విక్రమ్ గౌడ్‌కు పూరీ జగన్నాథ్ పరామర్శ
హైదరాబాద్ : కాల్పుల్లో గాయపడ్డ విక్రమ్ గౌడ్‌ను దర్శకుడు పూరీ జగన్నాథ్ పరామర్శించారు. జూబ్లీహిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా విక్రమ్‌గౌడ్ సినిమా ప్రొడ్యూసర్‌గా కూడా చిత్రపరిశ్రమకు పరిచయం. సినీ హీరో నితిన్ సోదరి నిఖితారెడ్డితో కలిసి ఆయన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఇష్క్, గుండెజారి గల్లంతైయ్యిందే సినిమాలను నిర్మించారు.
అలాగే విక్రమ్‌గౌడ్...కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ విక్రమ్‌గౌడ్‌ను మేయర్ అభ్యర్థిగా కూడా ప్రకటించింది. మరోవైపు అలంపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా విక్రమ్ గౌడ్‌ను పరామర్శించారు. గత కొద్దిరోజులుగా విక్రమ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు.