మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరాలో లోపం ఏర్పడినప్పుడు తాత్కాలికంగా స్పృహ కోల్పోతారు. దీన్నే మూర్ఛపోవడం అంటారు. వైద్యభాషలో దీన్ని సాధారణంగా "పాసింగ్ అవుట్" అని సూచిస్తారు.మూర్ఛలో మూడు రకాలు ఉన్నాయి (వాసోవగల్ సింకోప్, కరోటిడ్ సైనస్ సింకోప్, సిట్యుయేషనల్ సింకోప్).వీటిలో కొన్ని ప్రాణాపాయమైనవి. మరి మన చుట్టూ ఎవరైనా మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలన్నది ఇప్పుడు చూద్దాం.
మూర్ఛ/ఫిట్స్ తరచూ వచ్చేవాళ్లలో కొన్ని లక్షణాలు ఉంటాయి. శరీరం వీక్ అయిపోవడం, మైకం కమ్మేయడం, "బ్లాకింగ్ అవుట్/వైటింగ్ అవుట్" కూడా అనుభవిస్తారు. అసలు మూర్ఛ రావడానికి గల సాధారణ కారణాలు ఏంటంటే..
- భయం లేదా భావోద్వేగ గాయం,ఒత్తిడి.
- తీవ్రమైన నొప్పి,విశ్రాంతి లేకపోవడం.
- లోబీపీ, డీహైడ్రేషన్
- మధుమేహం
- గుండె జబ్బు
- దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (ఎంఫిసెమా)
- హైపర్వెంటిలేషన్
- ఎక్కువ సేపు ఒకే భంగిమలో నిలబడటం.
- ప్రేగు కదలిక సమయంలో తీవ్రమైన ఒత్తిడి
- కొన్ని మందులు లేదా ఆల్కహాల్ తీసుకోవడం
తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా?
అప్పటివరకు ఉల్లాసంగా గడిపిన వాళ్లు ఫిట్స్‌తో అల్లాడిపోతుంటారు. దీంతో ఏం చేయాలో తెలియక చుట్టూ ఉన్నవాళ్లు కూడా గందరగోళానికి గురవుతుంటారు. ఆ సమయంలో ఫిట్స్‌తో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి చేతిలో తాళాల గుత్తి ఉంచడం, ఇనుముతో తయారుచేసిన వస్తువులను ఉంచడం, ఉల్లిపాయ వాసన చూపించడం వంటివి చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల ఫిట్స్ ఆగిపోతాయనుకుంటారు. ఐరన్ మెదడులోని అలజడిని కంట్రోల్ చేసి ఫిట్స్‌ను తగ్గిస్తుందని నమ్ముతారు. కానీ వాస్తవానికి ఇది అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. సాధారణంగానే ఫిట్స్ లేదా మూర్ఛ అనేది ఎపిసోడ్‌ల రూపంలో వస్తాయి. ఇవి 1-2 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండవు. ఈ సమయంలో మీరు ఏం చేసినా, చేయక పోయినా దానంతటవే ఆగిపోతాయి. దీన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అని పిలుస్తారు. ఒకవేళ ఇది ఐదు నిమిషాల కంటే ఎక్కవు సేపు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలి?
►ముందుగా చేయవలసినది భయాందోళనలకు గురికాకూడదు. పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే పాదాలను రబ్ చేస్తుండాలి. దీనివల్ల చర్మం చల్లబడకుండా ఉంటుంది.
► మూర్ఛపోయిన వ్యక్తిని వెనుకవైపు పడుకోబెట్టడం లేదా అతని/ఆమె మోకాళ్ల మధ్య తాళం వేసి కూర్చోబెట్టడం లాంటివి చేయాలి.
► ఎవరైనా కిందపడిపోతే అది ఫిట్స్ అని అనుకోకుండా ముందుగా గాయలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. అప్పటికి ఆ వ్యక్తిలో కదలిక లేకపోతే వారి కాళ్లను గుండె నుంచి సుమారు 12 అంగుళాలు (30CM) పైకి లేపడం వల్ల రక్తప్రవాహం ఆగకుండా ఉంటుంది. వ్యక్తి శ్వాస తీసుకోవడం ఆపివేసినట్లయితే, వెంటనే CPR చేయండి.
► షేక్ చేయడం, అరవడం: కొన్నిసార్లు గాయం కారణంగా వ్యక్తులు సడెన్ షాక్‌కి గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఆ వ్యక్తుల పేరు తెలిస్తే గట్టిగా వాళ్ల పేరు పిలుస్తూ తట్టండి. శరీరాన్ని షేక్ చేయడం వల్ల స్పృహను తిరిగి పొందడానికి సహాయపడుతుంది.
మూర్ఛ వ్యాధిపై అవగాహన కలిగి ఉండటం ద్వారా మీరు అలాంటి వ్యక్తులను రక్షించిన వారు అవుతారు.
- నవీన్ నడిమింటి
ఆయుర్వేద నిపుణులు
ఫోన్ -9703706660
Comments
Please login to add a commentAdd a comment