ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు మొత్తం నశిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. ఎలాంటి ఆహారాలు వేడి చేసి తినడం వల్ల నష్టం ఏమిటో తెలుసుకుందాం.
►చాలామంది నాన్ వెజ్ ఫుడ్‌ని ఫ్రిజ్‌లో స్టోర్ చేసి తర్వాత వేడి చేసి తింటూ ఉంటారు. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
► చాలామంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఉదయం వేడి చేసి తింటారు. అలాగని ఉదయం మిగిలిన దానిని రాత్రికి వేడి చేసి తినడం మంచిదనుకోకండి. అది కూడా మంచి పద్ధతి కాదు. కొన్ని నివేదికల ప్రకారం అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే ఫుడ్ పాయిజన్ జరుగుతుందని తేలింది.
► గుడ్లని ఆమ్లెట్ వేసుకొని, ఉడకబెట్టుకొని తింటారు. కొన్నిసార్లు వీటితో కూరలు కూడా వండుతారు. గుడ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే గుడ్లు వండిన వెంటనే తినడం మంచిది. ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసిన తర్వాత తినకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
► మైక్రోవేవ్ ఓవెన్‌లో కాఫీని మళ్లీ వేడి చేయడం దాదాపుగా అందరూ చేస్తుంటారు. ఈ విషయం తెలిస్తే ఆ పని అస్సలు చేయరు. ఎందుకంటే కాఫీ చల్లబడినప్పుడు ఆమ్లంగా మారుతుంది. ఇది గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. దానికంటే కాఫీని థర్మో-ఫ్లాస్క్‌లో నిల్వ చేయండి. నచ్చినప్పుడు సిప్ చేయండి.
► చికెన్‌ని రోండోసారి ఉడికిస్తే అందులో మాంసకృత్తులు నశిస్తాయి.
► పుట్టగొడుగులను వండిన వెంటనే తినాలి. ఎక్కువసేపు నిల్వ ఉంచడం, రీహీట్ చేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల ప్రొటీన్లు విచ్ఛిన్నమై జీర్ణసంబంధిత సమస్యలు, ఇతరత్రా అనారోగ్యాలకు దారితీయొచ్చు.
► చేపలను మళ్లీమళ్లీ వేడి చేయడం వల్ల దాని మృదుత్వం మొత్తం పోయి పొడిగా మారుతుంది.
► ఆకుపచ్చ కూరగాయలు ఆకుపచ్చ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో నైట్రేట్ కూడా ఉంటుంది. ఇలాంటి కూరగాయలతో వండిన వంటకాలని వేడి చేసినప్పుడు అవి క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఈ తప్పు అస్సలు చేయకూడదు.
Comments
Please login to add a commentAdd a comment