Actress Shefali Shah Reveals About She Was Inappropriately Harassed In Crowded Market - Sakshi
Sakshi News home page

Shefali Shah: మార్కెట్‌లో అభ్యంగా తాకారు, కంపరం అనిపించింది.. అయినా ఏం చేయలేకపోయా

Published Mon, Apr 10 2023 3:52 PM | Last Updated on Mon, Apr 10 2023 4:40 PM

Actress Shefali Shah Reveals About She Was Inappropriately Harassed In Crowded Market - Sakshi

బుల్లితెర నటి షెఫాలీ షాకు చేదు అనుభవం ఎదురైంది. మార్కెట్‌కు వెళ్లినప్పుడు తనను ఎవరో అభ్యంతరకర రీతిలో తాకారని వెల్లడించింది. మొదట ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని భావించిన ఆమె తాజాగా ఈ సంఘటన గురించి మీడియాకు వెల్లడించింది.

తాజాగా ఏఎన్‌ఐ పాడ్‌క్యాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. నేను గతంలో చెప్పినట్లు అందరూ రకరకాల అనుభవాలు ఫేస్‌ చేసి ఉంటారు. అందులో నేను ఎదుర్కొన్న ఓ చేదు సంఘటన గురించి చెప్తాను. నేను ఓసారి బాగా రద్దీగా ఉన్న మార్కెట్‌లో నడుచుకుంటూ వెళ్లాను. ఎవరో అనుచితంగా తాకడంతో కంపరంగా అనిపించింది. నేను గిల్టీగా ఫీలవడం కాదు కానీ ఇది నిజంగా సిగ్గుచేటు.

ఆ పనికిమాలిన చర్యను అలాగే వదిలేశారా? అని మీరడగవచ్చు. అవును.. ఆ సమయంలో అలానే వదిలేశాను. నేనే కాదు చాలామంది ఆ సమయంలో తామే ఏదో తప్పు చేసినట్లుగా ఫీలయ్యి దాన్ని మర్చిపోతారు. అలాంటి ధోరణికి మనం చెక్‌ పెట్టాలి. దాని గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పుకొచ్చింది.

కాగా షెఫాలీ షా.. 1995లో వచ్చిన రంగీలా సినిమా ద్వారా సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత సత్య సినిమా చేయగా ఈ చిత్రానికి ఉత్తమనటిగా ఫిలిం ఫేర్‌ అవార్డు అందుకుంది. ఇటీవల జల్సా, డార్లింగ్‌, డాక్టర్‌ జీ చిత్రాలతో మెప్పించింది. మరోవైపు ఢిల్లీ క్రైమ్‌, హ్యూమన్‌ వెబ్‌ సిరీస్‌లోనూ నటించగా తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement