చచ్చినా సరే ఆ స్టార్ హీరోకి తల్లిగా మళ్లీ నటించను: ప్రముఖ నటి | 'I will never ever play mother to Akshay Kumar again': Shefali Shah - Sakshi
Sakshi News home page

Shefali Shah: హీరోలకు తల్లి పాత్రలు.. ఆ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published Tue, Oct 31 2023 11:03 AM | Last Updated on Tue, Oct 31 2023 11:13 AM

Actress Shefali Shah Comments On Akshay Kumar Mother Role - Sakshi

నటులు అన్నాక ఏ పాత్రయినా సరే చేయాలి. అలా వయసు తక్కువగా ఉన్నాసరే కొందరు లేడీ యాక్టర్స్.. తల్లి, ఆంటీ తరహా పాత్రలు చేస్తుంటారు. గుర్తింపుతో పాటు ఫన్నీ ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి క్రిటిసిజం ఎదుర్కొన్న ఓ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ స్టార్ హీరోకి తల్లిగా జీవితంలో మళ్లీ నటించనని క్లారిటీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!)

ఇంతకీ ఏమైంది?
'రంగీలా' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షెఫాలీ షా.. సత్య, గాంధీ లాంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. 2005లో రిలీజైన 'వఖ్త్: ద రేస్ ఎగైనెస్ట్ టైమ్' మూవీలో అక్షయ్ కుమార్‌కి తల్లిగానూ నటించింది. ఆ సినిమాలో నటించేటప్పటికీ.. అక్షయ్ కంటే షెఫాలీ నాలుగేళ్లు చిన్నది. కానీ మదర్ క‍్యారెక్టర్ చేసింది. తాజాగా ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. జీవితంలో మరోసారి అక్షయ్‍‌కి తల్లి పాత్ర చేయనని కుండ బద్ధలు కొట్టేసింది.

గత 25-30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాసరే గత నాలుగేళ్లుగానే బాగా పనిచేస్తున్నట్లు షెఫాలీ షా చెప్పుకొచ్చింది. షారుక్, అమితాబ్ బచ్చన్ ఎప్పటికీ స్టార్స్ అని చెప్పిన ఈమె.. ప్రస్తుత జనరేషన్‌లో అయితే రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ స్టార్స్ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. అయితే తాను మాత్రం ఎప్పటికీ స్టార్ యాక్టర్ కావాలనుకోవట్లేదని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: మూడు రోజుల వేడుక.. వరుణ్-లావణ్య పెళ్లి ముహూర్తం టైమ్ ఇదే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement