Prevention
-
ఉన్నపాటుగా ప్రాణాలు తీస్తున్న గుండెపోటు : ఎలా గుర్తించాలి?
తెలంగాణాలో హైకోర్టులో ఉండగానే హఠాత్తుగా కుప్పకూలి సీనియర్ న్యాయవాది ప్రాణాలు కోల్పోయిన వైనం ఆందోళన రేపింది. ఒకపుడు గుండెపోటు అంటే.. మధుమేహం ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, వయసు మీద పడిన వారికి, ఊబకాయ ఉన్నవారికి మాత్రమే వస్తుంది అని అనుకునే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో గుండె పోటు తీరు మారింది. మాకు రాదులే అని అనుకోడానికి లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండానే ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది? గుండె పోటు వచ్చే ముందు మన శరీరం ఏమైనా సంకేతాలు పంపిస్తుందా? ఈ కథనంలో చూద్దాం.జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడిన వారిలో గుండె వ్యాధుల ప్రమాదం ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో అసలు అనారోగ్య సమస్యలేకపోయినా కూడా హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు.గుండెపోటు అంటే? గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలలో కొవ్వు కాని గడ్డలు కాని ఏర్పడడం వల్ల రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడితే గుండె పోటు వస్తుంది. సాధారణంగా గుండె (కరోనరీ) ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ ,ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల అడ్డంకులు(బ్లాక్స్) ఏర్పడతాయి. రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వీటికి సరైన సమయంలో చికిత్స అవసరం. అలాగే బాడీలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిన వారు కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలువాస్తవానికి కొంతమందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మరికొందరికి తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, కానీ చాలామంది వాటిని గుర్తించడంలో వైఫల్యంతోనే ముప్పు ముంచుకొస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు గుర్తించి, ప్రాథమిక చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా ఉందిలో ఉంటుందని అంటున్నారు.గుండెల్లో మంట లేదా అజీర్ణంగొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడంఛాతీలో నొప్పి, గుండె లయలో మార్పులుశ్వాస తీసుకోవడంలో ఇబ్బందితల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తొందరగా అలసిపోవడం, అంటే కొద్దిగా నడిస్తేనే నీరసంనాలుగు మెట్టు ఎక్కంగానే ఆయాసంఇలాంటి లక్షణాలున్నపుడు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.► మరి కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది. ► ఒకటి లేదా రెండు రోజులకు మించి ఎడం చెయ్యి లేదా రెండు చేతులలో అకారణంగా నొప్పి, వికారం, వాంతి వచ్చినట్టు ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలిలక్షణాలు లేకపోయినా ఎవరు జాగ్రత్త పడాలి అధిక బరువు వున్నా, హైబీపీ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నా, ధూమపానం అలవాటు ఉన్న వారంతా గుండె పోటు ప్రమాదం పట్ల అవగాహనతో ఉండాలి. అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండే ఉద్యోగాలు చేసేవారిలోనూ గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అనేది గమనించాలి. ముఖ్యంగా మధ్య వయసులో స్త్రీల కన్నా మగవారికి గుండెపోటువచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతన్నారు.మెనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రెజెన్ స్థాయి తగ్గిపోతుంది. అప్పుడు వారిలో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అయితే 65 ఏళ్ల తర్వాత పురుషుల్లో కంటేమహిళల్లో ఎక్కువ గుండె పోటు వస్తున్నట్టు పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురిలోనూ అలసత్వం ఎంతమాత్రం మంచిది కాదు.మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉన్నా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వంశపారంపర్యంగా ఈ గుండె వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.గుండెపోటు రావడానికి కారణంవృత్తి, వ్యాపారాల్లో భరించలేని టెన్షన్లు, సరైన పోషకాహారం తీసుకోకపోవడంచిన్నతనం నుంచే అలవాటుపడిన జంక్‌ఫుడ్‌లు వదలలేకపోవడంకాలానికి తగినట్లుగా పిరియాడికల్ టెస్టులు చేయించుకొని శరీరంలో వస్తున్న అనారోగ్య సంకేతాలను ముందే తెలుసుకొని తగిన చికత్సలు తీసుకోకపోవడంశక్తికి మించి జిమ్, ఎక్సర్సైజులు వంటివి చేయడంగుండెపోటు రాకుండా ఏం చేయాలి?క్రొవ్వు పదార్ధాలు అతిగా తినకుండా శరీరానికి అవసరమైన మేరకు తినడంప్రతి ఉదయం నలభై నుండి అరవై నిమిషాలు నడక, లేదా ఇతర వ్యాయామం చేయడం.ఒత్తిడి లేని జీవన శైలి పాటించడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడంనోట్: కొన్ని అనుమానాస్పద లక్షణాలున్నవారందరూగుండెజబ్బు వచ్చేసినట్టు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలు కనిపించగానే రోగ నిర్ధరణ అనేది చాలా కీలకం. క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారంపై శ్రద్దతో పాటు ఏ చిన్న అనుమానం వచ్చినా అజాగ్రత్త చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
World Cancer Day 2025 : లక్షలాదిమంది బిడ్డలు అనాథలుగా; ముందుగా గుర్తిస్తే!
ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్నీ ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ "యునైటెడ్ బై యునిక్". కేన్సర్ కారకాలు, సంరక్షణపై దృష్టి సారించి, సంరక్షణలో మార్పు తీసుకురావడానికి కొత్త మార్గాలను అన్వేషించాలనేది దీని లక్ష్యం. వ్యక్తిగతీకరించిన చికిత్సలు, మద్దతుపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది. 2000లో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) ఈ రోజును ప్రారంభించింది. కేన్సర్ వ్యాధి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంఘాలు, సంస్థలను సమీకరించే ఈ కార్యక్రమానికి మరింత ఆదరణ పెరిగింది. కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స, అందరికీ సంరక్షణలో మెరుగుదల చూడాలనే సంకల్పంతో కేన్సర్ సమాజం ఐక్యంగా ఉంది అని UICC అధ్యక్షురాలు, స్వీడిష్ కేన్సర్ సొసైటీ సెక్రటరీ జనరల్ ఉల్రికా అరెహెడ్ అన్నారు.దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, తరువాతి కేన్సర్దే. 2050 నాటికి కేసులలో 77 శాతం పెరుగుదల అంచనా. ఫలితంగా 1.32 కోట్ల మరణాలు సంభవించనున్నాయని ఆందోళన వ్యక్తమౌతోంది. 2022లో 90.6 లక్షల మంది మరణించారు. ప్రతీ ఏడాది 10 లక్షల మంది పిల్లలు తమ తల్లిని కోల్పోతున్నారు. 10.4 లక్షల మంది పిల్లలు తమ తండ్రిని కోల్పోతున్నారు. నోటి కేన్సర్, రొమ్ము కేన్సర్, గర్భాశయ కేన్సర్, ఊపిరితిత్తుల కేన్సర్, కడుపు కేన్సర్, లివర్ కేన్సర్ ప్రధానంగా ఉన్నాయి.సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది, ట్యూమర్, కణితి, గడ్డలుగా మారే స్థితినే కేన్సర్ అని పిలుస్తారు. అయితే ఈ వ్యాధి ముందస్తుగా గుర్తించడం వల్ల చాలావరకు ప్రాణహాని నుంచి బయటపడవచ్చు. ఇది శరీరానికి సంబంధించిన వ్యాధి మాత్రమే కాదు కాదు, బాధిత వ్యక్తి, ఆ కుటుంబానికి చెందిన మానసిక, భావోద్వేగాలకు సంబంధించి కూడా. అయితే వివిధ రకాల అపోహలతోపాటు అవగాహన లేక పోవడం, భయం వల్ల ఈ వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతోంది. చాలా కేసుల్లో వ్యాధి ముదిరిన తరువాతే గుర్తిస్తుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అనట్టు ఏ వ్యాధికైనా చికిత్సకంటే ముందస్తుగా గుర్తించడం కీలకం. ఈ సూత్రం కేన్సర్ విషయంలో ఇంకా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.కేన్సర్‌ను గుర్తించేందుకు ముఖ్యమైన లక్షణాలుఉన్నట్టుండి అనూహ్యంగా బరువు తగ్గడం. ఎలాంటి కారణం అంటే, డైటింగ్, వ్యాయామం, లేకుండానే నెలకు ఐదు కేజీలకంటే ఎక్కువ బరువు తగ్గితే ప్రమాద సంకేతమని గుర్తించాలి. సుదీర్ఘం కాలం పాటు జ్వరం వేధించడం. కేన్సర్ కణాలు శరీరంలో వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం, బాడీ పెయిన్స్ లాంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గాయాలు త్వరగా మానకపోవడం. సాధారణంగా ఎలాంటి గాయమైనా మూడు నాలుగు వారల్లో నయం కావాలి. అలా కాని పక్షంలో అనుమానించాలి. గాయం తగ్గకపోగా, లక్షణాలు పెరుగుతుంటే వైద్యులను సంప్రదించాలి.నోట్లో ఎంతకీ మానని పుండ్లు. నోట్లో పుండ్లు ఏర్పడి చాలాకాలం తగ్గకుండా ఉంటే వైద్యులను సంప్రదించాలి. పొగాకు, గుట్కా, పాన్ నమలడం లాంటి అలవాట్లున్నవారు మరింత జాగ్రత్తపడాలి.అకారణంగా అలిసిపోవడం కేన్సర్‌లో మరో ప్రధాన కారణం. విపరీతమైన అసలట. నీరసం, ఓపిక లేకుండా అయిపోవడం. ఏ పని మీదా ధ్యాస పెట్టలేకపోవడం. నిస్సత్తువగా అనిపించడం. ప్రధానంగా లుకేమియా కేన్సర్ సోకిన వారిలో ఈ లక్షణం కనిపిస్తుంది. విపరీతమైన రక్తహీనత. రక్తంలో హిమగ్లోబిన్ శాతం గణనీయంగా తగ్గిపోవడం.శరీరంపై కొత్తగా మచ్చలు పుట్టుకు రావడం, పుట్టుమచ్చలు పెరిగి, వాటి నుంచి రక్తం కారడం. శరీర రంగు నల్లగా మారిపోవడం (హైపర్ పిగ్మెంటేషన్)ఆహారాన్ని మింగడం లేదా నీటిని తాగడం వంటి వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, విపరీతమైన దగ్గు లేదా గొంతు బొంగురు పోవడంలాంటి సమస్యలున్నా జాగ్రత్తపడాలి. సుదీర్ఘకాలం పాటు,వాంతులు వేధించడం, తిన్నది సరిగ్గా అరగకపోవడం, మలబద్ధకం లాంటి లక్షణాలు పెద్దపేగు కేన్సర్ వల్ల కావచ్చునేమో అనుమానించాలి.రొమ్ముల్లో, వృషణాల్లో, గొంతులో ఏదైనా గడ్డలు తగిలితే అనుమానించాలి. రొమ్మునుంచి రక్తం, చీము లాంటి స్రావాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. అలాగే పురుషాంగం లేదా యోనిపై మానని పుండ్లు ఉండే సాధారణ ఇన్ఫెక్షన్ అవునా? కాదా నిర్ధారించుకోవాలి. మూత్రంలో మంట, నొప్పి, రక్తం పడటం, మూత్రం రంగు మారడం, పదే పదే మూత్రానికి వెళ్లాలని పించడం, లేదా అసలే నీరుడు బంద్ కావడం లాంటి లక్షణాలు బ్లాడర్ లేదా ప్రొస్టేట్ కేన్సర్లకు దారి తీయవచ్చు.మలంలో విపరీతంగా రక్తం, రంగు మారడం పెద్ద పేగు కేన్సర్‌కు సంకేతం కావొచ్చు.ఈ పైన చెప్పిన లక్షణాలు మూడు లేదా నాలుగు వారాలకు మించి కొనసాగుతుంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. దానికి కారణాలను నిర్ధారణ చేసుకొని, తగిన చికిత్స తీసుకోవాలి. సైలంట్ కిల్లర్కేన్సర్ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే లక్షణాలు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు దాకా గుర్తించడం కష్టం. మరో విధంగా చెప్పాలంటే.. దాదాపు నాలుగో స్టేజ్‌లో బయటపడతాయి. ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్ , అండాశయ కేన్సర్ లాంటి నిశ్శబ్దంగా చుట్టుముడతాయి. ఈ మహమ్మారికి చిన్నాపెద్దా, ముసలీ ముతకా, స్త్రీ, పురుష అనే దయాదాక్షిణ్యాలేవీ ఉండవు. అందుకే అవగాహన, అప్రమత్తత అవసరం. -
సురక్షితం ఏఐ రాస్తే
నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలు కారణమవుతుండగా, మరికొన్ని చోట్ల రోడ్ల నిర్మాణంలోని లోపాలు కారణంగా నిలుస్తున్నాయి. ఈ రెండో సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పరిష్కారం కనిపెట్టారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఐఎన్ఏఐ కేంద్రం ఆవిష్కరించిన ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ (ఐరాస్తే) ఈ సమస్యకు దారి చూపింది. తెలంగాణ ప్రభుత్వం, ఇంటెల్ సహకారంతో ఐరాస్తేను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. -సాక్షి, హైదరాబాద్ఒక రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం 80 నుంచి 90 శాతం ఉన్న ప్రదేశాన్ని గ్రే స్పాట్‌గా గుర్తిస్తారు. అయితే, వరుసగా మూడేళ్లపాటు అదేచోట ప్రమాదాలు జరిగి పది మందికంటే ఎక్కువ చనిపోతే, ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలో చేర్చుతారు. ఇలాంటి ప్రదేశాలను గ్రే స్పాట్ల స్థాయిలోనే తెలుసుకోగలిగితే ప్రమాదాలు జరగకుండా, ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. సరిగ్గా ఈ పనే చేస్తుంది ఐరాస్తే. ఒక ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తించేందుకు మూడేళ్లు ఆగాల్సిన పనిలేకుండా ఏఐ సహకారంతో ముందుగానే గుర్తిస్తుంది. మూడు రహదారులపై అధ్యయనం.. ఐరాస్తేను రాష్ట్రంలోని మూడు ప్రధాన రహదారులపై ప్రయోగించి చూశారు. 2023, ఏప్రిల్ నుంచి 2024, మార్చి వరకు టీఎస్ఆర్టీసీకి చెందిన 200 బస్సుల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) పరికరాలు, 10 డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ (డీఎంఎస్) యూనిట్లను ఏర్పాటు చేసి పరీక్షించారు. మొత్తం 691 కిలోమీటర్ల మేర రోడ్లను అధ్యయనం చేశారు. 2022 నుంచి 2024 వరకు 5,606 ఎఫ్ఐఆర్లు, రోడ్డు ప్రమాద రికార్డులతో సహా క్రాష్ నివేదికలు, ఏడీఏఎస్ హెచ్చరికలు, బ్లాక్ స్పాట్లపై నిర్వహించిన భద్రతా ఆడిట్ట్లను పరిశీలించి ఒక్కో రహదారిపై 20 చొప్పున గ్రే స్పాట్లను ఐ రాస్తే గుర్తించింది. 15 గ్రే స్పాట్‌ల్లో పరిష్కార చర్యలను సూచిస్తూ జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు నివేదికలు సమర్పించారు. బారియర్స్‌తో సరిదిద్దవచ్చు.. కొన్ని గ్రే స్పాట్లకు స్వల్ప పరిష్కారాలు సరిపోతాయి. బారియర్స్, సైన్‌బోర్డులు, టీ–ఇంటర్ సెక్షన్ హెచ్చరిక సంకేతాలతో వాటిని సరిదిద్దవచ్చు. మరికొన్నింటికి ఆకృతి మార్పులు అవసరం. ఇప్పటివరకు మూడు గ్రే స్పాట్స్ సరిదిద్దే చర్యలకు ఎన్హెచ్ఏఐ టెండర్లను ఆహ్వనించింది. మిగిలిన ప్రదేశాలలో పని జరుగుతోంది. – పృథ్వీ, ఐ–రాస్తే ఆపరేషన్స్ మేనేజర్ 600 మందికి ఏబీసీలో శిక్షణ ప్రమాదాలు జరిగినప్పుడు తొలి స్పందన కోసం ఐరాస్తే 600 మంది స్థానికులకు యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ (ఏబీసీ)లో శిక్షణ ఇచ్చింది. వీరు 8 నెలల్లో 10 మంది ప్రాణాలు కాపాడారు. ఈ ఇంటిగ్రేటెడ్ నివారణ విధానం బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతున్నప్పుడు వాటిని అంచనా వేయగలదు. ఈ ప్రాజెక్టు విస్తరణకు రాజస్థాన్, జమ్ముకశీ్మర్ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం. – గోవింద్ కృష్ణన్, ఐ–రాస్తే ప్రోగ్రామ్ మేనేజర్, ట్రిపుల్ హైదరాబాద్ -
World Aids Day: పొంచే ఉంది.. కొంచెం జాగ్రత్త!
ఎయిడ్స్ పీడ బయటపడ్డ తొలినాళ్లలో తీవ్రమైన అనారోగ్యం, దారుణంగా క్షీణించి కదిలే కంకాళాల్లా ఉండే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. దాంతో ఎయిడ్స్ జబ్బు అంతరించి పోయిందేమో అనే అపోహ ప్రజల్లో ఏర్పడింది. అయితే, వాస్తవం మాత్రం పూర్తిగా అందుకు విరుద్ధం. ఇటీవలి కోవిడ్ రోజుల తర్వాత నుంచి హెచ్ఐవి వ్యాప్తి మళ్లీ పెరిగింది. దాంతో... నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగానైనా మరోమారి ఈ అంశంపై చర్చ జరగాల్సిన నేపథ్యంలో ఈ కథనం. తాజా లెక్కల ప్రకారం 2023 డిసెంబరు నాటికి 25 లక్షల మంది హెచ్ఐవి రోగులతో ప్రపంచంలోనే భారతదేశం రెండవ స్థానంలో వుంది. భారతీయ జనాభాలో తెలుగు రాష్ట్రాల ప్రజలు కేవలం ఆరు శాతమే అయినా... దేశంలోని హెచ్ఐవి బాధితుల్లో మాత్రం 20% మంది తెలుగువారే. అంటే... మన దేశంలోని ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు తెలుగు వ్యక్తి కావడం విషాదం. వ్యాప్తికి కారణాలు...ఎయిడ్స్, హెచ్ఐవీ మూడు విధాలుగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అవి... .లైంగిక చర్యతో పురుషుల వీర్యం, స్త్రీ జననేంద్రియ స్రావాలు కలవడం రక్తంలో రక్తం కలవడం అంటే ఎయిడ్స్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారి రక్తం ఆరోగ్యకరమైన వారి రక్తంతో కలవడం .బాధితురాలైన మహిళ నుంచి బిడ్డకు. నివారణ... చాలా వైరస్ జబ్బుల్లాగే చాలాకాలం పాటు దీనికీ నిర్దిష్టమైన చికిత్స లేదు. అయితే ఇప్పుడు చికిత్స అందుబాటులో ఉంది. కానీ అసలు ఎయిడ్స్‌కు గురై మందులతో జబ్బును అదుపులో ఉంచుకోవడం కంటే నివారణ చాలా మేలు. ఇది మూడు రకాలుగా వ్యాపిస్తుందని తెలుసు కాబట్టి ఆ మూడు అంశాలకు సంబంధించిన నివారణ మార్గాలు అవలంబిస్తే దీన్నుంచి పూర్తిగా దూరంగా ఉండవచ్చు. పైన పేర్కొన్న వ్యాప్తి కారణాలను బట్టి తీసుకోవాల్సిన నివారణ చర్యలివి... లైంగిక చర్యతో వ్యాప్తి చెందుతుంది కాబట్టి వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. పార్ట్నర్తో నమ్మకంగా వ్యవహరించాలి. సెక్స్‌లో పురుషులు తప్పనిసరిగా కండోమ్ వాడకం వాడాలి. మహిళలకు కొన్ని దేశాలలో ఫిమేల్ కండోమ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మద్యం మత్తులో కండోమ్ లేకుండా నిర్లక్ష్యంగా లైంగికచర్యకు పాల్పడే ప్రమాదం ఉన్నందున మద్యానికి దూరంగా ఉండటం చాలా అవసరం. రక్తంతో రక్తం కలవడం వల్ల ఎయిడ్స్ వ్యాప్తి చెందుతుందన్న అంశాన్ని గుర్తుంచుకుని ఒక నీడిల్ ఒకరికే పరిమితం చేయాలి. ఇక మాదక ద్రవ్యాలు వాడేవారు మత్తులో ఒకరు వాడిన సిరంజ్లే మరొకరు వాడితే... ఎయిడ్స్ వ్యాప్తిచెందుతుందన్న అంశాన్ని గుర్తుపెట్టుకుని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఇక తల్లి నుంచి బిడ్డకు అనేది సాధారణంగా భర్త కారణంగా భార్యకూ... ఆమెకు జబ్బు విషయం తెలియక... తీరా గర్భవతి అయ్యాక... తన తప్పేమీ లేకుండానే బిడ్డకు సంక్రమింప జేయడంతో అమాయకపు చిన్నారులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇలా ఈ వ్యాధి బారిన పడ్డ తల్లుల నుంచి చిన్నారులకు వ్యాధి వ్యాప్తి చెందకుండా (ప్రొఫిలాక్సిస్ చికిత్సగా) నివరపైన్ అనే నోటి ద్వారా ఇచ్చే మందు లేదా ఇంజెక్షన్‌ను తల్లికి ఇస్తారు. అలాగే బిడ్డ పుట్టాక అవసరాన్ని బట్టి ఆ చిన్నారికీ ఈ మందునిస్తారు. సాధారణ వ్యాప్తి మార్గాలకు ఇవీ నివారణలు. దీనికి తోడు అత్యంత వివక్షకు గురయ్యే ట్రాన్స్ జెండర్, గే, సెక్స్ వర్కర్లకు ఈ వ్యాధిపై అవగాహన వచ్చేలా, వారిలో చైతన్యం పెరిగేలా హెచ్ఐవి నివారణ కార్యక్రమాలను రూపొందించాలి. చికిత్స...చికిత్సకు ముందుగా అసలు ఎయిడ్స్ అంటే ఏమిటి, హెచ్ఐవీ అంటే ఏమిటో తెలుసుకోవడం అవసరం. ఎయిడ్స్‌కు కారణమయ్యే వైరస్‌ను హెచ్‌ఐవీగా... అంటే ఆ సంక్షిప్త అక్షరాలను విడమరిస్తే ‘హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్’గా చెబుతారు. హెచ్ఐవీ వైరస్ సోకాక... మానవుల్లో సహజంగా ఉండే వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) నశిస్తుంది. దాంతో చాలా మామూలు జబ్బు బారిన పడ్డా...అది ఎప్పటికీ నయం కాకుండా, దానివల్లనే మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ జబ్బును కలిగించే వైరస్‌ను హెచ్ఐవీ అంటారు. ఇక హెచ్ఐవీ సోకగానే వ్యాధి బయటకు కనిపించదు. క్రమంగా వ్యాధి నిరోధక కణాలన్నీ నశిస్తూ ΄ోవడం వల్ల... ఒక దశ తర్వాత ఏ చిన్న ఇన్ఫెక్షన్ సోకినా అది నయం కాని స్థితి వస్తుంది. ఆ కండిషన్‌నే ఎయిడ్స్ అంటారు. హెచ్ఐవి / ఎయిడ్స్ జబ్బు జీవితకాలపు వ్యాధి. ఒకసారి జబ్బు బారిన పడ్డవాళ్ల జీవితమంతా ఇక మందులు వాడాల్సే ఉంటుంది. పైగా అవి ఖరీదైనవి. యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అని పిలిచే ఆ మందులను వాడుతూ, హెచ్ఐవీని అదుపులో పెట్టుకుంటూ ఉండటమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స. హెచ్ఐవి – ఎయిడ్స్ జబ్బుకి పెద్ద ఎత్తున మందులు అందుబాటులోకి రావడం, ప్రభుత్వ వైద్యశాలలలో వీటిని ఉచితంగా అందజేయడంవల్ల ప్రస్తుతం చాలామంది వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దాదాపు సాధారణ మానవుల పూర్తికాల ఆయుర్దాయంతోనే వీళ్లూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. డా. యనమదల మురళీకృష్ణ, సాంక్రమిక వ్యాధుల నిపుణులు (చదవండి: కోడిపుంజులాంటి హోటల్..! ) -
బ్రెయిన్ స్ట్రోక్: ఇన్‌టైంలో వస్తే.. అంతా సేఫ్..!
కాలూ, చేయి చచ్చుపడినపోతే పక్షవాతం అనిపిలిచే సమస్య వస్తే కేవలం మంచానికి పరిమితమైపోవడమనే అనే భావన ఒకప్పుడు ఉండేది. ఇప్పటికీ కొందరిలో ఉంది. కానీ సమయానికి సరైన చికిత్స అందితే ‘స్ట్రోక్’ అని పిలిచే ఈ సమస్య నుంచి బాగుపడటం సాధ్యమే అని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నెల (అక్టోబరు) 29న వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ‘బ్రెయిన్ స్ట్రోక్’పై అవగాహన కోసం...మెదడును రక్షించుకోవడంలో టైమ్ చాలా కీలకం. స్ట్రోక్ వచ్చాక వైద్యం అందడంలో జరిగే ప్రతి నిమిషం జాప్యానికి కోటీ ఇరవై లక్షల న్యూరాన్లు నశించిపోతుంటాయి. అందుకే ‘‘టైమ్ ఈజ్ బ్రెయిన్’’ అంటారు. అందుకే స్ట్రోక్ గురించి మరింతగా తెలుసుకోవడం అవసరం. స్ట్రోక్‌లో రకాలు... 1) ఇస్కిమిక్ స్ట్రోక్ : రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల మెదడులో ఒక భాగానికి రక్తం అందక ఆ భాగం దెబ్బతినడాన్ని ‘ఇస్కిమిక్ స్ట్రోక్’ అంటారు. 2) హేమరేజిక్ స్ట్రోక్ : మెదడు లోపలి రక్తనాళాలు చిట్లడంతో మెదడులో రక్తస్రావం కావడం వల్ల వచ్చే స్ట్రోక్‌ను ‘హేమరేజిక్ స్ట్రోక్’ అంటారు. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టిఐఏ)... పక్షవాతం లక్షణాలు కనిపించాక అవి ఒకటి నుంచి రెండు గంటలలోపు తగ్గిపోయి బాధితుడు కోలుకుంటే దాన్ని ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్’ అని పిలుస్తారు. అంటే... పెద్ద భూకంపానికి ముందు చిన్న చిన్న ప్రకంపనల్లా ఒక పెద్ద స్ట్రోక్ రావడానికి ముందు సూచనలుగా ఇలాంటివి వస్తుంటాయి. ఒకవేళ చిన్న చిన్న లక్షణాలు కనిపించాక 24 గంటల తర్వాత కూడా బాధితుడు వాటి ప్రభావం నుంచి బయటపడకపోతే అప్పుడు దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్‌గా పరిగణిస్తారు. ఎవాల్వింగ్ స్ట్రోక్ : కాళ్లూ చేతులు చచ్చుబడుతూ పూర్తి స్థాయి స్ట్రోక్ క్రమంగా రావడాన్ని ఎవాల్వింగ్ స్ట్రోక్ అంటారు. ఈ టిఐఏ, ఇవాల్వింగ్ స్ట్రోక్‌లను ముందుగానే గుర్తించి తగిన చికిత్స చేయిస్తే పూర్తిస్థాయి స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు. అందుకే పైన పేర్కొన్న ఏదైనా లక్షణం లేదా కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స చేయించుకుని భవిష్యత్తులో పక్షవాతం రాకుండా నివారించుకోవడం సాధ్యమే. స్ట్రోక్‌కు కారణాలు: నిజానికి బ్రెయిన్ స్ట్రోక్ అన్నది ఎవరికైనా రావచ్చుగానీ సాధారణంగా చాలామందిలో హైబీపీ, డయాబెటిస్, పొగతాగడం, అతిగా మద్యం తాగే అలవాటు, సరైన వ్యాయామం లేక΄ోవడం, స్థూలకాయం, ఒత్తిడికి గురికావడం, రక్తంలో కొవ్వులు (కొలెస్ట్రాల్) ఎక్కువగా ఉండటం అనే అంశాలు స్ట్రోక్‌కు కారణమవుతాయి. అలాగే గుండె జబ్బులు, రక్తం గడ్డకట్టే స్వభావం ఎక్కువగా ఉండటమూ స్ట్రోక్‌కు కారణాలే.చికిత్స మొదటి నాలుగున్నర గంటల్లోపు హాస్పిటల్‌కు తీసుకువస్తే అది ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే వాళ్లకు టిష్యూ ప్లాస్మెనోజెన్ యాక్టివేటర్ అనే మందును రక్తనాళంలోకి ఇస్తారు. మొదటి ఆరుగంటలలోపు హాస్పిటల్‌కు తీసుకువస్తే పెద్ద రక్తనాళాలలో అడ్డంకులు (క్లాట్స్) ఏర్పడి స్ట్రోక్ వచ్చినవాళ్లలో స్టెంట్ ద్వారా క్లాట్స్‌ను తొలగించవచ్చు. పై రెండు పద్ధతుల ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చినవారు రక్తం పలుచబడటానికి వాడే మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. లేని పక్షంలో మళ్లీ స్ట్రోక్ రావచ్చు. అలాగే హైబీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు వాటిని అదుపులో పెట్టే మందులు వాడాలి. పునరావాస సేవలు (రీహ్యాబిలిటేషన్ సర్వీసెస్): స్ట్రోక్ వచ్చిన మొదటిరోజు నుంచే మొదలుపెట్టి తమ రోజువారీ కార్యక్రమాలను స్వతంత్రంగా చేసుకునేవరకు ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, సరైన రీతిలో నడిచేలా శిక్షణ వైద్యచికిత్సలో ముఖ్యం. స్టోక్ నిర్ధారణ ఇలా... సీటీ స్కాన్ (బ్రెయిన్)తో స్ట్రోక్ వచ్చిందనే నిర్ధారణ తోపాటు... అది ఇస్కిమిక్ స్ట్రోకా లేదా హేమరేజిక్ స్ట్రోకా అన్నది నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ సీటీ స్కాన్ (బ్రెయిన్)లో నిర్ధారణ కాక΄ోతే ఎమ్మారై (బ్రెయిన్), ఎమ్మార్ యాంజియో పరీక్ష చేయించాలి. అలాగే ఈ స్ట్రోక్ ఎందుకు వచ్చిందో తెలుసుకుని, మళ్లీ రాకుండా చూసుకోడానికి టూడీ ఎకో, గొంతు రక్తనాళాల డాప్లర్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించడం, షుగర్ మోతాదులు తెలుసుకోవడం... ఇవన్నీ రొటీన్‌గా చేయించే పరీక్షలు. చిన్న వయసులో స్ట్రోక్ వచ్చినా లేదా మందులు వాడుతున్నప్పటికీ మళ్లీ స్ట్రోక్ వచ్చినా కొన్ని అరుదైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.లక్షణాలుపక్షవాతంలో సాధారణంగా ఒక చేయీ, కాలూ చచ్చుపడిపోవడం మూతి వంకరపోవడం / మాట స్పష్టంగా రాకపోవడం కళ్లు తిరిగి పడిపోవడం శరీరం తూలడం మాట పడిపోవడం ఒకవైపు చూపు తగ్గిపోవడం మింగడం కష్టం కావడం ఎదురుగా ఉన్న వస్తువులు, మనుషులు ఒకటి రెండుగా/ఒకరు ఇద్దరుగా కనిపించడంఅరుదుగా పూర్తిగా స్పృహతప్పి పడిపోవడం జరగవచ్చు. పైన పేర్కొన్నవాటిల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించవచ్చు. నివారణే ప్రధానం... జీవనశైలి (లైఫ్‌స్టైల్)లో, ఆహారంలో మార్పులు లైఫ్ స్టైల్ మార్పులుప్రతిరోజూ వ్యాయామం మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం తిండి, నిద్రలలో వేళలు పాటించడం.ఆహారంలో మార్పులివి ఉప్పు తగ్గించడం తాజా కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సరైన సమయంలో చికిత్స పొందితే స్ట్రోక్ వల్ల మంచానికే పరిమితమైపోతామనే దురభిప్రాయం నుంచి బయటికి రావచ్చు. (చదవండి: పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే..? మనసులో సునామిలా..) -
సైబర్ నేరస్తుల బారి నుంచి తప్పించుకోండిలా..
Cyber Crime Prevention Tips: ఇటీవల కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలను లక్షంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పేర్లతో ఏమార్చి ప్రజలను దోచుకుంటున్నారు. బ్యాంకులు, క్రెడిట్ కార్డులతో మోసాలకు పాల్పడుతూ భారీగా డబ్బులు కొట్టేస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేర్లతోనూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మాట ఎక్కువగా వినబడుతోంది. వర్ధమాన్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్పీ ఒశ్వాల్(82)ను డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి ఆయన నుంచి ఏకంగా 7 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ చోరులు.సైబర్ నేరాలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి.. వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం, నిపుణులు పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల్లో ఎక్కువగా 10 రకాల మోసాలు జరుగుతున్నట్టు గుర్తించారు. అవేంటో తెలుసుకుందాం.1. ట్రాయ్ ఫోన్ స్కామ్:మీ మొబైల్ నంబర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాడుతున్నట్టు టెలికం రెగ్యులెటరీ అథారిటీ (ట్రాయ్) నుంచి ఫోన్ వస్తుంది. మీ ఫోన్ సేవలు నిలిపివేయకూడదంటే అధికారితో మాట్లాడాలంటూ భయపెడతారు. సైబర్ చోరుడు.. సైబర్ క్రైమ్ సెల్ పోలీసు అధికారిగా మిమ్మల్ని భయపెట్టి ఏమార్చాలని చూస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏటంటే ట్రాయ్.. ఫోన్ సేవలు నిలిపివేయదు. టెలికం కంపెనీలు మాత్రమే ఆ పని చేస్తాయి.2. పార్శిల్ స్కామ్: నిషేధిత వస్తువులతో కూడిన పార్శిల్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, ఈ కేసు నుంచి బయట పడాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ ఫోన చేస్తారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డిస్కనెక్ట్ చేసి పోలీసులను సంప్రదించాలి. బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన నంబరును పోలీసులకు ఇవ్వాలి.3. డిజిటల్ అరెస్ట్: మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని ఎక్కడికి వెళ్లినా తమ నిఘాలోనే ఉండాలని స్కామర్లు బెదిరిస్తారు. పోలీసులు, సీబీఐ అధికారుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు గుంజాలని చూస్తారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. వాస్తవం ఏమిటంటే పోలీసులు డిజిటల్ అరెస్టులు లేదా ఆన్లైన్ విచారణలు నిర్వహించరు.4. కుటుంబ సభ్యుల అరెస్ట్: కాలేజీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న మీ అబ్బాయి లేదా అమ్మాయి డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారని మీకు ఫోన్ కాల్ వస్తే అనుమానించాల్సిందే. ఎందుకంటే సైబర్ స్కామర్లు ఇలాంటి ట్రిక్స్‌తో చాలా మందిని బురిడీ కొట్టించారు. కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు చిక్కుల్లో పడ్డారనగానే ఎవరికైనా కంగారు పుడుతుంది. ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో కంగారు పడకుండా స్థిమితంగా ఆలోచించాలి. ఆపదలో చిక్కుకున్నారని చెబుతున్నవారితో నేరుగా మాట్లాడటానికి ప్రయత్నించండి.5. రిచ్ క్విక్ ట్రేడింగ్: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వెంటనే ఎక్కువ లాభాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రకటనలు వస్తున్నాయి. ఇలాంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అధిక రాబడి ఆశ చూపి స్కామర్లు జనాన్ని కొల్లగొడుతున్నారు. స్వల్పకాలంలోనే అత్యధిక రాబడి వస్తుందని ఆశ పడితే అసలుకే మోసం రావొచ్చు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.6. ఈజీ వర్క్.. ఎర్న్ బిగ్: చిన్నచిన్న పనులకు ఎక్కువ డబ్బులు ఇచ్చి ముగ్గులోకి లాగుతున్నారు సైబర్ మోసగాళ్లు. ఉదాహరణకు యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులకు లైకులు కొడితే డబ్బులు ఇస్తామని ఆఫర్ చేస్తారు. చెప్పినట్టుగానే డబ్బులు ఇచ్చేస్తారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. తమతో పాటు పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి.. భారీ మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఈజీ మనీ పథకాలు స్కామ్‌లని గుర్తిస్తే సైబర్ చోరుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.7. క్రెడిట్ కార్డ్ స్కామ్: మీరు వాడుతున్న క్రెడిట్ కార్డ్‌తో భారీ లావాదేవి జరిగిందని, దీన్ని నిర్ధారించుకోవడానికి ఫోన్ చేసినట్టు మీకు ఫోన్ వస్తే కాస్త ఆలోచించండి. సాయం చేస్తానని చెప్పి మీకు ఫోన్ చేసిన వ్యక్తి.. తన మరొకరికి కాల్ ఫార్వార్డ్ చేస్తాడు. మిమ్మల్ని నమ్మించిన తర్వాత సీవీవీ, ఓటీపీ అడిగి ముంచేస్తారు. మీ పేరుతో క్రెడిట్ కార్డు ఉన్నయిట్టయితే, దాంతో చేసే లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఒకవేళ ఏదైనా అనుమానం కలిగితే బ్యాంకును సంప్రదించాలి. అంతేకానీ అపరిచితులకు వివరాలు చెప్పకండి.8. నగదు బదిలీతో మస్కా: కొంత నగదు బ్యాంకు ఖాతాలో పడినట్టు స్కామర్లు మీ ఫోన్‌కు ఫేక్ మేసేజ్ పంపిస్తారు. తర్వాత మీకు ఫోన్ చేసి.. పొరపాటున నగదు బదిలీ అయిందని, తన డబ్బు తిరిగిచ్చేయాలని మస్కా కొడతారు. నిజంగా ఆ మేసేజ్ బ్యాంకు నుంచి వచ్చింది కాదు. నగదు బదిలీ కూడా అబద్ధం. ఎవరైనా ఇలాంటి ఫోన్ కాల్ చేస్తే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. నిజంగా నగదు బదిలీ జరిగిందా, లేదా అనేది నిర్ధారించుకోండి.9. కేవైసీ గడువు: కేవైసీ గడువు ముగిసిందని, అప్డేట్ చేసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి అంటూ.. ఎస్ఎంఎస్, కాల్, ఈ-మెయిల్ ఏవైనా వస్తే జాగ్రత్త పడండి. పొరపాటున ఈ లింకులు క్లిక్ చేస్తే మీరు స్కామర్ల బారిన పడినట్టే. ఈ లింకులు స్కామర్ల డివైజ్‌లకు కనెక్ట్ అయివుంటాయి. కాబట్టి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంటుంది. బ్యాంకులు లింకుల ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోమని చెప్పవు. నేరుగా వచ్చి మాత్రమే కేవైసీ వివరాలు ఇమ్మని అడుగుతాయి.10. పన్ను వాపసు: ట్యాక్స్‌పేయర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నావారికి ఫోన్ చేసి తమను తామును అధికారులుగా పరిచయం చేసుకుంటారు. ట్యాక్స్ రిఫండ్ చేయడానికి బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడించాలని కోరతారు. డిటైల్స్ చెప్పగానే మీ బ్యాంకు అకౌంట్లోని సొమ్మును స్వాహా చేసేస్తారు. ట్యాక్స్‌పేయర్ల బ్యాంకు ఖాతాల వివరాలు పన్నుల శాఖ వద్ద ఉంటాయి. కాబట్టి వారికే నేరుగా ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తాయి. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటలను అసలు నమ్మకండి.స్కామర్ల బారిన పడకుండా ఉండాలంటే..1. స్పందించే ముందు సమాచారాన్ని ధృవీకరించుకోండి2. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి3. నగదు లావాదేవీలను బ్యాంకుల ద్వారా నిర్ధారించుకోండి4. అనుమానాస్పద కాల్లు/నంబర్లపై రిపోర్ట్ చేయండి5. అధిక రాబడి పథకాల పట్ల జాగ్రత్తగా ఉండండి6. కేవైసీని వ్యక్తిగతంగా అప్డేట్ చేయండి7. వ్యక్తిగత/బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దుస్కామర్లపై ఫిర్యాదు చేయండిలా..1. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (1800-11-4000)2. సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in)3. స్థానిక పోలీస్ స్టేషన్4. ఈ వెబ్సైట్లో ఫిర్యాదు చేయండిsancharsaathi.gov.in/sfc/Home/sfc-complaint.jsp -
Cerebral Palsy Day: మస్తిష్క పక్షవాతం అంటే..
నేడు వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే.. సెరిబ్రల్ పాల్సీ అంటే మస్తిష్క పక్షవాతం. ఇదొక నరాల వ్యాధి. దీనిపై అవగాహన కల్పించేందుకు సెరిబ్రల్ పాల్సీ డేను అక్టోబర్ 6న నిర్వహిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒక కోటీ 70 లక్షలకు పైగా సెరిబ్రల్ పాల్సీ కేసులు నమోదయ్యాయి.కొందరికి పుట్టుకతో, మరికొందరికి తలకు గాయమైనప్పుడు మస్తిష్క పక్షవాతం సంభవిస్తుంది. దీని కారణంగా మెదడులో ఎదుగుదల లోపించి కండరాలు, కదలికలపై సమన్వయం అనేది లోపిస్తుంది. బాల్యంలో సంభవించే ఈ వైకల్యానికి జన్యుపరమైన లోపాలే ప్రధాన కారణంగా నిలుస్తాయి. భారతదేశంలోని ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ముగ్గురికి మస్తిష్క పక్షవాతం ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మస్తిష్క పక్షవాతం సోకిన పిల్లల్లో దొర్లడం, కూర్చోవడం, నడవడం వంటివి ఆలస్యమవుతాయి. ఇది ఆడపిల్లల కంటే కంటే మగపిల్లలలోనే అధికంగా కనిపిస్తుంది.మూడు నెలల వయసులో శిశువును ఎత్తిన సందర్భంలో తల వెనక్కి వాలిపోవడం, శరీరమంతా బిగుసుకోపవడం, కండరాల బలహీనత, ఆరు నెలలకు గానీ దొర్లకపోవడం, రెండు చేతులను కూడదీసుకోవడంలో వైఫల్యం, నోటివద్దకు చేతులు తీసుకురావడంలో సమస్యలు.. ఇవన్నీ మస్తిష్క పక్షవాతం లక్షణాలని వైద్యులు చెబుతుంటారు. ఇది కండరాల తీరు, ప్రతిచర్యలు, భంగిమ సమన్వయాన్ని, కదలికలు, కండరాల నియంత్రణను సమన్వయం చేయక ఇబ్బందులకు గురిచేస్తుంది.గర్భధారణ సమయంలో శిశువు అభివృద్ధిపై ప్రభావం చూపే రుబెల్లా వ్యాధి, శిశువు మెదడుకు రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడటం, ప్రసూతిలో సమయంలో ఆక్సిజన్ కొరత మొదలైనవి మస్తిష్క పక్షవాతానికి దారితీస్తాయి. మస్తిష్క పక్షవాతం నయం చేయలేని వ్యాధులలో ఒకటిగా పరిగణిస్తారు. అయితే మందులు, శస్త్రచికిత్స, స్పీచ్ థెరపీ మొదలైనవి మస్తిష్క పక్షవాతం బాధితులకు ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఈ వ్యాధి బారినపడినవారికి సకాలంలో వైద్యం అందిస్తే వ్యాధిని కొంత వరకు అరికట్టవచ్చని వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం -
హార్ట్ఫీషియల్గా అమ్మానాన్నలుగా..
ఇటీవల మనదేశం వ్యంధ్యత్వ సంక్షోభం (ఇన్ఫెర్టిలిటీ) దిశగా వెళుతోంది. ఈ సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే... ప్రతి ఆరు వివాహిత జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. సంతానలేమి అన్నది కేవలం పిల్లలు కలగకపోవడం మాత్రమే కాదు... ఇది మరిన్ని సంక్షోభాలకు... అంటే ఉదాహరణకు జనాభాలో యువత శాతం తగ్గిపోవడం, వృద్ధుల సంఖ్య పెరగడం వంటి అనర్థాలకు దారితీయవచ్చు. దీనివల్ల దేశ ఆర్థిక సంపద తగ్గడంతోపాటు అనేక విధాలా నష్టం జరుగుతుంది. ఈ నెల 25న ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) డే సందర్భంగా సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న దంపతులకు కృత్రిమ గర్భధారణకు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కోసం కొన్ని ప్రశ్నలకు ఇన్ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ కట్టా శిల్ప సమాధానాలు.ఇటీవల మనదేశంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరగడానికి కారణాలేమిటి?జ: దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది సామాజికం, రెండు ఆరోగ్యపరమైన కారణాలు. సామాజిక అంశాల విషయానికి వస్తే... ఇటీవల యువత పై చదువులు, మంచి ఉద్యోగాలంటూ కెరియర్ కోసం ఎక్కువ కాలం కేటాయించడం, పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడం, వాటిని నెరవేర్చుకోవడం కోసం ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లు, క్రమంగా లేని పనివేళలు, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం, అధిక బరువు, మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్ వంటి అనారోగ్యకర అలవాట్లు, వ్యసనాలు వంటివి సంతాన లేమికి దారితీస్తున్నాయి. ఇవన్నీ సామాజిక సమస్యలు.ఇక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే... మహిళల్లో కనిపించే హార్మోన్లలో అసమతౌల్యత, ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడులు వంటివి సంతానలేమికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇం΄్లాంటేషన్లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. ఇక మగవారిలోనైతే... శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం సంతానం కలగడానికి అవరోధంగా నిలుస్తున్నాయి.సాధారణంగా దంపతుల్లో సంతానలేమి ఉంటే ప్రధానంగా మహిళనే నిందిస్తారు. ఇదెంతవరకు సమంజసం?జ: ఇది మళ్లీ మరో సామాజిక సమస్య. వాస్తవానికి గర్భం రాకపోతే అందులో తప్పెవరిదీ ఉండదు. కానీ మన సమాజంలో మహిళ గర్భం దాల్చకపోతే, ఆమెనే తప్పుబడుతుంటారు. నిజానికి గర్భధారణ జరగకపోవడానికి లోపాలు 40% మహిళల్లో ఉంటే, మరో 40% శాతం పురుషుల్లోనూ ఉండవచ్చు. ఇద్దరిలోనూ లోపాలున్న కేసులు మరో 10% మందిలో ఉంటాయి. అయితే ఎంతకూ కారణాలు తెలియని కేసులు మరో 10% ఉంటాయి. అందుకే ఒక జంటకు సంతానం కలగకపోతే... ఎవరినెవరూ నిందించుకోకుండా, శాస్త్రీయపద్ధతుల్లో అవసరమైన పరీక్షలన్నీ క్రమంగా చేయించుకోవాలి.ఫలానా దంపతులకు సంతానలేమి అనే నిర్ధారణ ఎలా? జవాబు: ఆరోగ్యంగా ఉన్న భార్యాభర్తలు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులనుపాటించకుండా, కలిసి ఉంటూ ఏడాదిపాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రాకపోతే అప్పుడు ఆ దంపతులకు సంతానలేమి సమస్య ఉండే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ఈ సమస్యను ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.రెండో రకమైన సంతానలేమి ఏమిటంటే... మొదటిసారి గర్భధారణ తర్వాత, రెండోసారి గర్భధారణ కోసం కోరుకున్నప్పుడు ఏడాదిపాటు ప్రయత్నించినా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.ఇప్పుడున్న సాంకేతిక పురోగతితో కృత్రిమ గర్భధారణ ఎలా?జ: స్త్రీ, పురుషుల లోపాలు, వాటిని అధిగమించాల్సిన పద్ధతులన్నీ ప్రయత్నించాక కూడా గర్భం రాకపోతే అప్పుడు కొన్ని అత్యాధునిక పద్ధతుల్లో సంతాన సాఫల్యాన్ని సాధించవచ్చు. అవి...ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ): అండం విడుదలలో లోపాలు,ఎండోమెట్రియాసిస్, పురుషుల వీర్యకణాల సంఖ్య, కదలికల్లో లోపాలు ఉన్నప్పుడు ఐయూఐ అనే పద్ధతి ద్వారా డాక్టర్లు వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు.ఐవీఎఫ్: స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు ఐవీఎఫ్ అనే మార్గాన్ని సూచిస్తారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనే మాటకు సంక్షిప్త రూపమే ఐవీఎఫ్. దీనికే ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ అనే పేరు. ఇందులో తొలుత మహిళలో అండాలు బాగా పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి ఆరోగ్యకరమైన కొన్ని అండాలను సేకరించి, పురుషుడి శుక్రకణాలతో ప్రయోగశాలలోని ‘టెస్ట్‌ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు.ఈ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు వృద్ధి చెందుతాయి. (అందుకే టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియను అనుసరించిన చాలామందిలో ట్విన్స్ పుట్టడం సాధారణం.) ఇందులోని ఆరోగ్యకరమైన పిండాలను మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. రెండు వారాలకు నిర్ధారణ పరీక్షలూ, నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి గర్భం నిలిచిందా లేదా నిర్ధారణ చేసుకుంటారు. ఒకవేళ గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ ΄్లాన్ చేస్తారు.ఐసీఎస్ఐ: ఇంట్రా సైటో΄్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) అనే ఈ ప్రక్రియ పురుషుల్లో సమస్య ఉన్నప్పుడు అనుసరిస్తారు. ఇది కూడా ఐవీఎఫ్ లాంటిదే. ఇందులో ఎంపిక చేసుకున్న శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు. ఇందులోనూ మహిళల అండాల్లో లోపాలు ఉంటే మహిళా దాత నుంచి అండాన్ని సేకరించడం (ఐవీఎఫ్ విత్ డోనార్ ఎగ్), పురుషుని వీర్యకణాల్లో లోపాలుంటే దాత నుంచి సేకరించిన శుక్రకణంతో ఫలదీకరణ చేయడం (ఐవీఎఫ్ విత్ డోనార్ స్పెర్మ్), దంపతుల్లోని స్త్రీ, పురుషులిద్దరిలోనూ లోపాలు ఉంటే మరో మహిళ, మరో పురుషుడి నుంచి అండం, శుక్రకణాలు సేకరించి ఫలదీకరించి దంపతుల్లోని మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టడం (ఐవీఎఫ్ విత్ డోనార్ ఎంబ్రియో) అనే పద్ధతుల్లో సంతాన సాఫల్యం కలిగించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు.– డాక్టర్ కట్టా శిల్ప, కన్సల్టెంట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
ప్రాణాంతక చండీపురా వైరస్ : అసలేంటీ వైరస్, లక్షణాలు
వర్షాకాలంలో వివిధ రకాల అంటువ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. తాజాగా గుజరాత్, రాజస్థాన్‌లలో ‘చండీపురా’ వైరస్ కలకలం రేపుతోంది. వేగంగా వ్యాపిస్తోన్న ఈ వైరస్కారణంగా చిన్నారుల మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గుజరాత్ లోని ఆరావళి సబర్ కాంతా జిల్లాలో ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పలువురు చిన్నారులు మృతిచెందారు. చండీపురా వైరస్ ఎంత ప్రమాదకరమైనది? లక్షణాలేంటి? దీని బారినుంచి పిల్లలను ఎలా రక్షించుకోవాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.చండీపురా వైరస్ పిల్లలకు చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి సోకిన పిల్లవాడు సకాలంలో చికిత్స పొందకపోతే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ వైరస్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.చండీపురా వైరస్ లక్షణాలు సాధారణం ఫ్లూతో సమానంగా ఉంటాయి లక్షణాలు. దీంతో మామూలుగా జ్వరమే అనుకోవడంతో ప్రమాదం పెరుగుతోంది. చిన్నారుల మరణాలకు కారణమవుతోంది. అధిక జ్వరం, జ్వరం వేగంగా పెరగడం. వాంతులు, విరేచనాలు , తలనొప్పి, ఒక్కోసారి తలనొప్పితో పాటు స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ జ్వరం పిల్లలకు ప్రాణాంతకంగా మారుతోంది కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.చండీపురా వైరస్ అంటే ఏమిటి?చండీపురా వ్యాధి అనేది ఫ్లూ నుండి మెదడు జ్వరం వరకు తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే వైరస్. ఈ వైరస్ తొలి కేసులు 1965లో మహారాష్ట్రలోని చండీపురా గ్రామంలో కనిపించింది. అందుకే దీనికి చండీపురా అని పేరు పెట్టారు. ఈ వైరస్ రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన RNA వైరస్. ఇది కీటకాలు, దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది.ఏ వయస్సు పిల్లలకు ప్రమాదంచండీపురా వైరస్ ఎక్కువగా 9 నెలల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు సోకుతుంది. ఈ వైరస్ పిల్లలపై దాడి చేసినప్పుడు, సోకిన పిల్లలకి హై ఫీవర్, జ్వరం, విరేచనాలు, వాంతులు, బ్రెయిన్ ఫీవర్ ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేదు. కనుక అప్రమత్తత చాలా అవసరం. చండీపురా వైరస్‌ను ఎలా నివారించాలి?దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది కనుగ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఆహారం విషయంలో జ్రాగ్రత్త వహించాలి. చండీపురా వైరస్‌ను నివారించడానికి, దోమలు, ఈగలు , కీటకాలను నివారించడం ముఖ్యం. పిల్లలకు రాత్రిపూట పూర్తిగా కప్పే దుస్తులు ధరించేలా జాగ్రత్తపడాలి. దోమ తెరలు వాడాలి. దోమల నివారణ మందు వాడండి. దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు , తలుపులు మూసి ఉంచాలి. -
మూత తెరిచినా మునగం
వానాకాలం మొదలైంది.. కాస్త గట్టి వర్షం పడటంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి.. ఆ నీరు వేగంగా పోయేందుకు కొన్నిచోట్ల మ్యాన్‌హోల్స్ తెరిచారు.. ఆ నీళ్లలోంచే, ఆ మ్యాన్‌హోల్స్ దగ్గరి నుంచే జనం అటూఇటూ నడిచి వెళ్లారు.. కానీ ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు.ఎందుకంటే..అక్కడ మ్యాన్‌హోల్ ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ పట్టుజారినా అందులో పడిపోకుండా గ్రిల్స్ అడ్డంగా ఉన్నాయి. కాసేపటికి నీరంతా వెళ్లిపోయింది. మ్యాన్‌హోల్‌పై పెట్టేసిన మూత ఎల్ఈడీలతో వెలుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యలన్నీ పూర్తయితే.. నిపుణుల సూచనలన్నీ అమల్లోకి వస్తే.. జరిగేది ఇదే.కానీ మ్యాన్‌హోల్స్ వద్ద రక్షణ చర్యలు ఇంకా పూర్తవలేదు.. వానల తీవ్రత పెరుగుతున్నా పనుల వేగం పెరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డీప్ మ్యాన్‌హోల్స్‌కు గ్రిల్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని.. జపాన్‌లో అనుసరిస్తున్న తరహాలో మ్యాన్‌హోల్స్ మూతలపై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి అమలైతే.. ‘మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి’వంటి ఘటనలు ఇకపై వినకుండా ఉంటామని అంటున్నారు.సాక్షి, హైదరాబాద్: వానాకాలం ప్రారంభమైంది. కాస్త గట్టిగా చినుకులు పడినప్పుడల్లా.. డ్రైనేజీ, నాలాలు ఉప్పొంగడం.. రోడ్లపై, కాలనీల్లో నీళ్లు చేరడం మొదలైంది. జీహెచ్ఎంసీ, జల మండలి ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోడ్ల మీది చెత్త డ్రైనేజీల్లో చేరి పూడుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందిగా మారుతోంది. అలాంటి సమయాల్లో మ్యాన్‌హోల్స్ మూతలు తెరిచి, నీరు పోయేలా చేస్తుండటం ప్రమాదకరంగా మారుతోంది. కొన్నిసార్లు అయితే.. ఎక్కడ మ్యాన్‌హోల్స్ ఉన్నాయి? ఎక్కడ రోడ్డు ఉందనేది తెలియని పరిస్థితి ఉంటోంది. ఏదో పనిమీద బయటికి వెళ్లినవారు, ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటిబాట పట్టాల్సిన దుస్థితి. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌లో పడి జనం మృత్యువాతపడిన ఘటనలూ ఎన్నో.150కి పైగానే వాటర్ ల్యాగింగ్ పాయింట్స్మహానగరం పరిధిలో వాన నీరు నిలిచిపోయే సుమారు 150కుపైగా పాయింట్లుæ ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 50 వరకు ప్రమాదకర ప్రాంతాలు ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఎల్బీనగర్, చాదర్ ఘాట్, సింగరేణి కాలనీ, బాలాపూర్, మల్లేపల్లి, మైత్రీవనం, పంజగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఛే నంబర్, మెట్టుగూడ, వీఎస్టీ, ముషీరాబాద్, బాలానగర్, మూసాపేట, బోరబండ, మియాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రాంతాలు ఎక్కువ. ఇలాంటి చోట్ల నిలిచిన నీళ్లు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్‌హోల్స్ మూతలు తీస్తుండటం.. ప్రమాదాలకు దారి తీస్తోంది. మరికొన్ని చోట్ల వాహనాల రాకపోకలతో మ్యాన్‌హోల్స్ ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయి, మూతలు పగిలిపోయాయి. అలాంటి చోట వాననీరు నిలిచి.. పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. వాహనాలు కూడా వాటిలో పడి దెబ్బతింటున్నాయి.జపాన్‌లో మ్యాన్‌హోల్స్‌కు ఎల్ఈడీ లైట్లు జపాన్‌లోని టోక్యో సిటీలో మ్యాన్‌హోల్స్ మూతలపై ప్రత్యేకంగా కార్టూన్ డిజైన్లతో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ సాయంతో రీచార్జి అయ్యే ఈ లైట్లు.. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వెలుగుతూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ ఉన్నాయని సులువుగా గుర్తించి, జాగ్రత్త పడేందుకు వీటితో చాన్స్ ఉంటుంది. అంతేగాకుండా రకరకాల డిజైన్లు, రంగులతో కార్టూన్ క్యారెక్టర్లు కనిపిస్తూ అందంగా కూడా ఉంటున్నాయి. ఇలా మన దగ్గర కూడా మ్యాన్‌హోల్స్‌పై ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. రాత్రిపూట మ్యాన్‌హోల్స్ సులువుగా కనబడితే.. ప్రమాదాలు తప్పుతాయని అంటున్నారు.జలమండలి రక్షణ చర్యలువరదల ముంపుతో ఢిల్లీ, ముంబై లాంటి పరిస్థితి హైదరాబాద్‌లో ఏర్పడకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. సీవరేజీ ఓవర్ ఫ్లో, మ్యాన్‌హోల్స్ నిర్వహణపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. నగరవ్యాప్తంగా వాటర్ ల్యాగింగ్ పాయింట్లు, లోతైన మ్యాన్‌హోల్స్‌ను గుర్తించింది. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్ బిగించడంతోపాటు అత్యంత ప్రమాదకరమైనవని తెలిపేలా.. మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తోంది.కొన్ని వాటర్ ల్యాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది. నగరవ్యాప్తంగా 63వేలకుపైగా డీప్ మ్యాన్ హోల్స్ ఉండగా.. ఇప్పటివరకు 25 వేల వరకు మ్యాన్‌హోల్స్‌పై సేఫ్టీ గ్రిల్స్ బిగించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్ చేసి, ఎరుపు రంగు పెయింట్ వేస్తున్నామని.. ఎప్పటికప్పుడు మ్యాన్‌హోల్స్ నుంచి పూడిక, వ్యర్థాలను తోడేసేందుకు ఎయిర్‌టెక్ యంత్రాలను అందుబాటులో ఉంచినట్టు వివరిస్తున్నారు. ఇప్పటికే వానాకాలం మొదలైన నేపథ్యంలో.. ఈ రక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాల్సి ఉందని నగర ప్రజలు కోరుతున్నారు.రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీలువర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆరీ్ట), సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్ (ఎస్పీటీ)లను జలమండలి రంగంలోకి దింపింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలతోపాటు వాహనాలను కేటాయించింది. వాననీరు నిలిచిన చోట వాహనాల్లో ఉండే జనరేటర్లు, మోటార్లతో నీటిని తోడేస్తారు. ఎయిర్‌టెక్ యంత్రాలతో మ్యాన్‌హోల్స్ నుంచి తీసిన వ్యర్థాల (సిల్ట్)ను ఎప్పటికప్పుడు తొలగిస్తారు. మరోవైపు మ్యాన్‌హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్Œ నుంచి సీవర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. వారు రోజూ ఉదయాన్నే తమ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తారు. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు.మ్యాన్‌హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసులువాన పడుతున్న సమయంలో, నీళ్లు నిలిచినప్పుడు.. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోల్స్ మూతలను తెరవకూడదని జలమండలి స్పష్టం చేసింది. ఇష్టమొచి్చనట్టు తెరిచిపెడితే క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి నంబర్ 155313కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వవచ్చని సూచించింది. నాలాలపై నిర్లక్ష్యంతో.. మహానగర పరిధిలోని పలుచోట్ల నాలాలు ప్రమాదకరంగా మారాయి. నిబంధనల ప్రకారం.. రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పున్న నాలాలను క్యాపింగ్ (శ్లాబ్ లేదా ఇతర పద్ధతుల్లో పూర్తిగా కప్పి ఉంచడం) చేయాలి. రెండు మీటర్ల కన్నా వెడల్పున్న నాలాలకు రిటైనింగ్ వాల్ కట్టాలి. లేదా ఫెన్సింగ్ వేయాలి. కానీ గ్రేటర్ సిటీ పరిధిలో సగానికిపైగా చిన్న నాలాలకు క్యాపింగ్ లేదు. పెద్ద ఓపెన్ నాలాలకు రిటైనింగ్ వాల్/ ఫెన్సింగ్ లేకుండా పోయాయి. గతంలో వేసిన క్యాపింగ్, ఫెన్సింగ్ భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. దీనితో వాన పడినప్పుడు నాలాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత ఐదేళ్లలో సుమారు 15 మందికిపైగా నాలాల్లో పడి చనిపోవడం గమనార్హం. వానాకాలం మొదలైన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన క్యాపింగ్, ఫెన్సింగ్ వేయడం.. బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.మ్యాన్‌హోల్స్‌కు రక్షణ కవచాలు వర్షాకాలంలో మ్యాన్‌హోల్స్‌తో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాం. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డీప్ మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి అత్యంత ప్రమాదకరమైనవని తెలిసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను గుర్తించి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాం. వర్షం పడే సమయంలో కింది స్థాయి సిబ్బంది నుంచి మేనేజర్ వరకు వారి పరిధిలోని ఫీల్డ్‌లో ఉండేలా ఆదేశాలు జారీ చేశాం.డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి. వాటిలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలి. వాన నీరు సైతం సాఫీగా వెళ్లే విధంగా మార్గం ఉండాలి. వాటిలో పూడిక పేరుకుపోవడంతో వర్షం పడినప్పుడు నీరు వెళ్లక రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మురుగు నీటి వ్యవస్ధను పర్యవేక్షించే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. నిరంతరం పూడికతీత పనులు కొనసాగించాలి. వర్షాకాలంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలి.సిటీలో సీవరేజీ నెట్వర్క్, మ్యాన్ హోల్‌ల లెక్క ఇదీ..జీహెచ్ఎంసీ పరిధిలో సీవరేజీ నెట్వర్క్: 5,767 కి.మీశివారు మున్సిపాలిటీల పరిధిలో : 4,200 కి.మీ మొత్తం మ్యాన్‌హోల్స్: 6,34,919 డీప్ మ్యాన్‌హోల్స్: 63,221 వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో..: 26,798 శివారు మున్సిపాలిటీల పరిధిలో..: 36,423 -
World thyroid day 2024 : థైరాయిడ్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం
#World thyroid day 2024: మే 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. థైరాయిడ్ వ్యాధి, ఆరోగ్యం చూపే ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ఈరోజు.ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 2024: థీమ్నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCDలు), థైరాయిడ్ సమస్యలు ప్రపంచ ఆరోగ్య ఆందోళనలో గణనీయమై పాత్ర పోషిస్తున్నాయనే వాస్తవాన్ని తెలియ జేయడం.ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 2024: చరిత్ర1965లో యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ స్థాపన, ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం మొదలైంది. ఆ తరువాత థైరాయిడ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ (TFI) 2007లో మే 25వ తేదీని ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంగా ప్రకటించింది.థైరాయిడ్ వ్యాధిమెడ దిగువన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే చిన్న గ్రంథి పేరే థైరాయిడ్. ఇది ముఖ్యమైన రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అవి థైరాక్సిన్ (టి 4), ట్రైయోడోథైరోనిన్ (టి 3). ఈ రెండు హార్మోన్లు హార్మోన్లు జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధి, పునరుత్పత్ తిసమస్య సహా అనేక సమస్యలకు దారితీస్తుంది.ఆ గ్రంథి ఈ హార్మోన్లను తగినంతగా లేదా అధిక మొత్తంలో ఉత్పత్తి చేసినప్పుడు థైరాయిడ్ రుగ్మతలు తలెత్తుతాయి. హార్మోన్ల ఉత్పత్తి తగ్గితే హైపోథైరాయిడిజం అని, అధికమైతే హైపర్ థైరాయిడిజం అని రెండు రకాలుగా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.హైపోథైరాయిడిజం: అలసట, బరువు పెరగడం , నిరాశ వంటి లక్షణాలుంటాయి.హైపర్ థైరాయిడిజం: బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన వంటి లక్షణాలు.థైరాయిడ్ కేన్సర్: థైరాయిడ్ గ్రంధిలో ప్రాణాంతక పెరుగుదల కేన్సర్‌కు దారతీయవచ్చు.గోయిటర్: తరచుగా మెడలో వాపుగా కనిపిస్తుంది, హైపో- లేదా హైపర్ థైరాయిడిజంలోనే ఇది కనిపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయాలంటేచక్కటి జీవన శైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అసవరం. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అందేలా చూసుకోవాలి.వ్యాయామం చాలా అవసరం. ఎలాంటి వ్యాధులు దాడి చేయకుండా ఉండాలంటే క్రమం తప్పని వ్యాయామం ముఖ్యం. వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, డ్యాన్స్,యోగా ఇలా ఏదో ఒక వ్యాయామాన్ని కనీసం అరగంటలు పాటు చేయాలి. తద్వారా హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం రెండింటినీ అదుపులో ఉంచుకోవచ్చుథైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి మద్దతిచ్చే ఆహారంపై శ్రద్ధపెట్టాలి. ముఖ్యంగా సెలీనియం కీలకమైంది.బ్రెజిల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, సీఫుడ్,గుడ్లు, తృణధాన్యాలలో సెలీనియం పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఒత్తిడికి దూరంగా ఉండాలి, రోజులకు కనీసం ఎనిమిది గంటల కూడా చాలా అససరం. ఒక్కసారి థైరాయిడ్ ఉంది అని తెలిస్తే వైద్య సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. ఎలాంటి అపోహలను, అవాస్తవాలను నమ్మకుండా నిపుణుల సలహాలను పాటించాలి. -
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
పతీ ఏడాది మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. రక్తపోటు స్థాయి సాధారణ స్థాయి కంటే పెరగడాన్నే హైపర్‌టెన్షన్ అంటారు. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. అధిక రక్తపోటు లేదా హై బీపీను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది వచ్చిన సంగతి కూడా వ్యక్తులు కనిపెట్టలేకపోవచ్చు. ఈ నేపథ్యంలో హైబీపీ లక్షణాలు, నివారణ మార్గాలను ఒకసారి పరిశీలిద్దాం.వరల్డ్ హైపర్‌టెన్షన్ డేను 85 జాతీయ రక్తపోటు సంఘాలు లీగ్‌లతో కూడిన వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ దీన్ని ప్రారంభించింది. హైపర్‌టెన్షన్‌పై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.హైపర్ టెన్షన్ లక్షణాలుసాధారణంగా హైబీపీ కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అయితే రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వారు స్ట్రోక్, గుండె జబ్బులు , మూత్రపిండాల రుగ్మతలు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటారు. అధిక ఒత్తిడి రక్తపోటుకు దారితీయవచ్చు.తీవ్రమైన తలనొప్పి, ఛాతి నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడంతల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందివికారం, వాంతులు అస్పష్టమైన దృష్టి లేదా ఇతర దృష్టి మార్పులుఆందోళన, గందరగోళంచెవుల్లో శబ్దాలు, ముక్కు రక్తస్రావం హైపర్ టెన్షన్ చికిత్స ఆహారంలో ఉప్పును బాగా తగ్గించడం శారీరకంగా చురుగా ఉండటంధూమపానం, మద్యపానాన్ని మానేయడంబరువు ఎక్కువగా ఉంటే తగ్గడంజాగ్రత్తలుకూరగాయలు పండ్లు ఎక్కువ తీసుకోవడంగంటల తరబడి కూర్చోకుండా ఉండటంనడక, పరుగు, ఈత, డ్యాన్స్ లేదా బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలువారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ, లేదా వారానికి 75 నిమిషాల నడక ఉండాలి. ప్రతి వారం 2 లేదా అంతకంటే ఎక్కువ రోజులు వ్యాయామాలు చేయండి. తద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు ఆరోగ్య నిపుణులు సూచించిన మందులను తీసుకోవాలి. నోట్ : ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రక్తపోటును ముందుగానే గుర్తిస్తే నియంత్రణ సాధ్యమవుతుంది. -
చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా ట్రై చేయండి!
వేసవిలో చెమట ఎక్కువగా ఉండటం, వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు సమస్యలు వేధిస్తాయి. చెమట, ధూళికారణంగా జుట్టుకి తొందరగా మురికిపడుతుంది. అందువల్ల తరచు తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేయకపోవడం వల్ల అంతకుముందు చుండ్రు లేనివారికి చుండ్రు వచ్చే అవకాశం ఉంది. ముందే చుండ్రు ఉన్నవారిని ఆ సమస్య మరింతగా వేధిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ∗ రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకుని ఒక టీస్పూన్ రసాన్ని తలకు (జుట్టు కుదుళ్లకు) పట్టించి పది నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. మరొక టీ స్పూన్ల రసంలో కప్పు నీటిని కలిపి తలస్నానం పూర్తయిన తర్వాత తల మీద (స్కాల్ప్‌కు పట్టేలా) పోసుకోవాలి.∗ వారం పాటు తలకు ఆలివ్ ఆయిల్ రాస్తే చుండ్రు వదులుతుంది. రోజూ తలస్నానం చేసే వాళ్లు రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ పెట్టి ఉదయం తలస్నానం చేయవచ్చు.∗ రెండు టేబుల్ స్పూన్ల ల కొబ్బరి నూనెలో అంతే మోతాదు నిమ్మరసం కలిపి తలకు పట్టించి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. మర్దన చేసిన తర్వాత ఇరవై నిమిషాలకు మామూలు షాంపూ లేదా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి.∗ టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రి నానబెట్టి ఉదయం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి అందులో నిమ్మరసం (ఒక కాయ) కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. తలకు మెంతుల పేస్ట్ పెట్టినప్పుడు కొద్దిగా తేమగా ఉండగానే తలస్నానం చేయాలి. పూర్తిగా ఎండి΄ోయే వరకు ఉంచితే జుట్టుకు పట్టేసిన మెంతుల పేస్టును వదిలించడం కష్టం.∗ కప్పు పుల్లటి పెరుగులో టీ స్పూన్ల నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.∗చుండ్రును వదిలించడంలో వేపాకు కూడా బాగా పని చేస్తుంది. వేపనూనె తలకు పట్టించి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. వేప నూనె లేక΄ోతే వేపాకు రసం పట్టించి మర్దన చేయవచ్చు. -
అక్రమ వలసలకు చెక్.. సంచలన బిల్లు తెచ్చిన బ్రిటన్
లండన్: అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్న బ్రిటన్ వాటిని ఆపేందుకు సంచలన బిల్లు తీసుకువచ్చింది. మంగళవారం(ఏప్రిల్23) ‘సేఫ్టీ ఆఫ్ రువాండా’ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుతో అక్రమ వలసదారులకు అడ్డకట్టపడనుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారందరినీ ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు. బ్రిటన్ రాజు చార్లెస్ 3 ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారుతుంది. బ్రిటన్‌కు వచ్చే అక్రమ వలసదారులను ఆపడానికి రువాండా బిల్లు తీసుకువచ్చినట్లు ప్రధాని రిషి సునాక్ తెలిపారు. దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చేవారు నివసించడానికి ఇక నుంచి వీలులేదని చెప్పారు. అక్రమ వలసదారులను విమానాల్లో తీసుకువెళ్లి దేశం బయట వదిలేస్తామన్నారు. -
Mouth Cancer: దంత సమస్యలకు, నోటి కేన్సర్‌కు సంబంధం ఉందా?
ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి కేన్సర్. చిన్న పిల్లలనుంచి వృద్ధుల దాకా, మహిళలు, పురుషులు అనేక రకాల కేనర్ల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అమెరికా, భారత్ సహా అధిక జనాభా ఉన్న దేశాల్లో ఈ కేన్సర్ మహమ్మారిలా వ్యాపిస్తోంది. వీటిల్లో ప్రధానమైంది నోటి కేన్సర్. ప్రపంచవ్యాప్తంగా ఆరో అత్యంత సాధారణ క్యాన్సర్. పొగాకు, సుపారీ లేదా పాన్ మసాలా నమలడం లాంటి చెడు అలవాట్ల కారణంగా మహిళల కంటే పురుషులను ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రతి ఆరుగురిలో ఒకరు కేన్సర్‌తో మరణిస్తున్నారు. అయితే ప్రారంభ దశలో గుర్తించినప్పుడే దీనికి చికిత్స సాధ్యమవుతుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి క్యాన్సర్ రావడం చాలా ఆందోళన కలిగిస్తుంది. నోటి కేన్సర్ కూడా ప్రమాదకారి అనే చెప్పవచ్చు. పొగాకు నమలడం, మద్యం సేవించడం లేదా సిగరెట్లు తాగడం వంటి చెడు అలవాట్లు ఉన్నవారిలో ఇది సర్వసాధారణం అని అందరికీ తెలుసు. కానీ ఇవేవీ లేని వ్యక్తికి నోటి కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. నోటి లోపల, పెదవులు, చిగుళ్ళు, నాలుక, బుగ్గల లోపలిభాగం, అంగిలి, ఇలా నోటిలోని ఏ భాగంలోనైనా ఇది సోకవచ్చు. ఆ వ్యాధితో...అపుడసలు బుర్ర పని చేయలేదు : స్టార్ హీరోయిన్ నోటి కేన్సర్ లక్షణాలు సాధారణంగా దీన్ని ప్రారంభ దశలో గుర్తించడం అసాధ్యం. దంతాలు, చిగుళ్ళ వాపు, నోటి లోపల తెల్లటి మచ్చలు, దంతాలు వదులుగా మారడం మొదలవుతుంది. నోటి లోపల గడ్డలు లేదా గడ్డలు కనిపిస్తాయి. ఇది కాస్త ముదిరితే చెవుల్లో నొప్పి కూడా మొదలవుతుంది. ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదిరి ఆహారం తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ప్రధానంగా దంతాలు , చిగుళ్ల చుట్టూ నిర్వచించబడని ఇన్ఫెక్షన్ లేదా విపరీతమైన నొప్పి, స్వరపేటిక, వాయిస్‌లో మార్పులు అంటే బొంగురు పోవడం, లేదా ముక్కు, నాసోఫారింజియల్, నొప్పి తొలి సూచిక కావచ్చు. నోటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసిన తర్వాత కూడా నోటి దుర్వాసన (హాలిటోసిస్) ఉన్నా, మింగడంలో ఇబ్బంది (డిస్ఫాగియా) ,నోట్లోగడ్డలు కూడా తొలి సంకేతం. సిగరెట్, బీడీ, సిగార్, పొగాకు. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారికి కూడా నోటి కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. వాయిస్‌లో మార్పు వచ్చినా, నోరు, నాలిక మీద తెల్లటి మచ్చలు పుండ్లు త్వరగా మానక పోయినా, నోటిని తరచూ శుభ్రం చేసుకుంటున్నా దుర్వాసన వస్తున్నా, మింగడం కష్టం మారినా, ఉన్నట్టుండి దంతాలు వదులుగా మారి, నొప్పి పుడుతున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నోట్: ఈ లక్షణాలు ఉన్న వారందరికి కేన్సర్ సోకినట్టు కాదు అనేది గుర్తించాలి. కానీ, కొన్ని పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది. దీన్ని తొలి దశలో గుర్తించడమే చికిత్సలో కీలకం, అందుకే ముందస్తు పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. -
విపరీతమైన దగ్గు, ఆయాసంతో ఊపిరి సలపనివ్వడం లేదా? ఐతే ..
ఇది పొగచూరడం లాంటి ఏవో అడ్డంకులతో, ఊపిరిత్తుల్లో వచ్చే సమస్యతో, దీర్ఘకాలం పాటు కొనసాగుతూ బాధితుల్ని వేధించే జబ్బు అని పేరును బట్టి తెలుస్తుంది. దగ్గు, ఆయాసంతో వ్యక్తమయ్యే ఈ సమస్య ప్రధానంగా పెద్దవారినే వేధిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక (జన్యు) కారణాలతో చిన్న వయసువారిలో కూడా కనిపించవచ్చు. పొగతాగే అలవాటుతో పురుషుల్లో, ఇంకా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తూ ఉంటే... ఈ కారణంగా మహిళల్లో ఈ జబ్బు కనిపించే అవకాశాలెక్కువ. అసలే దగ్గుతో ఊపిరి సలపనివ్వని ఈ సమస్య, చలి కాలంలోని చల్లటి వాతావరణానికి మరింత పెచ్చరిల్లే అవకాశం ఉంది. దీని పేరే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్. సంక్షిప్తంగా సీఓపీడీ అని పిలిచే ఈ ఆరోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. దగ్గు ప్రధానంగా లక్షణంగా వ్యక్తమయ్యే సీవోపీడీ సమస్య పెద్దల్లో... అందునా 40 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. సిగరెట్లూ, బీడీలూ, చుట్టలూ, హుక్కా కాల్చే వారిలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వాతావరణ కాలుష్యాల్లో ఉండే దుమ్మూ, ధూళితో పాటు బొగ్గుగనులు, సిమెంట్, టెక్స్టైల్స్, రసాయనాల కాలుష్యం వెలువడే పరిశ్రమల దగ్గర ఉండేవారిలోనూ, ఆభరణాలకు పూతపూసే ఎలక్ట్రోప్లేటింగ్ వంటి కార్ఖానాల్లో పనిచేసేవారిలో కూడా ఇది ఎక్కువ. కారణాలు.. పొగతాగే అలవాటు ఉన్నవారిలో లేదా నిత్యం కాలుష్యాలకు ఎక్స్పోజ్ అవుతున్నవారిలో ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకెళ్లే శ్వాసనాళాలు వాపునకు గురవుతాయి. దాంతో ఊపిరి సరిగా అందదు. లంగ్స్ నిండుగా, కాస్త బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఛాతీ పట్టేసినట్లుగా ఉంటుంది. ఇక ఆస్తమా ఉన్న వ్యక్తులు సరైన చికిత్స తీసుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకోని సందర్భాల్లో... దీర్ఘకాలిక దుష్ప్రభావంగా సీవోపీడీ రావచ్చు. లక్షణాలు.. సీవోపీడీలో దగ్గు, ఆయాసాలు ప్రధాన లక్షణాలు. అయితే తీవ్రతను బట్టి ఇతరత్రా లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలా తీవ్రతను బట్టి ఈ వ్యాధిని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... గోల్డ్ 1 (మైల్డ్), గోల్డ్ 2 (మోడరేట్), గోల్డ్ 3 (సివియర్), గోల్డ్ 4 (వెరీ సివియర్). ఇక్కడ గోల్డ్ అనేది ‘గ్లోబల్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్’ అనే సంస్థకు సంక్షిప్త రూపం. ‘గోల్డ్’ సంస్థ... సీవోపీడీ మీద పరిశోధనలు చేస్తూ పల్మనాలజిస్టులకు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తుంది. సీవోపీడీ అనగానే కేవలం ఊపిరితిత్తుల సమస్య అనే అనుకుంటాం. కానీ బాధితులలో వివిధ అవయవాలకు సంబంధించిన ఇతర సమస్యలూ ఎక్కువే ఉంటాయి. మచ్చుకు... ఆస్టియో పోరోసిస్, హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, కార్పెల్ పల్మొనాలె... మొదలైన సమస్యలతో ఇది కలిసి ఉంటుంది. అందువల్ల ఈ లక్షణాలను గుర్తిస్తూ, చికిత్స అందించాల్సి ఉంటుంది, దీనినే ‘సిండమిక్ అప్రోచ్’ అంటారు. ఈ నెలలోనే 2024కు సంబంధించిన కొత్త చికిత్స మార్గదర్శకాలను ‘గోల్డ్’ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి నిర్ధారణ.. స్పైరోమీటర్ అనే పరికరం సహాయంతో సీవోపీడీని నిర్ధారణ చేస్తారు. దీనితో కొన్ని శ్వాస పరీక్షలు చేసి, సమస్య తీవ్రత ఎంతో తెలుసుకుంటారు. అంటే మైల్డ్, మోడరేట్ లేదా సమస్య తీవ్రం (సివియర్)గా ఉందా అని తెలుసుకుంటారు. ఈ పరీక్షకు ముందరే... బాధితులను వ్యక్తిగతంగా / క్లినికల్‌గా పరీక్షించడంతో డాక్టర్లకు కొంత అవగాహన వస్తుంది. ఇలా చేసే క్లినికల్ పరీక్షల్లో బాధితుల వృత్తి వివరాలూ (ప్రొఫెషనల్ హజార్డ్స్), వారు పనిచేసే చోటు, వారుండే చోట కాలుష్య ప్రభావాలూ, పొగతాగడంలాంటి వారి అలవాట్లు... ఇవన్నీ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. ఐఓఎస్ అనే పరికరం ప్రారంభ దశలో ఉన్న సీవోపీడీని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అపోహ–వాస్తవం ఈ వ్యాధి ఉన్నవారు ఎడతెరిపి లేకుండా దగ్గుతూ ఉంటారు. దాంతో ఇదో అంటువ్యాధిలా అనిపిస్తుంది గానీ నిజానికి ఇది అంటువ్యాధి కానే కాదు. చికిత్స.. పేరులోనే దీర్ఘకాలిక సమస్య అని చెప్పే ఈ వ్యాధికి చికిత్స కూడా దీర్ఘకాలికంగానే అవసరమవుతుంది. సీవోపీడీ లక్షణాలు కనిపించినప్పుడు దగ్గు కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్‌ను సంప్రదించాలి. లక్షణాలు పెరిగేదాకా ఆగడం లాంటి నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స ఎంత త్వరగా జరిగితే ఫలితాలు అంత బాగుంటాయి, సీవోపీడీని అంత తేలిగ్గా/సమర్థంగా అదుపు చేయవచ్చు. వాయునాళాలను వెడల్పు చేసేందుకు పీల్చే మందులైన ‘బ్రాంకోడయలేటర్స్’ (ఇన్హేలర్స్ / నెబ్యులైజర్స్)ను ఉపయోగిస్తారు. వాటిని ఉపయోగించగానే అవి శ్వాసనాళాలను వెడల్పు చేసి మరింత హాయిగా, తేలిగ్గా శ్వాస పీల్చుకోడానికి తోడ్పడతాయి. సీవోపీడీకి దీర్ఘకాలం చికిత్స అవసరం కాబట్టి దగ్గు వంటి లక్షణాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధి పూర్తిగా తగ్గినట్లుగా అనుకోకూడదు. లక్షణాలు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ డాక్టర్లు సూచించినట్లు ఫాలో అప్‌కు వెళ్తూ చికిత్స పూర్తయ్యేవరకు కొనసాగించాలి. నాన్ ఫార్మలాజికల్ థెరపీ.. సీవోపీడీతో బాధపడేవారిలో ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. దానిని క్లియర్ చేసే ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్లు సూచించిన విధంగా వాడాల్సి ఉంటుంది. హోమ్ ఆక్సిజన్ థెరపీ : ఇది చికిత్సలో మరో ప్రక్రియ. తీవ్రతను బట్టి అవసరం ఉన్నవారికి 19 గంటల పాటు ఇంటి దగ్గరే ఆక్సిజన్ వాడాల్సి ఉంటుంది. పల్మునరీ రీ–హ్యాబిలిటేషన్: ఇది చికిత్సలో ఇంకో ప్రక్రియ. తేలిక నుంచి ఓ మోస్తరు వరకు అవసరమున్న వ్యాయామాలు (పర్స్ లిప్ బ్రీతింగ్), అబ్డామినల్ బ్రీతింగ్‌తో పాటు చిన్న బరువులతో కండరాలను బలంగా చేసే (మజిల్ స్ట్రెంతెనింగ్) వ్యాయామాలు చేయడం అవసరం. నివారణ.. పొగతాగే అలవాటునుంచి దూరంగా ఉండటం / అప్పటికే పొగతాగే అలవాటుంటే వెంటనే మానేయడం మంచి నివారణ. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్తున్నకొద్దీ అది వాయునాళాలను మరింతగా మూసుకుపోయేలా చేస్తుంది. దాంతో శ్లేష్మం/కళ్లె మరింత ఎక్కువగా పెరుగుతూ పోతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ మోతాదు బాగా తగ్గి, పనిచేసే శక్తి, సామర్థ్యాలు తగ్గుతాయి. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) ∙ -
ఆ రోజే ఎందుకు డయాబెటిస్ డే జరుపుకుంటున్నాం?
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి కుటుంబంలో ఓ డయాబెటిస్ పేషెంట్ తప్పకుండా ఉంటున్నారు. రోజుకి రోజుకి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధి సైలంట్ కిల్లర్‌లా మొత్తం అవయవాలన్నింటిపై ప్రభావం చూపించి మనిషి ఆయఃప్రమాణాని తగ్గించేస్తోంది. ఈ మధుమేహం కారణంగా చాలామంది గుండె, మూత్రపిండాల, కంటి ఇన్ఫెక్షన్లా బారిన పడినవాళ్లు కోకొల్లలు. ఇది ఓ మహమ్మారిలా మనుషులను చుట్టుముట్టి జీవితాన్ని హారతి కర్పూరంలా తెలియకుండానే హరించేస్తుంది. నిజం చెప్పాలంటే ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలిక వ్యాధిలా ఉండిపోతుంది. కేవలం శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా రక్షించుకోవడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. అలాంటి మధుమేహ వ్యాధి కోసం ప్రత్యేకంగా ఓ రోజును ఏర్పాటు చేసి మరీ ఎందుకు జరుపుతున్నారు. అసలు ఈ మధుమేహాన్ని ఎలా నియంత్రించుకోవాలి తదితరాల గురించే ఈ కథనం!. చాలామంది దీనికి తీసుకోవల్సిన తగు జాగ్రత్తలు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ వ్యాధి కారణంగా తలెత్తే రుగ్మతలు బారినపడి ప్రాణాలు కోల్పోతున్నా వాళ్ల సంఖ్య ఎక్కువ. దీంతో ప్రజలందరికి ఈ వ్యాధిపై అవగాహన వచ్చేలా ఒక రోజుని ఏర్పాటు చేసుకుని..ప్రతి ఏటా అందుకు సంబంధించిన కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తే కనీసం ఈ వ్యాధి కారణంగా చనిపోతున్న వారి సంఖ్యను తగ్గించగలగడమే కాక మధుమేహ రోగుల సంఖ్యను కూడా నియంత్రించగలిగుతామని నిపుణులు భావించారు. అదీగాక ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పడితే అదుపులో పెట్టుకుని దీర్ఘకాలం జీవించేలా చేయగలుగుతాం. ఆ రోజు ఎందుకంటే.. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుతో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య 1991లో ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించగా, 2006 నుంచి అధికారికంగా పాటిస్తున్నారు. ఇక 1922లో సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ తన సహచర శాస్త్రవేత్తతో కలిసి ఇన్సులిన్ని కనిపెట్టిన సంగతి విధితమే. అయితే సర్ ఫ్రెడరిక్ ఈ వ్యాధిని నియంత్రిచడానికి రోగులను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నించాడు. పైగా ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని రోగుల్లో ధైర్యాన్ని నింపేవాడు. ఆయన విశేష కృషికి గానూ ఏటా సర్ ఫ్రెడరిక్ పుట్టిన రోజు నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డేగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ఒక్కో థీమ్‌తో ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధుమేహంలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక రకమైన జన్యుపరమైన రుగ్మత, ఇది ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ మీ జీవనశైలి, చెడు అలవాట్ల కారణంగా వస్తుంది. ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్(ఐడీఎఫ్) ప్రపంచ వ్యాప్తంగా సుమారు 537 మిలియన్ల(సుమారు 53 కోట్ల మందికి) మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2045 నాటిక సుమారు 700 మిలియన్ల(70 కోట్లకు)కు పైగా పెరుగుతుందని అంచనా. దాదాపు 90%నికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు టైప్2 డయాబెటిస్‌తోనే బాధపడుతున్నారు. దీన్ని క్రమతప్పక వ్యాయామం, ధూమపానానికి దూరంగా ఉండటం తోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో అదుపులో పెట్టుకోవచ్చు లేదా నివారించొచ్చు. ఈ ఏడాది థీమ్ "మధుమేహ సంరక్షణకు ప్రాముఖ్యత". ఈ ప్రచార క్యాంపెయిన్‌తో మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం. అందరికీ ఈ వ్యాధి పట్ల అవగాహన, వారికి కావల్సిన మద్దతును అందిచడం, సమస్య తీవ్రతను నివారించేలా దృష్టి సారించడం వంటి స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేగాదు 2030 నాటికి మధుమేహాన్ని నియంత్రించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునేలా అన్ని రకాల వనరులను వినియోగించుకోవాలని ఆరోగ్య కార్యకర్తలకు పిలుపునిస్తోంది ఈ ప్రచార కార్యక్రమం. ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనాలంటే.. ముందుగా మీకు టైప్ 2 మధుమేహం వచ్చిందో లేదో చెకప్ చేయించుకోవాలిజ మధుమేహం గురించి తెలుసుకోవడం, నివారణకు ఏం చేయాలి తదితరాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి మధుమేహగ్రస్తులకు మద్దుతు ఇవ్వడం మీ సమీప ప్రాంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించడంల లేదా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జెనీవాలోని ఐక్యరాజ్యసమితికి మీ జాతీయ ఆరోగ్య మంత్రి లేదా శాశ్వత మిషన్‌కు లేఖ పంపడం లేదా మధేమేహ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వమని కోరడం వంటివి చేయాలి (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
కీళ్ల నొప్పుల నివారణ మన చేతుల్లోనే..
ఆర్థరైటిస్ అంటే కీళ్లనొప్పులు లేదా కీళ్ల వాతంగా చెప్పవచ్చు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఈ నెల 12వ తేదీ ‘ప్రపంచ ఆర్థరైటిస్ డే’. ‘‘దీన్ని ఎదుర్కోవడం మీ చేతుల్లోనే, అందుకే దీనిపై చర్యకు ఉపక్రమించండి’’ (ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, టేక్ యాక్షన్) అన్నది ఈ ఏడాది థీమ్. ఈ నేపథ్యంలో దీని నివారణకూ, మేనేజ్మెంట్కూ బాధితుల చేతుల్లో ఏ మేరకు అవకాశం ఉందనే అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం. వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లు అరిగిపోతుంటాయనీ, దాంతో కీళ్లు ఒరుసుకుపోయి నొప్పి వస్తుంటుందనీ, ఇది వయసు పెరగడం వల్ల వచ్చే సమస్య కాబట్టి సర్దుకుపోక తప్పదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇది కొంతవరకే వాస్తవం. నిజానికి కీళ్లనొప్పులు / కీళ్లవాతం అనేక కారణాలతో వస్తుంటాయి. వీటిల్లో వందకు పైగా రకాలున్నాయి. అన్నింటినీ కలుపుకుని ఆర్థరైటిస్ లేదా కీళ్లవాతం అనే ఒక పదంతో సూచిస్తుంటారు. పైగా వయసు పెరిగిన వారిలోనే వస్తుంటాయన్నది కూడా పూర్తిగా నిజం కాదు. చాలామంది మధ్యవయస్కుల్లోనూ, కొంతమంది యువకుల్లోనూ కనిపిస్తుంటాయి. కారణాలు కొన్ని వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగా, హార్మోన్ల అసమతౌల్యతలూ, విటమిన్ల లోపాలు, వాతావరణ కాలుష్యాలూ... ఇలా అనేక కారణాలతో వస్తుంటాయి. అరుగుదలతో వచ్చే వాటిని మినహాయిస్తే... సొంత కణాలపైనే తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రతికూలంగా పనిచేసి, కణాలను దెబ్బతీయడం వల్ల వచ్చే కీళ్ల వాతాలూ ఉన్నాయి. ఇలా వచ్చేవాటిని ఆటో ఇమ్యూన్ సమస్యలుగా పేర్కొంటారు. శరీరంలోకి ప్రవేశించే శత్రుకణాలను దెబ్బతీయడానికి పుట్టే యాంటీబాడీస్... తమ సొంత కణాలే పరాయివిగా భావించి దెబ్బతీయడంతో కొందరిలో ఎముకలు, కీళ్లు, కండరాలతో పాటు... కొన్ని సందర్భాల్లో కీలకమైన అవయవాలు, వ్యవస్థలూ దెబ్బతినవచ్చు. ఆర్థరైటిస్‌లలో ప్రధాన ఆటోఇమ్యూన్ వ్యాధులు... ఆటోఇమ్యూన్ సమస్యలతో మహిళల్లో కనిపించే వ్యాధుల్లో లూపస్ (ఎస్‌ఎల్‌ఈ), రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ స్కీ›్లరోసిస్, ఏపియన్ వంటివి ముఖ్యమైనవి. ఎస్‌ఎల్‌ఈ మహిళల్లో ఎక్కువగా కనిపించే ఓ ముఖ్యమైన వ్యాధి. ఇది కిడ్నీలు, కీళ్లు, చర్మం, మెదడు, కండరాల వంటి అనేక అవయవాలను దెబ్బతీస్తుంది. అది చూపే ప్రభావాన్ని బట్టి కొందరిలో తేలికపాటి నుంచి తీవ్రమైన సమస్యగానూ ఉండవచ్చు. కొందరిలో ప్రాణాపాయానికీ దారితీయవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ) కీళ్ల మీద ప్రభావం చూపే వ్యాధి. సరైన చికిత్స తీసుకోకపోతే కీళ్లు వంకర్లుపోయి, శాశ్వత వైకల్యానికీ దారితీయవచ్చు. ఇది కీళ్లను మాత్రమే కాకుండా లంగ్స్, రక్తనాళాలు, కళ్లు, నాడీవ్యవస్థతో సహా శరీరంలోని ఇతర అవయవాలను లక్ష్యంగా చేసుకుని, ఇతర వ్యవస్థలనూ ధ్వంసం చేసే అవకాశమూ ఉంది. ఈ సమస్యతో బాధపడేవారిలో కొలెస్ట్రాల్ పెరుగుదలకు ఆస్కారం ఎక్కువ. అలాగే నాడీ వ్యవస్థ దెబ్బతినవచ్చు. ఈ కారణాలతో మరణాలకూ అవకాశం ఉంది. స్కిర్లోడెర్మా అనే కీళ్లవాతంలో చర్మం గట్టిపడటంతో పాటు జీర్ణవ్యవస్థ, గుండె, లంగ్స్, కిడ్నీల వంటి అవయవాలు ప్రభావితం కావచ్చు. యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అనే కీళ్లవ్యాధిలో రక్తం తరచూ గడ్డకడుతుంది. మహిళల్లో గర్భస్రావాలూ జరుగుతుంటాయి. ఇవిగాక ఇతర వ్యాధులు చాలానే ఉంటాయి. లక్షణాలు: కీళ్లవాతాలకు దాని రకాన్ని బట్టి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఈ లక్షణాలు అందరిలోనూ ఒకేలా బయటపడకపోవచ్చు. వ్యాధి రకాన్ని బట్టి, తీవ్రతను బట్టి, బాధితుల వయసు, వారి ఇతర వ్యాధులను బట్టి లక్షణాల తీరు మారుతూ ఉంటుంది. అయితే దాదాపు అన్ని రకాల కీళ్లవ్యాధుల్లో కనిపించే సాధారణ లక్షణాలను క్రోడీకరిస్తే... సాయంత్రానికి జ్వరం రావడం, నీరసం, నిస్సత్తువ, అలసట, క్రమంగా బరువు తగ్గడం, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు తొలిదశలో కనిపిస్తాయి. ఇవే లక్షణాలు ఇతర వ్యాధుల్లోనూ కనిపిస్తుండటం వల్ల వీటిని ఆర్థరైటిస్‌గా గుర్తించడం కొంచెం కష్టమైన పని. నిర్దిష్టంగా కీళ్ల విషయానికి వస్తే కీళ్లలో విపరీతమైన నొప్పి, వాపు, అక్కడ ఎర్రగా కందిపోయినట్లుగా అవుతుంది. ఈ లక్షణాలు కనిపించేనాటికి బాధితులు తమ సొంత పనుల్ని కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. ఇతర జాగ్రత్తలు... వీటిలో చాలావాటికి నివారణ ఉండదు. ఎందుకంటే ఇవి జన్యుపరమైనవీ, జన్యులోపాలతో వచ్చేవి. ఈ కారణంతో ఈ పరిమితి ఉంటుంది. ఈ జన్యులోపాలకు పర్యావరణ కారణాలూ, జీవనశైలీ తోడైనప్పుడు ఇవి బయటపడతాయి. అందుకే ఈ ఏడాది థీమ్‌ను బట్టి మన చేతుల్లో ఉండే అంశాలేమిటో తెలుసుకుని, ఆ మేరకు చర్యలు తీసుకోవడం చాలావరకు మేలు చేయడంతో పాటు... కొంతమేర నివారణకూ తోడ్పడేందుకు అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలివి... బరువును తగ్గించుకోవాలి. దీనివల్ల మందులు సమర్థంగా పనిచేయడమే కాకుండా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇదీ చికిత్సలో భాగమే. దీనివల్ల కీళ్లు వంకర్లు పోవు. ∙పొగతాగడం, మద్యపానం అలవాటును పూర్తిగా మానేయాలి. క్యాల్షియమ్ సమృద్ధిగా ఉండే ఆహారాల్ని తీసుకోవాలి. విశ్రాంతి వల్ల కీళ్లవాతాన్ని నివారించవచ్చునని కొందరు అపోహపడతారు. ఇది పూర్తిగా అవాస్తవం. కీళ్లవాతం వచ్చినవారిలో ఒంటి కదలికలు చురుగ్గా ఉండేలా నడక వంటి వ్యాయామాలు చేయాలి. దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలన్నది మరో అపోహ. ఇదీ వాస్తవం కాదు. ఈ అపోహలకు దూరంగా ఉండటమూ బాధితుల చేతుల్లో ఉన్న పనే. ఈ ఏడాది థీమ్‌ను అనుసరిస్తూ... బాధితులు తగిన జాగ్రత్తల్ని పాటించడం, రుమటాలజిస్టులను సంప్రదించి, వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, జీవనశైలిని మెరుగుపరచుకుంటే కీళ్లవ్యాధుల బాధల నుంచి దూరంగా ఉండవచ్చు. చికిత్స: ఆర్థరైటిస్‌కి కారణమైన కీళ్లవాతాన్ని బట్టి చికిత్స ఉంటుంది. చాలావాటికి కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులతోపాటు, చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉంటే తగు మోతాదులో స్టెరాయిడ్స్‌తో పాటు ‘డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్’ని మొదలుపెట్టాలి. జబ్బు తీవ్రతను అదుపు చేయడం కష్టమైన సందర్భాల్లో కొందరిలో ‘బయలాజిక్స్’ అనే మందుల్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అన్ని రకాల కీళ్లవాతాలకూ ఒకేరకం బయలాజిక్స్ పనిచేయవు. వ్యాధి తీవ్రత, ప్రభావితమైన అవయవం, బాధితులు స్త్రీ లేదా పురుషుడా అన్న అంశంతో పాటు ఒకవేళ బాధితులు మహిళలైతే వారు గర్భవతా లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మందుల్నీ, వాటి మోతాదుల్ని రుమటాలజిస్టులు నిర్ణయించి, సూచిస్తుంటారు. డా‘‘ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..) -
చేతిలో తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా? వాస్తవమిదే
మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరాలో లోపం ఏర్పడినప్పుడు తాత్కాలికంగా స్పృహ కోల్పోతారు. దీన్నే మూర్ఛపోవడం అంటారు. వైద్యభాషలో దీన్ని సాధారణంగా "పాసింగ్ అవుట్" అని సూచిస్తారు.మూర్ఛలో మూడు రకాలు ఉన్నాయి (వాసోవగల్ సింకోప్, కరోటిడ్ సైనస్ సింకోప్, సిట్యుయేషనల్ సింకోప్).వీటిలో కొన్ని ప్రాణాపాయమైనవి. మరి మన చుట్టూ ఎవరైనా మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. మూర్ఛ/ఫిట్స్ తరచూ వచ్చేవాళ్లలో కొన్ని లక్షణాలు ఉంటాయి. శరీరం వీక్ అయిపోవడం, మైకం కమ్మేయడం, "బ్లాకింగ్ అవుట్/వైటింగ్ అవుట్" కూడా అనుభవిస్తారు. అసలు మూర్ఛ రావడానికి గల సాధారణ కారణాలు ఏంటంటే.. భయం లేదా భావోద్వేగ గాయం,ఒత్తిడి. తీవ్రమైన నొప్పి,విశ్రాంతి లేకపోవడం. లోబీపీ, డీహైడ్రేషన్ మధుమేహం గుండె జబ్బు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (ఎంఫిసెమా) హైపర్వెంటిలేషన్ ఎక్కువ సేపు ఒకే భంగిమలో నిలబడటం. ప్రేగు కదలిక సమయంలో తీవ్రమైన ఒత్తిడి కొన్ని మందులు లేదా ఆల్కహాల్ తీసుకోవడం తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా? అప్పటివరకు ఉల్లాసంగా గడిపిన వాళ్లు ఫిట్స్‌తో అల్లాడిపోతుంటారు. దీంతో ఏం చేయాలో తెలియక చుట్టూ ఉన్నవాళ్లు కూడా గందరగోళానికి గురవుతుంటారు. ఆ సమయంలో ఫిట్స్‌తో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి చేతిలో తాళాల గుత్తి ఉంచడం, ఇనుముతో తయారుచేసిన వస్తువులను ఉంచడం, ఉల్లిపాయ వాసన చూపించడం వంటివి చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల ఫిట్స్ ఆగిపోతాయనుకుంటారు. ఐరన్ మెదడులోని అలజడిని కంట్రోల్ చేసి ఫిట్స్‌ను తగ్గిస్తుందని నమ్ముతారు. కానీ వాస్తవానికి ఇది అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. సాధారణంగానే ఫిట్స్ లేదా మూర్ఛ అనేది ఎపిసోడ్ల రూపంలో వస్తాయి. ఇవి 1-2 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండవు. ఈ సమయంలో మీరు ఏం చేసినా, చేయక పోయినా దానంతటవే ఆగిపోతాయి. దీన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అని పిలుస్తారు. ఒకవేళ ఇది ఐదు నిమిషాల కంటే ఎక్కవు సేపు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలి? ►ముందుగా చేయవలసినది భయాందోళనలకు గురికాకూడదు. పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే పాదాలను రబ్ చేస్తుండాలి. దీనివల్ల చర్మం చల్లబడకుండా ఉంటుంది. ► మూర్ఛపోయిన వ్యక్తిని వెనుకవైపు పడుకోబెట్టడం లేదా అతని/ఆమె మోకాళ్ల మధ్య తాళం వేసి కూర్చోబెట్టడం లాంటివి చేయాలి. ► ఎవరైనా కిందపడిపోతే అది ఫిట్స్ అని అనుకోకుండా ముందుగా గాయలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. అప్పటికి ఆ వ్యక్తిలో కదలిక లేకపోతే వారి కాళ్లను గుండె నుంచి సుమారు 12 అంగుళాలు (30CM) పైకి లేపడం వల్ల రక్తప్రవాహం ఆగకుండా ఉంటుంది. వ్యక్తి శ్వాస తీసుకోవడం ఆపివేసినట్లయితే, వెంటనే CPR చేయండి. ► షేక్ చేయడం, అరవడం: కొన్నిసార్లు గాయం కారణంగా వ్యక్తులు సడెన్ షాక్‌కి గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఆ వ్యక్తుల పేరు తెలిస్తే గట్టిగా వాళ్ల పేరు పిలుస్తూ తట్టండి. శరీరాన్ని షేక్ చేయడం వల్ల స్పృహను తిరిగి పొందడానికి సహాయపడుతుంది. మూర్ఛ వ్యాధిపై అవగాహన కలిగి ఉండటం ద్వారా మీరు అలాంటి వ్యక్తులను రక్షించిన వారు అవుతారు. - నవీన్ నడిమింటి ఆయుర్వేద నిపుణులు ఫోన్ -9703706660 -
దాల్చిన చెక్కతో ప్రొస్టేట్ కేన్సర్ నివారణ!
సాక్షి, హైదరాబాద్: భారతీయులు వంటకాల్లో తరచూ ఉపయోగించే దాల్చిన చెక్క ప్రొస్టేట్ కేన్సర్ నివారణకు దోహదపడుతుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) జరిపిన అధ్యయనం తేల్చింది. దాల్చిన చెక్కతో మన ఆరోగ్యానికి ఎన్నో మేళ్లు జరుగుతాయన్నది చాలాకాలంగా తెలిసిన విషయమే. ఎన్ఐఎన్ తాజా అధ్యయనం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. దాల్చిన చెక్కలోని చైనామాల్డీహైడ్, ప్రొసైనాడిన్ బీ–2లను ఎలుకలకు అందించినప్పుడు ప్రాథమిక దశలోని ప్రొస్టేట్ కేన్సర్‌పై సానుకూల ప్రభావం చూపినట్లు తెలిసింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుకలకు 16 వారాలపాటు దాల్చిన చెక్క, దాంతోపాటు చైనామాల్డీహైడ్, ప్రొసైనాడిస్ బీ–2లను అందించారు. ఆ తరువాత ఈ ఎలుకలకు ప్రొస్టేట్ కేన్సర్ వచ్చేలా చేశారు. దాల్చిన చెక్క, దాంట్లోని రసాయనాలను ఆహారంగా తీసుకున్న 60–70 శాతం ఎలుకల్లో కేన్సర్ లక్షణాలేవీ కనిపించలేదు. ఈ పదార్థాలు శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను సమర్థంగా తట్టుకోగలగడం వల్లనే వాటికి కేన్సర్ సోకలేదని భావిస్తున్నట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ అయేశా ఇస్మాయిల్ తెలిపారు. ప్రొస్టేట్ గ్రంథిలో కేన్సర్ కణాల వ్యాప్తి కూడా తక్కువగా ఉన్నట్లు తమ పరిశీలనలో తెలిసిందన్నారు. అంతేగాకుండా... ఎముకల్లోని ఖనిజాల మోతాదు ఎక్కువైందని, ఎముకలు బలహీనమయ్యే ప్రమాదం తగ్గిందని వివరించారు. ప్రొస్టేట్ కేన్సర్ నివారణలో దాల్చిన చెక్క ఉపయోగపడగలదన్న విషయం ఎలుకల్లో రుజువైనప్పటికీ మనుషుల్లో వాడకానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ‘కేన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్’జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. -
నోటి దుర్వాసన.. లైట్ తీసుకోవద్దు, చాలా ప్రమాదం
మీ నోరు బాగుందా? నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందన్నది సామెత. అందులోని నిజానిజాల సంగతి ఎలా ఉన్నా, మన నోరు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందన్నది వైద్య నిపుణుల మాట. కొందరి నోటి నుంచి చెడు వాసన వస్తుంటుంది. అది వారికి తెలియదు. ఒకవేళ తెలిసినా, అది కేవలం నోటి సమస్య మాత్రమే అనుకుని నోటిని పుక్కిలించి ఉమ్మెయ్యడం, మౌత్వాష్లను వాడటం వంటివి చేస్తారు. కానీ, చెడు శ్వాస అనారోగ్యానికి సంకేతమనే సంగతి మీకు తెలుసా? అవును. అది నిజం. బాగా బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంటే తప్పకుండా అనుమానించాలి. శరీరంలో నీరు తగ్గినట్లయితే.. ఆకలి వేస్తుందనే తప్పుడు సంకేతాలు ఇస్తుంది మెదడు. ఆ సమయంలో ఆహారానికి బదులు నీళ్లు తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. నోరు పొడిబారితే లాలాజలంలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణం తగ్గిపోయి నోటినుంచి చెడు వాసన వస్తుంది. అలర్జీలు కూడా కారణమే నోటి శుభ్రత పాటించకపోవడం, అలర్జీల వంటి సమస్యల వల్ల కూడా శ్వాస దుర్వాసన వస్తుంది. ఒకవేళ మీరు నోటిని శుభ్రంగా ఉంచుకుంటూ.. తగినన్ని నీళ్లు తాగే అలవాటు ఉన్నా సరే నోరు చెడు వాసన వస్తుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. టాన్సిల్ స్టోన్స్ వల్ల కూడా నోటి నుంచి చెడు వాసన వస్తుంది. కాబట్టి ఒకసారి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. వివిధ అనారోగ్య సమస్యలు, చెడు అలవాట్ల వల్ల కూడా నోటినుంచి దుర్వాసన వస్తుంది. ప్రతి రెండు మూడు నెలలకోసారి టూత్ బ్రష్‌ను మార్చడం ముఖ్యం, అలాగే నాలుక స్క్రాపర్, ఫ్లాసర్ కూడా మార్చాలి. ఈ సాధనాలు మీ దంతాలు, చిగుళ్ళు, నాలుకను శుభ్రంగా ఉండేలా చూస్తాయి. పంటినొప్పి, చిగుళ్ళలో వాపు వంటి బాధాకరమైన పరిస్థితులకి దారితీసే అసౌకర్యాలను నివారిస్తాయి. భోజనం చేసిన తర్వాత ఉప్పునీటితో నోటిని పుక్కిలించడం సహజమైన మౌత్‌వాష్‌గా పని చేస్తుంది, ఇది మీ నోటి పరిశుభ్రతను మరింత మెరుగుపరుస్తుంది. సరైన నోటి పరిశుభ్రత కోసం సాఫ్ట్–బ్రిస్టల్ బ్రష్, టూత్‌పేస్ట్, ఫ్లాస్, టంగ్ క్లీనర్, మౌత్ వాష్ వంటి ముఖ్యమైన ఉత్పత్తులను తప్పకుండా ఉపయోగించాలి. అప్పుడే నోటి ఆరోగ్యం బాగుండి, ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయి. గుండె జబ్బులను నివారించాలని అనుకునే వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు ముందు పళ్లు తోముకోవడం ఎంత ముఖ్యమో రాత్రి భోజనం తర్వాత నిద్రకు ఉపక్రమించే ముందు పళ్లు తోముకోవడం కూడా అంతే ముఖ్యమని అధ్యయనకారులు సలహా ఇస్తున్నారు. కొన్ని ఆహారాలు మీ చిగుళ్ళను బలంగా ఇంకా దంతాలు ఎక్కువ కాలం ఉండేలా చేస్తాయి. చిగుళ్ళు తగినంత బలంగా లేకుంటే, దంతాలు ఊడిపోతాయి. అందువల్ల, చిగుళ్ళను దృఢంగా చేయడం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవటం అవసరం. నోటి దుర్వాసన అరికట్టేందుకు చిట్కాలు ►దుర్వాసన కేవలం నోటి నుంచే వస్తున్నట్లయితే.. రోజూ ఉదయాన్నే పళ్లు తోమగానే తప్పకుండా నాలుకను శుభ్రం చేసుకోవాలి. ఏదైనా ఆహారాన్ని తిన్న తర్వాత నీటితో నోరు పుక్కిలించి ఉమ్మేయాలి. నోటిలో ఆహారం ఎక్కువసేపు ఉన్నట్లయితే బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంది. అది నోటిలో దుర్వాసన కలిగిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని నీటిని తాగుతుండాలి. ►రోజూ ఆపిల్ లేదా క్యారట్లను తినడం ద్వారా కూడా నోటిలో ఉండే మలినాలను తొలగించవచ్చు. కాఫీ ఎక్కువగా తాగినా సరే దుర్వాసన వస్తుంది కాబట్టి కాఫీకి బదులు గ్రీన్ టీ తాగడం మేలు. ఎందుకంటే గ్రీన్ టీ శ్వాసను మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. ► యాలుక్కాయను నోటిలో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి. ► దాల్చిన చెక్క, లవంగం కూడా మంచిదే. కిడ్నీలు సరిగా పని చేయకపోతే రక్తంలో ఉండే వ్యర్థాలు, మలినాలు పేరుకుపోతాయి. ఆ ప్రభావం నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్‌పై పడుతుంది. ఫలితంగా తినే ఆహారం రుచిగా అనిపించదు. పైగా ఏదో లోహాన్ని నోటిలో పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. అంతేగాక.. చెడు రక్తం వల్ల ఊపిరితిత్తుల్లోకి కూడా చేరుతుంది. దానివల్ల శ్వాస క్రియ సమయంలో రక్తంలో ఉండే మలినాలు మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్‌లో కలుస్తాయి. ఆ గాలి బయటకు వచ్చినప్పుడు శ్వాస దుర్వాసనతో కూడి ఉంటుంది. కాబట్టి.. ఆ రెండు లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించడం అవసరం. ఎందుకంటే నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది! అనారోగ్య కారణాలు కావచ్చు..! -
నిరంతరం కాళ్లు కదిలిస్తూ ఉండే... రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్!
కొందరిని గమనిస్తే... కుర్చీలో కూర్చుని కాళ్లు రెండూ కదుపుతూ ఉంటారు. వాళ్లు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా... అలా కదిలించడం వారికి ఇబ్బందిగానే ఉంటుంది. ఒకవేళ వారు బలవంతంగా దాన్ని నియంత్రించుకుంటే... అది వారికి అనీజీగా అనిపించి... కాసేపటి తర్వాత తమ ప్రమేయం లేకుండానే మళ్లీ కదిలించడం మొదలుపెడతారు. జనాభాలో దాదాపు 3 శాతం మందిలో ఇది ఉంటుంది. ఇలా కాళ్లు కదుపుతూ ఉండే సమస్యను ‘రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్’ (ఆర్ఎల్ఎస్) అంటారు. చాలామందిలో ఉండే ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం. కాళ్లు రెండూ అదేపనిగా కదుపుతూ ఉండే ఈ సమస్య కూర్చుని ఉన్నప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు... ఇలాంటివారిని జాగ్రత్తగా గమనిస్తే... ఈ ధోరణి సాయంత్రాలూ, రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయంలో ఎక్కువగా ఉంటుంది. వైద్య పరిభాష లో దీన్ని ‘విల్లిస్ ఎక్బామ్ డిసీజ్’ అని కూడా అంటారు. ఇది ఏ వయసువారిలోనైనా కనిపించినప్పటికీ... వయసు పెరుగుతున్న కొద్దీ ఇది కనిపించే అవకాశాలు పెరుగుతాయి. కొందరిలో ఇది ఎంత ఎక్కువ అంటే... వారి నిద్రకు సైతం ఇది అవరోధంగా మారుతుంది. కుటుంబ చరిత్రలో ఈ సమస్య ఉన్నవారి పిల్లల్లోని చాలామందిలో అనువంశికంగా ఈ సమస్య కనిపిస్తుంది. కారణాలు: ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు... త్వరగా ఉద్వేగాలకు లోనయ్యేవారు, అతిగా ఆందోళన పడేవారు, యాంగై్జటీకి గురయ్యేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇది ఎక్కువ. . లక్షణాలు: ∙కొందరిలో కాళ్లలో ఇబ్బంది పైకి పాకుతున్నట్లుగా అనిపిస్తుంది. ∙కాళ్లు కదుపుతూ ఉంటారు. కాళ్లు కదపడం ఆపితే చాలా ఇబ్బందిగానూ, అలా కదుపుతుంటే హాయిగాను ఫీలవుతారు. ∙ఇలా కదిపే వాళ్లలో రాత్రి నిద్రలో అకస్మాత్తుగా కాలి కండరాలు పట్టేస్తాయి. దాంతో అకస్మాత్తుగా నిద్రలేస్తారు. ఒక్కోసారి రాత్రంతా బాధపడతారు. తరచూ నిద్రాభంగాలు, దాంతో వచ్చిన నిద్రలేమితో జీవన నాణ్యత దెబ్బతింటుంది. ∙ఈ లక్షణాలున్న కొందరిలో కాళ్లలాగే భుజాలూ కదపడం కనిపిస్తుంది. కానీ ఇది చాలా అరుదు. అపోహ... వాస్తవం: రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్‌ను కొందరు మానసిక సమస్యనూ, మెదడు లేదా నాడీమండల సమస్యగానూ భావిస్తారు. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. కాకపోతే యాంగై్జటీతో పాటు కొన్ని మానసిక సమస్యలు ఉన్నవారిలో ఇది కనిపిస్తుండటం అనే అంశమే ఈ అపోహకు తావిస్తోంది. అంతే తప్ప ఇది మెదడు, నాడీ సంబంధమైన సమస్య లేదా మానసిక సమస్య కాదు. కొంతమంది ఇది నరాల్లోని సమస్యగా భావిస్తారు. ఇది సరి కాదు. నివారణ / నియంత్రణ రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ ఉన్నవారిలో హీమోగ్లోబిన్‌లో ఐరన్ లోపం ఉందేమో చెక్ చేసుకుని, ఒకవేళ ఉంటే దాన్ని భర్తీ చేయాలి. ∙కెఫిన్ ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి లేదా పరిమితంగా తీసుకోవాలి. ∙క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ∙కాళ్లు రెండూ గోరువెచ్చగా ఉన్న వేణ్ణీళ్ల టబ్‌లో ఉంచి, మెల్లగా మసాజ్ చేయడం. ∙సమస్య తీవ్రత ఉన్నవారు ‘ఫుట్ ర్యాప్ లేదా వైబ్రేటింగ్ ప్యాడ్స్’ వంటి ఉపకరణాలను డాక్టర్ల సూచన మేరకు వాడటం. -డాక్టర్ కె. శివరాజు,సీనియర్ ఫిజిషియన్ (చదవండి: మీలో ఏకాగ్రత ఎంత ఉంది? అందుకోసం ఏం చేయాలంటే) -
మెడ పట్టేసినప్పుడు.. త్వరగా నార్మల్ కావాలంటే?
నిద్రలో మెడపట్టేయడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. అలాగే ప్రయాణాల్లో మెడను అసహజ భంగిమలో ఉంచి వాహనాల్లో నిద్రపోయేవారిలో కూడా ఇది కనిపిస్తుంది. మెడ పట్టేయడాన్ని ఇంగ్లిష్‌లో రై నెక్ అంటారు. మెడపట్టేసినప్పుడు ఆ పరిస్థితి త్వరగా నార్మల్ అయ్యేందుకు పాటించాల్సిన సూచనలివి.. నిద్రలో చాలా పలచటి తలగడను వాడుతూ దాన్ని మెడ భాగంలోనే కాకుండా.. భుజాల వరకు సపోర్ట్‌గా ఉంచాలి. తలగడకు బదులుగా మెత్తటి టర్కీ టవల్నూ గుండ్రంగా చుట్టి (రోల్ చేసి) మెడ కింద సపోర్ట్‌గా ఉంచవచ్చు. ఊ మెడ మీద భారం పడేలా ఎక్కువ బరువున్న వాటిని అకస్మాత్తుగా ఎత్తకూడదు. ఇలా చేయడం వల్ల నొప్పి ఇంకా పెరుగుతుంది. కొందరు సెలూన్స్‌లో మెడను రెండువైపులా విరిచేసినట్లుగా టక్కున తిరిగేలా చేస్తుంటారు. ఇలా ఎంతమాత్రమూ చేయకూడదు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ప్రమాదకరం. కానీ నొప్పినివారణ మందును రెండు రోజుల పాటు వాడవచ్చు. అప్పటికీ తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించాలి. (చదవండి: ఎవాస్క్యులార్ నెక్రోసిస్ అంటే?) -
తన పోస్ట్‌కు విపరీతంగా లైక్స్.. పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్! కానీ అసలు సంగతి తెలిస్తే..
How To Get More Social Media Followers: సౌజన్య (పేరుమార్చడమైనది) సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటుంది. రాత్రి తను చేసిన పోస్ట్‌కు ఉదయం విపరీతంగా లైక్స్ రావడం, ఫాలోవర్స్ పెరగడం చూసి తెగ సంతోషించింది. ఒకట్రెండు రోజులు సజావుగా సాగినా ఆ తర్వాత నుంచి ప్రచార వస్తువుల గురించి ప్రకటనలు పెరిగాయి. తన చేసిన పోస్ట్‌లకు చెడుగా కామెంట్స్ పెడుతున్నారు. దీని వల్ల తన పేరు దెబ్బతింటుందనే ఆందోళన ఆమెను విపరీతమైన టెన్షన్‌కు గురిచేసింది. సోషల్ మీడియా సొసైటీలో ఫాలోవర్స్, లైక్స్, కామెంట్స్‌ను బట్టి విలువకట్టే రోజులు ఇవి. సినిమా స్టార్స్‌తోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు తమ సేవల గురించే కాదు, వస్తువుల బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టు కుంటుంటారు. అయితే, బ్రాండ్ ఎండార్స్మెంట్లను నిర్వహించే వ్యాపారాల దృష్టిని ఆకర్షించడానికి స్టార్స్, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఫాలోవర్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. ఇది ఒక పోటీలా మారుతుంటుంది. దీనిని గుర్తించిన నకిలీ ఫాలోవర్స్ అధికసంఖ్యలో పుట్టుకొస్తుంటారు. తమ మోసాలకు కొత్త తెర తీస్తుంటారు. దీనివల్ల ఆదాయ మార్గాలకు గండికొట్టడం, పేరు ప్రతి ష్టలు దెబ్బతీయడం వంటివి జరుగుతుంటాయి. నిజమైన ఫాలోవర్స్‌ను ఎలా పొందాలంటే.. ►ఆకర్షణీయమైన కంటెంట్‌ను సృష్టించాలి. మీ కంటెంట్ ప్రేక్షకులకు సమాచారంగా, వినోదాత్మకంగా, చూడటానికి ఆకర్షణీయంగా ఉండాలి. క్వాలిటీ ఫొటోలు, వీడియోలు వాడాలి. ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించాలి. ∙ ►క్రమం తప్పకుండా పోస్ట్ చేయడం వల్ల మీ ప్రేక్షకులు మీ కంటెంట్‌పై ఆసక్తిని కలిగి ఉంటారు. ►వ్యాఖ్యలు, సందేశాలకు ప్రతిస్పందించడం, అభిప్రాయాలను అడగడం, సంభాషణలను ప్రారంభించడం ద్వారా వీక్షకులతో సన్నిహితంగా ఉండాలి. ఇది ఫాలోవర్స్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. ►పోటీలు, బహుమానాలను ప్రకటించడం వల్ల కొత్త ఫాలోవర్లు పెరుగుతారు. మీ ఫాలోవర్లకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించవచ్చు. ►మీ వెబ్సైట్, ఇతర సోషల్ మీడియా అకౌంట్స్‌ను ప్రచారం చేసేలా ఉండాలి. దీనివల్ల చూసేవారి సంఖ్య పెరగడంతోపాటు కొత్త ఫాలోవర్లను ఆకర్షించడానికి సహాయపడుతుంది. నకిలీ ఫాలోవర్లు ఏం చేస్తారంటే.. ►కృత్రిమంగా ఫాలోవర్లను పెంచే ప్రయత్నంలో సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవడానికి అటోమేటెడ్ అకౌంట్స్‌ను రూపొందిస్తారు. ►ఫాలోవర్ కౌంట్, లైక్స్, కామెంట్స్ మళ్లించేందుకు వాస్తవంగా కంటే ఎక్కువ జనాదరణ లేదా ప్రభావవంతమైనదిగా కనిపించేలా చేయడానికి అకౌంట్లు సృష్టించబడతాయి. వీటిని థర్డ్‌పార్టీ ప్రొవైడర్ల నుంచి కొనుగోలు చేయచ్చు. ►లేదా నకిలీ ఖాతాలను సృష్టించే ప్రక్రియను ఆటోమేట్ చేసే సాఫ్ట్వేర్ సాధనాలను ఉపయోగించి సృష్టించవచ్చు. ∙ ►నకిలీ ఫాలోవర్లు అనైతికంగా ప్రవర్తిస్తారు. ►భవిష్యత్తులో మీ బ్రాండ్‌నేమ్‌ని దెబ్బతీస్తారు. ►వినియోగదారులు నిజమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండేలా ఫేక్ అకౌంట్స్‌ను క్రమం తప్పకుండా తొలగించాలి. నకిలీ అకౌంట్స్‌ను గుర్తింవచ్చు.. ►సోషల్ మీడియా పాలోవర్లను గుర్తించడం సవాల్‌గా ఉంటుంది. అయితే, నిజమైన వినియోగదారుల నుండి వీరిని వేరు చేయడంలో సహాయపడే కొన్ని సూచికలు... ►నకిలీ ఖాతాలో ప్రొఫైల్ సమాచారం ఉండదు. ప్రొఫైల్ ఫొటో సరైనది ఉండదు. బయో, లొకేషన్ వంటి అసంపూర్ణమైన లేదా ఖాళీ ప్రొఫైల్ ఉంటుంది. ►వీరి ఖాతాలో అతి సాధారణ కంటెంట్ ఉంటుంది. పోస్ట్‌కు ప్రతిస్పందనగా ఎమోజీలు ఉంటాయి. లేదా సంబంధం లేని వెబ్సైట్ లింక్‌లతో స్పామ్ కామెంట్స్ వదిలేయవచ్చు. ►వీరి ఖాతాలకు చాలా తక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు. కానీ, వీరు పెద్ద సంఖ్యలో ఇతర ఖాతాలను ఫాలో చేస్తుంటారు. ►ఇతరులతో ఎలాంటి ఇంటరాక్షన్ ఉండదు. కంటెంట్‌ను షేర్ చేయడం లేదా ఇతర యూజర్స్‌కి మెసేజ్‌లు, పోస్ట్‌లు.. అప్లోడ్ చేయడం నకిలీ అకౌంట్స్ వారు చేయరు. ►ఫాలోవర్ కౌంట్‌లో ఆకస్మిక పెరుగుదల ఉంటే అనుమానించాలి. నకిలీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు... ►ఇతరులను కించపరిచేలా ప్రతికూల కథనాలను, సమీక్షలు రాస్తారు. ►వారి వ్యూవర్షిప్ను పెంచడానికి మోసపూరిత ఫొటోలను పోస్ట్ చేస్తారు. ►నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, పెట్టుబడులు పెట్టాలని సిఫార్సు చేస్తూ, అవి తమకు తాముగా ప్రయోజనం పొందేలా చూస్తారు. నకిలీ ఖాతాల గురించి రిపోర్ట్ చేయడానికి... ►మీ డేటాను యాక్సెస్ చేయకుండా అకౌంట్‌ను బ్లాక్ చేయవచ్చు. ►లేదంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు నివేదించవచ్చు. https://www.facebook.com/help/306643639690823 https://help.twitter.com/en/rules-and-policies/platform-manipulation https://www.linkedin.com/help/linkedin/answer/a1338436/report-fake-profiles?lang=en https://help.instagram.com/446663175382270 - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వినీత్, తన సహచరుడిని ప్రేమించాడు! ఇక ట్రాన్స్‌జెండర్ మాయ.. వీళ్ల గురించి అసలు ఎందుకిలా?
వినీత్ (పేరు మార్చడమైనది) సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. అతను తన సహచరుడు ప్రేమించుకున్నారు. వారిద్దరూ కలిసి బతకాలని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా చివరకు వారి నిర్ణయానికి ఆమోదం తెలిపారు. కానీ, ‘మగవాళ్లు ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారట..’ అనే వ్యంగ్యపు మాటలు వారిని బాధిస్తున్నాయి. అంతేకాదు, సోషల్ మీడియాలో వారికి సంబంధించిన వార్తలు, వ్యతిరేక కామెంట్లు, లైంగికపరమైన చర్చలు జరుపుతుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. ‘మేం, మాలాంటి వారంతా గౌరవంగా బతకాలనుకుంటున్నాం. ఉద్యోగాలు చేసుకుంటున్నాం. అలాంటప్పుడు మా ఎదుగుదలకు సంబంధించి కాకుండా, లైంగికపరంగా మమ్మల్ని దిగజార్చే మాటలే ఎందుకు పదే పదే వస్తున్నాయి. ఈ బాధించే మాటలు, వీడియోల నుంచి మాకు విముక్తి ఎప్పుడు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ∙∙ మాయ ట్రాన్స్‌జెండర్. ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. సమాజంలో తమ వర్గాన్ని తక్కువగా చూస్తారన్న భయం ఆమెలో లేకపోలేదు. దానికి తోడు యూ ట్యూబ్ చూస్తున్నప్పుడల్లా ఆమెను వేల ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. వీడియోలు వైరల్ అవడం కోసం తమ వర్గానికి చెందిన వారిని లైంగికపరమైన విషయాలమీదనే ఫోకస్ చేస్తున్నారనేది ఆమె బాధ. దీనివల్ల సహచర ఉద్యోగుల్లోనూ, చుట్టుపక్కల కుటంబాల్లోనూ తనను కూడా అదే విధంగా చూస్తారని, నాలాగ బాధపడుతున్నవారు ఎంతో మంది ఉన్నారంటోంది మాయ. ∙∙ ఇది నేటి సమాజంలో అణచివేతకు గురికాబడుతున్న మరో వర్గంగా స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లను ప్రధానంగా చూస్తుంటాం. ఎల్జిబిటిక్యూఐఎ అనే పేరుతో వీరు హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో తమ సమస్యలను విన్నవించుకుంటూ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న ఈ జుగుప్సాకరమైన కంటెంట్ కలిగించే ఆందోళనను ఓ సున్నితమైన అంశంగా పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. తమ వర్గం వారిలోనూ డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతోద్యోగాలు చేసుకుంటున్నవారు ఉన్నారని, తమ విజయగాధలను తెలియజేయమని ఈ సందర్భంగా వారు వేడుకున్నారు. వైరల్ ప్రధానమా? సోషల్ మీడియా ద్వారా డబ్బు రావాలంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక సాధనం అని మనకు తెలిసిందే. ఎంత వైరల్ అయ్యే అంశాలు ఉంటే ఆ వీడియో ద్వారా అంత డబ్బు, దానితో పాటు పేరు వస్తుందని చాలా మందికి తెలుసు. అందుకే, ఆసక్తిని రేకెత్తించే అంశం ఏమిటో దానినే వీడియో అప్లోడ్ చేసేవారు ఎంచుకుంటారు. దీనితో పాటు వెబ్‌సైట్స్ ఇతర సామాజిక మాధ్యమాలు కూడా వార్త వైరల్ అయ్యేందుకు ఈ అంశాలను ఎంచుకుంటాయి. సైబర్ వేధింపులు సామాజిక మాధ్యమాల్లో మహిళలే అధిక వేధింపులకు లోనవుతుంటారు. అయితే, ఇటీవల పెరుగుతున్న పరిణామాల్లో ఎల్‌జిబిటిక్యూఐ+ కూడా చేరుతోంది. ఆఫ్‌లైన్‌లో జాతి, మత, వర్గంలో ఉండే విభేధాలు ఆన్‌లైన్‌లోనూ చూస్తుంటాం. డిజిటల్ యుగంలో తమ ఉనికిని చాటుకునే రోజుల్లో ఉన్నాం కాబట్టి ఎంచుకునే అంశాలు మరింత సున్నితంగా, తోటి వారి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. సహాయం కోసం వీరిని సంప్రదించవచ్చు రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా, సమాజంలో తమ గౌరవం దెబ్బతింటుందని, ఇతరులు తమను వేధింపులకు లోను చేస్తున్నారని అవి సమస్యగా తమ జీవనానికి అడ్డంకిగా ఉందనుకుంటే... 1. చట్టపరమైన రక్షణ కోసం 100కి కాల్ చేసి, పోలీసుల సాయం పొందవచ్చు. 2. జాతీయ/రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) అనేది జాతీయస్థాయి ప్రభుత్వ సంస్థ. మానవ హక్కుల ఉల్లంఘనలను ఈ సంస్థ ప్రత్యేకంగా పరిశీలిస్తుంది. ఎల్జిబిటిక్యూ+ వ్యక్తులైన వారు తమకు తగిన సహాయం కావాలంటే వీరిని సంప్రదించవచ్చు. 3. మహిళల కోసం జాతీయ /రాష్ట్ర కమిషన్: నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) అనేది లైంగిక నేరాలు, గృహహింస, వేధింపులు .. మొదలైన వాటి నుంచి మహిళల రక్షణలో పనిచేసే జాతీయస్థాయి ప్రభుత్వ సంస్థ. ఈ ఎన్సీడబ్ల్యూ కూడా తగిన సహాయం చేస్తుంది. 4. ఆన్లైన్ క్రైమ్ రిపోర్టింగ్ (ఆన్లైన్లో చేసిన వేధింపుల కింద) https://www.cybercrime.gov.in లోనూ రిపోర్ట్ చేయవచ్చు. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఎవరికి రిపోర్ట్ చేయాలి? సామాజిక మాధ్యమాల ద్వారా తమ గౌరవానికి భంగం కలిగించే అంశాలు ఉంటే రిపోర్ట్ చేయాల్సింది.. ఫేస్బుక్ .. https://www.facebook.com/help/ 116326365118751 ట్విటర్ ... https://help.twitter.com/en/safety-and-security/report-abusive-behavior ఇన్స్టాగ్రామ్–యూట్యూబ్ https://help.instagram.com/547601325292351 https://support.google.com/youtube/answer/2801939#protected_group లింక్డ్ఇన్: https://www.linkedin.com/help/linkedin/answer/a1336329/report-harassment-or-a-safety-concern?lang=en పైన ఇచ్చిన సోషల్‌మీడియా లింక్స్ ద్వారా ఆయా విభాగాలకు రిపోర్ట్ చేయవచ్చు. దానిపైన ఆ మాధ్యమాలు తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్. చదవండి: Beaumont Children Missing Case: ఆస్ట్రేలియా చరిత్రలో అపఖ్యాతి.. ఆ ముగ్గురు పిల్లలు ఏమయ్యారు? -
అమ్మాయిలు అన్నీ చెప్పేస్తారు.. మోసపోయిన తర్వాత కానీ..
మోసం చేశాడని చేతుల్లో ముఖం దాచుకుంటే మోసపోయానని తనను తాను హింసించుకుంటే పోయిన కాలం తిరిగి రాదు... జీవితం కూడా. సాంకేతికత మన పురోగతికి సాధనం మాత్రమే. సాంకేతికత మన జీవితాన్ని నిర్దేశించే ఆయుధం కాదు. అది ప్రశ్నించి... పరిహసించే పరిస్థితికి లోనుకావద్దు. ‘అబ్బాయిల చేతిలో అమ్మాయిలు మోసపోతున్నారు’... ఈ మాట పందొమ్మిది వందల అరవైలలో ఉండేది, ఎనభైలలోనూ ఉండేది. ఇరవై ఒకటో శతాబ్దంలోనూ వింటున్నాం. ‘మోసపోతున్నది అమ్మాయిలేనా అబ్బాయిలు మోసపోవడం లేదా, మోసం చేస్తున్నది అబ్బాయిలేనా మోసం చేస్తున్న అమ్మాయిలు లేరా’ అనే కౌంటర్ వాదన కూడా అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది... తేడా అంతా మోసపోతున్న తీరులోనే. టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. సద్వినియోగంతో పాటు దుర్వినియోగమూ ఎక్కువైంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో వేగం వచ్చింది, మోసం చేయడం సులువైంది. సోషల్ మీడియా ఇద్దరి జీవితాలను నిర్దేశించే స్థాయికి వెళ్లిందంటే... ఆ తప్పు టెక్నాలజీది కాదు, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని మనిషిదే. అమ్మాయిలు తమకు చట్టపరమైన రక్షణ ఉందా లేదా అనే ఆలోచన లేకుండా తమకు తాముగా జీవితాన్ని అభద్రతవలయంలోకి నెట్టివేసుకుంటున్నారని చెప్పారు సీనియర్ న్యాయవాది పార్వతి. ‘‘మా దగ్గరకు వచ్చే మహిళలనే గమనిస్తే... ఒకప్పుడు ఎక్కువ శాతం భర్త, అత్తింటి వారి నుంచి వేధింపులు, గృహహింస కారణాలతో వచ్చేవారు. ప్రేమ పేరుతో మోసం చేశాడని కూడా వచ్చేవారు. ఇప్పుడు ‘కొంతకాలం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి, ఇప్పుడు మొహం చాటేశాడనే కేసులు ఎక్కువయ్యాయి. ఇలాంటి కేసుల వివరాల్లోకి వెళ్తే ఆ ఇద్దరి మధ్య పరిచయానికి వేదిక సోషల్ మీడియానే అయి ఉంటోంది. ముఖాముఖి కలవడానికి ముందే ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలనూ షేర్ చేసుకుని ఉంటున్నారు. సరిగ్గా ఇక్కడే అమ్మాయిలు గమనించాల్సింది, జాగ్రత్త పడాల్సిందీ. ఎందుకంటే... అబ్బాయిలు మాటల్లో పెట్టి అమ్మాయిల వివరాలన్నీ తెలుసుకుంటున్నారు, తన గురించిన వివరాలను చాలా జాగ్రత్తగా ఇస్తారు. అతడు మొహం చాటేశాక, అతడి గురించి ఈ అమ్మాయిలను ఏ వివరం అడిగినా తెల్లమొహం వేస్తారు. ‘అన్ని వివరాలనూ షేర్ చేస్తున్నామని చెప్పారు కదా, అతడి గురించి నువ్వు తెలుసుకున్న దేంటి?’ అని అడిగినప్పుడు అమ్మాయిలు చెప్పే వివరాల్లో అతడి అభిరుచులు, ఇష్టమైన క్రీడాకారులు, అతడు చూసిన సినిమాలు, జీవితం పట్ల అతడి ఆకాంక్ష లు, చదివిన పుస్తకాలు... ఇలా ఉంటుంది జాబితా. అతడి ఉద్యోగం, చదువు, ఊరు, అమ్మానాన్నలు ఎక్కడ ఉంటారు, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల వివరాలు... ఏమీ చెప్పలేరు. ఒకవేళ అప్పటికే పెళ్లయిన వాడా అని కూడా తెలుసుకోరు. అతడు ఫోన్ నంబర్ మార్చేస్తే ఇక ఏ రకంగానూ అతడిని ట్రేస్ చేయలేని స్థితిలో ఉంటుంది పరిస్థితి. అమ్మాయిలు అన్నీ చెప్పేస్తారు! అమ్మాయిలు మాత్రం తనతో పాటు ఇంట్లో అందరి ఫొటోలు షేర్ చేయడం, ఇంటి అడ్రస్, అమ్మానాన్నల పేర్లు, ఉద్యోగం, బ్యాంకు బాలెన్స్, నగలు... అన్నీ చెప్పేసి ఉంటారు.‘పరిచయమైన వ్యక్తి ఫోన్ చేసి పలకరించేటప్పుడు చాలా సాధారణమైన మాట ‘భోజనం చేశావా’ అని అడిగితే దానిని తన మీదున్న కన్సర్న్ అని మురిసిపోతారు. తనకు సమయానికి అన్నం వండి పెట్టిన అమ్మ, తనకు అన్నీ అమర్చి పెడుతున్న నాన్న ఆ పనులన్నీ తన మీద ప్రేమతోనే చేస్తున్నారనే ఆలోచన రావడం లేదు. అతడి నుంచి ‘గుడ్‌నైట్’ మెసేజ్ వస్తుంది, దానికి అమ్మాయి నుంచి వెంటనే రిప్లయ్ వస్తే ‘ఇంకా నిద్రపోలేదా’ అని అడుగుతాడు. ఇవన్నీ చెప్పి.. ‘నా మీద అంత ప్రేమగా ఉండేవాడు. మా అమ్మానాన్నల కంటే ఎక్కువ ప్రేమ చూపించాడు. అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయి ఇద్దరం సహజీవనంలో ఉన్నాం’ అని చెబుతారు. అవతలి వ్యక్తి పెళ్లి ప్రస్తావన రానివ్వకుండా జాగ్రత్తపడిన విషయం మోసపోయిన తర్వాత కానీ అమ్మాయిలకు తెలియడం లేదు. ఈలోపు అమ్మాయి బ్యాంకు బాలెన్స్, నగలు ఖర్చయిపోయి ఉంటాయి. శ్రద్ధావాకర్ కేసులో దారుణం జరిగింది కాబట్టి సమాజం దృష్టిలోకి వస్తుంది. కానీ అలాంటి పరిస్థితి రాలేదనే మాటే కానీ మోసపోయి... న్యాయపోరాటం చేయలేక, ఆవేదనతో మానసికంగా కృంగిపోతున్న వాళ్లు ఎందరో’’ అని చెప్పారు లాయర్ పార్వతి. వంచనకు సాధనం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రేమ పేరుతో వంచించడానికి సోషల్ మీడియాను సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ఒక వ్యక్తితో ముఖాముఖి మాట్లాడితే ఒకసారికి కాకపోయినా ఐదారు దఫాలు మాట్లాడిన తర్వాతకైనా ముసుగు జారిపోతుంది. ఇక ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్‌లో అవతలి వ్యక్తి మనోభావాలను పసిగట్టడం సాధ్యం కానే కాదు. మోసపోతున్నది అమ్మాయిలు మాత్రమే అని కాదు, మోసపోతున్న వాళ్లలో ఎక్కువ శాతం అమ్మాయిలే ఉంటున్నారు. ఒకప్పుడు కలం స్నేహాలు ఎక్కడో ఉన్న ఇద్దరు వ్యక్తులను అనుసంధానం చేసేవి. అవి పరస్పరం అభిప్రాయాలు, అభిరుచులను షేర్ చేసుకోవడానికే పరిమితమయ్యేవి. సోషల్ మీడియా స్నేహాలు జీవితాలను నిర్దేశిస్తున్నాయి, తప్పుదారిలో నడిపిస్తున్నాయంటే... ఆ తప్పు సాంకేతికతది కాదు. మెదడు ఉన్న, విచక్షణ ఉండాల్సిన మనిషిదే. – వాకా మంజులారెడ్డి చట్టాలున్నాయి...కానీ! పెళ్లి చేసుకున్న మహిళకు చట్టపరంగా ఎలాంటి రక్షణ ఉందో, సహజీవనం విషయంలో కూడా అలాంటి రక్షణను కల్పించింది చట్టం. అయితే సహజీవనాన్ని నిరూపించుకోవాలి. చాలా సందర్భాల్లో నిరూపణ కష్టమవుతోంది. ఆ ఇద్దరూ ఒకే కప్పు కింద జీవించారని చుట్టుపక్కల వాళ్లు సాక్ష్యం చెప్పాలి. అలాగే ఆ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగ్నల్స్ వంటి సాంకేతిక ఆధారాలను చూపించవచ్చు. కానీ న్యాయస్థానం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ని ప్రధాన సాక్ష్యంగా పరిగణించడం లేదు, సెకండరీ ఎవిడెన్స్‌గా మాత్రమే తీసుకుంటుంది. సహజీవనాన్ని నిరూపించలేని పరిస్థితుల్లో ‘క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్’ కేసులు పెట్టవచ్చు. కానీ అమ్మాయిలు, వారి తల్లిదండ్రులకు, సమాజానికి భయపడి ఈ పని చేయలేకపోతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా కేసులు పెట్టి జీవితంలో మరింత అల్లకల్లోలంలోకి వెళ్లడానికి ఇష్టపడరు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండడమే చెప్పదగిన సూచన. పుట్టిన రోజుకి ఫ్లవర్ బొకేలు పంపించినంత మాత్రాన అతడిది సంపూర్ణమైన ప్రేమ అనే భ్రమలోకి వెళ్లవద్దు. – ఈమని పార్వతి, హైకోర్టు న్యాయవాది -
కొత్త సంవత్సరంలో.. కొత్త డిజిటల్ తీర్మానాలు
ఒక్క క్లిక్‌తో ప్రపంచం మన గుప్పిట్లోకి వచ్చేసింది. ఇంటర్నెట్ ఎన్నో అద్భుతాలను పరిచయం చేయడమే కాదు. మరెన్నో అననుకూలతలనూ కలిగిస్తోంది. స్మార్ట్ స్క్రీన్ కంటికి, మెదడుకు హాని కలిగించడమే కాదు. డిజిటల్ మోసాలతో జేబుకు చిల్లు పడేస్తుంది. కొత్త పరిచయాలతో స్నేహాలు వర్ధిల్లుతాయనుకుంటే ఏమరుపాటులో పరువు నెట్టింటికి చేరుతుంది. రాబోయే కొత్త సంవత్సరం, కొత్త జోష్‌లో డిజిటల్ ప్రపంచానికి సంబంధించి కొన్ని కచ్చితమైన తీర్మానాలు తీసుకోవాల్సిందే! చదువు, పని లేదా వ్యాపారంలో రాణించడమే మీ ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి అయితే, మీ వాస్తవ తీర్మానాలపై దృష్టి కేంద్రీకరించడానికి డిజిటల్, సోషల్ మీడియా డిటాక్స్‌కి ఇది సరైన సమయం. అంతేకాదు లోన్ యాప్‌లంటూ దోపిడీ, కస్టమర్ కేర్ అంటూ ఎర, ఓటీపీ చెప్పమనో, స్క్రీన్ షేర్ చేయమనో, క్యూ ఆర్ కోడ్ తోనో, వీడియో గేమ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూనో.. డిజిటల్ మోసగాళ్ల ఎత్తులకు అడ్డుకట్ట వేయాలన్నా, ఆన్లైన్లో సురక్షితంగా ఉండాలన్నాఎంతో సమాచారం మీ కోసం సిద్ధంగా ఉంది. డిజిటల్ బ్రేక్... స్మార్ట్‌ఫోన్ వచ్చాక దాని వల్ల పొందే సౌలభ్యం కారణంగా మన జీవితాలు, ఆసక్తులపై అది ఆధిపత్యం చలాయిస్తోంది. స్మార్ట్‌ఫోన్ వాడకంలోని ప్రతికూల అంశాలు మనస్తత్వవేత్తలు, వైద్యులు, సామాజిక సంస్థల దృష్టికి వచ్చాయి. వ్యక్తులలో మూడింట రెండు వంతుల మంది స్మార్ట్ఫోన్లు చేతిలో లేకుండా ఇంటి నుంచి బయటకు రావడం లేదని వివిధ దేశాల నుండి ఇప్పటికే ఉన్న నివేదికలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ బ్రేక్ తీసుకున్నప్పుడు చాలామందిలో మంచి ప్రయోజనాలు కనిపించాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది, తప్పిపోతామేమో అనే భయాన్ని తగ్గిస్తుంది, నిద్ర అలవాట్లను మెరుగుపరుస్తుంది, పని, జీవన సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. మరింత సానుకూల ప్రభావాన్ని తీసుకువస్తుంది. డిజిటల్ డీటాక్స్ కోసం... ►మీ స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్లను నిలిపివేయండి. దీని వల్ల మీకు ఏ నోటిఫికేషన్ అవసరమో, ఏది అనవసరమో తెలిసి వస్తుంది. ►మీ పడకగది, భోజనాల గదిని స్మార్ట్‌ఫోన్ రహిత జోన్‌గా మార్చండి. మీరు బెడ్రూమ్ బయట మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయాలనే నిర్ణయాన్ని కచ్చితంగా పాటించండి. ►స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్ నుండి సోషల్ మీడియాను యాక్సెస్ చేయండి. దీని వల్ల మీరు సోషల్ మీడియా షెడ్యూల్‌ను సెట్ చేసుకోవచ్చు. ►మీ హోమ్ స్క్రీన్‌ను నియంత్రించండి. స్టోరేజ్ స్పేస్‌ను సెట్ చేయడంతో పాటు హోమ్ స్క్రీన్ పై ముఖ్యమైన యాప్‌లు మాత్రమే ఉండేలా చూసుకోండి. అంతగా అవసరం లేనివి, ఇతర యాప్‌లను ఫోల్డర్లలో సెట్ చేయండి. ►కుటుంబసభ్యులు, బంధు, మిత్రులతో డిజిటల్ పరికరాలు లేని చర్చల్లో పాల్గొనండి. ►స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రంగురంగులతో కాకుండా గ్రేస్కేల్ మోడ్‌ని ఉపయోగించండి. ►ఆండ్రాయిడ్‌లో డిజిటల్ వెల్బీయింగ్ యాప్, ఐఓఎస్ లో స్క్రీన్ టైమ్ యాప్‌తో ప్రతిరోజూ స్క్రీన్ ల ముందు ఎన్ని గంటలు గడుపుతున్నారో ట్రాక్ చేయచ్చు. కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలను ఏర్పరచుకున్న తర్వాత, మీరు మీ స్క్రీన్ సమయాన్ని, డిజిటల్ శ్రేయస్సును కూడా పరిమితం చేయాలి. మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్‌మీడియా యాప్‌లను స్క్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఈ సెట్టింగ్ మీకు తెలియజేస్తుంది. 20 నిమిషాల పాటు ఎలక్ట్రానిక్ పరికరాల నుండి విరామం తీసుకోండి. ప్రతి 20 నిమిషాలకు, 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని చూడండి. లేదంటే.. (ఎ) నొప్పి, అసౌకర్యం పెరుగుతాయి. (బి) కళ్ళు మంట, దురద మొదలవుతాయి. (సి) కంటి చూపు తగ్గుతుంది. (డి) కంటి అలసట (ఇ) కంటి ఒత్తిడి తలనొప్పికి కారణమవుతుంది. డిజిటల్ భద్రత... ►మీ పెంపుడు జంతువుల పేర్లు, ఇంటిపేర్లు పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోవద్దు. పాస్వర్డ్లు ఎప్పుడూ కనీసం ఒక పెద్ద అక్షరం, ఒక అంకె, ఒక ప్రత్యేక అక్షరాన్ని కలిగి ఉండాలి. దీని వల్ల డిజిటల్ ఫ్రాడ్స్‌కి పాస్వర్డ్ అంచనా కష్టమవుతుంది. ►సోషల్ మీడియా వాయిస్ లేని వారికి వాయిస్ ఇస్తుండగా, ఒక నిఘా సమాజం కూడా ఉంటుంది. దీనిలో వాయిస్లెస్గా మారడం మనుగడకు తెలివైన మార్గం. సురక్షిత వెబ్సైట్లకు యాక్సెస్ పరిమితి ((htt-ps://) URL మొదట్లో HTTPS అని ఉంటే, మీరు సురక్షితంగా ఉన్నారని అర్థం. కంపెనీలు తమ వ్యాపార ప్రకటనల ప్రచారాలు, ఉత్పత్తులు, సేవలకు తగిన సమాచారాన్ని అందించడానికి మన అలవాట్లు, ప్రాధాన్యతలు, ఎంపికలు, ప్లేస్.. వీటన్నింటినీ మన ఫోన్, ఇతర డిజిటల్ పరికరాల నుండి GPS ద్వారా ట్రాక్ చేస్తాయి. చివరికి భాగస్వామ్యం చేస్తాయి. దీని వల్ల మన అనుమతి లేకుండానే థర్డ్ పార్టీకి ఈ సమాచారం చేరుతుంది. ►మీ ముఖ్యమైన డేటా సాధారణ బ్యాకప్ ఏ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయలేదని నిర్ధారించుకోండి. ►ఫిషింగ్, విషింగ్, స్మిషింగ్ టెక్ట్స్ మెసేజ్‌లు లింక్‌పై క్లిక్ చేయడం లేదా అటాచ్‌మెంట్‌ను తెరవడం కోసం మిమ్మల్ని మోసగించడానికి తరచుగా ఏదో ఒక స్టోరీ చెబుతాయి. ఇమెయిల్/ సోషల్ మీడియా, వాట్సప్ లేదా ఎసెమ్మెస్ ద్వారా వచ్చిన చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. వాటిని క్లిక్ చేయడానికి ముందు ఫిషింగ్ (https: //isitphishing.org/) కోసం తనిఖీ చేయండి. ►మీ డిజిటల్ పరికరంలో డేటాను రక్షించడంలో ఫైర్‌వాల్ సహాయం చేసినట్లే, ఆన్లైన్ నెట్‌వర్క్‌లలో VPN రక్షిస్తుంది. ►రెండు కారకాల ప్రమాణీకరణను ఉపయోగించడం మంచిది. మన గుర్తింపుకు రెండు పద్ధతుల ద్వారా యాక్సెస్ ఉండేలా చూసుకుంటే భద్రత బలోపేతమవుతుంది. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
టెలిగ్రామ్ యాప్ వల్ల ఎన్నో ప్రయోజనాలు! కానీ.. ఇలా చేశారంటే మాత్రం!
Cyber Crime Prevention Tips In Telugu: టెలిగ్రామ్ రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన క్రాస్–ప్లాట్‌ఫారమ్ మెసేజింగ్ అప్లికేషన్. ఇది విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఎందుకంటే ఇది మెరుగైన గోప్యత, ఎన్క్రిప్షన్ లక్షణాలతో పాటు రెండు లక్షల మంది సామర్థ్యం వరకు పెద్ద గ్రూప్ చాట్ ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. టెలిగ్రామ్ తన వినియోగదారులకు మీడియా పరిమాణాలపై పరిమితులు లేకుండా అనేక ఫీచర్లను అందిస్తుంది. ప్రయోజనాలు (ఎ) వాట్సాప్ గ్రూప్‌లలో 256 మంది సభ్యుల వరకు ఉండచ్చు. అదే, టెలిగ్రామ్ అయితే రెండు లక్షల మంది ఒక గ్రూప్‌గా ఉండవచ్చు. (బి) టెలిగ్రామ్ ప్రాథమికంగా మీరు రహస్యంగా ఎంచుకున్న సంభాషణలను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ఇది మీ గోప్యతను మెరుగుపరుస్తుంది. (సి) టెలిగ్రామ్ యాప్ పూర్తిగా ఉచితం. టెలిగ్రామ్‌లో బాధించే ప్రకటనలు ఉండవు (డి) మెసేజ్‌లను పంపిన వారికి, వాటిని స్వీకరించిన వారికి భద్రత ఉంటుంది. స్కామ్‌లు టెలిగ్రామ్ స్కామ్‌లు మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో జరుగుతాయి లేదా మెసేజింగ్ అప్లికేషన్ నుండి వినియోగదారులను ప్రమాదకరమైన థర్డ్ పార్టీ సైట్లు, అప్లికేషన్ లలోకి లాగుతాయి. టెలిగ్రామ్‌కు విస్తృతమైన ఆమోదం, వాడుకలో సౌలభ్యం కారణంగా స్కామర్లు జొరబడతారు. చాలా సార్లు, స్కామర్లు తమను తాము చట్టబద్ధమైన ఏజెంట్లుగా లేదా వివిధ కార్పొరేషన్ల ఉద్యోగులుగా చూపించుకోవడం చూస్తుంటాం. స్కామర్లు తరచుగా బాధితులను ఆకర్షించడానికి ప్రముఖ ఛానెల్‌ల నకిలీ/నకిలీ వెర్షన్లను సృష్టిస్తారు. ఈ గ్రూప్‌లు ఒకే విధమైన పేర్లు, ప్రొఫైల్ చిత్రాలను కలిగి ఉంటాయి. అదే పిన్ చేయబడిన సందేశాలను కలిగి ఉంటాయి. దాదాపు చట్టబద్ధమైన వాటితో సరిపోలే వినియోగదారు పేర్లతో ఉంటాయి. ప్రమోషన్లు, ఉచిత బహుమతులు, ఎమ్ఎల్ఎమ్ ఆధారిత పథకాలతో కూడిన స్కామ్‌లకు ప్రజలు బలైపోతుంటారు. స్కామర్లు సమస్యను పరిష్కరించడానికి మీ ల్యాప్‌టాప్ లేదా పరికరం రిమోట్ కంట్రోల్ తీసుకోవాలని తరచూ అడుగుతారు. ఈ ప్రక్రియలో మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సేకరిస్తారు. ఎ) బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ స్కామ్‌లు నాణేలు, డబ్బు లేదా ఖాతా లాగిన్ల నుండి బాధితులను స్కామ్ చేయడానికి స్కామర్లు టెలిగ్రామ్‌లో తమను తాము క్రిప్టో నిపుణులుగా చెప్పుకుంటారు. తమను తాము నిపుణులుగా చూపిస్తూ, వారు బాధితుల క్రిప్టో పెట్టుబడులపై హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేస్తారు. వారి స్కామ్‌లో భాగంగా, వారు తమ పెట్టుబడి పెరుగుతున్నట్లు చూపే బాధితుల చార్ట్‌లు, గ్రాఫ్‌లను చూపుతారు (ఈ సభ్యులలో ఎక్కువ మంది నకిలీ లేదా చెల్లించిన సోషల్ మీడియా నిపుణులు). బాధితుడు వాలెట్ లేదా డ్యాష్‌బోర్డ్‌లో ప్రదర్శించిన విధంగా వారి ఆదాయాలను ఉపసంహరించుకోలేరు. ఆ సమయంలో స్కామర్లు అదృశ్యమవుతారు. గ్రూప్‌లలో ఎప్పుడూ స్పందించరు. బి) బాట్లను ఉపయోగించి ఫిషింగ్ టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో బాట్లను నిర్మించే, ఉపయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎపిఐ ఉండటం వలన, వారు రియల్ సంభాషణలలో పాల్గొంటారు. దీంతో మీరు స్కామ్‌కి గురవుతున్నారో లేదో చెప్పడం కష్టం. అంటే, ఒక నకిలీ బాట్, బ్యాంకులు, డిజిటల్ చెల్లింపు అప్లికేషన్ల నుండి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ఈ బాట్ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా లాగిన్లు, పాస్వర్డ్లు, క్యూ ఆర్ కోడ్లను కూడా వదులుకోమని వినియోగదారుని కాల్ చేస్తుంది, ఒప్పిస్తుంది. సి) టెక్ సపోర్ట్ స్కామ్‌లు ఈ స్కామ్‌లో స్కామర్లు చట్టబద్ధమైన టెక్ సపోర్ట్ ఏజెంట్లలా నటిస్తుంటారు. స్కామర్లు సమస్యను పరిష్కరించడానికి బాధితుల ల్యాప్‌టాప్ లేదా పరికరాన్ని రిమోట్ కంట్రోల్‌గా తీసుకుంటారు. ఈ ప్రక్రియలో బాధితుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సేకరిస్తారు. డి) రొమాన్స్/ సెక్స్టార్షన్ స్కామ్‌లు సోషల్ మీడియా నిషేధించిన సాన్నిహిత్యాలు, నిషేధించిన ప్రవర్తనలలో పాల్గొనడానికి అవకాశాన్ని సృష్టిస్తుంది. స్కామర్లు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆన్లోలైన్లో వినియోగదారుతో నమ్మకాన్ని పొందేందుకు వారితో సంబంధాన్ని ప్రారంభిస్తారు. బాధితులు తమకు సున్నితమైన ఫొటోలు లేదా వీడియోలను పంపమని అడుగుతారు, ఆ పై వారు బ్లాక్మెయిల్ కోసం ఉపయోగిస్తారు. ఇతర రకాల శృంగార మోసాలు (ఎ) ప్రతిపాదనలతో దోపిడి. (బి) అందమైన స్త్రీ లేదా పురుషుడు. (సి) గే మ్యాన్ పే మేకింగ్. టెలిగ్రామ్ యాప్‌లో భద్రతా చిట్కాలు ఎ) మీ అన్ని రకాల పాస్‌వర్డ్‌లకు కనీసం 10 పెద్ద, చిన్న అక్షరాలు, సంఖ్యలు, చిహ్నాలు, ప్రత్యేకమైనవి, ఊహించడానికి కష్టంగా ఉండేలా నిర్వహణకు ఉపయోగించడాన్ని పరిగణించండి. బి) తెలిసిన మూలాల ద్వారా పంపబడినప్పటికీ, https://www.unshorten.it లేదా https://www.checkshorturl.com ను ఉపయోగించి సంక్షిప్త URLs / Links ధృవీకరించండి సి) తెలియని పరిచయాల ద్వారా పంపబడిన అటాచ్‌మెంట్స్‌ను క్లిక్ చేయడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి ముందు https://www.isitphishing.org or https://www.urlvoid.com వెబ్‌లింక్ ద్వారా ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. డి) వినియోగదారు ప్రొఫైల్‌కి వెళ్లి, మీ స్క్రీన్ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి, ‘యూజర్ బ్లాక్‘ ని ఎంచుకోండి. ఇ) స్కామ్ ఖాతా స్క్రీన్‌షాట్, ఏదైనా ఇతర సమాచారాన్ని టెలిగ్రామ్‌లోని@notoscam పంపండి. లేదా ప్రత్యామ్నాయంగా ఇమెయిల్:abuse@ telegram.orgకి పంపవచ్చు. చదవండి: మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి -
ఇంట్లో నుంచే లక్షలు సంపాదించండి అంటూ...
Cybercrime Prevention Tips In Telugu By Expert: యాప్స్ ఆధారంగా పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్లతో స్కామర్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అదనపు ఆదాయం కోసం చూస్తున్న వారికి, నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులను ట్రాప్ చేయడానికి యాప్ స్కామర్లు ఉపయోగిస్తున్న ఆఫర్ మోసాలు పలు విధాలుగా ఉంటున్నాయి. ‘ఆన్లైన్లో సంపాదించండి’, ‘పార్ట్ టైమ్ జాబ్’ వంటి ఆశావహమైన పదాలను మోసగాళ్లు, నేరస్థులు తమ ప్రకటనల ద్వారా ఉపయోగిస్తారు. ఈ సైట్లలో చాలా వరకు మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌కు లేదా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్‌ను పొందుపరిచిన వెబ్‌సైట్‌కి మనల్ని దారి మళ్లిస్తాయి. అలాగే, కొందరు తాము మోసపోయామని తెలిసి కూడా కావాలని మరో పదిమంది మోసపోవాలనుకుంటారు. దీంతో ఫలానా యాప్‌లలో పెట్టుబదులు పెట్టమని ప్రోత్సహిస్తుంటారు. వీటివల్ల మోసపోయే అవకాశాలూ అధికంగా ఉన్నాయి కాబట్టి, ఎవరికి వారు జాగ్రత్తపడటం అవసరం. ఇవీ సూచనలు... పార్ట్ టైమ్ జాబ్ స్కామ్ సూచికలు.. ►ఇంటి నుండి ఉచిత పని ►త్వరితంగా డబ్బు సంపాదించడం ►అపరిమిత సంపాదన సామర్థ్యం ►బహుళ స్థాయి మార్కెటింగ్ ►పెట్టుబడి అవకాశాలను పెంచడం ►ఫుల్ టైమ్ వేతనంతో కూడిన పార్ట్ టైమ్ ఉద్యోగాల ఎర మోసగాళ్లు అనుసరించే విధానాలు 1) బాధితులు పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్లు, ఇంటర్నెట్/ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మొదలైన ఇతర ప్రకటనలకు ఆకర్షితులవుతుంటారు. వీరి ఆశను అవకాశంగా తీసుకొని తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు అవుతుందని, అధిక కమీషన్లు లేదా అధిక రాబడి వస్తుందని స్కామర్లు వాగ్దానం చేస్తారు. ప్రకటనలు /ఎసెమ్మెస్‌ల ద్వారా సాధారణంగా ఒక లింక్ ఉంటుంది, ఇది నేరుగా టెలిగ్రామ్ లేదా వాట్సప్ చాట్‌లో చేరమని వారిని అడుగుతుంది. 2) APK (Android), DMZ (IOS) పై క్లిక్ చేయడం ద్వారా యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. ఈ అప్లికేషన్స్ ప్లే స్టోర్ లేదా యాప్స్టోర్లలో లేవని గమనించాలి. గ్రూప్స్‌లో చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు (యూట్యూబ్ వీడియోలు) వీటిని చూస్తారు. వారు ఈ యాప్‌లను ఉపయోగించి చాలా ఎక్కువగా ప్రయోజనం పొందామని తమ ‘మల్టీలెవల్ మార్కెటింగ్‘ వ్యూహంలో భాగంగా సూచిస్తుంటారు. ఈ యాప్‌ల ద్వారా లబ్ది పొందామనో, ఈ మొత్తంతో వస్తువులను కొనుగోలు చేయడంలో, పనులను చేయడం ద్వారా ఆఫర్లతో పాటు 200 శాతం ప్రయోజనం పొందుతారని చెబుతుంటారు. 3) ఒక పని చేయడానికి తప్పనిసరి షరతు ఏమిటంటే, మనదేశంలో పనిచేయడానికి అధికారం లేని చెల్లింపు గేట్‌వేల ద్వారా ఆ డబ్బు ఇస్తామని ఉంటుంది. 4) పని పూర్తయిన తర్వాత, బాధితుడు డబ్బును విత్‌డ్రా చేసే అవకాశాన్ని ఇవ్వమని అడుగుతాడు. అయితే, వివిధ చెల్లింపు అగ్రిగేటర్ల ద్వారా డబ్బు తీసుకోవడానికి వీలుపడదు. 5) మొదటిసారి డబ్బు పొందాక, బాధితుడు ఎక్కువ డబ్బు పెట్టుబడిగా పెట్టడానికి, మరిన్ని పనులు చేయడానికి ఆకర్షితుడవుతాడు. ఫలితంగా ఈ ప్రక్రియ మళ్లీ కొనసాగుతుంది. అయితే, బాధితుడు పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టిన తర్వాత, స్కామర్ చాట్‌లో కనిపించడు. మరింత అప్రమత్తత అవసరం ►యాప్ ఆదాయంలో సరైన నియంత్రణ/అనుకూల ఆమోదం కోసం అడగండి. ►ముందస్తుగా చెక్కులు ఇవ్వవద్దు. ►ఖాతా స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ►‘ప్రామిస్డ్ వర్సెస్ యాక్చువల్’ సందేశాలను నమ్మద్దు. ►యాప్ స్టోర్ / ప్లే స్టోర్ నుండి కాకుండా డౌన్లోడ్ చేసిన యాప్‌లపై ఆర్థిక లావాదేవీలు చేయవద్దు. ►ఫోన్ సంభాషణల సమయంలో లేదా స్క్రీన్ షేరింగ్, ఆర్థిక లావాదేవీలు చేయవద్దు. రక్షించుకోవడానికి జాగ్రత్తలు ►అధిక హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేస్తాయి, నమ్మద్దు. ►అధిక ప్రారంభ పెట్టుబడిని అభ్యర్థిస్తాయి. ►సంక్లిష్టమైన, నిలకడలేని వ్యాపార నమూనా ఉంటుంది. ►నష్టాలను తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేస్తారు. ►యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్‌లో జాబితా చేయని యాప్‌లలో పెట్టుబడుల జోలికి వెళ్లద్దు. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: 4G To 5G: 5జీ ఫోన్లలో.. 4జీ సిమ్ కార్డ్ ఉన్న సబ్స్క్రైబర్లు.. జాగ్రత్త.. ఇలా చేస్తే Cyber Crime: కేవైసీ అప్డేట్ చేస్తున్నారా?! పొరపాటున ఇలా చేశారో.. అంతే ఇక! -
ఒంటరిగా ఉన్నారా? భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నారా అంటూ వల..
డిజిటల్ మాధ్యమం ద్వారా ఖాతాలలోని డబ్బును దొంగిలించడానికి ఎస్సెమ్మెస్ ఫార్వర్డింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్నారు మోసగాళ్లు. ఎస్సెమ్మెస్ ల ద్వారా మీ ఖాతాలో లక్షల రూపాయలు బదిలీ అవుతున్నాయనో, ఎలక్ట్రిసిటీ బిల్లు, పాన్‌కార్డ్, క్రెడిట్‌కార్డ్ .. వంటివి అప్డేట్ చేసుకోవడానికి వివరాలను పూరింపమని వచ్చే సంక్షిప్త సందేశాల పట్ల జాగ్రత్త పడటం మంచిది. డిజిటల్‌గా చెల్లింపుల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇది ఆన్లైన్ మోసానికి మరింత హాని చేస్తుంది. ఆన్లైన్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు గత కొన్నేళ్లుగా జీవితాలను సులభతరం చేశాయి. మెజారిటీ కస్టమర్లు, చిల్లర దుకాణాలు, బడ్డీకొట్ల వాళ్లు కూడా ఈ చెల్లింపు పద్ధతులను ఇష్టపడుతున్నారు. స్కామర్లు మనదేశంలోని వ్యక్తులను మోసం చేయడానికి ఎస్సెమ్మెస్ ఫార్వార్డింగ్ యాప్‌లను ఉపయోగిస్తారు. వాటిలో చాలా వరకు స్కామ్‌లు ఫిషింగ్ మోసాలకు దారితీస్తున్నాయి. అంతేకాకుండా స్కామర్లు అందించిన షార్ట్ లింక్‌లను బాధితులు క్లిక్ చేసిన తర్వాత మాల్వేర్ ఇన్స్టాల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. స్కామర్లు ఉపయోగించేవి: బాధితుడి నమ్మకం, అజ్ఞానం, భయం, దురాశ, అత్యవసరం.. ఇవే మోసగాళ్లకు పెట్టుబడి. మోడల్ 1 : డబ్బు క్రెడిట్ ఉదాహరణకు: మీ అకౌంట్లోకి రూ. 3,3000 క్రెడిట్ అవుతుంది. మీ వివరాలను తక్షణమే నమోదు చేయండి. అందుకు వెంటనే తనిఖీ చేయండి... అంటూ ఓ లింక్ ఇస్తారు. మీరు అలాంటి మెసేజ్ చదివినా కానీ, అక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయకూడదని గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఆ లింక్ మీ డబ్బును దోచుకోవడానికి ఒక మార్గం కావచ్చు. మోడల్ 2 : విద్యుత్ బిల్లు నోటిఫికేషన్ ప్రియమైన కస్టమర్, మీ మునుపటి నెల బిల్లు అప్డేట్ కానందున ఈ రాత్రి 8:30 లకు ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నుండి మీ ఎలక్ట్రిసిటీ పవర్ డిస్కనెక్ట్ చేయబడుతుంది. దయచేసి వెంటనే అధికారిని సంప్రదించండి 8240471159.. ధన్యవాదాలు అనే మెసేజ్ వస్తుంది. మోడల్ 3 : పాన్‌కార్డ్ అప్డేట్ ప్రియమైన వినియోగదారు మీ యోనో ఎస్బిఐ నెట్ బ్యాంకింగ్ ఖాతా ఈరోజు సస్పెండ్ చేయబడుతుంది. దయచేసి మీ పాన్ కార్డ్‌ని అప్డేట్ చేయండి. అందుకు ఇక్కడ లింక్ క్లిక్ చేయండి http://bit y. wr/wkx822222 అని ఉంటుంది. మోడల్ 4 : క్రెడిట్ కార్డ్ బకాయి ‘‘ప్రియమైన కస్టమర్, దయచేసి మీ కార్డ్ బకాయి మొత్తాన్ని చెల్లించండి. మా పోర్టల్‌లో డిజిటల్ మోడ్‌లను ఉపయోగించి 0003తో ముగిసే మీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 2786.74 లేదా కనీస మొత్తం రూ. 140/– చెల్లించండి. అందుకు http://nmc. rf /kojkBGGGG. ఇప్పటికే చెల్లించినట్లయితే ఈ సందేశాన్ని మర్చిపోండి. UPI చెల్లింపు వీడియోను bit. y/2qKYXb88888లో, VPA ID ఈ వీడియోను bit. ly.2JJQr9KKKKKలో చూడండి’’అనే మెసేజ్ ఉంటుంది. మోడల్ 5 : రొమాన్స్ ఫ్రాడ్ ‘మీరు మీ జీవితంలో ఒంటరిగా ఉన్నారని భావిస్తున్నారా, ఒక మధురమైన కాల్ మీ కలలను సాకారం చేయగలదు, స్నేహం డేటింగ్ భాగస్వామి మీ కోసం వేచి ఉన్నారు. కాల్ చేయండి’ అంటూ నెంబర్ ఇస్తారు. మోడల్ 6 : డిపాజిట్ మోసం ‘అనుకోకుండా మీ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయబడింది, దయచేసి తిరిగి చెల్లించండి’ అని మెసేజ్‌లో ఉంటుంది. మోడల్ 7 : లాటరీ మోసాలు ‘మీ మొబైల్ నంబర్ లాటరీలో రూ. గెలుచుకున్నమొత్తం 1.85 కోట్లు, అమెరికా నుంచి కారును పంపుతున్నాం, క్లెయిమ్ చేయడానికి మీ పేర్లు, మొబైల్ నంబర్, చిరునామా.. వివరాలతో ప్రత్యుత్తరం పంపండి’ claim4222837@gmail.comఅని మెసేజ్‌లో ఉంటుంది. గమనించగలరు. చిట్కాలు 1. తెలిసిన మూలాల ద్వారా పంపబడినప్పటికీ,www.unshorten.it ఉపయోగించి సంక్షిప్త URL / లింక్‌లను ధ్రువీకరించండి. 2. క్లిక్ చేసే ముందు వెబ్‌లింక్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. దాని ఫిషింగ్ లింక్ కాదని నిర్ధారించడానికి www.isitphishing.org లేదా www.urlvoid.com ఉపయోగించి అన్ని లింక్‌లను ధ్రువీకరించండి. 3. ఇ–మెయిల్ ద్వారా సున్నితమైన, వ్యక్తిగత లేదా యాజమాన్య సమాచారాన్ని ఎవరు అడుగుతున్నారో దానితో సంబంధం లేకుండా ఎప్పుడూ పంపకండి. 4. https://dnschecker.org/email-header-analyzer.php ని ఉపయోగించి ఇమెయిల్ యొక్క పూర్తి సారాంశాన్ని తనిఖీ చేయండి 5. మీ ఇ–మెయిల్ లేదా ఎస్సెమ్మెస్ మొత్తం తప్పులతో కూడిన స్పెల్లింగ్స్, సరైన విధంగా లేని వ్యాకరణాన్ని గమనించవచ్చు. 6. వ్యక్తిగత సమాచారం కోసం అడిగే లింక్‌లు / ఫారమ్‌లు (పాస్వర్డ్లు – బ్యాంక్ సమాచారం) ఉంటాయి. 7. సెర్చ్ ఇంజిన్లలో కస్టమర్ కేర్ నంబర్ల కోసం ఎప్పుడూ వెతకవద్దు. సరైన కస్టమర్ కేర్ నంబర్ కోసం సంబంధిత యాప్ లేదా సంబంధిత అప్లికేషన్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి. 8. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం లేదా OTP, UPIN, బ్యాంక్ CVV నంబర్లను ఇవ్వడం అంటే మీరు మీ ఖాతా నుండి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని, మీకు రావడం లేదని అర్థం. 9. అన్ని సోషల్ మీడియా, బ్యాంకింగ్, ఇ–మెయిల్ ఖాతాల కోసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA)ని ప్రారంభించండి. 10. బ్యాంకింగ్ లావాదేవీలు చేస్తున్నప్పుడు లేదా సోషల్, ఇ–మెయిల్ ఖాతాలకు లాగిన్ చేస్తున్నప్పుడు మీ స్క్రీన్‌ను ఎప్పుడూ షేర్ చేయవద్దు. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Cyber Crime: కేవైసీ అప్డేట్ చేస్తున్నారా?! పొరపాటున ఇలా చేశారో.. అంతే ఇక! Cyber Crime Prevention Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ ఉందా?! ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు -
5జీ ఫోన్లలో.. 4జీ సిమ్ కార్డ్ ఉన్న సబ్స్క్రైబర్లు.. జాగ్రత్త! ఇలా చేశారంటే
Cyber Crime Prevention Tips In Telugu: టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా కొన్నాళ్లుగా మనందరం అధికంగా వింటున్న పేరు 5జీ. అంతేస్థాయిలో 5జీ పేరుతో మోసాలూ జరుగుతున్నాయి. టెక్నాలజీని అర్థం చేసుకోవడం, ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండటానికి మనం ఎంత అలెర్ట్‌గా ఉంటే, అంత సురక్షితంగా ఉండగలం. 5జీ నెట్వర్క్ ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో విడుదలవుతుంది. ఆ తర్వాత ఇతర నగరాల్లోనూ అందుబాటులో ఉంటుంది. నాన్స్టాండ్అలోన్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి ప్రారంభించడానికి అంటే, ఇప్పటికే ఉన్న 4జీ సాంకేతికతను ఉపయోగించి, ఆపై క్రమంగా స్టాండ్అలోన్ నెట్వర్క్ (5జీ) వైపు వెళతారు. మెరుగైన కవరేజ్.. 5జీలో తక్కువ ఫ్రీక్వెన్సీ, మెరుగైన కవరేజీ, లో స్పీడ్.. ఉంటుంది. ఇప్పటికే 5జీ ఫోన్లు ఉండి, 4జీ సిమ్ కార్డ్ ఉన్న సబ్స్క్రైబర్లు కొత్త 5జీ సిమ్ కార్డ్‌ల కోసం వెతకనవసరం లేదు, ఎందుకంటే టెక్నాలజీ ఆపరేటర్లు 4జీ నెట్‌వర్క్‌నే ఉపయోగిస్తున్నారు. అయితే టెలికాం ప్రొవైడర్లు స్టాండ్అలోన్ నెట్వర్క్కి అప్‌గ్రేడ్ చేసిన తర్వాత, ఆపై కస్టమర్లు కొత్త 5జీ సిమ్ కార్డ్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. మోసాలు జరిగే విధానం.. 5జీ పేరుతో జరిగే వాటిలో సిమ్ స్వాప్ మోసాలు ప్రధానమైనవి. ఆన్లైన్ మోసగాళ్ళు తమను తాము ఈ నెట్వర్క్కి ఫోన్కంపెనీల పేర్లు చెప్పి, వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పరిచయం చేసుకుంటున్నారు. సిమ్ కార్డ్‌లను 4జీ నుండి 5జీకి అప్డేట్ చేస్తామని చెబుతున్నారు. ఆ తర్వాత, వారు పంపిన మెసేజ్‌ల్లోని చిన్న లింక్‌పై క్లిక్ చేస్తే వచ్చిన ఓటీపీని సెండ్ చేయమని అడగవచ్చు. ధ్రువీకరణ తర్వాత, ఆపరేటర్ నిజమైన బాధితుడి సిమ్‌ను డియాక్టివేట్ చేస్తాడు. దీనికి బదులుగా కొత్త సిమ్ కార్డ్‌ను జారీ చేస్తాడు. టెలికాం వినియోగదారులను సిమ్ అప్‌గ్రేడ్ సాకుతో తమని తాము పరిచయం చేసుకుంటారు. సిమ్‌కార్డ్ మార్పిడి, ఆఫర్లతో వల వేయడం, పోర్టబిలిటీకి సంబంధించి ఓటీపీలు రాబట్టేలా చేస్తారు. మన వివరాలను అందించిన తర్వాత సిమ్ అప్‌గ్రేడ్‌కు బదులుగా బ్యాంక్ ఖాతా నుంచి నగదును మోసగాడు తన ఖాతాకు డెబిట్ అయ్యేలా చేస్తాడు. అందుకే, ఇలాంటివేవీ నమ్మకూడదు. నెట్వర్క్ సామర్థ్యాలు 5జీ గరిష్ట డేటా 10 జీబీపీఎస్‌కి చేరుకుంటుంది. ఇండోర్, అవుట్డోర్ పరిసరాలలో ఈ రీచ్ ఎక్కువ ఉంటుంది. ∙డేటా కనీసం 10 ఎమ్‌బీపీఎస్ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో విస్తృత ఏరియా కవరేజ్ కోసం 100 ఎమ్‌బిపిఎస్, ఇండోర్‌లో 1 జీబీపీఎస్ వరకు ఉంటుంది. 5జీ ఉన్న కస్టమర్లు కార్లు, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వారి ఫోన్లలో 4జీ వీడియోను ఆటంకం లేకుండా చూడవచ్చు. కంప్యూటర్ గేమ్స్ , ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటివి మరింతగా అందుబాటులోకి వచ్చేస్తాయి. ఈ సాంకేతికత ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య, విపత్తుల సమయంలో సహాయం.. వంటి వాటితో సహా వివిధ రకాల పరిశ్రమలపైనా ప్రభావాన్ని చూపుతుంది. 5జీ అప్లికేషన్లతో విపత్తు ప్రభావిత ప్రాంతాలపై రిమోట్ నియంత్రణ, బహిరంగ ప్రదేశాల్లో ఇన్స్టాల్ చేయబడిన హెచ్డి కెమెరాల నుండి ప్రత్యక్ష 4ఓ ఫీడ్... వంటివి సులభం అవుతాయి.. ఈ టెక్నాలజీ ప్రతి పనిలో మనుషుల పాత్రను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. భద్రత కోసం చిట్కాలు ఇప్పటికే ఉన్న 5జీ సేవలను ఉపయోగించడానికి మీ ప్రస్తుత 4జీ సిమ్ కార్డ్‌ని అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ∙ఫోన్ కాల్లో ఉన్నప్పుడు ఎటువంటి లావాదేవీలు చేయవద్దు. ∙యాప్‌లను డౌన్లోడ్ చేయమని లేదా యాప్‌లు / ఖాతాలను అప్డేట్ చేయమని మిమ్మల్ని అభ్యర్థించే ఎలాంటి అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలను అందించవద్దు. ఎప్పుడూ, ఓటీపీని ఎవరితోనూ షేర్ చేయవద్దు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవద్దు. అలా చేస్తే మన బ్యాంక్ ఖాతాల నుండి డబ్బు డెబిట్ అవుతుంది. చిన్న లింక్స్, సందేశాలను ధ్రువీకరించకుండా వాటిపై క్లిక్ చేయవద్దు. 5జీ పేరుతో ఎవరైనా మిమ్మల్ని మోసగిస్తే వెంటనే మీ స్థానిక సైబర్ క్రైమ్ పోలీసు అధికారులకు స్కామ్‌ను నివేదించండి. http://www.cybercrime.gov.in లో ఫిర్యాదునునమోదు చేయండి లేదా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి డయల్ చేయండి. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఎన్హెచ్ఏఐ కొత్త కార్యాచరణ.. పార్కింగ్ స్థలం లేకపోతే మూతే
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. జాతీయ రహదారులను ఆనుకుని ఉండే దాబాలు, హోటళ్లకు విధిగా పార్కింగ్ స్థలాలు ఉండాలని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా తగినంత పార్కింగ్ ప్రదేశాలు లేని దాబాలు, హోటళ్లను తొలగించాలని కూడా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి రోడ్డు ప్రమాదాల తీరును ఎన్హెచ్ఏఐ విశ్లేషించింది. జాతీయ రహదారులపై ఓ పక్కకు నిలిపి ఉంచే వాహనాలను ఇతర వాహనాలు ఢీకొట్టడమే ఎక్కువ ప్రమాదాలకు కారణమని గుర్తించింది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దాబాలు, హోటళ్లకు సమీపంలోనే ఎక్కువగా వాహనాలను నిలిపి ఉంచుతున్నట్టు కూడా ఎన్హెచ్ఏఐ పరిశీలనలో వెల్లడైంది. దాంతో హైవేల వెంబడి ఉన్న దాబాలు, హోటళ్లకు తగినంత పార్కింగ్ ప్రదేశాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ హైవేల వెంబడి ఉన్న దాబాలు, హోటళ్లను గుర్తించి పార్కింగ్ ప్రదేశాలపై నివేదిక సమర్పించాలని కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని హైవేలను ఆనుకుని ఉన్న దాబాలు, హోటళ్లపై ఎన్హెచ్ఏఐ అధికారులు చేపట్టిన సర్వే దాదాపు పూర్తి కావచ్చింది. చదవండి: (అల్లూరి విగ్రహావిష్కరణ: రచ్చ చేయబోయి.. చతికిలపడ్డ టీడీపీ) పార్కింగ్ లేకుండా 40 శాతం దాబాలు, హోటళ్లు రాష్ట్రంలో దాదాపు 40 శాతం దాబాలు, హోటళ్లకు పార్కింగ్ స్థలాలు లేవని సర్వేలో తేలినట్టు సమాచారం. ఆ దాబాలు, హోటళ్లకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. మూడు నెలల్లో పార్కింగ్ ప్రదేశాలు సమకూర్చుకోవాలని నిర్దేశించనున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని 7.50 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. అంటే రోడ్డుకు దాబా, హోటళ్లకు మధ్య కనీసం 7.50 మీటర్ల దూరం ఉండాలి. ఆ మధ్యలో పార్కింగ్ ప్రదేశాన్ని చూపించకూడదు. దాబాకు పక్కన పార్కింగ్ ప్రదేశాన్ని వేరేగా చూపించాలి. దాబాలు, హోటళ్ల వద్ద తగిన లైటింగ్ సదుపాయం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. తెల్లవారుజామున మంచు కురుస్తున్నప్పుడు కూడా వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఫాగ్ లైట్లను ఏర్పాటు చేయాలి. తప్పనిసరిగా టాయిలెట్లు, స్నానాల గదులు ఉండాలి. ప్రతి దాబా, హోటల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండాలి. ఆ సమీపంలోని ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్ల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలి. మూడు నెలల్లో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయని దాబాలు, హోటళ్లను మూసివేయిస్తారు. -
ఇష్టానుసారంగా ఆన్లైన్ సేవలు.. మీ పాస్వర్డ్ ఎంత సేఫ్.. ఇలా చేశారంటే!
Cyber Crime Prevention Tips: ఇ–మెయిల్, సోషల్‌మీడియా, బ్యాంకింగ్, ఫైల్ షేరింగ్, ఇ–కామర్స్.. ఇలా ప్రతిదానికి రకరకాల పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకుంటాం. వాటిలో సురక్షితమైన పాస్‌వర్డ్‌లను ఎంచుకోవడం, నిర్వహించడం కష్టంగా అనిపిస్తుంటుంది. కానీ, ఈ రోజుల్లో సేఫ్టీ పాస్వర్డ్ మేనేజ్మెంట్ను సరిగ్గా నిర్వహించకపోతే చిక్కులు తప్పవు. డిజిటల్ చెల్లింపులు పెరిగిన ఈ రోజుల్లో పాస్వర్డ్ నిర్వహణ లోపిస్తే అధికమొత్తంలో నగదును నష్టపోవాల్సి రావచ్చు. వీరిలో గృహిణులు, వయోజనుల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు నివేదికలు కూడా ఉన్నాయి. తమ పాస్‌వర్డ్‌ను ఇతరులకు చెప్పడం ఎంత నష్టమో, సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా అకౌంట్స్‌ను నిర్వహించడం కూడా అంతే నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి, ఆన్లైన్ సేవలు పొందేవారు ఇష్టానుసారంగా కాకుండా తప్పనిసరి భద్రతా చర్యలు కూడా తీసుకోవాలి. పటిష్టం చేసే విధానం... పాస్‌వర్డ్‌లో కనీసం 8 అక్షరాలు ఉండాలి. లాగిన్ చేసిన ప్రతి సైట్‌కి ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను రూపొందించడానికి బేస్, పిన్ విధానాన్ని ఉపయోగించడం శ్రేయస్కరం. ఉదాహరణకి.. primevideo.com ని లాగిన్ చేస్తున్నారనుకుంటే దానికి బేస్ 'rime@', పిన్ ’'home@321' సెట్ చేసుకోవచ్చు. కొత్త పాస్‌వర్డ్‌ను రూపొందించడానికి పాస్వర్డ్ జనరేటర్ సాధనాన్ని ఉపయోగించవచ్చు. వీటిలో చాలా వరకు సర్వీస్ ప్రొవైడర్లు డిఫాల్ట్‌గా అందిస్తాయి. పాస్వర్డ్ మేనేజర్ అప్లికేషన్లు, ఆన్లైన్ సేవల కోసం, పాస్‌వర్డ్‌లను నిల్వ చేయడానికి, రూపొందించడానికి, నిర్వహించడానికి వినియోగదారులను అనుమతించే ప్రోగ్రామ్ పాస్వర్డ్ మేనేజర్. పాస్‌వర్డ్‌లను రూపొందించడంలో, తిరిగి పొందడంలో, వాటిని ఎన్క్రిప్టెడ్ డేటాబేస్‌లో నిల్వ చేయడం, డిమాండ్‌పై ఉపయోగించడంలో ఇది సహాయం చేస్తుంది. అత్యున్నత స్థాయి భద్రతను అందించే చాలా సేవలు ఆర్మీ గ్రేడ్ ఎఇఎస్256–ఎన్క్రిప్షన్ని కలిగి ఉంటాయి. మూడు రకాల పాస్వర్డ్ మేనేజర్లు... 1. ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్. 2. ఇంటర్నెట్ కనెక్షన్‌తో ఏదైనా కంప్యూటర్ లేదా పరికరం నుండి యాక్సెస్ చేయవచ్చు. మీ ఆధారాలను నిల్వ చేయడానికి అనుమతిస్తుంది. 3. మీ ఆధారాలను నిల్వచేయడానికి హార్డ్‌వేర్ పరికరంలో ఇన్స్టాల్ అయి ఉంటుంది. పాస్వర్డ్ మేనేజర్ని ఉపయోగించడం వల్ల... 👉🏾మీ అన్ని ఆధారాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. 👉🏾నకిలీ లాగిన్ సందర్భంలో మీకు సమాచారం తెలియజేస్తుంది. 👉🏾మీ ఆధారాలను సులభంగా మార్చుకోవచ్చు. 👉🏾ఇతర గ్యాడ్జెట్స్లోనూ ఒకే పాస్‌వర్డ్‌ను నిర్వహించవచ్చు. కొన్ని ప్రముఖ పాస్వర్డ్ మేనేజర్లు (a)lastpass.com (b) keepass.info (c) keepersecurity.com (d) pwsafe.org (e) dashlane.com రెండు కారకాల ప్రమాణీకరణ 👉🏾రెండు దశలు లేదా ద్వంద్వ కారకాల ప్రమాణీకరణగా కూడా సూచిస్తుంది. ఇది భద్రతా ప్రక్రియ. దీనిలో వినియోగదారులు యాక్సెస్‌ని «ధ్రువీకరించడానికి రెండు వేర్వేరు ప్రమాణీకరణ కారకాలను అందిస్తారు. 👉🏾2ఎఫ్ఎ ఫిషింగ్ వ్యూహాలను ఉపయోగించి పరికరాలు లేదా ఆన్లైన్ ఖాతాల వివరాలను సేకరించి, దాడి చేసేవారికి కష్టంగా ఉండేలా ప్రామాణీకరణ ప్రక్రియకు అదనపు భద్రతను జోడిస్తుంది. 👉🏾ప్రతి 30 సెకన్లకు కొత్త సంఖ్యా కోడ్‌ను అందించే హార్ద్‌వేర్ సాధనాలను హార్డ్‌వేర్ టోకెన్ అంటారు. 👉🏾ఎసెమ్మెస్ టెక్ట్స్ మెసేజ్, వాయిస్ ఆధారిత సందేశం ద్వారా వినియోగదారునకు ఓటీపీ పంపుతుంది. 👉🏾సాఫ్ట్వేర్ టైమ్ ఆధారంగా జనరేట్ అయ్యే టివోటీపి పాస్‌కోడ్ కూడా పంపుతుంది. ∙పోర్టల్స్, అప్లికేషన్లు వినియోగదారునకు ఒక ఫుష్ నోటిఫికేషన్‌ను ప్రామాణీకరణగా పంపుతాయి. ఇక్కడ వినియోగదారుడు ఒకే టచ్‌తో యాక్సెస్‌ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. రెండు దశల ధ్రువీకరణ 👉🏾వినియోగదారుడి గ్యాడ్జెట్‌కు పంపిన పాస్వర్డ్, ఓటీపీ రెండింటినీ నమోదు చేయాలి. రెండు కారకాల ప్రామాణీకరణలో ఉపయోగించిన పద్ధతులలో ఫేసియల్ స్కాన్ టెక్నాలజీతో ఉంటాయి. అలాగే, వీటిని వేలిముద్ర స్కాన్‌తో యాక్సెస్ చేయవచ్చు. పాస్‌వర్డ్‌లను సురక్షితంగా ఉంచుకోవడానికి... మీ లాగిన్ ఆధారాలను నోట్‌బుక్‌లో రాసుకొని, ట్రాక్ చేసుకోవచ్చు. ∙మీ పాస్వర్డ్లు దొంగిలించబడ్డాయో లేదో ఈ కింది వెబ్సైట్లలో తనిఖీ చేసుకోవచ్చు. (a) passwords.google.com (b) haveibeenpwned.com (c) snusbase.com (d) avast.com/hackcheck 👉🏾మీ పాస్‌వర్డ్‌లో సాధారణ పదాలు, అక్షరాల కలయికలు లేకుండా చూడాలి. అంటే– పాస్వర్డ్, వెల్కమ్, సిటీ నేమ్, పెట్ నేమ్, ఇంటిపేరు... మొదలైనవి. 👉🏾పాస్వర్డ్ పొడవు 8 అక్షరాల్లో ఉండాలి. 👉🏾ప్రత్యేక అక్షరాలు, సంఖ్యలు, పెద్ద అక్షరాలను ఉపయోగించాలి. 👉🏾ప్రతి మూడు నెలలకోసారి మీ పాస్‌వర్డ్‌ని మార్చుకుని, రీ సెట్ చేసే అలవాటును పెంచుకోవాలి. 👉🏾మీ పాస్‌వర్డ్‌లను రీ సైకిల్ చేయవద్దు. కొత్త పాస్‌వర్డ్‌ను రూపొందించమని అడిగిన ప్రతిసారి కొత్త సిరీస్‌ను ఎంచుకోవాలని నిర్ధారించుకోండి. 👉🏾ఎసెమ్మెస్ ధృవీకరణతో రెండు కారకాల ప్రమాణీకరణ (2ఎఫ్ఎ) ఉపయోగించాలి. 👉🏾పెయిడ్ పాస్వర్డ్ మేనేజర్‌ను ఉపయోగించడం మేలు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
రూ. 225కే కోవిడ్ ప్రికాషన్ డోస్
న్యూఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా మొదలయ్యే కరోనా టీకా ప్రికాషన్ డోస్‌ను రూ.225కే ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. ‘కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కోవిషీల్డ్ టీకా ఒక్కో డోస్ ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించాం’అని ఎస్ఐఐ సీఈవో అథర్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు. అదేవిధంగా, ‘మా సంస్థ తయారు చేసే కోవాగ్జిన్ టీకా ఒక్కో డోస్‌ను ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,200కు బదులుగా రూ.225కే అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నాం’అని భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా వెల్లడించారు. 18 ఏళ్లు నిండి, రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారంతా 10వ తేదీ నుంచి ప్రైవేట్ టీకా కేంద్రాల్లో కోవిడ్ ప్రికాషన్ డోస్‌కు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
కడుపు ఉబ్బరంగా ఉందా?.. ఇదిలో ఇలా ట్రై చేయండి
కడుపు ఉబ్బరంగా ఉందని చాలా మంది డాక్టర్లను సంప్రదించడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఎందుకంటే ఈ సమస్య ఉన్నప్పుడు ఏ పనీచేయలేం. స్థిమితంగా ఉండలేం. మన జీవనశైలి వల్లే ఈ సమస్య వచ్చిందని గ్రహించి, అందుకు అనుగుణమైన మార్పు చేర్పులు చేసుకోవడం అవసరం. ఎక్కువ సేపు ఒకేచోట కూర్చుని పని చేయడం, శారీరక వ్యాయామం లేకపోవడం, అతి నిద్ర లేదా అసలు నిద్రలేకపోవడం, కొన్ని వ్యాధులకు వాడే మందుల వల్ల జీర్ణాశయంలో, పేగుల్లో కొన్ని సూక్ష్మ జీవుల వల్ల గ్యాస్ ఏర్పడుతుంది. లక్షణాలు పొట్ట ఉబ్బరం, ఆహారం తీసుకున్న తర్వాత ఆయాసం, కడుపులో నొప్పి, గుండెలో మంట, తేన్పు రావడానికి ఇబ్బంది, తిననప్పుడు కూడా కడుపు ఉబ్బరించుకోవడం. నడవడానికి కూడా ఇబ్బంది. నివారణ ఇలా... కడుపు ఉబ్బరాన్ని నివారించడంలో వ్యాయామం ముఖ్యమైంది. రోజు 40 నిమిషాలు ఉదయం లేక సాయంత్రం బ్రిస్క్‌వాక్ చేయాలి. నీళ్లు తగినన్ని తాగాలి. కుదిరితే స్విమ్మింగ్ చేయడం లేదా స్కిప్పింగ్ చేయడం అంటే తాడాట ఆడటం మంచిది. తిన్న వెంటనే పడుకోకుండా కొద్ది దూరం ఇంట్లోనే నడవాలి. గ్యాస్ ఎక్కువ చేసే పదార్థాలు, మసాలా తగ్గించాలి. మద్యం సేవించకూడదు. వేళకు ఆహారం తీసుకోవాలి. చికిత్స ఇది... ►ఒక గ్లాస్ నీటిలో నాలుగైదు చిన్న చిన్న అల్లం ముక్కలు వేసి ఆ నీటిని బాగా మరిగించి కొద్దిగా వేడిగా ఉండగానే ఆ నీటిని తాగేయాలి. ►అల్లం ముక్కలను దంచి రసం తీసి ఆ రసాన్ని తేనెతో కలిపి తాగినా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చెంచాడు వాము తీసుకుని అందులో కొంత ఉప్పు వేసి బాగా నలిపి ఆ మిశ్రమాన్ని తిని, నీరు తాగాలి. ►గ్లాసు నీరు లేదా తేనె, లేదా నిమ్మరసం లో కొద్దిగా బేకింగ్ సోడాను కలిపి తాగితే గ్యాస్ సమస్య తగ్గుముఖం పడుతుంది. ∙గ్లాస్ నీళ్లలో కొన్ని సోంపు గింజలను వేసి మరిగించి.. ఆ నీటిని వడకట్టి వేడిగా ఉండగానే తాగితే గ్యాస్ ఏర్పడకుండా ఉంటుంది. ►ఆకలి లేకపోవటం వల్ల పొట్ట ఉబ్బరిస్తుంటే జీలకర్రను దోరగా వేయించి, పొడిచేసి, అరచెంచాడు నుంచి చెంచాడు మోతాదుగా భోజనానికి ముందు అరకప్పు వేడినీళ్లతో తీసుకోవాలి. వాము, అల్లం, జీలకర్రను సమ భాగాలుగా తీసుకొని సైంధవ లవణం కలిపి నూరి ఉదయం, సాయంకాలాలు పుచ్చుకోవాలి. నిరంతరం కడుపుబ్బరంతో బాధపడేవారు భోజనానికి ముందు రెండు, మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకొని తింటుండాలి. -
తలకొట్టేసినట్టు అయ్యింది.. ఆ ఫొటోలు, వీడియోలను ఎలా తొలగించాలి?
Cyber Crime Preventing Tips: ‘సోనీ తింటున్నప్పుడు కూడా ఆ ఫోన్ ఎందుకు’ అరిచిన అమ్మ మీద విసుక్కుంది సోనీ. ఆఫీసు నుంచి వచ్చిన సోనీ తండ్రి భార్య మీద కోప్పడ్డాడు ‘తల్లిగా కూతురుకి ఏది మంచిదో, కాదో చెప్పలేవా... సోషల్ మీడియాలో ఏంటా ఫొటోలు. నాకు ఆఫీసులో తలకొట్టేసినట్టుగా అయ్యింది తెలుసా!’ అని అరిచాడు. ఆ మాటలకు ‘ఇదేమైనా నేనొక్కదాన్నే చేస్తున్నానా.. ఎంత మంది ఎలా ఉంటున్నారో చూడట్లేదా?’ అని తండ్రిని ఎదురు ప్రశ్నించింది సోనీ. ప్రశాంతంగా ఉన్న కుటుంబ వాతావరణం ఒక్కసారిగా విసుగులు, చిరాకులు, గొడవలవైపుగా సాగింది సోషల్‌మీడియా కారణంగా. ఇదొక్కటే కాదు... ఈ రోజుల్లో ఏం చేసినా, ఏం చెప్పినా, ఎలా ఉన్నా.. లేచిన దగ్గర నుంచి పడుకునేవరకు సోషల్ మీడియా ప్రపంచంలో తిరిగేవారే ఎక్కువ. అలాంటి ఈ ప్రపంచంలో దారి తెన్నూ లేకుండా తిరిగితే అభాసుపాలవడం ఖాయం. మరెలా ఉండాలి?! అనే ప్రశ్న మీదైతే.. సమాధానాలు ఇవే! ప్రతికూలతలు వ్యక్తులు, సంస్థలు, రాజకీయ నాయకులతో సహా సమాజంలోని అన్ని వర్గాల నుండి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను చూస్తున్నాం. అందుకే, భద్రత అనే విషయమై సోషల్ మీడియాను సెన్సార్ చేయాలనే ఆలోచనలకు పునాది రాయి పడింది. వినియోగదారులు తమ సైట్లలో, సామాజిక మాధ్యమాలలో వారి వ్యక్తిగత సమాచారాన్ని అందజేస్తుంటారు. తర్వాత ఉపయోగించడానికి సేవ్ చేస్తారు. అంటే, ఈ చర్యలన్నీ ప్రతి ప్రవర్తనా అంశం డాక్యుమెంట్ చేయడానికి వీలుగా, వాణిజ్య మాధ్యమానికి ఉపయోపడేలా ఉంటుంది. కంపెనీలు మీరు వాడిన పదాలు, చర్యలు, సంభాషణలు, ఫొటోలను దొంగిలించి, వాటిని సందర్భం లేకుండా అనాలోచితంగా పబ్లిక్ చేసేయొచ్చు. ఆ చిత్రాలు, వీడియోలను ఎలా తొలగించాలి... గూగుల్: సెట్టింగ్‌లపై క్లిక్ చేయండి. అందులో తొలగింపు ఆప్షన్‌ను ఎంచుకొని, దానిపై క్లిక్ చేయండి. ట్విటర్ : https://support.twitter.com/%20form/private_information ఫేస్బుక్: ఫొటో/వీడియోపై క్లిక్ చేసి, ఎగువ కుడివైపు ఉన్న డ్రాప్ డౌన్ చేయండి. ‘నా ఈ ఫొటో నచ్చలేదు. ఈ పోస్ట్‌ని నిషేధించండి’ పైన క్లిక్ చేయండి. సంబంధిత ఎంపికను ఎంచుకోండి అంటే ‘అది ఫేస్బుక్లో ఉండకూడద’ని అనుకుంటున్నాను’ అనే విషయం క్లియర్ అయిపోతుంది. యూ ట్యూబ్: ప్లేయర్ దిగువన ‘మోర్’ అనే బటన్‌పై క్లిక్ చేసి, డ్రాప్‌డౌన్ మెనూలో రిపోర్ట్ బటన్‌ను క్లిక్ చేయండి. వీడియో ఉల్లంఘనకు సరిపోయే కారణంపై క్లిక్ చేయండి. టాప్ 10 మర్యాదలు: ►మీ సోషల్ మీడియాలో ఏది బాగుంది అనే దాని ఆధారంగా ‘ఎక్కడ ఆహారం తినాలో’ నిర్ణయించుకోవద్దు. ఇతరుల పోస్టింగ్‌లో వివిధ రకాల డ్రెస్సులు చూసి, వాటిని కొనుగోలు చేయాలనుకోవద్దు. సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడం కోసం జిమ్ లేదా వ్యాయామశాలలో అతిగా వ్యాయామాలు చేయాలనుకోవద్దు. ►మీకు హాస్యం అనిపించేది ఇతరులకు హాస్యం కాకపోవచ్చు. వ్యక్తీకరణలో జాగ్రత్త అవసరం. ఉపయోగంలో లేనప్పుడు అన్ని సోషల్ మీడియా అప్లికేషన్లను లాగ్ ఆఫ్ చేయడం అత్యుత్తమం. లేకపోతే మీ స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్లు విడుదల చేసే సమాచారం వ్యసనానికి దారితీయడమే కాకుండా చాలా పరధ్యానాలకు కారణమవుతుంది. ►మీరు ప్రతికూలంగా భావించే విషయాలను పోస్ట్ చేసే ఖాతాలను అనుసరించడం వలన మీపైన కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ►నిజ జీవితంలోనే ఇప్పటికే తగినంత పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఆన్లైన్ ప్రపంచం లో పోటీ పడటం అంతగా అవసరం లేదు. మీ ఇష్టాలు మీ వ్యక్తిత్వానికి ►ప్రతిబింబం కాదని గుర్తుంచుకోవాలి. ఆఫ్‌లైన్–ఆన్లైన్ రెండింటినీ ఒకేవిధంగా పరిగణించాలి. ►మిమ్మల్ని ఇతరులు ఎలా చూడాలని కోరుకుంటున్నారో, మీ సోషల్ మీడియా యాక్టివిటీ ఆధారంగా ఇతరులు మిమ్మల్ని అలాగే చూస్తారని అది ప్రతిబింబం అని గుర్తించాలి. ►మీ వ్యాఖ్యలను ఇష్టపడనివారు, బెదిరింపులకు పాల్పడేవారు, ప్రతికూల వ్యాఖ్యలను వెలువరించేవారితో డిస్కనెక్ట్ అవడం మంచిదే అని నిర్ధారించుకోండి. మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని నిర్లక్ష్యం చేసేంతగా వర్చువల్ ప్రపంచంలో కోల్పోకండి. మీ పుట్టినరోజుకు సోషల్‌మీడియాలో ఒక లైక్ ఇవ్వని స్నేహితుడు, మిమ్మల్ని నేరుగా కలిసి కరచాలనం చేస్తారు. ►అభివృద్ధి వైపుగా ప్రయాణించే క్రమంలో కొత్త లోకం చూడాలనుకున్నట్టే, అక్కడ కొత్త సమస్యలు కూడా ఎదురవుతాయి. మన గోప్యతా సెట్టింగ్‌లు మనమేంటో చూపుతాయి. ►సమాజంలోని వారితో మనల్ని మనం పరిచయం చేసుకోవడానికి వ్యక్తిగత వివరాలు, నమ్మకాలు, ప్రాధాన్యాలు స్వచ్ఛందంగా బహిర్గతం చేస్తుంటాం. అందుకు సంబంధించిన కంటెంట్ కూడా అనేక అంశాలలో చాలా సులువుగా సందర్భోచితంగా ఉంటుంది. మనలో చాలా మంది సోషల్ మీడియా ఖాతాలను పూర్తిగా సోషల్వెంట్గా పరిగణిస్తారు. సాధారణంగా స్టేటస్‌లను అప్డేట్ చేయడం, సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా స్నేహితులు, ఫాలోవర్లు మీ అభివ్యక్తీకరణ గురించి ఏం అనుకుంటున్నారో అనే చిన్న అంచనాకు వస్తారు. మీ ఆన్లైన్ చర్యలు భవిష్యత్తులో విద్యా, వ్యక్తిగత లేదా వృత్తిపరమైన అవకాశాలను తీవ్రంగా పరిమితం చేయచ్చు. ►మీ సమాచారాన్ని పంచడం నియంత్రణకు కుకీలను బాక్ చేయండి. గోప్యతా సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయండి. ►ఒక పెద్ద అక్షరం, ఇతర సంక్లిష్టమైన అక్షరాలతో పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి. ∙చిత్రాలు చూసేటప్పుడు, అప్లోడ్ చేస్తున్నప్పుడు లొకేషన్ లీక్ కాకుండా చూడండి. ►’ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సున్నితమైన సమాచారాన్ని ఎప్పడూ షేర్ చేయవద్దు. ముఖ్యంగా ఆర్థిక, సంస్థ, వ్యక్తిగత సమాచారం మీ పరిధిలోనే ఉండటం ముఖ్యం. ►సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు స్మార్ట్ ఫోన్‌కన్నా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ల వాడకం మేలు. ►మీకు తెలిసిన, నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. -అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వరదల నియంత్రణకు స్పాంజి నగరాలు
మానవ కల్పిత కారణాలతో భూతాపం పెరుగుతోంది. వర్షపాతం పెరుగుతోంది. ప్రకృతి సమతుల్యత దెబ్బతింది. గంటకు మూడు చొప్పున అనేక జంతువృక్ష జాతులు అంతరిస్తున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం, అశుద్ధ పరిశ్రమలతో బొగ్గు పులుసు వాయువు విడుదల పెరిగింది. సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత ముంపులు, వరదలు, తుఫాన్లు, కరువులు, రోగాలు పెరుగుతున్నాయి. మరోవైపు జలాశయాలు ఎండిపోతున్నాయి. ప్రపంచంలో 200 కోట్ల మందికి తాగునీరు లేదు. భవిష్యత్తులో ఈ సమస్యలు పెరిగే ప్రమాదముంది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అన్నట్లు మానవ మనుగడకు కొత్త ఆలోచనలు అవసరం. (చదవండి: దళితులు శూద్రులే... విడగొట్టారంతే!) స్పాంజి నగరాలు వరదల నిర్వహణకు, పంట, మురికి కాలువల మెరుగుదలకు ఏర్పరచిన నూతన నగర నిర్మాణాలు. నదుల ఒడ్డున చెట్లు, పొదలు, రెళ్ళుగడ్డి, నీళ్ళు ఇంకే కాళ్ళబాటలు, ఆకుపచ్చని పైకప్పులు, వంతెనల మధ్య గుంటల్లో పొదలు, చిత్తడి మైదానాలు, వర్షపు నీటి వనాలు, జీవసంబంధ స్థలాలు స్పాంజి నగరాల భాగాలు. యు కొంగ్జియన్ చైనా పెకింగ్ విశ్వవిద్యాల యంలో నిర్మాణ విజ్ఞానశాస్త్ర, ప్రకృతి సౌందర్యశాస్త్రాల కళాశాల పీఠాధిపతి. ఈయన స్పాంజి నగరాలను ఆవిష్కరించారు. ఇవి నీటి ఎద్దడి, జలవనరుల కొరతను, ఉష్ణోగ్రతల ప్రభావాన్ని, నీటి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తాయి. వాన నీటిని ఒడిసిపట్టి, భూమిలో ఇంకింపజేసి నిలువచేస్తాయి. వరదలను అరికడతాయి. జీవావరణ, పర్యావరణాలను మెరు గుపరుస్తాయి. నున్నటి కాంక్రీటు నది గట్లు నీటి ప్రవాహ వేగాన్ని పెంచుతాయి. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...) 2012 జూలైలో బీజింగ్ వరదల్లో 79 మంది చనిపోయారు. పొలాలు మునిగిపోయాయి. ప్రజలు, జంతువులు, ఆస్తులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీనికి విరుగుడుగా చైనా పలు జిల్లాల్లో, నగరాల్లో స్పాంజి నగరాలను నిర్మించింది. నదుల కాంక్రీటు గట్లను తొలగించారు. చిత్తడి మళ్లను పెంచారు. జీవవైవిధ్యాన్ని పరిరక్షించారు. సహజ వనరులను కాపాడారు. సహజంగా పెరిగే పనికి రావనుకునే చెట్లు, మొక్కలు, పొదలను పెరగ నిచ్చారు. దీంతో వరదల సమస్య తీరింది. కప్పలు, పక్షులు తిరిగిచేరాయి. ఈ ప్రక్రియల్లో విద్యార్థుల ప్రమేయాన్ని పెంచారు. విద్యాసంస్థల్లో వ్యవసాయ ప్రదర్శనలు నిర్వహించారు. వాతావరణ మార్పుతో వచ్చే వరదల తీవ్రతను స్పాంజి నగరాలు తగ్గించాయి. మలేషియా, ఇండోనేషియా, బంగ్లా దేశ్ ఈ నగరాలతో ప్రయోజనం పొందాయి. సింగ పూర్, అమెరికా, రష్యా ఈ నగరాలను నిర్మిస్తు న్నాయి. పదేళ్ళ క్రితం జర్మనీ పర్యా వరణ పరిశోధక శాస్త్రజ్ఞులు హైదరాబాదులో స్పాంజి నగర ఏర్పాట్లు చేశారు. నాటి మెట్రోపాలిటన్ అభివృద్ధి అధికార సంస్థ వాటిని ఉపయోగించలేదు. కేరళ కొచ్చి స్పాంజి నగరం. కోజికోడ్, తిరువనంతపురంలలో స్పాంజి నగర నిర్మాణాలు జరుగుతు న్నాయి. గురుగ్రామ్, దిల్లీ, ముంబయిలలో స్పాంజి నగర పథకాలు రచించారు. వర్షపు నీటిని వేగంగా దూరంగా పంపడానికి గొట్టాలు, కాలువలు ఏర్పాటుచేయడం, నీళ్ళు పొంగి పారకుండా నది గట్లను కాంక్రీటుతో గట్టి పరచటం, ఎత్తు పెంచటం సంప్రదాయ పద్ధతులు. ఇవి జల ప్రవాహాన్ని తగ్గించవు. బయటికి, లేదా మరో వైపుకు నీళ్ళు వేగంగా పోయేటట్లు చేస్తాయి. స్పాంజి నగర పద్ధతి వర్షపు నీటిని భూమిలో ఇంకేటట్లు, భూఉపరితల నీటిని నిదానంగా పారే టట్లు చేస్తుంది. దీన్ని మూడు ప్రాంతాల్లో అమలు చేయవచ్చు. 1. నీటి ఊట ప్రదేశంలో, స్పాంజి రంధ్రాల లాగా చెరువులు, కుంటలు, ఇంకుడు గుంటలు నిర్మించటం. 2. చెట్లు, మొక్కలు నాటి నదుల, కాలువల ప్రవాహ దిశను వంకరటింకరగా మార్చటం. చిత్తడి నేలలను ఏర్పరిచి నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి నీళ్ళు భూమిలో ఇంకేటట్లు చేయడం. దీంతో పచ్చని ప్రదేశాలు, కృత్రిమ వనాలు, అటవీ స్థలాలు పెరుగుతాయి. పశుపక్ష్యా దులకు నీటి వసతి ఏర్పడుతుంది. వాటి నివాస స్థలాలు పెరుగుతాయి. (చదవండి: ఈ ప్రమాదాలు యక్షప్రశ్నలేనా!) 3. జనావాసాల ముంపును తగ్గించటం. పై రెండు పద్ధతులు పాటిం చిన తర్వాత మిగులు నీరు ఆటంకం లేకుండా నదులు, సముద్రాల్లో కలిసేటట్లు చేయాలి. కాలువలను పూడ్చరాదు. చెత్త చెదారాలతో నింపరాదు. వర్షాకాలానికి ముందు కాలువల పూడిక తీయాలి. ప్రవాహ మార్గంలో, లోతట్టు ప్రాంతాల్లో నిర్మా ణాలు చేయరాదు. పట్టణాల్లో చెరువులను పూడ్చి, వాణిజ్య నిర్మాణాలు, అపార్టు మెంట్లు, ఇల్లు కట్టుకుంటారు. గుంటూరులో ఒకప్పటి ఎర్ర చెరువు నేటి బస్‌స్టాండ్. 1977 నవంబర్ ఉప్పెనలో మూడు వందల మందిని ముంచిన నల్ల చెరువు నేడు పెద్ద నివాస ప్రాంతం. నీటితో కుస్తీ పట్టరాదు. దాని దారిన దాన్ని పోనివ్వాలి. స్పాంజి నగర నిర్మాణానికి సంప్రదాయ పద్ధతుల ఖర్చులో నాలుగో వంతు ఖర్చవుతుంది. వరదల నియంత్రణకు కాంక్రీటు నేల, గట్ల ఏర్పాటు, దప్పిక తీర్చుకోటానికి విషం తాగటం లాంటిది. వాతావరణ మార్పు అనువర్తనకు మన జీవన విధానాలను మార్చుకోవాలి. ఇవి ప్రకృతికి దూరమైన మనుషులను మరలా ప్రకృతితో మమేకం చేస్తాయి. - సంగిరెడ్డి హనుమంత రెడ్డి వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
World AIDS Day: హెచ్ఐవీని ఇలా గుర్తించొచ్చు.. ఈ సూత్రాలు పాటించాలి
హెచ్ఐవీ భూతం చాపకింద నీరులా విస్తరిస్తోంది. మందు లేని ఈ మాయరోగానికి నిండు జీవితాలు బలైపోతున్నాయి. అవగాహనా లోపం, నిర్లక్ష్యం మూలంగా కొందరు వ్యక్తులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండంతో వారి కుటుంబాలు వీధినపడుతున్నాయి. హెచ్ఐవీపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించే ఉద్ధేశంతో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు. హెచ్ఐవీని ఇలా గుర్తించొచ్చు ►హెచ్ఐవీ(హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్)ను గుర్తించడానికి ఏఆర్టీ సెంటర్లో కొంబెడ్స్, ట్రై లైన్, ట్రై స్పాట్ పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో పాజిటివ్ వచ్చినట్లయితే హెచ్‌ఐవీగా నిర్ధారిస్తారు. ►దీర్ఘకాల వీరోచనాలు, జ్వరం, ఎడతెరిపి లేని దగ్గు, చర్మ వ్యాధులు, గొంతు నొప్పి ఎక్కు వరోజులు ఉన్నట్లయితే వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలి ►నెల రోజుల్లో శరీర బరువులో 10 శాతం తగ్గినా, నెల రోజులకు మించి జ్వరం, విరేచనాలు బాధించినా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలి ►సీడీ- 4 టెస్ట్‌లో తెల్ల రక్తకణాల సంఖ్య 350 కంటే తక్కువగా ఉంటే వారికి జీవిత కాలం పాటు ప్రతి నెల ఉచితంగా ఏఆర్టీ సెంటర్లో మందులు అందిస్తారు. ఏబీసీ సూత్రం పాటించాలి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఏబీసీ సూత్రాన్ని పాటించాలి. ఎ-ఎబ్స్టెన్సెస్(వివాహానికి ముందు లైంగిక సంబంధాలకు దూరంగా ఉండటం), బి-బీ ఫెయిత్ ఫుల్ టూ లైఫ్ పార్టనర్(వివాహ జీవితంలో భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం పరిమితం చేసుకోవాలి). సీ- కాన్సిస్టెంట్ కరెక్ట్ యూజ్ ఆఫ్ కండోమ్( సరైన విధంగా ఎల్లప్పుడూ కండోమ్ వాడటం). ఈ మూడు సూత్రాలపై స్వచ్చంద సంస్థల సహాకారంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అప్రమత్తతే ముఖ్యం హెచ్ఐవీ వైరస్ వల్ల ఎయిడ్స్ వస్తుంది. ముఖ్యంగా విశృంఖల శృంగారం.. ఒకరికంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాలతో ఎక్కువగా ఎయిడ్స్ బారిన పడుతున్నారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ ఉన్న వారి రక్తం ఇతరులకు ఎక్కించడం వల్ల, తల్లి నుంచి బిడ్డకు, కలుషిత సిరంజీల వల్ల ఎయిడ్స్ వ్యాధి సంక్రమిస్తుంది. ఎయిడ్స్ రోగులు వినియోగించిన బ్లేడ్లు వాడడం వల్ల కూడా సంక్రమిస్తుంది. హెచ్ఐవీ సోకితే.. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి జలుబు తదితర అంటురోగాల బారిన త్వరగా పడతారు. ఆరోగ్యం క్షీణించినప్పుడు.. సీ డీ 4 పరీక్షలో కణాల సంఖ్య 200 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎయిడ్స్‌గా పరిగణిస్తారు. సెలూన్లలో కొత్త బ్లేడ్ వాడేలా చూసుకోవాలి. శారీరక సంబంధాల నియంత్రణ, ఇతర స్వీయ జాగ్రత్తలతో ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. సమాజాభివృద్ధికి నిరోధకంగా నిలుస్తున్న ఇటువంటి రుగ్మతలపై ప్రజానీకంలో విస్తృత అవగాహన కల్పించటంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. 2002లో 2.25 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి 2020 నాటికి 0.22 శాతంకు తగ్గింది. జిల్లాలో ప్రస్తుతం 21,332 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు, మచిలీపట్నం, గుడివాడలో ఎక్కువగా హెచ్ఐవీ కేసులు బయటపడుతున్నాయి. ఈ ప్రాంతాలపై ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పాజిటివ్ రేటు తగ్గించేలా.. పాజిటివ్ రేటు తగ్గించే క్రమంలో బాధితులను సకాలంలో గుర్తించేలా హెచ్ఐవీ పరీక్షలను వేగవంతం చేశారు. జిల్లాలో 18 హెచ్ఐవీ నిర్ధారణ కేంద్రాలు, 164 పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. సామాన్య ప్రజానీకానికి 2020–21లో 1,04,482 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 1,170 మందికి హెచ్ఐవీ నిర్థారణ అయింది. 2021–22లో అక్టోబర్ వరకు 70,100 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 797 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలింది. గర్భిణులకు 2020–21లో 82,086 మందికి పరీక్షలు చేయగా, ఇందులో మందికి హెచ్ఐవీ ఉన్నట్లుగా వెల్లడైంది. 2021–22లో అక్టోబర్ నెల వరకు 42,360 మందికి పరీక్షలు చేయగా, 53 మందికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. జీవన ప్రమాణం పెరిగేలా... ∙ఎయిడ్స్ నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. గతంలో మెరుగైన చికిత్స కోసమని హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం విజయవాడలోనే ‘వైరల్ లోడ్ ల్యాబ్’ అందుబాటులోకి వచ్చింది. రోగి ప్రాణాపాయం నుంచి తప్పించేలా(థర్డ్ లెవెల్ డ్రగ్) అవసరమైన మందులు సకాలంలో అందిస్తున్నారు. జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, విజయవాడలోని పాత, కొత్త ఆసుపత్రుల్లో ఏఆర్టీ కేంద్రాలు అందుబాటులోఉన్నాయి. వీటికి అనుబంధంగా జిల్లాలో 6 ఏఆర్టీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లు, మాదక ద్రవ్యాలను సూదుల ద్వారా ఎక్కించుకునే వారి ద్వారానే ఎక్కువగా హెచ్ఐవీ విస్తరిస్తున్నందున వీరికి అవగాహన కల్పించేందుకు జిల్లాలో 13 స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. -
సెల్ఫీ అడిక్షన్ పెరుగుతోందా.. ఈ ఏడు జాగ్రత్తలు అవసరం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరి 4న సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోటగిరి నాగరాజు (34) మరణం.. జూన్ 6న నిర్మల్ జిల్లా తానూర్ మండలం సింగన్‌గాం చెరువులో అక్కాచెల్లెళ్లు, సమీప బంధువైన ఎల్మె స్మిత (17), ఎల్మె వైశాలి (14), లహుబందే అంజలి (16) మృతి.. సెప్టెంబర్ 5న వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని లక్నాపూర్ ప్రాజెక్ట్ అలుగు వద్ద వీరరాజు (25), మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దుందుబీవాగు పరిధిలోని చెక్‌డ్యాం వద్ద కుందేళ్ల శివప్రసాద్ (23) అసువులుబాయడం.. ఇదేనెలలో సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలోని మోయతుమ్మెద వాగులో మామ అల్లుళ్లు మ్యాదరి రాజు(27), చెంచల రుషి (11) తిరిగిరాని లోకాలకు వెళ్లడం.. ఇలా సెల్ఫీలు ‘కిల్ఫీ’లుగా మారుతున్నాయి. విహారయాత్రలను విషాదంతో నింపిన ఈ ఏడాది ఉదంతాలివి. స్టేటస్లు, ప్రొఫైల్ పిక్ తదితరాలకు సెల్ఫీల కోసం ప్రత్యేక సెల్ఫోన్లు, స్టిక్స్‌తో పాటు కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అత్యంత దారుణమైన అంశాలూ దాగి ఉంటున్నాయి. ఈ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నాల్లో అనేక మంది ప్రమాదాల బారినపడి అశువులుబాస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు సెల్పీ మరణాలకు లోనుకాగా... వీటిలో రెండు మరణాలు ఇటీవల ఒక్కరోజే జరిగాయి. యువతలో ఈ ధోరణి ఎక్కువ... సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన చాలాకాలం తర్వాత ఈ సెల్ఫీల యుగం ప్రారంభమైంది. ప్రధానంగా ఫ్రంట్ కెమెరా సౌకర్యం ఉన్న సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక, నానాటికీ వాటి రెజుల్యూషన్ పెరగడంతో ఈ క్రేజ్ మొదలైంది. అనేక మంది ప్రముఖులు సైతం బహిరంగంగా సెల్ఫీ తీసుకుంటున్న సందర్భాలు అనేకం. సెల్ఫీ మోజులో ఉంటున్న వారిలో ఎక్కువ మంది యువతే. తామున్న ప్రాంతం, పరిస్థితులు, ప్రభావాలను పట్టించుకోకుండా సెల్ఫీ దిగడానికి ఆరాటపడుతున్నారు. ఈ ధోరణితోనే ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఎక్కువగా సోషల్‌మీడియా కోసమే... సోషల్ మీడియాలు ప్రాచుర్యం పొందిన తర్వాత సెల్ఫీలు దిగే అలవాటు మరింత ఎక్కువైంది. ఒకప్పుడు కేవలం తమ, తాము తీసిన ఫొటోలనే వీటిలో పెట్టేవాళ్లు. సెల్ఫీలు తీయడం ఎక్కువైన తరవాత సోషల్ మీడియాల్లో ఎవరి ప్రొఫైల్ పిక్ చూసినా, అప్లోడ్ చేసిన ఫొటోలు పరిశీలించినా సగానికి సగం సెల్ఫీలే కనిపిస్తున్నాయి. దీంతో ఒకరిని చూసి మరొకరు, ఒకరి ప్రొఫైల్స్ చూసి ఇంకొకరు... ఇలా అంతా సెల్ఫీ బాటపడుతున్నారు. ఈ ధోరణి వారితో పాటు ఇతరులకూ ఇబ్బందికరంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సెల్ఫీ అడిక్షన్ పెరుగుతోంది... దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో ఉపయోగాలు ఉంటున్నాయి. అదే సమయంలో కొన్ని అనర్థాలు తప్పట్లేదు. అలాంటి వాటిలో సెల్ఫీ అడిక్షన్ ప్రధానమైంది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ 2013లో సెల్ఫీ పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా పరిగణించింది. లైక్స్, కామెంట్స్ కోసం ఆరాటపడుతూ సొంతంగా తీసుకున్న చిత్రాలను సోషల్ మీడియాల్లో పోస్టు చేసే విధానం నానాటికీ పెరిగిపోతోంది. ఇందులో భాగంగా ఎదుటి వారిని ఆకర్షించే, ఆశ్చర్యపరిచే సెల్ఫీ తీసుకోవడానికి ప్రయతి్నస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. వీలున్నంత వరకు గ్రూప్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం, కౌన్సిలింగ్ పొందడం, యువతపై పెద్దల పర్యవేక్షణ ద్వారా ఈ సెల్ఫీ అడెక్షన్ నుంచి బయటపడవచ్చు. – డాక్టర్ అనిత రాయిరాల, ప్రొఫెసర్, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సేఫ్టీ కోసం ‘సప్త ప్రశ్నలు’... యూత్‌కు లేటెస్ట్ క్రేజ్‌గా మారిపోయిన ఈ సెల్ఫీ ప్రమాదభరితం కాకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. సెల్ఫీ తీసుకోవడానికి ఉపక్రమించే ప్రతి ఒక్కరూ... దానికి ముందు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలని కోరుతున్నారు. ఎవరి వారు వేసుకోవాల్సిన ప్రశ్నలు, అవి వర్తించే ప్రాంతాల్లో కొన్ని ఇలా... 1. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతాల్లో అసలు ఫొటోగ్రఫీకి అనుమతి ఉందా? (మ్యూజియాలు, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, విద్యా సంబంధ వ్యవహారాల్లో) 2. సెల్ఫీ కారణంగా నాకు, నా చుట్టు పక్కల వాళ్లకు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందా? (జూ పార్కులు, థీమ్ పార్కులు, జనసమర్థ ప్రాంతాలు, మాల్స్, సబ్వేస్, విమానాశ్రయాలు, వాహనాలు నడుపుతూ) 3. సెల్ఫీ తీసుకుంటూ ఎదుటివారు చూస్తున్న వాటికి నేను అడ్డం వస్తున్నానా? ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నానా? (థీమ్ పార్కులు, సినిమా హాళ్లు, సందర్శనీయ ప్రాంతాలు, కొన్ని కార్యక్రమాలు) 4. సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో మరో వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతీస్తున్నామా? (మత సంబంధ ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు) 5. సెల్ఫీ తీసుకుంటున్న ప్రాంతంలో కంటికి కనిపించని ముప్పు పొంచి ఉందా? (జూ పార్క్‌లు, జాతీయ పార్కులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎత్తైన భవనాలు/ప్రాంతాలు, ఓడలు, సబ్ వేస్, కదులుతున్న వాహనాలు, రహదారులు) 6. సెల్ఫీ తీసుకోవడం సమంజసమేనా? (ప్రమాదం జరిగిన ప్రాంతాలు, అంతిమయాత్రలు) 7. నేను తీసుకుంటున్న సెల్ఫీ ఇతరులకు అభ్యంతరకరం అవుతుందా? (పార్టీలు, రెస్ట్‌రూమ్స్ సమీపంలో, బీచ్‌ల్లో) ఆ రెండు చోట్లా ‘నో సెల్ఫీ’... యువతలో మితిమీరిపోతున్న ఈ సెల్ఫీ ఆసక్తి ప్రభుత్వ విభాగాలకూ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ‘నో పార్కింగ్’ప్రాంతాల తరహాలో ‘నో సెల్ఫీ ప్రాంతాలు అమలులోకి వస్తున్నాయి. 2015లో మహారాష్ట్ర నాసిక్‌లో జరిగిన కుంభ్‌మేళాలో సెల్ఫీ ప్రియులతో అనేక ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో కుంభమే ళాను అధికారులు ‘నో సెల్ఫీ జోన్’గా ప్రకటించాల్సి వచ్చింది. వీటి వల్ల జరిగే ప్రమాదాలను నిరోధించడం కోసం ముంబై పోలీసులు ఆ నగరంలోని 29 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్స్’గా ప్రకటించారు. కొన్నాళ్ల క్రితం గోవా అధికార యంత్రాంగం సైతం అక్కడి 23 ప్రాంతాలను ఇలానే ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ సైతం ఏర్పాటు చేసింది. -
‘నేనున్నాను’ అని చెప్పాల్సిన బాధ్యతను గుర్తు చేసే రోజు
‘నాకెవరున్నారు’ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవారికి వచ్చే మొదటి ఆలోచన అది. ‘నాకెవరూ లేరు’ అనిపించడం ‘ఈ సమస్య నుంచి నన్నెవరూ బయటపడేయలేరు’ అనిపించడం ‘ఈ సమస్య వల్ల నాతో ఉన్నవాళ్లంతా నాకు లేకుండా పోతారు’ అనిపించడం ‘నాకు ఎవరైనా తోడుంటే ఈ బాధ నుంచి బయటపడగలను’ అనిపించడం ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి అనిపిస్తే నష్టం లేదు. ఎప్పుడూ అనిపిస్తేనే ప్రమాదం. ఎప్పుడూ అనిపించేవారు గమనిస్తే తెలిసిపోతారు. అలాంటి వారికి ‘నేనున్నాను’ అని చెప్పాల్సిన బాధ్యతను గుర్తు చేసే రోజు ఇది. ముఖ్యంగా ఇంట్లో ప్రతి ఒక్కరూ ‘నీకు నేనున్నాను’ అని భరోసా ఇచ్చుకోవాల్సిన రోజు. కుటుంబసభ్యుల బలమే ఆత్మహత్యకు ప్రధాన విరుగుడు. ఆ సంగతిని గ్రహించాల్సిన రోజు కూడా ఇది. భార్గవి మధ్య వయసు గృహిణి. ఉద్యోగం చేసే భర్త, కాలేజీలకు వెళ్లే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజంతా ఇంటి పనుల్లో ఉంటుంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా క్షణాల్లో అమర్చుతుంది. చీకూ చింత చిన్న కుటుంబం. కానీ ఓ రోజు భార్గవి బాత్రూమ్లో రక్తపు మడుగులో పడి ఉంది. ఆసుపత్రిలో చేర్చారు. మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కోలుకున్న భార్గవి ‘నాకెవరున్నారు’ అన్న మాటలకు భర్త, పిల్లలు ఆశ్చర్యపోయారు. ∙∙ సంజయ్ ఇంజినీరింగ్ చేస్తున్నాడు. ఆలస్యంగా నిద్రలేస్తున్నాడు. అడిగితే ఆకలి లేదంటున్నాడు. పిల్లాడికి ఈ మధ్య బద్ధకం ఎక్కువైంది అనుకుంది తల్లి. అదే మాట గట్టిగా అరిచి చెప్పాడు తండ్రి. మరుసటి రోజు ఉరి వేసుకుంటూ కనిపించిన కొడుకును చూసి అదేమని అడిగితే ‘ఎందుకు బతకాలి’ అని అడిగాడు. ఆ మాటలకు తల్లడిల్లిపోయారు తల్లిదండ్రులు. ∙∙ భార్గవి కుటుంబంలో పిల్లలు కాలేజీ చదువు అయిపోగానే ఫోన్లో ఉంటారు. భర్త ఇంట్లోనూ ఆఫీసు పని చేసుకుంటూ ఉంటాడు. అదేపనిగా స్నేహితులతో మాట్లాడతాడు. కానీ, భార్య స్థితి ఏంటో పట్టించుకోడు. తలనొప్పి, నీరసం అని చెప్పినా ‘మామూలేగా’ అనేస్తాడు. ‘ఎవరూ నన్ను పట్టించుకోరు’ అనే ఆలోచనతో చావే శరణ్యం అనుకుంది భార్గవి. సంజయ్ ప్రేమ విఫలమై, చదువులో ఫెయిల్ అయిన కారణంగా జీవితాన్ని చాలించాలనుకున్నాడనే విషయాన్ని తల్లిదండ్రులు తమ లోకంలో ఉండి పసిగట్టలేకపోయారు. ∙∙ ‘పన్నెండేళ్ల పిల్లల స్థాయి నుంచి వృద్ధుల వరకు ఆత్మహత్యల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉందంటు’న్నారు మనస్తత్వనిపుణులు. ‘‘కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్యకు సంబంధించిన మాటలు మాట్లాడం, బాధపడటం చూసినప్పుడు అసలు పట్టించుకోరు. వారి భావాలను చాలా చిన్నగా చేసి చూస్తారు. 80–90 శాతం జనం ఇలాగే ఆలోచిస్తారు’ అంటారు సైకియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ్. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారి ప్రవర్తన ఎలా ఉంటుందో వివరించారు. ► మాట్లాడే మాటల్లో ఎక్కువ శాతం నెగిటిÐŒ గా ఆలోచిస్తారు. ‘నాకంటూ ఏవీ లేవు, ఎవరూ లేరు, ఏం చేసినా మంచి జరగదు..’ అంటూ ప్రతికూల వాతావరణాన్ని వెదుక్కుంటూ ఉంటారు. ► ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు పదే పదే ‘చచ్చిపోతాను’ అని చెబుతున్నా ‘వీళ్లేదో బెదిరించడానికి ఇలాగే చెబుతారులే. వీళ్లకంత ధైర్యం ఎక్కడిది?’ అనుకుంటారు ఇతరులు. దాంతో వీరు తమ మాటకు విలువ లేదని అహం దెబ్బతిని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. ► ఇంకో రకం వారు ఎదుటివారిలో మార్పు కోసం ఆత్మహత్యను వాడతారు. నేను చచ్చిపోతాను అనే ఆలోచన ఎదుటివారికి తెలిస్తే వారిలో మార్పు వస్తుందనుకుంటారు. ఆ విషయాన్ని గ్రహించకపోతే అంతకు తెగిస్తారు. మాటల కరువు ‘‘అసలు కుటుంబ సభ్యుల మధ్య మాటలే కరువయ్యాయి. ఫోన్లోనే జీవిస్తున్నారు’’ అంటారు సైకాలజిస్ట్ డాక్టర్ జ్యోతిరాజ. ‘సమయానికి తినడం, నిద్రపోవడం ఇవి శరీరానికి ఆరోగ్యాన్నిస్తాయి. ఉల్లాసపు మాటలు, ఉత్సాహపు కబుర్లే మనసును ఆహ్లాదంగా ఉంచుతాయి’ అంటారామె. పాజిటివ్ ఆలోచనా ధోరణి ఉన్నవాళ్లలోనే ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు చేసేవారిలోనే ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఉంటుందని అంతా అనుకుంటాం. కానీ, అన్ని విషయాల్లోనూ సానుకూల దృక్ఫధంతో ఉన్నవారు ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితి ఎదురైతే ‘ఇక అయిపోయింది నా జీవితం. ఎప్పటికీ తేరుకోలేను’ అనే ఆలోచన వచ్చి జీవితాన్ని ముగించుకోవాలనుకుంటారు. ‘పాజిటివ్‌గా ఉండే నేను నెగిటివ్ జీవితాన్ని భరించలేను’ అనే ఆలోచన చేస్తారు. ఇలాంటి వారిలో కొన్ని సిగ్నల్స్‌ని కనిపిస్తాయి. కీలకమైన సిగ్నల్స్.. గుర్తించండి సాదా సీదాగా కాకుండా వారి మనసు లోతుల్లోనుంచి వచ్చే భావనలా గుర్తించాలి. ‘నేను ఏదైనా చేయగలను’ అనే మనిషి ‘ఏమీ చేయలేను, నేను వేస్ట్’ అన్నప్పుడు వెంటనే అలెర్ట్ అవ్వాలి. అవి ఎలాంటివంటే.. ► అభిరుచులను, ఆసక్తులు వదిలేయడం ► ఇష్టమైన పనులు చేయకపోవడం ► ఇష్టమైన మాటలు మాట్లాడకపోవడం ► ఒంటరిగా ఉండాలనుకోవడం ► చేసే పని మీద దృష్టి పెట్టకపోవడం ► బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం ► ఆనందంగా ఉండే పరిస్థితుల్లోనూ బాధగా ఉండటం. బాధాకరమైన మాస్క్ వేసుకుంటారు డిప్రెషన్లో ఉన్నవారి కళ్లు నిస్తేజంగా, మెరుపు కోల్పోయి కనపడతాయి. ముఖంలో నవ్వు ఉండదు. బ్లాంక్ ఫేస్‌తో ఉంటారు. భావోద్వేగాలను ముఖంలో పలికించలేరు. మాట్లాడటానికే ఇష్టపడరు. కాళ్లూ చేతుల కదలికలను కూడా ఇష్టపడరు. రోజువారీ పనులనూ నిర్లక్ష్యం చేస్తారు. కాలు విరిగినా, చెయ్యి విరిగినా బాగయ్యేంతవరకు ఎలా విశ్రాంతి తీసుకుంటామో.. అలాగే మనసు కూడా సేదతీరేంత వరకు అవకాశాన్ని ఇవ్వాలి. సహనంతో కుటుంబ సభ్యులు ఇందుకు పూనుకోవాలి. మాటలే మందు..! పలకరించాలి. మాట్లాడుకోవాలి. గతంలో సాధించిన గెలుపు ఓటములను ప్రస్తావించాలి. పరిస్థితులు మారుతాయి అని చెప్పాలి. ఎక్కడన్నా బాధాకరమైన కథనాలు ఉంటే వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారో కూడా చెప్పాలి. సానుభూతి వాతావరణం మంచిది కాదు. ప్రాంతాన్ని మార్చాలి. నలుగురిలో సులువుగా కలిసిపోయేలా ఉంచాలి. – డా. కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ అతి పెద్ద మారణాయుధం ఫోన్ ఫోన్ కుటుంబాల్లోకి వచ్చి తిష్టవేసాకా ఒకరి బాగోగులు ఒకరు పట్టించుకోవడం అనేదే పోయింది. ఎక్కడో ఉన్నవారిని ‘అయ్యో’ అని మెసేజుల్లో పరామర్శిస్తారు. కానీ, ఇంటి వ్యక్తిని మాత్రం విస్మరిస్తారు. పిల్లల దగ్గర నుంచి ఫోన్లు లాక్కుంటే తమ పెన్నిధిని కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. పెద్దవాళ్లు ఫోన్ మాత్రమే తమ సర్వస్వం అన్నట్టుగా ఉంటున్నారు. వీటితోపాటు యువత ప్రేమ విఫలమైన కారణం, చదువులో వెనకబడటం వంటి వాటితో కూడా ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారు. కుటుంబమంతా కలిసి రోజూ పది నిమిషాలు మాట్లాడుకుంటే చాలు ఆ ఇంట ఆనందమే. ఆత్మహత్య అనే పదమే దరిచేరదు. – డా. జ్యోతిరాజ, సైకాలజిస్ట్ -
కోవిడ్ ఎప్పుడు అంతమవుతుందో తెలుసా? మరి ఇవి తెలుసుకోండి
కోవిడ్ పాండమిక్ వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు కోవిడ్ ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు అనే విషయం పూర్తిగా తెలియటం లేదు. అయితే ఈ కోవిడ్ అనేక కొత్త విపత్తులకు దారి తీయవచ్చనేది మాత్రం ప్రస్ఫుటం. ఇందులో ప్రమాదకరమైనవి డయాబెటిస్, గుండె జబ్బుల పెనుముప్పులు. ఇవి ఎందుకు రాబోతున్నాయి, వీటిని నివారించటం ఎలా అనే విషయాలపై అవగాహన కోసమే ఈ కథనం. డయాబెటిక్ ముప్పు పెరగడమెందుకు? ఇప్పటికే మన దేశాన్ని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. అంటే మధుమేహంలో ప్రపంచ రాజధాని అన్న (అప)కీర్తి మనదే. భారతదేశంలో 7.7 కోట్లకు పైగా డయాబెటిక్ రోగులు ఉన్నారని అంచనా. గణాంకాల ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అత్యధికమైన సంఖ్య. అంతేకాదు... ఇక్కడ సుమారు 50 శాతం మందికి షుగర్ జబ్బు ఉన్నప్పటికీ ఆ విషయం నిర్ధారణ కాకుండా ఉంటారని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో ఇది సుమారు 60 శాతం కావచ్చు. కోవిడ్ వచ్చినవాళ్లల్లో అనేకమందికి హాస్పిటల్లో చేరిన సందర్భంలో షుగర్ బయటపడింది. అయితే వీళ్లకి కోవిడ్ వల్ల షుగర్ వచ్చిందా లేక డయాబెటిస్ ఉన్నా ఆ విషయం తెలియక కోవిడ్ వచ్చినప్పుడు బయట పడిందా అన్నది స్పష్టంగా తెలియలేదు. ఇంతకుముందు చాలా రకాల వైరల్ న్యుమోనియాలలో షుగర్ కొత్తగా రావడం డాక్టర్లకు తెలిసిన విషయమే. సార్స్ – 1 లో కూడా డయాబెటిస్ కొత్తగా రావటం గమనించారు. కోవిడ్ –19 లోనూ మధుమేహం కొత్తగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకుల అంచనా. దీనికి అనేక కారణాలున్నాయి. మొదటిగా సార్స్ సీవోవీ–2 వైరస్ శరీరంలో ప్రవేశించడానికి ఉపయోగించుకునే ఏసీఈ–2 రిసెప్టార్లు ప్యాంక్రియాస్లోనూ ఉంటాయి. కాబట్టి ఊపిరితిత్తులను పాడు చేసినట్లుగానే ఈ వైరస్ ప్యాంక్రియాస్‌ను కూడా ప్రభావితం చేయగలుగుతుంది. కోవిడ్ –19 రావటం అనేది శరీరానికి ఒక స్ట్రెస్. ఇన్ఫెక్షన్తో కూడిన ఈ ఒత్తిడి వల్ల మధుమేహం రావడం అనేది ఇప్పటికే తెలిసిన అంశం. ఇవి మాత్రమే కాకుండా కోవిడ్ – 19 చికిత్సకోసం స్టెరాయిడ్స్ వాడటం కొన్నిసార్లు అవసరం. వాటితో రక్తంలో షుగరు పెరగవచ్చు. చాలామందికి స్టెరాయిడ్స్ ఆపేసిన తర్వాత షుగర్ నార్మల్‌కి వచ్చేస్తుంది. కొంతమందికి మాత్రం స్టెరాయిడ్స్ ఆపేశాక కూడా షుగర్ అధికంగానే ఉంటుంది. డయాబెటిస్ కి దోహదం చేస్తున్న కోవిడ్ ఇన్–అప్రాప్రియేట్ బిహేవియర్ మనం కరోనా నివారణకు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పాటించాలన్న విషయం తెలిసిందే. అంటే.. కోవిడ్ జాగ్రత్తలతో పాటు మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం లాంటివి కూడా కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్లోకి వస్తాయి. ఈ సందర్భంగా కొన్ని అనవసరమైన జాగ్రత్తలూ, మరికొన్ని అజాగ్రత్తల వల్ల షుగర్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ అవుతుంది. కోవిడ్ సాకుతో వ్యాయామం చేయటం పూర్తిగా ఆగిపోయింది. బలమైన ఆహారం తీసుకుంటే కోవిడ్ ని ఎదుర్కోవడానికి శరీరంలో మంచి శక్తి వస్తుందని చెప్పటంతో... కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవడం మొదలైంది. ఇలాంటి ఆహారంతో ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఏమేరకు ఉందో తెలియకపోయినా, బరువు పెరగటం జరుగుతోంది. దాంతో కోవిడ్ రిస్క్ తగ్గకపోగా ఊబకాయంతో వచ్చే రెండు అనర్థాలు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది కోవిడ్ –19 వల్ల కలిగే ప్రమాదపు అవకాశాలు పెరగడం, రెండోది బరువు పెరిగిన కారణంగా షుగర్ జబ్బుకి దగ్గరవడం. గుండెజబ్బుల పెనుముప్పు కోవిడ్ జబ్బుకి మన రెస్పాన్స్ వల్ల రాబోతున్న మరొక సమస్య గుండెజబ్బుల అనర్థం. గుండె జబ్బుల చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్లే వాళ్ల సంఖ్య కోవిడ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో తక్కువగానే ఉన్నప్పటికీ, కేసులు తగ్గిపోయే సమయానికి గుండెజబ్బులతో ఆస్పత్రికి వెళ్లే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీనికి అనేక కారణాలున్నాయి. మొదటిగా కోవిడ్‌లో షుగర్ పెరగటం, వ్యాయామం తగ్గడం, ఊబకాయం బాగా పెరిగిపోవడం... వంటి అంశాలన్నీ గుండె జబ్బులకి కూడా దోహదం చేస్తున్నాయి. మానసిక ఒత్తిడి పెరగటం కోవిడ్ పాండమిక్ వల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయాయి. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, దుకాణాలు మూత పడటం, శ్రమించినా ఉపాధి పొందే అవకాశాలు సన్నగిల్లడంతో ప్రజలు విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. ఆర్థికంగానూ, మానసికంగానూ, సామాజికంగానూ ఒక అభద్రతా భావం ప్రజల్లో నిండిపోయింది. ప్రతిరోజూ బంధువులను, తెలిసినవాళ్ళ లోనూ దుర్వార్తలు వినాల్సి రావటం, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల లోనూ భయోత్పాతాలు కలిగించే వార్తలు ఎక్కువగా వెలువడటంతోనూ భవిష్యత్తు పట్ల ఒక తెలియని భయం నెలకొంది. ఇక కోవిడ్ బారినపడి హాస్పటల్లో చేరాల్సి వచ్చిన వాళ్ల పరిస్థితి మరీ దయనీయం. భౌతిక దూరం సామాజిక దూరంగా మారిపోవడంతో ఒంటరితనం అందరినీ కలచివేసింది. చెక్ అప్లు తగ్గడం కోవిడ్ సందర్భంగా హాస్పిటల్ కి వెళ్లడానికి ప్రజల్లో విపరీతమైన భయం ఏర్పడింది. దాంతో క్రమం తప్పకుండా చేయించుకునే పరీక్షలు దాదాపు అందరూ వాయిదా వేశారు. దీనివల్ల చాలామందిలో బీపీ పెరిగిపోవడం, షుగర్ నియంత్రణలో లేకపోవడం సాధారణమైంది. దురలవాట్లు పెరగడం లాక్డౌన్ నిబంధనలు సడలించగానే మద్యం అలవాటు మళ్లీ బాగా పెరిగిపోయింది. మద్యం వల్ల రక్తపోటు పెరగడం, దానివల్ల గుండె మీద ఒత్తిడి పెరగడం కూడా జరుగుతుంది. దీంతోపాటు క్రమబద్ధమైన పరీక్షలూ, వైద్య పర్యవేక్షణ లేకపోవడంతో మద్యం, పొగతో కలిగే అనర్ధాలు బయటపడటం లేదు. గుండె జబ్బులు వచ్చిన వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడటం గుండె జబ్బు వచ్చిన తర్వాత కూడా ఆ విషయం తెలియకుండా ఆస్పత్రికి వెళ్ళడానికి భయపడి, ఇంటి దగ్గరే వైద్యం తీసుకోవడానికి ప్రయత్నం చేసి, సమయం బాగా మించిపోయాక... అప్పుడు ఆస్పత్రికి వెళ్ళేవాళ్లు చాలామంది ఉన్నారు. గుండె జబ్బు వచ్చిన మొదటి ఆరు గంటల లోపులో సరైన వైద్యం అందక పోతే ప్రాణానికి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ పాండమిక్‌లో ఈ విధమైన ఆలస్యం వల్ల అనేక మందికి గుండె పూర్తిగా పాడైపోవడం జరిగింది. ఒకసారి గుండె పంపింగ్ బలహీనం అయిపోయిన తర్వాత ఎంత అత్యాధునికమైన వైద్యం అందించినప్పటికీ సాధారణంగా గుండె మళ్లీ పూర్వ స్థితికి వచ్చే అవకాశం ఉండదు. గుండె పంపింగ్ బలహీనంగా ఉన్న వాళ్లకి ప్రాణహాని జరిగే అవకాశం నిత్యం పొంచి ఉంటుంది. ప్రస్తుతం బయటకు సునామీలా కనపడుతున్న కోవిడ్ పాండమిక్ గురించే అందరూ ఆలోచిస్తున్నారు. కానీ అదే సమయంలో చాప కింద నీరులా కమ్ముకు వస్తున్న మధుమేహం, గుండె జబ్బుల్ని ముందే గుర్తించి, నివారించడానికి చర్యలు చేపట్టకపోతే రానున్న రోజులో భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది. ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ఆ అనర్థాలను నివారించుకునే అవకాశమూ ఇంకా ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం కరోనా గాలిలో వ్యాప్తి చెందుతుంది అన్న భయంతో బయట నడవడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఆరు బయట ప్రాంతాల్లోనూ మైదానాల్లోనూ నడిచేటప్పుడు కరోనా వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ ఇంటి బయటకి వెళ్ళటానికి అవకాశం లేకపోతే ఇంట్లోనే అనేక రకాల వ్యాయామాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో వ్యాయామానికి సంబంధించిన పనిముట్లు ఇప్పుడు తక్కువ ఖర్చుతో కూడా దొరుకుతున్నాయి. అసలు ఏ విధమైన పనిముట్లు అవసరం లేకుండా కూడా అనేకమైన వ్యాయామాలు ఇంట్లో చేసుకోవచ్చు. వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం వల్ల బరువు పెరగకుండా ఉండవచ్చు. బరువు ఎక్కువ ఉన్న వాళ్లకి కరోనా వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు బలమైన ఆహారం తీసుకుంటే కోవిడ్ వచ్చే అవకాశం తక్కువగా ఉండకపోవచ్చు కానీ కోవిడ్ ని ఎదుర్కొనే అవకాశం మెరుగ్గా ఉంటుంది. ఇది నిజమే. కానీ బలమైన ఆహారం అంటే ఆహారం చాలా ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలని కాదు. మాంసకృత్తులు, విటమిన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిదే కానీ అదే సమయంలో నూనె వస్తువులు, కొవ్వు పదార్థాలు, రెడీమేడ్ ఆహారాలు, జంక్‌ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవడం ప్రమాదం అనే విషయం మర్చిపోకూడదు. పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు రెండూ అధికంగా ఉండే ఆహారం వల్ల మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహం ఉన్నవారు అన్ని రకాల తాజా పండ్లు తీసుకోవచ్చు కానీ ఇవి భోజనంలో భాగంగా తీసుకోవాలి తప్ప భోజనం తర్వాత మరీ ఎక్కువగా తీసుకున్నట్లయితే కావలసిన కేలరీల కన్నా ఎక్కువ కేలరీలు శరీరంలో చేరే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది అని అనేక పరిశోధనల్లో తేలింది. మెడిటేషన్‌తో కూడా స్ట్రెస్ బాగా తగ్గుతుంది. స్నేహితులకు బంధువులకు ఫోన్ లో టచ్‌లో ఉండటం, నెగిటివ్ న్యూస్ కి దూరంగా ఉండటం కూడా మానసిక ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడతాయి. ఆత్మీయతా, ఆధ్యాత్మికతా, స్థితప్రజ్ఞతా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మూడు ముఖ్యమైన మార్గాలు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవడం అనేక ఆసుపత్రుల్లో ఆన్లైన్ కన్సల్టేషన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లోనే బీపీ, షుగర్ పరీక్ష చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా వైద్యుల్ని సంప్రదించి మందులు క్రమబద్ధంగా వాడినట్లయితే రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉండే అవకాశం ఎక్కువ. అదేవిధంగా కొలెస్ట్రాల్ మోతాదును తెలుసుకోవడానికి రక్త పరీక్షలు ఇంటికి వచ్చి చేసే వాళ్ళు ఇప్పుడు నగరాల్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ తెలుసుకున్న తర్వాత వాటిని వైద్యుల సలహాతో నియంత్రించవచ్చు. ఈ ముప్పులను నివారించాలంటే ఏం చేయాలి? మధుమేహం, గుండె జబ్బులు పెద్దసంఖ్యలో రావడం తప్పనిసరిగా జరిగి తీరుతుందని కాదు. వీటిని నివారించుకోవడానికి సమయమింకా మించిపోలేదు. వీటిని ఎదుర్కోవాలంటే మన జీవన విధానంలో పూర్తిగా మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. ఈ మార్పులను సరైన విధంగా తీసుకురాగలిగితే మనం అనేక ప్రాణాలను కాపాడగలుగుతాం. వ్యసనాలకు దూరంగా ఉండటం ఒత్తిడి అధికంగా ఉండటం ఉన్నప్పుడు వ్యసనాలకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. వ్యసనమేదైనా అది మానసిక ఒత్తిడిని పెంచుతుంది కానీ ఎప్పటికీ తగ్గించదు కాబట్టి ఈ పాండమిక్ తరుణంలో వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంతా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. పొగ తాగటం వల్ల గుండె జబ్బు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని మర్చిపోకూడదు. డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
కరోనా.. అప్రమత్తతే అసలు మందు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైద్యపరంగా అనేక సవాళ్లు విసురుతున్నప్పటికీ.. దీర్ఘకాలిక వ్యాధిగ్ర స్తులు సైతం కొన్ని ప్రత్యేక చర్యలు, ముందు జాగ్రత్తలతో కరోనా ముప్పు నుంచి తప్పించుకోవచ్చు నని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. కరోనా సోకకుండా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యం పట్ల అప్రమత్తతతో వ్యవ హరిస్తూ, రోజువారీ పర్యవేక్షణ అమలు చేయాలని సూచిస్తున్నారు. రోజువారీ మందులు క్రమం తప్పకుండా వాడటంతో పాటు, ఇతర సప్లిమెంట్లు, ప్రొటీన్ తీసుకోవడం ద్వారా కరోనా సోకినా సుల భంగా బయటపడొచ్చునని చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన తర్వాత మధుమేహం, రక్తపోటుతో పాటు ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమ స్యలు ఉన్న వారు (కోమార్బిడిటీస్) ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం స్పష్టమైంది. బీపీ ఉన్నవారికి కోవిడ్ సోకితే ఇన్ఫెక్షన్ తీవ్రత పెరుగుతుందని, షుగర్, బీపీ రెండూ ఉంటే వైరస్ ప్రభా వం మరింత ఎక్కువగా ఉంటుందని కూడా తెలిసింది. బీపీ లేదా చక్కెర వ్యాధి ఉన్నవారిలో కార్డియో, సెరెబ్రోవాస్క్యులర్ జబ్బులు వచ్చే అవకాశాలున్నట్టుగా వైద్యులు తేల్చారు. ఈ నేపథ్యంలో బీపీ, షుగర్ ఉన్నవారు కోవిడ్ బారిన పడితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఏయే అంశాలు ప్రభా వితం చేస్తాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై డాక్టర్ ప్రభుకుమార్, డాక్టర్ నవీన్‌రెడ్డి తమ అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి బీపీ, షుగర్ ఉన్న వాళ్లు కష్టమైనా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సిం దే. దగ్గు, జలుబు వంటి చిన్న లక్షణాలు కనిపించినా డాక్టర్లను సంప్రదించాలి. వైద్యులతో టచ్ లో ఉండాలి. షుగర్, బీపీ స్థాయిలను రోజూ చెక్ చేసుకోవాలి. రోజూ వాడే మందుల నిల్వలు సరిపడా ఉండేలా చూసుకోవాలి. స్టెరాయిడ్స్ వినియోగం, మానసిక ఒత్తిళ్లతో పేషెంట్లలో కొత్తగా మధు మేహం రిపోర్ట్ అవుతోంది. వీరికి ముందుగానే రక్తం పలుచన చేసే మందులు, మల్టీ విటమిన్స్, యాంటీ ఇన్ఫ్లమేటర్స్, స్టెరాయిడ్స్ ఇస్తారు. సెకండ్‌వేవ్‌లో డయాబెటీస్, రక్తపోటు ఉన్న వారిలో వైరస్ రియాక్షన్, లోడ్ పెరిగి వైరస్‌తో కూడిన ఫెరిటిన్ శరీరమంతా వ్యాపించి నష్టం చేస్తోంది. – డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటీస్ నిపుణుడు, వృందశ్రీ క్లినిక్ తీవ్రత కొంత పెరిగింది... సెకండ్ వేవ్‌లో వైరస్ జన్యు రూ పాంతరం, పరివర్తనం, మ్యుటేషన్లు చెందడంతో వేగంగా వ్యాప్తి చెందడంతోపాటు తీవ్రత పెరిగిం ది. ఫస్ట్‌వేవ్‌లో ఇంటిలో ఒకరికే పరిమితమైతే, ఇప్పుడు అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. షుగర్, బీపీ పేషెంట్లకు రెండుదశల్లోనూ ఒకే చికిత్స చేస్తున్నాం. స్టెరాయిడ్స్ వాడ కంతో షుగర్ లెవల్స్‌తో పాటు బీపీ పేషెంట్లలో రక్తపోటు పెరుగుతోంది. సెకండ్‌వేవ్‌లో మధుమేహం ఉన్నవారిలో బ్లాక్‌ఫంగస్ కేసులు వస్తున్నాయి. రెండూ ఉన్న వారిలో ‘ఇమ్యూనిటీ సప్రెషన్’ స్థితి ఎక్కువగా ఉండటంతో పాటు, కోవిడ్ ప్రభావం, మందుల ప్రభావంతో షుగర్, బీపీ స్థాయిలు పెరిగి సమస్యలు కాస్త పెరుగుతున్నాయి. – డాక్టర్ ఎ.నవీన్‌రెడ్డి, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ నిపుణుడు, నవీన్‌రెడ్డి హాస్పిటల్, హైదరాబాద్ ఇలా చేస్తే మంచిది.. షుగర్, బీపీ, గుండె సమస్యలున్న వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి గాలిలో కూడా వైరస్ వ్యాపిస్తోంది కాబట్టి ఇళ్లలోనూ మాస్క్‌లు, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి హోం ఐసోలేషన్‌లో ఉన్నపుడు మల్టీ విటమిన్లను బాగా తీసుకోవాలి. విటమిన్–డీ 60కే, ప్రీ ప్రో బయోటిక్స్, విటమిన్–సీ, ప్రొటీన్లు, జింక్ తీసుకోవాలి. ప్రొటీన్ ఫుడ్ తినలేకపోతే పౌడర్ రోజూ తాగాలి. కోవిడ్ సోకినా వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. అందరూ ఆసుపత్రులకు పరిగెత్తుకు వెళ్లొద్దు. వైద్యుల సూచనల మేరకే వ్యవహరించాలి. తరచూ షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. 300 దాటితే తగిన జాగ్రత్తలు తీసుకుని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. బీపీ పేషెంట్లు కూడా తరచూ పరీక్షలు చేయించుకోవాలి. 140 నుంచి 80 రక్తపోటు ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్‌గా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. తాజా ఆకుకూరలు, కాయగూరలు,పండ్లు వంటివి తీసుకోవాలి. అలాగే చేపలు, కోడిగుడ్లు, పాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. షుగరున్న వారు తాము తీసుకునే రోజువారీ ‘డయాబెటిక్ డైట్’ కొనసాగించవచ్చు. మాంసకృత్తులు, పోషకవిలువలు ఎక్కువగా ఉన్న మటన్, చికెన్, పప్పులు, పండ్లు వంటివి తీసుకుంటే ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. -
కరోనా సోకకుండా జాగ్రత్తపడటం ఎలా..?
ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా అనుమానిత లక్షణాలు కన్పించగానే, టెస్టుల కన్నా ముందే లక్షణాలున్న వ్యక్తి మిగతా కుటుంబసభ్యులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉండాలి. సాధారణ జ్వరం, లక్షణాలే కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రత్యేకంగా ఒక గదిలో ఉంటే చాలా మంచిది. లక్షణాలున్న వ్యక్తితో సహా కుటుంబసభ్యులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రతి ఒక్కరూ చేతులు తరచూ శుభ్రం చేసుకుంటుండాలి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చిన్నపిల్లలను సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లకూడదు. ఎక్కువమంది గుమిగూడే ప్రాంతాలకు, వేడుకలకు అస్సలు వెళ్లకూడదు. ఇలా చేయడం వల్ల లక్షణాలున్న వ్యక్తికి టెస్టుల అనంతరం పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, చాలావరకు మిగతా కుటుంబసభ్యులకు, ఇతరులకు సోకకుండా ఉంటుంది. కరోనా సోకిందని తేలిన తర్వాత, స్వల్ప లక్షణాలే ఉన్నా.. ఇంట్లో ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచే వెసులుబాటు, దూరంగా ఉండే అవకాశం లేకపోతే ప్రభుత్వ లేదా ప్రైవేట్ కోవిడ్ కేర్ కేంద్రాలకు పంపించడం మంచిది. కోవిడ్ 19 సెకండ్ వేవ్‌లో వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ముందు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఒకరికి వస్తే అందరికీ సోకే ప్రమాదం తలెత్తుతోంది. ప్రస్తుతమున్న వైరస్ వేరియంట్ల వ్యాప్తి వేగం గతంలో కంటే 50% నుండి 150 % ఎక్కువగా ఉంది. గాలి, వెలుతురు లేని ప్రాంతాల్లో ఇది మరింత వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి ముందుగానే అప్రమత్తం కావడం అనేది చాలా ముఖ్యం. పై జాగ్రత్తలు పాటిస్తే కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. - డా. రాజేంద్ర క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగాధిపతి, మమత మెడికల్ కాలేజీ, హైదరాబాద్ చదవండి: కరోనా భయాన్ని జయించడం ఎలా..? కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా? కరోనా నుంచి కోలుకున్న వెంటనే టీకా వేయించుకోవచ్చా? -
‘మత్తు’ వదిలిస్తున్న ‘ఆపరేషన్ నయా సవేరా’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి ఉన్న మాదకద్రవ్యాల ‘మత్తు’ వదిలించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) రంగంలోకి దిగింది. గంజాయి తదితర మాదకద్రవ్యాల నిరోధానికి ‘ఆపరేషన్ నయా సవేరా’ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో సమాజంలో మాదకద్రవ్యాలు రుగ్మతగా మారాయి. దీంతో ఈ మహమ్మారిని నిర్మూలించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ సూచనల మేరకు ఎస్ఈబీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని కట్టడి చేసేందుకు పైలట్ ప్రాజెక్టుగా ‘ఆపరేషన్ నయా సవేరా’ పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టారు. గతనెల 25 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన విస్తృత దాడుల్లో గుంటూరు జిల్లాలో 22 కేసులు నమోదు చేసి 44 మందిని అరెస్టు చేయడంతోపాటు 59.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లాతోపాటు విజయవాడ నగరంలో 10 కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేసి 19 కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. గతనెల 29న గుంటూరు అర్బన్, విజయవాడలో ఎస్ఈబీ బృందాలు దాడులు నిర్వహించి 4 గ్రాముల ఎండీఎంఏ (సింథటిక్ డ్రగ్స్) స్వాధీనం చేసుకుని నలుగురుని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 174 మందిపై 69 కేసులు నమోదు చేసి 2,176 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలపై ఫోకస్ గంజాయి ఇతర మాదకద్రవ్యాలను అరికట్టేందుకు పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ ‘సాక్షి’కి చెప్పారు. ఈ రెండు జిల్లాల్లోను క్షేత్రస్థాయిలో 179 కార్యక్రమాలు నిర్వహించి 24 వేలమందికి అవగాహన కలి్పంచినట్టు తెలిపారు. డ్రగ్స్ ప్రమాదంపై ర్యాలీలు, సదస్సులు, హోర్డింగ్‌ల ఏర్పాటు చేశామన్నారు. మత్తు పదార్థాల గురించి తెలిస్తే కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించాలని ఆయన కోరారు. చదవండి: పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్.. జగనన్నను కలిశాకే.. ఈ కాళ్లకు చెప్పులు -
కేంద్రం అలర్ట్: కరోనా కట్టడికి ‘ట్రిపుల్ టీ’లు
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వైరస్ కట్టడి చేసేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ కట్టడికి ముఖ్యంగా మూడు ‘టీ’లు ప్రతిపాదించింది. టెస్ట్.. ట్రాక్.. ట్రీట్ అంటే పరీక్షలు చేయడం.. పాజిటివ్ తేలితే వారు ఎవరెవరినీ కలిశారో ట్రేస్ చేయడం.. అనంతరం చికిత్స అందించడం అని అర్థం. కరోనా పరీక్షలు పెంచండి.. జాగ్రత్తలు పాటించండి అని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు 70 శాతం పెంచాలి. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచి వైద్యం అందించాలి. పాజిటివ్ బాధితులు ఎవరెవరిని కలిశారో ట్రేసింగ్ చేయాలి. కేసులు అధికంగా ఉంటే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలి. ఆ జోన్లో ఇంటింటి సర్వే చేసి పరీక్షలు చేయాలి. రద్దీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు. మాస్క్‌లు, భౌతిక దూరం, శానిటైజర్ వినియోగం పెంచాలి. నిర్లక్క్ష్యం చేసే వారిపై జరిమానా విధించాలి. వైరస్ తీవ్రతను బట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరిని ఆంక్షలు, చర్యలు తీసుకోవచ్చు. అంతరాష్ట్ర రాకపోకలపై నిషేధం విధించలేదు. ప్రజలతో పాటు సరుకు రవాణాకు రాష్రా్టల మధ్య అనుమతులు అవసరం లేదు. విద్యాలయాలు, కార్యాలయాలు, రవాణా, హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు ఉద్యానవనాలు, జిమ్ కేందద్రాలు తదితర ప్రాంతాల్లో కరోనా నిబంధనలు విధిగా పాటించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగాలి. వీలైనంత ఎక్కువగా ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాల్లో తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మార్గదర్శకాలు వర్తిస్తాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. చదవండి: తెలంగాణలో విద్యాసంస్థలు బంద్ -
వంటలూ వడ్డింపులతో క్యాన్సర్ నివారణ
క్యాన్సర్ ఎందుకు, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కారణాలేమిటో ఎవరూ చెప్పలేరు. కానీ కొన్ని ఆహార అంశాల్లోనూ, వండటంలోనూ కొన్ని అంశాలు క్యాన్సర్ వచ్చేందుకు దోహదం చేస్తాయని తెలుసు. ఆ అంశాలేమిటో తెలుసుకుని వాటిని చేయకుండా ఉంటే క్యాన్సర్‌ను నివారించినట్లే. ఆహారం వంటల పరంగా క్యాన్సర్‌కు దోహదం చేసే అంశాలేమిటో తెలుసుకోండి. వాటినుంచి వీలైనంత దూరంగా ఉండండి. వీటిని అనుసరించండి ► ఆహారంలో పీచు ఉంటే అది పేగుల లోపలి భాగాన్ని శుభ్రంగా చేస్తుంది. పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు క్యాన్సర్‌ను నివారిస్తాయి. ఇలాంటి పీచులేని పదార్థాలు గతంలో పాశ్చాత్యులు విస్తృతంగా తీసుకునేవారు. దాంతో వారిలో పెద్దపేగు, కోలోరెక్టల్, రెక్టల్ క్యానర్లు ఎక్కువ. ఇటీవల మనం కూడా మారిన మన జీవనశైలి అలవాట్లలో పీచు ఎక్కువగా లేని ఆహారాలవైపు మళ్లాం. ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు, పొట్టు పుష్కలంగా ఉండే అన్ని రకాల ముడిధాన్యాల (హోల్ గ్రెయిన్స్)లో పీచు పుష్కలంగా ఉంటుంది. కేవలం పెద్ద పేగు క్యాన్సర్‌నే గాక... అనేక పెద్ద పెద్ద క్యాన్సర్లూ పీచుతో నివారితమవుతాయి. అందుకే వడ్డించే పదార్థాల్లో పీచు పుష్కలంగా ఉందా లేదా అని చూసుకోవడం క్షేమదాయకం. ► విటమిన్–సి, ఫోలేట్, నియాసిన్ వంటి విటమిన్లు నీళ్లలో కరుగుతాయి. అలా విటమిన్లు ఊరిన నీటితో వంట చేస్తున్నప్పుడు... ఆ నీటిని చాలాసేపు వేడిచేస్తే... అందులోని విటమిన్లు ఇగిరిపోతాయి. మనం ఆకుకూరలతో వంట చేసే సమయంలో ఎక్కువ సేపు వండుతూ ఉంటే మొక్కల నుంచి లభ్యమయ్యే పోషకాలు, ఫైటోకెమికల్స్ తరిగిపోతాయి. ఈ ఫైటోకెమికల్స్ క్యాన్సర్లతో ఫైట్ చేస్తాయి. అందుకే వంట ప్రక్రియలో విటమిన్లూ, పోషకాలు ఆవిరయ్యేలా కాకుండా అవి ఉండిపోయేంతగానే ఉడికించాలి. ఆకుపచ్చ, ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగుల్లో ఉండే కూరగాయలను ఆలివ్ నూనెలో వండటం మేలు. దీనివల్ల నూనెలో కరిగే విటమిన్లు ఒంటికి సమర్థంగా అందుతాయి. ► ఘాటుగా ఉండే ఉల్లి, వెల్లుల్లి క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. వాటిని నేరుగా అలాగే వంటల్లో వేసేయడం కంటే... కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా కొద్దిగా నలగ్గొట్టి వేస్తే... రుచికి రుచీ పెరుగుతుంది. క్యాన్సర్ తో ఫైట్ చేసే పోషకమైన అలిసిన్ వెలువడేందుకూ ఇది దోహదపడుతుంది. ఎర్రగా ఉండే టొమాటోలలో, ఎర్రటి రంగులో ఉండే ద్రాక్షల్లో... ఇలా ఎరుపు రంగులో ఉండే అనేక పండ్లలో లైకోపిన్ అనే క్యాన్సర్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. నేరుగా టొమాటోను తినడం కంటే కాస్తంత ఉడికించాక దాన్ని తింటే... అలా ఉడికించడం ద్వారా వెలువడ్డ లైకోపిన్‌ను మన జీర్ణకణాలు చాలా తేలిగ్గా స్వీకరిస్తాయి. ఇదీ ఆరోగ్యకరంగా వండటానికీ, వడ్డించడానికి ఓ మంచి ఉదాహరణ. ► తాజాపండ్లు క్యాన్సర్‌ను సమర్థంగా నివారించే వాటిల్లో ఒకటి. వీటిల్లోనూ తొక్కతో తినగలిగే జామ, ఆపిల్ వంటి పండ్లను కాస్త కడుక్కుని తొక్కతోనే తినడం మేలు. ఉదాహరణకు ఒక ఆపిల్‌ను తొక్కతో తింటే... మొత్తం పండులో లభ్యమయ్యే దానికంటే... కేవలం ఆ తొక్కలోనే 75% క్వెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్‌తో పోరాడే ఒక అమృతప్రాయమైన జీవరసాయనం. మనం వంటల్లోనూ, వడ్డింపుల్లోనూ ఆహారాల్లో పైన పేర్కొన్న సూచనలు పాటిస్తే అవి క్యాన్సర్ ముప్పునుంచి మనల్ని కాపాడతాయి. ఇవి చేయకండి... ► ఒకసారి వాడిన నూనెను మరోసారి వేడి చేసి ఉపయోగిస్తే క్యాన్సర్‌కు దోహదం చేసే అవకాశం ఉంది. ► కొవ్వులు ఎక్కువ మోతాదులో ఉండే ఆహార పదార్థాలు క్యాన్సర్ వచ్చేందుకు దోహదం చేసేవే. ► సాధారణంగా రెడ్‌మీట్ కూడా క్యాన్సర్ కారకమే. రెడ్ మీట్ ఎక్కువ గా తినే దేశాల్లో కొలోన్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్లు ఎక్కువగా రావడం డాక్టర్లు చూస్తుంటారు. మామూలు కూరగాయలు, ఆకుకూరల ఆహారం తినేవారితో పోలిస్తే ప్రతిరోజూ ప్రతి 100 గ్రాముల రెడ్‌మీట్ తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 17 శాతం పెరగడం నిపుణుల పరిశీలనతో తేలింది. అంతేకాదు... రెడ్ మీట్‌తో ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్, పొట్ట క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుంది. అయితే కొంతమంది మాంసాహార ప్రియులు మటన్ తినకుండా తమాయించుకోలేరు. ఇలాంటివాళ్లు కేవలం రుచికోసం కొద్దిగా అంటే ఉదాహరణకు... రోజుకు 90 గ్రాములకు బదులు మీ రెడ్మీట్ను 70 గ్రాములకే పరిమితం చేసుకోవడం మంచిది. దీనివల్ల పూర్తిగా కాకపోయినా... కొంతలో కొంత క్యాన్సర్ ముప్పు తప్పుతుంది. ► క్యాన్సర్ నివారణలో ఏం వండారన్నది కాదు... ఎలా వండామన్నది కూడా ముఖ్యమే. మనం ఏదైనా పదార్థాన్ని వండుతుంటే దాన్ని ఎంత ఉష్ణోగ్రత వద్ద ఉడికేలా చేస్తున్నారన్నదీ క్యాన్సర్ నివారణలో చాలా కీలకమైన అంశం. ఒక వంటకాన్ని (రెసిపీని) చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వండుతుంటే కొన్నిసార్లు క్యాన్సర్ కారకమైన రసాయనాలు వెలువడేందుకు అవకాశమిస్తున్నామా అని కూడా చూసుకోవాలి. మాంసాన్ని మితిమీరిన ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తున్నా... అంటే గ్రిల్డ్ మాంసంగా వేపుడుగానూ చేస్తున్నామంటే, ఆ మాంసాహారంలోని కొన్ని పదార్థాలు హెటెరో సైక్లిక్ అరోమాటిక్ అమైన్స్ (హెచ్ఏఏ) అనే రసాయన రూపాలుగా మారిపోవచ్చు. అవి క్యాన్సర్ కారకాలు. ఇటీవల విదేశాల్లోలాగా మన దగ్గర కూడా స్మోక్డ్ ఫుడ్ తినడం పెరిగింది. ఇలా స్మోకింగ్ ప్రక్రియకు గురైనా, నేరుగా అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న మంట తగిలేలా చేసినా... అప్పుడా ఆహారపదార్థాల్లోంచి ‘పాలీ సైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ అనే (పీఏహెచ్‌స్) అనే రసాయనాలు ఏర్పడతాయి. అవి కూడా క్యాన్సర్‌ను తెచ్చిపెట్టగల అవకాశం ఉన్నవే. ► క్యాన్సర్ నివారణలో ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేసుకోవడం కూడా కీలక భూమిక వహిస్తుంది. ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేసుకోకపోవడం లేదా నిల్వ చేసుకోవడంలో ఉపయోగించే పదార్థాల వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. చాలామంది ఆహారపదార్థాలను పాడైపోకుండా ఉంచడానికి ‘ఉప్పు’లో చాలాకాలం పాటు ఊరబెడుతుంటారు. ఇలా ఉప్పులో దీర్ఘకాలం ఊరిన పదార్థాల వల్ల పొట్ట లోపలి పొరలు (లైనింగ్) దెబ్బతిని అది ఇన్ఫ్లమేషన్కు (వాపు, నొప్పి, ఎర్రబారడం) గురయ్యే అవకాశం ఉంది. అలా పొట్ట లోపలి పొరలు (లైనింగ్) దీర్ఘకాలం ఒరుసుకుపోతూనే ఉండటం జరుగుతుంటే అక్కడ అలా ఒరుసుకు పోయిన లైనింగ్‌లలో నైట్రేట్ల వంటి క్యాన్సర్ కారక రసాయనాల ప్రభావానికి గురయ్యే అవకాశముంది. అలాంటి చోట్ల హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే సూక్ష్మజీవి నివసిస్తూ ఉంటే... ఆ ప్రాంతాల్లో పుండ్లు పడేలా చేస్తుంది. వీటినే స్టమక్ అల్సర్స్ అంటారు. ఈ స్టమక్ అలర్స్ కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. అది కేవలం ఉప్పు వాడే పచ్చళ్లకు మాత్రమే కాదు... చిప్స్, సాల్టెడ్ పదార్థాలు, బేకరీ ఐటమ్స్‌లో కూడా ఉప్పు ఎక్కువ గా ఉంటుంది. కాబట్టి వాటిని చాలా చాలా పరిమితంగా తీసుకోవాలి. క్యాన్సర్ మాట అటుంచి... మనం తినే ఆహారంలో ఉప్పు పరిమాణం పెరుగుతున్న కొద్దీ హైబీపీ కూడా పెరుగుతూ పోతుంది. అందుకే ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ 6 గ్రాములకు మించి ఉప్పు వాడకూడదు. శ్వేత బిరలి సీనియర్ డైటీషియన్ -
ఇవి తగినంత ఉంటే కరోనాకు చెక్
సాక్షి.హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో గాలి, వెలుతురు కూడా కీలకమని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. సాధారణంగా బహిరంగ ప్రదేశాలతో పోల్చితే గాలి, వెలుతురు సరిగాలేని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల కరోనా ఎక్కువ వ్యాపిస్తుందని గతంలోనే వెల్లడైన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రదేశాల్లో జనం గుమిగూడినప్పుడు మాట్లాడినా.. దగ్గినా.. తుమ్మినా వెలువడే తుంపర్లు సమీపంలో ఉన్న వారిని తొందరగా చేరుకుంటాయి. ఫలితంగా వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువవుతాయి. అయితే, ఇలాంటి చోట్లా సైతం గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చేస్తే వాయునాణ్యత, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వివిధ రూపాల్లో గాలిలో ఉండే వాయు కాలుష్యం తొలగిపోవడమో లేక పలుచన కావడమో జరుగుతుందని తాజాగా నిపుణులు తేల్చారు. ఇది కరోనా వైరస్ వ్యాప్తినీ అడ్డుకుంటుందని జర్మనీలోని హాలే యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ ఎపిడమాలజీ చేసిన ‘రీ స్టార్ట్–19’అధ్యయనంలో వెల్లడైంది. ఇదీ అధ్యయనం: గాలి ద్వారా ‘ఏరోసోల్స్’ఏ విధంగా వ్యాపిస్తాయనే విషయంపై కంప్యూటర్ మోడల్ ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలించారు. గాలి, వెలుతురు తగినంత స్థాయిలో ఉంటే వీటి వ్యాప్తి అంతగా లేదని గుర్తించారు. అందువల్ల అవసరమై న మోతాదులో గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని తేల్చారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం వంటివి కచ్చితంగా పాటిస్తూనే.. మూసి ఉన్న ప్రదేశాల్లో గాలి, వెలుతురు సరిగా ప్రసరించేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తమ పరిశీలనలో వెల్లడైన అంశాలు జనసమూహాలు ఉండే ప్రదే శాల్లోనూ కోవిడ్ మహమ్మారి నియంత్రణకు ఉపయోగపడతాయని వారు పేర్కొంటున్నారు. చదవండి: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కమిటీలు -
సారా కట్టడికి ‘నవోదయం’
సాక్షి, అమరావతి: మద్యం నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) ఇప్పుడు నాటుసారా కట్టడిపైనా దృష్టి సారించింది. ఇందుకోసం ‘నవోదయం’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ అమలులోకి తెచ్చింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. సారా తయారీ, అక్రమ మద్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే వేగుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా తయారీ కేంద్రాల లెక్కలు తేల్చింది. అవి ఎక్కడ? ఎన్ని ఉన్నాయి? ఎవరు తయారు చేస్తున్నారు? వంటి వివరాలను సేకరించింది. ఎస్ఈబీ చేపట్టిన కార్యాచరణలో కీలక అంశాలు ఇవి. ⇔ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 79 పోలీస్స్టేషన్ల పరిధిలో 191 మండలాల్లో మొత్తం 682 నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించారు. ⇔ నాలుగున్నర నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఈబీ బృందాలు జరిపిన దాడుల్లో 19,567 మందిపై కేసులు నమోదు చేశారు. నాటుసారా 2,58,448 లీటర్లు, సారా తయారీ కోసం సిద్ధం చేసిన ఊట 57,21,704 లీటర్లు ధ్వంసం చేశారు. సారాను తరలించేందుకు ఉంచిన 2,956 వాహనాలు, సారా తయారీ కోసం ఉంచిన 2,08,795 కిలోల బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. ⇔ ఎస్ఈబీ బృందాలు సారా తయారీదార్లను గుర్తించి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే చర్యలు వద్దంటూ మొదట కౌన్సెలింగ్ ఇస్తున్నాయి. మాట విని సారా తయారీకి జోలికివెళ్లని కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఆసరా కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. చెప్పినా మాట వినకుండా సారా తయారు చేస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ⇔ రాష్ట్రంలో నేర చరిత్ర ఉన్న పది వేల మందిని ఇకపై సారా తయారు చేయబోమంటూ హామీ ఇచ్చేలా బైండోవర్ చేశారు. ఎంత చెప్పినా వినకుండా సారా తయారీ వీడని 1,500 మందిపై రౌడీషీట్లు తెరిచారు. ఆరుగురిపై పీడీ యాక్ట్‌లు పెట్టారు. సారా తయారీ ఆపకుంటే కఠిన చర్యలు తప్పవు: వినీత్‌బ్రిజ్‌లాల్, ఎస్ఈబీ డైరెక్టర్ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రాణాల మీదకు తెచ్చే నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నాం. సమాజంలో పరువు పోగొట్టుకుని బతకడం కంటే సారా తయారీ ఆపేసి మంచి జీవనం గడపాలని కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అయినా వినకుండా సారా తయారు చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. అటువంటి వారికి 8 ఏళ్లు జైలు శిక్ష , రౌడీషీట్లు, పీడీ యాక్ట్‌లు తప్పవు. జిల్లాల వారీగా నాటుసారా తయారీ కేంద్రాలు: జిల్లా ఎన్ని మండలాలు నాటుసారా కేంద్రాలు శ్రీకాకుళం 13 90 విజయనగరం 10 28 విశాఖపట్నం 21 89 తూర్పుగోదావరి 36 186 పశ్చిమగోదావరి 12 20 కృష్ణా 6 27 గుంటూరు 6 14 ప్రకాశం 9 21 నెల్లూరు 2 7 చిత్తూరు 20 39 వైఎస్సార్ కడప 4 8 అనంతపురం 20 46 కర్నూలు 32 107 -
లైంగిక వేధింపులకు అడ్డుకట్ట
లక్నో: లైంగిక వేధింపులకు గురైన ఆమె జీవితం మీద ఆశను కోల్పోయింది. తనను తాను నిలదొక్కుకొని ఇప్పుడు బాలికలకు, మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తుంది. ఉత్తరప్రదేశ్‌కు చారిత్రాత్మక నగరమైన రాజధాని లక్నోలో నివాసముంటుంది ఉష. మురికివాడల పిల్లలకు విజ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశ్యంతో 2010లో టీచర్‌గా వెళ్లింది. తన సొంత ఖర్చులతో ఆ వాడలో ఒక షెడ్ నిర్మించింది. అందులోనే పిల్లలకు తరగతులు నిర్వహించేది. ఒకనాడు ఆ తరగతి గదిలోనే ఓ వ్యక్తి చేతిలో లైంగికదాడికి లోనయ్యింది. ఈ సంఘటన ఉష మనస్సుపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు ఆర్నెల్ల పాటు చీకటిలోనే కాలం గడిపింది. ఆ తర్వాత తేరుకొని ఇప్పటివరకు 75,000 మంది బాలికలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చి ఆత్మరక్షణలో మహిళలకు ఒక ఉదాహరణగా మారింది ఉషా విశ్వకర్మ. ఉష స్థాపించిన ‘రెడ్ బ్రిగేడ్’ ట్రస్ట్ ఇప్పుడు అక్కడ చట్టం కింద నమోదు చేయబడింది. ఏర్పాటు చేసిన ‘రెడ్ బ్రిగేడ్’ ప్రపంచ ఉనికి మహిళల చేతిలో ఉందని నిరూపించింది ఉష. తన బాల్యాన్ని పేదరికంలో గడపడంతో మురికివాడల పిల్లలకు విద్యను అందించడానికి వెళ్ళింది. ఆ సమయంలో జరిగిన సంఘటనను ఉష చెబుతూ –‘ఆ వ్యక్తి నాకు దగ్గరగా వచ్చినప్పుడు, అతనిని ఎదిరించే ధైర్యం కూడా నాకు లేదు. అతని చేష్టలను చూసి, కొట్టి అక్కడ నుండి తప్పించుకున్నాను. కానీ, కొన్నాళ్లపాటు ఆ ఘటన నన్ను వెంటాడింది. ‘ఎంతో కొంత ధైర్యం ఉన్న నాకే ఇలా జరిగితే మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి?’ అని ఆలోచించాను. సమాజ శ్రేయస్సు కోసం ఏదైనా చేయాలనుకున్నాను. ఈ ఆలోచనతోనే 2011లో ’రెడ్ బ్రిగేడ్’ సంస్థను స్థాపించాను. నా లాగే లైంగిక వేధింపులకు గురైన 15 మంది అమ్మాయిలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చాను’ అని వివరించింది. ఆయుధాలు లేని టెక్నిక్స్ ఉష తన మిషన్ ద్వారా మహిళలు సమాజంలో నిర్భయంగా జీవించగల వాతావరణాన్ని సృష్టించాలని కోరుకుంటోంది. ఆమె తన మిషన్‌కు ఎక్కువమంది అమ్మాయిలను కనెక్ట్ చేయాలనుకుంటుంది. ఈ బ్రిగేడ్‌కు అనుబంధంగా ఉన్న బాలికలు ఎరుపు కుర్తా, నల్ల సల్వార్ ధరిస్తారు. ప్రస్తుతం అలాంటి 100 మంది బాలికలు రెడ్ బ్రిగేడ్‌కు జతచేయబడ్డారు. ఈ బ్రిగేడ్ ద్వారా ఎలాంటి ఆయుధాలు లేకుండా 15–20 ‘నిరాయుధీకరణ’ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్‌ను అభివృద్ధి చేసింది. తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ బాలికల పట్ల దుష్టులు ఎలా ప్రవర్తిస్తారో దృష్టిలో ఉంచుకుని ఈ పద్ధతిని సవరించింది. ఆల్ ఇన్ వన్ ప్రభుత్వ ‘కవాచ్ మిషన్’ కింద 56,000 మంది మహిళలకు ఉష మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చింది. ఇది కాకుండా, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, రైల్వేలు, బ్యాంకులు, పోలీసులు, ఇతర వృత్తులు, మార్షల్ ఆర్ట్స్ వంటి 50 ప్రసిద్ధ సంస్థల మహిళలకు వారి ఆత్మరక్షణ కోసం నైపుణ్యాలను నేర్పిస్తోంది. ఈ విధంగా అన్ని వృత్తులు, అన్ని శాఖలలో పనిచేసే మహిళలకు శిక్షణ ఇవ్వడంలో బిజీగా ఉంటోంది. నాటకాల ద్వారా అవగాహన బాలికలకు, మహిళలకు ఆత్మరక్షణ ఎంత అవసరమో అవగాహన చేసే దిశగా ఆలోచించింది. ఇందుకు మంచి సన్నివేశాలను ఎంచుకొని లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా స్వరం పెంచిన ఉష ఇప్పటివరకు 700 వీధి నాటకాలను నిర్వహించింది. 225 సెమినార్ల ద్వారా మహిళలకు ఆత్మరక్షణ పద్ధతుల గురించి తెలియజేసింది. తనలాగా మరొక్కరు కూడా బాధపడకూడదు. జీవితం మీద నిరాశను పెంచుకోకూడదు. స్త్రీ–పురుషులిద్దరికీ జీవించే హక్కు ఉన్న ఈ సమాజంలో బలం కారణంగా మగవాడు చూపించే దౌర్జన్యాలకు ఆడది బలి కావద్దు. అకృత్యాలను అడ్డుకునే శక్తిని స్త్రీ పెంచుకోవాలని స్వరం పెంచి మరీ నినదిస్తోంది ఉషా విశ్వకర్మ. -
కరోనా వైరస్: త్రిముఖ వ్యూహం..
సాక్షి, శ్రీకాకుళం: కరోనా కల్లోలం సృష్టిస్తుంటే జిల్లా వాసులకు ఆ త్రిమూర్తులు అభయమిచ్చారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి సిక్కోలును కరోనా బారి నుంచి కాపాడడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. ము ఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి మధ్యనే గడు పుతూ ప్రజలకు ధైర్యం చెబుతున్నా రు. లాక్డౌన్లో జనాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. లాక్డౌన్ నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగం అంతా చక్క గా పనిచేసినా వారిని సమన్వయపరచుకుని ముందుకెళ్లడంలో కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు విజయవంతమయ్యారు. ఈ ము గ్గురు అధికారుల వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రజలకు ఇప్పటివరకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. కలెక్టర్ చొరవ ప్రశంసనీయం కరోనా ప్రభావం దేశంలో మొదలైన దగ్గరి నుంచే కలెక్టర్ జె.నివాస్ అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై కన్నేసి ఉంచారు. అధికారుల దగ్గరి నుంచి వలంటీర్లు, ఆశ కార్యకర్తల వరకు అప్రమత్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారంతా హోమ్ క్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వారి కదలికలపై నిఘా పెట్టారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక, వైరస్ వ్యాప్తి జోరుగా జరుగుతున్న వేళ స్వయంగా జనంలోకి వచ్చి అప్రమత్తం చేశారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడకూడదని ని త్యావసర సరుకులు, మందులు, కూరగాయలు అందుబాటులోకి తెచ్చారు. నిర్దేశిత ధరలకు ప్రజల దరి చేర్చా రు. లాక్‌డౌన్‌కు ముందు ఒక్కసారిగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రావడంతో వారిని ఊళ్లలోకి పంపించకుండా ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్లు పెట్టారు. జిల్లాకు 1,445 మంది విదేశాల నుంచి రాగా వారిలో 562 మందిని ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లలో పెట్టి భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. హోమ్ క్వారంటైన్లో ఉన్న వారి బాగోగులు కూడా చూసుకున్నారు. 819 మందికి ఉచితంగా సరుకులు డోర్ డెలివరీ చేయించారు. వలస కూలీల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారికి రోజుకో రకం భోజనం పెడుతున్నారు. అనాథలు, నిరాశ్రయులకు కూడా రెడ్‌క్రాస్ సాయంతో రోజూ భోజనం పెడుతున్నారు. ప్రభు త్వ ఆదేశాలను క్రమం తప్పకుండా పాటిస్తూ.. సొంత వ్యూహంతో ముందుకువెళ్లారు. ఢిల్లీ ఘటన తర్వాత మరింత అప్రమత్తమయ్యారు. ఇక్కడి ముస్లిం పెద్దలతో సమావేశమై సమస్త వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించిన వారి వివరాలు తెలుసుకుని పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు లాక్డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకున్న మత్స్యకారులకు అండగా ఓ బృందాన్నే అక్కడకు పంపారు. ఎస్పీ అవిశ్రాంత యోధుడు జనతా కర్ఫ్యూ దగ్గర నుంచి ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక మరింత వేగం పెంచి, రోడ్లపైనే ఎక్కువగా ఉంటున్నారు. కరోనాపై స్వయంగా అవగాహన కలి్ప స్తున్నారు. ప్రధాన కూడళ్లల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోళ్ల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విధుల్లో ఉన్న పోలీసులకు తగు జాగ్రత్తలు సూచిస్తూ, వారిలో మానసిక స్థైర్యం నింపుతున్నారు. ప్రతి రోజూ పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలకు ముఖ్యమైన ఆదేశాలిస్తూ వస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను ముందుగా గుర్తించి క్వారంటైన్లో ఉంచడమే కాకుండా వారు బయటికి రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. లాక్డౌన్లో రాష్ట్రంలో ప్రతి చోట పోలీసుల తీరుపై కొన్ని విమర్శలు వచ్చినా ఇక్కడా పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. దూసుకుపోతున్న జేసీ లాక్డౌన్ అమల్లోకి రాగానే తిండికి ఇబ్బంది వస్తుందేమోనన్న భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. వైరస్ వస్తే ఎలా ఉంటుందో తెలీదు గాని తినడానికి తిండి దొరకకపోతే ఇలాగే చనిపోతేమోనన్న ఆందోళన మొదట్లో ఉండేది. కానీ వాటిన్నింటినీ జాయింట్ కలెక్టర్ శ్రీని వాసులు పటాపంచలు చేశారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులు దొరకలేదన్న విమర్శలు రాకుండా చూసుకోగలిగారు. సామాజిక దూరాన్ని పాటించేలా షాపుల వద్ద చర్య లు తీసుకుంటూనే కూరగాయలు, మొబైల్ రైతు బజా ర్లు, కూరగాయలు డోర్ డెలివరీ, నిత్యావసర సరుకు లు, మందులు డోర్ డెలివరీ ఇలా ప్రతీది ప్రజల వద్దకే తీసుకొచ్చారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, మాంసం ధరలు పెంచకుండా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ట్రేడర్స్, పౌల్ట్రీ యజమానుల సమావేశమై ధరలపై దిశా నిర్దేశం చేశారు. రబీ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు కూడా చేశారు. వ్యవసాయానికి ఇబ్బందుల్లేకుండా చూడగలిగారు. జిల్లా యంత్రాంగం పనితీరు భేష్: రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో కరోనా కేసులు నమోదు కాకపోవడం మన అదృష్టమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వ్యాధి నియంత్రణలో ఉందని అన్నారు. శ్రీకాకుళంలో రోడ్డుపై వాహనచోదకులను ఆపి జాగ్రత్తలు చెబుతున్న దాసన్న కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖలు స మన్వయంతో చక్కగా పనిచేశాయని ప్రశంసించారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడంతో మీడియా చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి అహరి్నశలు ప్రజా సంక్షేమం తపిస్తోందన్నారు. కరోనా కట్టడిలో ఇది కీలక సమయమని, ఇక ముందు కూడా పూర్తి నిబద్ధత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎల్రక్టానిక్ మీడియా ప్రతినిధులకు బియ్యంతో పాటు నిత్యవసరాల కిట్లను పంపిణీ చేశారు. అలాగే సోమవారం శ్రీకాకుళం నగరంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద రోడ్లపై తిరుగుతున్న వారిని మంత్రి ఆపి కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతనే కరోనా నియంత్రణ సాధ్యపడుతుందన్నారు. జిల్లాలో ఒక్క పాటిజివ్ కేసు కూడా నమోదు కాలేదని ఇకపై కూడా రాకుండా మనమంతా కలిసికట్టుగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు తెలియజేసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. -
కృష్ణా జిల్లాలో కరోనా బుసలు!
సాక్షి, విజయవాడ: జిల్లాలో కరోనా బుసలు కొడుతోంది. ఎక్కడికక్కడ కరోనా కట్టడికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం బాధితుల్లో 78 శాతం మంది ‘ఢిల్లీ’తో సంబంధం ఉన్నవారేనని లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటికే కరోనా పాజిటివ్ బాధితులు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఏడు వందల తొంబై ఎనిమిది మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. మరోవైపు కరోనా వైరస్ సోకిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. వైద్యారోగ్యశాఖ అధికారులు రెడ్‌జోన్ ప్రాంతాల్లో కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో ప్రజల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఈ రోజు ఎన్ని కేసులు వచ్చాయంటూ అధికారులు మొదలుకొని సామాన్యుడి వరకు ఆరా తీస్తున్నారు. గత నెల లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఆదివారం వరకు జిల్లాలో 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క విజయవాడ నగరంలోనే 17 మంది, జగ్గయ్యపేటలో ముగ్గురు, పెనమలూరులో ముగ్గురు, నందిగామ మండలంలో ఇద్దరు, నూజివీడులో ఇద్దరు, మచిలీపట్నం నగరంలో ఒకరు కరోనా పాజిటివ్ బాధితులుగా తేలడంతో అధికారులు అప్రమత్తయ్యారు. వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులు 798 మందిని అధికారులు గుర్తించి విజయవాడ, గన్నవరం, గంగూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లకు తరలించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చి గృహ నిర్బంధంలో ఉన్న వారు 2,443 కాగా, గృహనిర్బంధం పూర్తి చేసిన వారు 870 మందని అధికారులు వెల్లడించారు. ఇంకా గృహ నిర్బంధంలో 1573 మంది ఉండగా, కరోనా పాజిటివ్ వచ్చిన వారు 28 మందిగా నిర్ధారించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారు 798 మంది కాగా, ఇంత వరకు సేకరించిన నమూనాలు 378, వీటిలో నెగిటివ్ వచ్చిన నమూనాలు 155 కాగా, ఫలితాలు రావాల్సి ఉన్న నమూనాలు 195 ఉన్నాయి. చికిత్సతో సంపూర్ణ ఆరోగ్యంతో బయట పడ్డవారు ఇద్దరని వైద్యాధికారులు వెల్లడించారు. పాజిటివ్ కేసుల్లో ఇద్దరు మరణించగా (అధికారికంగా ఒకరి మృతి ప్రకటించాల్సిఉంది), మిగిలిన వారికి విజయవాడ ప్రభుత్వాస్పత్రి, పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలోని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. బెజవాడలో 352 షాపులపై కేసులు కోవిడ్–19 చట్టం అమల్లోకి వచ్చాక నగరంలో వ్యాపారాలు నిర్వహించిన 352 షాపులపై విజయవాడ నగర పోలీసులు కేసులు నమోదు చేసి 535 మందిని అరెస్టు చేశారు. నిబంధనలు పట్టించుకోకుండా లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చిన 16,921 వాహనాలపై కేసులు నమోదు చేసి వారికి రూ.86,88,545 అపరాధ రుసుం విధించారు. మరో 172 వాహనాలను సీజ్ చేశారు. ఒక్క రోజే 25 మంది క్వారంటైన్‌కు.. మచిలీపట్నంలోని చిలకలపూడిలో కరోనా లక్షణాలతో ఉన్న ఒక వ్యక్తిని విజయవాడ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం తరలించారు. శనివారం అతనికి పాజిటివ్ అని తేలింది. అప్రమత్తమైన అధికారులు పాజిటివ్ వ్యక్తి ఇప్పటి వరకు ఎవరెవరిని కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారు? అన్న వివరాలపై ఆరా తీసి 25 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. -
భయాన్ని కాదు.. ధైర్యాన్ని నింపండి
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూనే ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి తప్ప భయాన్ని కాదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ వైరస్‌ను అరికట్టడంలో భాగంగా గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య పరంగా తీసుకోవాల్సిన చర్యలపై వైద్య నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా నివారణకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన ప్రణాళిక, వైరస్ సోకిన వారికి అందించాల్సిన వైద్యం, ప్రభుత్వం తరఫున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై చర్చించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 31 వరకు అమలులో ఉండేలా పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. జనం గుమిగూడకుండా చూడాలి ►పబ్లిక్ ప్రదేశాల్లో జనం గుమిగూడకుండా చూడటంలో భాగంగా థియేటర్లు, మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ అమ్యూజ్మెంట్ పార్క్‌లు మూసి వేయాలి. ►పెద్ద దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు కొనసాగిస్తూనే భక్తులకు దర్శనాలు నిలిపేయాలి. చిన్న దేవాలయాలు, మసీదులు, చర్చిలకు సైతం భక్తులు వెళ్లడం మానుకోవాలి. జాతరలు లాంటివి నిర్వహించకపోతే మేలు. ►హోటళ్లు, రెస్టారెంట్లలో మనిషికి మనిషికి మధ్య 2 మీటర్ల ఎడం పాటించేలా చూడాలి. వివాహాది శుభకార్యాలను వీలైనంత తక్కువ మందితో నిర్వహించాలి. వీలైతే వాయిదా వేసుకోవాలి. ►ప్రజా రవాణాలో ఉన్న వాహనాలు శుభ్రత పాటించాలి. ఎక్కువ మందిని బస్సుల్లో ఎక్కించుకోకూడదు. నిల్చొని ప్రయాణం చేసే పరిస్థితి ఉండకూడదు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నవారు ప్రయాణాలు మానుకోవాలి. నెలాఖరు దాకా అంక్షలు రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు సంబంధించి గురువారం జరిగిన సమీక్షలో సీఎం జగన్ చేసిన సూచనల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు. ఇవీ ఈ నెల 31 వరకు అమలులో ఉంటాయని, అందరూ తప్పకుండా పాటించాలన్నారు. రాష్ట్రంలో ఇదీ పరిస్థితి ►రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వారి కుటుంబాలు, ఇతరత్రా ఇంటింటి సర్వే చేయించామన్నారు. సహాయక చర్యలకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల రూపంలో మనకు మంచి వ్యవస్థ ఉందని చెప్పారు. ►ఇప్పటిదాకా రెండు పాజిటివ్ కేసులు (ఒంగోలు, నెల్లూరు – ఇద్దరూ విదేశాల నుంచి వచ్చిన వారే.. నెల్లూరు యువకుడు పూర్తిగా కోలుకున్నాడు) నమోదయ్యాయని వివరించారు. ఫిలిప్ఫైన్స్ నుంచి వచ్చిన 185 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామన్నారు. ►పలు మార్కెట్లు మూసి వేయడంతో మొక్కజొన్న, జొన్న ధరలు తగ్గుతున్నాయని, ఈ రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అరటి, చీనీ తదితర పండ్ల ధరలు కూడా తగ్గిపోతున్నాయని, కొద్ది రోజుల్లో తిరిగి ధరలను స్థిరీకరించే అవకాశం ఉందని చెప్పారు. ఇలా చేయండి.. ►ఇంటింటి సర్వే తర్వాత ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో మ్యాపింగ్ చేయించాలి. సచివాలయాల్లోని హెల్త్ అసిస్టెంట్లు, ఉద్యోగులు, ఏఎన్ఎం, ఆశావర్కర్, వలంటీర్లు, మహిళా పోలీసులందరికీ యాప్ అందుబాటులో ఉంచాలి. ►ప్రతి వలంటీర్ నుంచి 50 ఇళ్లకు సంబంధించిన డేటా సహా ఎప్పటికప్పుడు పరిస్థితులపై వివరాలను యాప్ ద్వారా తెప్పించుకోవాలి. ఆ డేటాపై సంబంధిత వైద్య సిబ్బంది అలర్ట్ కావాలి. ప్రజలు ఏం చేయాలి? ఏం చేయకూడదన్నదానిపై సూచనలు ఇవ్వాలి. ►వైరస్ నివారణకు చర్యలు చేపడుతూనే, ప్రజలకు ధైర్యం చెప్పాలి. తీవ్ర భయానికి గురిచేసేలా వ్యవహరించొద్దు. -
వదంతులు నమ్మొద్దు.. ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్(కొవిడ్-19) నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుడు కోలుకుంటున్నారని పేర్కొన్నారు. 14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్‌ను పరీక్షించి డిశ్చార్జ్ చేస్తామన్నారు. మాస్క్‌లు,శానిటైజర్ల కొరత రానివ్వం అని పేర్కొన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నిరంతరం సమీక్షిస్తున్నామని.. ప్రజలు ఆందోళన పడొద్దని ఆయన సూచించారు. (నిలువునా ముంచిన ‘కరోనా’ ) కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 840 మంది ప్రయాణికుల్ని గుర్తించామని పేర్కొన్నారు. 560 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని.. 250 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని వెల్లడించారు. 30 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారని చెప్పారు. 92 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 75 మందికి నెగిటివ్ వచ్చిందని.. 16 మంది శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా..లేకపోయినా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. (ఆసుపత్రి నుంచి కరోనా అనుమానితుడి పరార్!) విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో కరోనా టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. వైరస్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంటువ్యాధుల చట్టం-1897ను నోటిఫై చేశామని.. దీంతో జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖాధికారులకు మరిన్ని అధికారాలు కల్పించామని తెలిపారు. కరోనా వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని తెలిపారు. (కరోనాపై తప్పుడు ప్రచారం.. ముగ్గురి అరెస్టు) -
వారానికి మూడు రోజులే హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు హైకోర్టు చర్యలు ప్రారంభించింది. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోర్టుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. తర్వాత హైకోర్టు, జిల్లా, సబార్డినేట్ కోర్టుల విషయంలో హైకోర్టు రిజిస్టార్ జనరల్ ఎ.వెంకటేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు, ఇతర కోర్టుల బార్ అసోసియేషన్లను మూసేయాలని పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాలు అమల్లో ఉంటాయని స్పష్టంచేశారు. ఇవీ నిర్ణయాలు: హైకోర్టు ఇకపై ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో వారానికి మూడురోజులు మాత్రమే పనిచేస్తుంది. ఊ ఉగాది 25న బుధవారం వచ్చినందున ఆ రోజుకు బదులు 26న పనిచేస్తుంది. ఊ అన్ని స్థాయి కోర్టుల్లోనూ కక్షిదారులు న్యాయస్థానానికి రాకూడదు. కేసుకు సంబంధం ఉన్న లాయర్నే కోర్టు హాల్లోకి అనుమతిస్తారు. ఊ ఇతర న్యాయవాదులు కోర్టు కారిడార్లకే పరిమితమవ్వాలి. ఊ గతంలో వివిధ కేసుల్లో జారీ చేసిన స్టే ఉత్తర్వుల గురిం చి కోర్టుల దృష్టికి తీసుకువచ్చి వాటి పొడిగింపునకు లాయర్లు ప్రయత్నించాలి. కోర్టులు స్పందించకపోతే పరిణామాలు చేయిదాటేలా ఉంటాయన్న కేసులను మాత్రమే విచారిస్తాయి. ఊ న్యాయవాదులు కోర్టులోకి వచ్చేముందు బయట ఏర్పాటు చేసే శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి. ఊ కోర్టు ధిక్కార కేసుల్లో వ్యక్తిగత హాజరు కావాలన్న ఉత్వర్వులు తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ అమలు కావు. ఊ కోర్టు ధిక్కార కేసుల్లో వ్యక్తిగత హాజరుపై తాజాగా వెలువడిన ఈ ఉత్తర్వులను అడ్వొకేట్ జనరల్ కార్యాలయం సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ఊ అన్ని రకాల పిటిషన్ల దాఖలుకు వీలుంటుంది. అత్యంత ముఖ్యమైన కేసులను మాత్రమే కోర్టులు విచారిస్తాయి. ఊ హైకోర్టు సిబ్బందికి బయోమెట్రిక్ రద్దు చేశారు. వారంతా రిజిస్టర్లలో సంతకాలు పెట్టాలి. ఊ బార్ అసోసియేషన్, మహిళా న్యాయవాదుల భోజనశాలల్ని మూసివేయాలి. ఊ జడ్జీల వద్ద పనిచేసే లా క్లర్కులు తిరిగి ఉత్తర్వులిచ్చే వరకూ విధులకు హాజరు కానవసరం లేదు. ఊ కింది కోర్టుల్లో బెయిల్, ఇంజక్షన్, రిమాండ్ కేసులకు ప్రాధాన్యత ఇచ్చి వాటినే విచారించాలి. ఇతర కేసుల్ని 3 వారాలపాటు వాయిదా వేయాలి. ఊ వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎవరు కోరినా కింది కోర్టు సానుకూలంగా ఉండాలి. -
కరోనా నివారణకు పటిష్ట చర్యలు
-
ఏపీ: కరోనా నిరోధక చర్యలపై బులెటిన్
సాక్షి, అమరావతి: కరోనా నివారణకు రాష్ట్రంలో పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ (కొవిడ్-19) నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుడు కోలుకుంటున్నారని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. 14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్‌ను పరీక్షించి డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. ( విజయవాడలోనే కరోనా పరీక్షలు) కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 812 మంది ప్రయాణికుల్ని గుర్తించామని తెలిపారు. 536 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని.. 247 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని పేర్కొన్నారు. 29 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 82 మంది నమూనాలను ల్యాబ్‌కు పంపగా 65 మందికి నెగిటివ్ వచ్చిందని..16 మంది శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా, లేకపోయినా ఇళ్లలోనే ఉండాలని ఆయన సూచించారు. కుటుంబ సభ్యులతో, ఇతరులతో కలవకూడదన్నారు. కరోనా వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు (0866-2410978)కి తెలియజేయాలన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయాలని జవహర్‌రెడ్డి సూచించారు. (కరోనా టీకా కోసం యూఎస్ కుయుక్తులు!) -
కరోనాపై ఆందోళన వద్దు..
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని.. వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నిరోధక చర్యలపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ బాధితుడు కోలుకుంటున్నారని పేర్కొన్నారు. 14 రోజుల తర్వాత మళ్లీ శాంపిల్‌ను పరీక్షించి డిశ్చార్జ్ చేస్తామన్నారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి ఏపీకి వచ్చిన 675 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారని తెలిపారు. 428 మంది ఇళ్లల్లోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని పేర్కొన్నారు. 233 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని తెలిపారు.ఆసుపత్రిలో 14 మంది చికిత్స పొందుతున్నారన్నారు. (కరోనా ఎఫెక్ట్: అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ) 52 మందికి నెగిటివ్.. 61 మంది శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా 52 మందికి నెగిటివ్ అని తేలిందని.. 8 మంది శాంపిల్స్ సంబంధించిన రిపోర్టులు రావాల్సిఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా పెట్టామని తెలిపారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో 8,691 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేశామని.. వీరిలో 64 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నం,గన్నవరం, క్రిష్ణపట్నం ఓడరేవుల్లో ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేశామని వీరిలో ఒక్కరికి కూడా వ్యాధి లక్షణాలు లేవని తెలిపారు. (కరోనా పరీక్ష చేయించుకుని రండి..) కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు వ్యాధి లక్షణాలు ఉన్నా.. లేకపోయినా ఇళ్లలోనే ఉండాలని..బయటకు వెళ్లకూడదని సూచించారు. కుటుంబసభ్యులు, ఇతరలతో కలవకూడదని తెలిపారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్‌ను ధరించి 108 వాహనంలోనే సమీప ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని జవహర్‌రెడ్డి సూచించారు. అన్ని జిల్లాలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశాం.పూర్తి స్థాయిలో మాస్క్‌లు అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని కోరారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని తెలిపారు (కోడిని తింటే ‘కోవిడ్’ రాదు..) -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆందోళన వద్దు..
-
ఏపీ: కరోనాపై మరింత అప్రమత్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మరింత అప్రమత్తత చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెల్లూరులో ఇటలీ నుంచి వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదయిందని వెల్లడించారు. బాధితుడు ఉన్న ప్రాంతం చుట్టుపక్కల కిలోమీటరు వరకు ప్రతి ఇంటిని సర్వే చేశామని చెప్పారు. కరోనా బాధితుడి కుటుంబసభ్యులు, పని మనిషికి కూడా వైద్య పరీక్షలు చేయడంతో పాటు.. వైద్యుల పర్యవేక్షణలో కూడా ఉంచామని పేర్కొన్నారు.(ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు) ఏపీలో ప్రస్తుతం మరెక్కడా కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదన్నారు. 13 జిల్లాల్లో 56 ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరో 300 బెడ్లను సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇటలీ నుంచి ఏపీకి 238 మంది ప్రయాణికులు వచ్చారని.. వారిని గుర్తించి ప్రత్యేక వైద్య పరీక్షలు జరుపుతున్నామని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. స్విమ్స్‌లో కరోనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. (కరోనా కలకలం : డిస్నీ ధీమ్‌పార్క్‌ల మూసివేత) -
ఏపీ: ‘కోవిడ్-19’ కేసు ఒక్కటీ లేదు
సాక్షి, అమరావతి: ఏపీలో ఇప్పటి వరకు ఒక్క ‘కోవిడ్-19’ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా వైరస్ (కోవిడ్-19) నిరోధక చర్యలపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. వైరస్ నియంత్రణ కు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో స్క్రీనింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావిత దేశాల నుంచి ఏపీకి వచ్చిన 466 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 234 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని.. 226 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. 36 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 34 మందికి నెగిటివ్ అని తేలిందని పేర్కొన్నారు. ఇద్దరి శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. (కరోనా ఎఫెక్ట్.. దేవుని విగ్రహాలకు మాస్క్‌లు) ఆందోళన వద్దు.. కోవిడ్-19 వైరస్ విషయంలో ఆందోళన చెందవద్దని.. వదంతులు, నిరాధార ప్రచారన్ని నమ్మొద్దని ప్రజలకు జవహర్‌రెడ్డి సూచించారు. కరోనా వైరస్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్లుగా కలెక్టర్లను నియమించామని తెలిపారు. అధిక ధరలకు మాస్క్‌లు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తిస్థాయిలో మాస్క్‌లు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. లైన్ డిపార్ట్మెంట్లోని నోడల్ అధికారులందరితో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. వైరస్ నిరోధక చర్యల్లో విజయవాడలో రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కోవిడ్-19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు( 0866-2410978)కి తెలియజేయాలన్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిలో సంప్రదించాలని సూచించారు. వైద్య సలహాల కోసం 104 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని కెఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. (ఆ 33 మందికీ 'కరోనా' లేదు..) -
కరోనా వైరస్‌పై ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ ( కోవిడ్ –19)పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్‌పై వదంతులు, నిరాధార ప్రచారాన్ని విశ్వసించవద్దని చెప్పారు. కరోనా లక్షణాలేమైనా ఉంటే తక్షణం మాస్క్‌ను ధరించాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు (0866-2410978)కి తెలియజేయాలన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించాలని తెలిపారు.(ఏపీలో 'కోవిడ్' లేదు) ఏపీలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన 378 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారని పేర్కొన్నారు. 153 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 218 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురి పరిస్థితి స్థిమితంగా ఉందని తెలిపారు. 27 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 20 మందికి నెగిటివ్ అని తేలిందని.. ఏడుగురి శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. (అమ్మో.. చైనా నౌక!) ప్రయాణికులపై నిఘా.. కరోనా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టామని జవహర్ రెడ్డి తెలిపారు. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ్రస్కీనింగ్ చేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ డీజీ ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్లు 382 మెడికల్ షాపులపై దాడులు నిర్వహించారని తెలిపారు. అధిక ధరలకు మాస్క్ లు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ లు కూడా రద్దు చేస్తామన్నారు. మెడికల్ షాపులపై దాడుల్ని కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. (ఆందోళన వద్దు.. అప్రమత్తం కావాలి) -
ఆవుల మెడలో రేడియం టేపులు
హరియాణ: పశువులను సంరక్షించాలనే తపనతో ఓ స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితె.. సర్వ్ కాంట్రాక్టర్ సంగ్ (ఎస్సీఎస్), రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ఆర్వీఏ) అనే స్వచ్ఛంద సంస్థలు హరియాణాలోని పంచకులలో రోడ్డు ప్రమాదాల నివారణకు, మూగజీవాల పరిరక్షణకు సరికొత్త పంథా ఎంచుకున్నాయి. రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఆవులు, కుక్కల మెడల్లో రేడియం టేపులు కట్టారు. ఇప్పటి వరకు హైవేలోని 150 ఆవులకు రేడియం టేపులు కట్టామని నిర్వాహకులు తెలిపారు. ఎస్సీఎస్ ప్రెసిడెంట్ రవీందర్ జజారియా మాట్లాడుతూ.. జంతువులు, రాత్రి వేళ బైక్ నడిపే ప్రజలకు రక్షణ కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ‘పొగ మంచు వల్ల వాహనదారులకు జంతువులు కనిపించవు కనుక.. మంచు కురిసే చోట్ల ప్రమాదాలకు అవకాశం ఎక్కువ. అందుకనే రేడియం టేపుల ఆలోచన వచ్చింది. నాణ్యమైన రేడియం టేపులు ధరించిన జంతువులు వాహనాదారులకు దూరం నుంచి కనిపిస్తాయి. దాంతో వారు జాగ్రత్త పడొచ్చు. కోయంబత్తూరు నుంచి టేపులను కొనుగోలు చేస్తున్నామ’ని తెలిపారు. -
అతివేగానికి కళ్లెం
సాక్షి, ఆదిలాబాద్: అతివేగంతో ఎందరో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వాహనదారులు మాత్రం వాటిని తుంగలో తొక్కడంతో అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు సంభవించి అనేక మంది ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ అతివేగంగా వాహనాలు నడిపే వారికి కళ్లెం వేసింది. స్పీడ్‌గన్‌తో వేగాన్ని లెక్కించి మితి మీరితే కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది. ఇటీవల పోలీసు అధికారులు జిల్లాకు రెండు స్పీడ్ కంట్రోల్ లెజర్ గన్స్‌ను తెప్పించారు. జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలు, రద్దీ ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అతివేగంగా వచ్చే వాహనాల ఫొటో తీసి డాప్లర్ సిద్ధాంతం ఆధారంగా స్పీడ్ లెజర్గన్ ద్వారా వేగాన్ని లెక్కిస్తారు. పరిమితికి మించి వేగం ఉంటే ఈ–చలాన్ ద్వారా ఇంటి వద్దకే జరిమానా రశీదులు పంపిస్తారు. గాలిలో కలుస్తున్న ప్రాణాలు అతివేగంతో ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. దీంతోపాటు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 121 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 33 మంది మృత్యువాత పడ్డారు. 70 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇవేకాకుండా అనధికారికంగా ప్రమాదాలు ఎన్నో సంభవించాయి. అయితే వీటిని నివారించేందుకు పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో 11 ప్రమాదకర స్థలాలను గుర్తించింది. ఈ ప్రాంతాల్లో స్పీడ్గన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం దేవాపూర్ చెక్‌పోస్టు, భోరజ్ చెక్‌పోస్టు, చాంద బ్రిడ్జి, తదితర ప్రాంతాల్లో స్పీడ్గన్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదాలు ఎక్కువగా గుడిహత్నూర్ నుంచి నేరడిగొండ, దేవాపూర్ చెక్‌పోస్టు, భోరజ్ ప్రాంతాల్లోనే జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. స్పీడ్‌కు కళ్లెం.. స్పీడ్‌గన్‌తో వాహనాల మితిమీరిన వేగానికి చెక్ పడే అవకాశం ఉంది. వాహనాలు మితిమీరిన వేగంతో వెళితే స్పీడ్‌గన్‌తో దాని వేగాన్ని లెక్కించి ఈ–చలాన్ ద్వారా ఇంటి వద్దకే జరిమానాలు పంపుతారు. రూ.వెయ్యి నుంచి రూ.1400 వరకు జరిమానా విధిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. 14 కంటే ఎక్కువ జరిమానాలు పడిన వ్యక్తి డబ్బులు చెల్లించకుంటే పోలీసులు సంబంధిత వాహన యజమానులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెడతారు. జరిమానా మొత్తంతోపాటు ఫెనాల్టీ కడితేనే వదిలిపెడతారు. అయితే సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.వెయ్యి, రాంగ్రూట్లో వాహనం నడిపిస్తే రూ.1100, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.100, ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్తే రూ.1200, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.500, వాహనానికి బీమా లేకుంటే రూ.వెయ్యి, పొల్యూషన్ ధ్రువీకరణ పత్రం లేకుంటే రూ.వెయ్యి, వాహనానికి నంబర్ ప్లేట్ లేకుంటే రూ.100, మైనర్లు వాహనం నడిపితే రూ.వెయ్యి, పరిమితికి మించి వేగంగా వెళితే రూ.1400 జరిమానా విధిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో ప్రస్తుతం ఈ–చలాన్ విధానం ద్వారానే ఈ జరిమానాలు విధిస్తున్నారు. అజాగ్రత్త, నిబంధనలు అతిక్రమించే వారిపై జరిమానాల రూపంలో కొరడా ఝులిపిస్తున్నారు. నిబంధనలు పాటించాలి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఏ రోడ్డులో ఎంత వేగంతో వెళ్లాలనే విషయం సైన్బోర్డులపై ఉంటుంది. ఆ వేగానికి మించి వెళ్తేస్పీడ్గన్ల ద్వారా ఈ–చలాన్ రూపంలో జరినామాలు విధిస్తాం. వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్లొద్దు. దీంతో ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. వాహనపత్రాలు, లైసెన్స్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపరాదు. ప్రస్తుతం జాతీయ రహదారిపై ఈ స్పీడ్గన్లను ఏర్పాటు చేశాం. – విష్ణు ఎస్.వారియర్, ఎస్పీ -
పులిపిర్లా... ఇలా ట్రై చెయ్యండి!
మన వంటి మీద అక్కడక్కడ పులిపిర్లు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇవి వాటంతటవే తగ్గిపోతాయి కానీ కొంతమందిలో ఏళ్ల తరబడి ఉండి, బాధిస్తాయి. ఇవి చేతులపైన, మెడమీద, ముఖం మీద ఎక్కువగా కనిపిస్తూ, అందవికారంగా మార్చేస్తాయి. పులిపిర్ల నివారణకు అనేక రకాల చికిత్సలు ఉన్నాయి కానీ, కొన్ని చిట్కాల ద్వారా కూడా వాటిని నివారించుకోవచ్చు. ∙ముఖంపైన, మెడ మీద పులిపిరి కాయలు ఉన్నవారు దాల్చిన చెక్కను కాల్చి ఆ బూడిదని కొంచెం సున్నంలో కలిపి, దానికి కొన్ని బొట్లు నూనె కలిపి, వాటిపైన రాస్తే అవి రాలిపోతాయి. ∙అల్లాన్ని సన్నగా చెక్కి, సున్నంతో అద్ది పులిపిరిపై పెడుతుంటే క్రమంగా రాలిపోతాయి. ∙కాలిఫ్లవర్‌ను గ్రైండ్ చేసి రసం తీసి, ఆ రసాన్ని వీలైనన్ని సార్లు పులిపిర్లపై రాస్తుంటే మచ్చలు, గుంటలు పడకుండా రాలిపోతాయి. ∙మందంగా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్ద రాస్తే సరి, అవి ఎండి రాలిపోతాయి. ∙రావి చెట్టు ఫై బెరడును కాల్చి బూడిద చేసి, దానికి సున్నపు నీటి తేటను కలిపి నిల్వ చేసుకుని తగినంత మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేసి దాన్ని పులిపిరిపై రాస్తూ ఉంటే అవి రాలిపోతాయి. కొందరికి కొన్ని రోజులకే మంచి ఫలితం కనిపించవచ్చు. ఇంకొందరికి ఎక్కువకాలం పట్టొచ్చు. ప్రయత్నించి చూడండి. -
లైఫ్ మైనస్ ఫోర్
నానాటికీ మితిమీరుతున్న కాలుష్యం మనుషుల ఆయువును హరించేస్తోంది. వాయుకాలుష్యం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. కాలుష్యం కారణంగా భారతీయులు సగటున నాలుగేళ్ల ఆయువును కోల్పోతున్నారు. భారత్‌లో కేవలం వాయు కాలుష్యం కారణంగా ఏటా నాలుగు లక్షల మంది అకాల మరణాలకు బలవుతున్నారు. మనుషుల నిర్లక్ష్యం ఫలితంగా నీరూ నేలా కలుషితమవు తున్నాయి. ఇష్టానుసారం వ్యర్థాలను నదుల్లోకి వదిలేస్తుండటంతో పవిత్ర నదులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. అంతర్జాతీయంగా ఎన్నో ఘనతలు సాధించిన భారత్, అత్యధిక కాలుష్య నగరాలు గల దేశంగా కూడా మరో ఘనతను సాధించింది. మన నగరాల్లో వీచే గాలి నిండా విషవాయువులు ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 4,300 నగరాల్లోని వాతావరణ కాలుష్యంపై జరిపిన సర్వేలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అత్యధిక వాయు కాలుష్యం గల దేశాల్లో నేపాల్ మొదటి స్థానంలో ఉంటే, భారత్ రెండో స్థానంలో నిలిచింది. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా మనుషులు సగటున 1.8 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయని, భారత్‌లోనైతే సగటున నాలుగేళ్లు ఆయుర్దాయాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయని షికాగో వర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఎపిక్) తెలిపింది. ‘ఎపిక్’ అధ్యయనంలో తేలిన వివరాల ప్రకారం భారత్‌లోని వాయు కాలుష్యం దాదాపు ధూమపానంతో సమానంగా మనుషుల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు, వాయు కాలుష్యం మద్యానికి రెట్టింపు, నీటి కాలుష్యానికి మూడు రెట్లు, హెచ్ఐవీ కంటే ఐదురెట్లు ప్రమాదకరమని ‘ఎపిక్’ హెచ్చరించింది. ఢిల్లీ, బిహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో వాయు కాలుష్యం మరింత తీవ్రంగా ఉన్నట్లు వెల్లడించింది. గాలిలో స్వచ్ఛత కరువు ప్రపంచంలో ఎక్కడ చూసినా గాలిలో స్వచ్ఛత కరువవుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొంభై శాతం జనాభా కలుషితమైన గాలినే పీలుస్తూ బతుకులు వెళ్లదీస్తున్నారు. చిన్నారుల్లో 93 శాతం మంది అనారోగ్యకరమైన గాలినే పీలుస్తున్నారు. నగరాల్లోనే కాదు, పచ్చని పల్లెల్లో సైతం స్వచ్ఛమైన గాలి కరువైపోతోందంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో ఊహించుకోవాల్సిందే. చాలా దేశాలు కాలుష్య నివారణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా, మన దేశంలో మాత్రం అలాంటివన్నీ నాయకుల ప్రకటనల్లో తప్ప ఆచరణలో మచ్చుకైనా కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వాయు కాలుష్యం కారణంగా అకాల మరణాల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదు. వాయు కాలుష్యాన్ని రెండు రకాలుగా అంచనా వేస్తారు. ఒకటి: పీఎం 2.5.. అంటే ప్రతి ఘనపు మీటరు గాలిలో 2.5 మైక్రాన్ల వ్యాసం గల కాలుష్యాలు. చాలా సూక్ష్మంగా ఉండే ఈ కాలుష్యాలు ఊపరితిత్తుల లోలోపలికి చొరబడి ఆరోగ్యాన్ని ధ్వంసం చేస్తాయి. రెండు: పీఎం 10.. అంటే ప్రతి ఘనపు మీటరు గాలిలో 10 మైక్రాన్ల వ్యాసం గల కాలుష్యాలు. ఇవి ముక్కు, గొంతు వరకు మాత్రమే ఇబ్బంది కలిగిస్తాయి. పరిమాణంలో పెద్దగా గల ఈ కలుషిత పదార్థాలు ఊపిరితిత్తుల వరకు చొరబడటం అరుదు. వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో 38 లక్షల మంది ఇళ్ల లోపలి వాయు కాలుష్యాల కారణంగానే మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. వాహనాల నుంచి వెలువడే పొగ, భారీ గృహనిర్మాణాలు, రోడ్ల నిర్మాణాల కార్యకలాపాల వల్ల చెలరేగే ధూళి, జనసంచారం ఉన్న చోట్ల చెత్తను తగులబెట్టడం, వేడుకల్లో విచ్చలవిడిగా బాణసంచా కాల్చడం వల్ల ఆరుబయట కాలుష్యం ఏర్పడుతోంది. ఇప్పటికీ కట్టెల పొయ్యిలే ఆసియా, ఆఫ్రికాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పటికీ పొయ్యి వెలిగించుకోవడానికి కట్టెలు, పిడకలు వంటివి ఉపయోగిస్తుండటంతో ఇళ్ల లోపల కూడా జనం వాయు కాలుష్యం బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మన దేశంలో కట్టెలు, పిడకలతో పొయ్యి వెలిగించుకునే వారి సంఖ్య 10 కోట్ల వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. పొయ్యి వెలిగించుకోవడానికి కట్టెలు, పిడకలు, «ఊక, ఎండుటాకులు, రంపపు పొట్టు వంటివి ఉపయోగిస్తుండటం వల్ల ఇళ్లలో కూడా విపరీతమైన వాయు కాలుష్యానికి లోనవుతూ ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. ఇళ్లలో ఏర్పడిన వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో ఏటా దాదాపు 4 లక్షల మంది వరకు మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 90 శాతం మంది కట్టెలు, పిడకలు వంటివే వంటచెరకుగా వాడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోనైతే 24 శాతం మంది వీటిపైనే ఆధారపడుతున్నారు. మన దేశంలో ఇంటా బయటా వాడుతున్న కట్టెలు, పిడకలు వంటి వాటి పరిమాణం ఏటా 16.50 కోట్ల టన్నుల మేరకు ఉంటుందని, వీటి నుంచి వ్యాపించే పొగ ద్వారా 4.20 లక్షల టన్నుల సూక్ష్మ కాలుష్యాలు గాల్లోకి చేరుతున్నాయని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఒక అధ్యయనంలో వెల్లడించింది. పొయ్యిలోకి పిడకలు వాడే బదులు గ్రామీణ ప్రాంతాల్లో బయోగ్యాస్ ప్లాంటు ఏర్పాటు చేసి, బయోగ్యాస్ ఉపయోగించినట్లయితే వాయుకాలుష్యం తగ్గడంతో పాటు, వ్యవసాయ భూములకు నాణ్యమైన సేంద్రియ ఎరువు కూడా లభిస్తుందని ఐక్యరాజ్య సమితి నిపుణులు సూచిస్తున్నారు. మన దేశంలో వాహనాల ద్వారా వెలువడే పొగ కంటే, వంటచెరకు ద్వారా వెలువడే పొగ మూడు రెట్లు అధికంగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. గ్రామీణ పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నా, కట్టెల పొయ్యిల వాడకం కొనసాగుతూనే ఉంది. వాహనాల కాలుష్యం పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాల సంఖ్య మన దేశంలో నానాటికీ పెరుగుతోంది. నాణ్యమైన పెట్రోలు, డీజిల్ వాడకం వల్ల కొంత కాలుష్యం ఏర్పడుతుంటే, కల్తీ పెట్రోలు, డీజిల్ వాడకం వల్ల అంతకు రెట్టింపు కాలుష్యం చుట్టుముడుతోంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ ఉండటంతో ఆటోలు, మినీవ్యాన్లు వంటివి నడిపే డ్రైవర్లు ఆదాయం కోసం కల్తీ ఇంధనంపై ఆధారపడుతున్నారు. కల్తీ ఇంధనంతో నడిచే వాహనాలు వాతావరణంలోకి మరింతగా కాలుష్యాన్ని విరజిమ్ముతున్నాయి. వాహనాల ద్వారా కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లతో పాటు ప్రమాదకరమైన మిథేన్ వంటి హైడ్రోకార్బన్లు గాలిలోకి చేరుతున్నాయి. ఇవి ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాహనాల వల్ల వెలువడే కాలుష్యాన్ని ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరం చేస్తోంది. ట్రాఫిక్ రద్దీలో చిక్కుకున్న వాహనాలను నెమ్మదిగా నడపక తప్పని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు వాహనాల్లోని ఇంధనం మితిమీరి ఖర్చవడం ద్వారా గాల్లోకి కలుషిత వాయువులు చేరుతుంటాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నీ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. నగరాల్లో పెరుగుతున్న జనాభాకు, వాహనాలకు అనుగుణమైన రోడ్లు లేకపోవడంతో మన నగరాల్లో ట్రాఫిక్ సమస్య అనివార్యంగా మారుతోంది. వాహనాల వల్ల ఏర్పడిన కాలుష్యం కారణంగానే బెంగళూరు వంటి కొన్ని నగరాల్లో దాదాపు యాభై శాతం మంది చిన్నారులు ఉబ్బసం బారిన పడుతున్నారు. వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యమే కాకుండా, బొగ్గు, చమురు, సహజవాయువులను ఇంధనంగా ఉపయోగించే థర్మల్ పవర్ ప్లాంట్లు కూడా ఇతోధికంగా కాలుష్యానికి కారణమవుతున్నాయి. వాహనాలు, థర్మల్ పవర్ప్లాంట్ల నుంచి గాలిలోకి సూక్షా్మతి సూక్ష్మమైన కార్బన్ కణాలు, ధూళి కణాలు మోతాదుకు మించి చేరుతున్నాయి. వాహనాల కారణంగా వాయు కాలుష్యమే కాకుండా, ధ్వని కాలుష్యం కూడా ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోంది. వాహనాల నుంచి వెలువడే పొగ, విపరీతమైన ధ్వని కారణంగా ప్రజలు నానా వ్యాధుల బారిన పడుతున్నారు. వాయు కాలుష్యం వల్ల తలెత్తే వ్యాధులు వాయు కాలుష్యం వల్ల తలెత్తే కొన్ని ముఖ్యమైన వ్యాధులు ఇవే: ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ), లుకీమియా, న్యుమోనియా, ఊపిరితిత్తుల బలహీనత, గుండెజబ్బులు, గర్భిణులు వాయు కాలుష్యానికి లోనైతే వారికి పుట్టే పిల్లల్లో ఆటిజం వంటి లోపాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయని ఇటీవలి అధ్యయనాలు తేల్చాయి. నీటి కాలుష్యం వాయు కాలుష్యం తర్వాత భారత్‌ను పట్టి పీడిస్తున్న మరో పెద్ద బెడద నీటి కాలుష్యం. దేశవ్యాప్తంగా గల 3,119 నగరాలు, పట్టణాలు ఉంటే, వాటిలో కేవలం 209 నగరాలు, పట్టణాల్లో మాత్రమే మురుగునీటి నిర్వహణ వ్యవస్థ పాక్షికంగా ఉంది. కేవలం ఎనిమిది నగరాల్లో మాత్రమే మురుగునీటి నిర్వహణ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దేశంలోని 114 పట్టణ ప్రాంతాలకు చెందిన మురుగునీటిని ఏమాత్రం శుద్ధి చేయకుండా, యథాతథంగా గంగానదిలోకి వదిలేస్తున్నారు. భారత్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ప్రతిరోజూ 3835.40 కోట్ల లీటర్ల మురుగునీరు విడుదలవుతోందని అంచనా. అయితే, మన పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న మురుగునీటి శుద్ధి యంత్రాలు రోజుకు 1178.60 కోట్ల లీటర్ల మురుగునీటిని మాత్రమే శుద్ధి చేయగలవు. మిగిలిన మురుగునీరంతా యథాతథంగా నదుల్లోకి చేరుతోంది. దీనివల్ల ప్రజలు పవిత్రంగా భావించే నదులు దారుణంగా కలుషితమవుతున్నాయి. దేశంలోనే ప్రధానమైన గంగానదిని తీసుకుంటే, ఈ నది పరీవాహక ప్రాంతాల్లో దాదాపు 50 కోట్ల మంది నివసిస్తున్నారు. గంగానదిలో రోజూ దాదాపు 20 లక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. యమునా నది పరిస్థితి కూడా దాదాపు ఇదే తీరులో ఉంది. ఈ నదుల జలాల్లో కోలిఫామ్ బ్యాక్టీరియా సహా నానా ప్రమాదకర సూక్ష్మజీవులు, రసాయనాలు ఉన్నట్లు శాస్త్రీయంగా నిర్వహించిన పరీక్షల్లో తేలింది. భారత ప్రభుత్వం 2002లో జాతీయ జల విధానంలో మార్పులు చేపట్టింది. నీటి వనరుల నిర్వహణ వికేంద్రీకరించి, నీటి వనరులు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా ఈ విధానాన్ని రూపొందించినా, నేటికీ పరిస్థితులు మెరుగుపడిన దాఖలాల్లేవు. నీటి కాలుష్యం వల్ల తలెత్తే వ్యాధులు నీటి కాలుష్యం వల్ల డయేరియా, కలరా, మలేరియా, ఫైలేరియాసిస్, టైఫాయిడ్, హెపటైటిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపిస్తున్నాయి. మురుగునీరు నిల్వచేరే చోట దోమలు విజృంభించి బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, చికున్ గున్యా వంటి నానా రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. ప్రభుత్వం ‘స్వచ్ఛభారత్’ వంటి కార్యక్రమాలు తలపెట్టినా, ప్రజా చైతన్యం కొరవడటం వల్ల ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ఘన వ్యర్థాల కాలుష్యం ఘన వ్యర్థాల కాలుష్యం మన దేశాన్ని పీడిస్తున్న మరో పెద్ద సమస్య. విచ్చలవిడి ప్లాస్టిక్ వాడకం వల్ల పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, వ్యర్థమైన ఆహార పదార్థాలు, జంతు కళేబరాలు, కర్మాగారాల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు, ఆస్పత్రుల వ్యర్థాలు, భవన నిర్మాణ కార్యక్రమాల వల్ల పోగుపడే సిమెంటు, కాంక్రీటు వ్యర్థాలు భూసారానికి తీరని నష్టం కలిగిస్తున్నాయి. వీటికి తోడు ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం పెరగడంతో వీటి వ్యర్థాలు కూడా ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. భారత్‌లో ఏటా 20 లక్షల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగుపడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి అధ్యయనంలో తేలింది. భారత్‌లోని పట్టణ ప్రాంతాల నుంచి ఏటా దాదాపు 10 కోట్ల టన్నులకు పైగా ఘన వ్యర్థాలు పోగుపడుతున్నాయి. ఇవి చెత్తకుప్పల్లోకే కాకుండా కాలువలు, నదుల్లోకి, తీర ప్రాంతాల్లోనైతే సముద్రాల్లోకి చేరుతున్నాయి. నదులు, సముద్రాల్లోకి చేరిన ప్లాస్టిక్ వ్యర్థాలు వాటిలోని జలచరాల మనుగడకు ముప్పు తెస్తున్నాయి. వ్యర్థాల నియంత్రణకు సమీకృత విధానాన్ని అమలు చేయాలని, ఘన వ్యర్థాల్లో తడి, వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలని, వ్యర్థాలను రీసైకిల్ చేయడం, ప్రమాదకర వ్యర్థాలను సురక్షితమైన పద్ధతుల్లో తగులబెట్టడం వంటి చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు 2000 సంవత్సరంలో దేశంలోని పట్టణ సంస్థలను ఆదేశించినా, చాలా పట్టణాల్లో నేటికీ చెత్త సమస్య కొనసాగుతూనే ఉంది. అక్కడక్కడా కొన్ని పట్టణ సంస్థలు ప్లాస్టిక్ సంచుల వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తున్నా, చాలా చోట్ల ప్లాస్టిక్ సంచుల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉంది. వీధుల్లో పోగుపడిన చెత్తకుప్పలు ఎలుకలకు ఆలవాలంగా మారే అవకాశాలు ఉంటాయి. ఎలుకలు మితిమీరితే వాటి ద్వారా ప్లేగు వంటి మహమ్మారి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. ఘన వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల జీర్ణకోశ సమస్యలు, డయేరియా, కలరా, హెపటైటిస్ వంటి వ్యాధులు ప్రబలడానికి కారణమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు ఎలా ఉన్నా, ప్లాస్టిక్ వాడకంపై ప్రజలే స్వీయ నియంత్రణ పాటిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. – పన్యాల జగన్నాథదాసు సిగరెట్లకు సమానమైన కాలుష్యం సిగరెట్లు తాగే అలవాటు ఉన్నా లేకున్నా, మన నగరాల్లోని గాలిని పీలిస్తే చాలు ఉచితంగానే సిగరెట్ల వల్ల కలిగే దుష్ఫలితాలన్నీ కలుగుతాయని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు చేపట్టిన తాజా అధ్యయనంలో తేలింది. ఏయే నగరాల్లోని గాలి ఎన్ని సిగరెట్లకు సమానమో వివరిస్తూ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం... పీఎం –10 కాలుష్యాల్లో టాప్ – 5 నగరాలు ఢిల్లీ - 292 ఢారా - 147 కైరో - 284 ముంబై -104 బీజింగ్ - 92 -
నిర్వహణ కాదు.. నివారణ ముఖ్యం
ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఏర్పడుతున్న సంక్షోభాలను నిర్వహిం చడం కంటే వాటిని నివారించడం ఎంతో కీలకమైన అంశం. ఒక చిన్న రాష్ట్రమైన కేరళ ఇటీవల కనీవినీ ఎరుగని వరదల బారినపడి రూ. 21వేల కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. పశ్చిమకనుమల్లో పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన 3 ప్రాంతాల్లో 14 లక్షల చదరపుటడుగుల నేల క్షయమైపోవడంపై మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలోని వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్పర్ట్ ఎకాలజీ ప్యానెల్ చాలాకాలం క్రితమే తీవ్రంగా హెచ్చరించింది. ఈ కీలక ప్రాంతంలో నిర్మాణాలను, మైనింగ్ కార్యకలాపాలను తక్షణం నిషేధించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. కానీ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మాదిరే కేరళ ప్రభుత్వం మాధవ్ గాడ్గిల్ నివేదికను అలా తోసిపుచ్చింది. దీని ఫలితమే పెను వరద బీభత్సం. భారతదేశం ప్రకృతి వైపరీత్యాలకు నిలయం. దేశ భూభాగంలో 70 శాతం మేరకు సునామీలకు, తుపానులకు నిలయంగా ఉంటోంది. దాదాపు 60 శాతం భూమి భూకంపాల బారిన పడుతుండగా, 12 శాతం వరదల బారిన పడుతోంది. కానీ పట్టణ భారత్‌లో మాత్రం బహుళ అంతస్థుల భవనాలను విచ్చలవిడిగా కడుతున్నారు. ఇవి భూమిపై వేస్తున్న అదనపు భారాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా భూకంపాలకు సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సును దేశంలో అతికొద్ది యూనివర్సిటీలు మాత్రమే నిర్వహిస్తుండటం గమనార్హం. ప్రకృతి బీభత్సం ఇంత ప్రమాదకర స్థాయిలో చెలరేగుతున్నప్పటికీ నష్ట నివారణ ప్రక్రియ ఇప్పటికీ దేశంలో శైశవదిశలోనే ఉంటోంది. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కూడా రిస్క్ మేనేజ్మెంట్ రంగంలో నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి సైనిక బెటాలియన్ల ఏర్పాటుతోపాటు ప్రత్యేక బృందాలను ఎర్పర్చుకోవాలని కేంద్ర హోంశాఖ 2003లోనే ప్రతిపాదించింది. ప్రత్యేకించి కేరళ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి శిక్షణా సంస్థను నెలకొల్పుకోవాలని, పోలీసు బెటాలియన్లను సిద్ధం చేసుకోవాలని హోంశాఖ సూచిం చింది కానీ నేటికీ కేరళ ప్రభుత్వం స్పందించలేదు. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం. కేదార్నాథ్ విషాదం జరిగి ఏళ్లు గడిచిపోయినప్పటికీ ఉత్తరాఖండ్ రాష్ట్రం మూడు నుంచి ఆరు గంటల ముందే కారు మేఘాల గురించి, అతిభారీ వర్షాల గురించి హెచ్చరించే డాప్లర్ రాడార్ల వ్యవస్థను చాలా పరిమితంగానే కలిగి ఉంది. తగిన సంఖ్యలో హెలిపాడ్లు సరే సరి.. వరద తాకిడికి గురయ్యే ప్రాంతాల్లో నిర్మాణాలు ఎలా జరగాలో సూచించే మార్గదర్శక సూత్రాలు, వరద సమయాల్లో సురక్షిత ప్రాంతాలను గుర్తించే మ్యాప్‌లు కూడా తగినన్ని లేకపోవడం విచారకరం. పర్వతప్రాంతాల్లో భారీ డ్యామ్‌లకు ఆమోదముద్ర తెలిపినప్పటికీ జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ –ఎన్‌ఎమ్‌డీఏ– మూగపోయినట్లు కనిపిస్తోంది. భారత్‌లోని 5 వేల డ్యామ్‌లకు సంబంధించి అతి కొద్ది రాష్ట్రాలు మాత్రమే అత్యవసర కార్యాచరణ పథకాలతో సంసిద్ధంగా ఉన్నాయి. ఇంతవరకు 200 డ్యామ్‌లను మాత్రమే ఇవి కవర్ చేయడం గమనార్హం. మిగిలిన 4,800 డ్యాముల అతీగతీ లేదు. కేవలం 30 రిజర్వాయర్లు, బ్యారేజీలకు మాత్రమే వరద ప్రవాహం గురించిన అంచనాలు సిద్ధంగా ఉన్నాయి ప్రధాన నగరాల్లో వరద ప్రమాదాల గురించిన అంచనా, ఉపశమన చర్యల ప్రాజెక్టుల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదని కాగ్ దుయ్యబట్టింది కూడా. ఇక వరద ప్రాంతాల్లో ధ్వంసమైన ఇళ్లకు చెల్లిస్తున్న నష్టపరిహార మొత్తం దేశమంతా ఒకే విధానంతో ఉండటం సమస్యలను రెట్టింపు చేస్తోంది. నష్టతీవ్రతకు అనుగుణంగా పరిహారం అందించకుండా సమానత్వ ప్రాతిపదికన రూళ్లకర్ర సిద్ధాం తాన్ని అమలు చేస్తే ప్రభావిత ప్రాంతాలు కోలుకోవడం చాలా కష్టం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, మత్స్య పరిశ్రమలు, పశుసంపద, హస్తకళలు వంటి వాటికి జరిగిన నష్టంపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే అవి కుప్పగూలడం తథ్యం. అన్నిటికంటే ముఖ్యంగా విపత్తులు సంభవిం చినప్పుడు సైన్యం, పారామిలటరీ బలగాలను మాత్రమే తరలించే పద్ధతి వల్ల రాష్ట్రాల్లో వరద సహాయక చర్యలు కుంటినడకతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశం బలమైన విపత్తు నిర్వహణా సంస్థను తక్షణం నెలకొల్పాల్సిన అవసరముంది. ఇప్పుడు కావలసింది ప్రకృతి వైపరీత్యాల అత్యవసర నిర్వహణపై దృష్టి సారించడమే కానీ తాత్కాలిక చర్యలతో సరిపెట్టుకోవడం కాదు. ఈ విషయంలో రాష్ట్రాల స్వావలంబన చాలా ముఖ్యం. వరుణ్‌గాంధీ వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్ : fvg001@gmail.com -
నారింజ క్యాన్సర్ నివారిణి
నారింజ పండ్లు అంటే వ్యాధుల నివారణకు అడ్డుగోడలా నిలిచే రక్షణ కవచాలని అర్థం. పీచు ఎక్కువ, వ్యాధినిరోధకతను కలిగించే పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ కావడం వల్ల వీటిని కాస్త ఎక్కువగా తిన్నా లాభమే తప్ప నష్టం లేదు. నారింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని... ►నారింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఇవి ఎన్నో రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. ∙కణాలను నాశనం చేసి, ఏజింగ్‌కు తోడ్పడే ఫ్రీరాడికల్స్‌ను నారింజల్లోని హెస్పరిడిన్, హెస్పరెటిన్ వంటి బయోఫ్లేవనాయిడ్స్ సమర్థంగా అరికడతాయి. అందువల్ల నారింజలను తినేవారు దీర్ఘకాలం యౌవనంగా ఉంటారు. ∙నారింజపండ్లలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. అది అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే నారింజ చాలా వ్యాధులకు రుచికరమైన నివారణ అని చెప్పవచ్చు. ∙నారింజలో పీచు చాలా ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి నారింజ బాగా తోడ్పడుతుంది. ►మనలోని కొలెస్ట్రాల్‌ను అరికట్టడం ద్వారా రక్తప్రవాహం సాఫీగా జరగడానికి నారింజ బాగా ఉపయోగపడుతుంది. ఈ కారణం వల్ల గుండె ఆరోగ్యం దీర్ఘకాలం బాగుండటమే కాకుండా, చాలా రకాల గుండెజబ్బులూ నివారితమవుతాయి. అంతేకాదు... ఈ పండులోని పొటాషియమ్ రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. ఈ కారణం గా చూసినా ఇది గుండెకు మంచిది. ∙ఎక్కువ పీచు, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల స్థూలకాయం, బరువు తగ్గడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. ∙ఇందులో విటమిన్–ఏ కూడా పుష్కలంగా ఉండటం వల్ల కంటిచూపునూ మెరుగుపరుస్తుంది. -
ప్రాణాంతక వైరస్ : లక్షణాలు, వ్యాప్తి, నివారణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక వైరస్ ‘నిఫా’ ప్రకంపనలు రేపుతోంది. కేరళను వణికిస్తున్న ఈ కొత్త వ్యాధి ఇప్పటికే 11 మందిని పొట్టన పెట్టుకోగా... మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. వ్యాధి సోకిన పందులు, ఇతర సంక్రమిత జంతువులు ద్వారా లేదా కలుషితమైన పండ్లు (గబ్బిలాలు సగం తినే పండ్లను తినడం) ద్వారా ఈ వైరస్ సోకుతుందని ఇండియన్ జర్నల్ ఆఫ్ వైరాలజీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ పుట్టుక, విస్తరణ, వ్యాధి నిర్ధారణ, నివారణ చర్యలపై నిపుణుల సూచనలను ఒకసారి చూద్దాం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 1998 లో మలేషియాలో ఈ వైరస్‌ను తొలుత గుర్తించారు. మలేషియా, సింగపూర్లలో 100 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. నిఫా వైరస్ (ఎన్ఐవీ) పారామిక్సోవిరిడే జాతికి చెందినదీ వైరస్. ఈ వైరస్ అటు మనుషులను, ఇటు జంతులను కూడా సోకే ప్రమాదముంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అందించిన సమాచారం ప్రకారం ఇండియాలోనూ గతంలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. మలేషియా నుంచి 2001 ఈ వైరస్ మెల్లగా బంగ్లాదేశ్‌కు పాకింది. దాదాపు ప్రతి ఏడాది ఈ వైరస్ తన ఉనికిని చాటుకుంటోందని సీడీసీ తెలిపింది. ఆ తర్వాత ఇండియాలోని సిలిగురిలో కూడా వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సోకుతున్నట్లు గుర్తించారు. వ్యాధి లక్షణాలు ఈ నిఫా వైరస్ గుర్తించడానికి 5 నుంచి 14 రోజులు పడుతుంది. ఆ తర్వాత శరీరంలో చాలా వేగంగా మార్పులు కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం, శ్వాస సంబంధమైన సమస్యలు, లోబీపీ, అపస్మారక స్థితి, ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి, వాంతులు, అలసట, అస్పష్టమైన దృష్టి వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. వ్యాధి ముదిరితే మెదడును ప్రభావితం చేసే ఎన్సెఫలైటిస్ కారణంగా రోగి కోమాలోకి వెళ్ళవచ్చు. అయితే ప్రస్తుతం కేరళలో ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు మరికొన్ని లక్షణాలు కూడా గుర్తించారు. జ్వరం, సడెన్‌గా శ్వాస ఆడకపోవడం, లో బీపీతో రోగులు బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనికి లాంటి చికిత్స అందుబాటులో లేదు. అయితే ఆస్ట్రేలియాలో గుర్రాలకు హెండ్రా అనే వైరస్ సోకినపుడు ఇచ్చే చికిత్సనే ఈ నిఫాకు కూడా ప్రస్తుతం ఇస్తున్నారట. నిఫాకు ఆ పేరు ఎలా వచ్చింది? మలేషియాలో సుంగాయ్ నిఫా అనే గ్రామంలో మొదటగా ఈ వైరస్ కనిపించడంతో దానికి నిఫా అనే పేరు పెట్టారు. పందుల తర్వాతి కాలంలో కొన్ని జాతుల గబ్బిలాల ద్వారా ఈ వైరస్ సోకింది. ఈ నిపా వైరస్ ఓ జూనోటిక్ వైరస్. అంటే ఇది మనుషులకు, పశువులకు గాలి ద్వారా లేక లాలాజలం ద్వారా సోకుతుంది. అయితే ఇది గాలి ద్వారా సోకేది కాదని డాక్టర్లు చెబుతున్నారు. 1999లో పశువులకు దగ్గరగా ఉండే రైతులు, ఇతరుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. ఆ సమయంలో 300 పందులు పాక్షికంగా ఈ వైరస్ బారిన పడగా.. వంద మందికి పైగా మరణించారు. మొత్తం 265 మందికి ఈ వైరస్ సోకగా.. 40 శాతం మంది వ్యాధి ముదరడంతో చనిపోయారు. అప్పట్లో వ్యాధి సోకకుండా పది లక్షల పందులను చంపేశారు. తాజాగా గబ్బిలాలను తాకడం లేదా అవి కొరికిన పండ్లు తినడం ద్వారా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెప్పారు. ఇది ప్రాణాంతకమైన అంటువ్యాధి అని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోగి నుండి దూరంగా ఉండటం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, టాయిలెట్ల వాడకం దగ్గరనుంచి రోగులు ఉపయోగించే బట్టలు, పాత్రలను విడిగా ఉంచాలని సూచిస్తున్నారు. మృతదేహాన్ని తాకకుండా ఉండటంతోపాటు శ్మశానానికి తరలించేటపుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలంటున్నారు. -
ఆ ప్రభావం బిడ్డపై ఉంటుందా?
‘బేబి వెయిట్’ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? నేను సన్నగా ఉంటాను. నాకు పుట్టబోయే బిడ్డ మంచిలావుతో బొద్దుగా ఉండాలనుకుంటున్నాను. ఇది సాధ్యమేనా? బిడ్డ ఎక్కువ బరువుతో పుట్టాలంటే నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయగలరు. – కె.నందిత, ఆళ్లగడ్డ బిడ్డ బరువు అనేది తల్లి తీసుకునే ఆహారం, తల్లి నుంచి బిడ్డకు రక్త సరఫరా సరిగా ఉండటం, బిడ్డకు రక్తం వెళ్లే రక్తనాళాలు సరిగా వ్యాకోచించి ఉండటం, రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండటంపై ఆధారపడి ఉంటుంది. అలాగే తల్లిలో బీపీ, షుగర్, థైరాయిడ్, రక్తహీనత, కిడ్నీ, గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా ఉండటం వంటి అనేక అంశాల మీదా ఆధారపడి ఉంటుంది. ఆహారంలో రోజూ ఎక్కువగా పాలు, పెరుగు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు, మాంసాహారం వంటివి తీసుకోవడం వల్ల బిడ్డ బరువు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆహారాన్ని రోజూ కొద్దికొద్దిగా రెండు గంటలకోసారి తీసుకుంటూ ఉండాలి. కొంతమందిలో వారి శరీరతత్వాన్నిబట్టి ఆహారం ఎంత తీసుకున్నప్పటికీ తల్లి బరువే పెరుగుతుంది కానీ ఆహారం బిడ్డకు చేరదు. దాంతో బిడ్డ బరువు ఎక్కువగా పెరగకపోవచ్చు. మా కజిన్ abnormal uterine bleeding(aub) సమస్యతో బాధపడుతోంది. ఈ సమస్య గురించి వినడం ఇదే మొదటిసారి. ఇది ఏ కారణాల వల్ల వస్తుంది. నివారణ చర్యలు ఏమిటి? – పి.చందన, పిడుగురాళ్ల పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి నెలకోసారి మూడు నుంచి అయిదు రోజుల వరకు అవ్వడం సాధారణం. కానీ కొంతమందిలో క్రమం తప్పి, బ్లీడింగ్ త్వరత్వరగా అంటే నెలకు రెండుసార్లు లేదా ఇరవై రోజులకోసారి బ్లీడింగ్ ఎక్కువగా ఎక్కువ రోజులు అవ్వడం, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. దీన్నే అబ్నార్మల్ యుటెరిన్ బ్లీడింగ్ అంటారు. తెలియకుండా అబార్షన్ అయ్యి ముక్కలు ఉండిపోవడం, థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో ఫైబ్రాయిడ్, పాలిప్ వంటి కంతులు, ఎండోమెట్రియోసిస్, నీటి బుడగలు, అండాశయం, గర్భాశయ ఇన్ఫెక్షన్లు, గర్భాశయ క్యాన్సర్ (45 ఏళ్లు దాటిన తర్వాత), రక్తం గూడుకట్టే ప్రక్రియలో సమస్యలు, మానసిక ఒత్తిడి, అధిక బరువు, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల అబ్నార్మల్ యుటెరిన్ బ్లీడింగ్ అవ్వొచ్చు. వాటికి గల కారణాలను తెలుసుకోవడానికి జనరల్ ఎగ్జామినేషన్, స్పెక్యులమ్ పరీక్ష, స్కానింగ్, రక్త పరీక్షలు, పాప్ స్మియర్ వంటి ఇతర అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణాన్నిబట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. కొన్ని రకాల సమస్యలు రాకుండా ఉండేందుకు మన చేతిలో ఏమీ ఉండదు. కాకపోతే సమస్యలను ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల, సమస్య జటిలం కాకుండా ఉంటుంది. అలాగే నివారణలో భాగంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, ఒకవేళ అధిక బరువు ఉంటే తగ్గడం, వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం మంచిది. వాటివల్ల హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. మా ఆయన బాగా తాగుతాడు. తాగుడు ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుందని, అవయవలోపాలతో పుట్టే అవకాశాలు ఉండొచ్చునని ఒక్కరిద్దరు అన్నారు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియజేయగలరు. ప్రత్యేక జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందా? – కేఆర్, హైదరాబాద్ మగవారు బాగా మందు తాగడం వల్ల వీర్యకణాలు తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉండొచ్చు. అలాగే వీర్యకణాల నాణ్యత తగ్గిపోవచ్చు. నాణ్యత తగ్గిపోవడం వల్ల కొందరిలో, అవి అండంలో కలిసి పిండం ఏర్పడినప్పుడు పిండం సరిగా తయారు కాకపోవడం, పిండం సరిగా పెరగకుండా ఉండటం, జన్యుపరమైన లోపాలు ఏర్పడి మొదటి మూడు నాలుగు నెలల్లో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందరిలో పిండం పెరిగేకొద్దీ జన్యుపరమైన సమస్యలు, అవయవ లోపాలు, బుద్ధిమాంద్యం వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలంటే గర్భం కోసం ప్రయత్నం చేయక ముందు నుంచే, మందు తాగడం మానెయ్యడం మంచిది. మరీ పూర్తిగా మానెయ్యలేకపోతే వీలైనంత వరకు ఎంత తక్కువ తాగితే అంత మంచిది. గర్భం వచ్చిన తర్వాత సమస్యలు రాకుండా చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు ఉండవు. వీర్యకణాల్లో నాణ్యత లేకపోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటే ఎలాగైనా అవి వచ్చే తీరుతాయి. బిడ్డలో కొన్ని రకాల సమస్యలు ముందే తెలుసుకోవడానికి స్కానింగ్‌లు, రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. కానీ వీటిలో నూటికి నూరుశాతం సమస్యలు తెలియవు. కొన్ని సమస్యలు బిడ్డపుట్టిన తర్వాత పెరిగేకొద్దీ బయటపడతాయి. కాబట్టి గర్భం కోసం ప్రయత్నం చేసేటప్పుడు మందు తాగటం మానెయ్యడం ఒక్కటే మార్గం. -
జీఎస్టీ మోసాల నివారణకు ప్రత్యేక వ్యవస్థ
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానాన్ని అమలు చేసే జీఎస్టీ నెట్వర్క్ కేవలం పన్ను వసూళ్ల పోర్టల్‌గానే కాకుండా.. జీఎస్టీ పరమైన మోసాలను ముందుగానే పసిగట్టడంపై కూడా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఫ్రాడ్ అనలిటిక్స్ సిస్టమ్‌ను (ఎఫ్ఏఎస్) డిజైన్, అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. బిడ్ ప్రతిపాదన (ఆర్ఎఫ్పీ) ప్రకారం ఎఫ్ఏఎస్ రూపకల్పనకి ఏడాది వ్యవధి ఉంటుంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్, రిటర్నుల దాఖలు, ఈ–వేబిల్స్‌తో పాటు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), బ్యాంకులు, రాష్ట్రాల ఆదాయ పన్నుల శాఖల దగ్గరనుంచి వచ్చే సమాచారం అంతా క్రోడీకరించి .. పన్ను చెల్లింపుదారుల వివరాలు అన్ని కోణాల్లో సమగ్రంగా లభ్యమయ్యేలా ఎఫ్ఏఎస్ వ్యవస్థ ఉండనుంది. దాదాపు రూ. 300 కోట్ల టర్నోవరు, గడిచిన మూడేళ్లలో లాభాలు నమోదు చేసిన కంపెనీలు బిడ్లను దాఖలు చేయొచ్చు. అడ్వాన్స్డ్ ఆనలిటిక్స్‌ను అమలు చేయడంలో అనుభవం ఉండాలి. అర్హత పొందిన సంస్థ ఆరేళ్ల పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే జీఎస్‌టీఎన్‌కి సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌ను అందించిన కారణంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాత్రం ఈ బిడ్డింగ్‌లో పాల్గొనడానికి వీలుండదు. -
ఈ ఐదూ పాటిస్తే మరో 14 ఏళ్లు..
న్యూయార్క్ : వృద్ధాప్యంలో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్లిష్టంగా మారింది. అయితే అయిదు జీవనశైలి మార్పులను అనుసరించడం ద్వారా జీవితకాలాన్ని మహిళలు 14 ఏళ్ల పాటు, పురుషులు 12 సంవత్సరాలు పొడిగించుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. పొగతాగడానికి దూరంగా ఉండటం, రోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం, సరైన శరీర బరువు, అతిగా మద్యం తీసుకోకుండా ఉండటం వంటి ఐదు సూచనలూ పాటిస్తే పదేళ్ల పాటు మన జీవనకాలాన్ని పొడిగించుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. అమెరికా జాతీయ సర్వేల్లో 34 ఏళ్ల పాటు మహిళల గణాంకాలు, 27 ఏళ్ల పాటు పురుషుల డేటాను పరిశోధకులు విశ్లేషించిన మీదట ఈ నిర్ధారణకు వచ్చారు. నిపుణులు సూచించిన ఐదు అంశాలను సరిగ్గా పాటించిన వారు ఇతరులతో పోలిస్తే ఈ వ్యవధిలో 74 శాతం మంది అకాల మృత్యువాతన పడలేదు. గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ కారణంగా మరణాల రేటు వీరిలో అతి తక్కువగా నమోదైంది. వ్యాధికి చికిత్స కంటే నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నది తమ అథ్యయనంలో కీలకంగా వెల్లడైందని అథ్యయన రచయిత, హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన ఫ్రాంక్ హు అన్నారు. జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా వ్యాధులు దరిచేరకుండా జీవనకాలాన్ని మెరుగుపరుచుకోవచ్చని, ఆరోగ్యంపై వెచ్చించే ఖర్చులను అధిగమించవచ్చని పేర్కొన్నారు. తమ అథ్యయనం ప్రకారం తాము సూచించిన ఐదు సూత్రాలను పాటించిన వారిలో గుండెజబ్బుల ద్వారా మరణించడం 82 శాతం మేర తగ్గిందని, క్యాన్సర్ కారణంగా మరణాలు కూడా మూడింట రెండు వంతులకు పడిపోయిందని చెప్పారు. ఆరోగ్యంగా జీవించడంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అథ్యయన వివరాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ సర్క్యులేషన్లో ప్రచురితమయ్యాయి. -
మొటిమలు రాకుండా ఉండాలంటే..
న్యూఢిల్లీ : యుక్త వయసులో ఉన్న అమ్మాయిలను, అబ్బాయిలను భయపెట్టేది పరీక్షలు కాదు, సిలబస్ కాదు ...మరేంటంటే ‘ఆక్నే’ మన భాషలో చెప్పాలంటే మొటిమలు. అవును చంద్రబింబం లాంటి ముఖారవిందాన్ని పాడు చేయడానికి చిన్న మొటిమ చాలు. అందుకే మొటిమలంటే అంతలా భయపడతారు. మరి ఈ మొటిమలు ఎందుకు వస్తాయి, రాకుండ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎలా తగ్గించుకోవాలో ఓ సారి చూద్దామా... మొటిమలు అనేవి చర్మ సంబంధిత సమస్య. మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నూనే, చనిపోయిన చర్మ కణాలు చర్మ రంధ్రాలను మూసివేయడం వల్ల, ఒత్తిడి, హర్మోన్ల మార్పు, మోనోపాజ్ ఇలా రకరకాల కారణాలు. మారుతున్న జీవనశైలి కూడా మొటిమలు రావడానికి కారణం. మొటిమలు రాకుండా ఉండాలంటే రాత్రి పడుకునేముంది మేకప్‌ను పూర్తిగా తొలగించాలి రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మం వారు అయితే ఎక్కువ సార్లు శుభ్రంచేసుకోవాలి. మేకప్‌ను తొలగించడానికి అల్కహాల్ రహిత మేకప్ రిమూవరన్ని ఉపయోగించాలి. తర్వాత డీప్ పూర్ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన, తాజా ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్, మసాలాలకు దూరంగా ఉండాలి. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. నీరు శరీరం నుంచి విషపదర్ధాలను బయటకు పంపిస్తుంది. దీని వల్ల చర్మం తాజాగా, తేమగా ఉంటుంది. ప్రతిరోజు యోగా చేయ్యాలి. శ్వాస తీసుకోవడం, శ్వాసకు సంబంధించిన వ్యాయమాలు చేయడం వల్ల శరీరమంతా మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. ఫలితంగా మొటిమలు రాకుండా ఉంటాయి. ముఖాన్ని శుభ్రపర్చుకోవడానికి సబ్బు వాడకూడదు. సబ్బు వాడటం వల్ల ముఖం పొడిబారుతుంది. బాక్టీరియా వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది. సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండటానికి సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి. వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మొటిమలు రాకుండా నివారించవచ్చు. ఆకు కూరలు ఆకుపచ్చ కూరలు బచ్చలి, పాలకూర వంటివి మీ రోజు వారి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ ఏ ఆంటీ ఏజింగ్ ఎజెంట్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థలో ఉన్న బాక్టీరియాను, విషపదర్ధాలను బయటకు పంపిస్తుంది. పసుపు మొటిమలను తగ్గించడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మ నిగారింపుకు కూడా పసుపును వావడతారు. పసుపును ఆహారంలో తీసుకోవడం వల్ల మొటిమలను కలిగించే బాక్టీరియాను, విషపదర్ధాలను బయటకు నెట్టి వేస్తుంది. క్యారేట్ క్యారేట్లలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రోజువారి ఆహారంలో వీటిని భాగం చేసుకోవాలి. సాల్మన్ వీటిల్లో ఓమేగా3 ఫాటీ ఆమ్లాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలను నివారించడమే కాక నొప్పి, వాపుని తగ్గిస్తుంది. -
ఒక్క క్లిక్ చాలు..
కాజీపేట: అభం, శుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు బాధితులు భయపడుతున్నట్లు ఓ సర్వే ద్వారా జాతీయ బాలల హక్కుల సంరక్షణ సంఘం గుర్తించింది. బాధిత కుటుంబాలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఓ ఆన్లైన్ ఫిర్యాదు బాక్స్‌ను ఏర్పాటు చేసింది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి వాస్తవికతను బహిర్గతం చేయడం కోసం ఉద్దేశించిన పోస్కో ఈ–బాక్స్ వివరాలు తెలుసుకుందాం.. పోస్కో ఈ–బాక్స్ అంటే .. లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిందే ఈ–బాక్స్. ఇది నేషనల్ కమిషన్ ఆన్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో పని చేస్తుంది. పోస్కో చట్టం కింద నేరస్తులకు సకాలంలో శిక్షలు పడేలా సంస్థ వ్యవహరిస్తుంది. ఫిర్యాదులను గోప్యంగా విచారణ చేస్తారు. యానిమేషన్ చిత్రం గల విండో పేజీకి నావిగేట్ ద్వారా ఒక క్లిక్‌తో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను నమోదు చేసుకుని ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి బాలలకు న్యాయం చేస్తుంది. 16 ఏళ్లలోపు వారంతా బాలలుగా పేర్కొంది. ఫిర్యాదు చేద్దామిలా... నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్‌రైట్స్ అధికారిక వెబ్సైట్ లాగిన్ అవ్వాలి. ఠీఠీఠీ.nఛిpఛిట.జౌఠి.జీn ఈ సైట్లో లాగిన్ అయిన తర్వాత ముఖ చిత్రం కింది భాగంలో పోస్కో ఈ–బాక్స్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయగానే ఫిర్యాదు ఎలా చేయాలో ఓ వీడియో ప్రదర్శితమవుతుంది. ఆ విండో కింది భాగంలో ఉన్న ప్రెస్ హియర్ను క్లిక్ చేయగానే ఫిర్యాదు చిత్ర రూపాలు ఆరు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేసి ఆ కింది భాగంలో పేరు, ఫోన్ నంబర్, ఉంటే ఈమెయిల్ ఐడీ పేర్కొనాలి. ఈ ఫిర్యాదు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు వెళ్తుంది. విచారణ గోప్యంగా చేస్తారు. విచారణలో వేధింపులు నిజమని నిర్ధారణ అయితే నిందితులకు శిక్షపడేలా ఆదేశాలు జారీ చేస్తారు. రహస్య విచారణ వ్యవస్థకు శ్రీకారం.. బాలలపై లైంగిక వేధింపులు జరిగితే కొంతమంది మాత్రమే కొన్నింటిపైనే ఫిర్యాదు చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యుడో లేదా దగ్గరి బంధువు, పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా బాలలు లైంగిక వేధింపుల బారిన పడినప్పుడు చాలా సందర్భాల్లో ఫిర్యాదులు చేయడం లేదు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో ఓ రహస్య విచారణ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించేందుకు పోస్కో ఈ–బాక్స్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించింది. బాధితుల వివరాలు గోప్యం.. చిన్నారులపై లైంగిక వేధింపులపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాం. మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల నుంచి ఎక్కువగా ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. బాధితలకు పోస్కో చట్టంలో రక్షణ, ప్రభుత్వ చేయూత, విద్య, వృత్తి విద్యాల్లో శిక్షణ, సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ వంటి చర్యలను విస్తృతంగా చేపడుతున్నాం. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. – డాక్టర్ కె.అనితారెడ్డి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ -
ముందస్తు ప్రణాళికతో వడదెబ్బ నివారణ
► ముఖ్య కూడళ్లలో మజ్జిగ, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి ► బాధితులకు అత్యవసర వైద్య సేవలందించాలి ► రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం విజయనగరం కంటోన్మెంట్: వేసవి కాలంలో ప్రజలు వడదెబ్బ భారిన పడకుండా ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాల కొండయ్యతో కలసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరోగ్య జాగ్రత్తలను వివరించాలన్నారు. తెలుపు రంగు ఉన్న పలుచటి కాటన్ వస్త్ర ధారణను ప్రోత్సహించాలని సూచించారు. ఓఆర్ఎస్, గ్లూకోజ్, ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పీహెచ్‌సీల్లో 24 గంటల వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ఉపాధి హామీ వేతనదారులు ఉదయం 6 నుంచి 9.30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి ఆరు గంటల వరకు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లలో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల దాహార్తి తీర్చేందుకు, వైద్యం అందించేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో వడదెబ్బ మరణాలు సంభవించకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. జిల్లాలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు పంపిణీకి గతేడాది జిల్లాకు రూ.3 కోట్లు విడుదలయ్యాయని, వీటిలో రూ.23.38 లక్షలు ఖర్చు చేసి మిగతా నిధులు ప్రభుత్వానికి తిరిగి పంపించామన్నారు. 2015లో జిల్లాలో 149 వడదెబ్బ మరణాలు సంభవిస్తే బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించామన్నారు. 2016లో 115 మంది వడదెబ్బకు గురై మృతి చెందగా మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు ప్రతిపాదించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ శ్రీకేశ్, బి.లఠ్కర్, డీఆర్వో మారిశెట్టి జితేంద్ర, సీపీఓ జె.విజయలక్ష్మి, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల జేడీలు లీలావతి, వై.సింహాచలం, ఉద్యాన వన శాఖ డీడీ పీఎన్వీ లక్ష్మీనారాయణ, డీఎఫ్ఓలు వేణుగోపాల్, లక్ష్మణ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ పద్మజ, డీసీహెచ్ఓ ఉషశ్రీ, సాలూరు కమిషనర్ మల్లయ్యనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. -
స్వైన్‌ఫ్లూ మందుల పంపిణీ
దవలతవిశాఖ లీగల్: నగరంలో స్వైన్‌ఫ్లూ సోకకుండా ముందుజాగ్రత్తగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకటజ్యోతిర్మయి సోమవారం మందులు పంపిణీ చేశారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ప్రాంగణంలో సిబ్బంది, కక్షిదారులు, న్యాయవాదులకు హోమియో మందులు వేశారు. జగద్గురు పీఠం వైద్యులు డాక్టర్ హైమావతి, ఇతర వైద్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 75వేల మందికి ఈ మందుల పంపిణీ కార్యక్రమం జరుగతుందని జిల్లా జడ్జి చెప్పా రు. గతంలో గుంటూరు, హైదరాబాద్‌లలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. వ్యాధి సోకకుండా ముందుజాగ్రత్త చర్య నగర ప్రజలందరూ స్వైన్‌ఫ్లూ నివారణ మందులు తీసుకోవాలన్నారు. జి ల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యాల యంలో ఈ మందులు అందుబాటులో ఉంటాయని ఆమె చెప్పారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ కార్యదర్శి ఆర్.వి.నాగసుందర్, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షురాలు పైడా విజయలక్ష్మి, న్యాయఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేటీఎన్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
నడుము శస్త్రచికిత్స!
డాక్టర్ల వద్దకు వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికం నడుము నొప్పి అనే సమస్యతోనే వస్తుంటాయి. బహుశా మన సమాజంలో చాలామంది ఈ నడుమునొప్పితో బాధపడుతుండటం... దాంతో చాలా పనిగంటలు వృథా అయిపోవడంతో నడుము నొప్పి మన ఉత్పాదకతపైనా ప్రభావం చూపుతోంది. నడుము నొప్పికి చాలా అంశాలు కారణమవుతాయి. అయితే వాటిన్నింటిలోకెల్లా వయసు పెరుగుతున్న కొద్దీ అరుగుదల కారణంగా వెన్నుపూసలు అరగడంతో ఒక ప్రధాన సమస్య కాగా, వెన్నెముకల మధ్యన కుషన్‌లా ఉండే డిస్క్ (ఇంటర్ వర్టిబ్రియల్ డిస్క్) ఒత్తిడికి గురికావడం మరో సాధారణమైన అంశం. చాలా మంది పేషెంట్లు ఫిజియోథెరపీ ద్వారా నడుము నొప్పిని తగ్గించుకోడానికి ప్రయత్నిస్తారు. అయితే నొప్పి నివారణ మందులు వాడటం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, వెన్ను విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడం కూడా ఈ సమస్యనుంచి ఉపశమనం కలిగిస్తాయి. సాధారణంగా వచ్చే నడుము నొప్పుల్లో దాదాపు 95 శాతం సంప్రదాయ చికిత్సలైన ఫిజియోథెరపీ వ్యాయామాలు, ఉపశమనంగా వాడే పూతమందులు రాయడం వంటి వాటితో తగ్గిపోతాయి. అన్ని రకాల నడుము నొప్పులు సమస్యాత్మకం కాదు గానీ వీటిలో దాదాపు 5 శాతం కేసులు చాలా తీవ్రంగా పరిణమిస్తాయి. నరాలు అన్నీ మెదడు నుంచి మొదలై వెన్నుపాము ద్వారా అన్ని వెన్నుపూసల మధ్య ఖాళీ ప్రదేశాల నుంచి బయటకు వచ్చి మొండెం, చేతులు మొదలుకొని కాళ్ల వేళ్ల వరకు వ్యాపించి ఉంటాయన్న విషయం తెలిసిందే. ఏదైనా కారణం చేతగానీ, అరుదుగల వల్ల గానీ, వెన్నుపూసకూ, వెన్నుపూసకూ మధ్య ఉండే కుషన్ వంటి భాగమైన డిస్క్ జరగడం వల్ల గానీ నడుము ప్రాంతంలో ఏదైనా నరం మీద ఒత్తిడి పడటంతో సాధారణంగా నడుము నొప్పి వస్తుంది. కొన్ని సందర్భాల్లో నడుము భాగంలో డిస్క్ జారడం లేదా ఏదైనా ప్రమాదం వల్ల డిస్క్ నొక్కుకుపోవడంతో ఒక్కోసారి నడుము నొప్పి రావచ్చు. ఇంకొన్నిసార్లు ఆ ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్, ట్యూమర్లు, నడుములో నిర్మాణపరమైన (అనటామికల్) సమస్యలు, వెన్నెముక వంకరగా ఉండటం (స్కోలియోసిస్), నడుము వద్ద ఉండే వెన్ను ఎముకలు విరగడం (ఫ్రాక్చర్స్), కణుతులు, గడ్డలు, ఇతర ట్యూమర్లు రావడం వంటి సందర్భాల్లో తీవ్రంగా నొప్పి రావచ్చు. శస్త్రచికిత్స అవసరమైన సందర్భాలు.. ప్రమాదాల్లో వెన్నుపూసలు విరగడం లేదా డిస్క్ పక్కకు జరిగిపోవడం, వెన్నుపూసల అరుగుదలతో వెన్నుపాము నుంచి కిందివైపునకు వెళ్లే నరాలపై ఒత్తిడి పడి మల, మూత్ర విసర్జనలపై నియంత్రణ కోల్పోవడం, వెన్నుపూసల్లో ఎముక పెరిగి అది వెన్నుపాముపై తీవ్రమైన ఒత్తిడి కలిగించడం, కాళ్లు బలహీనంగా కావడం, కాళ్ల చివర్లలో తిమ్మిరులు వచ్చి ఆ ప్రాంతం స్పర్శ కోల్పోవడం... వంటి కొన్ని సందర్భాల్లో ఇతరత్రా సంప్రదాయ ఉపశమన చికిత్సలతో ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు శస్త్రచికిత్స ఒక్కటే మార్గమవుతుంది. శస్త్రచికిత్స ప్రక్రియ దెబ్బతిన్న వెన్నెముక భాగాలను సరిచేయడమో లేదా అవసరమైన సందర్భాల్లో అక్కడ రాడ్స్, ఫ్రేమ్స్ వంటి కొన్ని పరికరాలను (ఫిక్షేషన్స్) అమర్చడం ద్వారా ద్వారా నొప్పికి కారణమైన అంశాలను తొలగించడం జరుగుతుంది. ఇంకా చాలా అనుభవించాల్సిన జీవితం ముందున్న చిన్న వయసు రోగుల్లో నడుము భాగంలోని వెన్ను ప్రాంతంలో నొప్పి వచ్చి, ఇతరత్రా సంప్రదాయ ఉపశమన చికిత్సలతో తగ్గనప్పుడు శస్త్రచికిత్స చేస్తారు. అయితే సంప్రదాయ ఉపశమన చికిత్సలు ఏడాది పాటు తీసకున్న తర్వాత కూడా నొప్పి తగ్గకుండా ఉన్నప్పుడు డాక్టర్లు శస్త్రచికిత్స అనే ప్రత్యామ్నాయానికి వెళ్తారు. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఇప్పుడు అత్యంత తక్కువ గాటుతో శస్త్రచికిత్స చేసే సౌకర్యాలు ఉన్నాయి. వీటిని కీ–హోల్ సర్జరీగా పేర్కొనవచ్చు. అందులో అత్యాధునికమైన కెమెరాను నడు భాగంలోకి పంపుతారు. మైక్రోస్కోప్ సహాయంతోనూ, వెన్నెముక వద్ద మంచి వెలుగు ప్రసరింపజేయడం ద్వారా వెన్నెముకను పదింతలు పెద్దగా చూసి, సమర్థంగా శస్త్రచికిత్స చేయడం సాధ్యమవుతుంది. అయితే ఇలాంటి కీ–హోల్ సర్జరీల విషయంలో ఎంతో అత్యంత నైపుణ్యం ఉన్న సర్జన్లతో శస్త్రచికిత్స చేయించడం మేలు. ఎందుకంటే అతి చిన్న గాటు ద్వారా లోపలి భాగాలను నేరుగా చూడకుండా శస్త్రచికిత్స చేసే సమయంలో నిర్దిష్టమైన భాగానికి కాకుండా పక్క భాగాలకు గాయం కావడం జరిగే ప్రమాదం ఉంది. అందుకే అంత్యత నిపుణులైన శస్త్రచికిత్సకులు, కీ–హోల్ సర్జరీలో ప్రత్యేక శిక్షణ పొందిన వారు వీటిని చేస్తుంటారు. శస్త్రచికిత్సలో ఏం చేస్తారు... నడుము భాగంలో ఒకవేళ డిస్క్ పెరగడం లేదా పక్కకు తొలగడం వంటి అనర్థాలు జరిగి, అది స్పైన్ భాగంలోని (లంబార్ స్పైనల్) నరాలను నొక్కుతున్నప్పుడు, శస్త్రచికిత్స చేసి, ఆ పెరిగిన డిస్క్ భాగాన్ని తొలగించడం గానీ లేదా తన స్థానం నుంచి పక్కకు తొలగిన డిస్క్‌ను మళ్లీ సరిగా అమిరిపోయేలా చేస్తారు. ఒకవేళ ఏదైనా ప్రమాదాలలో డిస్క్ భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయినప్పుడు మళ్లీ ఆ డిస్క్ భాగాన్ని మెత్తటి ఎముకతో నింపి (బోన్ గ్రాఫ్ట్ చేసి), దానిపై ఒత్తిడి పడకుండా వెన్ను ప్రాంతంలో రాడ్స్, స్క్రూలు బిగిస్తారు. ప్రమాదాలకు గురైన యువ పేషెంట్లకు ఏడాది పాటు ఆగనవసరం లేకుండానే ఈ శస్త్రచికిత్స చేస్తారు. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్,హైదరాబాద్ -
సాగునీటి వనరుల కల్పనతోనే.. రైతు ఆత్మహత్యల నివారణ
బతికేందుకు తలకు మించిన భారం మోస్తున్నారు సాగునీరిస్తే సబ్సిడీలు కూడా అడగరు ‘సాక్షి’తో రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ సభ్యులు అనంతపురం అగ్రికల్చర్ : సాగునీటి వనరుల కల్పన, వ్యవసాయోత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం లాంటివి కల్పిస్తే అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వ రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ (ఏఈఆర్‌ఎస్) రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.నాగేశ్వరరావు, రీసెర్చ్ అసోసియేట్స్ డాక్టర్ కె.రాంబాబు, డాక్టర్ పి.రాముతో కూడిన బృందం మూడు రోజుల జిల్లా పర్యటనను సోమవారం ముగించుకుంది. ఈ సందర్భంగా సాయంత్రం వారు నగరంలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో ‘సాక్షి’తో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రైతు ఆత్మహత్యలకు దారితీసిన కారణాలు, కుటుంబాల స్థితిగతులు, భవిష్యత్తులో వారికి ఎలాంటి సహకారం అవసరం, ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై తెలంగాణలోని వరంగల్, మెదక్ జిల్లాలలో 50 కుటుంబాలు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుంటూరు జిల్లాల్లో 15 కుటుంబాలను కలిసి అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటికే తెలంగాణ జిల్లాలు, రాష్ట్రంలోని గుంటూరులో పూర్తి చేయగా.. ఇప్పుడు ఇక్కడ ముగిసిందన్నారు. డిసెంబర్ ఆఖరులోగా కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామన్నారు. జిల్లా రైతులకు నీళ్లిస్తే చాలు గత మూడు రోజులుగా వ్యవసాయశాఖ అధికారుల సహకారంతో జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 15 బాధిత కుటుంబాలను, మరికొందరు రైతులను కలిసి వివిధ అంశాలపై అధ్యయనం చేశామన్నారు. బుక్కపట్నం, ఓడీచెరువు, కదిరి, అనంతపురం రూరల్, గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల, గుత్తి మండలాల పరిధిలోని 14 గ్రామాల్లో పర్యటించామన్నారు. ‘రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి ఇంట అప్పులు కుప్పలుగా ఉన్నాయి. పంటలు పండించడానికి తలకు మించిన భారం మోస్తున్నారు. కొందరు ఎక్కువ భూమిని కౌలుకు తీసుకుని తీవ్రంగా నష్టపోయారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు కష్టంగా కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులు కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. పంటలు పండించేందుకు నీటి కొరత వేధిస్తోంది. నీళ్ల కోసం అప్పులు చేసి బోర్లు వేయిస్తున్నారు. అందులో 90 శాతం ఫెయిల్ అవుతున్నాయి. గుత్తి మండలం కొత్తపేటలో కె.నారాయణస్వామి అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో ఏకంగా 9 బోర్లు వేయించినా ఒక్కదాంట్లో కూడా నీరు రాలేదు. అప్పులు రూ.4 లక్షలకు పైబడి కావడంతో తీర్చే స్తోమత లేక ఆత్మహత్యకు తెగించాడు. ఒక్కోసారి టమాట, ఉల్లి, ఇతరత్రా ఉద్యాన ఉత్పత్తులకు కూడా సరైన గిట్టుబాటు కాక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యల వల్ల జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగానే కనిపిస్తోంద’ని అన్నారు. ‘ఆత్మహత్యలు తగ్గించాలంటే రైతులకు సాగునీళ్లు ఇవ్వాలి. సమృద్ధిగా నీళ్లుంటే అన్ని రకాల పంటలు పండించే సత్తా వీరికి ఉంది. నీళ్లు, మార్కెటింగ్ ఉంటే ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఇతరత్రా రాయితీలు కూడా అడిగే పరిస్థితి కనిపించడం లేదు. రైతులు కూడా అవసరం లేకున్నా పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా భూముల్లో ఉప్పుశాతం ఎక్కువగా ఉన్నందున ఆశించిన దిగుబడలు రావడం లేదు. వేరుశనగ, కంది పంటల సాగు ఇక్కడ శరణ్యం. పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు, ఎరువుల యాజమాన్యం, హెల్ప్‌లైన్, కౌన్సెలింగ్ సెంటర్ల ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకువస్తే ఆత్మహత్యలను బాగా తగ్గించడానికి అవకాశం ఉంద’ని వివరించారు. -
ఆహార వృథాను అరికడదాం
భూమి అమితంగా వేడెక్కుతోంది. మంచు పర్వతాలు కరుగుతున్నాయి. సముద్రాల నీటి మట్టం పెరుగుతోంది. కరువు, పెనుతుపానులు, వరదలు సాధారణమే అన్నంత తరచుగా వస్తున్నాయి. ఈ ఉపద్రవాల వల్ల రెండు ముఖ్య పర్యవసానాలు తలెత్తుతున్నాయి: 1. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజల జీవితాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. వీరిలో చాలామంది బక్కరైతులే. ఆహారోత్పత్తికి వీరు మరింతగా తిప్పలు పడాల్సి వస్తోంది. 2. మరో 14 ఏళ్ల నాటికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ సరిపోయేలా ఆహారం అందించాలన్న లక్ష్యం దెబ్బతింటున్నది. ఆహార వృథాను మనం అరికట్టగలం ఎలాగంటే.. ఆహారం వృథాను తగ్గించేందుకు ప్రయత్నించాలి. అడవులను, నీరు, మట్టి వంటి ప్రకృతి వనరులను పరిరక్షించుకోవాలి. తక్కువ ఇంధనం లేదా తక్కువ కాలుష్యం వదిలే ఇంధనాలు వాడాలి. ఇటువంటి ఇతర పనులు చేయాలి. ఇంతకీ మీరేం చేయగలరు? రోజువారీ అలవాట్లు కొన్నిటిని మార్చుకోవడం, కొన్ని చిన్న నిర్ణయాలు తీసుకుంటే చాలు - వాతావరణ మార్పులను తట్టుకునేందుకు మీరు చేయగలిగింది మీరు చేసినట్టే. ప్రకృతి వనరులను పరిరక్షించుకుందాం.. భూమి, నీరు, పశువులు, మొక్కలు.. ఇవన్నీ ధరిత్రి మనకందిస్తున్న వనరులే. నీరు, నేల లేకుండా మనం పంటలు పండించలేం. మట్టిని సారవంతంగా మార్చే ఖనిజాలు కొరవడి, నీరు కలుషితమైపోతే పోషకాలతో కూడిన ఆహారాన్ని పండించుకోవడం కష్టమౌతుంది. మనందరికీ తగినంత పోషకాహారాన్ని పండించుకోవాలంటే ప్రకృతి వనరులను కంటికిరెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది.. అదెలాగంటే.. నీటిని వృథా చేయకూడదు.. సుదీర్ఘ స్నానానికి బదులు.. కొద్దిసేపట్లో స్నానం ముగించాలి. 5-10 నిమిషాల షవర్ స్నానంతో పోల్చితే బాత్ టబ్ స్నానం వల్ల నీరు ఎక్కువగా వృథా అవుతుంది. పళ్లు తోముకున్నంత సేపూ కుళాయి తిప్పి ఉంచితే కనీసం 6 లీటర్ల నీరు ఖర్చవుతుంది. తోముకున్న తర్వాత నీటిని ఉపయోగిస్తే లీటరుతో సరిపోతుంది. మీ ఇంట్లో ఏదైనా కుళాయి నుంచి నీరు చుక్కలుగా లీకవుతూ ఉంటే వెంటనే ఇంట్లో పెద్ద వారికి చెప్పండి. లీకయ్యే ట్యాప్ ద్వారా ఏడాదికి 11 వేల లీటర్ల నీరు వృథాగా పోతుంది తెలుసా? వర్షపు నీటిని పట్టి ఉంచుకొని లేదా వంట పాత్రలు, చేతులు చేతులు కడుక్కున్న నీటిని మీ పెరట్లో మొక్కలకు పోస్తే నీటి ఖర్చు తగ్గుతుంది కదూ... శాకాహారం మిన్న.. ప్రతి భోజనంలోనూ మాంసాహారం భుజించడం కన్నా. మాంసాహారం తగ్గించి.. పప్పులు వంటి శాకాహారం తీసుకుంటే మంచిది. ఇది అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం. పప్పులతో కొత్త వంటకాలు ఏమేమి చేయొచ్చో ప్రయత్నిస్తే మంచిది. మాంసం కోసం పెంచే పశువుల పోషణ నిమిత్తం విస్తారమైన అడవులు నరికి పచ్చి మేత వేసి పెంచుతున్నారు. కాబట్టి, మాంసాహారం తగ్గిస్తే మంచిది. చేపలు తరిగిపోకుండా చూడాలి.. సముద్ర జలాల్లో పెరిగే టూనా, కాడ్ వంటి జాతి చేపల మీద మక్కువతో వాటి సంతతి అంతరించిపోయేలా సముద్రాన్ని జల్లెడ పట్టే బదులు.. మన దగ్గర్లో దొరికే ఇతరత్రా జాతుల చేపలను తినడం మంచిది. విద్యుత్ ఆదా మేలు.. పిల్లలూ.. విద్యుత్‌ను పొదుపుగా వాడే గృహోపకరణాలు కొనాల్సిందిగా మీరు పెద్దలకు సూచించండి. గదిలో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆ గదిలో లైట్లు, ఫ్యాన్లను ఆపేయండి. టీవీ, స్టీరియో లేదా కంప్యూటర్లను స్టాండ్బైలో ఉంచకుండా పూర్తిగా ఆపేయండి. ఇంటిపంటలు పండించండి.. సేంద్రియ సేద్యం వల్ల మట్టి ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని.. మీ ప్రాంతంలో రైతు మార్కెట్లలో లేదా స్థానిక సూపర్ మార్కెట్లలో సేంద్రియ ఆహారోత్పత్తులను గుర్తించి కొనుగోలు చేయడంలో మీ తల్లిదండ్రులకు తోడ్పడండి. మేడపైన, బాల్కనీల్లో ఉన్నంతలో వీలైనన్ని కుండీలు/మడుల్లో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేద్దామని మీ తల్లిదండ్రులను అడగండి.. నేలను, నీటిని రసాయనాలతో పాడుచేయకండి.. ఇంట్లో గచ్చును శుభ్రం చేయడానికి వాడే క్లీనర్లు, పెయింట్ తదితర ఉత్పత్తులు కొనేటప్పుడు.. ఘాటైన రసాయనాలు కానీ, బ్లీచింగ్ కానీ కలవని వాటిని ఎంపిక చేసుకోమని మీ తల్లిదండ్రులను కోరండి. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులను వాడటం ద్వారా నీటిని, నేలను పాడు చేయకుండా చూడగలుగుతాం.. సోలార్ ప్యానల్స్... సౌరశక్తిని వినియోగిస్తే వాతావరణ మార్పులను తగ్గించవచ్చు. సోలార్ ప్యానల్స్, ఇతర వాతావరణ అనుకూల ఇంధన వ్యవస్థల వినియోగానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలేమైనా ఉన్నాయేమో శోధించమని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అడగండి. ఆహార ఉద్గారాలను తగ్గించండి... కార్లు, విమానాలు, విద్యుత్ వాహనాలపై మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు కార్బన్ డయాక్సయిడ్ వంటి కర్బన ఉద్గారాలు (కార్బన్ ఎమిషన్స్) విడుదలై వాతావరణాన్ని అమితంగా వేడెక్కిస్తూ.. వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. ఈ ఉద్గారాలను ‘కార్బన్ ఫుట్ ప్రింట్’గా లెక్కిస్తున్నాం. అదేవిధంగా.. మన ఆహారాన్ని బట్టి ‘ఫుడ్ ప్రింట్’ (ఆహార సంబంధమైన కర్బన ఉద్గారాల ముద్ర)ను లెక్కిస్తున్నారు. మనం వాడే కారు పొగ వదులుతూ ఉంటుంది కాబట్టి.. దాని ఉద్గారాల గురించి మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. అయితే, మనం తినే ఆహారానికి సంబంధించిన ఉద్గారాలు నేరుగా కంటికి కనిపించవు. మన పళ్లెంలోకి వచ్చే ముందు ఈ ఆహారాన్ని ఎక్కడ పండించారు? ఎంత దూరం నుంచి తరలించి, ఎంతకాలం నిల్వ చేశారు? అందుకు ఎంత ఇంధనం ఖర్చయింది? అన్న దాన్ని బట్టి దాని ‘ఫుడ్ ప్రింట్’ ఆధారపడి ఉంటుంది. ఆహార ఉద్గారాలను తగ్గించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేమిటంటే... మీకు అవసరమైనంత మాత్రమే కొనండి.. పిల్లలూ.. వీక్లీ షాపింగ్ లిస్ట్‌ను తయారు చేయడం ద్వారా మీ తల్లిదండ్రులకు తోడ్పడండి. ఎంత సరిపోతుందనుకుంటారో అంతే కొనండి. దానితో సరిపెట్టండి! అలా చేస్తే ఆహారమే కాదు, డబ్బు కూడా వృథా కాకుండా ఉంటుంది. లేబుల్స్ చూసి మోసపోకండి.. ‘బెస్ట్ బిఫోర్’.. ‘యూజ్ బై’ అని ఆహారోత్పత్తుల ప్యాకింగ్ పై రాసి ఉంటుంది. వీటి మధ్య వ్యత్యాసాన్ని గమనించండి. ‘బెస్ట్ బిఫోర్’ డేట్ దాటిన తర్వాత కూడా ఆ ఆహారం కొన్నిసార్లు పనికొస్తుంది. అయితే, ‘యూజ్ బై’ డేట్ దాటితే మాత్రం తినడం మంచిది కాదు. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి.. ప్లాస్టిక్ ప్యాకెట్లలో ఉండే ఆహారాన్ని తక్కువగా కొనడం, కొనడానికి వెళ్లేటప్పుడు సొంత బ్యాగ్‌లను తీసుకెళ్లడం, తిరిగి వాడదగిన వాటర్ బాటిల్స్ ఉపయోగించడం, వాడి పారేసే ప్లాస్టిక్ కప్పుల వాడకం తగ్గించడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో మీ తల్లిదండ్రులకు తోడ్పడండి. పునర్వినియోగం వాడిన పేపర్, ప్లాస్టిక్, గ్లాస్, అల్యూమినియంను పారేయకుండా.. పునర్వినియోగించే ప్రయత్నం చేయండి. తద్వారా చెత్త కుప్పలు పెరిగిపోకుండా ఉంటాయి. ఆహార నిల్వలో జాగ్రత్త.. ఆహారోత్పత్తుల నిల్వలో తెలివిగా వ్యవహరించాలి. కప్‌బోర్డులు, ఫ్రిజ్‌లలో ఆహారోత్పత్తుల బాక్స్‌లను నిల్వ చేసేటప్పుడు కొత్త వాటిని వెనుక వైపు, పాత వాటిని ముందు వైపు ఉంచాలి. టిన్నులు, ప్యాకెట్లలో ఆహారాన్ని కొంత ఉపయోగించి, మిగతా దాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచేటప్పుడు ఎయిర్‌టైట్ కంటెయినర్లు వాడటం ద్వారా ఆహారం తాజాగా ఉండేలా చూడవచ్చు. మిగిలిన ఆహారాన్ని ఇష్టపడండి.. పిల్లలూ.. మీ ఇంట్లో వండిన ఆహారం మిగిలిపోతే.. పారేయకండి! మిగిలిన ఆహారాన్ని ఫ్రీజర్‌లో ఉంచి, తర్వాత ఒక రోజు తీసి తింటే బాగుంటుందని మీ తల్లిదండ్రులకు సూచించండి. మీరు రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు తినగలిగిన దానికన్నా తక్కువగా కొనుగోలు చేయండి. ఫుల్ తినలేమనుకుంటే ఆఫ్ ఇవ్వమని అడగండి. తీసుకున్న ఆహారం మిగిలిపోతే.. ప్యాక్ చేయించి ఇంటికి తీసుకెళ్లండి. ఇలా చేస్తే.. ఆహారాన్ని మాత్రమే కాదు డబ్బునూ ఆదా చేసినట్టే కదూ..! కంపోస్టు చేయండి.. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఆహారం ఎంతో కొంత మిగిలిపోతుంది. అంతమాత్రాన చెత్తకుప్పలో వేయడం ఒక్కటే మార్గం అనుకోకూడదు. పండ్లు, కూరగాయల తొక్కలు, గుడ్ల పెంకులు చెత్తబుట్టలో వేయడం కన్నా.. కంపోస్టు బిన్లో వేసి సేంద్రియ ఎరువును తయారు చేసి పెరటి మొక్కలకు వాడవచ్చు. మన చేతుల్లోనే పర్యావరణ హితం! మన రోజువారీ జీవితంలో చేసే చిన్న చిన్న పనుల్లో కొద్దిపాటి మార్పులతో వాతావరణ పరిరక్షణకు మన వంతు సహాయ పడవచ్చు. వీటిలో కొన్ని పద్ధతులను మీరు ఇప్పటికే అనుసరిస్తుంటే సంతోషం.. లేకుంటే మాత్రం కొన్నిటినైనా పాటించేందుకు ప్రయత్నించి పర్యావరణ పరిరక్షణలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి. చెత్తబుట్ట దగ్గరకు వెళ్లే ముందు ఒక్కసారి.. చెత్తబుట్ట ఉంది కదా అని దాన్ని నింపటానికి ప్రయత్నించకండి. బ్యాటరీలు, ఫోన్లు, రంగులు, మందులు, రసాయనాలు, టైర్లు వంటివి నీటి వనరులలో కలవటం వల్ల పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతోంది. ప్రతి వస్తువును పనికిరానిదిగా భావించి చెత్తబుట్టలో వేసే పద్ధతికి స్వస్తి చెప్పి.. వస్తువుల వాడకాన్ని తగ్గించటం, అవకాశం ఉంటే పాత వాటినే మళ్లీ ఉపయోగించటంపై దృష్టి సారించాలి. నడక ముద్దు.. దగ్గరలో ఉన్న ప్రదేశాలకు సైకిల్‌పై వెళ్లటం, వీలయితే తరుచూ ప్రజా రవాణా (బస్సులు/లోకల్ ట్రైన్ల)ను వాడటం ద్వారా పర్యావరణ హితానికి మనవంతు కృషి చేయవచ్చు. స్థానికంగా పండించిన వాటిని కొనండి.. స్థానిక వ్యాపారాన్ని ప్రోత్సహించండి. దగ్గరలోని షాపుల్లో వస్తువులను కొనుగోలు చేయండి. స్థానికంగా పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయండి. దీనివల్ల వాహనాలు ప్రయాణం చేసే దూరం తగ్గి ఉద్గారాల విడుదల తగ్గుతుంది. పట్టణాలకు పచ్చదనం అద్దండి.. పచ్చదనాన్ని జీవితంలోకి ఆహ్వానించండి. మీ పాఠశాలల్లో, పెరటి తోటలను పెంచండి. ఇంటిలోనే ఇంటి పంటలను సాగుచేయండి. ఇంటిపైన, బాల్కనీలో కూరగాయ మొక్కలను పెంచండి. ఒకవేళ మీ ఇంట్లో చోటు సరిపోదని భావిస్తే ఇరుగుపొరుగును కూడగట్టి ఖాళీ స్థలంలో సామూహిక సాగును చేపట్టండి. అడవులకు మీ అరచేతులే రక్ష రోజువారి వ్యవహారాల్లో సాధ్యమైనంత తక్కువ పేపర్‌ను వాడండి. తప్పనిసరి అనిపిస్తేనే ప్రింట్ తీయండి. ప్రింట్లో పేపర్ రెండువైపులా వాడండి. చిత్రలేఖనం, చిత్తుప్రతికి పాఠశాల నుంచి సేకరించిన పేపర్‌ను వాడండి. పేపర్ టవల్స్, మూత్రశాలలో వాడే పేపర్ ఉత్పత్తుల్లో పునర్వినియోగానికి వీలయిన వాటినే వాడండి. మన్నిక గల కలప లేదా పొరల చెక్క (ప్లైవుడ్)తో చేసిన గృహోపకరణాలను మాత్రమే కొనాలని మీ కుటుంబ సభ్యులకు సలహాలివ్వండి. తాజా పరిణామాలపై ఓ కన్నేయండి.. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎ వో) వారి వాతావరణ మార్పులకు సంబంధించిన వెబ్‌సైట్‌ను లేదా సామాజిక మాధ్యమాలను అనుసరించండి. స్థానిక వార్తావ్యవస్థను గమనికలో ఉంచుకోండి. సందేశాన్ని పంచండి.. స్ఫూర్తిని పెంచండి సామాజిక మాధ్యమాల్లో వాతావరణ మార్పులు వంటి పర్యావరణానికి సంబంధించిన సంబంధించిన ఆసక్తికరమైన వార్తలను చూస్తే లైక్ చేయండి. వాటిని స్నేహితులతో పంచుకోండి. భూమిని రక్షించుకునే లక్ష్యంతో జరిగే స్థానిక, జాతీయ అధికారిక కార్యక్రమాల్లో మీరేం చేయగలరో ఆలోచించుకొని మీ వంతు కృషిచేయండి. పర్యావరణ హితమైన ఉత్పత్తులకే ప్రాథాన్యమివ్వండి మీ చిట్టి చెల్లెలు బుజ్జి పాపాయిల కోసం వస్త్రంతో చేసిన నాపీలు, తువ్వాళ్లను మాత్రమే కొనుగోలు చేయాలని మీ తల్లిదండ్రులకు ప్రేమతో షరతులు విధించండి. పర్యావరణ హితమైన ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వండి. వాటి అవశేషాలు సులభంగా భూమిలో కలిసిపోతాయి. పర్యావరణ ప్రియులుగా మసలుకోండి మీ సెలవు రోజులను ఆనందంగా గడిపేందుకు కుటుంబంతో కలిసి విహార యాత్రకు వె ళ్లే సమయంలో వీలయితే విమాన ప్రయాణాన్ని చేయకండి. విమానాలు అధిక మొత్తంలో బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్)ను విడుదల చేస్తాయి. తప్పనిసరయితే కర్బన ఉద్గారాల విడుదలను నియంత్రించే వ్యవస్థలు.. మొక్కల పెంపకం వంటి కార్యక్రమాల్లో పాల్గొనే విమాన కంపెనీలను మాత్రమే మీ ప్రయాణానికి ఎంచుకోండి. పునరుత్పాదక శక్తి వనరుల ప్రాజెక్టుకు సహాయం చేయటం ద్వారా మీ వంతు ఉద్గారాల విడుదల నియంత్రించవచ్చు. ఆహార వృథాకు స్వచ్ఛంద సంస్థల చెక్ ఆహార వృథాను అరికట్టడానికి భారత్ సహా వివిధ దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. వేడుకల సందర్భంగా జరిగే విందు భోజనాల్లో, రెస్టారెంట్లలో మిగిలిపోయిన తాజా ఆహారాన్ని సేకరించి నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. మన దేశంలో పెళ్లి వేడుకల్లో, ఇతరత్రా విందు వినోదాల్లో, రెస్టారెంట్లలో నిత్యం 20 శాతానికి పైగా ఆహార పదార్థాలు వృథా అవుతున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అధ్యయనంలో తేలింది. మన దేశంలోని ప్రధాన నగరాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు వేడుకల నిర్వాహకుల నుంచి, రెస్టారెంట్ల నుంచి తినదగిన స్థితిలో ఉండి మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి నిరుపేదలకు పంపిణీ చేస్తున్నాయి. ఇలా సేకరించిన ఆహారాన్ని నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఆహార వృథాను అరికట్టడానికి మన దేశంలో కచ్చితమైన చట్టాలేవీ లేవు గాని స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి పలు పాశ్చాత్య దేశాలు ఈ విషయంలో కాస్త కఠినమైన చట్టాలనే అమలు చేస్తున్నాయి. రెస్టారెంట్లలో ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను తినకుండా వృథా చేస్తే భారీ జరిమానాలనే వడ్డిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన గ్లోటైడ్ సొసైటీతో పాటు దేశవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు ఆహార వృథాను అరికట్టేందుకు కృషి చేస్తున్నాయి. -
ఒక్క నిమిషం ఆలోచించండి
– ఆత్మహత్యకు పాల్పడేవారికి ఎస్పీ సూచన – నగరంలో ఆత్మహత్యల నివారణ దినోత్సవ ర్యాలీ కర్నూలు(హాస్పిటల్): ఆత్మహత్య చేసుకునే వారు.. కనిపెంచిన అమ్మ గురించి ఒక్క నిమిషం ఆలోచించాలని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. ఆత్మహత్యల నివారణ దినాన్ని పురస్కరించుకుని కర్నూలు మైండ్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం వాకింగ్ నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ.. జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ వారిపై ఎన్నో ఆశలు, ప్రేమాభిమానాలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి ఆలోచించాలన్నారు. సమాజంలో ప్రతి చోటా ఒత్తిడి ఉంటుందని చెప్పిన ఎస్పీ.. దాన్ని ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాలి తప్ప ఆత్మహత్యకు పాల్పడవద్దన్నారు. విద్యాసంస్థల్లో అధ్యాపకులు, తల్లిదండ్రులు ఈ దిశగా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఆత్మహత్యల నివారణకు నడక కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, నడవడటమే కాదు సమాజాన్ని సైకియాట్రిస్ట్‌లు నడిపించాలని సూచించారు. కాలేజి, పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు కౌన్సెలింగ్ చేయాలని కోరారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి మాట్లాడుతూ అన్ని విషయాల్లో ఒత్తిడి పెరిగిన క్రమంలో వారి ప్రవర్తనను గమనిస్తూ ఉంటే ఆత్మహత్యలను చాలా వరకు నివారించవచ్చన్నారు. ఏపీ సైకియాట్రిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కె.నాగిరెడ్డి, డాక్టర్ బి. రమేష్‌బాబు, ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్షులు డాక్టర్ బి. శంకరశర్మ, కార్యదర్శి డాక్టర్ సి. మల్లికార్జున, మానసిక వైద్యులు హరిప్రసాద్, రంజిత్‌కుమార్, రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దోమలకాలం.. నివారణే మార్గం
– ప్రజలు భాగస్వాములు కావాలి – డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో పలు ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలు కురిసి...దోమలు వృద్ధి చెందడంతో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దోమకాటు బారినపడకుండా ఎవరికి వారు స్వీయ నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి చెప్పారు. గురువారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మలేరియా విభాగం దోమల నివారణకు చర్యలు చేపడుతోందని, దీనికి ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు. ఇళ్లు, పరిసరాల్లో దోమల నివారణ చర్యలు చేపడితే విషజ్వరాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. ఈ సందర్భంగా దోమల వల్ల వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి ఆమె వివరించారు. దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు మలేరియా : ఆడ అనఫిలిస్ దోమకాటు వల్ల వస్తుంది. లక్షణాలు: వణుకుతో కూడిన చలిజ్వరం, చెమటలు పట్టడం, తలనొప్పి, జ్వరం రోజు విడిచి రోజు రావడం, వాంతులు అవడం. మెదడువాపు వ్యాధి ః జపనీస్ ఎన్సెఫలిటిస్ దోమకాటు వల్ల వస్తుంది. పందులు, పశువులను కుట్టిన దోమలు మనుషులకు కుట్టిన వెంటనే రక్తం ద్వారా వ్యాధి కారక క్రిములు మెదడుకు చేరి మెదడువాపు వ్యాధి వస్తుంది. లక్షణాలు : ఈ వ్యాధి ముఖ్యంగా 14 సంవత్సరాల్లోపు పిల్లలకు ఎక్కువగా వస్తుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, స్పహతప్పడం వంటి లక్షణాలు ఉంటాయి. డెంగీ : ఏడిస్ ఈజిపై ్ట అనే దోమ ద్వారా డెంగీ వ్యాధి వస్తుంది. లక్షణాలు: ఈ దోమలు పగటిపూట మాత్రమే కుడతాయి. తీవ్రమైన జ్వరం, శరీరంపై దద్దుర్లు, చర్మం ద్వారా రక్తస్రావం, తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. కండరాలు, కీళ్లనొప్పులు, ఆకలి మందగించడం జరగవచ్చు. దీంతో ఒక్కసారి ఒంట్లో రక్తస్రావం జరిగి ప్రాణాలకు ముప్పు రావచ్చు. పైలేరియా(బోదకాలు): క్యూలెక్స్ దోమకాటు వల్ల వస్తుంది. లక్షణాలు : జ్వరం రావడం, వృషణాల్లో వాపు, కాళ్లలో నీరసం, కాళ్లవాపు, ప్రత్యేకించి కళ్లు, చేతులు, స్థనాలు, జననేంద్రియాలు పాడవడం ఈ వ్యాధి ముఖ్యలక్షణాలు. చికున్ గున్యా : చికున్ గున్యా జ్వరం వైరస్ సోకడం వల్ల వస్తుంది. ఈ వైరస్ పగటి పూట పులిదోమ కాటు వల్ల వస్తుంది. లక్షణాలు : జ్వరం, భరించలేనంతగా కళ్లు, కండరాల నొప్పులు, వాంతి అవుతున్నట్లుగా, దాహం అధికంగా ఉండటం, తీవ్రమైన ఒళ్లునొప్పులు దీర్ఘకాలంగా ఉంటాయి. నివారణ చర్యలు – ఇంటి పరిసరాల్లో దోమలు పెరిగేందుకు అనువుగా ఉండే నీటి నిల్వలను నిర్మూలించాలి. –తాగి పారేసిన కొబ్బరిబోండాలను ముక్కలుగా చేసి చెత్తకుండీలో వేయాలి. –ఓవర్‌హెడ్ ట్యాంకులు, నీటినిల్వ పాత్రలను, ఎయిర్ కూలర్లు, డ్రమ్ములు లాంటి వాటిని పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేయాలి. – కాల్వలో వ్యర్థాలు, చెత్త, చెట్లకొమ్మలు వేయరాదు. – వారానికి ఒకసారి పూలతొట్టెలలో, పూల కుండీలలో నీరు మార్చాలి.నీరు నిల్వ ఉండకుండా చూడాలి. – దోమలు లోపలికి రాకుండా కిటికీలకు సన్న జాలిని కట్టాలి. దోమతెరలు తప్పనిసరిగా వాడాలి. – ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలి. –టైర్లు, రోడ్డుపై గుంతలో వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. –జ్వరం వచ్చిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.