గొంతు వెనుక ఉన్న ఒక ప్రాంతం, నోరు వెనుకభాగంలో ఉండే పల్చటి పొరలో వాపు రావడం గొంతునొప్పికి ప్రథమ లక్షణం. సమస్య ఉదయం తీవ్రంగా ఉండి, పొద్దుపోయేకొద్దీ తగ్గుతుంటుంది. ఇది ప్రాథమిక దశలోనే తగ్గవచ్చు లేదా తీవ్రం కావచ్చు. ఫారింజైటిస్ మూలంగా గొంతునొప్పి తీవ్రమై, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏ మాత్రం తగ్గకపోవచ్చు. అది వారానికి, రెండువారాలకు పైగా గొంతు బొంగురుపోయి ఉన్నప్పుడు, జ్వరం 101 డిగ్రీలకన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, తెమడలో రక్తం కనిపిస్తూ, మింగడంలో గానీ, శ్వాస తీసుకోవడంలోగానీ ఇబ్బంది అనిపించవచ్చు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు దీనికి కారణం కావచ్చు. అలాగే నోరు సరిగా తెరుచుకోకపోడం, చెవినొప్పి, వికారం లేదా వాంతులు కావడం, తీవ్రమైన నీరసం, మెడవద్ద ఉండే లింఫ్ నోడ్స్ పెద్దవిగా కావడం, టాన్సిల్స్ మీద తెల్లని మచ్చలు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపించినప్పుడు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. జాగ్రత్తలు: గొంతు సమస్యలు మొదలైనప్పుడు ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో నోరు పుక్కిలించాలి. గొంతుకు విశ్రాంతినివ్వాలి. ద్రవపదార్థాలు తీసుకోవాలి. గొంతు తడి ఆరకుండా చూసుకోవాలి. మసాలా తగ్గించాలి. మద్యం అలవాటుంటే మానాలి. హోమియో చికిత్స బెల్లడోనా: తీవ్రమైన గొంతునొప్పి, టాన్సిల్స్ వాపు, మంట, దీనితోపాటు జ్వరం, గొంతునొప్పి. గొంతు పొడిబారినట్టుగా ఉండి ద్రవాలు తీసుకోవడానికి ఇష్టపడరు. మెర్క్‌సాల్: వాతావరణం మారితే గొంతునొప్పి, నోటిలో పొక్కులు, గొంతు అల్సర్స్, గొంతు మొద్దుబారినట్లుగా ఉండి, గొంతులో తీవ్రమైన మంట ఉంటుంది ఫైటోలెక్కా: ముక్కు ఎర్రబారడం, టాన్సిల్స్ వాచడం, కాళ్లూ చేతులూ లాగ డం, శ్లేష్మం, నోరుదుర్వాసన వంటి లక్షణాలున్నప్పుడు. కాలిమూర్: గొంతుభాగంలో గోధుమరంగు చిన్నచిన్న మచ్చలు, దీర్ఘకాలిక గొంతునొప్పి ఉన్నప్పుడు. ఇంకా లాకసిస్, లైకోపొడియా, వైతియా అనే మందులు డాక్టర్ పర్యవేక్షణలో వాడవలసి ఉంటుంది. జనరల్హెల్త్ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నాకు మొదటి నుంచి అసిడిటీ సమస్య ఉంది. ఇటీవల ఒళ్లంతా తీవ్రమైన నొప్పులు రావడంతో డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నాను. ఒకటి రెండుసార్లు పెయిన్ కిల్లర్స్ వాడాను. అవి వాడినప్పటి నుంచి కడుపులో మంట మరింతగా పెరుగుతోంది. నాకు పరిష్కారాన్ని సూచించండి. - మనోహర్, కడప కొన్ని నొప్పి నివారణ మందుల వల్ల... ముఖ్యంగా ఎన్ఎస్ఏఐడి గ్రూపునకు చెందిన బ్రూఫెన్, డైక్లోఫెనాక్, నాప్రోక్సెన్ వంటి వాటివల్ల అసిడిటీ, గుండెలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేని మందులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి మీ డాక్టర్‌ను సంప్రదించి మీకు మందులతో వస్తున్న సైడ్ఎఫెక్ట్స్ గురించి వివరించండి. డాక్టర్ మందులు మార్చి ఇస్తే మీ సమస్య తీరుతుంది. కాకపోతే మీకు ఒళ్లునొప్పులు రావడానికి గల కారణాలను కూడా తెలుసుకొని, దానికీ చికిత్స అందించడం అవసరం. కాబట్టి ఒకసారి ఫిజీషియన్‌ను సంప్రదించండి. నా వయస్సు 64 ఏళ్లు. నాకు గత పదేళ్లుగా షుగర్, బీపీ ఉన్నాయి. ఈమధ్య ముఖం బాగా ఉబ్బింది. కాళ్లపై కూడా వాపు కనిపిస్తోంది. దాంతోపాటు పొట్ట నొప్పి కూడా వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేసి మూత్రపిండాల్లో సమస్య ఉందన్నారు. కిడ్నీలు ముప్ఫయి శాతం దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టపోయిన దాన్ని మళ్లీ బాగు చేయలేమని కూడా చెప్పారు. నాకు వచ్చిన సమస్య ఏమిటి? నా మూత్రపిండాలు మిగతా 70 శాతం చెడిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి. - ఓంకార్‌నాథ్, విజయనగరం షుగర్, బీపీ సమస్యలు ఉన్నవారిలో వాటిని నియంత్రించుకోకపోతే, కొంతకాలం తర్వాత మూత్రపిండాలపై వాటి దుష్ర్పభావం పడి అవి దెబ్బతినడం చాలామందిలో కనిపించే పరిణామమే. దీనికి డయాబెటిక్ నెఫ్రోపతి లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) లేదా కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ (సీసీఎఫ్) కారణాలు కావచ్చు. అందువల్లనే బీపీ, షుగర్... ఈ రెండు సమస్యలూ ఉన్నవారు ఏడాదికి ఒక్కసారైనా వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని చికిత్సలో తగు మార్పులు (అంటే... మందులు, వాటి మోతాదుల్లో మార్పులు) చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బహుశా మీరు ఈ పరీక్షలు తరచూ చేయించకపోవడం వల్లనో లేదా మీకు ఈ సమస్యల దుష్ర్పభావాల ఫలితాలపై తగినంత అవగాహన లేకపోవడం వల్లనో ఇప్పటికే ముప్పయి శాతం డ్యామేజీ జరిగిపోయి ఉంవడచ్చు. ఇంకా ఆరోగ్యపరంగా మరింత నష్టం వాటిల్లకుండా ఉండటం కోసం మీరు మీ బీపీ, షుగర్లను అదుపులో పెట్టుకోవడం, వైద్యులను తరచూ సంప్రదిస్తూ క్రమం తప్పకుండా సంప్రదించడం అవసరం. మీరు ఇకపై తరచూ మీ ఫిజీషియన్‌ను తప్పక సంప్రదిస్తూ ఉండండి. రేడియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 57 ఏళ్లు. ఇటీవల వినికిడి శక్తి బాగా తగ్గింది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేయించి, న్యూరోసర్జన్‌ను సంప్రదించమని చెప్పారు. వినికిడి సామర్థ్యానికీ, మెదడుకూ సంబంధం ఏమిటి? డాక్టర్ ఆపరేషన్ అవసరం అంటున్నారు. నాకు శస్త్రచికిత్స అంటే భయం. దాని అవసరం లేకుండా చికిత్స చేయడం సాధ్యం కాదా? దయచేసి వివరంగా చెప్పండి. - శ్యామలరావు, అనకాపల్లి మీరు చెప్పిన లక్షణాలను బట్టి మెదడులోని కణుతుల పరిమాణం బాగా పెరగడం వల్ల వినికిడి శక్తి తగ్గిందని అనుకోవచ్చు. కొందరిలో కొన్నిసార్లు మెదడులో కణుతులు పెరుగుతాయి. వీటిని బ్రెయిన్ట్యూమర్స్ అంటారు. వీటిలో చాలా రకాలు ఉంటాయి. అయితే ప్రాథమికంగా వీటిని హానిచేయనివి (బినైన్), హానికరమైనవి (మాలిగ్నెంట్) అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. మెదడులో సాధారణంగా వచ్చే కణుతుల్లో దాదాపు వంద రకాలకు పైగా ఉన్నప్పటికీ గ్లయోమా, మినింజియోమా ఆకాస్టిక్ న్యూరోమా అనేవి ప్రధానమైనవి. ఇందులో మినింజియోమా కణుతులు హానిచేసేవి కావు. అయితే అవి మెదడు పైపొరల నుంచి గానీ, లేదా అడుగు భాగం నుంచి గానీ పుట్టుకొస్తాయి. వినికిడి శక్తి తగ్గడానికీ, మెదడు కణుతుల పెరుగుదలకూ సంబంధం ఉంది. చెవి వెలుపల నుంచి వచ్చే శబ్దతరంగాలను చెవిలోపలి శ్రవణనాడి మెదడుకు మోసుకుపోతుంది. ఈ శ్రవణనాడిని ఆలంబన చేసుకొని పెరిగే ట్యూమర్‌నే అకాస్టిక్ న్యూరోమా లేదా ష్వానోమా అంటారు. ఇది పెరుగుతున్నప్పుడు ముఖానికి సంబంధించిన ఫేషియల్ నాడితో పాటు ట్రైజెమినల్ నాడిపై ఒత్తిడి పెరుగుతుంది. అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఏర్పడితే ట్యూమర్ వల్ల కలిగే ఒత్తిడితో పరిసరాల్లోని నాడులు ప్రభావితమై వినికిడి శక్తి సన్నగిల్లుతుంది. దాంతోపాటు నోరు ఒంకరపోవడం, తూలిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. లక్షణాలు కనిపించేవారకూ చాలామందిలో మెదడులో ట్యూమర్ ఉందన్న విషయం బయటపడకపోవచ్చు. అయితే వినికిడిశక్తి తగ్గడంతో ఈఎన్టీ నిపుణుల వద్దకు వెళ్లినప్పుడు వారు చేయించే ఎమ్మారై స్కాన్ల వల్ల ఇటీవల చిన్నసైజు ట్యూమర్లూ తెలుస్తున్నాయి. వారు అకాస్టిక్ న్యూరోమాను అనుమానించినప్పుడు సంబంధిత పరీక్షలు చేయిస్తారు. ఇప్పుడు శస్త్రచికిత్స అవసరం లేకుండానే రేడియేషన్ చికిత్స ద్వారా 3 సెం.మీ. వరకు ఉన్న మెదడు ట్యూమర్లను కరిగించవచ్చు. మీరు ఆపరేషన్ గురించి ఆందోళన పడకుండా న్యూరోసర్జన్‌ను కలవండి. -
పైల్స్ - హోమియో చికిత్స
పైల్స్ వున్న వారి బాధ వర్ణనాతీతం. మలవిసర్జన తర్వాత ఈ బాధ కొన్ని గంటల వరకు ఉంటుంది. నొప్పి, మంట, దురద ఉండి, సూదులతో గుచ్చుకున్నట్లు వుండి వీరు ఒకచోట కూర్చోలేరు, నిల్చోలేరు. ఈ మొలలు చిట్లడం వలన రక్తస్రావం జరుగుతుంది. చాలారోజుల వరకు రక్తస్రావం అయితే శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గి ఎనీమియా రావడానికి ఆస్కారం ఉంది. జీవన విధానం, మారుతున్న ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి, వాహనాలు అధికంగా నడపడం, వేసవికాలం, నీరు అధికంగా తీసుకోకపోవడం వలన ఇవి వస్తాయి. మలద్వారంతో కలుపబడిన పెద్ద పేగు చివరి భాగాన్ని మలనాళం లేదా రెక్టమ్ అంటారు. ఇక్కడ ఉన్న కణజాలంలో అధికంగా ఉండే రక్తనాళాల వాపు వలన ఈ స్థితి వస్తుంది. పురీష నాళం వెలుపలి భాగంలో వస్తే బాహ్య హెమరాయిడ్స్ అని, లోపలి భాగంలో వస్తే లోపలి హెమరాయిడ్స్ అని అంటారు. ఇవి బఠాణీ గింజ లేదా ద్రాక్షపండు పరిమాణంలో గులాబీ రంగులో, మూడు లేదా నాలుగు గుత్తులుగా లేదా విడిగా కూడా ఉండే ఈ స్థితిని మూలశంక (పైల్స్) వ్యాధిగా పేర్కొంటారు. ఎవరికి వస్తుంది..? ... గర్భిణులలో, ప్రోస్టేట్ గ్రంథి వాపు ఉన్నవారిలో సాధారణంగా చూస్తాం. పిల్లలలో ఈ వ్యాధిని అరుదుగా చూస్తాం. కారణాలు... మలబద్దకం మూలంగా అధికంగా ముక్కుటం దీర్ఘకాలిక విరేచనాలు గర్భస్థ పిండం ఒత్తిడి వలన, అధికంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్ల వలన పొత్తికడుపు లేదా పేగులలోని క్యాన్సర్ సంబంధ కణుతుల వలన వంశపారంపర్యంగా అధిక బరువు, స్థూలకాయం హెమరాయిడ్లు, వేరికోస్ సిరల వ్యాధి ఉన్నవారిలో పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని రోజూ తీసుకోవడం... వంటివి. హెమరాయిడ్లు - రకములు... మొదటి తరగతి (ఫస్ట్ డిగ్రీ పైల్స్): రెక్టమ్ లేదా మలనాళం లోపలే ఉంటాయి; రెండవ తరగతి (సెకండ్ డిగ్రీ పైల్స్): పురీషనాళం తెరచుకుని ఉన్నప్పుడు వెలుపలికి వచ్చి, మలద్వారం మూసుకున్న వెంటనే లోపలికి వెళ్లిపోతాయి; మూడవ తరగతి (థర్డ్ డిగ్రీ పైల్స్): వెలుపలికి వచ్చి, హెమరాయిడ్లను లోపలికి చొప్పించిన వెంటనే లోనికి వెళ్లిపోతాయి; నాల్గవ తరగతి (ఫోర్త్ డిగ్రీ పైల్స్): మలద్వారం వెలుపల శాశ్వతంగా వేలాడుతూ ఉంటాయి. లక్షణాలు: చాలామంది ఎక్కువగా లోపలి హెమరాయిడ్ల (ఇంటర్నల్ పైల్స్)తో ఏ లక్షణాలూ లేకుండానే ఉంటారు. మలద్వారం తెరచుకున్న వెంటనే తాజా రక్తం మలద్వారం ద్వారా వెలుపలికి వస్తుంది. మలద్వారం చుట్టూ దురద ఉండవచ్చు. మూడు-నాలుగు దశలలోని హెమరాయిడ్లు, అధికంగా నొప్పి ఉండి చీము వంటి పలుచని ద్రవం విసర్జింపబడుతుంది. నివారించవచ్చా? మొలలు వచ్చిన తరువాత కంటె మొలల లక్షణాలు కనబడిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చు. మొలలతో బాధపడేవారు ఆహారపు అలవాట్లలో, జీవన విధానంలో మార్పు తీసుకొస్తే నివారించవచ్చు. ముఖ్యంగా తాజా పండ్లు, ఆకుకూరలు, ఫైబర్‌తో కూడిన పదార్థాలు, దప్పిక ఉన్నా లేకున్నా పది నుండి పన్నెండు గ్లాసుల నీరు తీసుకోవడం, మాంసాహారం, మసాలాలు, పచ్చళ్లు తీసుకోకుండా ఉంటే మంచిది. ఎక్కువసేపు కూర్చోకుండా, యోగా, వ్యాయామం చేయడం వలన నివారించవచ్చు. హోమియో చికిత్స వలన ప్రయోజనం ఉంటుందా? మొదటి మూడు దళలలోని హెమరాయిడ్లను పూర్తిగా నయం చేయటమేకాక, శస్త్రచికిత్స, అవసరం లేకుండా చేస్తుంది. అంతేకాకుండా హెమరాయిడ్ వలన వచ్చే బలహీనతను తగ్గించి, శాశ్వతంగా రాకుండా చేస్తుంది. హోమియోలో ఆస్కులస్ హిప్, ఆలోస్, హెయాములస్, కొలింగ్ సోనియా, ఆర్గనిక్ ఆల్, నక్సామికా మందులు బాగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్ ph: 7416 107 107