epilepsy
-
చేతిలో తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా? వాస్తవమిదే
మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరాలో లోపం ఏర్పడినప్పుడు తాత్కాలికంగా స్పృహ కోల్పోతారు. దీన్నే మూర్ఛపోవడం అంటారు. వైద్యభాషలో దీన్ని సాధారణంగా "పాసింగ్ అవుట్" అని సూచిస్తారు.మూర్ఛలో మూడు రకాలు ఉన్నాయి (వాసోవగల్ సింకోప్, కరోటిడ్ సైనస్ సింకోప్, సిట్యుయేషనల్ సింకోప్).వీటిలో కొన్ని ప్రాణాపాయమైనవి. మరి మన చుట్టూ ఎవరైనా మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. మూర్ఛ/ఫిట్స్ తరచూ వచ్చేవాళ్లలో కొన్ని లక్షణాలు ఉంటాయి. శరీరం వీక్ అయిపోవడం, మైకం కమ్మేయడం, "బ్లాకింగ్ అవుట్/వైటింగ్ అవుట్" కూడా అనుభవిస్తారు. అసలు మూర్ఛ రావడానికి గల సాధారణ కారణాలు ఏంటంటే.. భయం లేదా భావోద్వేగ గాయం,ఒత్తిడి. తీవ్రమైన నొప్పి,విశ్రాంతి లేకపోవడం. లోబీపీ, డీహైడ్రేషన్ మధుమేహం గుండె జబ్బు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (ఎంఫిసెమా) హైపర్వెంటిలేషన్ ఎక్కువ సేపు ఒకే భంగిమలో నిలబడటం. ప్రేగు కదలిక సమయంలో తీవ్రమైన ఒత్తిడి కొన్ని మందులు లేదా ఆల్కహాల్ తీసుకోవడం తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా? అప్పటివరకు ఉల్లాసంగా గడిపిన వాళ్లు ఫిట్స్‌తో అల్లాడిపోతుంటారు. దీంతో ఏం చేయాలో తెలియక చుట్టూ ఉన్నవాళ్లు కూడా గందరగోళానికి గురవుతుంటారు. ఆ సమయంలో ఫిట్స్‌తో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి చేతిలో తాళాల గుత్తి ఉంచడం, ఇనుముతో తయారుచేసిన వస్తువులను ఉంచడం, ఉల్లిపాయ వాసన చూపించడం వంటివి చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల ఫిట్స్ ఆగిపోతాయనుకుంటారు. ఐరన్ మెదడులోని అలజడిని కంట్రోల్ చేసి ఫిట్స్‌ను తగ్గిస్తుందని నమ్ముతారు. కానీ వాస్తవానికి ఇది అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. సాధారణంగానే ఫిట్స్ లేదా మూర్ఛ అనేది ఎపిసోడ్ల రూపంలో వస్తాయి. ఇవి 1-2 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండవు. ఈ సమయంలో మీరు ఏం చేసినా, చేయక పోయినా దానంతటవే ఆగిపోతాయి. దీన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అని పిలుస్తారు. ఒకవేళ ఇది ఐదు నిమిషాల కంటే ఎక్కవు సేపు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలి? ►ముందుగా చేయవలసినది భయాందోళనలకు గురికాకూడదు. పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే పాదాలను రబ్ చేస్తుండాలి. దీనివల్ల చర్మం చల్లబడకుండా ఉంటుంది. ► మూర్ఛపోయిన వ్యక్తిని వెనుకవైపు పడుకోబెట్టడం లేదా అతని/ఆమె మోకాళ్ల మధ్య తాళం వేసి కూర్చోబెట్టడం లాంటివి చేయాలి. ► ఎవరైనా కిందపడిపోతే అది ఫిట్స్ అని అనుకోకుండా ముందుగా గాయలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. అప్పటికి ఆ వ్యక్తిలో కదలిక లేకపోతే వారి కాళ్లను గుండె నుంచి సుమారు 12 అంగుళాలు (30CM) పైకి లేపడం వల్ల రక్తప్రవాహం ఆగకుండా ఉంటుంది. వ్యక్తి శ్వాస తీసుకోవడం ఆపివేసినట్లయితే, వెంటనే CPR చేయండి. ► షేక్ చేయడం, అరవడం: కొన్నిసార్లు గాయం కారణంగా వ్యక్తులు సడెన్ షాక్‌కి గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఆ వ్యక్తుల పేరు తెలిస్తే గట్టిగా వాళ్ల పేరు పిలుస్తూ తట్టండి. శరీరాన్ని షేక్ చేయడం వల్ల స్పృహను తిరిగి పొందడానికి సహాయపడుతుంది. మూర్ఛ వ్యాధిపై అవగాహన కలిగి ఉండటం ద్వారా మీరు అలాంటి వ్యక్తులను రక్షించిన వారు అవుతారు. - నవీన్ నడిమింటి ఆయుర్వేద నిపుణులు ఫోన్ -9703706660 -
చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపించినా.. ఉన్నట్టుండి కిందపడిపోయి
చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తూ దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నట్లుండి కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉండటం మనలో చాలా మంది గమనించి ఉంటాం. ఇలా కింద పడి ఉన్న వ్యక్తుల చేతిలో తాళం చెవులు పెడితే కాసేపటికి తేరుకుని మళ్లీ ఏమీ జరగనట్లు వెళ్లిపోతూ ఉంటారు. దీనినే వాడుకభాషలో వాయి అని పిలుస్తారు. వ్యవహారికభాషలో మాత్రం మూర్చగా పేర్కొంటారు. వైద్యపరిభాషలో ఫిట్స్ లేదా ఎపిలెప్సీగా చెబుతారు. నవంబర్ 17న జాతీయ మూర్ఛ వ్యాధి అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజీ విభాగానికి ప్రతి వారంలో సోమ, గురువారాల్లో రెండు రోజులు ఓపీ నిర్వహిస్తారు. ఇక్కడికి ప్రతి ఓపీ రోజున 250 మంది దాకా చికిత్స కోసం వస్తారు. ఈ లెక్కన నెలకు సగటున 2వేల మంది, ఏడాదికి 24వేల మంది ఓపీలో వైద్యం తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఒక ప్రొఫెసర్ డాక్టర్ సి. శ్రీనివాసులు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ. శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సౌజన్య, డాక్టర్ శ్యామసుందర్ సేవలందిస్తున్నారు. వచ్చిన రోగుల్లో 20 శాతానికి పైగా మూర్ఛవ్యాధిగ్రస్తులే ఉంటున్నారు. జనాభాలో ఒక శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల అంచనా. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 45 వేల మందికి పైగా బాధితులు ఉన్నట్లు అంచనా. ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో ప్రస్తుతం ఐపీ సేవలతో పాటు ఈఈజీ మిషన్ సేవలు కూడా లభిస్తున్నాయి. ఏడాదికి 15 వేల మందికి ఈఈజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటుగా ఈ పరీక్ష చేయించుకోవాలంటే ఒక్కొక్కరికి రూ.2వేలు ఖర్చవుతుంది. అవసరమైన వారికి ఎంఆర్ఐ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇంకా ఈఎంజీ, ఐసీయూ ఏర్పాటైతే ఈ విభాగానికి అవసరమైన పీజీ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వీరితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోని న్యూరాలజిస్టులు మరో 15 మంది దాకా ఉన్నారు. వీరి వద్ద కూడా నెలకు మరో 900 మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారు. ఇక నాటు మందులను ఆశ్రయించే వారు వీరికి రెట్టింపు సంఖ్యలో ఉంటారు. మూర్ఛల్లో రకాలు–లక్షణాలు సాధారణ మూర్చలో మొత్తం మెదడు చాలా వరకు దెబ్బతింటుంది. టానిక్ క్లోనిక్‌లో ఆకస్మికంగా స్పృహ కోల్పోవచ్చు. రోగిపడిపోవడం, దీంతో పాటు చేతులు, కాళ్లు కొట్టుకోవడం చేస్తారు. అబ్సెన్స్ లేక సెటిల్ మాలో మూర్ఛలో స్పృహ స్వల్పకాలంపాటు కోల్పోతారు. ఈ దశలో రోగి కొంత కాలం పాటు శూన్యంలోకి చూస్తూ ఉంటారు. మయోక్లోనిక్ మూర్ఛలో ఆకస్మిక, సంక్లిప్త కండరాలు సంకోచాలు సంభవిస్తాయి. ఇవి మొత్తం శరీరమంతా లేదా కొన్ని భాగాలకు సంభవిస్తాయి. అటోనిక్ మూర్ఛలో ఆకస్మిక విచి్ఛన్నం సంభవిస్తుంది. ఆ తర్వాత తక్షణమే కోలుకుంటారు. సరళమైన ఫోకల్ మూర్ఛలో రోగికి చేతులలో, కాళ్లలో కండరాల లాగుట కనిపిస్తుంది. లేదా వినికిడి, దృశ్యం, వాసన, రుచిలో ఆటంకం కలగవచ్చు. సంక్లిష్ట ఫోకల్ మూర్ఛలో రోగి స్పృహ కోల్పోతాడు. రోగికి విచిత్రమైన ప్రవర్తన ఉన్నట్లుగా కనిపిస్తాడు. కొన్ని సెకన్లు, నిమిషాల పాటు ప్రతిస్పందన లేకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. సూక్ష్మ ముడతలు, లేదా ముఖంలో, చేతుల్లో, కాళ్లలో తరచూ లాగుతుంది. మూర్ఛ వ్యాధికి కారణాలు వంశపారంపర్యం, మెనింజైటిస్, రక్తంలో షుగర్ శాతం పెరగడం, తగ్గడం, మెదడుకు గాయాలైనప్పుడు, గడ్డలు ఉన్నప్పుడు, రక్తంలోని కొన్ని ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల మూర్ఛ వస్తుంది. మూర్చ(ఫిట్స్) అంటే.. మూర్చ అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ రుగ్మతల సమూహం. మెదడులోని ఎలక్ట్రిక్ యాక్టివిటీ అసాధారణ పగుళ్ల వల్ల సంభవిస్తుంది. మూర్చలు వాటి కారణం, కేంద్ర స్థానాన్ని బట్టి వర్గీకరించవచ్చు. మూర్చలు తరచుగా కన్వల్షన్స్ లేదా ఎపిలెప్టిక్ ఫిట్స్‌గా సూచిస్తారు. ఇది సున్నా నుంచి 10 ఏళ్లలోపు, 50 నుంచి 70 ఏళ్లలోపు వారికి కలుగుతుంది. ఒక్కోసారి ఏ వయస్సులో వారికైనా రావచ్చు. మూర్ఛవ్యాధి నిర్ధారణ మూర్ఛకు గురైన వారు వైద్యుని వద్దకు వచ్చిన వెంటనే అతని పక్కన ఉన్న వ్యక్తితో జరిగిన సంఘటన గురించి వైద్యులు ఆరా తీసి అది మూర్ఛనా కాదా తెలుసుకుంటారు. నిర్ధారణ కోసం అవసరమైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఈఈజీ పరీక్షలు చేయిస్తారు. కొన్నిసార్లు వీడియో ఈఈజీ పరీక్ష కూడా చేయాల్సి రావచ్చు. వీటి ద్వారా మెదడులోని ఏ భాగంలో దెబ్బతినడం వల్ల మూర్చ వస్తుందో గుర్తిస్తారు. మందులు వాడితే తగ్గిపోతుంది మూర్ఛ వ్యాధిగ్రస్తులను దాదాపు 75 శాతం మందిని మందులతోనే పూర్తిగా నయం చేయవచ్చు. కేవలం 25 శాతం మందికి మాత్రమే ఆపరేషన్ అవసరమవుతుంది. ఇలాంటి ఆపరేషన్లకు ఎక్కువగా కేరళలోని శ్రీ చిత్ర ఆసుపత్రికి వెళతారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని నిమ్స్, ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రులు ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం మూర్ఛ వ్యాధికి 25 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. మా విభాగానికి వచ్చిన మూర్ఛ రోగులకు ఉచితంగా మందులు, చికిత్స, వైద్యపరీక్షలు చేయిస్తున్నాం. అయితే వైద్యుల సూచన మేరకు ఇంటి వద్ద మందులు వాడితేనే చికిత్సకు వ్యాధి లొంగుతుంది. – డాక్టర్ సి.శ్రీనివాసులు, న్యూరాలజీ విభాగం హెచ్ఓడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
డ్రైవింగ్‌లో ఉండగా మూర్ఛ
తుమకూరు : కుమారుడితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కారులో వెళ్తున్న తండ్రి మూర్ఛకు గురై సీటులో వెనక్కువాలిపోయి ప్రాణాలు విడిచాడు. అదృష్టవశాత్తూ వాహనం నిలిచిపోవడంతో కుమారుడికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలుకా, హులియూరు సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. జిల్లాలోని కొరటిగెరె తాలుకా, ఆలాళసంద్ర గ్రామానికి చెందిన శివకుమార్(35) బుధవారం కుమారుడు పునిత్‌తో కలిసి కుక్కర్ల లోడ్ తీసుకెళ్తుండగా హులియూరు సమీపంలో మూర్ఛకు సీటులో వెనక్కువాలిపోయాడు. అయితే వాహన వేగం తక్కువగా ఉండటంతో ఆగిపోయింది. తండ్రికి ఏమైందో తెలియక ఎనిమిది సంవత్సరాల కుమారుడు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. స్థానికులు వచ్చి పరిశీలించగా శివకుమార్ మృతి చెందినట్లు గుర్తించి హులియూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి బంధువులకు సమాచారం ఇచ్చి కేసు దర్యాప్తు చేపట్టారు. -
వేడి తగ్గించే వినూత్న పదార్థం!
నాటింగ్‌హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. తనంతట తానే ఉష్ణోగ్రతను తగ్గించుకునే ఓ పదార్థాన్ని తయారు చేయగలిగారు. అంతేకాదు.. ఈ పదార్థంతో కాలిన గాయాలకు మెరుగైన చికిత్స కల్పించవచ్చు... అంతరిక్షంలో రేడియోధార్మికత తదితర శక్తుల నుంచి రక్షణ పొందవచ్చు కూడా. కృత్రిమ ప్లాస్టిక్... అతిసూక్ష్మస్థాయి చానెళ్లు.. కొన్ని ద్రవాలతో రూపొందిన ఈ కొత్త పదార్థం ధర్మాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. మొక్కలు, మానవ శరీరాల మాదిరిగా పనిచేసే ఈ పదార్థం కాలిన గాయాల నుంచి వేడిని తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుందని.. తద్వారా గాయం తొందరగా మానేందుకు అవకాశం ఏర్పడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ మార్క్ ఆల్ట్సన్. అంతేకాకుండా.. అంతరిక్ష ప్రయాణాల్లో సౌర రేడియోధార్మికత కారణంగా వేడి విపరీతంగా పెరిగిపోతూంటుందని.. ఈ వేడిని క్రమ పద్ధతిలో తగ్గించడం.. ఒక దగ్గర కేంద్రీకృతమయ్యేలా చేయడం.. ఆ తరువాత ఆ వేడిని విద్యుత్తుగా మార్చగలగడం ఈ పదార్థం ప్రత్యేక లక్షణమని వివరించారు. ప్రస్తుతం తాము ఈ పదార్థాన్ని పరిశోధనశాలలో ప్రయోగాత్మకంగా పరిశీలించి చూశామని.. తగినన్ని నిధులు సమకూర్చుకున్న తరువాత వాణిజ్య స్థాయిలో పరిశోధనలు చేస్తామని వివరించారు. మూర్ఛను ముందుగా గుర్తించే పరికరం... మూర్ఛ లక్షణాలు ఎప్పుడు కనిపిస్తాయో చెప్పడం కష్టం. ఏమాత్రం ముందు తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనవసరమైన గాయాలు, ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చు. ఐండోహోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఇప్పుడు అచ్చంగా అలాంటి యంత్రాన్ని తయారు చేశారు. చేతి కంకణం మాదిరిగా తొడుక్కునే ఈ యంత్రాన్ని తాము 28 మంది రోగులపై పరీక్షించి సత్ఫలితాలు సాధించామని... మూర్ఛ వచ్చే ముందు ఈ యంత్రం ఓ అలారం మోగిస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ జొహాన్ అరెండ్స్ తెలిపారు. గుండె కొట్టుకునే వేగం, కదలికలను గుర్తించే సెన్సర్ల ద్వారా ఈ యంత్రం పనిచేస్తుందని చెప్పారు. పరీక్షల సమయంలో ఈ యంత్రం 96 శాతం సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందని వివరించారు. మూర్ఛ రోగం ఉన్నవారిలో ఆకస్మిక దాడుల కారణంగా 20 శాతం మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని.. ఈ యంత్రాన్ని వాడటం ద్వారా మరణాలను గణనీయంగా తగ్గించవచ్చునని చెప్పారు. శబ్దాలు, వీడియోల ద్వారా కూడా అలారం పని చేసేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వాయు, ధ్వని కాలుష్యంతో గుండెజబ్బులు! వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం ఒక్కటే గుండెకు సమస్య కాదు.. వీధుల్లోని రణగొణ ధ్వనులు కూడా గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు స్విట్జర్లాండ్‌కు చెందిన ట్రాపికల్ అండ్ పబ్లిక్‌హెల్త్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. స్విట్జర్లాండ్‌లో 2000 నుంచి 2008 వరకూ గుండెపోటుతో మరణించిన వారి వివరాలను పరిశీలించడం ద్వారా తామీ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టిన్ రిసీ తెలిపారు. ఉపగ్రహ చిత్రాల సాయంతో గాల్లోని కాలుష్యకారక కణాల మోతాదులు, స్విట్జర్లాండ్‌లోని మొత్తం 1834 కేంద్రాల నుంచి సేకరించిన నైట్రోజన్ డయాక్సైడ్ వివరాలను... ఎనిమిదేళ్ల మధ్యకాలంలో గుండెపోటుతో మరణించిన 19,261 మంది వివరాలతో జోడించి చూసినప్పుడు ఈ ఫలితాలు వచ్చినట్లు రిసీ తెలిపారు. కాలుష్య కారక కణాలు పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 ఎక్కువైన కొద్దీ మరణాల రేటు కూడా ఎక్కువవుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసిందని అలాగే ప్రతి ట్రాఫిక్ రణగొణ ధ్వనుల మోతాదు పది డెసిబెల్స్ పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశం రెండు శాతం వరకూ పెరిగిందని చెప్పారు. -
కొత్త ‘మూర్ఛ మందు’ సక్సెస్!
మూర్ఛరోగ లక్షణాలను గణనీయంగా తగ్గించేందుకు గంజాయి నూనె కానబిడాల్ బాగా ఉపయోగపడుతుందని అమెరికాలోని అలబామా రాష్ట్రంలో జరిగిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ అధ్యయనంలో భాగంగా కొంతమంది మూర్ఛ రోగులకు ఈ కానబిడాల్ నూనెను అందివ్వడం మొదలుపెట్టారు. అధ్యయనానికి ముందు కొంత మందికి రెండు వారాల సమయంలో దాదాపు 144 సార్లు మూర్ఛ లక్షణాలు కనిపించేవి. పన్నెండు వారాల తరువాత పరిశీలించినప్పుడు ఈ సంఖ్య 52కు తగ్గిపోయింది. ఆ తరువాత నాలుగేళ్ల వరకూ మూర్ఛ లక్షణాల తీవ్రత తగ్గడమే కాకుండా, లక్షణాలు తక్కువగా కనిపించాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టినా బేబిన్ అంటున్నారు. ఈ అధ్యయనం కోసం తాము గ్రీన్విచ్ బయో సైన్సెస్ అనే సంస్థ తయారుచేసిన ఎపిడోలెక్స్ అనే కానబిడాల్ నూనె వాడామని, గంజాయిలో మత్తు కలిగించే రసాయనం టీహెచ్‌సీ ఇందులో చాలా తక్కువ మోతాదులో ఉంటుందని చెప్పారు. దుష్ప్రభావాలు పెద్దగా లేవని అన్నారు. సాధారణ చికిత్స పద్ధతులకు లొంగని వేర్వేరు వర్గాల రోగులను తాము అధ్యయనంలో చేర్చామని, అందరిలోనూ ఫలితం ఒకేలా ఉండటం గుర్తించాల్సిన విషయమని చెప్పారు. -
మూర్ఛవ్యాధికి చేప చర్యలకూ లింకు!
ఆఫ్రికా నదుల్లో ఓ విచిత్రమైన చేపజాతి ఉంది. సెకనులో అతితక్కువ సమయంపాటు విద్యుత్ ఛార్జ్‌ను విడుదల చేస్తాయి ఇవి. ఎందుకూ? చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు.. వేటగాళ్ల నుంచి తప్పించుకునేందుకు! సరేగానీ.. దీనికి మన జబ్బులకు ఏంటి సంబంధం అంటే టెక్సస్, మిషిగన్ స్టేట్ యూనివర్శిటీల శాస్త్రవేత్తలను అడగాల్సిందే. వీరేం చెబుతారూ అంటే.. పరిణామ క్రమంలో చేపలు అలవర్చుకున్న ఈ చర్యకు, మూర్ఛవ్యాధికీ సంబంధం ఉందీ అని! తోకభాగంలో ఉండే అతిచిన్న అవయవం ద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకునే ఈ చేపను అర్థం చేసుకుంటే మూర్ఛతోపాటు కండరాల, గుండె వ్యాధులకు మెరుగైన చికిత్స అందించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఇమ్మని స్వప్న అంటున్నారు. మూర్ఛవ్యాధిలో మెదడు, కండరాల నుంచి చిన్నస్థాయిలో విద్యుత్తు విడుదల అవుతుందన్నది తెలిసిందే. శరీరంలోని పొటాషియం ఛానల్స్‌లో వచ్చే మార్పుల కారణంగా విద్యుత్తు పల్స్‌కు స్పందన లేకుండా, లేదంటే కొద్దిగా మాత్రమే స్పందన కలిగి ఉండటం వల్ల మూర్ఛ వంటి వ్యాధులు వస్తాయని స్వప్న వివరించారు. -
ఆ నూనెతో మూర్ఛ లక్షణాలు తగ్గుముఖం!
గంజాయి అంటే చాలామందికి పోలీస్ కేసులు.. ఒళ్లు తెలియని మత్తు గుర్తుకొస్తాయేమోగానీ.. వాస్తవానికి ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అని అంటున్నారు శాస్త్రవేత్తలు. వాంటర్బిల్ట్ బయో వీయూ రిసోర్స్ నుంచి సేకరించిన వైద్య రికార్డుల ఆధారంగా రాబర్ట్ కార్సన్ అనే ఓ శాస్త్రవేత్త మూర్ఛవ్యాధి చికిత్సలో గంజాయి పాత్ర ఏమిటన్నదానిపై పరిశోధన నిర్వహించారు. దాదాపు 108 మంది మూర్ఛ వ్యాధిగ్రస్తులకు గంజాయి నుంచి తీసిన నూనెను మందుగా ఇచ్చినప్పుడు దాదాపు 40 శాతం మందిలో వ్యాధిలక్షణాలు సగానికి తగ్గిపోగా.. పదిశాతం మందిలో పూర్తిగా లేకుండా పోయాయి. మిగిలినవారిలోనూ కొంత మెరుగుదల కనిపించింది. వీరిలో 22 శాతం మంది తాము తీసుకుంటున్న సాధారణ మందుల మోతాదును గణనీయంగా తగ్గించుకోగలిగారు. శుద్ధి చేసిన గంజాయి నూనెపై తాము పరిశోధనలు చేసినప్పటికీ... చాలామంది వ్యక్తిగత స్థాయిలో దీన్ని వాడుతూనే ఉన్నారని ఈ విషయంలో అందరూ జాగ్రత్త వహించాలని రాబర్ట్ కార్సన్ సూచిస్తున్నారు. -
ఛీ..ర్స్
మద్యానికి దూరంగా ఉండడం అంటే... మంచి ఆరోగ్యానికి దగ్గరగా ఉండడమే. న్యూ ఇయర్ వస్తోంది. ఊరికే రాదు. ‘హ్యాపీ’ అనే ట్యాగ్‌తో వస్తుంది. ఆ ట్యాగ్‌ని అలాగే నిలుపుకుందాం. హెల్త్‌ని, హ్యాపీనెస్నీ కాపాడుకుందాం. మద్యం పొంగి పొరలే తరుణం దగ్గరపడింది! న్యూ ఇయర్ అంటూ ఫ్రెండ్స్ ఛీర్ అప్ అయ్యే టైమ్ ముంచుకొస్తోంది. సో.. ‘ముందున్నది ప్రమాదకరమైన ‘మందు’ మలుపు! ఆ మలుపును సేఫ్‌గా దాటించడానికే ఈ హెచ్చరిక బోర్డులాంటి కథనం. ఎలాంటి పరిమితులూ పాటించకుండా దీర్ఘకాలం మద్యం సేవిస్తుండటం వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. మన శరీరంలోని దాదాపు అన్ని వ్యవస్థలపైనా దాని దుష్ప్రభావం ఉంటుంది. మెదడు (నాడీవ్యవస్థ), జీర్ణవ్యవస్థ, గుండెతో పాటు రక్తప్రసరణ వ్యవస్థ, సెక్స్ సామర్థ్యంతో పాటు ప్రత్యుత్పత్తి ధర్మాలు సహా.. అన్నీ దెబ్బతిటాయి. క్యాన్సర్ల ముప్పు అయితే ప్రతి క్షణం పొంచి ఉంటుంది. ఫస్టు సిప్పుతోనే మొదలు జీర్ణం కావడానికి ఆహారానికైనా కాస్త టైమ్ పడుతుందేమో గానీ... నోట్లోకి చేరీ చేరగానే మద్యం దుష్ప్రభావాలు మొదలైపోతాయి. మద్యం పెదవులు దాటి నోట్లోకి రాగానే అక్కడి మ్యూకస్ పొరలు (మ్యూకస్ మెంబ్రేన్) ఆ రసాయన ఘాటుకు ఎంతోకొంత దెబ్బతింటాయి. ఆహారం ఒంట్లోకి ఇమిడిపోవాలంటే అందుకోసం అది చిన్న పేగుల వరకు రావాలి. కానీ ఆల్కహాల్ నేరుగా మ్యూకస్ పొరల నుంచే ఒంట్లోకి ఇంకుతుంది. ఖాళీ కడుపుతో కనుక ఆల్కహాల్ తాగుతుంటే ఈ ఇంకిపోయే వేగం మరింత ఎక్కువవుతుంది. ఇలా మ్యూకస్ పొరల దగ్గర్నుంచి చిన్న పేగుల వరకు ప్రతి చోటా మద్యం దుష్ప్రభావం చూపుతుంది. డైరెక్ట్ ఎటాక్.. కాలేయం మీదే ఒంట్లోకి వచ్చే ప్రతి విష పదార్థానికీ, ఆ మాటకొస్తే ప్రతి పదార్థానికి గేట్ కీపర్ లాంటిది కాలేయం. ఆహారం పట్టుకొచ్చే పాస్‌ను చూసి... విధిగా చెక్ చేసి మరీ ఆ ఆహారాన్ని లోనికి అనుమతిస్తుంది కాలేయం. వచ్చింది లిక్కర్ అని తెలియగానే... లివర్ అందులోని విషపదార్థాలను విరిచివేయడం మొదలెడుతుంది. గేట్‌కీపర్‌గా మాత్రమే కాదు... చెత్తను ఎత్తిపోసే కూలీగా కూడా పనిచేస్తుంది లివర్. మద్యం ప్రభావంతో మెదడు కూడా మనకు జీవక్రియలు వేగంగా జరిగేలా చూసి చెమటపట్టించేలా చేస్తుంది. అలాగే శ్వాసవేగం పెరిగేలా చూస్తుంది. ఆ చెమటలో... శ్వాసలో దుర్గంధం ఎందుకంటే... తాను విరిచేసిన విషాలను ఇటు చెమటలోనూ, అటు శ్వాస ద్వారా లివర్ బయటకు నెట్టేయడం వల్లనే. ఆ తర్వాత మూత్రం ద్వారా కూడా అదే పని చేస్తుంది లివర్. ఇలా లివర్ చేసే కూలీ పనులకు చెమట, శ్వాస అనే సహాయకూలీలను పంపి మనల్ని పదిలంగా కాపాడుతుంది మెదడు! ‘కంజీనర్ల’ మాయ ఆల్కహాలిక్ లిక్కర్ ఏదైనా సరే... అందులో కొన్ని పదార్థాలుంటాయి. వాటిని ‘కంజీనర్స్’ అంటారు. ఆల్కహాల్ తాగగానే మనకు మద్యం తాలూకు అసలు రుచి తెలియదు. వాసన పసిగట్టలేం. రంగును గుర్తించలేం. అంటే అలా రంగు, రుచి, వాసనలకు పంజరాల్లా పనిచేస్తాయి ఈ కంజీనర్స్. ఈ కంజీనర్స్ కేవలం మిథనాల్, బ్యుటనాల్ వంటి ఆల్కహాల్లో మాత్రమే కాదు... ఆల్డిహైడ్స్, ఫీనాల్స్, టానిన్స్, ఐరన్, లెడ్, కోబాల్ట్లలోనూ ఉంటాయి. అదే పనిగా తాగేయడం (బింజ్ డ్రింకింగ్) కొంతమంది ఎప్పుడో ఒకసారి కదా తాగుతున్నాం అనుకుని ఆ ఒకేసారి చాలా ఎక్కువగా తాగేస్తుంటారు. అలా తాగినప్పుడు 6 నుంచి 36 గంటల పాటు దేహంలో చక్కెర పాళ్లు లోపిస్తాయి. అందుకు కారణం మన చక్కెరపాళ్లను సరిదిద్దుతూ/నియంత్రిస్తూ ఉండాల్సిన కాలేయం అసలు పని వదిలేసి ఆల్కహాల్ విషాలను విరిచేస్తూ ఉండటమే. దాంతో మన ఒంట్లోని నీళ్ల (ద్రవాల) పాళ్లు తగ్గుతాయి. దాంతో డీ–హైడ్రేషన్ జరిగి... దాహం వేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ స్థితి గంటలకొద్దీ కొనసాగుతుంటుంది. ఒక్కోసారి మెదడులోని సిరల్లో రక్తం గడ్డకట్టవచ్చు. ఫలితంగా తలనొప్పి మొదలుకొని... వాంతులు, మూర్ఛ, కొన్ని సందర్భాల్లో పక్షవాతం కూడా రావచ్చు. ఇలా అపరిమితంగా తాగేసినప్పుడు అంచనా వేసే శక్తి లోపించడం, అవయవాలను సమన్వయం చేసుకోలేకపోవడం, దేనిమీదా దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి పరిణామాలకు దారితీసి, ప్రయాణంలో ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. రక్తంలో మితిమీరి ఆల్కహాల్ ఉంటే ఒళ్లు చల్లబడిపోవచ్చు. రక్తపోటు తగ్గిపోవచ్చు. శ్వాసక్రియ క్రమంగా మందగించి మరణానికి దారితీయవచ్చు. మద్యం దుష్ఫలితాలు మైగ్రేన్ : ముదురు రంగులో ఉండే వైన్ లేదా చేదుగా ఉండే రమ్ వంటి ఆల్కహాల్ ద్రవాలు తాగినప్పుడు అవి తొలుత మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించవచ్చు. ఇలాంటి దీర్ఘకాలిక మైగ్రేన్.. తలనొప్పులు ఒక్కోసారి మూర్ఛ, పక్షవాతానికి దారితీసే ప్రమాదమూ ఉంది. మూర్ఛ : సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఆల్కహాల్ అలవాటు ఉన్న వారిలో మూర్ఛ వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ. కొందరు ఎప్పుడూ తాగుతూ ఉండడం, కొన్నాళ్ల తర్వాత మళ్లీ మానడం వంటివి చేస్తుంటారు. ఇలా మాటిమాటికీ తాగుడు మొదలుపెట్టడం, మానడం చేసేవారిలో ‘కిండ్లింగ్’ అనే ప్రక్రియ చోటుచేసుకొని అది కూడా మూర్ఛకు దారితీస్తుంది. కిండ్లింగ్ అంటే తటాలున నిప్పును పుట్టించడం. అంటే ఇలా తాగుడును ఇష్టం వచ్చినట్లు మొదలుపెట్టడం, సడెన్‌గా మానేయడం వల్ల మెదడులో తటాలున జరిగే పరిణామాలతో మూర్ఛ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆల్కహాల్‌ను మొదలే పెట్టకూడదు. నియంత్రణ కోల్పోవడం : దీర్ఘకాలం మద్యం తాగేవారిలో మెదుడులోని బ్యాలెన్సింగ్‌కు తోడ్పడే సెరిబెల్లమ్ భాగం దెబ్బతింటుంది. దాంతో వారు సరిగా నడవలేరు. తూలుతున్నట్లుగా నడుస్తారు. మాట కూడా ముద్దముద్దగా, అర్థం కానట్లుగా (స్లర్ర్డ్ స్పీచ్) వస్తుంది. పెరిఫెరల్ న్యూరోపతి : ఆల్కహాల్ వల్ల ఒంట్లో మండుతున్నట్లుగా (బర్నింగ్ సెన్సేషన్) ఉండవచ్చు. అరికాళ్లు, అరచేతుల్లో నొప్పి, సూదులతో గుచ్చుతున్నట్లుగా కూడా ఉంటుంది. క్రమంగా నరాల దొంతరలు (నర్వ్ ఫైబర్స్) దెబ్బతిని... ఆ తర్వాత్తర్వాత చేతులు–కాళ్లు దెబ్బతిని నడవలేకపోవడం, ఏ పనీ చేయలేకపోవడం వంటి స్థితి రావచ్చు. మద్యం మానేయడం ద్వారా దీర్ఘకాలంలో ఈ పరిస్థితి మెల్లగా చక్కబడి మునుపటిలా అయ్యేందుకు అవకాశం ఉంది. ఇక మద్యంతో తలతిరగడం, అంగస్తంభన సమస్యలు, నియంత్రించలేనంత ఒత్తిడితో మూత్రం వస్తుండటం, మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రంపై నియంత్రణ లేకపోవడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. అలాగే మనకు ఆహారంతో అందాల్సిన విటమిన్లను మద్యం అందనివ్వదు. దాంతో విటమిన్ల లోపం వల్ల వచ్చే వ్యాధులు, కలిగే దుష్పరిణామాలు సంభవిస్తాయి. చూపు దెబ్బతినడం : అన్ని కండరాలు దెబ్బతిన్నట్లే చాలా అరుదుగా కంటి కండరాలు దెబ్బతిని చూపు తగ్గవచ్చు. ఇలా ఎలా చూసినా మద్యంతో అన్నీ నష్టాలే. న్యూ ఇయర్ పార్టీ అనో, మరొకటనో కొన్ని క్షణాల ఉల్లాసం కోసం ఇంతటి మూల్యాన్ని చెల్లించడం సరైనపని కాదన్నది గ్రహిస్తే... మద్యానికి దూరంగా ఉండటం పెద్ద కష్టమేమీ కాదు. మద్యానికి ఎందుకు బానిసలవుతారంటే..! మొదటిసారి మద్యం తాగినప్పుడు ఒకటి రెండు డ్రింక్స్ చాలా రిలాక్సింగ్‌గా ఉంటాయి. శరీరం తేలికైపోయినట్లు ఉంటుంది. ఉల్లాసంగా అనిపిస్తుంది. సంకోచాలు తగ్గుతాయి. స్ట్రెస్ కూడా తగ్గినట్లుగా అనిపిస్తుంది. దీనికి కారణం మెదడులోని ఓపియాయిడ్ అనే కణాల నుంచి డోపమైన్ అనే రసాయనాలు బయటికి వచ్చి మెదడును కాసేపు ఉత్తేజపరచడమే. దాంతో ఒకలాటి ఆనందంలో తేలిపోతున్న అనుభూతులు కలుగుతాయి. ఆ అనుభూతులను మనసు తరచు కోరుకుంటూ ఉంటే మద్య సేవనం వైపు ఆలోచన మళ్లుతుంది. దాంతో అసలు కథ మొదలవుతుంది. మద్యసేవన వ్యసనం మితిమీరితే మెదడులోని ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం దెబ్బతినడం మొదలవుతుంది. మనలో లాజిక్‌తో కూడిన ఆలోచనలకు, ప్లానింగ్‌కూ, అంచనావేయడానికి తోడ్పడే ఈ భాగం క్రమంగా పనిచేయకపోవడంతో ఆ భావోద్వేగాలపై అదుపు లేకుండా పోతుంది. రిస్క్ తీసుకునే పనులకు పాల్పడతాం. ముప్పును తప్పించుకోగలమనే అతివిశ్వాసం పెరుగుతుంది. దాంతో అనేక అనర్థాలు సంభవిస్తాయి. క్రమంగా మెదడులోని టెంపోరల్ లోబ్ ప్రభావితమవుతుంది. ఫలితంగా మరచిపోవడం, మాటలకు చేతలకు పొంతన లేకపోవడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. అంతేకాదు, నిద్రపై కూడా ప్రభావం పడుతుంది. మనం హాయిగా పడుకున్న తర్వాత ఒక రిలాక్సేషన్ ఫీలింగ్‌తో తిరిగి నిద్రలేస్తాం. ఇందుకు కారణం మన నిద్రలోని ఒక దశ. ఇందులో కనుపాపలు స్పందిస్తూ ఉంటాయి. నిద్రలేవగానే హాయినిచ్చే ఈ దశనే ఆర్ఈఎమ్ దశగా చెబుతారు. బాగా మద్యం తాగినప్పుడు మనలో ఆర్ఈఎమ్ దశ లోపిస్తుంది. దాంతో నిద్రలేచాక చికాకుగా ఉండి, హాయి అనే ఫీలింగ్ ఉండదు. నిద్రలో ప్రమాదకరమైన గురక (స్లీప్ ఆప్నియా)తో ఒక్కోసారి ఊపిరి ఆగిపోయే ముప్పు పొంచి ఉంటుంది. డా. బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరోఫిజీషియన్ సిటీ న్యూరో సెంటర్, రోడ్ నం.12 బంజారాహిల్స్, హైదరాబాద్ -
మూర్ఛ రోగులు ఒంటరిగా ఉండరాదు
మూర్ఛ రోగులు వంట, ఈత, ప్రయాణం, ఎల్తైన ప్రదేశాల్లో ఒంటరిగా ఉండరాదని ప్రముఖ న్యూరాలజిస్ట్ డా.గోపాలం శివన్నారాయణ అన్నారు. జన విజ్ఞానవేదిక, కదిరి శాఖ సీఆర్సీలో మూర్ఛ రోగులకు నిర్వహించిన వైద్య శిబిరానికి ఆయన హాజరై రోగులను పరీక్షించారు. రాయచోటి, పులివెందుల, కర్ణాటక, మొలకల చెరువు నుంచి సుమారు 160 మంది హాజరయ్యారు. మళ్లీ వైద్యశిబిరం సెప్టెంబర్ 18న జరుగుతుందని, జేవీవీ జిల్లా కోశాధికారి బీ.నరసారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జేవీవీ ఉపాధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేంద్రరెడ్డి, సబ్ యూనిట్ మలేరియా సూపర్వైజర్ మహబూబ్‌బాషా పాల్గొన్నారు. -
ఎపిలెప్సీ రోగులూ... బోర్లా పడుకోకండి!
ఎపిలెప్సీ (మూర్చ లేదా ఫిట్స్)తో బాధపడేవారు బోర్లా పడుకోవద్దని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఇలా పడుకోవడం తీవ్ర ప్రమాదానికి అంటే ఒక్కోసారి మృత్యువుకు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఎపిలెప్సీ /మూర్చ/ఫిట్స్ ఉన్నవారిపై నిర్వహించిన ఇరవై ఐదు వేర్వేరు అధ్యయనాలతో పాటు, అకస్మాత్తుగా సంభవించిన 253 మరణాలనూ, ఆ మరణాలు సంభవించిన సమయంలో ఆ వ్యక్తులు పడుకొని ఉన్న తీరును పరిశీలించిన అధ్యయనవేత్తలు ఈ జాగ్రత్తను చెబుతున్నారు. ఇలా బోర్లా పడుకోవడం వల్ల ఎపిలెప్సీ ఉన్న రోగుల్లో నిద్రలోనే చనిపోయే అవకాశాలు 26.7 శాతం పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అధ్యయన వివరాలన్నీ ‘న్యూరాలజీ’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
డీఎస్సీ పరీక్ష రాస్తూ విద్యార్థి మృతి
కర్నూలు : మూర్ఛవ్యాధితో బాధపడుతున్న ఒక విద్యార్థి డీఎస్సీ పరీక్ష రాస్తూ మృతిచెందిన సంఘటన కర్నూలులో శనివారం జరిగింది. వివరాల ప్రకారం...కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామానికి చెందిన చిన్నరాముడు కుమారుడు అనోక్ కుమార్‌కు మూర్ఛవ్యాధి ఉంది. అయితే తను డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడు. వారం రోజుల క్రితం కర్నూలుకు వచ్చి స్నేహితుని గదిలో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం కర్నూలు నగరంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో పరీక్ష రాస్తుండగా మధ్యాహ్నం 12.30 గంటలకు వాంతి చేసుకుని మూర్ఛపోయాడు. అధికారులు వెంటనే అనోక్ కుమార్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే అతను మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పింఛన్ ఇవ్వలేదని.. మూర్ఛపోయిన వృద్ధురాలు
వనపర్తి రూరల్ : తాను పింఛన్ల సర్వే సమయంలో ఆస్పత్రిలో ఉన్నానని.. దయ ఉంచి తన దరఖాస్తును పరిశీలించి పింఛన్ ఇవ్వాలని ఓ వృద్ధురాలు ఎంపీడీఓను వేడుకొంది. దీనికి ఎంపీడీఓ ససేమిరా అన్నా డు. దీంతో ఆవేదనకు గురైన ఆ వృద్ధురాలు అక్కడే మూర్ఛపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన వనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. వనపర్తి మండలం శ్రీనివాసపురానికి చెందిన జక్కుల నర్సమ్మ (68) శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చింది. ఆ సమయంలో కార్యాలయంలో ఎంపీడీఓతో పా టు గ్రామ సర్వే అధికారి ఉన్నారు. వారివద్దకు వెళ్లి వృద్ధాప్య పింఛన్ పొందేందుకు తనకు అన్ని అర్హతలూ ఉన్నాయని.. తనక భర్త కూడా లేడని, దరఖాస్తు పరిశీలించి పింఛన్ ఇవ్వాలని చాలాపేసు ప్రాధేయపడింది. దీనికి వారు ఒప్పుకోలేదు. ఆమె తరఫున ఉప సర్పంచ్ జనార్దన్, మున్సిపల్ కౌన్సిలర్లు రమేష్‌నాయక్, కృష్ణబాబులు ఎంపీడీఓను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా, ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆవేదనకు గురైన నర్సమ్మ మూర్ఛతో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ఎంపీడీఓ అక్కడనుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడే ఉన్న పలువురు ప్రజాప్రతినిధులు వృద్ధురాలిని 108 అంబులెన్స్‌లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎంపీడీఓను నిలదీసిన తండావాసులు ప్రభుత్వం ఆసరా పథకంలో భాగంగా ఇచ్చే ఫింఛన్లు పొందడానికి అన్ని అర్హతలు ఉన్న వారిని సైతం తొలగించటానికి కారణం ఏంటని పెద్దగూడెం తండావాసులు, ఖాశీంనగర్ తండా వాసులు శుక్రవారం ఎంపీడీఓను నిలదీశారు. అనర్హులకు ఫింఛన్లు ఇచ్చిన ఎంపీడీఓ అసలై న అర్హులకు ఇవ్వకుండా తప్పుడు సర్వే చేశారని, గ్రామాల్లో మరోసారి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన ఎంపీడీఓ నాగశేషాద్రి సూరి తా ను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వే చే శానని, ఏవైనా అ భ్యంతరాలుంటే ఆర్డీఓకు ఫిర్యాదు చేసుకోవచ్చునని సమాధానం ఇచ్చారు.