హెల్త్ టిప్స్
►నీళ్ళలో తులసి ఆకులు వేసి మరిగించి, ఆ తర్వాత మరిగిన తులసి నీటిని కాస్త చల్లార్చి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
► కొంచెం గోరువెచ్చని నీళ్లలో కరక్కాయ పొడిని కలుపుకుని తాగినా, కరక్కాయ ముక్క బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉన్నాపొడి దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
► అర టీ స్పూన్ సొంఠి పొడి లో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకున్నా దగ్గు నుంచి రిలీఫ్ లభిస్తుంది.
► టీ స్పూన్ తేనెలో 1 టీ స్పూన్ అల్లం రసం, 1 టీ స్పూన్ దానిమ్మరసం మూడింటిని బాగా కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకి 2 లేదా మూడు సార్లు చేస్తే రిజల్ట్ మీకే తెలుస్తుంది.
► రెండు, మూడు రోజుల పాటు రెండు మిరియాల గింజలు, మెలమెల్లగా నములుతూ, ఆ రసం మింగితే దగ్గు తగ్గుతుంది.
► సీతాఫలం విత్తనాలు, ఆకులు మెత్తగా నూరి పట్టిస్తే, పేలు పోతాయి.
► అరటిపండు, తేనెతో కలిపి తీసుకంటే క్షయవ్యాధిగ్రస్తులకు మంచిది.
► నేరేడు ఆకులు నీటిలో మరిగించి, వడగట్టి, ఆ నీటిని పుక్కిలిస్తే నోటిపూతలు తగ్గుతాయి.
► వేప చెట్టు బెరడును పెనంపై బాగా కాల్చి, మెత్తగా పొడి చేయాలి. ఆ పొడికి కొద్దిగా కొబ్బరి నూనె చేర్చి, కురుపులపై రాస్తే ఉపశమనం వుంటుంది. ∙వేపాకు రసం, దానికి సమాన భాగంలో పెరుగు జోడించి, కాస్త నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది.
మీకు తెలుసా?
►వంట పూర్తయిన తర్వాత అంట్లను కొందరు వంటింటి షింకులోనే అలా ఉంచేస్తుంటారు. అలా చేయకండి. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడమో లేకపోతే బయట వేసుకోవడమో చేయండి. సింకులో గిన్నెలు పడి ఉండటం వల్ల వాటిలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రావడం ప్రారంభం అవుతుంది. వాటిని వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
►సాధారణంగా చాలా మంది వంటింట్లోనే చెత్త డబ్బాను పెట్టుకుంటుంటారు. ఒకటి రెండు రోజులు గనుక అది అలాగే ఉండిపోతే సూక్ష్మ జీవులు చేరి కంపు రావడం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏ రోజుకారోజు చెత్తను తీసివేయండి. వెసులుబాటు ఉంటే గనుక అసలు దీన్ని వంటింటి బయట వైపు ఏర్పాటు చేసుకోవడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment