
బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి ప్రస్తుతం సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సిరీస్‌లో శ్వేతా బసు ప్రసాద్, జావేద్ జాఫేరి ఐమీ ఐలా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ సిరీస్‌గా 'ఊప్స్ అబ్ క్యా'ను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 20 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాల్ కులకర్ణి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన సంఘటనలను వివరించింది. మొదటిసారి సినిమా ఆడిషన్‌కు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఆ సమయంలో చాలా ఇబ్బందిగా అనిపించిందని పేర్కొన్నారు.
సోనాలి కులకర్ణి మాట్లాడుతూ.. ' ఓ సినిమా ఆడిషన్ కోసం తన వద్ద ఉన్న ఏకైక పంజాబీ సూట్‌ను ధరించా. నాతో పాటు ఆడిషన్‌కు మరో 25 మంది అమ్మాయిలు హాజరయ్యారు. అయితే అప్పుడు డైరెక్టర్ గిరీష్ కర్నాడ్‌ను కలుస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. నేను లోపలికి వెళ్లగానే అక్కడ నా స్నేహితులు ఉన్నారు. వారిలో ఒకరిద్దరు నాకంటే పెద్దవాళ్లు కూడా ఉన్నారు. సిటీలో పేరున్న ఒకామె 'ఎందుకు వచ్చావ్' అని అడిగింది. ఆమె ప్రశ్నలోని వ్యంగ్యం నాకు అర్థం కాలేదు. అందిరిలాగే వర్క్‌షాప్‌కు వచ్చానని సమాధానం ఇచ్చా. కానీ ఆమె (ఆంటీ) నన్ను చూస్తూ కెమెరాలో ముదురుగా ఉండే అమ్మాయిలు చాలా బాగా కనిపించరని మీకు తెలియదా? అన్నారు. ఆ సమయంలో నాకు 16 ఏళ్ల వయసు. ఆమె మాటలతో చాలా ఇబ్బంది పడ్డా. చాలా డిస్టర్బ్ అయ్యా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అనిపించింది.' అని వెల్లడించారు.
ఆ తర్వాత జరిగిన ఆడిషన్‌లో డైరెక్టర్ గిరీశ్ కర్నాడ్ అందరినీ పలకరించాడు. ఆయన వచ్చాక నన్ను నేను పరిచయం చేసుకున్నా.. గిరీశ్ కర్నాడ్‌తో మాట్లాడిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. అంతకుముందు జరిగిన అవమానాన్ని మరిచిపోయేలా చేసింది. తాను 12వ తరగతి చదువుతున్నానని.. అంతేకాకుండా నాటకాల్లో చేస్తున్నట్లు డైరెక్టర్‌తో చెప్పినట్లు గుర్తు చేసుకుంది సోనాలి కులకర్ణి.
Comments
Please login to add a commentAdd a comment