సంతానలేమి సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? - ఒక సోదరి
మన జీవనశైలిలో వచ్చిన మార్పుల ప్రభావం ప్రత్యుత్పత్తిపై కూడా పడుతోంది. మహిళల విషయానికి వస్తే... సాధారణంగా సంతానం పొందడానికి 18 నుంచి 30 ఏళ్ల వయసు చాలా అనుకూలమైనది. కానీ ఇటీవల అనేక కారణాల వల్ల పెళ్లిలు ఆలస్యం కావడంతో సంతానం పొందడం అన్నది 30 - 40 ఏళ్ల వయసులో చాలా ఎక్కువగా జరుగుతోంది. ఇలా ఆలస్యం అవుతున్న కొద్ది ప్రత్యుత్పత్తి సమస్యలు ఎక్కువ కావచ్చు.
సంతాన లేమికి కారణాలు: హార్మోన్ల అసమతౌల్యత... మహిళల్లో కనిపించే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, ఎఫ్‌ఎస్‌హెచ్, ఏఎమ్‌హెచ్ వంటి హార్మోన్ల అసమతౌల్యం, మెదడులోని పిట్యుటరీ గ్రఃతి సరిగా పనిచేయకపోవడం.
గర్భాశయ కారణాలు: ఫైబ్రాయిడ్, పాలిప్స్, అడినోమయొసిస్ లేదా ఎండోమెట్రియాసిస్ వల్ల రుతుక్రమంలో అధిక రక్తస్రావం, మధ్యలో చుక్కల మాదిరిగా స్రావం, రుతుక్రమాల మధ్య నిడివి తక్కువ కావడం వంటి సమస్యలు అండాశయ కారణాలలో పీసీఏడి వంటి సమస్యలు, వయసు పెరుగుతున్న కొద్ది అండాశయాలలోని అండం ప్రామాణికత (సైజ్, క్వాలిటీ) తగ్గడం, అండాశయాలు కుంచించుకుపోవడం, అండాల సంఖ్య తగ్గడం
ట్యూబ్‌లలో సమస్య: పీఐడీ లేదా టీబీ వంటి వ్యాధుల వల్ల ట్యూబ్స్ మూసుకుపోవడం క్రోమోజోమల్/జెనెటిక్ కారణాలు. లక్షణాలు: రుతుక్రమం సరిగా రాకపోవడం, మధ్యలో రక్తస్రావం కనిపించడం, రెండు పీరియడ్స్ మధ్య నిడివి తగ్గడం, పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి గర్భనిరోధక మాత్రలు మానేసిన 6 -10 నెలల తర్వాత కూడా రుతుక్రమం సరిగా రాకపోవడం పీసీఓడీ వల్ల కలిగే అధిక బరువు, అవాంఛిత రోమాలు, 2 - 3 నెలల్లో రుతుక్రమాలు ఆగిపోవడం... ఈ లక్షణాలు కనిపించిన వారు ఆలస్యం చేకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
చికిత్స: హార్మోన్ల అసమతౌల్యత నుంచి మొదలుకొని లక్షణాలను బట్టి జన్యుపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియోలో సంతానలేమి సమస్యకు చికిత్స చేయవచ్చు.