ప్రతీకాత్మక చిత్రం
Winter Care Tips: స్నానానికి వేణ్ణీళ్లా? చన్నీళ్లా? ఇదేం ప్రశ్న లేదా పనికి మాలిన సందేహం? ఎవరికి ఎలా ఇష్టం అయితే అలా స్నానం చేస్తారు అని ముఖం చిట్లించకండి. ఎందుకంటే స్నానానికి ఎప్పుడూ వేడినీళ్లకే లేదా ఎప్పుడూ చన్నీళ్లకే ప్రాధాన్యత ఇవ్వడం కొందరికి అలవాటు. అది ఒకందుకు మంచిదే.
అయితే, ఎంత చలికాలం అయినా, చన్నీళ్లతోనే స్నానం చేయడం లేదా ఎంత వేసవిలో అయినా వేడినీళ్లతోనే స్నానం చేయడం అంత మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు. మరయితే ఏ నీటితో స్నానం చేయడం మంచిదో తెలుసుకుందామా?
రెండూ అపోహలే
దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు చన్నీళ్ల స్నానమే మంచిదంటారు. మరికొందరు వేడివేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల అలసట తీరిపోయి హాయిగా అనిపిస్తుందంటారు. నిజానికి ఈ రెండూ సరయినవి కావు. రెండూ అపోహలే. స్నానానికి నీళ్లు మరీ చల్లగా ఉండకూడదు.
మరీ వెచ్చగా ఉండకూడదు. గోరువెచ్చని నీళ్లతో చేసే స్నానమే ఒంటికి ఆరోగ్యకరం. ఇక బలహీనంగా ఉన్నవాళ్లు, వయసుపైబడిన వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో కానీ స్నానం చేయవద్దు.
అవి వేణ్ణీళ్లయినా, చన్నీళ్లయినా... వీలయినంత వరకు పొద్దున్నే ఏమీ తినకముందే స్నానం చేయడం మంచిది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల స్నానానికి ముందే తినాల్సివచ్చినా... కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు.
ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత కనీసం అర్ధగంట అయినా వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది.
ఒకవేళ మీరు చిన్నప్పట్నుంచీ చన్నీళ్ల స్నానమే చేస్తూ వస్తున్నారా? లేదా మీ వృత్తిరీత్యా వేరే ఊళ్లలో ఉండటం వల్ల వేణ్ణీళ్లు పెట్టుకోవడం సాధ్యం కావడం లేదా? ఇలా మరీ చన్నీళ్ల స్నానమే చేయడం తప్పకపోతే... స్నానం వ్యవధిని వీలైనంత కుదించండి. నీళ్లు ఎంత చల్లగా ఉంటే... స్నానం వ్యవధి అంతగా తగ్గాలన్నమాట.
చన్నీళ్లతో లేదా వేణ్ణీళ్లతో స్నానం చేశాక ఒకవేళ తలనొప్పి లేదా జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే... అవి (చన్నీళ్లు / వేణ్ణీళ్లు) మీకు అంతగా సరిపడవని గుర్తించి, ఆ మేరకు గోరువెచ్చని నీటికి షిఫ్ట్ అవ్వండి.
చదవండి: Hema Malini: మొహానికి అరోమా ఆయిల్‌తో మసాజ్.. నా బ్యూటీ సీక్రెట్ అదే!
Saina Nehwal: తన మొహం కూడా చూడనంటూ పెదవి విరుపులు! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా..
Comments
Please login to add a commentAdd a comment