మన దేశంలో గంజాయి తాగడం నిషిద్ధం. అంతేగాదు గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా చేస్తే జైలుకే పరిమితమవ్వుతారు. అలాంటి గంజాయితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తాజా పరిశోధనలో వెల్లడయ్యింది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరిచి, ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో సహయపడుతుందని పరిశోధకులు గుర్తించారు. అసలు ఈ గంజాయి ఎలా మెమరీ నష్టాన్ని, ఒత్తిడిని నివారిస్తుందో సవివరంగా చూద్దామా..
మత్తు కోసం గంజాయి లేదా గంజాయి మొక్కలోని ఎండిన ఆకులు పొగబెట్టడం లేదా నమలడం వంటివి చేస్తుంటారు. అందువల్లే దీన్ని మత్తు పదార్థంగా నిర్ణయించి ప్రభుత్వాలు నిషేధించడం జరిగింది. అయితే ఈ గంజాయి మెక్కలోని సైకోయాక్టివ్ పదార్థాల్లో కన్నాబినాయిడ్స్ ఉన్నాయి. వీటి నుంచి సీబీజీ, కన్నాబిడియోల్(సీబీడీ) ఉత్పన్నం అవుతాయట. అందువల్లే కొన్ని దేశాల్లో దీన్ని కీమోథెరపీ కారణంగా వచ్చే దీర్ఘకాలిక నొప్పి లేదా వికారం చికిత్సలో ఈ గంజాయిని వినియోగించడం జరుగుతుందట. ఇప్పుడు ఈ విషయమై ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది కూడా. అంతేగాదు అధికా ఆదాయ దేశాలతో సహా అనేక దేశాల్లో ఈ గంజాయి ఔషధ వియోగం చట్టబద్ధమైనదే.
దీనిపై పరిశోధనలో చేసిన వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ గంజాయిలోని సీబీజీని నిరంభ్యంతరంగా వినియోగించవచ్చని తేల్చి చెప్పారు. అందుకోసం పరిశోధకులు రెండు వర్చువల్ సమావేశాల్లో సుమారు 34 మంది వ్యక్తులపై అధ్యయనం చేశారు. వారందరికి దాదాపు 20 మిల్లీగ్రాముల సీబీజీ లేదా ప్లేసీబోను ఇచ్చారు. ఈ మత్తు ప్రభావంతో వారిలోని ఆందోళన, ఒత్తిడి మానసిక స్థితి ప్రాథమిక స్థాయిలను గుర్తించగా..చాలా ప్రభావవంతంగా వారిలో ఆందోళ, ఒత్తడి స్థాయిలు తగ్గాయి కూడా.
అలాగే జ్ఞాపకశక్తిలో గణనీయమైన మెరుగుదల కనిపించిదని అన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో తక్కువ మత్తు, పొడి నోరు, నిద్రపోవడం, పెరిగిన ఆకలి వంటి మార్పులు కనిపించాయని చెప్పారు. ఈ గంజాయిలోని సీబీజీ ఓ అద్భుత ఔషధం అని చెప్పారు పరిశోధకులు. ఇక్కడ దీన్ని ఉపయోగించే పరిమితిని అర్థం చేసుకుంటేనే సత్ఫలితాలు పొందగలమని అన్నారు. దీనిపై కొనసాగుతున్న అధ్యయనాలు భవిష్యత్తులో సీబీజీ ప్రయోజనాలు, భద్రతపై సమగ్ర అవగాహన అందిస్తాయని నమ్మకంగా చెప్పారు శాస్త్రవేత్తలు. టైమ్స్‌నౌ న్యూస్ ప్రకారం ఈ అధ్యయనం సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.
(చదవండి: ఈ మందులు ఉదయం కాఫీతో తీసుకుంటున్నారా..?)
Comments
Please login to add a commentAdd a comment