చూస్తుండగానే పైనుంచి దూసుకెళ్లిన కారు! | Car Hits Woman And Rolled Over Her At Mangalore In Karnataka | Sakshi
Sakshi News home page

చూస్తుండగానే పైనుంచి దూసుకెళ్లిన కారు!

Published Sat, Aug 8 2020 4:40 PM | Last Updated on Sat, Aug 8 2020 7:55 PM

Car Hits Woman And Rolled Over Her At Mangalore In Karnataka - Sakshi

సాక్షి, బెంగుళూరు: కర్ణాటకలోని మంగుళూరులో ఓ మహిళ మృత్యు ముఖంలోకి వెళ్లి ప్రాణాలతో బయటపడింది. కాద్రి కంబ్లా జంక్షన్‌ గుండా స్కూటర్‌ వెళ్తున్న వాణిశ్రీ అనే మహిళను ఓ కారు అడ్డుగా వచ్చి ఢీకొట్టింది. దాంతో ఆమె ఎగిరి కారు బానెట్‌పై పడి.. అక్కడి నుంచి కింద పడింది. అయినా కూడా ఆ సోయితప్పిన కారు డ్రైవర్‌ అదేమీ గమనించలేదు. కారుని అలానే ముందుకు పోనిచ్చాడు. దాంతో కారు ఆమె మీదుగా వెళ్లింది.

అయితే, రోడ్డు పక్కనే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై కారును అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. డ్రైవర్ కారు నిలపడంతో స్థానికులు వెంటనే కారుని అమాంతం పెకెత్తి మహిళను బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించారు. వాణిశ్రీకి ఎలాంటి అపాయం లేదని, చిన్న గాయాలే తగిలాయని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంపై కామెంట్ల వర్షం కురుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement