కాంతా లగా... పాటతో 20 ఏళ్ల వయసులో ఓవర్‌నైట్ స్టార్ అయింది షెఫాలీ జరీవాలా. 1972లో వచ్చిన పాటకు ఇది రీమిక్స్‌గా తెరకెక్కింది. ఈ పాట సూపర్ క్లిక్ అవడంతో తర్వాత ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్‌లో మెరిసింది షెఫాలీ. కానీ జనం మాత్రం ఆమెను కాంతా లగా బ్యూటీగానే గుర్తుపెట్టుకున్నారు. ఆ మధ్య హిందీ బిగ్‌బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొంది నటి. తాజాగా ఈ నటి బాల్యంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది.
'15 ఏళ్ల వయసులో మొదటిసారి నాకు మూర్ఛ వచ్చింది. అందరూ నన్ను అదోలా చూసేవారు. ఆ వ్యాధి నన్ను పదేళ్లపాటు వెంటాడింది. మూర్ఛ వ్యాధితో జీవించడమనేది ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. అంత చిన్న వయసులో నేనొక నిస్సహాయురాలిగా ఫీలయ్యానో లేదో కానీ ఆత్మస్థైర్యంతో మాత్రం ఉండకపోయేదాన్ని. నేను ఎదుగుతున్నకొద్దీ నా ముందు మరిన్ని సవాళ్లు ప్రత్యక్షమయ్యాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ సడన్‌గా మూర్ఛ వస్తుందేమోనన్న భయం ఎప్పుడూ నాపై ఒత్తిడి పెంచేది.
కాంతా లగా షూటింగ్ చేస్తున్నప్పుడు, ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు ఫిట్స్ వస్తుందేమోనని భయంతో వణికిపోయేదాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితులు చక్కదిద్దుకున్నాయి. మెడిసిన్స్ పుణ్యమా అని 15 ఏళ్లుగా నాకు మూర్ఛ రావడం లేదు. మానసికంగా, శారీరకంగా ఎంతో ధృడంగా ఉన్నాను. ఉత్తమ జీవితం గడుపుతున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా షెఫాలీ.. ముజే షాదీ కరోగే సినిమాలో నటించింది. నాచ్ బలియే 5, 7 సీజన్స్‌లోనూ మెరిసింది.
Comments
Please login to add a commentAdd a comment