దోమల రాజ్యం
- నివారణలో పురపాలక నిర్లక్ష్యం
- వ్యాధులతో పట్టణవాసులకు అనారోగ్యం
యలమంచిలి : దోమల విజృంభణతో యలమంచి లి పట్టణవాసులు భయపడిపోతున్నారు. వీటి నివారణకు రూ.లక్షలు ఖర్చవుతున్నా ఫలితం కనిపిం చడం లేదని మండిపడుతున్నారు. ఈ మున్సిపాలిటీ లో జ్వరపీడితుల సంఖ్య ఇటీవల ఎక్కువగా ఉంది. జ్వర బాధితులతో పట్టణంలో ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. దోమ కాటుతో మలేరియా, డెం గ్యూ, ఫైలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి.
చర్యలు అంతంత మాత్రమే..
దోమల నివారణకు పురపాలక సంఘం చిత్తశుద్ధితో కార్యాచరణ అమలు చేయటం లేదు. దోమల కారక మురికి కాల్వలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో వాటి లార్వాలు చనిపోయేందుకు ప్రతి వారం బెటైక్సు, మలాథియన్ రసాయనాలు పిచికారీ చేయాలి. లార్వాలు తినే గంబూషియా చేపలు మురికి కాల్వల్లో వదలాల్సి ఉండగా ఆ మాటే మరిచారు. మరుగు కాల్వల్లో ఎం.ఎల్ ఆయిల్ బాల్స్ వేయాల్సి ఉన్నా నామమాత్రంగా వేసి నిధులు ఖర్చయినట్టు చూపిస్తున్నారు.
ఫాగింగ్ చేయాల్సి ఉన్నా ఆ ఊసే పక్కనపెట్టేశారు. కొద్ది నెలలుగా మున్సిపాలిటీ పరిధిలో ఫాగింగ్ యంత్రాలు మూలకు చేరినా పట్టించుకోకపోవడం దోమల నివారణపై చూపుతున్న శ్రద్ధ ఏపాటిదో అర్ధమైపోతోంది. మరుగుదొడ్ల ద్వారా దోమలు వ్యాప్తి చెందకుండా గొట్టాలకు వలలు కట్టారు. చెత్త నిల్వ ప్రాంతాల్లో తొలగించిన తరువాత బ్లీచింగ్ చల్లాలి. కేవలం చెత్త ఏరివేసి సరిపెట్టేస్తున్నారు.
అస్తవ్యస్థ డ్రైనేజీ వ్యవస్థ..
పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారి ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి దుర్వాసన వస్తోంది. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. పట్టణంలో యానాద్రి కాలువ పూడికతో నిండి కాలువలన్నీ శిథి లమయ్యాయి. మూడేళ్ల క్రితం గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చే స్తామని ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. గత ఎమ్మెల్యే కన్నబా బు యానాద్రి కాలువ విస్తరణ పను లు చేయించాలని ప్రయత్నించినా మధ్యలోనే నిలిచిపోయింది. మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధి, డెంగ్యూ వంటి వ్యాధులు దోమలు కారణంగా వ్యాప్తి చెందుతున్నాయి. శివారుగ్రామాలు కట్టుపాలెం, గొల్లలపాలెం, మంత్రిపాలెం, కొక్కిరాపల్లి, వెంకటాపురం గ్రామాల్లో రోడ్లన్నీ బహిర్భూమిగా ఉపయోగించడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి.
దోమల నిర్మూలనకు చర్యలు..
పట్టణంలో దోమల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. తరచూ మలాథియాన్, బెటైక్స్ పిచికారీ చేస్తున్నాం. మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చూస్తున్నాం. రూ.10 లక్షలతో యానాద్రి కాలువ, మరికొన్ని ప్రధాన మురుగు కాలువల్లో పూడిక తీయిం చేందుకు త్వరలో టెండర్ ఖరారు చేస్తాం.
-సత్తారు శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్