
మూర్ఛరోగ లక్షణాలను గణనీయంగా తగ్గించేందుకు గంజాయి నూనె కానబిడాల్ బాగా ఉపయోగపడుతుందని అమెరికాలోని అలబామా రాష్ట్రంలో జరిగిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ అధ్యయనంలో భాగంగా కొంతమంది మూర్ఛ రోగులకు ఈ కానబిడాల్ నూనెను అందివ్వడం మొదలుపెట్టారు. అధ్యయనానికి ముందు కొంత మందికి రెండు వారాల సమయంలో దాదాపు 144 సార్లు మూర్ఛ లక్షణాలు కనిపించేవి. పన్నెండు వారాల తరువాత పరిశీలించినప్పుడు ఈ సంఖ్య 52కు తగ్గిపోయింది.
ఆ తరువాత నాలుగేళ్ల వరకూ మూర్ఛ లక్షణాల తీవ్రత తగ్గడమే కాకుండా, లక్షణాలు తక్కువగా కనిపించాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టినా బేబిన్ అంటున్నారు. ఈ అధ్యయనం కోసం తాము గ్రీన్‌విచ్ బయో సైన్సెస్ అనే సంస్థ తయారుచేసిన ఎపిడోలెక్స్ అనే కానబిడాల్ నూనె వాడామని, గంజాయిలో మత్తు కలిగించే రసాయనం టీహెచ్‌సీ ఇందులో చాలా తక్కువ మోతాదులో ఉంటుందని చెప్పారు. దుష్ప్రభావాలు పెద్దగా లేవని అన్నారు. సాధారణ చికిత్స పద్ధతులకు లొంగని వేర్వేరు వర్గాల రోగులను తాము అధ్యయనంలో చేర్చామని, అందరిలోనూ ఫలితం ఒకేలా ఉండటం గుర్తించాల్సిన విషయమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment