neem trees
-
వేప తెగులు స్వల్పకాలికమే
సాక్షి, సాగుబడి డెస్క్ :వాతావరణంలో, వర్షపాతంలో చోటుచేసుకుంటున్న పెను మార్పులే వేప చెట్లకు శాపంగా మారినా, దీని వల్ల వేప కాయల ఉత్పత్తికి విఘాతం కలగటం లేదని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ప్రాథమిక అధ్యయనంలో నిర్ధారణకు వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ప్రతి ఏటా వేప చెట్ల చిగుర్లు మాడిపోతుండటం, మరికొన్ని చోట్ల చెట్లు నిలువునా ఎండిపోతుండటం గత కొన్నేళ్లుగా రివాజుగా మారిన విషయం తెలిసిందే. టీ మస్కిటో పురుగు (టిఎంబి) సోకటం వల్ల కొన్ని నెలల పాటు (మే–సెప్టెంబర్) వేప చెట్ల కొమ్మలు ఎండిపోతూ.. తిరిగి వాటికవే తిప్పుకుంటున్నాయి. ఇది నైరుతి రుతుపవనాల కాలం ముగిసిన తర్వాత తగ్గిపోయే సమస్యేనని, దీని వల్ల వేప కాయల దిగుబడికి పెద్దగా నష్టం లేదని ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఐసీఏఆర్– కేంద్రీయ ఆగ్రోఫారెస్ట్రీ పరిశోధనా సంస్థ (సిఎఎఫ్‌ఆర్‌ఐ–కాఫ్రి) సంచాలకులు డా. ఎ. అరుణాచలం వెల్లడించారు. అయితే, క్రిమిసంహారక స్వభావం కలిగిన వేపను టిఎంబి గతమెన్నడూ లేనంతగా ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఆశిస్తోందన్న అంశంపై లోతైన అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. గాలిలో అధిక తేమ వల్లనే పురుగు ఉధృతి ఆగ్రోఫారెస్ట్రీపై జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి సాగుబడి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మే నుంచి అకాల వర్షాలు, వర్షపాతంలో అసాధారణ మార్పుల వల్ల ఆయా రాష్ట్రాల్లో గాలిలో తేమ అధికంగా ఉండటం మూలంగా ట్రీ మస్కిటో పురుగు ఉధృతి పెరుగుతోందన్నారు. తెలంగాణలో కూడా కనిపించడం విచిత్రమే సముద్ర తీర రాష్ట్రాల్లో ఇది ప్రధాన సమస్యగా ఎదురవుతున్నదని, కానీ తెలంగాణలో కూడా ఇది తీవ్రంగా కనిపిస్తుండటం పట్ల ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారాయన. 96 దేశాల్లో వేప చెట్లు పెరుగుతున్నాయని, అయితే, టీ మస్కిటో పురుగు సోకుతున్నట్లు చైనా తప్ప మరే దేశమూ వెల్లడించలేదన్నారు. గాలి ద్వారానే టిఎంబి విస్తరిస్తోందని, ఒక ప్రదేశంలో దగ్గర దగ్గరగా ఉన్న చెట్లకు ఎక్కువగా సోకుతోందని, ఇది మనుషులకు హానికరం కాదని డా. అరుణాచలం అన్నారు. ఇలా అరికట్టవచ్చు పొటాషియం లోపించిన నేలల్లో పెరుగుతున్న వేప చెట్లకు టీఎంబీ ఎక్కువగా సోకుతున్నట్లు కొన్ని ప్రాంతాల్లో గుర్తించారు. పొటాషియం పుష్కలంగాఉన్న నేలల్లో చెట్లకు పెద్దగా సోకలేదు. పశువుల ఎరువులో ట్రైకోడెర్మా విరిడి కలిపి వేపచెట్లకు వేస్తే కొమ్మెండు సమస్యను సమర్థవంతంగా అరికట్టవచ్చని డా. అరుణాచలం వివరించారు. -
వేపకు మళ్లీ ‘డై బ్యాక్’ ముప్పు!
ల్లెపల్లెనా, రోడ్ల పక్కన, అడవుల్లో విస్తృతంగా పెరిగే మన వేపచెట్లకు మరోసారి ‘డై బ్యాక్’జబ్బు ముప్పు పొంచి ఉంది. సుమారు మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ‘టీ మస్కిటో’, ఫంగస్ దాడితో తీవ్రంగా దెబ్బతిన్న లక్షలాది వేపచెట్లు ఈ ఏడాది ఉగాది తర్వాత కోలుకుంటున్న క్రమంలో మళ్లీ టీ మస్కిటో దాడి మొదలుపెట్టింది. ఈసారి ఫిబ్రవరి నుంచి అకాల వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ పంజా విసురుతోంది. ఫలితంగా చెట్లన్నీ కొమ్మలతో సహా ఎండి పోవడంతోపాటు ఆకులు రాలిపోతున్నాయి. దీనివల్ల చెట్లకు పోషకాలు అందక క్రమంగా చచ్చిపోతున్నాయి. దీన్నే డై బ్యాక్‌గా పిలుస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ తగ్గనున్న వేప విత్తన దిగుబడి... రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రం కావొచ్చని శాస్త్రేవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెగుళ్లు సోకడం వేపవిత్తనాల దిగుబడి భారీగా తగ్గిందని చెబుతున్నారు. ఈ ఏడాది 50 నుంచి 80% దాకా విత్త నాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని, దీని ప్రభావం వేప ఉత్పత్తులు, నీమ్కేక్స్, నీమ్ ఆయిల్, నీమ్ కోటింగ్‌పై ఆధారపడిన పరిశ్రమలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డై బ్యాక్ జబ్బును జాతీయ స్థాయిలో దీనిని కట్టడి చేసేందుకు కార్యాచరణను చేపట్టక పోతే భవిష్యత్‌లో వేప ఆధారిత ముడిపదార్థాలను విదేశాల నుంచి దివగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఎదురుకావొచ్చని చెబుతున్నారు. కొనసాగుతున్న పరిశోధనలు.. ఈ సమస్యపై ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫారెస్ట్ కాలేజీ ఆఫ్ రిసెర్చ్ ఇన్స్టి ట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) ఐఐసీటీ, జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విడి విడిగా పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వేపచెట్లకు ఎదురవుతున్న కీటక దాడు లు, చెదలు, ఫంగస్‌లను ఎలా కట్టడి చేయాలనే దాని పై పరిష్కారాలు కనుగునేందుకు కృషి చేస్తున్నాయి. ఎఫ్సీఆర్ఐలో పరి శోధన నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.జగదీశ్‌కుమార్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఫోమోప్సిస్ అజాడిరాచ్టే అనే పాథోజెన్ ద్వారా వేప చెట్లకు ఈ జబ్బు సోకుతున్నట్లు గుర్తించారు. ఈ పాథోజెన్ గాలి ద్వారా సులభంగా వ్యాప్తికి అవకాశం ఉన్నందున వేపచెట్లు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాక వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. రాష్ట్రమంతటా వేప చెట్లు విస్తరించి ఉన్నందున అన్నింటికీ వివిధ రసా యన మిశ్ర మాలతో పిచికారీ చేయడం అసాధ్యంగా మారిందని వివరించారు. అయితే వేపకు బతికే శక్తిసామ ర్థ్యాలు ఎక్కువగా ఉన్నందున పెద్దచెట్లకు అంతగా నష్టం ఉండదని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా విభాగం రిటైర్డ్ సంచాలకుడు డాక్టర్ ఆర్.జగదీశ్వర్ అభిప్రాయపడ్డారు. కానీ గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు ఎక్కువ కావడంతో వేపచెట్టు నుంచి విత్తనం నేలపై పడి తిరిగి మొలకెత్తడం తగ్గిపోయిందన్నా రు. అందు వల్ల వేప ముడిపదార్థాల ఉత్పత్తి, సరఫరాలో తగ్గుదల కనిపిస్తోందని సాక్షితో మాట్లాడుతూ చెప్పారు. -
వేప చెట్లకు ముప్పు..
సాక్షి, హైదరాబాద్: కొమ్మల ముడత లేదా డైబ్యాక్ అని పిలిచే విధ్వంసకర వ్యాధితో ప్రస్తుతం వేపచెట్లకు ముప్పున్నదని ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్లాంట్ పాథాలజిస్ట్ డా.జగదీశ్ తెలిపారు. ఇది అన్ని వయసులు, అన్ని పరిమాణాల వేప చెట్ల ఆకులు, కొమ్మలు, పుష్పగుచ్ఛాలను ప్రభావితం చేస్తుందని, ఐతే దీని వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కొనేంత బలంగా మన రాష్ట్రంలోని చెట్లున్నాయని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఆగస్టు–డిసెంబర్ల మధ్య ఎక్కువగా కనిపిస్తుందని, వర్షాకాలం మొదలయ్యాక లక్షణాలు కనిపిస్తాయని, వర్షాకాలం చివర్లో శీతాకాలంలో ఇది క్రమంగా తీవ్రమవుతుందని వివరించారు. విత్తన శుద్ధితో తగ్గుముఖం వేప విత్తనాలు విత్తే సమయంలో, శిలీంద్రనాశకాలు లేదా బయో నియంత్రిత ఏజెంట్లతో విత్తన శుద్ధి ఈ సంక్రమణను తగ్గిస్తుందని తెలియజేశారు. మొలక, నారు దశలో కార్బండాజిమ్ 2.5 గ్రాముల లీటరు నీరు లేదా ట్రైకోడెర్మా వంటి బయోకంట్రోల్ శిలీంద్రనాశకాల నివారణ స్ప్రేలు కచ్చితంగా నారు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయనీ, వ్యాధులకు నిరోధకతను కల్పిస్తాయని తెలిపారు. వేప చెట్టు స్వాభావికంగా వ్యాధిని బాగా తట్టుకోగలుగుతుందని, తరచుగా ఫంగస్ వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయగలదని స్పష్టం చేశారు. దీనిపై తమ ఇన్స్టిట్యూట్ ల్యాబొరేటరీలో అధ్యయనాలు నిర్వహించామని, వ్యాధికారక కారణాన్ని ఫోమోప్సిస్ అజాడిరచ్టేగా గుర్తించినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో వరుసగా మూడేళ్లుగా ఇది వెలుగులోకి రావడం కొంత ఆందోళన కలిగించే అంశమేనని పేర్కొన్నారు. వేప డైబ్యాక్, ఇతర చెట్ల వ్యాధులకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 9705893415 నంబర్లో సంప్రదించవచ్చునని జగదీశ్ తెలియజేశారు. -
Neem Tree: వేపకు మళ్లీ ఆపదొచ్చింది.. మేలుకోకపోతే వింత రోగంతో..
ఆత్మకూరు (ఎం)/యాదాద్రి భువనగిరి: వేపకు మళ్లీ ఆపదొచ్చింది. వింత రోగంతో పచ్చని వృక్షాలు మాడిపోతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న చెట్లు కళ్లెదుటే మోడుబారి పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కూడా వైరస్ సోకి పెద్ద ఎత్తున చెట్లు మోడుబారాయి. గత సంవత్సరం మాదిరిగానే మళ్లీ వేప చెట్లు వైరస్‌కు గురవుతున్నాయి. వైరస్ ద్వారా తెగులు సృష్టిలో రకరకాల చెట్లు ఉన్నప్పటికీ వేపది ప్రత్యేక స్థానం. ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టుతో అనేక రకాల ప్రయోజనాలున్నాయి. అలాంటి ప్రాధాన్యం కలిగిన వేప చెట్టు ఇప్పుడు డైబ్యాక్, ట్రీమస్టికో వైరస్ బారిన పడింది. ఈ వైరస్ సోకిన చెట్ల కొమ్మలు పసుపు, గోదుమ రంగులోకి మారి ఆ తర్వాత నిర్జీవ స్థితికి చేరుతున్నాయి. ఈ వైరస్ ఒక వేప చెట్టు నుంచి మరో వేప చెట్టుకు వస్తుంది. వాడాల్సిన మందులు వైరస్ బారిన పడిన వేప చెట్లకు కార్భోలానిజిమ్ ద్రావకాన్ని ఒక గ్రాం ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పది రోజుల తర్వాత కాపర్ ఆక్సై డ్ క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంతేకాకుండా వైరస్ ఆశించిన చెట్టు కొమ్మలను నరికివేయాలి. నరికిన కొమ్మలకు గోరింటాకు ముద్దగా చేసి అంటించాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. (చదవండి: వీళ్లు మనుషులేనా.. ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురుని కిడ్నాప్ చేసి గుండుకొట్టించి) గత ఏడాది మొక్కుబడి చర్యలు గత ఏడాది వేప చెట్లు వైరస్ బారిన పడి ఎండిపోతుండడంతో అప్రమత్తం అయిన ప్రభుత్వం.. చెట్లను కాపాడుకునేందుకు సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి వేప చెట్లకు మందులు పిచికారీ చేయాల్సి ఉంది. మొక్కుబడిగా కొన్ని చెట్లకు మాత్రమే మందులు వేసి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. మందు పిచికారీ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది కావడంతో సర్పంచ్‌లు చేతులెత్తేశారు. దీంతో వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. (చదవండి: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా హాస్టళ్లు, లాడ్జీలు.. పోలీసుల ప్రత్యేక యాప్) ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంది వేప చెట్లకు వైరస్ తీవ్ర త ఈసారి ఎక్కువగా ఉంది. తేమ శాతం అధికంగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వైరస్ సోకిన చెట్టు ఆరు నెల్లోపు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే చిగురిస్తాయి. గతంలో సర్పంచ్‌లకు చెప్పి మందు పిచికారీ చేయించాం. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. –అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి మందులు పిచికారీ చేయాలి వేప చెట్లతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. పూర్తిగా ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లు వైరస్ బారిన పడి ఎండిపోతుండడం ఆందోళన కలిగి స్తోంది. ప్రభుత్వం ముందుకొచ్చి సంరక్షణలు చర్యలు చేపట్టాలి. అధికారులకు ఆదేశాలు జారీ చేసి మందులు పిచికారీ చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే చెట్లు అంతరించే ప్రమాదం ఉంది –డి.వెంకన్న, సైన్స్ ఉపాధ్యాయుడు, ఆత్మకూరు(ఎం) అధికారులు స్పందించాలి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి వేప పుల్లతోనే దంతాలు తోముకుంటున్నా. గత ఏడాది వేప చెట్లకు వైరస్ సోకి చాలా వరకు ఎండిపోయాయి. మళ్లీ అదే మాదిరిగా ఇప్పుడు ఎండిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మొదటిసారి పూర్తిస్థాయిలో నివారణ చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వెంటనే స్పందించి చెట్లను కాపాడాలి. –బద్దం శంకర్‌రెడ్డి, రైతు, కాల్వపల్లి, ఆత్మకూరు(ఎం) మండలం -
వేపచెట్టు మళ్లీ ఎండిపోతోంది
సాక్షి, హైదరాబాద్: వేపకు మళ్లీ ఫంగస్ సవాల్ విసురుతోంది. గతేడాది ఆగస్టు–సెప్టెంబర్ మాసాల్లో వేపకొమ్మల చివర్లు మాడిపోయి.. చూస్తుండగానే చెట్టు మొత్తం ఎండిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడూ సరిగ్గా అదే సమయంలో వేపచెట్ల చివర్లు ఎండిపోవటం మొదలైంది. దీంతో ఈ ఫంగస్ సమస్య వేపచెట్ల పాలిట సీజనల్ దాడిగా మారనుందనే నిపుణుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం పది రోజులుగా నగర శివారుల్లో, శంషాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ ప్రాంతాల్లో వేపచెట్ల కొమ్మ చివరి భాగాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. అయితే గతేడాది స్థాయిలో తీవ్రత లేకున్నా, కొన్ని ప్రాంతాల్లో ఈ ఎండిపోతున్న తీరు వేగంగా విస్తరిస్తోంది. మళ్లీ అదే ఫంగస్ వ్యాప్తి? గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికిపైగా వేపచెట్ల కొమ్మలు ఎండిపోయాయి. వీటిలో 10 శాతం చెట్లు నిలువునా ఎండిపోయాయి. కానీ ఔషధ వృక్షమనే పేరున్న వేపచెట్లు తమను తాము కాపాడుకుని.. ఉగాదికల్లా మళ్లీ చిగురించాయి. మురికినీళ్లు నిరంతరం నిలిచే ప్రాంతాలు, మొదలు వద్ద కాంక్రీట్ చేసిన ప్రాంతాల్లోని చెట్లు మాత్రం ఎండిపోయాయి. వేపను సాధారణంగా ఆశించే టిమస్కిటో బగ్ అనే పురుగు కాటువేయటం, ఆ ప్రాంతం నుంచి ‘పోమోస్సిస్ అజాడిరెక్టే’ అనే ఫంగస్ లోపలికి ప్రవేశించి చెట్లు ఎండిపోయేలా చేసినట్టు నిపుణులు గుర్తించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం సంచాలకుడు జగదీశ్వర్ ఆధ్వర్యంలో నిపుణులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎండిన వేపకొమ్మలు తెచ్చి పరిశోధించారు. వివిధ పరీక్షల్లో పోమోప్సిస్ అజాడిరెక్టే ప్రభావం చాలా ఎక్కువుందని, ప్యుజేరియం, కర్వులేరియా అనే ఫంగస్‌లు సోకాయని తేలింది. వీటి నివారణకు కొన్ని మందులను సూచిస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. మళ్లీ పరీక్షలు ప్రారంభం ఇప్పుడు మళ్లీ వేపకొమ్మలు ఎండిపోతున్న నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు శంషాబాద్ సమీపంలోని కొన్ని చెట్ల నమూనాలను సేకరించి కల్చర్ పరీక్షలు చేస్తున్నారు. ఫిర్యాదులొచ్చిన మిగతా ప్రాంతాల నుంచి కూడా నమూనాలు సేకరిస్తున్నామని పరిశోధన విభాగం సంచాలకుడు జగదీశ్వర్ సాక్షితో చెప్పారు. ‘వాతావరణంలో ఫంగస్‌లు కలిసిపోయినప్పుడు తదుపరి సంవత్సరాల్లోనూ అవి మళ్లీ ప్రభావం చూపుతాయి. కొన్నిచోట్ల చెట్లు ఎండిపోవటానికి ఇదే కారణం కావచ్చు. ఈ నెలలో సమస్య విస్తరిస్తే, ఈసారీ ఫంగస్ ప్రభావం ఉన్నట్టేనని భావించాల’ని వివరించారు. -
భానుడి భగభగ.. అనూహ్యంగా పెరిగిన ధర.. కేజీ 160.. చరిత్రలో తొలిసారి!
ఈ ఏడాది నిమ్మ రైతుల పంట పండింది. అనూహ్యంగా ధరలు పెరుగుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సీజన్లో కేజీ రూ.140 నుంచి రూ.160 వరకు పలికింది. ధరలు బాగుండడంతో అప్పుల ఊబి నుంచి బయట పడుతున్నామంటూ అన్నదాతలు సంతోషంగా చెబుతున్నారు. సాక్షి,గూడూరు/సైదాపురం: నిమ్మ ధరలు పసిడి ధరలను తలపిస్తున్నాయి. చరిత్రలో ఇప్పటివరకూ రాని ధరలు ఆదివారం పలికాయి. లూజు బస్తా కనిష్టంగా రూ.11 వేల నుంచి గరిష్టంగా రూ.13 వేల వరకూ చేరింది. కిలో రూ.140 నుంచి రూ.160 వరకూ ధర పలికింది. అదేవిధంగా పండ్లకు రూ.110 నుంచి రూ.130 వరకూ రావడంతో రైతుల ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో వారంరోజుల నుంచి నిమ్మ మార్కెట్లో ఆశించిన మేర ధరలు వస్తుండడంతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆపిల్ ధర కన్నా నిమ్మ ధరలే అధికంగా ఉన్నాయంటూ సంతోషంగా చెబుతున్నారు. కాపు లేకపోవడంతోనే.. ఒక్క రోజులో ఢిల్లీ మార్కెట్‌కు కాయలు తీసుకొచ్చే దూరంలో ఉన్న భావానగర్‌లో, మహారాష్ట్రలోని బీజాపూర్‌లో, మన రాష్ట్రంలోని రాష్ట్రంలోని తెనాలి, ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో కాపు లేకపోవడంతోనే ఈ ధరలు నమోదువుతున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. అలాగే మన ప్రాంతంలో తీవ్ర వర్షాల కారణంగా ఆలస్యంగా పూత ఆలస్యమైంది. ఇలా అనేక అంశాలు కలిసి రావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మూడేళ్లగా ఈ సీజన్లో నిమ్మకాయలకు విపరీతమైన ధరలు వస్తుండడంతో రైతులు నష్టాల ఊబి నుంచి బయటపడున్నారు. మంచి డిమాండ్ గూడూరు, పొదలకూరు నిమ్మ మార్కెట్లకు ఢిల్లీ మార్కెట్ గుండెలాంటిదని చెబుతుంటారు. అక్కడ ధరలు బాగా పలుకుతుంటేనే ఇక్కడి నిమ్మ మార్కెట్ కళకళలాడుతుంది. అటు నార్త్ ఢిల్లీ, సౌత్ చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి రెండు రోజులుగా కాయలు కావాలంటూ స్థానిక మార్కెట్లలోని వ్యాపారులను అడుగుతున్నారు. ఎప్పుడూ చూడలేదు నిమ్మకాయల ధరలు ఇప్పటి వరకూ ఈ స్థాయిలో పలికింది లేదు. నాకు తెలిసే కాకుండా, మా పెద్దల కాలంలో కూడా ఇలా ధరలు రాలేదు. 2009లో లూజు బస్తా గరిష్టంగా రూ.9 వేలు పలికితే అబ్బో అన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలు కొన్నాళ్లు నిలబడితే చాలు. – జగన్నాథం, రైతు, వెంకటేశుపల్లి ఆనందంగా ఉన్నాం నిమ్మ ధరలు ఇప్పటి వరకూ ఇంత పలికిందే లేదు. జగనన్న పాలనలో రైతులే రాజులుగా మారారు. అందుకు నిదర్శనమే నిమ్మకాయల ధరలు ఈ స్థాయికి చేరడం. కాయలుంటే ధరల్లేక, ధరలుంటే కాయల్లేక ఇబ్బందులు పడే నిమ్మరైతుల కష్టాలు తేరినట్లే.. చాలా ఆనందంగా ఉన్నాం. – వజ్జా అనిల్‌రెడ్డి, రైతు, వెందోడు -
వేపకూ ‘ఉగాది’
సాక్షి, హైదరాబాద్: వేప చెట్లు మంచు ముత్యాలతో నిండినట్టు తెల్లటి పూతతో కళకళలాడుతున్నాయి. చైత్రమాసం ముంగిట ఇలా ఇవి కొత్త శోభను సంతరించుకోవటం సహజం. కానీ, ఈసారి దీనికో ప్రత్యేకత ఉంది. సరిగ్గా 4 నెలల కిందట వేప పరి స్థితి వేరు. ఉంటుందా లేదా అన్నంత ప్రమాదంలో పడిందా వృక్ష జాతి. కానీ.. నిలువెల్లా ఔషధ గుణాలను ఇముడ్చుకున్న వేప భయంకరమైన శిలీంద్ర దాడిని ఎదుర్కొంది. చిగుళ్లు, ఆకులు, కొమ్మలు.. క్రమంగా వాడి, ఎండిపోతూ చెట్టు నిలువెల్లా మాడిపోయే పరిస్థితిని అధిగమినించింది. చైత్రం ముంగిట ఆ చెట్టుకు మరో‘ఉగాది’ప్రారంభమైంది. కొత్త సంవ త్సరం వేళ షడ్రుచుల ఉగాది పచ్చడిలో తన ప్రత్యేకతను నిలుపుకొనేందుకు సిద్ధమైంది. పూతతో పునరుజ్జీవ కళ ఫోమోస్సిస్ అజాడిరక్టేగా పిలిచే డై–బ్యాక్ వ్యాధి వేపను ప్రభావితం చేసింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వేపకు సోకిన ఈ వ్యాధి తెలంగాణలో గతేడాది ఆగస్టులో ప్రవేశించింది. తొలుత గద్వాల ప్రాంతంలో రిపోర్టు అయింది. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పాకి నవంబర్ చివరి నాటికి ఉధృతమైంది. గాలిద్వారా ప్రబలిన ఈ శిలీంద్రం దాదాపు అన్ని వేపచెట్లకు సోకింది. కొమ్మల చివర్లలో ప్రారంభమై క్రమంగా చెట్టు అన్ని ప్రాంతాలకు పాకుతూ ఆకులు మాడిపోయేలా చేసింది. శాస్త్రవేత్తలు దీనిని అతితీవ్ర వ్యాధిగా గుర్తించారు. దీంతో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వం దృష్టికి తెచ్చి, వెంటనే దాని నివారణకు పిచికారీ చేయాల్సిన మందులను సూచించింది. కానీ స్వతహాగా కీటక నాశని లక్షణాలున్న వేప.. జనవరి చివరి నాటికి శిలీంద్ర ప్రభావా న్ని తగ్గించుకోగలిగింది. వాతావరణంలో వచ్చి న మార్పులతో శిలీంద్రం క్రమంగా బలహీనపడింది. దీంతో పుంజుకున్న వేప మరొకసారి నిండుగా పూత పూసి పునరుజ్జీవ కళను సంతరించుకుంది. చనిపోయిన చెట్లు ఒక శాతంలోపే.. డై–బ్యాక్‌కు గురైన వేప చెట్లు క్రమంగా పుంజుకుని పూర్వ వైభవానికి చేరుకుంటున్నాయని, ఇప్పట్లో వాటికి మళ్లీ ప్రమాదం ఉండకపోవచ్చని అగ్రి వర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. డై–బ్యాక్‌కు గురైన చెట్లలో దాదాపు ఒక శాతం చెట్లు డిక్లైన్ (క్షీణత) బారినపడ్డట్టు గుర్తించారు. వాటిల్లో దాదాపు 0.7 శాతం చెట్లు ఈపాటికే చనిపోయాయని, మిగతావి కూడా కోలుకునే పరిస్థితి ఉండకపోవచ్చని వర్సిటీ పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ ‘సాక్షి’తో చెప్పారు. డై–బ్యాక్‌కు గురై కోలుకునే చెట్లకు కావాల్సిన పోషకాలు సకాలంలో అందాల్సి ఉంటుంది. కానీ చెట్ల చుట్టూ నీటిని పీల్చుకునేందుకు అవాంతరం కలిగించేలా కాంక్రీట్ చేసి ఉండటం, మురికినీరు నిరంతరం చుట్టూ నిలిచి ఉండటం లాంటివి చెట్లు చనిపోవటానికి ఎక్కువ కారణమవుతున్నాయని గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. పరీక్షల్లో కానరాని శిలీంద్రం.. వేప డై–బ్యాక్‌కు గురైన సమయంలో చాలా ప్రాంతాల నుంచి చెట్ల నమూనాలు సేకరించి వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ల్యాబ్‌లో కల్చర్ టెస్టులు నిర్వహించారు ఇందులో చాలా రకాల శిలీంద్రాలు గుర్తించా రు. కానీ నాలుగైదు రకాలు ఎక్కువగా ఉన్న ట్టు తేలింది. ఇప్పుడు శిలీంద్రాన్ని జయించిన చెట్ల నుంచి మళ్లీ నమూనాలు సేకరించి వారం కింద మళ్లీ పరీక్షించారు. ఈసారి వాటిపై శిలీంద్రాల అవశేషాలు కనిపించలేదని పేర్కొన్నారు. పూత పూర్తిగా సురక్షితమే శిలీంద్ర ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో వేపపై పిచికారీ చేయాల్సిన రసాయనాలను మేం సూచించాం. కానీ ఇప్పుడు వేప పూర్తిగా కోలుకుంది. దాని పూత కూడా పూర్తిగా సురక్షితమే. ఉగాది పచ్చడిలో నిరభ్యంతరంగా వినియోగించొచ్చు. ఈ సమయంలో వేపచెట్లపై పురుగుమందుల పిచికారీ చేయకూడదు. అది పర్యావరణం, ఇతర జంతువులపై ప్రభావం చూపుతుంది. – జగదీశ్వర్, అగ్రి వర్సిటీ పరిశోధన విభాగం సంచాలకులు -
వేప చెట్లకు హోమియో చికిత్స
Homeopathy Treatment For Neem Trees: వేప చెట్లు డై బ్యాక్ అనే శిలీంద్ర సంబంధమైన తెగులుతోపాటు టీ మస్కిటో అనే దోమ దాడికి గురవుతున్నాయి. కొన్ని చోట్ల చిగుర్లు ఎండిపోతే, మరికొన్ని చోట్ల నిలువునా వేప చెట్లు ఎండిపోతున్నాయి. సేంద్రియ, పకృతి వ్యవసాయంలో చీడపీడల నియంత్రణలో కీలకపాత్ర నిర్వహించే వేప చెట్లను కోల్పోతే భవిష్యత్‌లో భారీ నష్టాలుంటాయి. ఈ సమస్య నివారణకు హోమియో మందులు ఉపయోగపడతాయని ప్రసిద్ధ హోమియో వైద్యులు డా. అంబటి సురేంద్ర రాజు, భువనగరి సమీపంలోని రామచంద్రాపురంలోని అమేయ కృషి వికాస కేంద్రం రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి తెలిపారు. వేప చెట్లను రక్షించుకోవడానికి ఈ కింది రెండు మందులను వేర్వేరుగా పిచికారీ చేయాలి. రెంటినీ కలిపి చల్లకూడదు. క్యూప్రమ్ మెట్ 200 (CUPRUM METALLICUM 200) ద్రవ రూప హోమియో మందును, ఈ కింద చెప్పిన విధంగా ఆ మోతాదులో, పిచికారీ చేస్తే టీ మస్కిటో దోమ నశిస్తుంది. దీన్ని పిచికారీ చేసిన రెండు రోజుల తర్వాత కొక్సీనెల్లా 200 (COCCINELLA SEPTEMPUNCTATA 200) అనే ద్రవ రూప హోమియో మందును, ఈ కింద చెప్పిన విధంగా ఆ మోతాదులో, నీటిలో కలిపి వేప చెట్లపై పిచికారీ చేయడం లేదా చెట్టు మొదలు చుట్టూ పాదు చేసి పొయ్యొచ్చు. ముందుగా చెట్టు చుట్టూ పాదును మామూలు నీటితో నిండుగా తడిపిన తర్వాత.. మందు కలిపిన నీరు చెట్టుకు పది లీటర్లయినా సరిపోతుంది. చెట్టు మరీ పెద్దదైతే ఇరువై లీటర్ల వరకూ పోసుకోవచ్చు. ఒక దఫా ఈ రెండు మందులు వాడిన తర్వాత.. 8 రోజులు వేచి చూడండి. అవసరం అనుకుంటే మరోసారి వాడండి. హోమియోపతి మందు వాడే విధానం 20 లీటర్ల నీటికి 2.5 మిల్లీ లీటర్ల (ఎం.ఎల్.) మోతాదులో హోమియో మందును కలిపి వాడాలి. ఒక లీటరు సీసా లేదా ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని అందులో సగం వరకు నీరు నింపుకోవాలి. అందులో 2.5 మిల్లీలీటర్ల (ఎం.ఎల్.) మందు కలిపి, మూత బిగించి, 50 సార్లు గట్టిగా కుదుపుతూ ఊపాలి. ఆ తర్వాత ఆ మందును స్ప్రేయర్ ట్యాంకులో పోసుకొని, 20 లీటర్ల నీరు నింపి, పిచికారీ చేసుకోవాలి. -
చేదు వేపకు.. చెడ్డ రోగం!
సాక్షి, హైదరాబాద్: పురుగులు, కీటకాలను నివారించేందుకు, మరెన్నో సమస్యలకు మందుగా వాడే వేప చెట్లను.. ఓ చిన్న కీటకం, మూడు శిలీంద్రాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. చెట్లను నిలువునా మాడ్చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఏ ఊళ్లో చూసినా వేపచెట్ల కొమ్మలు ఎండిపోతున్నాయి. అప్పటివరకు బాగున్న చెట్లు కూడా.. చిగుళ్లు, ఆకులు, కొమ్మలు వరుసగా ఎండిపోయి నిట్టనిలువుగా మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో.. వ్యవసాయ విశ్వవిద్యాలయం రంగంలోకి దిగింది. వర్సిటీ పరిశోధన విభాగం సంచాలకుడు జగదీశ్వర్ ఆధ్వర్యంలో నిపుణులు టి.కిరణ్‌బాబు, జి.ఉమాదేవి, ఎన్.రామ్‌గోపాల్‌వర్మల బృందం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేపకొమ్మలు సేకరించి పరిశీలించింది. తెగులు సోకిన భాగాలను ల్యాబ్‌లో పరీక్షించి సమస్యకు కారణాలను గుర్తించింది. వేపచెట్లను కాపాడే చర్యలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కానీ ప్రభుత్వ పరంగా చర్యలేమీ లేకపోవటంతో రోజురోజుకు వేప చెట్లు మాడిపోతూనే ఉన్నాయి. కీటకం కొరికి.. శిలీంద్రాలు (ఫంగస్) ఆశించి.. వేపకొమ్మల చివరిభాగంలో టిమస్కిటో బగ్ అన్న కీటకం కొరికి రసాన్ని పీల్చడంతో ఈ సమస్య మొదలైందని పరిశోధకులు గుర్తించారు. ఈ కీటకాలు ముందునుంచే ఉన్నా.. దానికితోడుగా కొన్నిరకాల శిలీంద్రాలు వ్యాపించడంతో సమస్య ముదిరిందని తేల్చారు. వేపచెట్లపై టిమస్కిటో బగ్ కొరికేసి రసం పీల్చడంతో ఆ ప్రాంతంలోని చిగుళ్లు ఎండిపోవటం మొదలవుతోంది. అదేచోట కొన్నిరకాల శిలీంద్రాలు పాగా వేసి.. మెల్లగా విస్తరిస్తూ చెట్టు నిలువునా మాడిపోయేలా చేస్తున్నాయి. ఇందులో ‘ఫోమోప్సిస్ అజాడిరెక్టే’ అన్న శిలీంద్రం తీవ్ర విధ్వంసానికి కారణమవుతోందని గుర్తించారు. వ్యవసాయ వర్సిటీ పరిశోధన బృందం చేసిన కల్చర్ టెస్టుల్లో మూడొంతులకుపైగా ఈ శిలీంద్రమే కనిపించింది. ఆ తర్వాత ఫ్యుజేరియం, కర్వులేరియా అనే ఫంగస్‌లు ప్రభావం చూపుతున్నట్టు తేలింది. ఇవి కాకుండా మరో ఏడెనిమిది రకాల ఫంగస్‌లు కనిపించినా.. అవి నామమాత్రంగానే ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. వేప చెట్ల కొమ్మలపై కనిపిస్తున్న జిగురు మచ్చలు ఈ ఫంగస్ల వల్ల ఏర్పడినవేనని తెలిపారు. వాడాల్సిన కీటకనాశనులివీ.. కీటకాలను నిర్మూలించేందుకు.. ప్రతి లీటర్ నీటిలో థయోమెథాక్సమ్ 0.2 గ్రాములు, అసిటామిప్రిడ్ 0.2 గ్రాముల చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. శిలీంద్రాల తెగులును నాశనం చేసేందుకు కార్బండాజిమ్, మ్యాంకోజెబ్‌ల మిశ్రమాన్ని ప్రతి లీటర్‌కు 2.5 గ్రాముల చొప్పున కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. ఆ వేపపుల్లలు వాడొచ్చు శిలీంద్రాలు ఆశించిన వేప చెట్లు ఎండిపోతున్న నేపథ్యంలో.. చాలాచోట్ల వేపపుల్లలతో పళ్లు తోముకునేందుకు జనం జంకుతున్నారు. అయితే వాటి నుంచి మనుషుల ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదని, మాడినంత మేర తొలగించి మిగతా పుల్లలతో పళ్లు తోముకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జామ చెట్లపైనా ప్రభావం ఈ శిలీంద్రాలు వేపకే పరిమితం కాకుండా కొన్ని ఇతర రకాల చెట్లపైనా కనిపిస్తున్నట్టు నిపుణులు తాజాగా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో జామకాయలపై పెద్దపెద్ద మచ్చలు ఏర్పడుతున్నాయన్న ఫిర్యాదులు వచ్చాయని.. వాటిని పరిశీలించగా ఈ శిలీంద్రాల ప్రభావమేనని తేలిందని అనురాగ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రస్తుతం జామకాయలపైనే ఈ సమస్య ఉందని, ఆ చెట్లపై ఇంకా ప్రభావం కనిపించలేదని పేర్కొన్నారు. మరోవైపు కానుగ చెట్లకు కూడా ఈ సమస్య వస్తోందని ఏజీ వర్సిటీ నిపుణులు చెప్తున్నారు. -
వేపా.. వేపా.. ఎందుకు ఎండుతున్నావ్?
సాక్షి, హైదరాబాద్: కాలుష్యం జడలు విప్పుతోంది. ఫలితంగా జీవవైవిధ్యం దెబ్బతింటోంది. అనూహ్య వాతావరణ మార్పులు అనంతజీవరాశి మనుగడపై ప్రభావం చూపుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం దేన్నీ వదలడం లేదు. చీడపీడలకు విరుగుడుగా ఉపయోగపడే చెట్లు కూడా క్రమంగా కొత్త వ్యాధులు, తెగుళ్ల బారిన పడుతున్నాయి. చిన్నపిల్లలకు అమ్మవారు పోస్తే అది నయం కావడానికి వేప ఆకులు, వేపమండలపై వారిని పడుకోబెట్టడం, వేపాకులు, పసుపునీళ్లతో స్నానం చేయించడం వంటి వి చేయిస్తుంటారు. అలాంటి వేప చెట్టుకు సాధారణంగా రోగాలు, తెగుళ్లు దరిచేరవనేది జనంలో ఒక అభిప్రాయం ఉంది. అయితే ఇటీవల వేపచెట్టుకు తెగుళ్లు ఏర్పడటంతో ఆకులు, కొమ్మలు ఎండిపోవడం, కొన్నిచోట్ల గోధుమ వర్ణంలోకి మారడం కనిపిస్తోంది. ఇలా తెగుళ్లు సోకి మూడునెలల్లోనే వేపచెట్టు నిర్జీవంగా తయారవుతోంది. జీవాయు«ధంగా పేరు గాంచిన వేపచెట్లు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో చీడపీడలు, తెగుళ్ల బారిన పడి మాడిపోతున్నాయి. ముఖ్యంగా తేయాకు తోటల్లో కనిపించే తెగులు ఈ వేపచెట్లపై దాడి చేస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. వివిధ రకాల ఫంగస్‌లతో... మలేరియా, ఫంగస్, వైరల్ జ్వరాలపై పోరాడేతత్వమున్న వేపచెట్లను కొత్తగా ‘ట్విగ్ బ్లైట్ అండ్ డై బాక్’, ‘టీ మస్కిటో బగ్’తదితర ఫంగల్ వ్యాధులు అతలాకుతలం చేస్తున్నాయి. గాలి ద్వారా ఓ రకమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందడం వల్ల ఇది వేగంగా విస్తరిస్తున్నట్టుగా వెల్లడైంది. సాధారణంగా తేయాకు తోటల్లో కనిపించే ‘టీ మస్కిటో బగ్’తెగుళ్లు, ఫంగస్ వ్యాధులు ఇప్పుడు వేపచెట్లపై ప్రతాపం చూపుతున్నాయి. ఈ తెగుళ్లకు కారణమైన ఈ కీటకాల జీవితకాలం 25–32 రోజులు మాత్రమే. ఇవి కోకొవా, అల్లనేరేడు, చింత, మిరియాలు, పత్తి, చెక్క, తదితర రకాలను సైతం ప్రభావితం చేస్తున్నాయి. ఔషధ విలువలున్న వేపచెట్లను కాపాడుకుని పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కనిపిస్తున్న విధంగా డైబ్యాక్ డిసీజ్ విస్తృతంగా వ్యాప్తి చెం దితే వేపచెట్లు తీవ్రంగా ప్రభావితమౌతాయని తెలంగాణ వ్యవసాయ వర్సిటీ బాటనీ అధ్యాపకులు, వ్యవసాయ పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. చీడపీడలు, తెగుళ్లు సోకిన మేరకు వేప కొమ్మలను నరికి బాబిస్టిన్‌ను పిచికారి చేయడం లేదా గోరింటాకును ముద్దగా చేసి నరికిన కొమ్మలకు అంటించడం ద్వారా వీటి వ్యాప్తిని నియంత్రించి చెట్టు అవసాన దశకు చేరకుండా అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు. వేప చెట్లను కాపాడండి: గూడూరు రాష్ట్రంలో అంతుచిక్కని తెగులు, వ్యాధితో ఎండిపోతున్న వేపచెట్లను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలోని పలుచోట్ల వేపచెట్లు, వాటి ఆకులు, కొమ్మలు ఎండిపోయి పసుపు, గోధుమ రంగులోకి మారుతూ క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేపచెట్లు చాలా ఔషధ విలువలు కలిగి ఉన్నందున పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘గత మూడు రోజుల్లో తమ ఇంటి ప్రాంగణంలో మూడు వేప చెట్లు అకస్మాత్తుగా ఎండిపోయాయి’అని పేర్కొన్నారు. అటవీ శాఖ తక్షణమే ముందుకు వచ్చి ఈ పరిణామాలకు గల కారణాలను గుర్తించాలని కోరారు. హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ గాలిని శుద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న వేపచెట్లను సంరక్షించడం లేదని, వేప చెట్లను సంరక్షించకుంటే హరితహారం కార్యక్రమం వృథా అని పేర్కొన్నారు. -
Corona: వేపచెట్ల కిందే చికిత్స... ప్రాణం నిలుస్తోంది!
లక్నో : మారుమూల ప్రాంతాల్లోని కరోనా బాధితులకు చికిత్స అందించడం కష్టతరంగా మారింది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, ఆస్పత్రులు లేక, డాక్టర్లు ట్రీట్మెంట్ చేయకపోవడంతో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఓ రిమోట్ ఏరియాకు చెందిన కరోనా బాధితులు ఆర్ఎంపీ డాక్టర్ల సాయంతో చెట్లకిందే ట్రీట్మెంట్ చేయించుకొని ప్రాణాలతో బయటపడుతున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం.. మారుమూల గ్రామాల్లో సరైన వైద్యు సదుపాయాలు లేకపోవడంతో.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జేవార్ జిల్లాకు చెందిన కరోనా బాధితులు చెట్లకిందే కరోనా చికిత్స చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆక్సిజన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధితులు వేపచెట్లు ఉన్న స్థలాన్నే కరోనావార్డులుగా మార్చుకుంటున్నారు. స్థానికంగా ఉండే ఆర్ఎంపీ డాక్టర్ల సాయంతో ట్రీట్మెంట్ చేయించుకొని ప్రాణాల్ని కాపాడుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే బాధితులకు ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన వెంటనే వేపచెట్ల కింద మంచాలపై పడుకుటుంటున్నారు. దీంతో వెంటనే ఆక్సిజన్ లెవల్స్ పెరిగి ఉపశమనం లభిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మాజీ ప్రెసిడెంట్ యోగేశ్ తలన్ మాట్లాడుతూ.. "మాకు సరైన వైద్య సదుపాయాలు లేవు. కరోనా వచ్చిందని టెస్టులు చేయించుకుందామంటే ఆస్పత్రులు లేవు. అందుకే మేమంతా ఆరుబయట చెట్లకిందే కరోనాకు చికిత్స చేయించుకుంటున్నాం. ఎవరికైనా ఆక్సిజన్ సమస్య ఎదురైతే వేపచెట్ల కిందనే పడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆక్సిజన్ లెవల్స్ పెరిగినట్లు చాలా మంది చెబుతున్నారు’’ అని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో వైద్యసదుపాయాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. చదవండి : అయ్యో నా కూతురు చనిపోయింది సార్, మీకు డ్రామాలా ఉందా? -
పసుపు మయం, నిమ్మకాయల మాల
-
మాకు ఊపిరి పోస్తారా..?
సాక్షి, వనపర్తి : వేపచెట్లను బతికించుకోవడంపై అధికారుల్లో ఇంకా చలనం రావడం లేదు.. ‘ఔషధ గనికి ముప్పు’ శీర్షికన వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలం కంభాళాపురంలో వేపచెట్లు మాత్రమే ఎండిపోతున్నాయని ‘సాక్షి’లో జనవరి 5న ప్రచురించిన కథనానికి కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం శాస్త్రవేత్తలు స్పందించారు. మరునాడే గ్రామాన్ని సందర్శించి వేపచెట్లకు సోకిన వైరస్‌ను తెలుసుకునేందుకు కొమ్మలు, ఆకులు, కాండం బెరడు సేకరించి ల్యాబ్ పంపించారు. అదేరోజు తెగులును అదుపు చేసేందుకు కార్బన్ డజిం అనే ఫెస్టిసైడ్ మందు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. సర్పంచ్ రాజవర్ధన్‌రెడ్డి గ్రామస్తులతో సమాలోచన చేసి కొన్ని చెట్లకు పిచికారీ చేయగా.. అవి మళ్లీ పచ్చని ఆకులను చిగురిస్తోంది. పత్రికల్లో వార్త వచ్చిన నాలుగైదురోజులు హడావుడి చేసిన స్థానిక పాలకులు, అధికారులు తర్వాత మళ్లీ చెట్ల విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకుని ఎంతో దూరం నుంచి పనివదులుకు వచ్చిన శాస్త్రవేత్తలు చేసిన సూచనలు, సలహాలు పాటించి ఉంటే ఎండినట్లు గుర్తించిన సుమారు 2 వేల చెట్లు ఇప్పటికే మళ్లీ చిగురించేవి. కానీ, స్థానిక అధికారులు, పాలకులు నామమాత్రపు చర్యలతో మమా అనిపించడంతో కొన్ని చెట్లు మాత్రమే పూర్వవైభవాన్ని సంతరించుకుని పచ్చని ఆకులను చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. హరితహారంపై ఉన్న ధ్యాస.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటి ఫొటోలకు ఫోజులిచ్చే అధికారులు, పాలకులు దశాబ్దాల నాటి వేలాది చెట్లను రక్షించుకునే విషయంలో ఎందుకు చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకే గ్రామంలో సుమారు రెండు వేల చెట్లు ఎండిపోతున్నాయి, శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనలు పాటిస్తే వాటన్నింటినీ బతికించుకోవచ్చు. ఈ విషయమై కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. డిప్లోడియా ఫంగస్‌గా గుర్తింపు కంభాళాపురంలో వేపచెట్లకు వచ్చిన వైరస్ డిప్లోడియా ఫంగస్‌గా శాస్త్రవేత్తలు గుర్తించారు. పలుమార్లు గ్రామాన్ని సందర్శించి చెట్లకు పిచికారీ చేసే మందుల పేర్లు, ఎక్కడ లభిస్తుంది.. ఎలా వాడాలనే విషయంపై సూచనలు చేశారు. సకాలంలో స్పందించనందుకే.. సకాలంలో స్పందించి మందు పిచికారీ చేసినందుకే.. కొన్ని వేపచెట్లు మళ్లీ చిగురించాయి. లేదంటే వైరస్ పక్కనున్న గ్రామాలకు పాకేది. ఎండిన చెట్లలో కొన్ని వందల ఏళ్ల క్రితం నాటివి కూడా ఉన్నాయి. వాటికి ప్రాణం పోసిన తృప్తి చాలా ఆనందాన్ని ఇస్తోంది. – రాజేంద్రకుమార్‌రెడ్డి, కేవీకే శాస్త్రవేత్త 13 చెట్లకు పిచికారీ చేశాం గ్రామానికి శాస్త్రవేత్తలు వచ్చి పరీక్షలు చేసి మందు నీటిలో కలిపి పిచికారీ చేయమన్నారు. ఆలయం వద్ద, ప్రధాన కూడళ్లలో ఉన్న 13 చెట్లకు కార్బన్‌డజిం మందును నీటిలో కలిపి పిచికారీ చేయడంతో అవన్నీ మళ్లీ చిగురించాయి. మిగతా వాటికి పిచికారీ చేయలేదు. వాటంతట అవే బతికే అవకాశం ఉంది. – రాజవర్ధన్‌రెడ్డి, సర్పంచ్, కంభాళాపురం -
వేపతో లాభాలెన్నో!
తుగ్గలి: వేప..వ్యవసాయంలో రైతన్నకు నేస్తం. పంటల్లో వేప సంబంధిత ఉత్పత్తులను వాడి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించవచ్చు. పంటలకు రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు, కీటకాలను నాశనం చేసే గుణాలు ఇందులో ఉన్నాయని పరిశోధనల్లో రుజువైంది. వేప ఉత్పత్తులను పంటల్లో, ధాన్యం నిలువల్లో తదితర వాటిల్లో వాడే విధం, లాభాలను వ్యవసాయ అధికారి కృష్ణ కిషోర్ రెడ్డి (8886613960) సూచించారు. వేప ఆకులు: ఎండిన వేప ఆకులు లేదా పొడిని కలిపితే నిల్వ చేసిన ధాన్యానికి పురుగులు పట్టవు. వేపాకుల కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనె సంచులకు పురుగులు చేరవు. వేపాకులు పొలంలో ఎరువుగా వేస్తే పోషకాలతో పాటు, వ్యాధినిరోధక శక్తి కలిసి వస్తాయి. వేప గింజలు..: వేప గింజల్లో 0.3 నుంచి 0.6 శాతం అజాడివిక్టిన్ అనే మూల పదార్థం ఉంటుంది. ఇది ఘాటైన చేదు రుచి, వాసన కలిగిస్తుంది. ఈ మందులు వాడిన పైరుపై పురుగులు వాలవు, గుడ్లు పెట్టే శక్తి తగ్గిపోతుంది. గుడ్లు పెట్టినా లార్వా దశలో రావాల్సి మార్పులు రాకుండా సంతతి తగ్గిపోతుంది. క్రమేణా పురుగులు నశిస్తాయి. పంటలకు మేలు చేస సహజ శత్రువులకు హాని కలుగజేయవు. వేప గింజల కషాయం 10 కిలోల వేప గింజల పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక రోజంతా నానబెట్టాలి. ఈ ద్రావణానికి 2 కిలోల సబ్బుపొడి వేసి కలియబెట్టిన తరువాత వడగట్టాలి. వచ్చిన కషాయాన్ని పైరుపై పిచికారీ చేస్తే తెల్లదోమ, ఆకుముడుత పురుగులను సమర్థవంతంగా ఆరికట్టవచ్చు. తొలి దశలో చిన్న గొంగలి పురుగు, కాయ తొలుచు పురుగును అరికట్టే అవకాశం ఉంది. నూనె తీయగా మిగిలిన పిండిని నీటిలో కలిపి ద్రావణం చేసుకోవచ్చు. 10 కిలోల పిండిని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక వారం పాటు నానబెట్టి తరువాత తేటను వేరుచేసి మొక్కలపై పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వేప చెక్క (వేప పిండి) ఇది మైలేన చిక్కటి సేంద్రియ ఎరువు. గింజ నుంచి తీసివేసిన వేప పిండిలో 5.2 శాతం నత్రజని, 11 శాతం భాస్వరం, 1.5 శాతం పొటాష్ ఉంటుంది. ఇది ఎరువుగానే కాకుండా సస్యరక్షణకు ఉపయోగపడుతుంది. వేప పిండి ఎకరాకు 150–200 కిలోలు వాడాలి. ఇది కొన్ని బ్యాక్టీరియా తెగుళ్లను నివారిస్తుంది. నులి పురుగులను అదుపులో ఉంచుతుంది. వేప పిండిలో కలిపి యూరియాను వాడినపుడు నత్రజని నెమ్మదిగా తగ్గుతుంది. వేపపిండి 40 కేజీల ప్యాకెట్ రూ.200లకు మార్కెట్లో లభిస్తుంది. వేప నూనె..: పంటలపై పిచికారీ చేయడం వల్ల కాయతొలుచు, రసం పీల్చు పురుగుల్ని అదుపు చేయవచ్చు. ఒక లీటరు వేప నూనెకు 200 లీటర్ల నీరు, 200 గ్రాముల సబ్బుపొడి (సర్ఫ్) కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. ఇది ఒక ఎకరాలో పిచికారీ చేయడానికి సరిపోతుంది. నూనె, నీరు కలువదు కావున ముందుగా సబ్బు పొడి వేసి బాగా కలిపి నురగ వచ్చిన తరువాత నీటిలో కలిపి వేయాలి. -
మూత్రపిండ కేన్సర్‌కు ‘వేప’ మందు!
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండ సంబంధిత (రెనల్) కేన్సర్‌కు మన వేపతో చికిత్స చేయవచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు చెప్పారు. వేప చెట్టు నుంచి తీసిన రసాయనాల్లో నాలుగు రసాయనాలు కేన్సర్ కణాలను చంపగలుగుతున్నాయని తమ పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు. ‘రసాయన పరిశోధనల్లో ప్రకృతి స్ఫూర్తి’ అన్న అంశంపై సోమవారం ఐఐసీటీలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఐఐసీటీ 70వ వార్షికోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సు మూడు రోజులపాటు జరగనుంది. ఈ సందర్భంగా ఐఐసీటీ శాస్త్రవేత్త ఎస్.చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడారు. అద్భుతమైన ఔషధంగా వేప గొప్పతనం కొత్త కానప్పటికీ.. రెనల్ కేన్సర్‌ను నియంత్రించేందుకూ వేప ఉపయోగపడుతుందని తాము గుర్తించామని ఆయన చెప్పారు. ప్రకృతి సిద్ధమైన అనేక రసాయనాలను, వాటి తయారీ ప్రక్రియలను అనుకరించేందుకు ఐఐసీటీలో విసృ్తత ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రెనల్ కేన్సర్‌కు చికిత్సతోపాటు, వయసుతో వచ్చే మతిమరపు (అల్జీమర్స్) నివారణకు ‘గాలంథమైడ్’ అనే సహజ రసాయనం ఉపయోగపడుతుందని గుర్తించామన్నారు. ఈ అంశాలపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థలైన మ్యాక్స్‌ప్లాంక్ ఇన్స్టిట్యూట్, డార్ట్మండ్ యూనివర్సిటీ, మేయో క్లినిక్‌లతో కలసి పనిచేస్తున్నామని చంద్రశేఖర్ వివరించారు. కాగా.. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ గోవర్ధన్ మెహతా స్వాగతోపన్యాసం చేశారు. రానున్న కాలంలో సుస్థిర అభివృద్ధికి తోడ్పడే పరిశోధనలకు ఐఐసీటీ కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీకాంతం, మాజీ డెరైక్టర్లు ఎ.వి.రామారావు, జె.ఎస్.యాదవ్, ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు. -
మీరు భూమి సొత్తా? భూమి మీ సొత్తా?
వివేకం మీరు పుట్టినప్పుడు, మీ శరీరం ఎంతుండేది? ఇప్పుడెంతైంది? అది పెరగడానికి ఏం చేశారు? ఆహారం ఇచ్చారు. ఆహారం ఎక్కడి నుండి లభించింది? ఈ నేల నుండి. మీరు తిన్న ప్రతి పండు, కాయ ఈ మట్టితో, నీటితో తయారైనవే కదా! మాంసాహారి అయితే మీరు తినే మేక, కోడి కూడా ఈ మట్టిలో లభించినదాన్నే తిని పెరిగాయి. కనుక ప్రధానంగా ఈ మట్టి వల్లనే మీ శరీరం తయారైంది. అంటే ఈ శరీరానికి మట్టి చేర్చి, చివరకు దాన్ని ‘నేను’ అంటున్నారు. ఒక పాత్రలో నీరున్నది. అదీ, మీరూ ఒకటేనా? కాదనే అంటారు. ఆ నీటిని తాగేయండి. అది మీ శరీరంలో కలిసిపోగానే, దాన్ని ఏమంటారు? ‘నేను’ అనే కదా! అంటే ఏదైనా మీ ‘అనుభూతి’లోకి రావడాన్నే ‘మీరు’ అని భావిస్తారు. బయట ఉన్న నీరు, నేల, గాలి, వేడి.. వీటితోనే సృష్టింపబడ్డారని తెలుసా? అవి మీలో ఒక భాగమైన పిమ్మట, వాటిని వేరుచేసి చూడటం వీలు పడదు కాబట్టి, మొత్తం ‘నేను’ అంటున్నారు. అంటే కొంత ఆ మట్టి మీ రూపంలో శ్వాస వదులుతున్నది. ఇంకొంత మట్టి మీ తోటలో ఎత్తుగా ఎదిగిన చెట్టుగా ఉన్నది. మరికాస్త మట్టి మీరు కూర్చున్న కుర్చీగా మారిపోయింది. ఇదే మట్టి కాలచక్రంలో మామిడిచెట్టుగా, వేప చెట్టుగా, గడ్డిగా, పువ్వుగా, వానపాముగా, మనిషిగా పలురకాల అవతారాలను ధరిస్తోంది. మీ ఆలోచనా విధానాన్ని బట్టి చూసినా అది నిజమే! మీరు ఊదిన బెలూన్‌లో మీ ఊపిరి గాలి దాగి ఉంది. బెలూన్ పగిలి, అది బయటికి పోగానే, మీలోని ఒక భాగం, బయటి గాలిలో కలిసిపోయినట్లే కదా! సూక్ష్మంగా చెప్పాలంటే, ఈ ప్రపంచంలో మీరొక భాగమై ఉన్నట్లే. ఈ ప్రపంచం కూడా మీలో ఒక భాగమేనని అర్థం చేసుకున్నారా? దీన్ని బుర్ర ఉపయోగించి అర్థం చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అంతరంగంలో అది స్ఫురిస్తే, అదే ఆధ్యాత్మికం! అంతేకాని, ఆధ్యాత్మికం అంటే గుళ్లకు వెళ్లి టెంకాయలు కొట్టడం కాదు. కొవ్వొత్తి వెలిగించడమూ కాదు. మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థించడమూ కాదు. దీన్ని అర్థం చేసుకుంటే, దేవుడి కోసం ఎదురు చూడకుండా, మీ స్వర్గాన్ని మీరే నిర్మించుకోగలరు. ఒక యోగి మరణశయ్య మీదున్నాడు. తన శిష్యులకు తాను స్వర్గానికి పోవడానికి నిశ్చయించుకున్నట్లు తెలిపాడు. ‘‘దేవుడి మనసులో ఏముందో నాకు తెలియదు. నా మనసులో ఏముందో నాకు తెలుసు. మిగతావాళ్లు నరకం అనుకునే ప్రదేశానికి నన్ను పంపినా, దాన్ని కూడా స్వర్గంగా భావించడం నాకు తెలుసు,’’ అన్నాడా యోగి. నిజమే! మీ అంతరంగం దేన్నైనా స్వర్గంగా మార్చవచ్చు. లేదా నరకంగా చేయవచ్చు. అది బాహ్య స్థితి వల్ల కాదు. మీరూ మీ పక్కనున్నదీ ఒకటే అని తెలుసుకోగలిగారంటే- తర్వాత ఎవరి మీద ఈర్ష్యపడతారు! అసూయ పడతారు! ఎవరితో కొట్లాడుతారు? ఎవరితో పోటీ చేస్తారు? ఎవరితో శత్రుత్వం పెంచుకుంటారు? ఆ అనుభవం వచ్చిన పిమ్మట, బయట పరిస్థితులెలా ఉన్నా అంతరంగంలో మీకు ఎప్పుడూ స్వర్గమే! సమస్య - పరిష్కారం ఇలా అడుగుతున్నందుకు క్షమించండి. ఈ మధ్య అనేక మంది గురువుల గురించిన వార్తలు విన్న తరువాత ఇలా అడగాలని అనిపిస్తోంది. మీరు దేవుడిని చూశారా? - రామాంజనేయులు, నల్గొండ సద్గురు: ‘నేను దేవుడిని చూశానా?’ అని మీరు అడుగుతున్నారంటే, అది భూతకాలాన్ని సూచిస్తోంది. నేనెప్పుడూ దేవుడిని చూస్తూనే ఉన్నాను. నాకు దేవుడు తప్ప మరేమీ కనిపించడం లేదు. నేను దేవుడినే చూస్తున్నాను. మీరు దేవుడని అనేది సృష్టికి మూలమైనది. అవును కదూ? మీరు ఒక జీవిని చూడదలచుకుంటే అందుకు ఎన్నో మార్గాలున్నాయి. మీ శరీరాన్ని చూడవచ్చు. మీ మాటల ద్వారా మీ మనసుని చూడవచ్చు లేక మీలో సృష్టికి మూలంగా ఉన్న మౌలికమైనదాన్ని చూడవచ్చు. ఈ రోజు ఉదయం మీరు దోశలు తిన్నారు. సాయంత్రం అయ్యేసరికి అది కాస్తా మనిషి శరీరంగా మారిపోయింది. అంటే సృష్టి మీలోనే పనిచేస్తోందన్న మాట. అంటే, సృష్టికి మూలం, అంటే మీరు చెప్పే సృష్టికర్త లేక మీరు చెప్పే దేవుడు మీలో నుంచే పని చేస్తున్నాడన్నమాట. దాన్ని మీరు చూడగలరా, చూడలేరా అన్నదే ఇక్కడ ప్రశ్న. జీవితంలోని ప్రతిక్షణం, దానిని నేను నాలోనే చూడగలుగుతున్నాను. చుట్టుపక్కల ఉన్న ప్రతిదానిలోనూ చూడగలుగుతున్నాను. నేను దేవుడిని చూశానా? ఇది ఓ ప్రశ్నే కాదు. నేను ఎప్పుడూ దేవుడిని చూస్తూనే ఉన్నాను.