Police Seized 100 Kg Drug Laced Chocolates From 2 Shops In Mangalore - Sakshi
Sakshi News home page

Narcotic Chocolate Case: 100 కేజీల డ్రగ్స్‌ చాక్లెట్లు స్వాధీనం

Published Fri, Jul 21 2023 12:39 PM | Last Updated on Fri, Jul 21 2023 12:49 PM

Police Seize 100 Kg Drugs Chocolate Mangalore - Sakshi

యశవంతపుర(బెంగళూరు): మంగళూరు నగర డ్రగ్స్‌ నిఘా విభాగం పోలీసులు 100 కేజీల డ్రగ్స్‌ పూతగల చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పాండేశ్వర పోలీసులు మంగళూరు లో కార్‌స్ట్రీట్‌, ఫళ్నీర్‌లో రెండుచోట్ల దాడులు చేసి మత్తు పదార్థాలు పూతపూసిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మనోహర్‌ శేఠ్‌, చెచ్చన్‌ సోంకర్‌ అనేవారిని అరెస్ట్‌ చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ కులదీప్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ తెచ్చి అమ్ముతున్నట్లు వివరించారు.


మరో ఘటనలో..

తండ్రిని హతమార్చిన కూతురు
దొడ్డబళ్లాపురం: మానసిక అస్వస్థురాలైన కుమార్తె.. కన్నతండ్రిని హత్య చేసిన సంఘటన చెన్నపట్టణ తాలూకా నాయిదొళె గ్రామంలో చోటుచేసుకుంది. పుష్ప అనే వివాహిత తండ్రి హుచ్చీరయ్య (68)ను పారతో కొట్టి హత్య చేసింది. మానసిక ఆరోగ్యం బాగా లేకపోవడంతో పుష్ప గత కొంత కాలంగా భర్తను వదిలి పుట్టింట్లో ఉంటోంది. వైద్యం చేయించుకోక మరింత ముదిరింది. రోజూ తండ్రితో గొడవ పడేది. బుధవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగ్గా, ఇంట్లోని పార తీసుకుని ఇష్టానుసారంగా బాదడంతో వృద్ధుడు ప్రాణాలొదిలాడు. చెన్నపట్టణ గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పుష్ప పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement