'కాంటా లగా..' మ్యూజిక్ వీడియోతో ఒక్కసారిగా ఫేమస్ అయింది షెఫాలీ జరీవాలా. ఆ మధ్య బుల్లితెర రియాలిటీ షో హిందీ బిగ్‌బాస్‌లోనూ సందడి చేసిన ఈ భామ హర్మీత్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. కానీ వీరి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. వైవాహిక జీవితంలో తను మానసిక హింసకు గురయ్యానని అందుకే విడాకులిచ్చేశానని చెప్తోంది షెఫాలీ. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. హింస శారీరకంగా మాత్రమే ఉండదు అని అది మానసికంగా కూడా ఉంటుందని చెప్తోంది. అది అనుభవించినప్పుడు జీవితంలో సంతోషమనేదే మిగలదని పేర్కొంది.
"నేను స్వతంత్రురాలిని. నా డబ్బు నేను సంపాదించుకుంటాను. కాబట్టి నా నిర్ణయాలు కూడా నేనే తీసుకుంటాను. కానీ మన సమాజం ఈ విడాకుల ప్రక్రియను నిషిద్ధం అన్నట్లుగా చూస్తుంది. అయితే దాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. మనకేం అనిపిస్తుందో అదే చేయాలి. అందుకే నా జీవితంలో విడాకులు తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు వెనకడుగు వేయలేదు. ఆ సమయంలో చాలామంది మద్దతుగా నిలబడ్డారు కూడా" అని షెఫాలీ చెప్పుకొచ్చింది. మొదటి పెళ్లి పెటాకులైన తర్వాత పరాగ్ త్యాగిని రెండో పెళ్లి చేసుకున్న ఆమె త్వరలోనే ఓ ఆడపిల్లను దత్తత తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయని, త్వరలోనే తమ ఇంట్లో చిన్నారి అల్లరి మొదలవబోతుందని తెలిపింది.
చదవండి: ఆ వార్తల్లో నిజం లేదు.. మణిరత్నం సినిమాలు భద్రపరుస్తాం
Comments
Please login to add a commentAdd a comment