
Homeopathy Treatment For Neem Trees: వేప చెట్లు డై బ్యాక్ అనే శిలీంద్ర సంబంధమైన తెగులుతోపాటు టీ మస్కిటో అనే దోమ దాడికి గురవుతున్నాయి. కొన్ని చోట్ల చిగుర్లు ఎండిపోతే, మరికొన్ని చోట్ల నిలువునా వేప చెట్లు ఎండిపోతున్నాయి. సేంద్రియ, పకృతి వ్యవసాయంలో చీడపీడల నియంత్రణలో కీలకపాత్ర నిర్వహించే వేప చెట్లను కోల్పోతే భవిష్యత్‌లో భారీ నష్టాలుంటాయి. ఈ సమస్య నివారణకు హోమియో మందులు ఉపయోగపడతాయని ప్రసిద్ధ హోమియో వైద్యులు డా. అంబటి సురేంద్ర రాజు, భువనగరి సమీపంలోని రామచంద్రాపురంలోని అమేయ కృషి వికాస కేంద్రం రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి తెలిపారు. వేప చెట్లను రక్షించుకోవడానికి ఈ కింది రెండు మందులను వేర్వేరుగా పిచికారీ చేయాలి. రెంటినీ కలిపి చల్లకూడదు.
క్యూప్రమ్ మెట్ 200 (CUPRUM METALLICUM 200) ద్రవ రూప హోమియో మందును, ఈ కింద చెప్పిన విధంగా ఆ మోతాదులో, పిచికారీ చేస్తే టీ మస్కిటో దోమ నశిస్తుంది. దీన్ని పిచికారీ చేసిన రెండు రోజుల తర్వాత కొక్సీనెల్లా 200 (COCCINELLA SEPTEMPUNCTATA 200) అనే ద్రవ రూప హోమియో మందును, ఈ కింద చెప్పిన విధంగా ఆ మోతాదులో, నీటిలో కలిపి వేప చెట్లపై పిచికారీ చేయడం లేదా చెట్టు మొదలు చుట్టూ పాదు చేసి పొయ్యొచ్చు. ముందుగా చెట్టు చుట్టూ పాదును మామూలు నీటితో నిండుగా తడిపిన తర్వాత.. మందు కలిపిన నీరు చెట్టుకు పది లీటర్లయినా సరిపోతుంది. చెట్టు మరీ పెద్దదైతే ఇరువై లీటర్ల వరకూ పోసుకోవచ్చు. ఒక దఫా ఈ రెండు మందులు వాడిన తర్వాత.. 8 రోజులు వేచి చూడండి. అవసరం అనుకుంటే మరోసారి వాడండి.
హోమియోపతి మందు వాడే విధానం
- 20 లీటర్ల నీటికి 2.5 మిల్లీ లీటర్ల (ఎం.ఎల్.) మోతాదులో హోమియో మందును కలిపి వాడాలి.
- ఒక లీటరు సీసా లేదా ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని అందులో సగం వరకు నీరు నింపుకోవాలి. అందులో 2.5 మిల్లీలీటర్ల (ఎం.ఎల్.) మందు కలిపి, మూత బిగించి, 50 సార్లు గట్టిగా కుదుపుతూ ఊపాలి. ఆ తర్వాత ఆ మందును స్ప్రేయర్ ట్యాంకులో పోసుకొని, 20 లీటర్ల నీరు నింపి, పిచికారీ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment