ఇదొక విప్లవం.. త్వరలోనే తెలుస్తుంది: నటి | Sonali Kulkarni on center desition | Sakshi
Sakshi News home page

ఇదొక విప్లవం.. త్వరలోనే తెలుస్తుంది: నటి

Published Sat, Dec 3 2016 5:20 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

ఇదొక విప్లవం.. త్వరలోనే తెలుస్తుంది: నటి

ఇదొక విప్లవం.. త్వరలోనే తెలుస్తుంది: నటి

ముంబై: ‘ఇదొక విప్లవం. భారతదేశ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయగల గొప్ప నిర్ణయం. మార్పు జరిగి ఇంకా నెల రోజులే కదా కావస్తోంది. మున్ముందు అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. అవి అందరికీ అనుభవంలోకి వస్తాయి. తద్వారా జీవితాలు సుఖమయం అవుతాయి’ అంటూ నోట్ల రద్దు నిర్ణయాన్ని తెగ పొగిడేసింది నటి సోనాలీ కులకర్ణి.

శుక్రవారం ముంబైలో ఓ ప్రీమియం స్పా ప్రారంభోత్సవానికి వచ్చిన సోనాలీ విలేకరులతో మాట్లాడుతూ.. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు సుహృద్భావంతో అర్థం చేసుకున్నారని, కార్డులు, పేటీఎంలను వినియోగిస్తూ క్యాష్ లెస్ దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. ఇంతకు ముందు ప్రేక్షకులు సినిమా చూడాలంటే లైన్లో నిలబడి టికెట్ కొనుక్కోవాల్సి వచ్చేదని, ఇప్పుడలాంటి శ్రమలు పడాల్సిన అవసరం లేకుండా మొబైల్స్ ద్వారా సులువుగా టికెట్లు పొందొచ్చని తెలిపారు. ఈ విషయాన్ని పలువురు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రేక్షకులకు వివరిస్తున్నారని చెప్పారు.

నోట్ల రద్దు ప్రజల జీవితాలను సులభతరం చేస్తుందని, కొంత ఆలస్యంగానైనా ఏదో ఒక సమయానికి అద్భుతమైన మార్పులు చవిచూస్తామని సోనాలి కులకర్ణి అన్నారు. ప్రస్తుతం మరాఠీలో మూడు, బాలీవుడ్ లో రెండు, ఒక గుజరాతీ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. తనకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఇంతకు మించి ఏదీ కోరుకోవాల్సిన అవసరంలేదని సోనాలి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement