
'పెళ్లి, ప్రెగ్నెన్సీకి దూరంగా ఉంటేనే సినిమా ఛాన్స్' అని హీరోయిన్లతో నిర్మాతలు ఒకప్పుడు బలవంతంగా సంతకం చేయించుకునేవారట. ఎవరిదాకానో ఎందుకు? తనతోనూ అలాంటి అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకున్నారంటోంది సీనియర్ హీరోయిన్ షీబా ఆకాశ్‌దీప్ (Sheeba Akashdeep Sabir). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ చాలా మారిపోయింది. ఇప్పుడు టాప్ హీరోయిన్లందరూ స్టార్ హీరోలతో జత కడుతున్నారు. పెద్దగా తారతమ్యాలు లేవు.

హీరోయిన్‌గా కొంతకాలమే..
అయితే అప్పటికీ, ఇప్పటికీ హీరోలు దశాబ్దాలతరబడి కథానాయకులుగానే కొనసాగుతున్నారు. కానీ మాకు ఆ అవకాశం లేదు. హీరోయిన్‌గా చేయడానికి నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. అది అయిపోయాక ఇదిగో నాలా క్యారెక్టర్ రోల్స్ చేయాల్సిందే! గతంలో ఓ భయంకరమైన కండీషన్ ఉండేది. మా తరంవారికి ఎవరికైనా బాయ్‌ఫ్రెండ్ ఉంటే అది బయటకు చెప్పాలంటేనే భయపడేవాళ్లం. ఎందుకంటే అప్పట్లో హీరోయిన్ అంటే సింగిల్‌గానే ఉండాలన్న రూల్ ఉండేది.
భయంకరమైన కాంట్రాక్ట్
ప్రేమలో ఉన్నామని తెలిస్తే ఏవేవో పుకార్లు పుట్టుకొచ్చేవి. పెళ్లయిందంటే ఏకంగా ప్యాకప్ చెప్పాల్సిందే! అందుకనే నిర్మాతలు మాతో ముందుగానే ఓ అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకునేవారు. మేము పెళ్లి చేసుకోము, పిల్లల్ని కనము అని అందులో రాసుండేది. ఇది అత్యంత భయంకరమైన కాంట్రాక్ట్. అని చెప్పుకొచ్చింది. షీబా ఆకాశ్‌దీప్.. యే ఆగ్ కబ్ బుజేగి (1991) సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. నచ్నేవాలే గానేవాలె, సూర్యవంశీ, హమ్ ఐ కమాల్ కె, ప్యార్ కా రోగ్, సురక్ష, కాలియా, మిస్ 420, కాలా సామ్రాజ్య, దమ్ వంటి చిత్రాలు చేసింది. చివరగా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని సినిమాలో మెరిసింది.
చదవండి: బాక్సాఫీస్‌పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!
Comments
Please login to add a commentAdd a comment