Shefali
-
24 ఏళ్ల కింద విడాకులు.. అది ముగిసిన చాప్టర్: నటుడు
బాలీవుడ్లో పెళ్లి- విడాకులు అనేవి సర్వసాధారణమైపోయాయి. కొందరు విడాకులు తీసుకున్న తర్వాత కూడా మాజీ పార్ట్నర్తో స్నేహాన్ని కొనసాగిస్తుంటే మరికొందరు మాత్రం పరిచయమే లేనట్లు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. బాలీవుడ్ మాజీ దంపతులు షెఫాలి షా- హర్ష్ చాయ రెండో కోవలోకి వస్తారు. కఠిన నిర్ణయం.. వీరిద్దరూ 1994లో పెళ్లి చేసుకోగా 2000వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది నటి.. దర్శకుడు విపుల్ అమృత్లాల్ షాను పెళ్లి చేసుకుంది. మరోవైపు హర్హ్ 2003లో నటి సునీత సేన్‌గుప్తాను పెళ్లాడాడు. తాజాగా హర్ష్.. తన విడాకుల గురించి మాట్లాడుతూ.. అది చాలా కష్టమైన నిర్ణయమే.. విడాకులు తీసుకుని 20- 25 ఏళ్లవుతోంది. అయినా అది ముగిసిన చాప్టర్ అని దీర్ఘంగా నిట్టూర్చాడు. అసౌకర్యంగా ఫీలవను.. మళ్లీ అతడే నోరు విప్పుతూ.. కానీ ఇప్పుడు మేము స్నేహితులుగా కూడా మాట్లాడుకోవట్లేదు. అలా అని తనతో మాట్లాడటానికి నాకు ఏ ఇబ్బందీ లేదు. తను నాకు ఎదురైనా సరే నేనేమీ అసౌకర్యంగా ఫీలవను అని చెప్పుకొచ్చాడు. అటు షెఫాలి కూడా పెళ్లిలో జీవితాంతం సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని దీవిస్తారు. కానీ ఇది అందరికీ వర్తించదని తర్వాత అర్థమైంది. అన్ని పెళ్లిళ్లు నూరేళ్లు ఉండవని తెలుసుకున్నాను. మా బంధం వర్కవుట్ కాలేదు.. దానికి మనం ఏం చేయలేం అని చెప్పుకొచ్చింది. చదవండి: సిద్దార్థ్‌కు 21 ఏళ్ల క్రితమే పెళ్లి.. ఆ కారణం వల్లే విడాకులు? -
చచ్చినా సరే ఆ స్టార్ హీరోకి తల్లిగా మళ్లీ నటించను: ప్రముఖ నటి
నటులు అన్నాక ఏ పాత్రయినా సరే చేయాలి. అలా వయసు తక్కువగా ఉన్నాసరే కొందరు లేడీ యాక్టర్స్.. తల్లి, ఆంటీ తరహా పాత్రలు చేస్తుంటారు. గుర్తింపుతో పాటు ఫన్నీ ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి క్రిటిసిజం ఎదుర్కొన్న ఓ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ స్టార్ హీరోకి తల్లిగా జీవితంలో మళ్లీ నటించనని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!) ఇంతకీ ఏమైంది? 'రంగీలా' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షెఫాలీ షా.. సత్య, గాంధీ లాంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. 2005లో రిలీజైన 'వఖ్త్: ద రేస్ ఎగైనెస్ట్ టైమ్' మూవీలో అక్షయ్ కుమార్‌కి తల్లిగానూ నటించింది. ఆ సినిమాలో నటించేటప్పటికీ.. అక్షయ్ కంటే షెఫాలీ నాలుగేళ్లు చిన్నది. కానీ మదర్ క్యారెక్టర్ చేసింది. తాజాగా ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. జీవితంలో మరోసారి అక్షయ్‌కి తల్లి పాత్ర చేయనని కుండ బద్ధలు కొట్టేసింది. గత 25-30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాసరే గత నాలుగేళ్లుగానే బాగా పనిచేస్తున్నట్లు షెఫాలీ షా చెప్పుకొచ్చింది. షారుక్, అమితాబ్ బచ్చన్ ఎప్పటికీ స్టార్స్ అని చెప్పిన ఈమె.. ప్రస్తుత జనరేషన్లో అయితే రణ్వీర్ సింగ్, ఆలియా భట్ స్టార్స్ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. అయితే తాను మాత్రం ఎప్పటికీ స్టార్ యాక్టర్ కావాలనుకోవట్లేదని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: మూడు రోజుల వేడుక.. వరుణ్-లావణ్య పెళ్లి ముహూర్తం టైమ్ ఇదే!) -
రద్దీగా ఉన్న మార్కెట్‌కు వెళ్తే అసభ్యంగా తాకారు: నటి
బుల్లితెర నటి షెఫాలీ షాకు చేదు అనుభవం ఎదురైంది. మార్కెట్‌కు వెళ్లినప్పుడు తనను ఎవరో అభ్యంతరకర రీతిలో తాకారని వెల్లడించింది. మొదట ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని భావించిన ఆమె తాజాగా ఈ సంఘటన గురించి మీడియాకు వెల్లడించింది. తాజాగా ఏఎన్ఐ పాడ్‌క్యాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. నేను గతంలో చెప్పినట్లు అందరూ రకరకాల అనుభవాలు ఫేస్ చేసి ఉంటారు. అందులో నేను ఎదుర్కొన్న ఓ చేదు సంఘటన గురించి చెప్తాను. నేను ఓసారి బాగా రద్దీగా ఉన్న మార్కెట్లో నడుచుకుంటూ వెళ్లాను. ఎవరో అనుచితంగా తాకడంతో కంపరంగా అనిపించింది. నేను గిల్టీగా ఫీలవడం కాదు కానీ ఇది నిజంగా సిగ్గుచేటు. ఆ పనికిమాలిన చర్యను అలాగే వదిలేశారా? అని మీరడగవచ్చు. అవును.. ఆ సమయంలో అలానే వదిలేశాను. నేనే కాదు చాలామంది ఆ సమయంలో తామే ఏదో తప్పు చేసినట్లుగా ఫీలయ్యి దాన్ని మర్చిపోతారు. అలాంటి ధోరణికి మనం చెక్ పెట్టాలి. దాని గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పుకొచ్చింది. కాగా షెఫాలీ షా.. 1995లో వచ్చిన రంగీలా సినిమా ద్వారా సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత సత్య సినిమా చేయగా ఈ చిత్రానికి ఉత్తమనటిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది. ఇటీవల జల్సా, డార్లింగ్, డాక్టర్ జీ చిత్రాలతో మెప్పించింది. మరోవైపు ఢిల్లీ క్రైమ్, హ్యూమన్ వెబ్ సిరీస్‌లోనూ నటించగా తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. -
మూర్ఛ వ్యాధి.. ఎప్పుడు, ఎక్కడ వస్తుందోనని భయపడేదాన్ని: నటి
కాంతా లగా... పాటతో 20 ఏళ్ల వయసులో ఓవర్‌నైట్ స్టార్ అయింది షెఫాలీ జరీవాలా. 1972లో వచ్చిన పాటకు ఇది రీమిక్స్‌గా తెరకెక్కింది. ఈ పాట సూపర్ క్లిక్ అవడంతో తర్వాత ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్‌లో మెరిసింది షెఫాలీ. కానీ జనం మాత్రం ఆమెను కాంతా లగా బ్యూటీగానే గుర్తుపెట్టుకున్నారు. ఆ మధ్య హిందీ బిగ్‌బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొంది నటి. తాజాగా ఈ నటి బాల్యంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. '15 ఏళ్ల వయసులో మొదటిసారి నాకు మూర్ఛ వచ్చింది. అందరూ నన్ను అదోలా చూసేవారు. ఆ వ్యాధి నన్ను పదేళ్లపాటు వెంటాడింది. మూర్ఛ వ్యాధితో జీవించడమనేది ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. అంత చిన్న వయసులో నేనొక నిస్సహాయురాలిగా ఫీలయ్యానో లేదో కానీ ఆత్మస్థైర్యంతో మాత్రం ఉండకపోయేదాన్ని. నేను ఎదుగుతున్నకొద్దీ నా ముందు మరిన్ని సవాళ్లు ప్రత్యక్షమయ్యాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ సడన్‌గా మూర్ఛ వస్తుందేమోనన్న భయం ఎప్పుడూ నాపై ఒత్తిడి పెంచేది. కాంతా లగా షూటింగ్ చేస్తున్నప్పుడు, ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు ఫిట్స్ వస్తుందేమోనని భయంతో వణికిపోయేదాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితులు చక్కదిద్దుకున్నాయి. మెడిసిన్స్ పుణ్యమా అని 15 ఏళ్లుగా నాకు మూర్ఛ రావడం లేదు. మానసికంగా, శారీరకంగా ఎంతో ధృడంగా ఉన్నాను. ఉత్తమ జీవితం గడుపుతున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా షెఫాలీ.. ముజే షాదీ కరోగే సినిమాలో నటించింది. నాచ్ బలియే 5, 7 సీజన్స్‌లోనూ మెరిసింది. -
DOCTOR G : మగ గైనకాలజిస్ట్ తిప్పలు
ఇష్టం లేని పోస్టింగులు ఉద్యోగులకు ఉన్నట్టే ఇష్టం లేని డిపార్ట్మెంట్లు డాక్టర్లకు ఉంటాయి. కొందరు న్యూరో వద్దనుకుంటారు. కొందరు పిడియాట్రిషియన్ కావడాన్ని బోర్ ఫీలవుతారు. కొందరికి చర్మవ్యాధుల డాక్టర్ అవాలని అస్సలు ఉండదు. కాని వద్దనుకున్న సీటే వస్తే? ఆయుష్మాన్ ఖురానాకి గైనకాలజీలో సీటు వస్తుంది. కాని అతను చేయాలనుకున్నది ఆర్థోపెడిక్స్. గైనకాలజీ అంటే స్త్రీల ప్రపంచం. పేషంట్లకు ఇబ్బంది. ఈ డాక్టరుకు బెరుకు. ఈ సమస్యను స్క్రీన్ మీద నవ్వులు పూయించడానికి అదే సమయంలో డాక్టర్ల గొప్పతనం చాటడానికి త్వరలో వస్తోంది ‘డాక్టర్ జి’. దీనికి అనురాగ్ కశ్యప్ చెల్లెలు అనుభూతి కశ్యప్ దర్శకురాలు కావడం మరో విశేషం. ‘పేషెంట్లు మహిళా గైనకాలజిస్టునే ప్రిఫర్ చేస్తారు’ అంటాడు గైనకాలజీలో పి.జి. చేస్తున్న ఆయుష్మాన్. ‘ఈ ఆడ, మగ తేడా ఏంటి? డాక్టర్ డాక్టరే ఎవరైనా’ అంటుంది సీనియర్ మహిళా గైనకాలజిస్ట్ షేఫాలి షా. ‘పేషెంట్లు అలా అనుకోరు కదా’ అంటాడు. ‘ముందు నువ్వు అనుకో. నీ ఆలోచన మార్చుకో. నువ్వో గైనకాలజిస్టువి. నీలోని మేల్ టచ్‌ను వదులుకో’ అంటుందామె కోపంగా. గైనకాలజీ విభాగంలో మహిళా పేషెంట్లకు చికిత్స చేయాలంటే మగవాడైన తను ‘మగ స్పర్శ’ను ఎలా వదులుకోవాలి అనే తిప్పలు వచ్చి పడతాయి ఆయుష్మాన్‌కి. అతను హీరోగా నటిస్తున్న ‘డాక్టర్ జి’ ట్రైలర్‌లోని సంభాషణ ఇది. ఈ సినిమా రెండు వారాల్లో విడుదల కానుంది. డాక్టర్ల మీద చాలా సినిమాలు వచ్చాయి గతంలో. ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్.’ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా రోజుల క్రితమే రాజేష్ ఖన్నా ‘ఆనంద్’లో అమితాబ్ పోషించిన డాక్టర్ పాత్ర చాలా ముఖ్యం. ఇంకా ‘డాక్టర్ కోట్నిస్ కీ అమర్ కహానీ’, ‘దిల్ ఏక్ మందిర్’, ‘ఏక్ డాక్టర్ కీ మౌత్’... ఇవన్నీ డాక్టర్ ప్రొఫెషన్‌ను గొప్పగా చూపించాయి. ఇప్పుడు విడుదల కానున్న ‘డాక్టర్ జి’ కూడా ఈ రంగంలోని సాధకబాధకాలను చర్చించనుంది. అయితే కొంత సరదాగా. అది కూడా మగ గైనకాలజిస్ట్ సమస్యను తీసుకుంది. గైనకాలజీ అనగానే గర్భానికి సంబంధించిన విషయాలు, కాన్పులు, గర్భాశయ చికిత్సలు ఉంటాయి. పేషెంట్లు అనివార్యంగా స్త్రీలు కనుక డాక్టర్లు కూడా స్త్రీలే అయితే పరీక్షించడంలో ఇబ్బందులు ఉండవు. గుండె డాక్టరు, ఊపిరితిత్తుల డాక్టరు, ఈఎన్టి డాక్టరు మగవాడైనా పర్వాలేదు కాని మహిళా పేషెంట్లకు మగ గైనకాలజిస్టు అయితే ఇబ్బంది పడతారు. వారి కంటే ఎక్కువ ఇబ్బంది ఈ సినిమాలో ఆయుష్మాన్ పడనున్నాడు. కాని శరీరం ఎప్పుడైతే ‘రోగగ్రస్తం’ అవుతుందో ‘చికిత్స కు అవసరమైన స్థితికి’ చేరుకుంటుందో అప్పుడు ఆ శరీరం ‘స్త్రీదా’, ‘పురుషుడిదా’ అనే తేడా లేకుండా పోతుంది. పేషెంట్ కూడా ఆ సమయంలో తన ప్రాణం దక్కితే చాలు– వైద్యం ఎవరు చేసినా పర్వాలేదు అనే స్థితికి వెళుతుంది/వెళతాడు. ఇక్కడ కూడా ఒక అత్యవసర కాన్పు సమయంలో పేషెంట్ డాక్టర్ ఎవరనేది చూడదు. కాన్పు జరిగితే చాలనే అనుకుంటుంది. కాని ఆయుష్మాన్ ఖురానా తనలోని ఆ ఇబ్బందిని పోగొట్టుకుని శరీరాన్ని శరీరంలా చూసే స్థితికి చేరుకోవడమే ఈ కథ. ‘త్రీ ఇడియెట్స్’లో ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందు కనిపించని సన్నివేశం ఉంటుంది. అది క్లయిమాక్స్‌లో కొంతమంది ఐఐటి విద్యార్థులు కలిసి కాన్పు కష్టమైన తమ డీన్ కుమార్తెకు పురుడు పోయడం. ఈ సన్నివేశం తీయడం కత్తి సాము మీద నడవడం లాంటిది. ఆ సమయంలో అక్కడ ఉన్నది స్త్రీ కాదు... ఆ కుర్రవాళ్లు పురుషులు కాదు. ఆమె పేషెంట్... వాళ్లు ఆమెకు సాయం చేస్తున్న మనుషులు... అలా చూపించగలగడంలో దర్శకుడు పెద్ద సక్సెస్ సాధిస్తాడు. అందుకే ఆమిర్ ఖాన్ కాన్పు కావాల్సిన స్త్రీ నుంచి బిడ్డ తల బయటకు వచ్చిందో లేదో లోపల తొంగి చూసి చెక్ చేయడం అసభ్యంగా ఉండదు. ఆ సందర్భంలో ప్రేక్షకులతో సహా అందరూ తాము స్త్రీలో పురుషులో అనే సంగతి మరచి మానవులుగా మారతారు. వైద్యంలో వైద్యులు ఇదే సాధన చేస్తారు. ‘డాక్టర్ జి’లో సీనియర్ గైనకాలజిస్ట్‌గా పని చేసిన షెఫాలీ షా పాత్ర ముఖ్యం. ఈ పాత్రే పి.జి. చేస్తున్న ఆయుష్మాన్ ఖురానాకు వైద్యం నేర్పిస్తుంది. స్త్రీ దేహ సమస్యలను మనిషిగా అర్థం చేసుకోవడంలో సాయం చేస్తుంది. హీరోయిన్గా రకుల్ ప్రీత్ కనిపిస్తుంది. కథలో ఆమె కూడా మెడిసిన్‌లో పి.జి. చేసే స్టూడెంటే. మగవాళ్లు దర్శకులుగా ఉంటే ఇలాంటి సినిమాలు స్త్రీల దృష్టికోణం తప్పే అవకాశం ఉంది. కాని ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అనుభూతి కశ్యప్. ఈమె అనురాగ్ కశ్యప్, అభినవ్ కాశ్యప్ (దబంగ్ దర్శకుడు)ల సోదరి. ‘డాక్టర్ జి తీయడానికి చాలారోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తం మీద తీయగలిగాను’ అంటుందామె. మేనేజ్మెంట్ రంగంలో 8 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన అనుభూతి కశ్యప్ చివరకు తాను పని చేయాల్సింది సినిమాల్లోనే అని గ్రహించి మంచి ఉద్యోగాన్ని వదిలేసి అనురాగ్ కశ్యప్ తీస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ తీసింది. ‘డాక్టర్ జి’ ఆమె తొలి పెద్ద సినిమా అని చెప్పవచ్చు. మగ డాక్టర్ దగ్గర చూపించుకోవడం నామోషీ అని భావించే మహిళా పేషెంట్లు, మహిళా పేషెంట్ల విషయంలో కంఫర్ట్ ఫీలవని మగ డాక్టర్లు ఈ సినిమాను ఎలా వ్యాఖ్యానిస్తారో చూడాలి. మగవాళ్లు దర్శకులుగా ఉంటే ఇలాంటి సినిమాలు స్త్రీల దృష్టికోణం తప్పే అవకాశం ఉంది. కాని ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అనుభూతి కశ్యప్. ఈమె అనురాగ్ కశ్యప్, అభినవ్ కాశ్యప్ (దబంగ్ దర్శకుడు)ల సోదరి. ‘డాక్టర్ జి తీయడానికి చాలారోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తం మీద తీయగలిగాను’ అంటుందామె. -
విద్యాబాలన్.. ‘జల్సా’ మూవీ రివ్యూ
క్రైమ్ అండ్ పనిష్మెంట్... పురుష ప్రపంచంలో కనిపించే చర్య... ప్రతిచర్య. కాని స్త్రీల ప్రపంచంలో నేరం తర్వాత శిక్ష ఉంటుందా క్షమ ఉంటుందా? ‘జల్సా’ సినిమా చూడాలి. ఇద్దరు హీరోల రోజులు పోయి ఇద్దరు మహిళా ఆర్టిస్టుల రోజులు వచ్చాయి అని ఈ సినిమా ఎలుగెత్తి చాటుతోంది. విద్యాబాలన్, షెఫాలీ షా... వీళ్ల పోస్టర్‌తో సినిమా రిలీజ్ కావడం పెద్ద బాలీవుడ్ లీప్. మరో విశేషం సెరిబ్రల్ పాల్సీ ఉన్న తెలుగు పిల్లవాడు సూర్య కాశీభట్ల ముఖ్యపాత్ర పోషించి ఆకట్టుకోవడం. ఈవారం సండే సినిమా. మనిషి ఒక నేరం చేస్తాడు. చట్టం శిక్ష విధిస్తుంది. అన్నిసార్లు చట్టానికి చిక్కకపోవచ్చు. ఆ శిక్ష సాపేక్షం కావచ్చు. అంతమాత్రం చేత ఆ నేరం ఆ మనిషిని ఊరికే ఉంచుతుందా? మానసికంగా అది విధించే శిక్ష ఏమిటి? పశ్చాత్తాపంతో విధించుకునే శిక్ష ఏమిటి? శిక్షను తప్పించుకుందామనుకుని ప్రయత్నిస్తూ ఆ అశాంతి లో వేసుకునే శిక్ష ఏమిటి? మానవ ప్రవర్తన, స్వభావం, ఆలోచన ఎప్పటికప్పుడు వినూత్నం. పరిస్థితులకు ఒక్కోసారి బానిస. అవే పరిస్థితులపై విజేత. ‘జల్సా’ ఒక నేరం చేసిన స్త్రీకి, ఆ నేరం వల్ల నష్టపోయిన స్త్రీకి మధ్య నడిచే కథ. సాధారణంగా సినిమా అనేది వ్యాపారం కాబట్టి ఇలాంటి కథలు మగవారి మధ్య రాసుకుంటారు. ఆ మగవాళ్ల ఇమేజ్‌తో సినిమాలు ఆడుతాయి. కాని ఇప్పుడు స్త్రీలతో కథ నడిపించవచ్చని నిరూపిస్తున్నారు. ఇది ప్రయోగం. ప్రయత్నం. ముందంజ. కథ ఏమిటి? ముంబై నగరంలో ఉన్నత వర్గానికి చెందిన జర్నలిస్ట్ విద్యాబాలన్. ఆమె విడాకులు తీసుకుంది. ఆమెకు సెరిబ్రల్ పాల్సీ ఉన్న ఒక పన్నెండేళ్ల కొడుకు ఉన్నాడు. తోడుగా వృద్ధురాలైన తల్లిగా రోహిణి హట్టాంగడి. వీరందరికీ వండి పెట్టడానికి రుక్సానా అనే వంట మనిషి షెఫాలీ షా. విద్యా బాలన్ విలువలు ఉన్న జర్నలిస్ట్. ఆమె సత్యాన్ని వెలికి తీయడానికి ఎంతటి వారినైనా ఎదిరిస్తూ ఉంటుంది. కాని ఆమే సత్యాన్ని దాయవలసి వస్తే? ఒకరోజు అర్ధరాత్రి ఆమె డ్యూటీ నుంచి ముగించి కారు డ్రైవ్ చేస్తూ ఒక టీనేజ్ అమ్మాయిని ఢీ కొడుతుంది. ఊహించని ఈ ఘటనకు ఎలా రియాక్ట్ కావాలి? అక్కడ ఎవరూ ఉండరు. దిగి చూసే ధైర్యం లేదు. టీనేజ్ అమ్మాయిని ఆమె ఖర్మానికి వదిలి ఇల్లు చేరుకుంటుంది. కాని మరుసటి రోజు తెలుస్తుంది అలా తాను యాక్సిడెంట్ చేసి మృత్యువు అంచుదాకా (సీరియస్‌గా గాయపడుతుంది) పంపిన అమ్మాయి తన పనిమనిషి కూతురేనని. ఒక వైపు సంఘంలో పరువు, ఇంకో వైపు జైలు భయం, మరోవైపు ఎలా తప్పించుకోవాలి అనే ఆందోళన, తన సొంత ఇంటి మనిషిలాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాననే గిల్ట్. ఇవన్నీ ఆమెను వెంటాడుతాయి. సత్యాన్ని వెతుకులాడే జర్నలిస్ట్ తానే ఒక సత్యాన్ని తొక్కిపెట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. మరోవైపు పనిమనిషి అయిన షెఫాలీ షాకు ఇదంతా తెలియదు. ఎవరో యాక్సిడెంట్ చేశారు. తన యజమాని వైద్యం చేయిస్తోంది. కూతురు బతుకు బుగ్గిపాలైంది అనే శోకం. కాని ఒక నేరం జరిగితే అందుకు తప్పకుండా శిక్ష ఉంటుంది. చట్టానికి విద్యాబాలన్ దొరక్కపోవచ్చు. కాని షెఫాలీ షాకు దొరికిపోతుంది. తన కూతురికి యాక్సిడెంట్ చేసింది తన యజమానే అని తెలుసుకున్న షెఫాలీ షా ఏం చేసింది? చూడాలి. పరిస్థితులు ఒక ఘటన జరిగినప్పుడు పరిస్థితుల కొద్దీ మనిషి స్వభావం ఎలా మారిపోతుందో ఈ సినిమా చర్చిస్తుంది. విద్యాబాలన్ యాక్సిడెంట్ ముందు వరకూ ఒక మనిషి... అయ్యాక ఒక మనిషి. ఆమెకు తీవ్రమైన మానసిక ఆందోళన మొదలైపోతుంది. లిఫ్ట్‌లో, నాలుగ్గోడల మధ్య ఉండలేకపోతుంటుంది. పీడకలలు. ఇదంతా సత్యాన్ని దాచడం వల్లే. ఆమె తన స్వభావానికి విరుద్ధంగా ఈ విషయం బయటపడకుండా ఉండాలంటే ఎవరెవరిని ఎంతెంత పెట్టి కొనాలి అనే రంధిలో పడిపోతుంది. మరోవైపు తన కూతురులాంటి అమ్మాయిని జీవచ్ఛవంలా హాస్పిటల్లో చూసి లోలోపల కుమిలిపోతూ ఉంటుంది. అటువైపు షెఫాలీ షా చుట్టూ చాలామంది మూగుతారు. నేరం జరిగినప్పుడు శిక్ష పడాలి అని మొదట అనిపిస్తుంది. కాని పేదవాళ్లు ఆ సందర్భంలో ఒకలాగా శ్రీమంతులు ఒకలాగా వ్యవహరిస్తారని ఈ సినిమాలో చూపిస్తారు. పోలీసులే మధ్యవర్తులుగా మారి నీకో పది లక్షలు ఇప్పిస్తాం... కాంప్రమైజ్ అయిపో అని షెఫాలీని ఒప్పిస్తారు. గమనించండి. పేదవాళ్లు శ్రీమంతులకు నష్టం కలిగిస్తే ఇలాంటి అప్షన్ ఉండదు. వారు జైలుకు వెళతారు. షెఫాలీ అంగీకరిస్తుంది. కాని చివరకు నేరం చేసింది తన యజమానే అనుకున్నాక ఆమె ప్రతిచర్య వేరేగా ఉంటుంది. ఆ ప్రతిచర్య ఏమిటి? స్త్రీ అంటే క్షమ. క్షమించడమే. కాని ఇదంతా గ్రిప్పింగ్‌గా ఉంటుంది చూడటానికి. ఆ పిల్లాడు ఈ సినిమాలో విద్యాబాలన్ కుమారుడుగా వేసిన సూర్య కాశీభట్ల మరో ముఖ్యపాత్ర. ఈ పాత్ర ఒక సంకేతం కావచ్చు. కన్నకొడుకు సెరిబ్రల్ పాల్సీ (మాట, కదలికల లోపం)తో ఉన్నప్పటికీ విద్యా బాలన్ ఆ పిల్లాణ్ణి ప్రేమించకుండా ఉంటుందా? ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లాడికి వంట మనిషిగా పని చేసే షెఫాలీ కూడా వాణ్ణి ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లాడు సంపూర్ణుడు కాడు. లోపం ఉన్నవాడు. తాము ఇష్టపడే మనుషులు సంపూర్ణులు అయి ఉండరు. ఏవో ఒక లోపాలు ఉంటాయి. తప్పులు జరుగుతాయి. పొరపాట్లు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంతమాత్రాన ఆ బంధాలను తెంపేసుకోలేము. కఠినమైన శిక్షలు విధించలేము. క్షమ ఒక మార్గం ఏమో వెతకాలి. ఏమంటే శిక్ష కంటే క్షమ గొప్పది. ఈ సినిమా అలాంటి ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. విద్యా బాలన్, షెఫాలీ... వీరద్దరి గొప్ప నటనను చూడొచ్చు. సూర్య కూడా ఎంతో గొప్పగా నటిస్తాడు. కథ ఇంకా బాగుండొచ్చు. క్లయిమాక్స్ అసంపూర్ణం అనిపించవచ్చు. కాని అసంపూర్ణతను ప్రేమించమనే కదా డైరెక్టర్ సురేశ్ త్రివేణి చెబుతున్నది. అమేజాన్ ప్రైమ్‌లో ఉంది. -
Shefali Shah: రెస్టారెంట్ బిజినెస్‌లోకి నటి... పగటి‘కళ’లు నిజమవుతాయి!
Shefali Shah Opens Jalsa Restaurant In Ahmedabad How It Named Specialities: ‘పగటి కలలు నిజం కావు’ అంటారు. మరి పగటి‘కళ’లు? కచ్చితంగా నిజమవుతాయనే చెబుతుంది బాలీవుడ్ నటి, డైరెక్టర్ షెఫాలి షా. చిన్న పాత్ర అయినా రామ్‌గోపాల్‌వర్మ ‘సత్య’ సినిమాలో ప్యారీ మాత్రేగా గుర్తుండి పోయేలా నటించింది షా. ఒకవైపు సినిమాలు, మరో వైపు షార్ట్‌ఫిల్మ్, వోటిటీ ఫిల్మ్... ఇంత బిజీలోనూ షెఫాలి ఎప్పుడూ ఒక పగటి‘కళ’ కనేది! ఆ కల ఇలా ఉంటుంది... ఒకచోటికి అందరూ వస్తారు. వేడివేడి తేనీరు ఆస్వాదిస్తూనో, ఘుమఘుమలాడే అపరిచిత వంట రుచులను మెచ్చుకుంటూనో పక్కాగా కళల గురించి మాట్లాడుకుంటారు. ‘బంగారం ధర ఎంత పెరిగింది?’ ‘క్రిస్టో కరెన్సి నన్ను మరోస్థాయికి తీసుకెళ్లిందనుకోండి’ ‘ఈమధ్య కొత్త కారు కొన్నాను’ ఇలాంటి మాటలేవీ అక్కడ వినిపించవు. స్థూలంగా చెప్పాలంటే చూసిన నాటకం గురించి, విన్న సంగీతం గురించి, చదివిన పుస్తకం గురించి గంటలకొద్దీ మాట్లాడుకుంటారు. ఒకరి నుంచి మరొకరు విలువైన విషయాలు నేర్చుకుంటారు...... ఎట్టకేలకు తన కలను నిజం చేసుకుంది షెఫాలి. అహ్మదాబాద్ (గుజరాత్)లో ‘జల్సా’ పేరుతో ఒక రెస్టారెంట్ ప్రారంభించింది. టేబుల్ మ్యాట్స్, నేప్కిన్స్ ఎంపిక నుంచి గోడలపై పెయింటింగ్స్ వరకు అన్నీ స్వయంగా తానే చేసింది. విద్యాబాలన్‌తో కలిసి ‘జల్సా’ అనే సినిమాలో నటించింది షెఫాలి. తనకు ‘జల్సా’ అనే పదం చాలా ఇష్టం. దానిలో ‘ఉత్సాహం, ఉద్వేగం’ ఉంటాయి అంటుంది. ‘జల్సా’ అనేది మోర్ దేన్ ఫుడ్‌లాంటి రెస్టారెంట్! ఏ ఉదయం పూటో ‘జల్సా’కు వెళితే కమ్మనీ కాఫీ తాగుతూ కళ్యాణిరాగాన్ని ఆస్వాదించవచ్చు. సాయంత్రం స్నాక్స్‌తో పాటు తోలుబొమ్మలాటను ఎంజాయ్ చేయవచ్చు. ఒక్కటా రెండా....అన్ని రకాల కళలు, కళాకారులకు ఇదొక వేదిక అయింది. ‘కళల కార్నివాల్’ ‘సెలబ్రేషన్ ఆఫ్ ఫ్రెండ్స్’ అయింది. ఇలాంటి ‘జల్సా’లను దేశంలోని ముఖ్యనగరాల్లో ప్రారంభించాలనేది షెఫాలి మరో కల. ‘జల్సాలో భోజనంతో పాటు రకరకాల అనుభవాలను కూడా వడ్డిస్తాం’ అని సరదాగా అంటుంది షెఫాలి. ‘కళ అంటే సృజన మాత్రమే కాదు సామరస్యం కూడా’ అంటారు తాత్వికులు. ‘జల్సా’కు వెళ్లినవారికి ఆ సామరస్యం తప్పకుండా కనిపిస్తుంది! చదవండి: Shraddha Parekh: చేతిని గట్టిగా పట్టుకుంటే ఇంటర్నల్ బ్లీడింగ్.. ఎముకలు విరిగేవి.. 20 ఏళ్ల తర్వాత -
విడాకులు: తప్పంతా నాదేనా.. వేశ్య పాత్రలు పోషించినంత మాత్రాన
ముంబై: విడాకులు తీసుకున్న మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఈ సమాజానికి అలవాటు అని టీవీ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ షెఫాలి జరీవాలా అన్నారు. పురుషుడు పది పెళ్లిళ్లు చేసుకున్నా కూడా ఎవరూ నోరు మెదపరని, అదే స్త్రీ రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమె క్యారెక్టర్‌ను శంకిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాంటా లగా’ వీడియోతో పాపులర్ అయిన షెఫాలి జరీవాలా 2004లో మ్యుజీషియన్ హర్మీత్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. అనంతరం షెఫాలి, నటుడు ప్రయాగ్ త్యాగిని రెండో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి తాజాగా వెల్లడించారు. ‘‘చిన్న చిన్న విషయాలకు కూడా మహిళలను నిందించడం చాలా మందికి అలవాటు. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే.. మనం సంతోషంగా ఉన్న ఒక్క ఫొటోను షేర్ చేసినా కూడా వారు సహించరు. ప్రతీ విషయాన్ని జడ్జ్ చేయాలనే చూస్తారు. ఇదంతా ఎదుటి వాళ్లకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? అసలు మహిళలనే ఎందుకు అలా జడ్జ్ చేస్తారు. ముఖ్యంగా విడాకులు తీసుకున్న స్త్రీల గురించి చులకనగా మాట్లాడతారు. నేను.. నా మొదటి భర్తతో విడిపోయిన తర్వాత.. ‘‘ఆమే ఏదో తప్పు చేసి ఉంటుంది. తను కాంటా లగా గర్ల్ కదా. చాలా బోల్డ్. అందుకేనేమో విడాకులు’’అంటూ నీచంగా మాట్లాడారు. సినిమాల్లో వేశ్య, ప్రతినాయక, బోల్డ్ పాత్రలు పోషిస్తే నిజ జీవితంలో కూడా అలాగే ఉంటామని అనుకోవడం పొరబాటు’’ అని ఉద్వేగానికి లోనయ్యారు. కాగా కాంటా లగా పాట(2002)తో బోల్డ్ నటిగా గుర్తింపు పొందిన షెఫాలీ.. నచ్ బలియే 2, బిగ్‌బాస్ 13 వంటి పలు రియాలిటీ షోలతో పాటు, పలు వెబ్‌సిరీస్‌లలోనూ నటించారు. చదవండి: భర్తతో విడాకులు; మళ్లీ ప్రేమలో పడ్డా: నటి -
మొదటి పెళ్లి.. మానసిక హింసకు గురయ్యా: నటి
'కాంటా లగా..' మ్యూజిక్ వీడియోతో ఒక్కసారిగా ఫేమస్ అయింది షెఫాలీ జరీవాలా. ఆ మధ్య బుల్లితెర రియాలిటీ షో హిందీ బిగ్‌బాస్‌లోనూ సందడి చేసిన ఈ భామ హర్మీత్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. కానీ వీరి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. వైవాహిక జీవితంలో తను మానసిక హింసకు గురయ్యానని అందుకే విడాకులిచ్చేశానని చెప్తోంది షెఫాలీ. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. హింస శారీరకంగా మాత్రమే ఉండదు అని అది మానసికంగా కూడా ఉంటుందని చెప్తోంది. అది అనుభవించినప్పుడు జీవితంలో సంతోషమనేదే మిగలదని పేర్కొంది. "నేను స్వతంత్రురాలిని. నా డబ్బు నేను సంపాదించుకుంటాను. కాబట్టి నా నిర్ణయాలు కూడా నేనే తీసుకుంటాను. కానీ మన సమాజం ఈ విడాకుల ప్రక్రియను నిషిద్ధం అన్నట్లుగా చూస్తుంది. అయితే దాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. మనకేం అనిపిస్తుందో అదే చేయాలి. అందుకే నా జీవితంలో విడాకులు తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు వెనకడుగు వేయలేదు. ఆ సమయంలో చాలామంది మద్దతుగా నిలబడ్డారు కూడా" అని షెఫాలీ చెప్పుకొచ్చింది. మొదటి పెళ్లి పెటాకులైన తర్వాత పరాగ్ త్యాగిని రెండో పెళ్లి చేసుకున్న ఆమె త్వరలోనే ఓ ఆడపిల్లను దత్తత తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయని, త్వరలోనే తమ ఇంట్లో చిన్నారి అల్లరి మొదలవబోతుందని తెలిపింది. చదవండి: ఆ వార్తల్లో నిజం లేదు.. మణిరత్నం సినిమాలు భద్రపరుస్తాం -
‘దూరమైనా.. స్నేహంగానే ఉన్నాం’
'కాన్టా లగా' గర్ల్ షెఫాలీ జరీవాలా, ‘బాలికా వధు’ సీరియల్ ఫేం సిద్ధార్థ్ శుక్లా కొంత కాలం డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ బిగ్‌బాస్-13లో పాల్గొని హౌజ్‌లో అభిమానులను అలరించారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు షెఫాలీ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘మొదట బిగ్‌బాస్ హౌజ్‌లో మేమిద్దరం గొడవ పడ్డాము. సిద్ధార్థ్ సీక్రెట్ రూమ్‌కి వెళ్లి వచ్చాక మా మధ్య స్నేహం పెరిగింది. మేమిద్దరం చాలా లాజికల్‌గా ఆలోచిస్తాము. మా అభిరుచులు కూడా ఒకేలా ఉంటాయి. మేము ట్రావెల్, విశ్వం, బుల్లెట్ రైళ్లు వంటి పలు విషయాలు గురించి చర్చించుకున్నాం. మేము డేటింగ్ చేయటం ఆపేసిన తర్వాత కూడా ఒకరి పట్ల ఒకరం స్నేహంగానే ఉండేవాళ్లం’ అని షెఫాలీ చెప్పుకొచ్చారు. పదేళ్ల క్రితం షెఫాలీ జరీవాలా, సిద్ధార్థ్ శుక్లా సహజీవనం చేశారు. అయితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ జంట పలుకారణాలతో విడిపోయారు. కాగా, 2014లో షెఫాలీ.. టీవీ నటుడు పరాగ్ త్యాగిని వివాహం చేసుకున్నారు. తాజాగా షెఫాలీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు షెఫాలీ ప్రెగ్నెంట్ అయ్యారని పలు కామెంట్లు చేశారు. దీనిపై షెఫాలీ స్పందిస్తూ.. తను ఎక్కువగా ఆహారం తీసుకోవటం వల్ల బొద్దుగా కనిపించాని క్లారిటీ ఇచ్చారు. ఇక బిగ్‌బాస్-13 ట్రోఫీని సిద్ధార్థ్ శుక్లా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా రూ.40 లక్షల ప్రైజ్‌మనీతో పాటు లగ్జరీ కారును కూడా అతడు సొంతం చేసుకున్నాడు. -
కరోనా వార్తలపై నటి క్లారిటి
సాక్షి, ముంబై : తనకు, తన కుటుంబానికి కరోనా సోకిందని వస్తోన్న వార్తలను నటి షెఫాలి షా స్పందించారు.తన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, దాని ద్వారా తనకు కరోనా సోకిందంటూ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేశారంటూ తెలిపింది.అయితే తన ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూ ఎంతో మంది మెసేజ్‌లు,కాల్స్ చేశారని వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వచ్చిందంటూ వస్తోన్న వార్తలపై ఫేస్బుక్ అకౌంట్లో ఇలా చెప్పుకొచ్చింది. "నిన్న రాత్రి నా ఎఫ్బి అకౌంట్ హ్యాక్ అయింది. అయితే దీంతో ఓ రకంగా మంచే జరిగింది. ఎంతోమంది నాకు కాల్స్, మెసేజ్‌లు చేసి నా ఆరోగ్య పరిస్థిని తెలుసుకున్నారు. కొందరు మీకు మాట్లాడాలనిపిస్తే దయచేసి ఫోన్ చేయండి అంటూ వాళ్ల ఫోన్ నెంబర్లు కూడా షేర్ చేశారు. వారిలో కొంతమందిని అయితే నేను బహుశా ఒకటి,రెండు సార్లు కలిసుంటూ వారు కూడా నా హెల్త్ విషయంలో ఎంతో ఆందోళన చెందారు. మీ అందరి ప్రేమకు పేరుపేరున ధన్యవాదాలు" అంటూ తనపై వస్తోన్న ఫేక్ న్యూస్‌పై షెఫాలి క్లారిటీ ఇచ్చింది. -
విక్రమ్ గౌడ్ డైరెక్షన్లో కాల్పుల డ్రామా
హైదరాబాద్ : మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల కేసులో మిస్టరీ ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అనంతపురానికి చెందిన నలుగురు నిందితులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులను పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ముఠాకు, విక్రమ్ గౌడ్‌కు గతంలోనే పరిచయం ఉన్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. అంతేకాకుండా ఈ కాల్పుల సూత్రధారి విక్రమ్ గౌడేనని పోలీసులు తమ విచారణలో తేల్చారు. సానుభూతి కోసమే విక్రమ్ కాల్పుల పథకం రచించినట్లు తెలుస్తోంది. తనకు తెలిసినవారితోనే తతంగం నడిపినట్లు సమాచారం, తన ఇంటి వెనుక కొత్త చెరువులో గన్ పడేసినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో విక్రమ్‌గౌడ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. మరోపక్క ఆర్థిక ఇబ్బందులు, ఆయుధ లైసెన్స్ పునరుద్ధరణ, కుటుంబానికి దగ్గర కావడం తదితర కారణాల నేపథ్యంలో ఈ కథ మొత్తానికీ విక్రమ్‌గౌడే సూత్రధారా అన్న కోణాన్నీ పరిగణలోకి తీసుకుని ఆరా తీశారు. ఉదంతం జరిగిన విక్రమ్‌గౌడ్ ఇంటికి సమీపంలోనే ఆపోలో ఆస్పత్రి సైతం ఉండటంతో ఇంటినే స్పాట్‌గా ఎంచుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో విక్రమ్ ప్రమేయం బయటపడి, ఆయన ప్లాన్ ప్రకారమే కాల్పులు జరిగినట్లు లేదా కాల్చుకున్నట్లు తేలితే ఆయనతో పాటు సంబంధం ఉన్న వారిపైనా కేసుల నమోదుకు నిర్ణయించారు. అగంతకులు వాడిని ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్న అతడు ఈ కాల్పుల డ్రామాకు తెరతీశాడు. కాగా పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు విక్రమ్‌తో పాటు అతడి భార్య షిపాలీపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. -
విక్రమ్‌పై వస్తున్న కథనాలు అవాస్తవం: షిఫాలీ
హైదరాబాద్ : మాజీమంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. కాగా కాల్పుల ఘటనకు సంబంధించి తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని విక్రమ్ గౌడ్ భార్య షిఫాలీ తెలిపారు. మీడియాలో విక్రమ్‌పై వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. ఆరోజు ఏం జరిగిందో పోలీసులకు చెప్పామని, విక్రమ్‌పై ఎవరు దాడి చేశారో పోలీసులే గుర్తించాలన్నారు. తమకు మంచి చేయకపోయినా దుష్ప్రచారం చేయవద్దని షిఫాలీ విజ్ఞప్తి చేశారు. పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు. విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని షిఫాలీ చెప్పారు. మరోవైపు సంఘటన జరిగి 24 గంటలు దాటినప్పటికీ పోలీసులు ఎలాంటి నిర్థారణకు రాలేకపోతున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు పలుదఫాలుగా ప్రశ్నించినప్పటికీ విక్రమ్ గౌడ్ నోరు మెదపనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విక్రమ్ భార్య షిఫాలీని ఇవాళ పోలీసులు మరోసారి విచారణ చేశారు. కాగా కాల్పుల్లో మూడో వ్యక్తి ప్రమేయం లేదని నిర్ధారించిన పోలీసులు, విక్రమ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అలాగే విక్రమ్ తండ్రి ముఖేష్ గౌడ్ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా 2015లోనే రెన్యువల్ ముగిసినప్పటికీ అనధికారికంగా రెండేళ్లుగా ముఖేష్ వద్దే తుపాకీ ఉన్నట్లు సమాచారం. -
విక్రమ్ గౌడ్‌కు పూరీ జగన్నాథ్ పరామర్శ
హైదరాబాద్ : కాల్పుల్లో గాయపడ్డ విక్రమ్ గౌడ్‌ను దర్శకుడు పూరీ జగన్నాథ్ పరామర్శించారు. జూబ్లీహిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా విక్రమ్‌గౌడ్ సినిమా ప్రొడ్యూసర్‌గా కూడా చిత్రపరిశ్రమకు పరిచయం. సినీ హీరో నితిన్ సోదరి నిఖితారెడ్డితో కలిసి ఆయన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఇష్క్, గుండెజారి గల్లంతైయ్యిందే సినిమాలను నిర్మించారు. అలాగే విక్రమ్‌గౌడ్...కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ విక్రమ్‌గౌడ్‌ను మేయర్ అభ్యర్థిగా కూడా ప్రకటించింది. మరోవైపు అలంపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా విక్రమ్ గౌడ్‌ను పరామర్శించారు. గత కొద్దిరోజులుగా విక్రమ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. -
‘నా భర్తను ఎవరో చంపడానికి యత్నించారు’
హైదరాబాద్ : కాల్పుల ఘటనలో గాయపడ్డ విక్రమ్‌గౌడ్ భార్య శిఫాలి మాత్రం తన భర్తపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. దర్గాలో అన్నదానం కోసం ఉదయం రెండున్నర గంటలకు నిద్ర లేచామని తనకంటే ముందు భర్త హాల్లోకి వెళ్లారని తెలిపారు. ఇంతలోనే కాల్పుల శబ్ధం రావడంతో.... కిందకు దిగానని అప్పటికే విక్రమ్ గౌడ్ రక్తపు మడుగులో ఉన్నారని చెప్పరు. ఒక వ్యక్తి కాల్పులు జరిపాడని భర్త విక్రమ్‌గౌడ్ తనతో చెప్పాడని శిఫాలి చెప్పారు. తన భర్తను ఎవరో చంపడానికి యత్నించారని ఆరోపించిన ఆమె, కాల్పులు జరిపిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని... బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాగా విక్రమ్ గౌడ్‌కు గత కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఈ బెదిరింపులకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారం కిందటే గన్ లైసెన్స్ కోసం అప్లయి చేయగా పోలీసులు తిరస్కరించారన్నారు. తెలిసినవాళ్లే కాల్పులు జరిపారని, ఒక్కరే వచ్చి కాల్పులు జరిపినట్లు విక్రమ్ చెప్పాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. విక్రమ్ కోలుకున్న తర్వాత నిందితుడి పేరు చెబుతాడన్నారు. -
విక్రమ్ కాల్పుల ఘటనపై దర్యాప్తు వేగవంతం: సీపీ
హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేందర్ రెడ్డి కాల్పుల ఘటన వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. రోజు తెల్లవారుజామున 3 గంటలకు కాల్పులు జరిగాయన్నారు. ఆ సమయంలో వాచ్మెన్, అతని భార్య, ఇంకో పనిమనిషితో పాటుగా భార్యాభర్తలు (విక్రమ్ గౌడ్, శిఫాలీ) మాత్రమే ఉన్నారని, సంఘటన జరగటం బాధాకరమని,ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు. విక్రమ్ శరీరంపై రెండు గాయాలున్నాయని, ఎలా జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా వెస్ట్ జోన్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ కూడా విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. విక్రమ్ గౌడ్ నివాసంలో ఆధారాలు సేకరించామని, క్లూస్‌టీమ్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయన్నారు. తెల్లవారుజామున పెద్దమ్మ గుడికి వెళ్లే సమయంలో కాల్పుల శబ్ధం వినిపించిందని విక్రమ్ భార్య తెలిపారని, ఆస్పత్రికి తీసుకు వచ్చిన సమయంలో విక్రమ్ స్పృహలోనే ఉన్నారని సీపీ పేర్కొన్నారు. ఏం జరిగిందనేది కొంత సమయం తర్వాత చెబుతానన్నాడని, విక్రమ్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. మొత్తం రెండు రౌండ్లు కాల్పులు జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఇక కాల్పుల సమయంలో ఫ్లోర్‌పై రక్తం పడి ఉందని, తుడిచి వేసినట్లుగా కనిపిస్తోందన్నారు. తెలియక తుడిచానని వాచ్మెన్ చెబుతున్నాడని సీపీ చెప్పారు. విక్రమ్ వద్ద ఎలాంటి ఆయుధం లేదని, సమీపంలోని అన్ని సీసీ ఫుటేజ్‌లు సేకరించామన్నారు. వాహనాల కదలికలను పరిశీలిస్తున్నామని, నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామన్నారు. కాగా ఘటన జరిగి ఏడు గంటలు దాటుతున్నా....కాల్పుల కారణాలపై పోలీసులు నిర్దారణకు రాలేకపోతున్నారు. బయట వ్యక్తులే తమ వాడిపై కాల్పులు జరిపాడని...విక్రమ్‌గౌడ్ బంధువులు ఆరోపిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు. కొన్ని రోజులుగా విక్రమ్‌గౌడ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అని కూడా బంధువులు అంటున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిగితేకానీ ఏమీ చెప్పలేమంటున్నారు. అయితే ఆగంతకులే కాల్పులు జరిపారనే దాన్ని తోసిపుచ్చుతున్నారు. ఆ మేరకు ఆధారాలు లభించనందు వల్లే పోలీసులు ఈ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాల్లో ఆగంతకులకు సంబంధించిన ఎలాంటి విజువల్స్ రికార్డు కాలేదని తెలిసింది. ఒక సమయంలో ఆత్మహత్యాకోణంపైనే పోలీసులు ఎక్కువుగా దృష్టి సారించారు. అయితే ఈ కోణంలోనూ ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆత్మహత్యాయత్నం చేసుకుంటే ఆయుధం ఏమూంది? దాన్ని ఎవరు మాయం చేశారు?. ఆత్మహత్యే అయితే దాన్ని దాచాల్సిన అవసరం బంధువులకు ఎందుకొచ్చింది? అనేది కీలకంగా మారింది. ఇదిలా ఉంటే అసలు విక్రమ్‌గౌడ్‌కు లైసెన్స్ వెపనే లేదని పోలీసులు చెబుతున్నారు. మరి లైసెన్స్ గన్ లేకపోతే కాల్పులకు కారణమైన గన్ ఎవరిది?. విక్రమ్‌గౌడ్ అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారా? మరెవరిదైనా ఇంట్లో పెట్టుకున్నారా? ఇలా ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు కాల్పులు జరిగింది పిస్టల్తోనో, రివాల్వర్తోనూ అనేది కూడా అంతుపట్టడం లేదు. అయితే తాము అన్ని కోణాల్లో శాస్త్రీయ విచారణ చేసిన తర్వాతే ఒక నిర్ణయానికొస్తామని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. విక్రమ్‌గౌడ్‌పై ఆగంతకులు వచ్చి కాల్పులు జరిపినట్టు చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. బెదిరింపు కాల్స్ విక్రమ్‌కు వచ్చాయా లేదా అనేది తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. మిస్టరీగా మారిన కాల్పుల కేసులో అన్ని కోణాల్లో విచారిస్తున్నామంటున్న డీసీపీ తెలిపారు. సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేశామని, సీసీ కెమెరా, ఫోన్ కాల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
విక్రమ్ కాల్పుల ఘటనలో పలు అనుమానాలు!
హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విక్రమ్ గౌడ్‌కు అసలు లైసెన్స్ ఆయుధమే లేదని పోలీసులు చెబుతున్నారు. పటిష్టమైన భద్రత ఉన్న ఇంట్లోకి బయటి నుంచి దుండగులు వచ్చినట్లు ఆనవాళ్లు లభించలేదు. అంతేకాకుండా సంఘటనా స్థలంలో భార్యాభర్తలే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కాల్పుల సమయంలో ఔట్ హౌస్‌లో సెక్యూరిటీ గార్డు ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమ్ గౌడ్‌పై కాల్పులు జరిపిందెవరు?. బయట నుంచి ఎవరు రాకుంటే లోపల ఉన్నదెవరు? ఇంట్లోనే ఉన్నవారు కాల్పులు జరిపారా? లేక విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇక తన ఫిర్యాదులో కూడా విక్రమ్ భార్య శిఫాలీ ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు. అలాగే ఘటనా స్థలంలో రక్తం మరకలు తుడిచేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాల్పుల గురించి ఇప్పుడే ఏం చెప్పలేం.. కాల్పుల ఘటనపై విచారణ చేస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ‘కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లో ఇద్దరు (భార్యభర్తలు) మాత్రమే ఉన్నారు. బయట వ్యక్తులు వచ్చి కాల్పులు జరపటానికి అవకాశాలు లేవు. కాల్పులకు వాడింది...7.9 ఎమ్ఎమ్ పిస్తోలుగా అనుమానిస్తున్నాం. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఇక కాల్పుల గురించి ఇప్పుడే ఏం చెప్పలేం. విక్రమ్ గౌడ్‌కు ఆయుధాల లైసెన్స్ లేదు. ఇక దాడి ఎలా జరిగిందనే విషయాన్ని విక్రమ్ చెప్పలేకపోతున్నారు’ అని డీసీపీ వెల్లడించారు. కాగా విక్రమ్ పలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాల్పుల ఘటనలో గాయపడిన విక్రమ్ గౌడ్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల్లో విక్రమ్ గౌడ్ చేయి, పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అతడి శరీరం నుంచి రెండు బుల్లెట్లను వైద్యులు వెలికితీశారు. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యపరిస్ధితి నిలకడగా ఉంది. ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్ మరోవైపు సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. షార్ట్ వెపన్‌కు సంబంధించి రెండు ఖాళీ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఘటనా స్థలం నుంచి ఎటువంటి ఆయుధాలు స్వాధీనం చేసుకోలేదని డీసీపీ చెప్పడం గమనార్హం. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా విక్రమ్ గౌడ్ ఇంటి పరిసరాల్లోనే తచ్చాడినట్లు సమాచారం. స్నానం చేసి వచ్చేసరికి కాల్పులు: శిఫాలీ ఈ కాల్పుల సంఘటనపై విక్రమ్ గౌడ్ భార్య శిఫాలీ మాట్లాడుతూ...‘శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉదయమే గుడికి వెళ్లాలనుకున్నాం. నేను స్నానం చేసి వచ్చేసరికి కాల్పులు జరిగాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చాను.’ అని తెలిపారు. గత తొమ్మిది నెలలుగా ఫిల్మ్‌నగర్‌లో ఉంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా, తమ కుటుంబంలో ఎవరికీ కలహాలు లేవని విక్రమ్ బాబాయ్ మధు గౌడ్ చెప్పారు. కాల్పులకు పాల్పడిన వారు ఎవరో తెలియదని అన్నారు.