Epilepsy disease
-
మూర్ఛకు శాశ్వత పరిష్కారం
సాక్షి, విశాఖపట్నం: వైద్య రంగాన్ని కలవరపెడుతున్న మూర్ఛ (ఎపిలెప్సీ) రోగానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని అంతర్జాతీయ మూర్ఛరోగ నిపుణుడు, క్లీవ్‌ల్యాండ్ ఎపిలెప్సీ సెంటర్ న్యూరో డైరెక్టర్ డాక్టర్ ఇమద్ ఎం నజ్మ్ చెప్పారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (ఐయాన్‌కాన్)–2024 సదస్సులో కీలకోపన్యాసం చేసేందుకు విశాఖ వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. కొన్ని దేశాల్లో మూర్ఛ రోగానికి శస్త్రచికిత్సలు చేసినా.. ఫలితాలు మాత్రం రాబట్టుకోలేకపోతున్నామన్నారు. నాడీ సంబంధిత వ్యాధులు పరిష్కరించడంలో ఇంకా వందేళ్లు వెనకబడే ఉన్నామన్నారు. ఎపిలెప్సీపై పరిశోధనలు వేగవంతమవుతున్నాయని తెలిపారు. ఆయన ఏమన్నారంటే.. ప్రతి ఆరుగురిలో ఒకరికి నరాల సమస్యప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతుండటం కలవరపెట్టే అంశం. ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్ల మంది మూర్ఛతో జీవిస్తున్నారు. 10 లక్షల మంది మెసియల్ టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీతో బాధపడుతున్నారు. మెదడులో వైకల్యాలు అని పిలిచే మూర్ఛ రోగం వైద్య రంగంలో క్లిష్టంగా మారుతోంది.మెదడు అధ్యయనం అంటే.. అది మూర్ఛ కావచ్చు, అల్జీమర్స్ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, పార్కిన్సన్ కావచ్చు. నాడీ సంబంధిత వ్యాధులు ఇటీవల ఎక్కువయ్యాయి. వయసుతో పాటు ఈ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. 75 ఏళ్లు పైబడిన ప్రతి 100 మందిలో 15 మందికి మూర్ఛ రోగం ప్రమాదకరంగా మారే అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకే మూర్ఛ వంటి నాడీ సంబంధిత వ్యాధులపై పరిశోధనలు విస్తృతం చేస్తున్నాం.శస్త్ర చికిత్సల్లో మూడొంతులు విఫలం మూర్ఛకు శస్త్రచికిత్స అంటూ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నారు. అంటే మెదడులోని టెంపోరల్ లోబ్‌కు సంబంధించిన భాగాన్ని తొలగించడం మూర్ఛకు ఉన్న ఏకైక శస్త్రచికిత్స. ఇది అంత విజయవంతం కాదు. ఇప్పటివరకు చేసిన ఈ తరహా చికిత్సల్లో మూడొంతులు విఫలమవుతున్నాయి. మందుల ద్వారా కూడా అంత ఫలితాలు రావడం లేదు. మూర్ఛ రోగం వచ్చిన ప్రతి 100 మందిలో 90 శాతం రోగులు మందులు వాడుతున్నారు. వీరిలో కేవలం 44 శాతం మందికే ఫలితాలు దక్కుతున్నాయి.అమెరికా పరిశోధనలు సఫలీకృతంఅమెరికాలో ఎపిలెప్సీపై 2007 నుంచి పరిశోధనలు కొనసాగుతున్నాయి. 2007లో లేజర్ థెరపీకి అనుమతి లభించింది. 2013లో న్యూరో స్టిమ్యులేషన్, 2018లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్), 2019లో హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అ్రల్టాసౌండ్ ద్వారా మూర్ఛకు కారణాలపై పరిశోధనలు చేసేందుకు అనుమతి లభించింది. ఇది విజయవంతమయ్యే దిశగానే పరిశోధనలు ముందుకు సాగుతున్నాయి. అయితే.. నాడీ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి, రోగ నిర్ధారణ చేయడంఅనేది వైద్య ప్రపంచానికి పెద్ద సవాల్‌గా మారింది. హృద్రోగాల్ని ఎలాగైతే ముందుగానే పసిగట్టే వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందో.. అదేవిధంగా నాడీ వ్యవస్థకు సంబంధించిన వైద్య పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 2050 నాటికి న్యూరో సంబంధిత వ్యాధులకు సంబంధించి సంపూర్ణ చికిత్స వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. -
చేతిలో తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా? వాస్తవమిదే
మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరాలో లోపం ఏర్పడినప్పుడు తాత్కాలికంగా స్పృహ కోల్పోతారు. దీన్నే మూర్ఛపోవడం అంటారు. వైద్యభాషలో దీన్ని సాధారణంగా "పాసింగ్ అవుట్" అని సూచిస్తారు.మూర్ఛలో మూడు రకాలు ఉన్నాయి (వాసోవగల్ సింకోప్, కరోటిడ్ సైనస్ సింకోప్, సిట్యుయేషనల్ సింకోప్).వీటిలో కొన్ని ప్రాణాపాయమైనవి. మరి మన చుట్టూ ఎవరైనా మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. మూర్ఛ/ఫిట్స్ తరచూ వచ్చేవాళ్లలో కొన్ని లక్షణాలు ఉంటాయి. శరీరం వీక్ అయిపోవడం, మైకం కమ్మేయడం, "బ్లాకింగ్ అవుట్/వైటింగ్ అవుట్" కూడా అనుభవిస్తారు. అసలు మూర్ఛ రావడానికి గల సాధారణ కారణాలు ఏంటంటే.. భయం లేదా భావోద్వేగ గాయం,ఒత్తిడి. తీవ్రమైన నొప్పి,విశ్రాంతి లేకపోవడం. లోబీపీ, డీహైడ్రేషన్ మధుమేహం గుండె జబ్బు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (ఎంఫిసెమా) హైపర్వెంటిలేషన్ ఎక్కువ సేపు ఒకే భంగిమలో నిలబడటం. ప్రేగు కదలిక సమయంలో తీవ్రమైన ఒత్తిడి కొన్ని మందులు లేదా ఆల్కహాల్ తీసుకోవడం తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా? అప్పటివరకు ఉల్లాసంగా గడిపిన వాళ్లు ఫిట్స్‌తో అల్లాడిపోతుంటారు. దీంతో ఏం చేయాలో తెలియక చుట్టూ ఉన్నవాళ్లు కూడా గందరగోళానికి గురవుతుంటారు. ఆ సమయంలో ఫిట్స్‌తో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి చేతిలో తాళాల గుత్తి ఉంచడం, ఇనుముతో తయారుచేసిన వస్తువులను ఉంచడం, ఉల్లిపాయ వాసన చూపించడం వంటివి చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల ఫిట్స్ ఆగిపోతాయనుకుంటారు. ఐరన్ మెదడులోని అలజడిని కంట్రోల్ చేసి ఫిట్స్‌ను తగ్గిస్తుందని నమ్ముతారు. కానీ వాస్తవానికి ఇది అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. సాధారణంగానే ఫిట్స్ లేదా మూర్ఛ అనేది ఎపిసోడ్ల రూపంలో వస్తాయి. ఇవి 1-2 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండవు. ఈ సమయంలో మీరు ఏం చేసినా, చేయక పోయినా దానంతటవే ఆగిపోతాయి. దీన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అని పిలుస్తారు. ఒకవేళ ఇది ఐదు నిమిషాల కంటే ఎక్కవు సేపు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలి? ►ముందుగా చేయవలసినది భయాందోళనలకు గురికాకూడదు. పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే పాదాలను రబ్ చేస్తుండాలి. దీనివల్ల చర్మం చల్లబడకుండా ఉంటుంది. ► మూర్ఛపోయిన వ్యక్తిని వెనుకవైపు పడుకోబెట్టడం లేదా అతని/ఆమె మోకాళ్ల మధ్య తాళం వేసి కూర్చోబెట్టడం లాంటివి చేయాలి. ► ఎవరైనా కిందపడిపోతే అది ఫిట్స్ అని అనుకోకుండా ముందుగా గాయలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. అప్పటికి ఆ వ్యక్తిలో కదలిక లేకపోతే వారి కాళ్లను గుండె నుంచి సుమారు 12 అంగుళాలు (30CM) పైకి లేపడం వల్ల రక్తప్రవాహం ఆగకుండా ఉంటుంది. వ్యక్తి శ్వాస తీసుకోవడం ఆపివేసినట్లయితే, వెంటనే CPR చేయండి. ► షేక్ చేయడం, అరవడం: కొన్నిసార్లు గాయం కారణంగా వ్యక్తులు సడెన్ షాక్‌కి గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఆ వ్యక్తుల పేరు తెలిస్తే గట్టిగా వాళ్ల పేరు పిలుస్తూ తట్టండి. శరీరాన్ని షేక్ చేయడం వల్ల స్పృహను తిరిగి పొందడానికి సహాయపడుతుంది. మూర్ఛ వ్యాధిపై అవగాహన కలిగి ఉండటం ద్వారా మీరు అలాంటి వ్యక్తులను రక్షించిన వారు అవుతారు. - నవీన్ నడిమింటి ఆయుర్వేద నిపుణులు ఫోన్ -9703706660 -
మూర్ఛ వ్యాధి.. ఎప్పుడు, ఎక్కడ వస్తుందోనని భయపడేదాన్ని: నటి
కాంతా లగా... పాటతో 20 ఏళ్ల వయసులో ఓవర్‌నైట్ స్టార్ అయింది షెఫాలీ జరీవాలా. 1972లో వచ్చిన పాటకు ఇది రీమిక్స్‌గా తెరకెక్కింది. ఈ పాట సూపర్ క్లిక్ అవడంతో తర్వాత ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్‌లో మెరిసింది షెఫాలీ. కానీ జనం మాత్రం ఆమెను కాంతా లగా బ్యూటీగానే గుర్తుపెట్టుకున్నారు. ఆ మధ్య హిందీ బిగ్‌బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొంది నటి. తాజాగా ఈ నటి బాల్యంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. '15 ఏళ్ల వయసులో మొదటిసారి నాకు మూర్ఛ వచ్చింది. అందరూ నన్ను అదోలా చూసేవారు. ఆ వ్యాధి నన్ను పదేళ్లపాటు వెంటాడింది. మూర్ఛ వ్యాధితో జీవించడమనేది ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. అంత చిన్న వయసులో నేనొక నిస్సహాయురాలిగా ఫీలయ్యానో లేదో కానీ ఆత్మస్థైర్యంతో మాత్రం ఉండకపోయేదాన్ని. నేను ఎదుగుతున్నకొద్దీ నా ముందు మరిన్ని సవాళ్లు ప్రత్యక్షమయ్యాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ సడన్‌గా మూర్ఛ వస్తుందేమోనన్న భయం ఎప్పుడూ నాపై ఒత్తిడి పెంచేది. కాంతా లగా షూటింగ్ చేస్తున్నప్పుడు, ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు ఫిట్స్ వస్తుందేమోనని భయంతో వణికిపోయేదాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితులు చక్కదిద్దుకున్నాయి. మెడిసిన్స్ పుణ్యమా అని 15 ఏళ్లుగా నాకు మూర్ఛ రావడం లేదు. మానసికంగా, శారీరకంగా ఎంతో ధృడంగా ఉన్నాను. ఉత్తమ జీవితం గడుపుతున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా షెఫాలీ.. ముజే షాదీ కరోగే సినిమాలో నటించింది. నాచ్ బలియే 5, 7 సీజన్స్‌లోనూ మెరిసింది. -
చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపించినా.. ఉన్నట్టుండి కిందపడిపోయి
చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తూ దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నట్లుండి కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉండటం మనలో చాలా మంది గమనించి ఉంటాం. ఇలా కింద పడి ఉన్న వ్యక్తుల చేతిలో తాళం చెవులు పెడితే కాసేపటికి తేరుకుని మళ్లీ ఏమీ జరగనట్లు వెళ్లిపోతూ ఉంటారు. దీనినే వాడుకభాషలో వాయి అని పిలుస్తారు. వ్యవహారికభాషలో మాత్రం మూర్చగా పేర్కొంటారు. వైద్యపరిభాషలో ఫిట్స్ లేదా ఎపిలెప్సీగా చెబుతారు. నవంబర్ 17న జాతీయ మూర్ఛ వ్యాధి అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజీ విభాగానికి ప్రతి వారంలో సోమ, గురువారాల్లో రెండు రోజులు ఓపీ నిర్వహిస్తారు. ఇక్కడికి ప్రతి ఓపీ రోజున 250 మంది దాకా చికిత్స కోసం వస్తారు. ఈ లెక్కన నెలకు సగటున 2వేల మంది, ఏడాదికి 24వేల మంది ఓపీలో వైద్యం తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఒక ప్రొఫెసర్ డాక్టర్ సి. శ్రీనివాసులు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ. శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సౌజన్య, డాక్టర్ శ్యామసుందర్ సేవలందిస్తున్నారు. వచ్చిన రోగుల్లో 20 శాతానికి పైగా మూర్ఛవ్యాధిగ్రస్తులే ఉంటున్నారు. జనాభాలో ఒక శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల అంచనా. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 45 వేల మందికి పైగా బాధితులు ఉన్నట్లు అంచనా. ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో ప్రస్తుతం ఐపీ సేవలతో పాటు ఈఈజీ మిషన్ సేవలు కూడా లభిస్తున్నాయి. ఏడాదికి 15 వేల మందికి ఈఈజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటుగా ఈ పరీక్ష చేయించుకోవాలంటే ఒక్కొక్కరికి రూ.2వేలు ఖర్చవుతుంది. అవసరమైన వారికి ఎంఆర్ఐ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇంకా ఈఎంజీ, ఐసీయూ ఏర్పాటైతే ఈ విభాగానికి అవసరమైన పీజీ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వీరితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోని న్యూరాలజిస్టులు మరో 15 మంది దాకా ఉన్నారు. వీరి వద్ద కూడా నెలకు మరో 900 మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారు. ఇక నాటు మందులను ఆశ్రయించే వారు వీరికి రెట్టింపు సంఖ్యలో ఉంటారు. మూర్ఛల్లో రకాలు–లక్షణాలు సాధారణ మూర్చలో మొత్తం మెదడు చాలా వరకు దెబ్బతింటుంది. టానిక్ క్లోనిక్‌లో ఆకస్మికంగా స్పృహ కోల్పోవచ్చు. రోగిపడిపోవడం, దీంతో పాటు చేతులు, కాళ్లు కొట్టుకోవడం చేస్తారు. అబ్సెన్స్ లేక సెటిల్ మాలో మూర్ఛలో స్పృహ స్వల్పకాలంపాటు కోల్పోతారు. ఈ దశలో రోగి కొంత కాలం పాటు శూన్యంలోకి చూస్తూ ఉంటారు. మయోక్లోనిక్ మూర్ఛలో ఆకస్మిక, సంక్లిప్త కండరాలు సంకోచాలు సంభవిస్తాయి. ఇవి మొత్తం శరీరమంతా లేదా కొన్ని భాగాలకు సంభవిస్తాయి. అటోనిక్ మూర్ఛలో ఆకస్మిక విచి్ఛన్నం సంభవిస్తుంది. ఆ తర్వాత తక్షణమే కోలుకుంటారు. సరళమైన ఫోకల్ మూర్ఛలో రోగికి చేతులలో, కాళ్లలో కండరాల లాగుట కనిపిస్తుంది. లేదా వినికిడి, దృశ్యం, వాసన, రుచిలో ఆటంకం కలగవచ్చు. సంక్లిష్ట ఫోకల్ మూర్ఛలో రోగి స్పృహ కోల్పోతాడు. రోగికి విచిత్రమైన ప్రవర్తన ఉన్నట్లుగా కనిపిస్తాడు. కొన్ని సెకన్లు, నిమిషాల పాటు ప్రతిస్పందన లేకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. సూక్ష్మ ముడతలు, లేదా ముఖంలో, చేతుల్లో, కాళ్లలో తరచూ లాగుతుంది. మూర్ఛ వ్యాధికి కారణాలు వంశపారంపర్యం, మెనింజైటిస్, రక్తంలో షుగర్ శాతం పెరగడం, తగ్గడం, మెదడుకు గాయాలైనప్పుడు, గడ్డలు ఉన్నప్పుడు, రక్తంలోని కొన్ని ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల మూర్ఛ వస్తుంది. మూర్చ(ఫిట్స్) అంటే.. మూర్చ అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ రుగ్మతల సమూహం. మెదడులోని ఎలక్ట్రిక్ యాక్టివిటీ అసాధారణ పగుళ్ల వల్ల సంభవిస్తుంది. మూర్చలు వాటి కారణం, కేంద్ర స్థానాన్ని బట్టి వర్గీకరించవచ్చు. మూర్చలు తరచుగా కన్వల్షన్స్ లేదా ఎపిలెప్టిక్ ఫిట్స్‌గా సూచిస్తారు. ఇది సున్నా నుంచి 10 ఏళ్లలోపు, 50 నుంచి 70 ఏళ్లలోపు వారికి కలుగుతుంది. ఒక్కోసారి ఏ వయస్సులో వారికైనా రావచ్చు. మూర్ఛవ్యాధి నిర్ధారణ మూర్ఛకు గురైన వారు వైద్యుని వద్దకు వచ్చిన వెంటనే అతని పక్కన ఉన్న వ్యక్తితో జరిగిన సంఘటన గురించి వైద్యులు ఆరా తీసి అది మూర్ఛనా కాదా తెలుసుకుంటారు. నిర్ధారణ కోసం అవసరమైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఈఈజీ పరీక్షలు చేయిస్తారు. కొన్నిసార్లు వీడియో ఈఈజీ పరీక్ష కూడా చేయాల్సి రావచ్చు. వీటి ద్వారా మెదడులోని ఏ భాగంలో దెబ్బతినడం వల్ల మూర్చ వస్తుందో గుర్తిస్తారు. మందులు వాడితే తగ్గిపోతుంది మూర్ఛ వ్యాధిగ్రస్తులను దాదాపు 75 శాతం మందిని మందులతోనే పూర్తిగా నయం చేయవచ్చు. కేవలం 25 శాతం మందికి మాత్రమే ఆపరేషన్ అవసరమవుతుంది. ఇలాంటి ఆపరేషన్లకు ఎక్కువగా కేరళలోని శ్రీ చిత్ర ఆసుపత్రికి వెళతారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని నిమ్స్, ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రులు ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం మూర్ఛ వ్యాధికి 25 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. మా విభాగానికి వచ్చిన మూర్ఛ రోగులకు ఉచితంగా మందులు, చికిత్స, వైద్యపరీక్షలు చేయిస్తున్నాం. అయితే వైద్యుల సూచన మేరకు ఇంటి వద్ద మందులు వాడితేనే చికిత్సకు వ్యాధి లొంగుతుంది. – డాక్టర్ సి.శ్రీనివాసులు, న్యూరాలజీ విభాగం హెచ్ఓడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
Epilepsy: దేహం రంగు మారిందో ప్రాణాపాయం తప్పదు
సాక్షి, గుంటూరు: ఫిట్స్ వ్యాధికి వైద్యం లేదనే అపోహకు కాలం చెల్లింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 50 మిలియన్ల ప్రజలు మూర్చవ్యాధితో (ఎపిలెప్సి) బాధపడుతున్నారు. వీరిలో 80 శాతం బాధితులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. మన దేశంలో 10 మిలియన్ల మంది వ్యాధితో బాధపడుతున్నారు. ప్రజలకు ఫిట్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎపిలెప్సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2009 నుంచి నవంబర్ నెలను జాతీయ ఎపిలెప్సీ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మూర్చ అంటే (ఫిట్స్).. మెదడులో ఉన్న న్యూరాన్లలో విద్యుత్ ఆవేశం ఎక్కువైనప్పుడు బయట కనిపించే లక్షణాలనే ఫిట్స్ లేదా మూర్చ అంటారు. ఇది వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కొట్టుకుని పడిపోతారు. ఫిట్స్ వచ్చినప్పుడు కొంత మందికి నాలుక కొరుక్కోవడం, నోటి నుంచి నురగ రావడం గమనించవచ్చు. ఫిట్స్ ఎక్కువ సమయం ఉండే మనిషి దేహం నీలంరంగుగా మారి ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చు. కారణాలు.. మెదడులో వచ్చే ఇన్ఫెక్షన్లు, గడ్డలు, తలకు గాయాలు, బ్రెయిన్ స్ట్రోక్స్, మెదడులో రక్తనాళాలు ఉబ్బడం, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన సమస్యల వల్ల ఫిట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పిల్లలు, పెద్దవాళ్లలో అందరిలోనూ ఈ మూర్ఛ వ్యాధి వస్తుంది. గొంతు, చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల చిన్నారుల్లో వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు ప్రసవ సమయంలో కొన్ని రకాల చికిత్స విధానాలు పాటించకపోవడం వల్ల, టీబీ, హెచ్ఐవీ, మెదడువాపు జబ్బుల వల్ల, వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ల వల్ల ఫిట్స్ కేసులు దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో బాధితులు.. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతి శనివారం మూర్చవ్యాధి బాధితుల కోసం ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. ప్రతి వారం 150 మంది ఓపీ విభాగానికి వైద్యం కోసం వస్తున్నారు. జిల్లాలో సుమారు 90 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు , ఫిజీషియన్ల వద్ద ప్రతి రోజూ ఒక్కొక్కరి వద్ద ఐదు నుంచి పది మంది వరకు ఫిట్స్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. -
3 కి.మీ. మోసుకెళ్లినా దక్కని గర్భిణి ప్రాణం
నార్నూర్(గాదిగూడ): కాన్పు కోసం ఆదివారం ఉదయమే పుట్టింటికి వచ్చింది. నెల రోజులైతే చాలు పండంటి బిడ్డకు జన్మనిస్తాననే ఆలోచనలోనే ఉంది. అనుకోకుండా ఆ గర్భిణికి సాయంత్రం ఫిట్స్ వచ్చాయి. 108కు ఫోన్ చేసినా.. ఊళ్లోకి వచ్చే పరిస్థితిలేదు. దీంతో 3 కిలోమీటర్లు గర్భిణిని మోసుకెళ్లారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గాదిగూడ మండలం కునికాస కొలాంగూడ గ్రామానికి చెందిన కొడప రాజుబాయి(22)కి రెండేళ్ల క్రితం మండలంలోని పరస్వాడ(బి) గ్రామానికి చెందిన యువకుడు భీంరావుతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. ఇన్ని రోజులు అత్తగారింట్లో ఉన్న రాజుబాయి కాన్పు కోసం ఆదివారం ఉదయం భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. చేతులపై మోస్తూ.. కునికాస కొలాంగూడ గ్రామ శివారులో వాగు ఉంది. అంబులెన్స్ గ్రామంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రాజుబాయిని 3 కిలోమీటర్ల దూరం చేతులపై ఎత్తుకుని తీసుకెళ్లారు. జాగ్రత్తగా వాగు దాటించారు. అప్పటికే అక్కడికి 108 చేరుకుంది. అక్కడి నుంచి అంబులెన్స్‌లో గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పీహెచ్సీలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఝరి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి పరిస్థితి విషమంగా ఉందని స్టాఫ్‌నర్సు కాంతాబాయి కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో అదే అంబులెన్స్‌లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో రాజుబాయి మృతిచెందింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నిండు గర్భిణి ప్రాణం పోయిందని కుటుంబీకులు, గ్రామస్తులు ఆరోపించారు. -
10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే కాబోయే వరుడు..?
గుత్తి రూరల్: యల్లనూరు మండలం శింగవరం గ్రామానికి చెందిన శివశంకర్ ప్రసాద్‌రెడ్డి మూర్ఛ వ్యాధితో మృతి చెందాడు. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన ఓ యువతితో ఈ నెల 13వ తేదీన వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో గుత్తిలో ఉన్న బంధువులు, స్నేహితులకు ఆహ్వాన పత్రికలు పంచేందుకు వచ్చాడు. పత్రికలు ఇచ్చి అందరినీ ఆహ్వానించిన అనంతరం స్వగ్రామం బయల్దేరాడు. అయితే ఎంగిలిబండ శివారుకు చేరుకోగానే మూర్ఛ రావడంతో శివశంకర్ రోడ్డు పక్కకు వాహనం ఆపేసి కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు, వాహనదారులు అతడు కోలుకునేందుకు సపర్యలు చేయగా.. శివశంకర్ ఆలోపే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం ఏర్పడింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగుతోంది. -
రోబోటిక్ సాయంతో మూర్చ రోగికి చికిత్స
సాక్షి, హైదరాబాద్: మూర్చ వ్యాధితో బాధపడుతున్న తొమ్మిదేళ్ల బాలుడికి రోబోటిక్ పరిజ్ఞానం సాయంతో విజయవంతంగా ఎలక్ట్రోడ్లను అమర్చారు కిమ్స్ వైద్యులు.. ఈ తరహా చికిత్స నగరంలోనే తొలిదని వారు ఆదివారం వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన బాలుడు గత ఐదేళ్లుగా మూర్చ సంబంధ సమస్యతో బాధపడుతున్నాడు. రోజుకు నాలుగైదు సార్లు వచ్చే మూర్చతో చాలా అవస్థలు పడేవాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని చికిత్స కోసం గత నెల 11న కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. న్యూరాలజిస్ట్ సీతాజయలక్ష్మి బాలుడికి ఎంఆర్ఐ, ఈఈజీ పరీక్షలు చేయించారు. సమస్య మూలాలు గుర్తించేందుకు డాక్టర్ మానస్ పాణిగ్రాహి నేతృత్వంలోని వైద్య బృందం రోబోటిక్ టెక్నాలజీ సాయంతో మెదడులో 8 ఎలక్ట్రోడ్లను విజయవంతంగా అమర్చారు. సాధారణంగా ఇలాంటి చికిత్సకు 7 నుంచి 8 గంటల సమయం పడుతుండగా, రోబోటిక్ టెక్నాలజీతో 3 గంటల వ్యవధిలోనే అవసరమైన చోట కావాల్సినన్ని ఫ్రేమ్‌లను పెట్టి ఎలక్ట్రోడ్లను అమర్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ తరహా చికిత్స వల్ల రోగికి తక్కువ నొప్పి, తక్కువ ఖర్చుతో పాటు త్వరగా కోలుకునే అవకాశముందని వెల్లడించారు. మూర్చకు కారణమైన మూలాలను గుర్తించి, ఆ మేరకు తదుపరి చికిత్సలు అందించనున్నట్లు స్పష్టం చేశారు. -
మూర్ఛకు చెక్ పెట్టే కొత్తిమీర!
మనం నిత్యం వంటల్లో ఉపయోగించే కొత్తిమీరలో మూర్ఛవ్యాధికి చికిత్స కల్పించే మందు ఉన్నట్లు గుర్తించారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. మూర్ఛ లక్షణాలతోపాటు వాంతులు, వికారాలను తగ్గించేందుకు కొత్తిమీర ఉపయోగపడుతుందని చాలాకాలంగా తెలిసినప్పటికీ కచ్చితంగా ఏ మూలకం ద్వారా ఇది జరుగుతోందో మాత్రం తెలియదు. ఈ అంశాన్ని కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. మూర్ఛ లక్షణాల్లో కొన్ని మెదడులోని కేసీఎన్క్యూ పొటాషియం ఛానళ్ల ద్వారా నియంత్రించబడుతున్నట్లు ఇప్పటికే తెలిసిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు కొత్తిమీర ఆకులోని పదార్థాలను విశ్లేషించడం ద్వారా తమ అధ్యయనాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో కొన్ని రసాయనాలు పొటాషియం ఛానళ్లను చైతన్యపరుస్తున్నట్లు గుర్తించారు. డొడిసెనాల్ అనే పదార్థం పొటాషియం ఛానళ్లకు అతుక్కుపోవడం ద్వారా అవి పనిచేసేలా చేస్తున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జెఫ్ అబోట్ తెలిపారు. జంతువులపై జరిగిన ప్రయోగాల్లోనూ ఈ డొడిసెనాల్ మూర్ఛ లక్షణాలను తగ్గిస్తున్నట్లు స్పష్టమైందని తెలిపారు. వాంతులు వికారాలకు మరింత మెరుగైన మందును తయారు చేసేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. పరిశోధన వివరాలు ఫాసెబ్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
విధి వంచితులు.!
వారు కడు నిరుపేదలు.. ఒకరు మూర్ఛ వ్యాధితో అల్లాడుతుంటే.. మరొకరు పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు.. ఎవరైనా దయతలచి కాస్త అన్నం పెడితే వారు ఆకలి తీర్చుకుంటారు.. లేదంటే కడుపు మాడ్చుకోవాల్సిందే.. అత్యంత దుర్భరంగా బతుకీడుస్తూ.. మానవతా వాదుల చేయూత కోసం ఎదురు చూస్తున్న తల్లీబిడ్డల దీనగాధ ఇది. అట్లూరు:అట్లూరు మండల పరిధిలోని మణ్యవారిపల్లి బీసీ కాలనీలో కత్తి సుబ్బమ్మ(70), కత్తి పుల్లయ్య(40) అనే తల్లీ కొడుకు నివాసముంటున్నారు. సుబ్బమ్మకు ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, కుమార్తెలతో పాటు ఒక కుమారుడికి వివాహమైంది. చిన్న కుమారుడు పుల్లయ్యకు మూర్ఛ వ్యాధితోపాటు బుద్ధి మాంద్యం కూడా ఉంది. దీంతో అతనికి పెళ్లి కూడా చేయలేదు. పుల్లయ్య బద్వేలు పట్టణంలో భిక్షాటన చేస్తూ కాలం గడుపుతూ వారానికో.. లేదా నెలకో ఒకసారి తల్లి వద్దకు వచ్చి వెళ్లేవాడు. తల్లి సుబ్బమ్మ కూలీపనులు చేసుకుని జీవనం సాగించేది. ఆమెకు ఏడేళ్ల క్రితం పక్షవాతం సోకింది. ఫలితంగా ఒక కాలు, ఒక చేయి పనిచేయక పోవడంతో కదలలేక మంచానికే పరిమితమైంది. ఈ పరిస్థితిలో కుమారుడు కూడా తల్లి వద్దకే చేరుకున్నాడు. అయితే తలదాచుకునేందుకు వీరికి కనీసం గూడు కూడా లేకపోవడంతో పట్టలు కప్పిన ఓ చిన్న గుడారంలో వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ కనాకష్టంగా బతుకు వెళ్లదీస్తున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు అనారోగ్యంతో అడుగు ముందుకేయలేని స్థితిలో ఉన్న ఈ అభాగ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత మానవతావాదులపై ఉంది. అర్హులైన వారికి వృద్ధాప్య.. వికలాంగ పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పుకునే పాలకులు ఇలాంటి వారి విషయంలో సానుకూలంగా స్పందించాలని పలువురు కోరుతున్నారు. అలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఎంతో కొంత సహాయం చేసి ఆదుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు. -
ఫిట్స్ రావడంతో పొలంలో పడి మహిళ మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): ఫిట్స్ రావడంతో బురద పొలంలో పడి మహిళ ఊపిరాడక మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని సలాబత్పూర్ ఇట్య తండాలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని సలాబత్పూర్ ఇట్య తండాకు చెందిన కాట్రోత్ మంజుల (25) ఆమె భర్త గోప్య ఇద్దరూ కలిసి సొంత పొలంలో పనికి వెళ్లారు. మధాహ్నం సమయంలో మంచినీరు తెమ్మని చెప్పడంతో నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన మంజులకు ఫిట్స్ రావడంతో ఒరంపై నుండి జారి పొలంలో పడిపోయింది. కొద్దిసేపటికి గమనించిన భర్త అక్కడికి వెళ్లి చూడగా బురదలో పడిపోవడంతో ఊపిరాడక మృతిచెందింది. ఈ విషయమై మృతురాలి అన్న బదావత్ గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి కొడుకు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అంతులేని కథ.. తీరని వ్యథ
కష్టపడి డిగ్రీ వరకు చదువుకుని నలుగురికి విద్యాబుద్ధులు చెబుతూ జీవిద్దామనుకున్న ఆ యువకుడికి మూర్చవ్యాధి మృత్యుమార్గం చూపుతోంది. కాళ్లు, చేతులను చుట్టేసి మంచానికే పరిమితం చేసింది. వైద్యానికి ఉన్న కాస్త భూమి హారతి కర్పూరంలా కరిగిపోగా... వృద్ధాప్యంలో ఉన్న తల్లిపైనే ఆధారపడి బతకుతూ...నిత్యం నరకం అనుభవిస్తున్నాడా యువకుడు. కనగానపల్లి మండలం ముత్తువకుంట్ల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పక్కీరమ్మ, మారెన్న దంపతులకు నలుగురు కుమారులు. చాలాకాలం క్రితమే మారెన్న మృత్యువాత పడడంతో పక్కీరమ్మే కుటుంబ భారం మోయాల్సి వచ్చింది. చిన్న కుమారుడు కొడాల నరసింహులు చురుగ్గా ఉండడంతో కష్టపడి బాగా చదివించింది. తల్లి కష్టం చూసిన నర్సింహులు కూడా ఒకవైపు డిగ్రీ చదువుతూనే ఆర్డీటీ పాఠశాలలో పిల్లలకు ట్యూషన్ చెప్పుకొంటూ కుటుంబానికి సాయంగా ఉండేవాడు. అయితే మిగతా ముగ్గురు కూమారులు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోగా... పక్కీరమ్మ, నరసింహులు కలిసి ఉంటున్నారు. నరాల బలహీనతతో నరకం అయితే నరసింహులుకు 22 సంవత్సరాల వయస్సులో చిన్న మెదడులో నరాల బలహీనత ఏర్పడి కాళ్లు, చేతులు పనిచేయకుండా పోవటంతో పాటు నోట మాట కూడా సరిగా రాకుండా పోయింది. ఆర్డీటీ సహకారంతో బత్తలపల్లి, అనంతపురం ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నాడు. కానీ నయం కాకపోవడంతో డాక్టర్లు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్యం చేయించుకోవాలని సూచించారు. దీంతో వారికున్న ఐదు ఎకరాల పొలాన్ని విక్రయించి మూడు సంవత్సరాల పాటు అక్కడే ఉండి వైద్యం చేయించుకున్నాడు. కానీ చిన్న మెదడులో వచ్చిన స్పాస్టిక్ ఎటాక్సిక్ సిండ్రోమ్ (మెదడులోని నాళాలు దెబ్బతినటం) అనే సమస్య వల్ల నరాల బలహీనత ఏర్పడిందని, దీనివల్ల చేతులు, కాళ్లతో పాటు మిగిలిన అవయవాలు సరిగా పనిచేయవని వైద్యులు తెలిపారు. ఈ సమస్య త్వరగా నయం కాదని, అవసరమైన మందులు, సరైన ఆహారం, మంచి వ్యాయామం చేస్తే కొంతవరకు నయం చేసుకోవచ్చునని సూచించారు. అయితే అక్కడే చాలా రోజులు ఉండి వైద్యం చేయించుకోవడానికి అవసరమైన డబ్బులు లేక ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చేశాడు. అన్నీతానై... నరాల బలహీనతతో కాళ్లు, చేతులు సరిగా పనిచేయక నరసింహులు మంచం మీదే ఉండాల్సి వస్తోంది. దీంతో 80 ఏళ్ల వయస్సున్న పక్కీరమ్మే అన్నీ తానై కుమారుడిని చూసుకుంటోంది. వృద్ధాప్యంలో సరిగా కళ్లు కూడా కనిపించపోయినా కుమారుడిపై ఉన్న మమకారంతో అతనికి సేవలు చేయాల్సి వస్తోంది. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో తినేందుకు తిండికూడా లేక.. కుమారుడు నరసింహులుకు వైద్యం చేయించలేక పక్కీరమ్మ పడుతున్న బాధలు అన్నీ, ఇన్నీకావు. సమీప బంధువుల నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గాని ఎటువంటి సాయం అందటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆకలి బాధలతో జీవించటం కన్నా చావే నయమని కన్నీరుమున్నీరవుతోంది. మానవత్వం కలిగిన దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. సాయం చేయాలనుకుంటే.. కొడాల నరసింహులు తండ్రి: మారెప్ప ముత్తువకుంట్ల గ్రామం, కనగానపల్లి మండలం బ్యాంకు ఖాతా నంబరు: 31508584829 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కనగానపల్లి బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0005657 నరసింహులు సెల్ : 9666948405 -
మూర్ఛకు మందులున్నాయా?
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 25 ఏళ్లు. రాత్రి షిఫ్ట్‌లో ఉద్యోగం చేస్తోంది. ఆమె జాబ్‌లో ఒత్తిడి ఎక్కువ. ఒక రోజు కాళ్లూ చేతులు కొట్టుకుంటూ ఉంటే హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. డాక్టర్లు చూసి కన్వల్షన్స్ (మూర్ఛ) అన్నారు. జీవితాంతం మందులు వాడాలి అని చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? - లక్ష్మీ, కందుకూరు మూర్చ వ్యాధి అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే నరాలకు, మెదడుకు సంబంధించిన వ్యాధులలో ఒకటి. మెదడులో రసాయనిక చర్యల వల్ల విద్యుత్ తరంగాలు వెలువడటంతో కేంద్రనాడీ వ్యవస్థలో, యాంత్రిక నాడీ వ్యవస్థలో పెనుమార్పులు సంభవించి, మనిషి స్పర్శ కోల్పోవడం, కండరాలు బిగుసుకుపోవడం, శరీరంలోని భాగాలలో వణుకు రావడం వంటి లక్షణాలు ఏర్పడటాన్ని కలగలిపి మూర్చవ్యాధి అంటారు. మూర్చవ్యాధి చిన్నపిల్లల్లోనూ, పెద్దవారిలోనూ వచ్చే అవకాశం ఉంది. ఈ జబ్బుతో బాధపడేవారు కొందరు కిందపడిపోయి గిలగిలా కొట్టుకుంటూ స్పృహతప్పి పడిపోతుంటారు. ఈ సమయంలో వారి నోటి నుంచి నురగ కూడా వస్తుంటుంది. దాంతో వారిని మూర్చవ్యాధిగ్రస్తులుగా మనం గుర్తిస్తాం. పక్కవారు కొందరు వారి చేతిలో తాళాల గుత్తి పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఏ విధమైన ఉపశమనమూ ఇవ్వదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కారణాలు: జ్వరం, పుట్టుకతో వచ్చే లోపాల వల్ల మూర్చవ్యాధి రావచ్చు మెదడులో లోపాలు లేదా మెదడులో కంతులు, మెదడు రసాయనాల్లో మార్పులు/అసమతుల్యత, ఇన్ఫెక్షన్లు అతిగా మద్యపానం, ఆకలితో ఎక్కువసేపు ఉండటం నిద్రలేకపోవడం లక్షణాలు: మూర్చపోయే ముందు తీవ్రమైన వణుకులు, నోటి నుంచి చొంగ కారడం, ఒక్కోసారి నాలుక కరచుకోవడం వంటివి చేస్తుంటారు. స్పర్శ కోల్పోవడం, అరుపులతో శబ్దాలు చేయడం ఒళ్లంతా చెమటలు పట్టడం తెలియకుండా మూత్రవిసర్జన చేయడం. చికిత్స: హోమియోలో ఈ వ్యాధికి చికిత్స వయసును బట్టి ఉంటుంది. దీనికి కోనియం, ఫై మెట్, సెలీనియమ్, కాల్కేరియా కార్బ్, క్యూప్రమ్మెట్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని హోమియో డాక్టర్లు మందులు సూచిస్తారు. అనుభజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాటిని వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే..? కిడ్నీ కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 45 ఏళ్లు. ఆయనకు డయాబెటిస్ ఉంది. కిడ్నీ పాడైందని డాక్టర్లు చెప్పారు. సమస్యను డయాబెటిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటున్నారు. అంటే ఏమిటి? దీనికి కారణాలు, లక్షణాలు, నిర్ధారణ పరీక్షల గురించి చెప్పండి. - ప్రసాద్, గుంటూరు ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ అన్నది చాలా సాధారణమైంది. మారుతున్న జీవనశైలి, స్థూలకాయం, లోపించిన దేహ పరిశ్రమ, డయాబెటిస్ వ్యాధి పట్ల అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతోంది. కొన్ని ఏళ్ల తరబడి నియంత్రణలో లేని డయాబెటిస్ దుష్ర్పభావాల వల్ల చాలా మంది మూత్రపిండాల వైఫల్యానికి గురై, మృత్యువాత పడటం జరుగుతోంది. డయాబెటిస్ మూలంగా వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్ గురించి అవగాహన కల్పించాలి. దాదాపు అరవై రకాల వ్యాధులకు డయాబెటిస్ ప్రధాన కారణమవుతోందని అధ్యయనాల్లో గుర్తించారు. దీర్ఘకాలికంగా డయాబెటిస్తో బాధపడేవారిలో ఎక్కువ మంది డయాబెటిస్ కిడ్నీ ఫెయిల్యూర్‌కి గురవుతుంటారు. మానవ శరీరంలోని విసర్జక వ్యవస్థలో కిడ్నీలు ప్రధానమైన పాత్ర పోషిస్తుంటాయి. శరీరంలోని అబ్డామిన్ క్యావిటీకి వెనుక భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఈ కిడ్నీలు అమరి ఉన్నాయి. ఒక్కొక్క కిడ్నీ పొడవు 11 సెం.మీ. వెడల్పు 6 సెం.మీ., మందం 3 సెం.మీ. కలిగి, బరువు 150 గ్రాములు ఉంటుంది. ఈ కిడ్నీల్లో నెఫ్రాన్స్ అనే ఫిల్టర్స్ ఉంటాయి. అవి అవిశ్రాంతంగా రక్తాన్ని వడపోస్తూ అందులోని విష, వ్యర్థ, మలిన పదార్థాలను మూత్రరూపంలో బయటకు పంపుతుంటాయి. ఈ రక్త వడపోత కార్యక్రమంలో అంతరాయం ఏర్పడటాన్ని డయాబెటిస్ కిడ్నీ ఫెయిల్యుర్ అంటారు. కిడ్నీ ఫెయిల్యూర్ రకాలు: 1.అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ 2.క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్. కారణాలు: కిడ్నీ ఫెయిల్యూర్‌కి అనేక కారణాలున్నాయి. వాటిలో కొన్ని... పుట్టుకతో జన్యుపరంగా వచ్చే వ్యాధులు తర్వాతి కాలంలో కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు మూత్ర విసర్జక వ్యవస్థలో ఏ అవయవానికైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, సరైన సమయంలో చికిత్స చేయించకపోతే కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారితీయవచ్చు దీర్ఘకాలికంగా డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండెజబ్బులకు సరైన చికిత్స తీసుకోనివారిలో ఎక్కువ శాతం మంది కిడ్నీ వైఫల్యానికి గురవుతుంటారు మన శరీరాన్ని రక్షించాల్సిన వ్యాధి నిరోధక శక్తి మన మూత్రపిండాలపైనే దాడి చేస్తే అవి దెబ్బతింటాయి. ఈ కండిషన్‌ను క్రానిక్ గ్లోమెరులో-నెఫ్రైటిస్ అని అంటారు. లక్షణాలు: ముఖం, పొట్ట, కాళ్లు, పాదాలకు బాగా నీరుపడుతుంది ఆహారం తీసుకున్న వెంటనే వాంతి వచ్చినట్లుగా ఉంటుంది మూత్రవిసర్జనలో మార్పులు వస్తాయి ఆకలి తగ్గిపోతుంది బరువు తగ్గుతుంది బద్దకంగా ఉండటం తలనొప్పి కళ్లు తిరగడం ఒళ్లంతా దురదలు మగతగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ: సీరమ్ క్రియాటినిన్ బ్లడ్ యూరియా యూరిక్ యాసిడ్స్, ప్రోటీన్స్ మొదలైనవి నార్మల్ స్థాయి కంటే ఎక్కువగా ఉంటాయి ఆల్బుమిన్ మూడు ప్లస్ ఉంటుంది అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఐవీపీ ఎక్స్‌రే ద్వారా కిడ్నీ వైఫల్యాన్ని గుర్తించవచ్చు రీనల్ బయాప్సీ ద్వారా కిడ్నీ ఎంత మేరకు దెబ్బతిన్నదనే అంశాన్ని, కిడ్నీ భవిష్యత్తును పూర్తిగా తెలుసుకోవచ్చు. డాక్టర్ ఎమ్.కమల్ కిరణ్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, సెంచరీ హాస్పిటల్స్, హైదరాబాద్ -
మూర్ఛ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు
హోమియో కౌన్సెలింగ్ మా పాపకు ఆరేళ్లు. తనకు తరచు ముక్కునుంచి రక్తం వస్తుంటుంది. ఇటీవల కొంతకాలంగా మలంలో కూడా ర క్తం పడుతోంది. డాక్టర్‌కు చూపించి, మందులు వాడుతున్నాము కానీ పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - ఎన్.పుష్పకుమారి, ఆదోని పిల్లలలో ముక్కు నుంచి రక్తం పడటమనేది తరచు కనిపించేదే. ఈ సమస్య ముఖ్యంగా వేసవి, చలికాలాలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ఎపిస్టారిస్ అంటారు. ఇంటి వాతావరణం వేడిగా లేదా చల్లగా పొడిగా తయారైనప్పుడు ముక్కురంధ్రాలు పొడిబారి చర్మం చిట్లుతుంది. చిన్నపిల్లలు ముక్కులో వేళ్లుపెట్టి కెలుక్కుంటూ ఉంటారు. దీనివల్ల ముక్కురంధ్రాలలో ఉన్న సున్నితమైన రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం జరగవచ్చు. అదేవిధంగా అలర్జీలు వచ్చినప్పుడు లేదా జలుబు చేసినప్పుడు గట్టిగా తుమ్మటం, ముక్కు చీదటం, ముక్కుకు బలమైన దెబ్బ తగలటం, ముక్కులో బలపాలు, పెన్సిళ్లు వంటివి పెట్టుకోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు. నివారణ: ఇటువంటప్పుడు కంగారు పడి, ముక్కులో గుడ్డలు అవీ పెట్టడం, కదలకుండా పడుకోబెట్టడం వల్ల సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. మాడు మీద చెయ్యి పెట్టి గట్టిగా ఒత్తిపట్టుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. ముక్కులో వేళ్లు పెట్టుకోనివ్వకూడదు. గోళ్లు పెరగకుండా చూడాలి. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కొబ్బరినూనె రాయడం మంచిది. మలంలో రక్తం పడటానికి కారణాలు మలద్వారం వద్ద చీలిక (ఫిషర్): ముఖ్యంగా చిన్నపిల్లల్లోనూ, పెద్దవాళ్లలోనూ ఇలా జరగడానికి కారణం మలబద్ధకం. గట్టిగా ముక్కడం వల్ల కింది భాగంలోని పేగుల నుంచి రక్తస్రావం జరగవచ్చు. అలాగే పిండదశలో ఉన్నప్పుడు తల్లి బొడ్డునుంచి గర్భస్థ శిశువు పేగుల్లోకి వెళ్లే నాళ్ల మూసుకు పోవడం వల్ల పేగుల్లో తిత్తులు ఏర్పడవచ్చు. చిన్నపేగుల్లో అల్సర్స్, పేగు చొచ్చుకురావడం, ఒక పేగులోని కొంత భాగం మరో పేగులోకి చొచ్చుకుపోతుంది. జువైనల్ పాలిప్స్: పేగుల్లో పిలకలు; రక్తనాళాల్ల లోపాలు, పేగుల్లో వాపు. హోమియోవైద్యం: చిన్నపిల్లల్లో రక్తస్రావ సమస్యలకు హోమియోలో అద్భుతమైన మందులున్నాయి. వ్యాధి కారణాలు, లక్షణాలు, పిల్లల మానసిక, శారీరక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా వైద్యం చేస్తారు. దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలూ తలెత్తకుండా ఎలాంటి శస్త్రచికిత్సలూ అవసరం లేకుండా వ్యాధి సమూలంగా తగ్గిపోతుంది. సమీపంలో ఉన్న మంచి అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుని సంప్రదించండి. -డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా అబ్బాయికి 15 ఏళ్లు. వాడికి చిన్నప్పట్నుంచీ మూర్ఛ వ్యాధి ఉంది. చికిత్స చేయిస్తున్నాం. అయితే గత ఆరు నెలలుగా మూర్ఛ రావడం ఆగిపోయింది. దాంతో మందులు నిలిపివేశాం. ఇటీవల మా బాబుకు స్కూల్లో మళ్లీ మూర్ఛ వచ్చింది. ఒకసారి తగ్గిన తర్వాత కూడా మూర్ఛ వ్యాధి మళ్లీ వస్తుందా? మా బాబుకు సరైన, శాశ్వతమైన పరిష్కారం చూపించగలరు. - లక్ష్మి, విజయవాడ మీ బాబుకు మూర్ఛ తగ్గిందనుకొని మీరు మందులు వాడటం ఆపివేశారు. కానీ మీ బాబుకు మూర్ఛ వ్యాధి పూర్తిగా నయం కాలేదు. వ్యాధి కొద్దిగా తగ్గినట్లు అనిపించగానే చాలామంది మందులు వాడటం ఆపేస్తుంటారు. కానీ అది మంచిది కాదు. మూర్ఛవ్యాధికి దీర్ఘకాలిక చికిత్స అవసరం. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ మందులు వాడటం ద్వారా మూర్ఛను అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛలో చాలా రకాలు ఉంటాయి. వ్యాధి తత్వం, రోగి వయసు, ఇతర పరిస్థితులపై... దానికి అందించాల్సిన చికిత్స ఆధారపడి ఉంటుంది. మూర్ఛ ఉన్నవారు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ, క్రమం తప్పకుండా మందులు వాడాలి. మీ బాబుకు మూర్ఛవ్యాధి ఎందుకు వస్తుందో తెలుసుకొని, అందుకు అనుగుణంగా చికిత్స పొందడం ఎంతో ముఖ్యం. ఒకవేళ మీ బాబుకు ఉన్న మూర్ఛ రకానికి సర్జరీ అవసరమని వైద్యులు సూచిస్తే, అప్పుడు శస్త్రచికిత్సతో దానికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. సర్జరీ అవసరం లేకుండా మందులు వాడమని సలహా ఇస్తే, వారు సూచించిన విధంగా, మందులు మానేయకుండా, డాక్టర్లు చెప్పేవరకు వాటిని వేసుకోవాలి. ఒకవేళ ఒకపూట మందులు వేసుకోవడం మరచిపోయినా, ఏదైనా కారణాలతో వేసుకోలేకపోయినా, గుర్తుకు రాగానే రెట్టింపు మందులు (ఇది డాక్టర్ సూచన మేరకు మాత్రమే) వేసుకోవాలి. వైద్యులను సంప్రదించకుండా మీ అంతట మీరు మందులను ఎట్టిపరిస్థితులలోనూ నిలిపివేయవద్దు. మూర్ఛ అనేది అదుపులో ఉంచుకోదగిన వ్యాధి. క్రమం తప్పకుండా మందులు వాడితే మూర్ఛ ఉన్నవారు కూడా అందరిలాగే సాధారణ జీవితం గడపగలుగుతారు. మూర్ఛ వ్యాధి ఉన్నవారు కాంతిమంతమైన వెలుగు ఉన్న చోట ఉండకూడదు. కంప్యూటర్, ల్యాప్‌టాప్ ముందు ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు. ధ్వనులకు దూరంగా ఉండాలి. కార్లు, ద్విచక్రవాహనాలు నడపకూడదు. స్విమ్మింగ్ చేయకూడదు. ఎత్తులకు ఎక్కడం అంత మంచిది కాదు. -డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం సీనియర్ న్యూరో సర్జన్ యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్ యాండ్రాలజీ కౌన్సెలింగ్ నాకు 20 ఏళ్లు. నేను ఏడేళ్ల నుంచి హస్తప్రయోగం చేస్తున్నాను. రోజుకు కనీసం ఒకసారైనా హస్తప్రయోగం చేసుకుంటాను. ఈమధ్య ఎంతగా ప్రయత్నించినా నాకు అంగస్తంభన కలగడం లేదు. సెక్స్ మూడ్ కూడా రావడం లేదు. పైగా పురుషాంగం మీద నరాలు పైకి తేలి కనిపిస్తున్నాయి. సెక్స్‌కు, పెళ్లికి పనికిరానేమో అని ఆందోళనగా ఉంది. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - ఆర్.వి.కె.ఎమ్., చిట్యాల పురుషాంగం మీద నరాలు కనిపించడానికీ, అంగస్తంభనకూ ఎలాంటి సంబంధం లేదు. వాస్తవానికి పురుషాంగం లోపల ఉండే కండరాల్లోకి రక్తం ప్రవహించడం వల్ల అంగస్తంభన జరుగుతుంది. ఆ ప్రక్రియకూ, పురుషాంగం పైన కనిపించే నరాలకు అస్సలు సంబంధం లేదు. మీలాగే దాదాపు యువకులందరూ యుక్తవయసుకు రాగానే హస్తప్రయోగం మొదలుపెడతారు. అది చాలా స్వాభావికమైన చర్య. అయితే పోనుపోనూ అది యాంత్రికం అవుతుంది. అలా అవుతున్న కొద్దీ మొదట్లో ఉన్నంత థ్రిల్ కనిపించకపోవచ్చు. మీరు కెరియర్‌పై దృష్టి పెట్టండి. ఏదో ఒక సమయంలో మీకు మూడ్ వచ్చినప్పుడు మీది కేవలం అపోహ అన్న విషయం మీకే అర్థమవుతుంది. మీరు వివాహానికి పూర్తిగా అర్హులు. సంతృప్తికరమైన సెక్స్ జీవితాన్ని అనుభవించగలరు. నాకు 60 ఏళ్లు. రెండేళ్ల క్రితం వరకు బాగానే సెక్స్ చేస్తుండేవాణ్ణి. ప్రస్తుతం సెక్స్ చేయాలనే కోరిక ఉన్నా అంగస్తంభన సరిగా లేకపోవడంతో సెక్స్ చేయలేకపోతున్నాను. దీనికి తోడు రాత్రిళ్లు మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తోంది. నిద్రసరిగా పట్టడం లేదు. నాకు తగిన సలహా ఇవ్వండి. - డి.కె.ఎమ్., కొత్తగూడెం అరవై ఏళ్లు పైబడ్డ వాళ్లలో సెక్స్ సంబంధిత, మూత్ర సంబంధిత సమస్యలు కనిపించవచ్చు. వయసు పెరుగుతుండటంతో చాలా మందిలో కనిపించే సాధారణమైన సమస్యలే ఇవి. ప్రోస్టేట్ గ్లాండ్ పెరగడం వల్ల మూత్ర సంబంధిత సమస్య, రక్తనాళాలు కొంత బలహీనం కావడం వల్ల అంగస్తంభన సమస్యలు వచ్చి ఉండవచ్చు. ఈ రెండింటినీ మందులతో కొంత నయం చేయవచ్చు. దాంతోపాటు శారీరక, మానసిక దారుఢ్యం (ఫిట్నెస్) కోసం కృషి చేయడం ద్వారా మరికొంత సెక్సువల్ పెర్ఫార్మెన్స్ను పెంచుకోవచ్చు. షుగర్, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలు చేయించుకుని అవి ఉంటే వాటిని నియంత్రించుకునేందుకు అవసరమైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకసారి మీ యూరాలజిస్ట్/యాండ్రాలజిస్ట్‌ను కలవండి. - డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి హైదరాబాద్ -
నా భర్త మరణానికి కారణమేమీ?
మూర్ఛతో మృతిచెందాడని మోసగించాడు పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు పలమనేరు: తాపీ పనికని భర్తను బెంగళూరుకు తీసుకెళ్లారు. అక్కడ పనిచేస్తుండగా మూర్ఛవ్యాధితో మృతిచెందినట్లు నమ్మబలికి ఇప్పుడేమో రూ.3 లక్షలు పరిహారం ఇస్తానంటూ చెబుతున్న వ్యక్తిపై విచారణ జరిపి తన భర్త మృతికి కారణమేమిటో తెలుసుకోవాలని బాధితురాలు గుణవతి శుక్రవారం పలమనేరు సీఐ సురేంద్రరెడ్డికి ఫిర్యా దు చేసింది. బాధితురాలి కథనం మేరకు పలమనేరు పురపాలక సంఘపరిధిలోని నీళ్లకుంటకు చెందిన వెంకటేష్‌నాయుడు తాపీ పనిచేసేవాడు. అదే గ్రామానికి చెందిన సుబ్బయ్య బెంగళూరులో ఎక్కువ సంపాదన వస్తుందని ఒప్పించి గత నెల 25న అక్కడికి తీసుకెళ్లాడు. డిసెంబర్ 31న అక్కడ తాపీ పనిచేస్తుండగా వెంకటేష్ నాయుడు మూర్ఛ తో కిందపడి మృతి చెందాడని సుబ్బయ్య సమాచారమిచ్చాడు. దీంతో అక్కడికి వెళ్లేందుకు బయల్దేరుతుండగానే తానే మృతదేహాన్ని గ్రామానికి తీసుకొస్తున్నానంటూ సుబ్బయ్య ఫోన్లో చెప్పి తీసు కొచ్చాడు. మరుసటి రోజు వెంకటేష్‌నాయుడు మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉన్న తన భర్త ఎలా మృతిచెందాడని బాధితురాలు సుబ్బయ్యను ప్రశ్నించింది. దీంతో నీళ్లు నమిలిన సుబ్బయ్య రూ.3లక్షలు ఇస్తానని గ్రామస్తుల సమక్షంలో ఒప్పుకున్నాడు. అతని మృతికి అనారోగ్యం కారణం కాదని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు విచారణలో ఉంది