'Charu Asopa and I can get back together', says Rajeev Sen just days after divorce - Sakshi
Sakshi News home page

ఇప్పుడు విడిపోయాం.. కానీ ఎప్పటికైనా మళ్లీ కలుస్తాం: నటుడు

Published Wed, Jun 14 2023 3:26 PM | Last Updated on Wed, Jun 14 2023 4:12 PM

Rajeev Sen: Charu Asopa and I Can Get Back Together Again - Sakshi

బుల్లితెర నటి చారు అసోపా, మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌ విడిపోయిన సంగతి తెలిసిందే! 2022లోనే వీరు విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి విడిగానే జీవిస్తున్నారు. ఇటీవల జూన్‌ 8న అధికారికంగా విడాకులు మంజూరైనట్లు తెలిపారు. ఈ క్రమంలో తాను చేసింది సరైన పనే అని చారు అభిప్రాయపడుతుండగా రాజీవ్‌ మాత్రం బాధలో కూరుకుపోయినట్లు కనిపిస్తున్నాడు. విడాకులు వచ్చి వారం రోజులు కాకముందే మళ్లీ కలిస్తే బాగుండని ఆశపడుతున్నాడు.

తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మేమిద్దరం కలిసి ఉండనంత మాత్రాన నా కూతురి మీదున్న ప్రేమ తగ్గదు. నా బిడ్డ విషయంలో మేమిద్దరం ఒకరికి ఒకరం మద్దతుగా ఉంటాం. ఒక తండ్రిగా నా కూతురికి నేను ఎక్కువ సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను. నేనెప్పుడూ చారు క్షేమాన్ని కోరుకుంటాను. తనకు ఎప్పుడూ అండగా ఉంటాను. తనపై నా ప్రేమ అలాగే ఉంటుంది. ఏదో ఒక రోజు మేము మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు రాజీవ్‌.

కాగా చారు అసోపా, రాజీవ్‌ సేన్‌ 2019 జూన్‌ 9న పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా 2021లో పాప పుట్టింది. ఆమెకు జియానా అని నామకరణం చేశారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ పాపకు తల్లిదండ్రులుగా మాత్రం ఉంటామని చెప్తున్నారు. ఇకపోతే రాజీవ్‌ ఇటీవలే 'హజ్రత్‌' అనే షార్ట్‌ ఫిలింలో నటించడమే కాక దాన్ని నిర్మించాడు కూడా! చారు విషయానికి వస్తే దేవాన్‌ కీ దేవ్‌.. మహదేవ్‌, మేరే అంగ్నే మే, జీ మా, బాల్‌ వీర్‌ వంటి పలు సీరియల్స్‌లో నటించింది.

చదవండి: ఆ స్థానంలో ప్రభాస్‌ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను: కృతీ సనన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement