
తండ్రి మృతదేహం వద్ద విలపిస్తున్న కుమారుడు
తుమకూరు : కుమారుడితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కారులో వెళ్తున్న తండ్రి మూర్ఛకు గురై సీటులో వెనక్కువాలిపోయి ప్రాణాలు విడిచాడు. అదృష్టవశాత్తూ వాహనం నిలిచిపోవడంతో కుమారుడికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలుకా, హులియూరు సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. జిల్లాలోని కొరటిగెరె తాలుకా, ఆలాళసంద్ర గ్రామానికి చెందిన శివకుమార్(35) బుధవారం కుమారుడు పునిత్‌తో కలిసి కుక్కర్ల లోడ్ తీసుకెళ్తుండగా హులియూరు సమీపంలో మూర్ఛకు సీటులో వెనక్కువాలిపోయాడు. అయితే వాహన వేగం తక్కువగా ఉండటంతో ఆగిపోయింది. తండ్రికి ఏమైందో తెలియక ఎనిమిది సంవత్సరాల కుమారుడు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. స్థానికులు వచ్చి పరిశీలించగా శివకుమార్ మృతి చెందినట్లు గుర్తించి హులియూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి బంధువులకు సమాచారం ఇచ్చి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment