
సాక్షి, ముంబై : తనకు, తన కుటుంబానికి కరోనా సోకిందని వస్తోన్న వార్తలను నటి షెఫాలి షా స్పందించారు.తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, దాని ద్వారా తనకు కరోనా సోకిందంటూ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేశారంటూ తెలిపింది.అయితే తన ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూ ఎంతో మంది మెసేజ్‌లు,కాల్స్ చేశారని వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా వచ్చిందంటూ వస్తోన్న వార్తలపై ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఇలా చెప్పుకొచ్చింది. "నిన్న రాత్రి నా ఎఫ్‌బి అకౌంట్ హ్యాక్ అయింది. అయితే దీంతో ఓ రకంగా మంచే జరిగింది. ఎంతోమంది నాకు కాల్స్, మెసేజ్‌లు చేసి నా ఆరోగ్య పరిస్థిని తెలుసుకున్నారు. కొందరు మీకు మాట్లాడాలనిపిస్తే దయచేసి ఫోన్ చేయండి అంటూ వాళ్ల ఫోన్ నెంబర్లు కూడా షేర్ చేశారు. వారిలో కొంతమందిని అయితే నేను బహుశా ఒకటి,రెండు సార్లు కలిసుంటూ వారు కూడా నా హెల్త్ విషయంలో ఎంతో ఆందోళన చెందారు. మీ అందరి ప్రేమకు పేరుపేరున ధన్యవాదాలు" అంటూ తనపై వస్తోన్న ఫేక్ న్యూస్‌పై షెఫాలి క్లారిటీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment