గంజాయి అంటే చాలామందికి పోలీస్ కేసులు.. ఒళ్లు తెలియని మత్తు గుర్తుకొస్తాయేమోగానీ.. వాస్తవానికి ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అని అంటున్నారు శాస్త్రవేత్తలు. వాంటర్‌బిల్ట్ బయో వీయూ రిసోర్స్ నుంచి సేకరించిన వైద్య రికార్డుల ఆధారంగా రాబర్ట్ కార్సన్ అనే ఓ శాస్త్రవేత్త మూర్ఛవ్యాధి చికిత్సలో గంజాయి పాత్ర ఏమిటన్నదానిపై పరిశోధన నిర్వహించారు. దాదాపు 108 మంది మూర్ఛ వ్యాధిగ్రస్తులకు గంజాయి నుంచి తీసిన నూనెను మందుగా ఇచ్చినప్పుడు దాదాపు 40 శాతం మందిలో వ్యాధిలక్షణాలు సగానికి తగ్గిపోగా.. పదిశాతం మందిలో పూర్తిగా లేకుండా పోయాయి.
మిగిలినవారిలోనూ కొంత మెరుగుదల కనిపించింది. వీరిలో 22 శాతం మంది తాము తీసుకుంటున్న సాధారణ మందుల మోతాదును గణనీయంగా తగ్గించుకోగలిగారు. శుద్ధి చేసిన గంజాయి నూనెపై తాము పరిశోధనలు చేసినప్పటికీ... చాలామంది వ్యక్తిగత స్థాయిలో దీన్ని వాడుతూనే ఉన్నారని ఈ విషయంలో అందరూ జాగ్రత్త వహించాలని రాబర్ట్ కార్సన్ సూచిస్తున్నారు.
ఆ నూనెతో మూర్ఛ లక్షణాలు తగ్గుముఖం!
Published Fri, Mar 2 2018 6:00 AM | Last Updated on Fri, Mar 2 2018 6:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment