24 ఏళ్ల కింద విడాకులు.. అది ముగిసిన చాప్టర్‌: నటుడు | Harsh Chhaya: My Divorce with Shefali Shah is a Closed Chapter | Sakshi
Sakshi News home page

Harsh Chhaya: కఠిన నిర్ణయం.. కానీ అది ముగిసిన చాప్టర్‌

Published Wed, Mar 27 2024 6:53 PM | Last Updated on Wed, Mar 27 2024 7:22 PM

Harsh Chhaya: My Divorce with Shefali Shah is a Closed Chapter - Sakshi

బాలీవుడ్‌లో పెళ్లి- విడాకులు అనేవి సర్వసాధారణమైపోయాయి. కొందరు విడాకులు తీసుకున్న తర్వాత కూడా మాజీ పార్ట్‌నర్‌తో స్నేహాన్ని కొనసాగిస్తుంటే మరికొందరు మాత్రం పరిచయమే లేనట్లు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. బాలీవుడ్‌ మాజీ దంపతులు షెఫాలి షా- హర్ష్‌ చాయ రెండో కోవలోకి వస్తారు.

కఠిన నిర్ణయం..
వీరిద్దరూ 1994లో పెళ్లి చేసుకోగా 2000వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది నటి.. దర్శకుడు విపుల్‌ అమృత్‌లాల్‌ షాను పెళ్లి చేసుకుంది. మరోవైపు హర్హ్‌ 2003లో నటి సునీత సేన్‌గుప్తాను పెళ్లాడాడు.  తాజాగా హర్ష్‌.. తన విడాకుల గురించి మాట్లాడుతూ.. అది చాలా కష్టమైన నిర్ణయమే.. విడాకులు తీసుకుని 20- 25 ఏళ్లవుతోంది. అయినా అది ముగిసిన చాప్టర్‌ అని దీర్ఘంగా నిట్టూర్చాడు.

అసౌకర్యంగా ఫీలవను..
మళ్లీ అతడే నోరు విప్పుతూ.. కానీ ఇప్పుడు మేము స్నేహితులుగా కూడా మాట్లాడుకోవట్లేదు. అలా అని తనతో మాట్లాడటానికి నాకు ఏ ఇబ్బందీ లేదు. తను నాకు ఎదురైనా సరే నేనేమీ అసౌకర్యంగా ఫీలవను అని చెప్పుకొచ్చాడు. అటు షెఫాలి కూడా పెళ్లిలో జీవితాంతం సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని దీవిస్తారు. కానీ ఇది అందరికీ వర్తించదని తర్వాత అర్థమైంది. అన్ని పెళ్లిళ్లు నూరేళ్లు ఉండవని తెలుసుకున్నాను. మా బంధం వర్కవుట్‌ కాలేదు.. దానికి మనం ఏం చేయలేం అని చెప్పుకొచ్చింది.

చదవండి: సిద్దార్థ్‌కు 21 ఏళ్ల క్రితమే పెళ్లి.. ఆ కారణం వల్లే విడాకులు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement