
మంజుల మృతదేహం
కౌడిపల్లి(నర్సాపూర్): ఫిట్స్ రావడంతో బురద పొలంలో పడి మహిళ ఊపిరాడక మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని సలాబత్‌పూర్ ఇట్య తండాలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని సలాబత్‌పూర్ ఇట్య తండాకు చెందిన కాట్రోత్ మంజుల (25) ఆమె భర్త గోప్య ఇద్దరూ కలిసి సొంత పొలంలో పనికి వెళ్లారు.
మధాహ్నం సమయంలో మంచినీరు తెమ్మని చెప్పడంతో నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన మంజులకు ఫిట్స్ రావడంతో ఒరంపై నుండి జారి పొలంలో పడిపోయింది. కొద్దిసేపటికి గమనించిన భర్త అక్కడికి వెళ్లి చూడగా బురదలో పడిపోవడంతో ఊపిరాడక మృతిచెందింది. ఈ విషయమై మృతురాలి అన్న బదావత్ గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి కొడుకు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment