పింఛన్ ఇవ్వలేదని.. మూర్ఛపోయిన వృద్ధురాలు
వనపర్తి రూరల్ : తాను పింఛన్ల సర్వే సమయంలో ఆస్పత్రిలో ఉన్నానని.. దయ ఉంచి తన దరఖాస్తును పరిశీలించి పింఛన్ ఇవ్వాలని ఓ వృద్ధురాలు ఎంపీడీఓను వేడుకొంది. దీనికి ఎంపీడీఓ ససేమిరా అన్నా డు. దీంతో ఆవేదనకు గురైన ఆ వృద్ధురాలు అక్కడే మూర్ఛపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన వనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జరిగింది.
వనపర్తి మండలం శ్రీనివాసపురానికి చెందిన జక్కుల నర్సమ్మ (68) శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చింది. ఆ సమయంలో కార్యాలయంలో ఎంపీడీఓతో పా టు గ్రామ సర్వే అధికారి ఉన్నారు. వారివద్దకు వెళ్లి వృద్ధాప్య పింఛన్ పొందేందుకు తనకు అన్ని అర్హతలూ ఉన్నాయని.. తనక భర్త కూడా లేడని, దరఖాస్తు పరిశీలించి పింఛన్ ఇవ్వాలని చాలాపేసు ప్రాధేయపడింది.
దీనికి వారు ఒప్పుకోలేదు. ఆమె తరఫున ఉప సర్పంచ్ జనార్దన్, మున్సిపల్ కౌన్సిలర్లు రమేష్‌నాయక్, కృష్ణబాబులు ఎంపీడీఓను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా, ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆవేదనకు గురైన నర్సమ్మ మూర్ఛతో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ఎంపీడీఓ అక్కడనుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడే ఉన్న పలువురు ప్రజాప్రతినిధులు వృద్ధురాలిని 108 అంబులెన్స్‌లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఎంపీడీఓను నిలదీసిన తండావాసులు
ప్రభుత్వం ఆసరా పథకంలో భాగంగా ఇచ్చే ఫింఛన్లు పొందడానికి అన్ని అర్హతలు ఉన్న వారిని సైతం తొలగించటానికి కారణం ఏంటని పెద్దగూడెం తండావాసులు, ఖాశీంనగర్ తండా వాసులు శుక్రవారం ఎంపీడీఓను నిలదీశారు. అనర్హులకు ఫింఛన్లు ఇచ్చిన ఎంపీడీఓ అసలై న అర్హులకు ఇవ్వకుండా తప్పుడు సర్వే చేశారని, గ్రామాల్లో మరోసారి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన ఎంపీడీఓ నాగశేషాద్రి సూరి తా ను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వే చే శానని, ఏవైనా అ భ్యంతరాలుంటే ఆర్డీఓకు ఫిర్యాదు చేసుకోవచ్చునని సమాధానం ఇచ్చారు.