Sonali Kulkarni
-
అమ్మాయిలు అలా కోరుకోవడంలో తప్పేముంది.. సోనాలిపై ఉర్ఫీ ఫైర్
బాలీవుడ్ సోనాలి కులకర్ణి భారతీయ మహిళలపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రస్తుత అమ్మాయిలు సోమరిపోతులుగా తయారయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె వ్యాఖ్యల పట్ల మరో నటి ఉర్ఫీ జావేద్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంచి సంపాదన ఉన్న భర్త కావాలని కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించింది. సోనాలి మాట్లాడిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది. పురుషులు శతాబ్దాలుగా స్త్రీలను కేవలం పిల్లలు కనే యంత్రాలుగా చూస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడింది. ఉర్పీ తన ట్విట్లో రాస్తూ..'ఆధునిక మహిళలు తమ పనితో పాటు ఇంటి పనులను కూడా చేస్తున్నారు. అలాంటి వారిని మీరు సోమరిపోతులు అని పిలుస్తున్నారా? మంచి సంపాదన ఉన్న భర్తను కోరుకోవడంలో తప్పేంటి? శతాబ్దాలుగా పురుషులు స్త్రీలను పిల్లలు కనే యంత్రంగా మాత్రమే చూశారు. వివాహానికి ప్రధాన కారణం కట్నం. మహిళలు కట్నం అడగడానికి భయపడకండి. అవును మీరు చెప్పింది నిజమే.. మహిళలు పని చేయాలి కానీ అది అందరికీ లభించని ప్రత్యేకమైన హక్కు.'. అంటూ పోస్ట్ చేసింది. How insensitive , whatever you said ! You’re calling modern day women lazy when they are handling their work as well as household chores together ? What’s wrong in wanting a husband whose earning good ? Men for centuries only saw women as child vending machine and yes the main… https://t.co/g1rQGyuSDg — Uorfi (@uorfi_) March 17, 2023 -
రూ.50 వేల శాలరీ, కారు ఉన్న బాయ్‌ఫ్రెండ్ కావాలి.. హీరోయిన్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ సోనాలి కులకర్ణి పెద్దగా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. కన్నడ సినిమాలతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, హిందీతో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించిన ఆమె నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దేశంలోని చాలా మంది అమ్మాయిలు సోమరిపోతులు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఆమెకు కొందరు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఆధునిక భారతీయ మహిళలపై సోనాలి కులకర్ణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె భారతీయ మహిళల గురించి మాట్లాడింది. ఈ రోజుల్లో బాగా సంపాదన, స్థిరపడిన వారినే భర్తగా కావాలని కోరుకుంటున్నారని తెలిపింది. సోనాలి మాట్లాడుతూ..'ఇండియాలో చాలా మంది అమ్మాయిలు సోమరిపోతులే. వారికి బాగా సంపాదించి, సొంతిల్లు ఉండాలని కోరుకుంటారు. రెగ్యులర్ ఇంక్రిమెంటట్స్ వచ్చే భర్త కావాలి. ఈ మధ్యకాలంలో మహిళలు తమ సొంతకాళ్లపై నిలబడటం మర్చిపోతున్నారు. తమ కోసం సంపాదించగలిగేలా మీ ఇళ్లలోని అమ్మాయిలను పెంచమని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. ఇంట్లో కొత్త ఫ్రిజ్ కావాలి. అందులో సగం మీరు చెల్లించండి. మిగిలిన సగం నేను చెల్లిస్తానని ఒక్క అమ్మాయియైనా చెప్పగలరా?. పురుషులకు 18 ఏళ్లు రాగానే కుటుంబానికి ఆర్ధికంగా మద్దతుగా ఉండేందుకు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కానీ 25 సంవత్సరాలు వచ్చిన మహిళలు మాత్రం తమ బాయ్ ఫ్రెండ్‌ను కావాల్సినవి కొనివ్వాలని బలవంతం చేస్తున్నారు.' అని ఇంటర్వ్యూలో మాట్లాడారు. (ఇది చదవండి: నా గుండె గుబులుగా ఉంది.. సింగర్ సునీత ఎమోషనల్) అమ్మాయిలు పెళ్లి విషయానికి వచ్చేసరికి.. అబ్బాయికి సొంతిల్లు ఉందా? 50 వేల పైనే శాలరీ, కారు ఉందా? అనేదే చూస్తున్నారు. అసలు అమ్మాయిలకి ఏమి కావాలి మంచి అబ్బాయిల? మంచి ఆఫర్లా? అని ప్రశ్నించారు. అమ్మాయి, అబ్బాయి కష్ట, సుఖాలను సమానంగా పంచుకోవాలి.. కానీ అమ్మాయిలు అది వదిలేసి మానవ హక్కులు అంటున్నారని కులకర్ణి విమర్శించింది. సోనాలి కామెంట్స్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆమెనుప్రశంసిస్తుండగా.. చాలా మంది మహిళలు విమర్శిస్తున్నారు. కాగా.. దిల్ చాహ్తా హై, ప్యార్ తూనే క్యా కియా వంటి సినిమాల్లో సోనాలి నటించింది. I don't know who she is but hats off to her courage to speak the unspoken unpalatable truth! 👏#Equality pic.twitter.com/vB2zwZerul — Amit Srivastava 🕉️ (@AmiSri) March 15, 2023 -
సోషల్ హల్చల్: జాన్వీ కపూర్ బ్యూటీ.. రెడ్ డ్రెస్‌లో కియారా లుక్స్
ప్రతి రోజు సోషల్ మీడియాలో సినీ తారలు తమ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంటారు. ఇవాళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సినీ తారలపై ఓ లుక్కేద్దాం. బ్లాక్ డ్రెస్‌లో జాన్వీ కపూర్ అందాలు రెడ్ డ్రెస్‌లో కవ్విస్తున్న బాలీవుడ్ భామ కియారా అద్వానీ బ్లూ డ్రెస్‌లో హెబ్బాపటేల్ హోయలు బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హాట్ లుక్స్ ఖతార్ టూర్ ఎంజాయ్ చేస్తున్న అనన్య పాండే ఫ్యాషన్ లుక్‌లో రవీన్ టాండన్ స్టన్నింగ్ లుక్‌లో అదరగొట్టిన పూజా హెగ్డే View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Sonalee Kulkarni (@sonalee18588) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
ఇదొక విప్లవం.. త్వరలోనే తెలుస్తుంది: నటి
ముంబై: ‘ఇదొక విప్లవం. భారతదేశ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయగల గొప్ప నిర్ణయం. మార్పు జరిగి ఇంకా నెల రోజులే కదా కావస్తోంది. మున్ముందు అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. అవి అందరికీ అనుభవంలోకి వస్తాయి. తద్వారా జీవితాలు సుఖమయం అవుతాయి’ అంటూ నోట్ల రద్దు నిర్ణయాన్ని తెగ పొగిడేసింది నటి సోనాలీ కులకర్ణి. శుక్రవారం ముంబైలో ఓ ప్రీమియం స్పా ప్రారంభోత్సవానికి వచ్చిన సోనాలీ విలేకరులతో మాట్లాడుతూ.. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు సుహృద్భావంతో అర్థం చేసుకున్నారని, కార్డులు, పేటీఎంలను వినియోగిస్తూ క్యాష్ లెస్ దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. ఇంతకు ముందు ప్రేక్షకులు సినిమా చూడాలంటే లైన్లో నిలబడి టికెట్ కొనుక్కోవాల్సి వచ్చేదని, ఇప్పుడలాంటి శ్రమలు పడాల్సిన అవసరం లేకుండా మొబైల్స్ ద్వారా సులువుగా టికెట్లు పొందొచ్చని తెలిపారు. ఈ విషయాన్ని పలువురు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రేక్షకులకు వివరిస్తున్నారని చెప్పారు. నోట్ల రద్దు ప్రజల జీవితాలను సులభతరం చేస్తుందని, కొంత ఆలస్యంగానైనా ఏదో ఒక సమయానికి అద్భుతమైన మార్పులు చవిచూస్తామని సోనాలి కులకర్ణి అన్నారు. ప్రస్తుతం మరాఠీలో మూడు, బాలీవుడ్ లో రెండు, ఒక గుజరాతీ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. తనకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఇంతకు మించి ఏదీ కోరుకోవాల్సిన అవసరంలేదని సోనాలి వ్యాఖ్యానించారు.