chemicals
-
సహజత్వం కోల్పోతున్న నీరు
సాక్షి, సిద్దిపేట: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోటికి పైగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే భక్తులు ఉపయోగించే షాంపూలు, సబ్బుల ఇతర కెమికల్స్ వల్ల వాగులో నీరు సహజత్వాన్ని కోల్పోతోందని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్మోహన్ పరిశోధనల ద్వారా తేల్చారు. వాగులో పుణ్యస్నానాలు చేశాకే... మేడారం జాతరకు జంపన్నవాగుకు విడదీయలేని బంధం ఉంది. కాకతీయులతో యుద్ధం జరిగిన సమయంలో రోజుల తరబడి పోరాటం చేసిన సమ్మక్క కుమారుడు జంపన్న.. మేడారం పొలిమేరలో ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణ చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. ఆనాటి నుంచి ప్రజలు ఆ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. భక్తజనులు జంపన్నవాగులో పుణ్యస్నానమాచరించి ఆ తర్వాత తల్లుల దర్శనానికి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. వాగుకు ఇరువైపులా2 కిలోమీటర్ల మేర స్నానఘట్టాలు మేడారంలోని జంపన్నవాగుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల పొడవులో స్నానఘట్టాలు ఉన్నాయి. భక్తులు ఈ వాగులో స్నానం చేసేందుకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి జాతర సమయాల్లో నీటిని వదులుతారు. ఈ నీరు స్నానఘట్టాల దగ్గర నిల్వ ఉండేలా ఇసుక బస్తాలతో తాత్కాలిక చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తారు. మరోవైపు వాగులో ఉన్న ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్ ద్వారా నీటిని తోడి స్నానఘట్టాల దగ్గర ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌కు పంపిస్తారు. భక్తులు జంపన్నవాగులో మునక వేసిన తర్వాత బ్యాటరీ ట్యాప్స్ దగ్గర స్నానాలు చేస్తారు. ఇలా కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలోనే లక్షలాది మంది భక్తులు జాతర జరిగే నాలుగు రోజుల పాటు నిర్విరామంగా స్నానాలు చేస్తారు. ఈ సమయంలో ఉపయోగించే షాంపులు, సబ్బుల కారణంగా జంపన్న వాగులోని నీరు సహజత్వానికి కోల్పోతోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు సహజమైన కుంకుమ స్థానాన్ని చాలా చోట్ల కెమికల్ కుంకుమలు ఆక్రమించడం ఈ సమస్యను మరింత తీవ్రం చేసింది. 18 శాంపిల్స్ సేకరణ గతేడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర జరిగింది. ఈ సందర్భంగా జాతరకు వారం రోజుల ముందు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జంపన్న వాగులో ఆరు చోట్ల, జాతర సమయంలో ఆరు చోట్ల, జాతర ముగిసిన వారం రోజులకు ఆరుచోట్ల ఇలా 18 శాంపిల్స్ సేకరించారు.వీటిని ప్రత్యేక బాటిళ్లలో తీసుకొచ్చి కళాశాలలో టెస్ట్ చేశారు. వాటి ఫలితాలు ఇలా ఉన్నాయి. సాధారణంగా అయితే పీహెచ్ 6.5 నుంచి 8.5, డిజాల్వడ్ ఆక్సిజన్(డీవో) 6 ఎంజీ కంటే ఎక్కువ (లీటరు నీటిలో), బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ) 2ఎంజీ అంతకంటే తక్కువ (లీటరు నీటిలో), బాక్టీరియా అసలు ఉండొద్దు. 24, 25 తేæదీల్లో నేపాల్‌లో ప్రజెంటేషన్ బయోటెక్నాలజీ సొసైటీ ఆఫ్ నేపాల్ ఆధ్వర్యంలో కాఠ్మాండ్లో ఈ నెల 24,25 తేదీల్లో జరిగే 3వ అంతర్జాతీ య బయోటెక్నాలజీ సదస్సుకు జంపన్న వాగులో సాముహిక పుణ్యస్నానాలతో నీటి కాలుష్యంపై చేసిన పరిశోధన పత్రం ఎంపికైంది. దీనిపై పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు డాక్టర్ మదన్మోహన్కు ఆహ్వానం అందింది.నివారణ మార్గాలుసహజత్వాన్ని కోల్పోయిన నీటిలోబ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఇలాంటి నీటిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. » వాగులో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు దిగువకు వెళ్లేలా నీటి ప్రవాహం కొంచెం ఎక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. » క్లోరినేషన్ ఎక్కువగా చేయాలి. » సబ్బు, షాంపుల వినియోగం, బట్టలు ఊతకడం, కుంకుమ వేయడాన్నినియంత్రించాలి. » జాతర నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ స్నానం చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు అని పరిశోధన ద్వారా నిర్థారణ అయ్యింది. జాగ్రత్తలు పాటించాలి పుణ్యస్నానాలు చేయడం మంచిదే. తగు జాగ్రత్తలు పాటించాలి. పుణ్యస్నానాలు చేసే సమయంలో పూజా ద్రవ్యాలు అందులో వేయొద్దు. షాంపూలు, సబ్బులు వినియోగించడం వలన నీరు సహజత్వం కోల్పోయి కాలుష్యం అవుతుంది. దీంతో చర్మ వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్లు వస్తాయి. – డాక్టర్ మదన్ మోహన్, సిద్దిపేట ప్రభుత్వడిగ్రీ కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి -
భూగర్భ'గరళం'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూగర్భ జలం గరళంగా మారిందా? బావులు, బోరు బావుల్లో ఎక్కడ పడితే అక్కడ నీటిని తాగితే రోగాలు కొనితెచ్చుకున్నట్లేనా? 26 జిల్లాల్లోనూ కొన్ని చోట్ల తాగడానికే కాదు.. సాగుకు కూడా భూగర్భ జలాలు పనికి రానంత విషతుల్యంగా మారాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది భూగర్భ జలాల నాణ్యత నివేదిక–2024. దేశవ్యాప్తంగా 2023లో వర్షాకాలం ప్రారంభానికి ముందు, వర్షాకాలం ముగిసిన తర్వాత కేంద్ర భూగర్భ జల మండలి (సీజీడబ్ల్యూబీ) భూగర్భ జలాల నమూనాలను పరీక్షించి, వాటి నాణ్యతను తేల్చింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన రసాయనాలు పరిమితికి మించి చేరడం వల్ల విషతుల్యంగా మారాయని సీజీడబ్ల్యూబీ నివేదిక తేల్చింది. ఆర్శనిక్, యురేనియం, క్లోరైడ్, ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి ప్రమాదకరమైన రసాయనాలతోపాటు ఇనుము వంటి లోహ ధాతువులు భూగర్భ జలాల్లో పరిమితికి మించి ఉన్నట్లు వెల్లడించింది. పారిశ్రామిక వ్యర్థాలను యథేచ్ఛగా వదిలేయడం, వ్యవసాయంలో క్రిమి సంహారక మందులు, ఎరువులను అధిక మోతాదులో వినియోగించడం, పట్టణీకరణ పెరిగిపోవడంతో మురుగు నీటిని శుద్ధి చేయకుండా వదిలేయడం, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలను పరిమితికి మించి తోడేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తేల్చింది.రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నైట్రేట్, 17 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్, 12 జిల్లాల్లో ఇనుము, 7 జిల్లాల్లో ఆర్శనిక్ పరిమితికి మించి ఉన్నట్లు తెలిపింది. ప్రతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో పరిమితికి మించి సోడియం కార్బొనేట్ ఉండటం వల్ల ఆ నీళ్లు సాగుకు కూడా వాడకూడదని సీజీడబ్ల్యూబీ తేల్చింది.నైట్రేట్భూగర్భ జలాల్లో నైట్రేట్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నైట్రేట్ ఎక్కువ ఉంది. 2023 వర్షాకాలం ముగిసిన తర్వాత 1149 ప్రాంతాల్లో పరీక్షించగా.. 270 ప్రాంతాల్లో పరిమితికి మించి నైట్రేట్ ఉన్నట్లు తేలింది. రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తరువాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. పల్నాడు జిల్లాలో 70 చోట్ల పరీక్షించగా 36 చోట్ల నైట్రేట్ చాలా ఎక్కువ ఉన్నట్లు తేలింది.క్లోరైడ్లీటర్ నీటిలో 250 మిల్లీ గ్రాముల లోపు క్లోరైడ్ ఉంటే అవి తాగడానికి సురక్షితం. రాష్ట్రంలో 887 చోట్ల పరిమితికి లోపే క్లోరైడ్ ఉన్నట్లు తేలింది. 222 చోట్ల 250 నుంచి 1,000 మిల్లీగ్రాముల మధ్య ఉన్నట్లు తేలింది. వెయ్యి మిల్లీగ్రాములకంటే ఎక్కువ క్లోరైడ్ ఉంటే ఆ నీటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ తాగకూడదు. రాష్ట్రంలో 40 ప్రాంతాల్లో వెయ్యి మిల్లీగ్రాములకంటే ఎక్కువగా క్లోరైడ్ ఉన్నట్లు తేలింది.ఇనుములీటర్ నీటిలో ఒక మిల్లీ గ్రాముకంటే ఎక్కువ పరిమాణంలో ఇనుప (ఐరన్) ధాతువులు ఉంటే ఆ నీటిని పొరపాటున కూడా తాగకూడదు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో (అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశి్చమ గోదావరి) కొన్ని ప్రాంతాల్లో భూగర్భజలాల్లో పరిమితికి మించి ఇనుప ధాతువులు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.ఫ్లోరైడ్భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 8వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 130 ప్రాంతాల్లో పరిమితికి మించి ఫ్లోరైడ్ ఉన్నట్లు తేలింది. శ్రీసత్యసాయి జిల్లాలో 27 చోట్ల, పల్నాడు జిల్లాలో 19, ప్రకాశం జిల్లాలో 25 చోట్ల ఫ్లోరైడ్ పరిమితికి మించి చాలా ఎక్కువ ఉన్నట్లు తేలింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఎనీ్టఆర్, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాలోనూ ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్న జిల్లాలు 2015 నుంచి క్రమేణా పెరుగుతున్నాయి.ఆర్శనిక్ఆర్శనిక్ విషతుల్యమైనది. లీటర్ నీటిలో 0.01 మిల్లీ గ్రాములకు మించి ఉంటే ఆ నీటిని పొరపాటున కూడా తాగకూడదు. రాష్ట్రంలో అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో పరిమితికి మించి ఆర్శనిక్ ధాతువులు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.సాగుకూ పనికి రావు..లీటరు నీటిలో 1.25 మిల్లీ గ్రాములకంటే ఎక్కువగా సోడియం కార్బొనేట్ ఉంటే ఆ నీటిని సాగుకు వినియోగించకూడదు. రాష్ట్రంలో 27.68 శాతం నమూనాల్లో సాగుకు పనికిరాని విధంగా ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు తేలింది. -
యాపిల్ వాచ్‌తో క్యాన్సరా? కోర్టులో వ్యాజ్యం
ఐఫోన్‌తో సహా యాపిల్ కంపెనీకి చెందిన ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఇక అత్యంత ప్రీమియం యాపిల్ వ్యాచ్ల (Apple Watch) సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ వ్యాచ్ల విషయంలోనే యాపిల్ ఇప్పుడు యూఎస్‌లో వ్యాజ్యాన్ని (Lawsuit) ఎదుర్కొంటోంది. ఇది వినియోగదారులను విష రసాయనాలకు గురిచేస్తోందని, క్యాన్సర్‌తో (cancer) సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఆరోపించింది.హానికర రసాయనాలువివిధ కంపెనీలకు చెందిన 22 వాచ్ బ్యాండ్లపై (వాచ్ బెల్ట్) చేసిన అధ్యయనం ఫలితంగా ఈ వ్యాజ్యం దాఖలైంది. ఇందులో 15 వాచ్ బ్యాండ్ల తయారీకి ఉపయోగించిన పదార్థాల్లో హానికర రసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన “ఓషన్”, “నైక్ స్పోర్ట్”, సాధారణ “స్పోర్ట్” వాచ్ బ్యాండ్లు అధిక స్థాయిలో పెర్ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ పదార్థాలను (PFAS) కలిగి ఉన్నాయని డైలీ మెయిల్ నివేదిక అధ్యయనాన్ని ఉదహరించింది.ఈ హానికర పదార్థాలను ‘ఎప్పటికీ నిలిచిపోయే రసాయనాలు’గా పేర్కొంటారు. ఎందుకంటే ఈ రసాయనాలు పర్యావరణంలో, మానవ శరీరంలో చాలా ఏళ్లు వాటి దుష్ప్రభావాలను కొనసాగిస్తాయి. వీటితో కలిగే అనారోగ్య దుష్పరిణామాలలో పుట్టుకతో వచ్చే లోపాలు, ప్రోస్టేట్, మూత్రపిండాలు, వృషణాల క్యాన్సర్, అలాగే సంతానోత్పత్తి సమస్యలు ఉన్నాయి.యాపిల్ వాదన ఇదీ..కాగా తమ వాచ్ బ్యాండ్లు 'ఫ్లోరోఎలాస్టోమర్' అనే సింథటిక్ రబ్బరు నుండి తయారవుతాయాయని, ఇది ఫ్లోరిన్ కలిగి ఉంటుంది కానీ హానికరమైన పెర్ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలు మాత్రం ఉండవని యాపిల్ సంస్థ చాలా కాలంగా వాదిస్తోంది. ఈ ఫ్లోరోఎలాస్టోమర్ సురక్షితమైనదని, ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా పూర్తిగా పరీక్షించినట్లు కూడా చెబుతోంది.అయితే యాపిల్ తమ వాచ్లకు వినియోగించే ఫ్లోరోఎలాస్టోమర్ ఆధారిత బ్యాండ్లు ఆరోగ్య ప్రమాదాలకు దోహదపడే ఇతర పదార్థాలతో పాటు పెర్ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలను కలిగి ఉన్నాయనే వాస్తవాన్ని దాచిపెట్టిందని వ్యాజ్యంలో ఆరోపించారు.హృదయ స్పందన రేటు, నడక, నిద్ర వంటి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు యూజర్లను అప్రమత్తం చేసే హెల్త్-ట్రాకింగ్ ఉపకరణాలుగా కూడా విస్తృతంగా అమ్ముడుపోతున్న ఈ స్మార్ట్‌వాచ్‌లే క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని అధ్యయనాల్లో తేలడం ఆందోళనకరం. -
ఏఎమ్ గ్రీన్‌తో డీపీ వరల్డ్ భాగస్వామ్యం
గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియాను ఉత్పత్తి చేస్తున్న ఏఎమ్ గ్రీన్(AM Green) సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. గ్రీన్ ఇంధనాలు, రసాయనాల కోసం స్థిరమైన సరఫరా అందించేందుకు డీపీ వరల్డ్(DP World)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారంతో డీకార్బనైజేషన్‌కు ప్రయత్నాలు జరుగుతాయని కంపెనీ తెలిపింది.ఇటీవల కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం రెండు కంపెనీలు తాజాగా భాగస్వామ్య పత్రాలపై సంతకాలు చేశాయి. ఏఎమ్ గ్రీన్, డీపీ వరల్డ్ సంయుక్తంగా ఈ పరిశ్రమలో లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నాయి. సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల(MTPA) గ్రీన్ అమ్మోనియా, 1 ఎంటీపీఏ గ్రీన్ మిథనాల్‌ను ఎగుమతి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. జీరో-కార్బన్ ఉద్గారాల కోసం యూరోపియన్ యూనియన్, యూఏఈలో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మొబైల్ రీఛార్జ్ మరింత భారం కానుందా..?గ్రీన్ కో గ్రూప్ & ఏఎమ్ గ్రీన్ వ్యవస్థాపకుడు మహేష్ కొల్లి మాట్లాడుతూ..‘గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా ఎదగాలనే భారతదేశ ఆశయానికి కంపెనీ కట్టుబడి ఉంది. గ్రీన్ మాలిక్యూల్స్‌తో వాతావరణ కాలుష్యాన్ని కట్టడి చేయవచ్చు. ఈ పరిశ్రమలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడానికి డీపీ వరల్డ్‌లో భాగస్వామ్యం కావడం సంతోషకరం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, ఇతర సుస్థిర ఇంధనాలను సమర్థవంతంగా ఎగుమతి చేయడానికి తోడ్పడుతుంది’ అన్నారు. డీపీ వరల్డ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ యువరాజ్ నారాయణ్ మాట్లాడుతూ..‘స్వచ్ఛమైన ఇంధనాలు, రసాయన ఉత్పత్తుల ఎగుమతిని సులభతరం చేయడానికి ఏఎమ్ గ్రీన్‌తో భాగస్వామ్యం కీలకం కానుంది’ అన్నారు. -
అక్కడ చేపలు పట్టాలంటే చంపాల్సిందే
‘అక్కడ చేపలు పట్టడమంటే చెరువుల్లో బాంబులు వేయడమో.. కరెంటు షాక్ ఇచ్చి లేదా నీటిలో రసాయనాలు కలిపి చేపలు చచ్చేలా చేసి పట్టుకోవడమో మాత్రమే తెలుసు. అంతేగానీ.. ప్రత్యేకంగా చేపలు పట్టేందుకు స్థానికులకు శిక్షణలేదు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో దీనిని గమనించాను. తద్వారా విషపూరితమైన చేపలను తినడమో.. చేపలతో పాటు ఇతర ప్రాణులు చనిపోవడమో జరుగుతోంది. అందుకే ప్రత్యేకంగా ఏడు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన (అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయా, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర) 20 మంది అధికారులకు శిక్షణ ఇస్తున్నాం’.. అని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ) డైరెక్టర్ డాక్టర్ జార్జ్ నీనన్ తెలిపారు. అక్కడ మత్స్య సంపదను పెంచడంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై కూడా ఈ ఐదురోజుల శిక్షణలో భాగం చేశాం. ఇక్కడ శిక్షణ తీసుకున్న అధికారులు అక్కడకెళ్లి స్థానికంగా ఉండే మత్స్యకారులతో పాటు స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) శిక్షణ ఇస్తే వారి ఆదాయ మార్గాలను పెంచేందుకు దోహదపడుతుందని ఆయన చెప్పారు. విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఉన్న సంస్థ కార్యాలయంలో వీరికి ఐదురోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ‘సాక్ష్రి’ ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నంమత్స్యసంపదకు తీవ్ర నష్టం!ఈశాన్య రాష్ట్రాల్లో చేపలు పట్టేందుకు ప్రధానంగా మెకానికల్ స్టుపెఫైయింగ్ పద్ధతిలో రాళ్లు విసరడం, డైనమైట్ వంటి పేలుడు పదార్థాలను ఉపయోగించడం చేస్తుంటారు. దీనిని సాధారణంగా బ్లాస్ట్ లేదా డైనమైట్ ఫిషింగ్ అని పిలుస్తారు. ఈ పద్ధతి చాలా హానికరం. ఈ పద్ధతిలో కేవలం మనం ఆహారంగా తీసుకునేందుకు అవసరమయ్యే చేపలతో పాటు వాటి గుడ్లు, ఇతర జలచరాలు కూడా చనిపోతాయి. ఇక మరో పద్ధతి.. ఫిష్ పాయిజనింగ్. ఈ పద్ధతిలో రాగి, సున్నం వంటి రసాయనాలను వినియోగిస్తారు. గిరిజన సంఘాలు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఈ పద్ధతిలో కూడా చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకూ చనిపోతాయి. అంతేకాక.. చేపలలో విష రసాయనాలు ఉంటాయి. వీటిని తినడం ఆరోగ్యానికి హానికరం కూడా. ఈ పారే నీటిని కిందనున్న ప్రాంతాల వారు తాగేందుకు వినియోగించే అవకాశం ఉంటుంది. తద్వారా వారి ఆరోగ్యాలు కూడా పాడవుతాయి. ఇక మూడో పద్ధతి.. ఎలక్ట్రికల్ ఫిషింగ్. ఈ పద్ధతిలో కరెంట్ షాక్ ఇవ్వడం ద్వారా చేపలు కదలకుండా పక్షవాతం వచ్చినట్లుగా పడిపోతాయి. తద్వారా వాటిని వలలతో పట్టుకోవడం సులభమవుతుంది. ఈ అన్ని పద్ధతుల్లో మత్స్యసంపద దెబ్బతినడంతో పాటు పర్యావరణ వ్యవస్థను కూడా ధ్వంసం చేస్తుంది. అందుకే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.ప్రతీచోట ఏపీ ఫిష్ మార్కెట్..ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతీ ప్రాంతంలో రెండు చేపల మార్కెట్లు ఉన్నాయి. ఒకటి స్థానిక చేపల మార్కెట్ కాగా.. మరొకటి ఆంధ్రప్రదేశ్ ఫిష్ మార్కెట్. అక్కడ ఏపీ చేపలకు అంత డిమాండ్ ఉంది. మేం చూసిన ప్రతీ ప్రాంతంలో చేపల మార్కెట్ ఎక్కడా అని ఆరాతీస్తే.. ఏ మార్కెట్ కావాలి? లోకల్ ఫిష్ మార్కెటా? ఏపీ ఫిష్ మార్కెట్ కావాలా అని అడిగే వారు. ఇక విమానాశ్రయాల్లో కూడా చేపల ఉత్పత్తుల విక్రయం జరుగుతుంది.ప్రత్యేక పద్ధతుల్లో తయారుచేసిన చేపలను అక్కడ విక్రయిస్తున్నారు. వాటికి స్థానికుల నుంచి మంచి డిమాండ్ ఉంటోంది. అయితే, మన విమానాశ్రయాల్లో అటువంటి పరిస్థితిలేదు. మరింతగా చేపల వినియోగాన్ని, మార్కెట్‌ను పెంచేందుకు ఇటువంటి పద్ధతులను మనం కూడా ఆచరించాల్సిన అవసరం ఉంది.తాబేళ్ల రక్షణకు ప్రత్యేక వలలు..సముద్రంలో వేటకు వెళ్తున్న మత్స్యకారులు వినియోగిస్తున్న వలల్లో తాబేళ్లు కూడా చిక్కుకుంటున్నాయి. తద్వారా తాబేళ్లు మృతువాత పడుతున్నాయి. దీనిని నివారించేందుకు తాబేళ్ల రక్షణ కోసం ప్రత్యేకంగా టర్టిల్ ఎక్స్‌క్లూడర్ డివైజ్ (టెడ్)లను అభివృద్ధి చేశాం. తాబేళ్ల రక్షణ కోసం ఈ వలలను ప్రత్యేకంగ ఉపయోగించే దిశగా మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నాం. మొదటి దశలో 60 వేల వరకూ తయారుచేస్తున్నాం. అయితే, వీటి ధర అధికంగా ఉంది. వీటిని సబ్సిడీపై అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. -
ప్లాస్టిక్స్ బరువును పెంచుతాయా..?
ఇంతవరకూ ప్లాస్టిక్ బౌల్స్‌లో తినకూడదు... అందులోని ప్లాస్టిక్ ఒంట్లోకి చేరడంతో ఆరోగ్యపరంగా అనేక అనర్థాలు వస్తాయనే విషయం తెలిసిందే. కానీ ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే నోట్లోకి వెళ్లని వస్తువులతోనూ ఒంటి బరువు పెరుగుతుందనీ, దాంతో పెరిగిన బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయనీ, అందుకే ఈ ప్లాస్టిక్‌ను ‘ఒబిసోజెన్స్’ అంటారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఉదాహరణకు... షాంపూ బాటిల్ సైతం మన బరువును పెంచేస్తుందంటున్నారు నిపుణులు. షాంపూ బాటిల్ మాత్రమే కాదు... షవర్ జెల్, హెయిర్ కండిషనింగ్లాంటి ప్లాస్టిక్ సీసాలూ, తిరిగి మాటిమాటికీ భర్తీ చేసుకోడానికి అవకాశమున్న బాటిళ్లలో ఉండే ప్లాస్టిక్ కూడా బరువును పెంచేస్తుందని నార్వేలోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ పరిశోధనల్లో తేలింది. ఈ అధ్యయనంలో 629 రకాల వివిధ ప్లాస్టిక్ వస్తువుల్లోని దాదాపు 55,000 రకాలకు పైగా రసాయనాలను పరీక్షించారు. ప్లాస్టిక్‌లోని దాదాపు పదకొండు రకాల రసాయనాలు బరువు పెంచడానికి కారణమవుతున్నాయంటూ తెలుసుకున్నట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ మార్టిన్ వేజ్నర్ పేర్కొన్నారు. ఆ ప్లాస్టిక్ సీసాలను వాడినప్పుడు దేహంలోకి ప్రవేశించే పదకొండు రకాల రసాయనాల కారణంగా బరువు పెరుగుతుండటంతో వాటిని ‘ఒబిసోజెన్స్’ అని వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా బైస్ఫినాల్–ఏ వంటి ‘ఒబిసోజెన్స్’ దేహంలోని జీవరసాయన ప్రక్రియల్లో పాల్గొనడంతోపాటు కొవ్వు నిండిపోయేలా ఫ్యాట్ సెల్స్ సంఖ్యను పెంచుతాయని తేలింది. దాంతో దేహం బరువు అమాంతం పెరుగుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో పరిశోధకుడు జొహన్నేస్ వోకర్ తెలిపారు. ఇప్పటివరకూ ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమని, అలాగే బైస్ఫినాల్–ఏ, థ్యాలేట్స్ వంటి ప్లాస్టిక్స్ వల్ల అనేక నరాల సంబంధిత వ్యాధులూ, వ్యాధినిరోధకతను తగ్గించే సమస్యలూ, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలాంటి అనారోగ్యాలు కలగవచ్చని తేలింది. ఇప్పుడు అవే ప్లాస్టిక్ ఉపకరణాలూ, పరికరాలు... బరువు పెరిగేలా చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తాజా పరిశోధనల్లో విస్పష్టంగా తేలింది. ‘ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే ప్రముఖ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. (చదవండి: నెత్తురు చిందించకుండానే చక్కెర పరీక్ష..! ) -
లారీకి రూ.25 వేలు తీసుకుని కెమికల్స్ ను మూసీలోకి వదులుతున్న ముఠా
-
ప్రకృతి చోద్యం!
ఎలాంటి రసాయనాలు వాడకుండా పంటలు పండించడమే ప్రకృతి వ్యవసాయం. దీనివల్ల భూసారం పెరగడంతో పాటు రైతులకు పెట్టుబడి తగ్గుతుంది. అంతేకాకుండా ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. అందువల్లే గత ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాయి. ఇందుకోసం వ్యవసాయశాఖలోనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాయి. కానీ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం లెక్కలు ఘనంగా కనిపిస్తున్నా... క్షేత్రాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయం జిల్లాలో రికార్డుల్లోనే సాగుతోంది. అధికారులు వేలాది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగుతోందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నామమాత్రానికే పరిమితమైంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విభాగం ఉన్నా... ఉత్తుత్తి హడవుడే తప్ప ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రకృతి వ్యవసాయం కింద జిల్లాలో సాగుచేసిన ఆహార పంటల్లో కెమికల్స్ అవశేషాలు ఉన్నట్లుగా శాస్త్రీయంగా నిర్ధారణ కావడంతో ప్రకృతి సేద్యం...అంతా చోద్యంగా మారింది. లెక్కల్లో మాత్రం 34,024 ఎకరాల్లో... 2024–25 సంవత్సరంలో జిల్లాలోని 141 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 53,834 మంది రైతులతో 75,534 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం. ప్రకృతి వ్యవసాయ విభాగం లెక్కల ప్రకారం ఇప్పటికే 32,607 మంది రైతులు 34,024 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కానీ 32,707 మంది రైతుల్లో 5 శాతం మంది కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్లే జిల్లాలో వేలాది మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు చెబుతున్నప్పటికి.. సరి్టఫికేషన్ మాత్రం అతి కొద్ది మందికే వస్తోంది. అది కూడా స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకే దక్కుతోంది. సాగుకు సిబ్బంది వెనుకంజ ప్రకృతి వ్యవసాయ విభాగంలో 367 మంది పనిచేస్తున్నారు. వాస్తవానికి వీరంతా వారికున్న భూమిలో ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రధానంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరీ వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులకు అదర్శంగా నిలవాలి. కానీ వీరిలోనే 60 శాతం మంది ప్రకృతి వ్యవసాయాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. రైతులకు ఆదర్శంగా ఉండాల్సిన సిబ్బందే కాడికిందపడేస్తే ఇక రైతులు ఎందుకు పట్టించుకుంటారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కొందరు మాస్టర్ ట్రైనర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. విచ్చలవిడిగా కెమికల్స్ వాడుతున్నా.. ప్రకృతి వ్యవసాయం అంటూ నమ్మిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చల విడిగా కెమికల్స్ వాడకం జిల్లాలో చాలా మంది పేరుకే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆచరణలో మాత్రం అంతా కెమికల్స్ వ్యవసాయమే. ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంటే రసాయన ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గాలి. కానీ వివిధ మండలాల్లో లెక్కకు మించి రసాయన ఎరువులు వినియోగిస్తుండటం గమనార్హం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2.50 లక్షల టన్నుల వరకు రసాయన ఎరువుల వినియోగం ఉంది. జిల్లాల పునరి్వభజన తర్వాత కర్నూలు జిల్లాలో 1.50 లక్షల టన్నుల వరకు వినియోగమవుతోంది. 2024–25 ఖరీఫ్‌లో 1,27,567.657 టన్నుల రసాయన ఎరువులను వినియోగించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. సాగు విస్తీర్ణం పెంచుతాం జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపుతున్నారు. ఆసక్తి ఉన్న వారిని గుర్తించి శిక్షణ ఇస్తున్నాం. జీవామృతం, కషాయాల తయారీపై కూడా అవగాహన కల్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసే సిబ్బంది కూడ ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది 54,834 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారిప్రకృతి వ్యవసాయం అంటే... ప్రకృతి వ్యవసాయం అంటే ఎలాంటి పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకుండా పంటలు పండించడం. పంటల సాగులో ద్రవ, ఘన జీవామృతాన్ని మాత్రమే వినియోగించడం. చీడపీడల నివారణకు కషాయాలు, బ్రహ్మస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం తదితర వాటిని వినియోగించడం. ఏ రకంగానూ ఇటు పురుగుమందులు, అటు రసాయన ఎరువులు వినియోగించకపోవడం. అలా..వరుసగా మూడేళ్లు సాగు చేస్తే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లుగా పరిగణిస్తారు. కానీ అధిక దిగుబడుల కోసం చాలా మంది వి చ్చల విడిగా రసాయన మందులు వాడుతున్నారు. కల్లూరు మండలం లక్ష్మీపురం పంచాయతీలో 631 మంది మహిళలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ పంచాయతీలో ముగ్గురు మాత్రమే 100 శాతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందుకే సరి్టఫికేషన్ కూడా ఎవరూ వెళ్లడం లేదు. అధికారులు చెబుతున్న లెక్కలన్నీ ఇలాగే ఉంటున్నాయి. పాలేకర్ స్ఫూర్తితో 150 మంది రైతులు.. ఎవరి ప్రమేయం లేకుండా స్వచ్ఛందగా జిల్లాలోని 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీరు దాదాపు పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నారు. వీరు సుబాష్ పాలేకర్ స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం విశేషం. ప్రకృతి వ్యవసాయ విభాగం చెబుతున్న వారిలో 5 శాతం కూడ ప్రకృతి వ్యవసాయం చేసే వారు లేరు. ఈ 150 మంది రైతుల ఉత్పత్తులతోనే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హడావుడి చేస్తున్నారు.34,024 ఎకరాలు అధికారుల లెక్కల ప్రకారం ప్రకృతి సాగు విస్తీర్ణం367 ప్రకృతి సాగు విభాగంలోని సిబ్బంది75,534 ఎకరాలు ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయం లక్ష్యం? ? ప్రస్తుతం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు -
బ్యూటీ విత్ నేచర్!
అందం అంటే.. ఒకప్పుడు ఆడవారి సొంతం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా అందరూ అందంగా ఉండేందుకు తాపత్రయపడుతున్నారు. నగరంలో సౌందర్య సాధనాల మార్కెట్ భారీగా నడుస్తోంది. అయితే ఇప్పుడున్న యువత తాము వాడుతున్న బ్యూటీ ప్రొడక్ట్స్‌పై చాలా కచి్చతత్వంగా ఉంటున్నారు. ఎంతలా అంటే ప్రతి ఉత్పత్తిలో ఉన్న పదార్థాలను తరచి తరచి చూస్తున్నారు. వాటి గురించి గూగుల్‌లో వెతికి అవి తమపై ఎలా ప్రభావితం చేస్తాయి.. తమ శరీర తత్వానికి ఎలా సరిపోతాయి.. వాటిని వాడితే ఎంత ప్రమాదకరం వంటి అంశాలను తెలుసుకుంటున్నారు. మరికొందరు కెమికల్స్ తక్కువగా ఉండే హెర్బల్ ఉత్పత్తులను మాత్రమే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరైతే ప్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. యువతలో పెరుగుతున్న అవగాహన చర్మ సౌందర్యంతో పాటు, కేశ సంరక్షణ విషయంలో చాలా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోవడం సర్వసాధారణంగా మారింది. ఇక చర్మం కూడా నిగనిగలాడాలని, తెల్లగా ఉండాలని అనేక సౌందర్య సాధనాలను వాడుతున్నారు. అయితే వాటిలో కూడా కెమికల్స్ లేని నేచురల్ ప్రొడక్ట్స్ వాడితే భవిష్యత్తులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాటి జోలికి వెళ్తున్నారు. ముఖానికి వాడే ఉత్పత్తుల దగ్గరి నుంచి జుట్టుకు వాడే నూనెల వరకూ దాదాపు సహజసిద్ధంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఉదాహరణకు కొబ్బరినూనె దుకాణాల్లో కొనడం కన్నా ఎక్కడైనా నేచురల్‌గా దొరుకుతుందేమోనని ఆన్లైన్లో వెతుకుతున్నారు. కోల్డ్ ప్రెస్స్డ్ కొబ్బరినూనె, ఆముదం నూనె కొనేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా ప్రతి సౌందర్యసాధనం సహజసిద్ధంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.కాస్త జాగ్రత్త మరి.. సహజసిద్ధంగా తయారు చేసిన ఉత్పత్తులు బాగానే పనిచేసినా.. గుడ్డిగా ఏదీ నమ్మకూడదని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి ఎలాంటివి పనిచేస్తాయో.. ఎవరి శరీర తత్వానికి ఎలాంటి రెమెడీలు వాడితే బాగుంటుందో తెలుసుకున్న తర్వాతే వాడటం మంచిదని చెబుతున్నారు. ముందు మన చర్మ తత్వం, జుట్టు సాంద్రత తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. కాగా, అన్ని వస్తువులు, అన్ని ఔషధాలూ అందరికీ సరిపోవని, ఎవరికి ఎలాంటివి వాడితే మంచిదో ఓ అవగాహనకు రావాలంటున్నారు. ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఒకసారి డెర్మటాలజిస్టును సంప్రదించి, దాని గురించి వారితో చర్చిస్తే మంచిదని సూచిస్తున్నారు. నిర్మొహమా టంగా వాడాలనుకుంటున్న ఉత్పత్తుల గురించి చెప్పి.. వారి సలహా మేరకు వాడాలని పేర్కొంటున్నారు. లేదంటే ఎంతకాలం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడినా ప్రయోజనం ఉండకపోవచ్చని, అనవసరంగా సమయంతో పాటు డబ్బులు వృథా చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు చెట్టు నుంచి తీసిన పసరు వంటివి కూడా ఎంత మోతాదులో వాడుతున్నామో తెలియకుండా వాడితే దుష్పరిణామాలు ఉంటాయని, ఏదీ మోతాదుకు మించి వాడటం సరికాదని చెబుతున్నారు.అందరికీ అన్నీ సెట్ కావు.. ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిన రెమెడీలు అందరి చర్మతత్వం, కేశాలకు సరిపడకపోచ్చు. అందుకే ఏదీ గుడ్డిగా నమ్మడం సరికాదు. మనకు ఎలాంటి రెమెడీలు సరిపోతాయో చూసుకున్న తర్వాతే వాడటం మంచిది. ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉన్పప్పుడు హోం రెమెడీలు వాడటం అస్సలు మంచిది కాదు. సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఏ సమస్యకైనా 60 శాతం మేర చికిత్స అవసరం పడుతుంది. 20 శాతం నేచురల్ ఉత్పత్తులు వాడటం వల్ల మెరుగవుతుంది. మరో 20 శాతం మేర రోజువారీ ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. హోం రెమెడీలతో సమస్యలను తీవ్రతరం చేసుకుని మా వద్దకు చాలామంది వస్తుంటారు. అందుకే నిపుణులను సంప్రదించాకే ఏది వాడాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. – డాక్టర్ లాక్షనాయుడు, కాస్మెటిక్ డెర్మటాలజీ, ఏస్తటిక్ మెడిసిన్ఇన్స్టాలో వీడియోలు చూసి..సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో మనకు తెలిసిందే. ఇటీవల సౌందర్యాన్ని పెంపొందించేవంటూ.. పూర్వ కాలంలో పెద్దవాళ్లు వాడే వారంటూ పలు రకాల మొక్కల గురించి సామాజిక మాధ్యమాల్లో తెగ వీడియోలు చేస్తున్నారు. కొందరేమో వంటింట్లో సౌందర్యసాధనాలు అంటూ వీడియోలు పెడుతున్నారు. వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గా అందంగా కనిపిస్తారని, చర్మ సమస్యలు తగ్గుతాయని, జుట్టు రాలిపోకుండా.. ఒత్తుగా పెరుగుతుందని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది వీడియోలను చూసుకుంటూ ఇంట్లోనే సహజసిద్ధంగా ఉత్పత్తులను తయారుచేసుకుంటున్నారు. మళ్లీ పూర్వకాలంలోకి వెళ్తున్నారని చెప్పొచ్చు. -
రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ తెగ లాగించేస్తున్నారా? అయితే కేన్సర్ ముప్పు
పుట్టినరోజు, పెళ్లి రోజు, నూతన సంవత్సరం, ఇలా వేడుక ఏదైనా కేక్ ఉండాల్సిందే. ఖరీదైనా సరే.. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ కేక్స్ ఉంటే ఇక ఆ సందర్భానికి మరింత జోష్. వీటిని అంటే అంతలా ఇష్టపడతారు. కానీ వీటిని ఆకర్షణీయంగా తయారు చేసేందుకు వాడే రంగులు కేన్సర్ కారకమవుతున్నాయని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు రకాలతోపాటు మరో 12 పాపులర్ కేక్స్ తయారీకి వాడే రంగులతో జాగ్రత్త అని హెచ్చరించింది. అందం, ఆకర్షణ కోసం వంటకాల్లో రంగులు వాడటం కొత్త కాదు కానీ.. వీటిల్లో కొన్ని మరీ ముఖ్యంగా కృత్రిమంగా తయారు చేసిన రంగులు కేన్సర్‌ను కలుగజేస్తాయని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ విభాగం బెంగళూరులోని బేకరీల్లోని కేక్స్‌పై పరీక్షలు నిర్వహించింది. అల్లురా రెడ్, సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సిఎఫ్, పోన్సో 4ఆర్, టార్ట్రాజైన్ ,కార్మోయిసిన్ వంటి హానికరమైన కృత్రిమ రంగుల వీటి తయారీకి వాడుతున్నట్లు గుర్తించింది. ఇవన్నీ కేన్సర్ ముప్పును పెంచేవేనని స్పష్టం చేసింది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకూ ఈ కృత్రిమ రంగులు కారణమవుతాయని తెలిపింది.ఈ ఫలితాల దృష్ట్యా, కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం ఆహార భద్రతా నిబంధనలను పాటించాలని, వినియోగ యోగ్యమైన పదార్థాలనే ఉత్పత్తుల తయారీలో ఉపయోగించాలని బేకరీలను కోరింది. వినియోగదారులు కూడా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించింది. (శతాబ్దాల శాప భయం : చీర సింగారించుకుని మరీ పురుషుల గర్భా నృత్యం)గోబీ మంచూరియా, కబాబ్‌లు, పానీ పూరీ లాంటి వాటిల్లోనూ కేన్సర్ కారక కృత్రిమ రంగులు వాడినట్లు కర్ణాటక ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. అంతేకాకుండా.. రోడమైన్-బి లాంటి రంగులపై నిషేధం విధించింది కూడా. ఇలాంటి కృత్రిమ రంగుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. -
నాలుగో స్థానంలో ఫార్మా ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా ఎగుమతులు భారత్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్ట్ మధ్య 11.9 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.1 శాతం అధికం. ఎగుమతుల పరంగా జెమ్స్–జువెల్లరీ, కెమికల్స్ విభాగాలను దాటి ఫార్మా రంగం నాల్గవ స్థానంలో నిలిచింది. 2023లో ఫార్మా రంగం ఆరవ స్థానంలో ఉంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమ 8–10% ఆదాయ వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. అమె రికా, యూరప్ వంటి రెగ్యులేటెడ్ మార్కెట్లకు బలమైన ఎగుమతులు, ఆఫ్రికా, ఆసియాతో సహా సెమీ–రెగ్యులేటెడ్ మార్కెట్లలో రికవరీ, అలాగే స్థిరమైన దేశీయ డిమాండ్‌తో 2024–25లో ఈ స్థాయి ఆదాయ వృద్ధిని సాధిస్తుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. స్థిర నగదు ప్రవాహాలు.. 2023–24లో భారత ఔషధ పరిశ్రమ సుమారు 10 శాతం వృద్ధిని సాధించింది. యూఎస్ జెనరిక్స్ మార్కెట్లో ధరల ఒత్తిడి తగ్గడం, నిర్వహణ వ్యయాలు మెరుగవడం.. వెరశి ఆపరేటింగ్ మార్జిన్లు 70–80 బేసిస్ పాయింట్లు పెరిగి సుమారు 22.5 శాతానికి చేరే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు సముచిత చికిత్సా విభాగాల్లో కొనుగోళ్లను కొనసాగించినప్పటికీ.. స్థిర నగదు ప్రవాహాలు, తక్కువ ఆర్థిక పరపతి నుండి కూడా ఈ రంగం ప్రయోజనం పొందుతుందని అంచనా. గత ఏడాది రూ.4.1 లక్షల కోట్ల మార్కెట్లో సగానికి బాధ్యత వహించే 190 ఔషధ తయారీ కంపెనీల ఆదాయాల ఆధారంగా క్రిసిల్ నివేదిక రూపొందించింది. ఆదాయం దాదాపు సమానం.. దేశీయ విక్రయాలు, ఎగుమతుల మధ్య ఆదాయం దాదాపు సమానంగా ఉందని క్రిసిల్ వెల్లడించింది. దేశీయ ఆదాయంలో అధికంగా దీర్ఘకాలిక, తీవ్ర చికిత్సా విభాగాల ద్వారా సమకూరుతోంది. ఎగుమతుల ఆదాయం ప్రధానంగా ఫార్ములేషన్స్ 80 శాతం, బల్క్ డ్రగ్స్ 20 శాతం నమోదవుతోంది. 2024–25లో ఫార్ములేషన్ ఎగుమతులు రూపాయి పరంగా 12–14 శాతం పెరుగుతాయని అంచనా. యూఎస్, యూరప్ వంటి నియంత్రిత మార్కెట్లు 13–15 శాతం వృద్ధిని సాధిస్తాయి. కొనసాగుతున్న ఔషధాల కొరత, కొత్త ఉత్పత్తుల లాంచ్‌లు, ప్రత్యేక ఉత్పత్తుల వైపు మళ్లడం ఇందుకు కారణం. సెమీ–రెగ్యులేటెడ్ మార్కెట్లకు ఎగుమతులు 8–10 శాతం పెరగవచ్చు. విదేశీ మారక నిల్వలను మెరుగవడం, ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాలలో కరెన్సీల స్థిరీకరణ ఇందుకు సహాయపడుతుంది. దేశీయంగా మార్కెట్ ఇలా.. ఫార్మా పరిశ్రమ ఆదాయం దేశీయంగా 7–9 శాతం పెరుగుతుందని అంచనా. ముఖ్యంగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్ఎల్ఈఎం) ఉత్పత్తులలో ధరల పెరుగుదల ఇందుకు దోహదం చేయనుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం టోకు ధరల సూచీలో జరిగిన కొద్దిపాటి మార్పుల కారణంగా ఎన్ఎల్ఈఎం పోర్ట్‌ఫోలియో వృద్ధి తగ్గుతూనే ఉంటుంది. పెరుగుతున్న జీవనశైలి సంబంధిత వ్యాధులు, మహమ్మారి అనంతర ఆరోగ్య అవగాహన అధికం కావడం వంటి కారణంగా దీర్ఘకాలిక చికిత్సల విభాగం దేశీయ ఆదాయ వృద్ధికి కీలకంగా దోహదపడుతుందని క్రిసిల్ భావిస్తోంది. -
విషపూరిత నురుగులు కక్కుతున్న యమునమ్మ, ఎవరూ పట్టించుకోరే?
దేశంలో ఒక పక్క సార్వత్రిక ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరో పక్క రోజు రోజుకి కాలుష్య కాసారంగా మారిపోతున్న పవిత్ర యమునా నదీ తీరం మరోసారి కాలుష్య సెగలు కక్కుతోంది. టన్నుల కొద్దీ మురుగునీరు, పారిశ్రామిక, గృహ వ్యర్ధాలతో విషపూరిత నురుగుతో నిండిపోయింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో అనూహ్యంగా పెరిగిపోతున్న కాలుష్యానికి సాక్షీభూతంగా నిలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. యమున ఉపరితలంపై విషపూరిత నురుగు తేలుతున్న వీడియోలు గతంలో చాలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి .అలాగే కోవిడ్ లాక్డౌన్ కాలంలో యమునకు కాలుష్యం స్థాయి చాలావరకు తగ్గి ప్రశాంతంగా కనిపించడం గమనార్హం. తీవ్రమైన కాలుష్యంతో యమునా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని దుష్ప్రభావాలు, పొంచివున్న ముప్పుపై వాతావరణ నిపుణులు, శాస్త్రజ్ఞులు ఎంత మొత్తుకుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. తక్షణమే కనీస జాగ్రత్తలు చేపట్టాలని కోరుతున్నారు. Kalindi Kunj ... Yamuna Delhi . Beautiful poisonous pink water froth with chemicals ,, @ArvindKejriwal promised clean Yamuna in 2017 ,,nothing happened@SwatiJaiHind @AtishiAAP ... IIT quota admission , is useless pic.twitter.com/svcQ3wdYGw — No Conversion (@noconversion) May 19, 2023 నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఢిల్లీ, హర్యానా ,ఉత్తరప్రదేశ్ నుండి శుద్ధి చేయని మురుగునీటిలో ఫాస్ఫేట్లు, సర్ఫ్యాక్టెంట్లు (రసాయన సమ్మేళనాలు) యమునలో కలిసిపోతున్నాయి. ఇదే విషపూరిత నురుగుకు కారణం. ఈ రెండింటిలోనూ 99 శాతం గాలి, నీటిలో కలిసి పోతుంది.ఫలితంగా అనేక బాధలు తప్పవు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు లాంటి సమస్యలొస్తాయి. ఈ రసాయనాలతో జీర్ణకోశ సమస్యలు ,టైఫాయిడ్ వంటి వ్యాధులు రావచ్చు. దీర్ఘకాలం పాటు ఈ పారిశ్రామిక కాలుష్య కారకాలకు ఎక్స్పోజ్ అయితే నరాల సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతాయి. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఆగ్రోకెమికల్స్ ఆదాయం డౌన్! దశాబ్దకాలంలో ఇదే తొలిసారి..
ముంబై: ఉత్పత్తుల ధరల తగ్గుదల, డిమాండ్ అంతంతమాత్రంగా ఉండటం, రబీ పంట సీజన్లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఒక మోస్తరుగా ఉండటం తదితర అంశాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీ ఆగ్రోకెమికల్స్ రంగం ఆదాయం 3 శాతం మేర క్షీణించనుంది. క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ మేరకు అంచనాలు వేసింది. దశాబ్దకాలంలో ఇలా జరగడం ఇదే తొలిసారని పేర్కొంది. చైనా నుంచి సరఫరా వెల్లువెత్తడంతో అంతర్జాతీయంగా ఆగ్రోకెమికల్స్ ధరలు పడిపోయాయని, ఎగుమతులకు డిమాండ్ తగ్గిందని క్రిసిల్ తెలిపింది. అటు అమ్మకాల పరిమాణం, వసూళ్లు తగ్గడం వల్ల నిర్వహణ మార్జిన్లు 400–450 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) మేర క్షీణించి దశాబ్దపు కనిష్టమైన 10–11 శాతానికి పడిపోవచ్చని వివరించింది. డిమాండ్ అంతంతమాత్రంగా ఉండటంతో తయారీ సంస్థలు తమ మూలధన వ్యయాల ప్రణాళికలను కూడా మార్చుకునే పరిస్థితి నెలకొందని క్రిసిల్ పేర్కొంది. లాటిన్ అమెరికా, అమెరికాలో పంటల సీజన్ మళ్లీ ప్రారంభమయ్యే సమయానికి అంతర్జాతీయంగా తయారీ సంస్థలు తిరిగి నిల్వలను పెంచుకోవడం మొదలెట్టాక నవంబర్ నుంచి ఎగుమతులకు డిమాండ్ మెరుగుపడవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఎగుమతుల్లో ఆ రెండు మార్కెట్ల వాటా 55 శాతం ఉంటుంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ఎగుమతులు మందగించడంతో దేశీ తయారీ సంస్థల దగ్గర నిల్వలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో దేశీయంగా అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్ స్థాయిలోనే ఉండొచ్చు. వర్షపాతం ఆశించినంత స్థాయిలో లేకపోవడం వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండటం రబీ పంటలపై ప్రభావం చూపనుంది. ఫలితంగా ఆగ్రోకెమికల్స్ పరిశ్రమపైనా ప్రతికూల ప్రభావం పడనుంది. సాధారణంగా దేశీయంగా క్రిమిసంహారకాల వినియోగంలో ఈ సీజన్ వాటా 35 శాతం ఉంటుంది. అటు ఎగుమతులు మందగించడం, ఇటు దేశీయంగా డిమాండ్ నెమ్మదించడం వంటి అంశాల కారణంగా ఆగ్రోకెమికల్స్ తయారీ సంస్థల నిర్వహణ లాభదాయకత దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి త్రైమాసికంలో వాటి ఆపరేటింగ్ మార్జిన్ వార్షిక ప్రాతిపదికన 700–1,000 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. అయితే, మూడో త్రైమాసికం నుంచి డిమాండ్ పుంజుకునే అవకాశం ఉండటం వల్ల నిర్వహణ లాభదాయకత సీక్వెన్షియల్‌గా మెరుగుపడవచ్చు. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో కాస్త తక్కువగా 10–11 శాతానికే పరిమితం కావచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 15.2 శాతంగా నమోదైంది. రాబోయే రోజుల్లో డిమాండు, కీలక ఎగుమతి మార్కెట్లలో వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తులు.. ముడిసరుకు ధరలు మొదలైన వాటిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. -
కెమికల్ కిల్లింగ్స్!
వివిధ రసాయనాలు, పురుగుమందులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది రసాయనాల కారణంగా మృతిచెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్యంపై రసాయనాల ప్రభావం పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అంతర్జాతీయంగా జరిగే అన్ని రకాల మరణాల్లో 3.6 శాతం కెమికల్స్ ద్వారానే జరుగుతున్నాయని నివేదిక వివరించింది. ముఖ్యంగా భారత్‌లో పురుగుమందుల వల్లే ఏడాదికి 70 వేల ఆత్మహత్యలు జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొంది. – సాక్షి, హైదరాబాద్హృద్రోగాలే అధికం హృద్రోగాలే అధికం డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం... కెమికల్స్ వల్ల వచ్చే జబ్బుల్లో అత్యధికంగా 40% గుండె జబ్బులే ఉంటున్నాయి. అలాగే 20% దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు, 15% కేన్సర్లు ఉంటున్నాయి. ఏటా లక్ష మంది పురుషుల్లో కెమికల్స్ వల్ల 35 మరణాలు సంభవిస్తుండగా అందులో 32 జబ్బులు దీర్ఘకాలిక జబ్బుల వల్లే జరుగుతున్నాయి. మహిళల్లో లక్షకు 17మంది కెమికల్స్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల్లో 20% కెమికల్స్ ద్వారా, రైతు ఆత్మహత్యల్లో 30% కెమికల్స్ ద్వారా, 1.4% నిద్రమాత్రల వంటి మందులు వేసుకోవడమే కారణం. ఏయే రసాయనాల వల్ల ఎటువంటి జబ్బులు..? ఆర్సెనిక్, ఆస్బెస్టాస్, బెంజిన్, బెరీలియం, క్యాడ్మియం తదితర రసాయనాలు 2.9 శాతం కేన్సర్లకు కారణమవుతున్నాయి. ఆర్సెనిక్ భూగర్భ జలాల నుంచి వస్తుండగా బొగ్గు గనుల్లో పనిచేసే వారిలో ఆస్బెస్టాస్ చేరుతోంది. ధూమపానం, వాహన కాలుష్యం ద్వారా బెంజిన్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. మురికినీరు లేదా కలుషిత జలాల్లో ఉండే చేపలు తినడం, అలాంటి నీటితో సాగు చేసే ఆలుగడ్డ, వరి, పొగాకు ద్వారా క్యాడ్మియం ఒంట్లోకి చేరుతోంది. సీసం వాడకాన్ని తగ్గించాలి... ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 41 శాతం దేశాలు సీసంపై చాలావరకు నియంత్రణ విధించాయి. అయినా పెయింటింగ్స్, వాహన ఇంధనాలు, నీరు, ఫుడ్ ప్యాకేజీలు, చిన్నారుల ఆట బొమ్మల్లో దాని వాడకం ఇంకా కొనసాగుతోంది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా వస్తువుల్లో సీసం వాడకాన్ని నివారించాలి. అన్ని రకాల రసాయనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారంటే 16 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారన్నమాట. – డాక్టర్ కిరణ్ మాదల,సైంటిఫిక్ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ సీసంతో ఆరోగ్యానికి హాని.. కెమికల్స్ వల్ల హానిలో సగ భాగం సీసం అనే లోహం ద్వారానే జరుగుతోంది. సీసాన్ని పెయింటింగ్స్, ప్లంబింగ్ పనులతోపాటు స్మోకింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మైనింగ్, ఐరన్, ఉక్కు తయారీ, ఆయిల్ రిఫైనింగ్‌లో, పెట్రోల్, విమాన ఇంధనాలు, కాస్మెటిక్స్, సంప్రదాయ మందులు, నగల తయారీ, సిరామిక్స్, ఎల్రక్టానిక్ వస్తువులు, వాటర్ పైప్‌లలో సీసం ఉంటోంది. కలర్ కోటింగ్‌తో కూడిన ఆహారాలు తినడం వల్ల గుండె జబ్బుల్లో 4.6 శాతం, కిడ్నీ జబ్బుల్లో 3 శాతం సీసం ద్వారా వస్తున్నాయి. చిన్నారుల్లో మూడో వంతు బుద్ధిమాంద్యం సీసం ద్వారా ఏర్పడుతోంది. పిల్లల్లో ఎక్కువగా పెయింటింగ్స్ ద్వారా సీసం వారిలో చేరుతుండగా ఐదేళ్లలోపు పిల్లల్లో సీసం కలిగించే దుష్ప్రభావం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. సీసం కలిసిన వస్తువుల వాడకం వల్ల గర్భిణుల్లో ముందస్తు ప్రసవాలు లేదా అబార్షన్లు జరుగుతున్నాయి. -
కెమికల్స్, పెట్రోకెమికల్స్‌కు పీఎల్ఐ
న్యూఢిల్లీ: కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగానికి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ తరహా ఉత్పత్తులకు భారత్‌ను తయారీ కేంద్రంగా చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కెమికల్స్, పెట్రోకెమికల్స్ తయారీ రంగం నిర్వహిస్తున్న మూడో ఎడిషన్ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. కఠినమైన కాలుష్య నియంత్రణలు, పెరుగుతున్న కారి్మక వ్యయాలతో రసాయనాల పరిశ్రమలోని అంతర్జాతీయ కంపెనీలు తమ తయారీ వసతులను వైవిధ్యం చేసుకోవాలని చూస్తున్నాయని.. వీటి తయారీకి భారత్ ప్రత్యామ్నాయ కేంద్రంగా ఎదిగే అవకాశాలు, సామర్థ్యాలు ఉన్నాయని చెప్పారు. దీనికితోడు ఈ ఉత్పత్తులకు భారత్ సైతం పెద్ద వినియోగ కేంద్రంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశీయంగా మిగులను ఎగుమతి చేసుకోవచ్చని, ఇందుకు ప్రభుత్వం విధానాల పరంగా మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ‘‘భారత్ తయారీ కేంద్రంగా అవతరించేందుకు మేము సానుకూలంగా ఉన్నాం. అందుకే కెమికల్స్, పెట్రోకెమికల్స్‌కు పీఎల్ఐని పరిశీలిస్తున్నాం. సుస్థిరత, కర్బన ఉద్గారాల విడుదల, కాలుష్యం, బూగర్భనీటి కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమ అదనపు సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలి. 2047 నాటికి ఇంధన పరంగా స్వావలంబన, 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాలను గుర్తు పెట్టుకోవాలి. ప్రతీ పరిశ్రమ, రంగం తన వంతు సహకారం అందించకపోతే ఈ లక్ష్యాలు సాకారం కావు’’అని మంత్రి సీతారామన్ గుర్తు చేశారు. పర్యావరణ అనుకూలమైన వృద్ధికే తమ ప్రాధాన్యం అని చెప్పారు. కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్రోత్సాహకానికి ప్రభుత్వం రూ.19,744 కోట్లను ప్రకటించడాన్ని గుర్తు చేశారు. -
బీ అలర్ట్! హైదరాబాద్‌లో హానికర రసాయనాలతో ఐస్‌క్రీమ్‌లు..
సాక్షి, హైదరాబాద్: ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో వీటికున్న క్రేజ్ వేరు. రోడ్లపై ఐస్‌క్రీం కనపడితే కొనిచ్చేంత వరకు పిల్లలు మారాం చేస్తుంటారు. ఇక వేసవి వచ్చిందంటే చాలు.. హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్‌గా ఐస్‌క్రీం తినాలనిపిస్తుంది. అందుకు ఈ సీజన్లో ఐస్క్రీంలకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు దీన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. హానికరమైన రసాయనాలతో ఐస్క్రీంలను తయారీ, నకిలీ ఐస్‌క్రీంలపై బ్రాండెడ్ స్టిక్కర్లతో అమ్మకాలు జరుపుతున్నారు. ప్రజలు ప్రాణాల పణంగా, లాభాలే ప్రధాన అజెండాగా వ్యాపారం చేస్తున్నారు. భారీగా లాభాలు ఆర్జించేందుకు కల్తీ దారిని ఎంచుకుంటున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా చిన్న పిల్లలు తినే ఐస్ క్రీం ను కూడా కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడో వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ లోని చందానగర్‌లో వెలుగులోకి వచ్చింది. హానికరమైన రసాయనాలతో నకిలీ ఐస్‌క్రీమ్‌లను తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న ముఠా గుట్టు రట్టైంది. పోలీసులు జరిపిన దాడిలో బ్రాండెడ్ పేర్లతో నకిలీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో షాపులోని సరుకు సీజ్ చేసి నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తస్మాత్ జాగ్రత్త భాగ్యనగర ప్రజలారా! -
ఎగుమతులు @ 447 బిలియన్ డాలర్లు
రోమ్: భారత్ వస్తు ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22తో పోల్చితే 6 శాతం పెరిగి 447 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇదే సమయంలో దేశ దిగుమతులు 16.5 శాతం ఎగసి 714 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 267 బిలియన్ డాలర్లకు చేరింది. పెట్రోలియం, ఫార్మా, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల రంగాల నుంచి ఎగుమతుల్లో మంచి వృద్ధి నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్, ఇటలీల్లో ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకూ పర్యటించిన గోయల్ ఈ సందర్భంగా పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు మరింత పురోగమించడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపిన అంశాల్లో ముఖ్యమైనవి... ► వస్తు, సేవలు కలిపి ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక విభాగాల దిగుమతులు 892 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ ఎకానమీ క్రియాశీలత, పురోగమనానికి సూచికలుగా ఎగుమతి–దిగుమతి గణాంకాలు ఉన్నాయి. ► అన్ని దేశాలతో పటిష్ట వాణిజ్య సంబంధాలు నెరపడానికి భారత్ కృషి సల్పుతోంది. ► ఇన్వెస్టర్ల పెట్టుబడులకు భారత్ అత్యంత ఆకర్షణ ప్రదేశంగా ఉంది. ఎకానమీ పరంగా చూస్తే, భారత్ ఎంతో పటిష్టంగా ఉంది. వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదవుతున్నాయి. ఎగుమతులు బాగున్నాయి. ద్రవ్యోల్బణం దిగివస్తోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పటిష్టంగా 600 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. విదేశాల నుంచి భారత్‌కు పంపుతున్న రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లుపైగానే ఉంటున్నాయి. పెట్టుబడుల ప్రవాహం బాగుంది. ► ఎగుమతుల భారీ వృద్ధి లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్ ఇప్పటికే ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించడం జరిగింది. -
ఏపీలో విష్ణు కెమికల్స్ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ విష్ణు కెమికల్స్ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తోంది. వచ్చే అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్లో స్పెషాలిటీ కెమికల్స్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు బోర్డు సోమవారం ఆమోదముద్ర వేసినట్లు తెలిపింది. విష్ణు కెమికల్స్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా 57 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. ఆటోమొబైల్, ఫార్మా, ఉక్కు తదితర పరిశ్రమలకు ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. -
ఫ్లోర్ క్లీనర్లు, ఫ్రెష్నర్లతో ప్రమాదం.. డేంజర్ అని తెలిసినా ఎడాపెడా వాడకం
దోమల్ని తరిమేసేందుకు కాయిల్ లేదా రీఫిల్.. గచ్చును శుభ్రం చేసేందుకు ఫ్లోర్ క్లీనర్.. గ్యాస్ స్టవ్‌పై మరకల్ని తుడిచేందుకు క్రీమ్.. బాత్రూమ్ను శుభ్రం చేసేందుకు ఓ ద్రవం.. టాయిలెట్‌ను శుద్ధి చేసేందుకు మరో రసాయనం.. సువాసన వెదజల్లేందుకు రూమ్ ఫ్రెష్నర్స్.. ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి ఇంట్లో డజనుకు పైగా రసాయన ఉత్పత్తులు వినియోగించడం పరి పాటిగా మారిపోయింది. ఇవే ప్రజల పాలిటి శాపంగా మారుతున్నాయి. ఇలాంటి వాటిని వినియోగించడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. సాక్షి, అమరావతి: ఇంట్లో పరిశుభ్రత.. సువాసన కోసం వాడే వాణిజ్య ఉత్పత్తుల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. వీటి వాడకం వల్ల వయసుతో సంబంధం లేకుండా ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నట్టు వెల్లడైంది. ఆయా ప్యాకెట్లు, డబ్బాలపై ‘ఇది విషం. ఇంట్లో పిల్లలకు దూరంగా ఉంచాలి’ అని.. దీనిని ‘మండే గుణం ఉంది’ అని జాగ్రత్తలు రాసి ఉన్నా.. వాటిని పట్టించుకునేవారు 10% కూడా ఉండటం లేదు. సామాజిక మాధ్యమాల్లో సినీ తారలతో సైతం ఆయా కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. అందుకే విదేశాల్లో నిషేధం విధించిన వాణిజ్య ఉత్పత్తులు సైతం మనదేశంలో విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి. ఇంటి పరిశుభ్రత కోసం, సువాసన కోసం వాడే వాణిజ్య ఉత్పత్తుల వినియోగం పరిమితి దాటుతోందని, వీటివల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యం బారినపడుతున్నారని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) హెచ్చరిస్తోంది. పట్టణాల్లో మరీ ఎక్కువ మనదేశంలో అతి శుభ్రత, ఇంట్లో కొత్త అలవాట్లను ప్రవేశ పెట్టడంలో పట్టణ ప్రజలే ముందున్నారని సీఎస్ఈ పేర్కొంది. కొన్నేళ్లుగా తడి, పొడి చెత్తతోపాటు ఈ వేస్ట్‌పై ప్రజల్లో కల్పిస్తున్న అవగాహనతో చాలావరకు మార్పు వచ్చినా.. ఇంటి శుభ్రత కోసం ప్రమాదకర రసాయనాల వాడటం మాత్రం పెరుగుతున్నట్టు గుర్తించింది. ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా అందుతున్న చెత్తలో నెలకు సగటున ఒక్కో ఇంటి నుంచి 5 కేజీలకు పైగా వాడేసిన ఫ్లోర్ క్లీనర్లు, యాసిడ్ బాటిళ్లు, రూమ్ ఫ్రెష్నర్స్, మస్కిటో రీఫిల్స్, పెయింట్లు, వార్నిష్ డబ్బాలు, గడువు ముగిసిన మందులు వంటివి వస్తున్నట్టు గుర్తించారు. ప్రమాదకరమైన గృహ వ్యర్థాలలో పారేసిన పెయింట్ డబ్బాలు, పురుగు మందుల డబ్బాలు, సీఎఫ్ఎల్ బల్బులు, ట్యూబ్‌లైట్లు, విరిగిన పాదరసం థర్మామీటర్లు, సిరంజీలు పట్టణ గృహాల నుంచి సేకరించే చెత్తలో అధికంగా వస్తున్నట్టు గుర్తించారు. ఇవన్నీ పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాన్ని వేగంగా దెబ్బతీసేవే. మనదేశంలో పెస్ట్ కంట్రోల్ సెంటర్లకు వస్తున్న కాల్స్ సైతం ఏటా పెరుగుతున్నాయని, 2012లో రోజుకు 7.6 కాల్స్ వస్తే.. 2022లో 23కు చేరినట్టు సీఎస్ఈ గుర్తించింది. బొద్దింకలు, బల్లులు, చెద పురుగులు వంటి వాటి నిర్మూలన కోసం అత్యంత విషపూరితమైన రసాయనాలను ఇంట్లో వాడుతున్నట్టు తేలింది. సంప్రదాయ విధానాలే మేలు అమెరికాలో సగటున ప్రతి కుటుంబం వాడే క్లీనర్స్‌లో 3 నుంచి 11 నుంచి 38 లీటర్ల విష పదార్థాలు ఉన్నట్టు యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకటించింది. ఇవి గాలిలో కలిసినప్పుడు ప్రమాదకర అవశేషాలను విడుదల చేస్తాయని పేర్కొంది. ఆ సంస్థ దాదాపు 2 వేలకు పైగా శుభ్రపరిచే ఉత్పత్తులను పరిశీలించగా, వాటిలో 10 శాతం పైగా విషపూరితమైనవిగా గుర్తించింది. అత్యంత ప్రమాదకరమైన ఉత్పత్తులను ప్రభుత్వం రద్దు చేయగా.. మిగిలిన వాటిపై ‘హెచ్చరిక, జాగ్రత్త, ప్రమాదం, విషం’ అన్న పదాలను పెద్దగా ముద్రించేలా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. మన దేశంలోనూ ఇలాంటి ఉత్పత్తులే ఉన్నాయని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా సహజ మార్గాలను అనుసరించాలని సీఎస్ఈ విజ్ఞప్తి చేస్తోంది. డ్రెయిన్ శుభ్రం చేసేందుకు ప్లంగర్ లేదా ప్లంబర్ స్నేక్, అద్దాల శుభ్రతకు వెనిగర్ లేదా నిమ్మరసం వంటివి వాడాలని సూచిస్తోంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం వంటగది, బాత్రూమ్, హాల్, పడక గదుల్లో సగటున ఒక్కో ఇంటిలో 8 కేజీల వరకు ప్రమాదకర రసాయనాలు, పౌడర్లు వినియోగిస్తున్నారు. డ్రెయిన్ క్లీనర్లు, ఓవెన్ శుభ్రం చేసుకునేవి, ఫ్లోర్ క్లీనర్లు వంటి వాటిలోని రసాయనాలు ఇంట్లోని వారిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నట్టు సీఎస్ఈ గుర్తించింది. పెద్దవారు వాడే డియోడరెంట్లు, బాడీ స్ప్రేలతో ఇంట్లోని పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోంది. వీటి వినియోగం వల్ల వెంటనే చర్మం, కళ్లు మండటంతో పాటు దీర్ఘకాలంలో పిల్లల్లో ఆస్తమా వంటి రోగాలు కనిపిస్తున్నట్టు యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఈపీఏ) ప్రకటించింది. పిల్లల్లో కనిపిస్తున్న ఊపిరి సంబంధింత సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నవారు గతంలో రెండు మూడు శాతం ఉండగా.. అది 10.4 శాతానికి పెరిగినట్టు తేలింది. -
గంగాధర మిస్టరీ మరణాల్లో కొత్తకోణం.. మమత శరీరంలో ఆర్సెనిక్!
సాక్షి, కరీంనగర్: సంచలనం సృష్టించిన కరీంనగర్ జిల్లాలోని గంగాధర మిస్టరీ కేసు మరో మలుపు తిరగనుంది. పోలీసులు అనుమానిస్తున్నట్లు ఇంటి పెద్ద వేముల శ్రీకాంత్ తన భార్యాపిల్లలపై విషప్రయోగం చేశాడని నిర్ధారణ అయితే.. పిల్లల మృతదేహాలకూ పోస్టుమార్టం తప్పేలా లేదు. డిసెంబరు 30న అర్ధరాత్రి వేముల శ్రీకాంత్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇదే విషయాన్ని చికిత్స సమయంలో వైద్యులకు చెప్పాడు. ఈ పరిణామంతో పోలీసుల దర్యాప్తు అకస్మాత్తుగా శ్రీకాంత్ వైపు తిరిగింది. శ్రీకాంత్ బయోటెక్నాలజీలో పీజీ చేయడం.. ఫుడ్ సైన్స్ లెక్చరర్ కావడం.. రోజూ ప్రయోగాల కోసం ల్యాబ్‌లో రసాయనాలు వినియోగించడం.. వెరసీ అతనికి కెమికల్స్‌పై పూర్తిస్థాయి అవగాహన ఉందని పోలీసులు నిర్ధా రణకు వచ్చారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల తరహాలోనే తానూ రక్తపువాంతులు, విరోచనాలు చేసుకుని మరణించడంతో వారి శరీరంలోనూ సోడియం హైడ్రాక్సైడ్ చేరిందా..? అనే సందేహాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఫోరెన్సిక్ అధికారులు మమత శరీరంలో ఆర్సెనిక్ ఆనవాళ్లు ఉన్నాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు వారు మరింత లోతుగా రసాయన విశ్లేషణ జరుపుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై ఎఫ్ఎస్ఎల్ తుది నివేదిక పంపితే.. మమత మరణానికి స్పష్టమైన కారణం తెలియనుంది. 45 రోజుల్లో నలుగురు ఈ ఘటనల్లో తొలుత శ్రీకాంత్ కొడుకు అద్వైత్ (20నెలలు)వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురై నవంబరు 16న కన్నుమూశాడు. అవే లక్షణాలతో కూతురు అమూల్య (6) డిసెంబర్ ఒకటిన ప్రాణాలు విడిచింది. ఈ రెండు మరణాలకు వైద్యులు కారణాలు చెప్పలేకపోయారు. అంతుచిక్కని వ్యాధి, కలుషిత తాగునీరు కారణమనుకుని సమీపంలోని బావిలోని తాగునీటిని, బాధితుల బంధువుల రక్తాన్ని పరీక్షించారు. అయినా వారికి ఏమీ చిక్కలేదు. దీంతో మిస్టరీ మరణాలు చేతబడి, మంత్రాల కారణంగా జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. శ్రీకాంత్ భార్య మమత (26) కూడా అనారోగ్యానికి గురై డిసెంబరు 18న మరణించింది. డిసెంబరు 30న శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. 45 రోజుల వ్యవధిలో మొత్తం కుటుంబం అనుమానాస్పద స్థితిలో తుడిచిపెట్టుకుపోయింది. మమత శరీరంలో ఆర్సెనిక్..! మరి పిల్లల్లో..? పోలీసుల వినతి మేరకు మమత పోస్టుమార్టం సమయంలో వైద్యులు విస్రా (శరీరంలోని కీలక అంతర్భాగాలు)ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మమత శరీర భాగాల్లో ఆర్సెనిక్ ఆనవాళ్లను గుర్తించారు. దీన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఆమె శరీరంలోకి ఎలా చేరింది..? పిల్లల మరణాలకు కారణం ఆర్సెనికా..? లేదా సోడియం హైడ్రాక్సైడా..? అనే విషయాన్ని పోలీసులు ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. పిల్లలిద్దరూ అనారోగ్య లక్షణాలతో మరణించారని వారికి పోస్టుమార్టం నిర్వహించలేదు. ఇపుడు వారి మరణంపై అనేక సందేహాలు వెలుగులోకి రావడంతో వారి శవాలకు పోస్టుమార్టం తప్పనిసరి కానుంది. అందుకే పిల్లల శరీర భాగాల నుంచి విస్రా (అంతర్భాగాల నుంచి నమూనాలు)ను తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: వాడు నీ కొడుకే.. కిడ్నాప్ కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్! రెండు నెలల అనంతరం.. నవంబరు 16న 20 నెలల అద్వైత్ అనుమానాస్పదంగా మరణించాడు. అతడిని గంగాధర శివారులోని వంతెన సమీపంలో ఖననం చేశారు. డిసెంబరు ఒకటిన అమూల్య (6) కూడా కన్నుమూసింది. దీంతో తమ్ముడి సమాధి పక్కనే అక్కనూ ఖననం చేశారు. వీరిలో అద్వైత్ మరణించి 50 రోజులు, అమూల్య చనిపోయి 35 రోజులు దాటింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రావడానికి వారం పట్టవచ్చని పోలీసులు అంటున్నారు. ఒకవేళ మమత శరీరంలో విష ఆనవాళ్లు ఉంటే పిల్లల మరణాలకు కారణం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే నిజమైతే.. పిల్లలు మరణించిన దాదాపు రెండు నెలల అనంతరం పోస్టుమార్టం చేయాల్సి వస్తుందని పలువురు సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
సేఫెక్స్ కెమికల్స్ పెట్టుబడుల బాట
న్యూఢిల్లీ: ఆగ్రోకెమికల్స్ తయారీ కంపెనీ సేఫెక్స్ కెమికల్స్ పెట్టుబడుల బాట పట్టింది. రానున్న మూడు, నాలుగేళ్లలో రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలున్నట్లు వెల్లడించింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అగ్రిటెక్ సంస్థ అగ్కేర్ టెక్నాలజీస్‌లో తాజా పెట్టుబడులు వెచ్చించనున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా ఇంటరాక్టివ్ టెక్ ప్లాట్‌ఫామ్‌కు తెరతీయడంతోపాటు.. తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఇందుకు నిధులను అంతర్గత వనరుల నుంచి సమీకరించనున్నట్లు గ్రూప్ డైరెక్టర్ పియూష్ జిందాల్ తెలిపారు. నిధుల సమీకరణను చేపట్టే యోచన లేదని స్పష్టం చేశారు. ప్రధానంగా రైతుల కు ఉపయుక్తమయ్యేలా వాతావరణ సమాచారం, నిపుణుల సలహాలు, మండి రేట్లు తదితరాలను టెక్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందించనున్నట్లు వివరించారు. తయారీ యూనిట్ ద్వారా భారీ డిమాండుగల పశువుల దాణా తదితర ప్రొడక్టులతోపాటు ఇతర సొల్యూషన్లు రూపొందించనున్నట్లు తెలిపారు. -
నిజామాబాద్ నగరంలో భారీ పేలుడు!
ఖలీల్‌వాడి: నిజామాబాద్ నగరం రెండో పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దబజార్లో శనివారం రాత్రి 10.30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా పేలుడుతో అక్కడి శివసాయి వైన్స్, ఫ్యాషన్ స్టోర్, లక్ష్మీనర్సింహస్వామి జనరల్ స్టోర్లకు సంబంధించిన షెడ్లు ధ్వంసమయ్యాయి. చెత్త ఏరుకునే వ్యక్తి కెమికల్ పదార్థాలను తీసుకురావడంతో పేలుడు సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. కెమికల్ పదార్థాలు ఉన్న బాక్సును ఊపడంతో పేలుడు జరిగిందని వెల్లడించారు. స్థానికులు పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ పేలుడులో చేతికి తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని జీజీహెచ్‌కు తరలించినట్లు రెండో టౌన్ ఎస్సై పూర్ణేశ్వర్ తెలిపారు. ఇది బాంబు పేలుళ్లా.. లేక రసాయినిక చర్య కారణంగా జరిగిన పేలుడా అనేది దర్యాప్తులో తేలనుందని చెప్పారు. Telangana| 1 person injured in a blast in Bada Bazar area,Nizamabad We received info about a blast.The injured in the incident told that the blast happened when he shook a box of chemicals. Fire brigade was called.Injured was taken to hospital,he is fine now:SHO One Town(10.12) pic.twitter.com/HVY9K1n51E — ANI (@ANI) December 11, 2022 ఇదీ చదవండి: అమ్మో పులి...! జిల్లాలో మళ్లీ చిరుతల అలజడి -
పురుషులకే క్యాన్సర్ ముప్పు అధికం.. ఈ పరీక్షలు తప్పనిసరి.. లక్షణాలేంటంటే?
యువతలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలలో స్నేహితులు, సరదాలు, ఎక్కువ. ఈ క్రమంలో సరదగా, టైమ్‌పాస్‌గా మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్ వంటి దురలవాట్లు, బయటతిండి తినడం కూడా వాళ్లలోనే ఎక్కువ. బయటి ఆహారం అందంగా కనిపించడానికి వాటిల్లో నూనెలు, ఉప్పుకారాలు ఎక్కువగా వాడటమే కాకుండా కొన్ని ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్, కెమికల్స్, వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఇవి క్యాన్సర్ కారకాలు కావచ్చు. దురలవాట్లు, బయటి తిండి ఎక్కువగా తీసుకోవడం, వృత్తిపరమైన కారణాలు, ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవడం, వాతావరణ కాలుష్యానికి గురవ్వడం, నైట్‌డ్యూటీలు, ఏసీ రూముల్లో నిద్రలేకుండా పనిచేయడం, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం ఇలా కారణాలు ఏమైతేనేం... మొత్తంగా చూస్తే పురుషులు స్త్రీలకంటే క్యాన్సర్‌కు ఎక్కువగా గురవుతారని మనం గమనించగలం. పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్ తప్పితే ఇంక ఏవి తీసుకున్నా స్త్రీలకంటే పురుషుల్లోనే ఎక్కువ. కారణాలు... ఉప్పు కారాలు, పచ్చళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, ఇంకా దురలవాట్లు ఉండటం వంటి అంశాలు పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌కు గురిచేస్తుంటాయి. అందుకే భారతదేశంలోని పురుషులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ల బారిన పడటం ఎక్కువ అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. మన దేశంలోని పురుషులు నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్ క్యాన్సర్లకు గురవడం చాలా ఎక్కువగా గమనిస్తుంటాం. అలవాట్లు, జీవనశైలి, ఆహారం ఆరోగ్యకరంగా లేకపోవడంతో పాటు పురుషుల్లో వారి వృత్తిపరమైన కారణాలూ ఉంటాయి. ఆస్బెస్టాస్ కంపెనీలో పనిచేసేవారు, అల్యూమినియమ్ కంపెనీల్లో పనిచేసేవారు, ఆల్కహాలిక్ బేవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీ, రేడియమ్ ఉత్పత్తులు, రేడియో న్యూక్లైడ్, చెక్కపొడి, గామారేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారికి ఊపిరితిత్తులు – హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్... ఇతర వృత్తుల వారి కంటే ఎక్కువగా వచ్చే ముప్పు ఉంటుంది. ఎండకు ఎక్కువగా తిరగడం లేదా ఎండ అస్సలు తగలకుండా ఏసీ రూముల్లో అలా గంటల తరబడి కూర్చుని పనిచేయడం, నైట్‌డ్యూటీలు, పెస్టిసైడ్స్, కెమికల్స్‌కు మగవారే ఎక్కువగా గురవుతారు కాబట్టి వారికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. సాధారణంగా పురుషులు... అమ్మ లేదా భార్య ఏవి పెడితే అవి తింటూ ఉంటారు. వారు దగ్గరగా లేనప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు తేలికగా దొరికే జంక్‌ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా ఊబకాయం ముప్పు కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. నిర్ధారణ పరీక్షలు... పురుషుల్లో వయసు పైబడ్డాక సాధారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకోడానికి పీఎస్ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్) అనే రక్తపరీక్షను 50 ఏళ్లు పైబడ్డాక చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు... వీర్యంలో, అలాగే మూత్రంలో రక్తం కనిపించడం, నడుము, తుంటి, పక్కటెముకల నొప్పులు, మూత్రసంబంధ సమస్యల వంటి లక్షణాలతో కనిపించేసరికి... దశ ముదిరిపోయి ఎముకలకు కూడా పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పీఎస్ఏ పరీక్షలో యాంటిజెన్ పెరగడాన్ని గమనిస్తే ఇతర పరీక్షలు, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్ఈ), ప్రోస్టేట్ బయాప్సీతో పాటు అవసరమైతే అల్ట్రాసౌండ్, బోన్‌స్కాన్, సీటీ స్కాన్, ఎమ్మారై, బయాప్సీ వంటి పరీక్షలు చేస్తారు. యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో లక్షణాలు ఉన్నా లేకున్నా పీఎస్ఏ, డీఆర్ఈ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా మేరకు ఎంతకాలం తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకుంటే మంచిదో తెలుసుకోవాలి. పీఎస్ఏ పరీక్షల్లో మార్పులు ఎలా ఉంటున్నాయి, ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలనే విషయాల మీద అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరి. పురుషుల్లో ఈ కింది లక్షణాలను నిర్లక్ష్యం చేయడం తగదు. 1. తగ్గని దగ్గు; ఆ దగ్గుతో పాటు రక్తం పడటం. 2. ఆకలి తగ్గడం, బరువు తగ్గడం 3. అంతుపట్టని జ్వరం, స్పష్టమైన కారణం లేకుండా ఆకస్మికంగా బరువు తగ్గడం 4. మూత్రం ఆగి ఆగి రావడం, రక్తం కనిపించడం 5. మలవిసర్జనలో రక్తస్రావం 6. తీవ్రమైన అజీర్తి 7. గొంతునొప్పి, ఘనపదార్థాలు తీసుకోలేకపోవడం 8. నోటిలో మానని పుండ్లు 9. ఎముకల్లో నొప్పులు. పై లక్షణాలను ఇన్ఫెక్షన్స్ అనీ, పైల్స్ అనీ, రోగనిరోధక శక్తి తగ్గిందనీ, స్మోకింగ్ వల్ల కొద్దిగా దగ్గు వస్తూ ఉండటం మామూలేనంటూ నిర్లక్ష్యం చేయడం జరుగుతుంటుంది. కానీ వయసు కాస్త పైబడి, దురలవాట్లు ఉండి, లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పురుషుల్లో ఎక్కువగా కనిపించే నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్, ప్రోస్టేట్ క్యాన్సర్లకు సంబంధించిన హెచ్చరికలు కావచ్చు. కాబట్టి ఆ మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, క్యాన్సర్లపై అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. -
మీరు తింటున్న చికెన్ బిర్యానీలో ఏముందో తెలుసా?.. భయంకర వాస్తవాలు
సాక్షిప్రతినిధి, కర్నూలు: మనం తింటున్న బిర్యానీలో మెటానియల్ ఎల్టో, టార్ట్రాజిన్ అనే రసాయనాలు కలుపుతున్నారు. దీంతో పాటు టేస్టింగ్‌సాల్ట్ (చైనాఉప్పు) తప్పనిసరి. వీటి వినియోగంతో బిర్యానీలో మంచి రుచి, రంగు వస్తోంది. కానీ వరుసగా 40 రోజులు తింటే కీళ్లనొప్పులు, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ►రెస్టారెంట్లకు వెళ్లినా, డిన్నర్లకు వెళ్లినా ఐస్‌క్రీం తినడం తప్పనిసరి. చివరకు ఫ్యామిలీ ప్యాక్‌లను ఇళ్లలో ఫ్రిజ్‌లలో ఉంచి తింటున్నారు. వీటిలో కొవ్వుశాతం మరీ తక్కువగా ఉన్న పాలను వినియోగించడంతో పాటు టార్ట్రాజిన్, రంగులు కలుపుతారు. ఐస్‌క్రీం గడ్డకట్టేందుకు రసాయనాలు వినియోగిస్తారు. పిల్లలకు ఎంతో ప్రేమతో వీటిని తినిపిస్తుంటాం. ఇవి ప్రాణాంతక వ్యాధులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ►దీర్ఘకాలం బేకరీలలో సిల్వర్ పూతతో ఉండే స్వీట్లు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సిల్వర్ పూతలో సీసం ఎక్కువగా ఉంటుంది. స్వీట్లలో వాడే సన్‌సెటన్, కాట్రాజ్, బ్రిలియంట్ ఎల్లో, టార్ఫిజిన్ కూడా హానికరమే. ►ఆపిల్ ఎక్కువ కాలం నాణ్యంగా ఉండేందుకు కంటికి కనిపించని మైనపుపూత పూస్తారు. అలాగే పురుగుమందులు పిచికారీ చేస్తారు. శుభ్రం చేయకుండా తింటే వీటితో కూడా ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం ►రోడ్డు సైడ్ తయారు చేసే పానీపూరి, గోబీతో పాటు అన్ని రకాల వంటల్లో టేస్టింగ్‌సాల్ట్, ఇతర రసాయనాలు కలుపుతున్నారు. రుచికోసం, మంచి రంగు కోసం, ఎక్కువ కాలం నిల్వ కోసం ఇలాంటి వాటిని వాడుతున్నారు. ఈ ఆహార పదార్థాలు తిన్న వారు ప్రమాదకర జబ్బుల బారిన పడుతున్నారు. ►ఆహార పదార్థాల అమ్మకం, వినియోగం జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆహార భద్రతా వ్యవస్థ వైఫల్యంతో కల్తీలకు అడ్డుపడటం లేదు. ఉమ్మడి జిల్లాలో 2018–19లో ఫుడ్‌సేప్టీ’(ఆహార భద్రత) అధికారులు 374 శాంపిల్స్ సేకరించి, 54 నాణ్యతలేనివిగా తేల్చారు. అలాగే 36 శాంపిల్స్ ఆరోగ్యానికి తీవ్ర హానికరమైనవిగా తేల్చి కేసులు నమోదు చేశారు. 2020–21లో 175 శాంపిల్స్ సేకరిస్తే ఐదు నాణ్యత లేనివని, ఎనిమిది నకిలీవని, ఒకటి హానికరమని తేల్చారు. 2021–22లో 313 శాంపిల్స్ తీస్తే ఇందులో ఐదు నాణ్యత లేనివి, రెండు ప్రమాదకరమైనవి, నాలుగు నకిలీవి ఉన్నట్లు నిర్ధారించారు. ఉమ్మడి జిల్లాలో చిన్నా పెద్దా హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు, చాట్, నుడుల్స్ షాపులు అన్ని కలుపుకుని ఆరు వేలకు పైగా ఉన్నాయి. కర్నూలు నగరంలోనే 1500 దాకా ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఆహారానికి సంబంధించిన అన్ని వ్యాపారాలకు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ లైసెన్స్ మంజూరు చేయాలి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న చిన్న, మధ్యతరగతి హోటళ్లలో 20 శాతానికి మించి అనుమతులు లేవు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఫుడ్‌సేప్టీ అధికారుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో తనిఖీలు, కేసుల నమోదుకు ఇబ్బందిగా మారింది. కేసులు నమోదు చేస్తే చార్జ్‌షీటు నుంచి కోర్టు కేసుల వరకూ తిరిగేందుకు కూడా సిబ్బంది లేరు. దీంతో కేసుల నమోదుకు ఈ శాఖ కూడా ఆసక్తి చూపడటం లేదు. నిబంధనల మేరకు ఏడాదికి నిర్వహించాల్సిన మేరకు శాంపిల్స్ తీసి మ.మ. అనిపిస్తున్నారు. రోజుల తరబడి నిల్వ.. ఫుడ్‌సేప్టీ అధికారులు పలు మండీల్లోని పండ్లు ల్యాబ్‌కు పంపారు. ఇందులో 13 శాంపిల్స్ ప్రమాదరకంగా తేల్చారు. ఇందులో ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, సపోటతో పాటు పలు రకాల పండ్లు ఉన్నాయి. పండ్లు మాగేందుకు వాడే రసాయనాలతో క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. అలాగే కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్, మటన్, రొయ్యలు, చేపలతో పాటు పలు రకాల పదార్థాలు రోజుల తరబడి నిల్వ ఉంటాయి. వాటికి కలర్‌కోటింగ్ ఇచ్చి రుచి కోసం రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారు. బేకరీల్లో స్వీట్లు, కేక్‌లకు వాడే రంగులు, వాటిపై వాడే వెండిపూత అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. కొన్ని స్వీట్లు నోట్లో పెట్టుకోగానే వాసన వస్తుంది. కొన్ని రసాయనాలను ప్రభుత్వం నిషేధించినా రెండు జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. గాలి, వెలుతురు ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. కానీ చాలాచోట్ల, ముఖ్యంగా డాబాల్లో, బార్లలో చీకట్లో ఆహారాన్ని వడ్డిస్తున్నారు. దీంతో ఆహారం ఎలా ఉందో, అందులో ఏ రంగు కలిపారో తెలియని పరిస్థితి. పురుగుమందుల కోటాలో టేస్టింగ్ సాల్ట్ దిగుమతి టేస్టింగ్‌సాల్ట్ చైనా నుంచి ఫరి్టలైజర్స్ పేరుమీద దిగుమతి అవుతోంది. ఆహార విషెస్ సూచికలో ఇది లేదు. చైనాలో ఇది వంటల్లో వాడితే ఉరిశిక్ష విధించేలా అక్కడి శిక్షలు ఉన్నాయి. దీన్ని తరచుగా తింటే బీపీ, షుగర్ చిన్నవయస్సులోనే వచ్చే ప్రమాదముంది. తరచూ వాడితే మన నాలుక కొన్ని రుచులను గుర్తించే గుణాన్ని కోల్పోతుంది. పాస్ట్‌ఫుడ్, రెస్టారెంట్లలో టేస్టింగ్‌సాల్ట్ లేకుండా ఏ వంటకం తయారవడం లేదు. ఆరోగ్యానికి హాని ఇలా.. ♦మెటానియల్ ఎల్లో వాడకం నిషేధం. కానీ వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై వెంటనే దు్రష్పభావం చూపించదు. నెమ్మదిగా క్యాన్సర్‌కు కారకమవుతుంది. చిన్నారుల్లో నిద్రలేమి, నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి. ♦వంటకాల్లో రంగుకోసం వాడే నిషేధిత టార్ట్రాజిన్ చాలా ప్రమాదకరం. దీనితో థైరాయిడ్ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, తామర వచ్చే సూచనలు ఉన్నాయి. ♦స్వీట్లు, బిస్కెట్లలో ఆరెంజ్ రంగు కోసం వాడే సన్‌సెటన్, పసుపు రంగు కోసం వాడే కాట్రాజ్, గ్రీన్ కలర్ కోసం వాడే బ్రిలియంట్ బ్లూ, టారా్టజిన్లు ప్రమాదకరం. ♦చాక్లెట్లలో వాడే రోడ్మన్–బి కూడా ప్రాణాంతకమే. ♦ఆహార కల్తీ వల్లనే 53 శాతం మందికి క్యాన్సర్ వస్తున్నట్లు పలు సంస్థల సర్వేల్లో తేలింది. విదేశాల్లో చర్యలు ఇలా... ♦కెనడా, ఐర్లాండ్, స్వీడన్ వంటి దేశాల్లో ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఆ దేశాలను అత్యుత్తమ ఆహార నాణ్యత కలిగిన దేశాలుగా పేర్కొన్నాయి. ♦కెనడాలో విక్రయించే అన్ని ఆహారపదార్థాలను తప్పనిసరిగా తనిఖీ చేయాల్సిందే. వ్యవసాయం, ఇతర ఆహారపదార్థాల కోసం అక్కడ ప్రత్యేకశాఖలు, విభాగాలున్నాయి. ♦వ్యవసాయ ఉత్పత్తులపై నిఘాకు, పునఃశుద్ధికి ‘వ్యవసాయ ఆహార కెనడా’ అనే సంస్థతో అక్కడి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కెనడియన్ ఫుడ్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ(సీఎఫ్ఐఏ) ఆ«దీనంలో పనిచేస్తోంది. ఈ సంస్థ పౌరుడికి చేరే ప్రతి ఆహారపదార్థాన్ని తప్పకుండా పరిశీలించిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు అనుమతి ఇస్తుంది. కోడిగుడ్లను సైతం పునఃశుద్ధి ప్రక్రియ చేయకుండా అనుమతి ఇవ్వదు. రుచికోసం రసాయనాలను ఏమాత్రం అనుమతించవద్దు. సహజ రుచుల్లోనే వండివడ్డించాలనేది అక్కడి నియమం. ఇలాంటి నిబంధనలను ఇక్కడ కూడా కఠినంగా అమలు చేస్తేనే కల్తీని అరికట్టవచ్చు. చదవండి: బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు? -
లాజిస్టిక్స్‌కు సానుకూలం..
ముంబై: లాజిస్టిక్స్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం మేర వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. అయితే చమురు, కమోడిటీల ధరలు పెరుగుతున్న దృష్ట్యా ఈ రంగంలోని కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని పేర్కొంది. లాజిస్టిక్స్ రంగంపై ఒక నివేదికను ఇక్రా గురువారం విడుదల చేసింది. 2021–22లో ఈ రంగంలో వృద్ధి కరోనా ముందు నాటితో పోలిస్తే 14–17 శాతం అధికంగా ఉంటుందని తెలిపింది. మధ్య కాలానికి ఆదాయంలో వృద్ధి అన్నది ఈ కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ నుంచి వస్తుందని పేర్కొంది. జీఎస్టీ, ఈవేబిల్లు అమలు తర్వాత లాజిస్టిక్స్ సేవల్లో సంస్థాగత వాటా పెరుగుతున్నట్టు వివరించింది. బహుళ సేవలను ఆఫర్ చేస్తుండడం కూడా ఆదరణ పెరగడానికి కారణంగా పేర్కొంది. పైగా ఈ రంగంలోని చిన్న సంస్థలతో పోలిస్తే పెద్ద సంస్థలకు ఉన్న ఆర్థిక సౌలభ్యం దృష్ట్యా, వాటికి ఆదరణ పెరుగుతోందని.. ఈ రంగంలో రానున్న రోజుల్లో మరింత వ్యాపారం సంస్థాగతం వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. క్రమంగా పెరుగుతున్న డిమాండ్ కొన్ని నెలలుగా రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నట్టు ఇక్రా తెలిపింది. పలు రంగాల్లో డిమాండ్ పుంజుకోవడం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. కరోనా మూడో విడత వేగంగా సమసిపోవడంతో ఆంక్షలను ఎత్తేయడం కలిసి వచ్చినట్టు వివరించింది. కమోడిటీల ధరలు పెరిగిపోవడం, రవాణా చార్జీలన్నవి స్వల్పకాలంలో సమస్యలుగా ప్రస్తావించింది. వినియోగ డిమాండ్‌పై మార్జిన్లు ఆధారపడి ఉంటాయని అంచనా వేసింది. ‘‘త్రైమాసికం వారీగా లాజిస్టిక్స్ రంగం ఆదాయం 2021–22 రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి వెళ్లింది. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం కలిసొచ్చింది’’అని ఇక్రా తన నివేదికలో తెలిపింది. 2022 జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈవే బిల్లుల పరిమాణం, ఫాస్టాగ్ వసూళ్లలో స్థిరత్వం ఉన్నట్టు ఇక్రా నివేదిక వివరించింది. -
బరితెగిస్తున్న కల్తీగాళ్లు
కీసర: నాసిరకం అల్లం, వెల్లుల్లి తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. కీసర ఇన్స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఈస్ట్గాంధీనగర్లో ఓ ఇంటిలో నాసిరకం అల్ల,వెలుల్లి తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు సోమవారం సాయంత్రం ఆ ఇంటిపై దాడి చేశారు. తనకు అన్నిరకాల అనుమతులు ఉన్నట్లు పట్టుబడిన వ్యక్తి చెప్పడంతో పోలీసులు సమగ్ర విచారణ జరిపారు. కూషాయిగూడ చక్రీపురానికి చెందిన కొత్తపల్లి భానుప్రసాద్(58) కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకొని కొన్నిరోజులుగా అదనపు లాభం కోసం నాసిరకం అల్లం, వెల్లుల్లి తయారు చేస్తున్నాడు. ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా పౌల్ట్రీమీల్, అజాంటాక్స్టైటానియం డయాక్సైడ్యాంటాస్ట్ రసాయనాలు కలిపారని తెలిపారు. జాడులు, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 4044 కిలోల అల్లం, వెల్లుల్లి పేస్టు.. రసాయనాలు అజాంటాక్స్ 40 కిలోలు, పౌల్ట్రీమీల్ 30 కిలోలు, ఎసిటిక్ యాసిడ్ 20లీటర్లు, సిట్రిక్ యాసిడ్ 20 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చైనా కంపెనీలకు భారత్ షాక్! యాంటీ డంపింగ్ సుంకాలు
న్యూఢిల్లీ: కొన్ని రకాల అల్యుమినియం ఉత్పత్తులు, రసాయనాలు సహా చైనా నుంచి దిగుమతయ్యే అయిదు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం యాంటీడంపింగ్ సుంకం విధించింది. అయిదేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. పొరుగు దేశం నుంచి చౌక ఉత్పత్తులు వెల్లువెత్తడం వల్ల దేశీ తయారీదారులు దెబ్బతినకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిర్దిష్ట ఫ్లాట్ రోల్డ్ అల్యుమినియం ఉత్పత్తులు, సోడియం హైడ్రో సల్ఫైట్ (అద్దకం పరిశ్రమలో ఉపయోగించేది), సిలికాన్ సీలెంట్ (సోలార్ ఫోటోవోల్టెయిక్ మాడ్యూల్స్ తయారీలో ఉపయోగపడేది), హైడ్రోఫ్లూరోకార్బన్ కాంపోనెంట్ ఆర్–32 .. హైడ్రోఫ్లూరోకార్బన్ బ్లెండ్స్ (రెండింటిని రిఫ్రిజిరేషన్ పరిశ్రమలో వాడతారు) వీటిలో ఉన్నాయి. వాణిజ్య శాఖలో భాగమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) నిర్వహించిన దర్యాప్తులో ఈ ఉత్పత్తులను భారత మార్కెట్లో సాధారణ తయారీ రేటు కన్నా చాలా తక్కువకు చైనా ఎగుమతి చేస్తున్నట్లు తేలింది. ఇలా భారీ స్థాయిలో వచ్చి పడుతున్న దిగుమతుల వల్ల (డంపింగ్) దేశీ పరిశ్రమ నష్టపోతోందని వెల్లడైంది. దీంతో డీజీటీఆర్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం సుంకాలు విధించింది. మరోవైపు, ఇరాన్, ఒమన్ తదితర దేశాల నుంచి కాల్సైన్డ్ జిప్సం పౌడరుపైనా యాంటీ డంపింగ్ సుంకం విధించింది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో చైనాకు భారత్ నుంచి ఎగుమతులు కేవలం 12.26 బిలియన్ డాలర్లుగా ఉండగా.. దిగుమతులు ఏకంగా 42.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
పటాన్చెరులో ఘరానా మోసం... మూడు తులాల బంగారం తీసుకొని
సాక్షి, పటాన్చెరు(మెదక్): బంగారం, వెండి ఆభరణాలను శుభ్రం చేస్తామని వచ్చి మోసం చేసేందుకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన పటాన్చెరు పట్టణంలోని లక్కదొడ్డి కాలనీలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన ఆనంద్‌కుమార్ సాహా, రాజ్‌కుమార్ సాహాలు లక్కదొడ్డి కాలనీకి వచ్చారు. సుకన్య అనే మహిళకు మాయమాటలు చెప్పి నల్లగా ఉన్న పుస్తెలతాడును శుభ్రం చేస్తామని చెప్పి తీసుకున్నారు. వారి వెంట తెచ్చుకున్న కొన్ని రసాయనాలల్లో పుస్తెలతాడును ముంచి తీశారు. అంతే మూడు తులాలు ఉన్న పుస్తెలతాడు రెండు తులాలు కరిగిపోయి తెగిపోయింది. దీంతో అనుమానం వచ్చిన సుకన్య నిలదీసేలోపే ఒక నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించారు. గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు క్రైం సీఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. పట్టుబడిన ఇద్దరు బీహార్‌కు చెందిన వారని, మహారాష్ట్ర సోలాపూర్‌కు రాత్రి వచ్చి ఉదయం పటాన్చెరు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. -
రసాయనాలతో టీ పొడి
సూర్యాపేట క్రైం: అంతర్రాష్ట్ర కల్తీ టీ పొడి తయారీ ముఠా గుట్టును సూర్యాపేట పోలీసులు రట్టుచేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు సూత్రధారులతోపాటు మరో 12మంది చిరువ్యాపారులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 22.5లక్షల విలువ గల 45.5 క్వింటాళ్ల నకిలీ టీ పొడితోపాటు రెండు కార్లు, తూకం యంత్రాలు, 50 కేజీల ప్రాణాంతక రసాయన రంగుపొడి (టాట్రాజైన్), గ్యాస్ సిలిండర్, 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ కేసు వివరాలను వెల్లడించారు. సూర్యాపేటలో రసాయనాలతో తయారుచేసిన కల్తీ టీ పొడి విక్రయాలు జరుగుతున్నట్లు కొద్ది రోజుల క్రితం పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టి తొలుత పట్టణంలో టీపొడి అమ్ము తున్న రాచకొండ అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్వారా చిరువ్యాపారులు పోకల రమేష్, బూర్ల వినయ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన సర్వేమా శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. రాజమండ్రికి చెందిన కృష్ణ చైతన్య, జగన్నాథం వెంకట్‌రెడ్డి, రావులపాలెం గ్రామానికి చెందిన సర్వేమా శ్రీనివాస్, విజయవా డకు చెందిన కామేశ్వర్రావులు సూత్రధారు లని విచారణలో వెల్లడైంది. వీరు పదేళ్లుగా ఈ వ్యవహారం నడుపుతున్నట్లు తెలిసింది. మూడు బృందాలుగా ఏర్పడి.. పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి ఏపీలో నకిలీ టీపొడి సూత్రధారుల ఇళ్లపై దాడులు జరిపి నలుగురిని అదుపులోకి తీసుకున్నా రు. మరో 8 మంది పరారీలో ఉన్నారని, త్వ రలో పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. అయితే, సూర్యాపేట జిల్లాకు చెందిన వారు కొన్నేళ్లుగా ముఠాలోని సూత్రధారులతో సంబంధాలు పెట్టుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆ కీలక వ్యక్తులు ఎవరనేది పోలీసులు గోప్యంగా ఉంచడంపై అనుమానాలు కలుగుతున్నాయి. -
ఛత్రీనాక పేలుడు ఘటన: ట్విస్ట్ ఏంటంటే..
హైదరాబాద్: ఛత్రీనాక పీఎస్ పరిధి కందికల్ గేట్ వద్ద గురువారం అర్ధరాత్రి పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు బెంగాల్‌కు చెందిన విష్ణు,జగన్నాథ్‌లుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ పేలుడుకు గల కారణాలను పరిశీలిస్తున్నారు. మృతులు పీవోపీ విగ్రహ తయారీ కార్మికులని పోలీసులు తెలిపారు. అయితే, ఈ పేలుడులో కొత్తకోణం బయటపడింది. యువకులు గుంతలో టపాసులతోపాటు కెమికల్స్‌ను పెట్టి కాల్చడం వల్ల పేలుడు సంభవించిందని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. విగ్రహ తయారీ పరిశ్రమలో బాణాసంచా కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. పేలుడు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని ఏసీపీ మజీద్ తెలిపారు. -
ప్రకృతి సాగులో పరిశోధనలు
సాక్షి, అమరావతి: పురుగు మందులు, రసాయనాలతో సేద్యం కారణంగా ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. పురుగు మందులు, రసాయనాల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి సేద్యంతో ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రాష్ట్రంలో ఉద్యమ రూపంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. సామూహిక ప్రకృతి వ్యవసాయ నిర్వహణ ప్రాజెక్టు (ఏపీ కమ్యూనిటీ మేనేజ్మెంట్ నేచురల్ ఫామింగ్ – ఏపీసీఎన్ఎఫ్) కింద ఇప్పటికే రాష్ట్రంలో 3,730 పంచాయతీల్లో 4.78 లక్షల మంది రైతులు 5.06 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని చేపట్టారు. ప్రకృతి సాగుపై లోతైన పరిశోధనలు, పంటల సర్టిఫికేషన్‌కు వైఎస్సార్ జిల్లా పులివెందులలో అంతర్జాతీయ స్థాయి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తోంది. జర్మనీ ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేస్తోన్న ఈ కేంద్రం కోసం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు సిద్దమవుతోంది. 2031 నాటికి ప్రకృతి సేద్యంలో 60 లక్షల మంది రైతులు రాష్ట్రంలో ప్రకృతి సాగు కోసం జర్మన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక చేయూతనిస్తోంది. 2031 నాటికి కనీసం 60 లక్షల మంది రైతులను ప్రకృతి సేద్యం వైపు మళ్లించడమే లక్ష్యంగా ఏపీసీఎన్ఎఫ్–కేఎఫ్‌డబ్ల్యూ (జర్మన్ బ్యాంకు) ప్రాజెక్టు కింద జర్మన్ ప్రభుత్వం రూ.785.90 కోట్లు (90 మిలియన్ యూరోలు) గ్రాంట్‌తో కూడిన ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 719 పంచాయతీల్లో ఐదేళ్ల (2020–25) పాటు అమలవుతుంది. తాజాగా విస్తృత స్థాయి పరిశోధనల కోసం ఇండో–జర్మన్ గ్లోబల్ సెంటర్ ఫర్ అగ్రోకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ సెంటర్ (ఐజీజీసీఏఆర్‌ఎల్) ఏర్పాటుకు జర్మనీ ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.174 కోట్లు (20 మిలియన్ యూరోలు) గ్రాంట్ ఇస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘ప్రకృతి సాగు’పై పరిశోధనలకు ఏర్పాటవుతోన్న తొలి పరిశోధన కేంద్రం ఇదే. ఈ ప్రతిష్టాత్మక పరిశోధన కేంద్రానికి 60 ఎకరాల భూమితోపాటు భవనాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. అంతర్జాతీయ స్థాయిలో కేఎఫ్‌డబ్ల్యూ, వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీ సెంటర్ (ఐసీఆర్‌ఏఎఫ్), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ), అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (సీఐఆర్ ఏడీ), జీఐజెడ్లు భాగస్వాములవు తుండగా, కేంద్ర వ్యవసాయ శాఖతో పాటు నీతి ఆయోగ్, భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఐసీఏఆర్), రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యవసాయశాఖతో పాటు రైతుసాధికార సంస్థ, వ్యవసాయ వర్సిటీలు భాగస్వాములు కాబోతున్నాయి. పరిశోధన కేంద్రం లక్ష్యాలు.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తూ గ్రామీణ జీవనోపాధిని మెరుగుపర్చడమే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఇక్కడ శాస్త్రీయ పరిశోధనలు జరుగుతాయి. వాటి ఫలితాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేలా వ్యవసాయ శాస్త్ర నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని పెంపొందిస్తారు. రానున్న ఐదేళ్లలో ఏపీతోపాటు దేశంలోని మరో ఐదు రాష్ట్రాల్లో ప్రకృతి సాగును ప్రోత్సహించి, కనీసం 10 వేల మంది రైతులను శాస్త్రవేత్తలుగా మారుస్తారు. వెయ్యిమంది సాంకేతిక నిపుణులను తయారు చేయడం, లక్ష మందిని సర్టిఫైడ్ చాంపియన్ అభ్యాసకులుగా తీర్చిదిద్దడం ఈ కేంద్రం లక్ష్యాలు. పరిశోధనలను ఏప్రిల్‌లో ప్రారంభిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రపంచ దేశాలకు దిక్సూచిలా పరిశోధన కేంద్రం మన రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సేద్యానికి ఆర్థిక చేయూతనిస్తోన్న జర్మనీ ప్రభుత్వం ఇక్కడ అంతర్జాతీయ స్థాయి పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. నవంబర్ నెలాఖరుకల్లా జర్మనీ ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు 2021–27 వరకు ఈ జర్మనీ సహకారమందిస్తుంది. ఇక్కడ జరిగే పరిశోధనలు ప్రకృతి సాగులో దేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా దిక్సూచీగా మారనున్నాయి. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ -
చైనా బొమ్మలతో డేంజర్!
Dangerous Chemicals In China Toys: మేడ్ ఇన్ చైనా బొమ్మలకు అమెరికా చెక్ పోస్ట్ వేసింది. చైనా నుంచి నౌకల్లో చేరిన బొమ్మలను దేశంలోకి రాకుండా అడ్డుకుంది. తాజాగా పోర్ట్‌లోనే సుమారు ఏడు బాక్స్‌ల బొమ్మలను అధికారులు సీజ్ చేయడం విశేషం. ఇందుకు కారణం.. బొమ్మల్లో ప్రమాదకరమైన కెమికల్స్‌ను గుర్తించడం!. చైనా నుంచి వచ్చిన బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాల ఆనవాళ్లను అమెరికా అధికారులు గుర్తించారు. ఈ మేరకు షిప్లో వచ్చిన మేడ్ ఇన్ చైనా బొమ్మల్ని అమెరికా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. భారత్‌లో బాగా ఫేమస్ అయిన లగోరి(స్వీట్, పల్లీ.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు) తరహా చైనా మేడ్ బొమ్మలూ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. జులై 16న చేపట్టిన కన్జూమర్ ప్రొడక్ట్స్ సేఫ్టీ కమిషన్(CPSC), సీబీపీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్న బొమ్మల్ని గుర్తించారు. కొన్ని బొమ్మలకు సీసం, కాడ్మియం, బేరియం పూత పూస్తున్నారని, దానివల్ల పిల్లల ప్రాణాలకు ముప్పుపొంచి ఉందని పేర్కొంటున్నారు వైద్యులు. అంతేకాదు ఆగష్టు 24న చైనా నుంచి షిప్ ద్వారా వచ్చిన కొన్ని బొమ్మల్లోనూ ఈ కెమికల్స్ ఆనవాళ్లను నిర్ధారించారు. ఈ తరుణంలో అక్టోబర్ 4న అమెరికాకు చేరుకున్న చైనా బొమ్మల్ని సీజ్ చేయడం విశేషం. మరోవైపు హాలీడే షాపింగ్ సీజన్ నేపథ్యంలో యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీపీబీ) అప్రమత్తమైంది. అంతేకాదు ఆన్లైన్ షాపింగ్ చేసేప్పుడు పిల్లల బొమ్మల విషయాల్లో జాగ్రత్తగా ఎంచుకోవాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎఫెక్ట్‌తో చైనా బొమ్మల వర్తకంపై భారీ ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. చదవండి: చైనాలో భారీ కార్పొరేట్ పతనం తప్పదా? -
రసాయన గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: దూలపల్లిలోని ఓ రసాయన గోదాంలో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్‌రావు, పేట్‌బషీరాబాద్ సీఐ రమేష్, ప్రత్యక్షసాక్షులు తెలిపిన మేరకు.. నర్పత్రావు అనే వ్యక్తి దూలపల్లి పారిశ్రామికవాడలో ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమల మధ్యలో సాల్వెంట్ గోదాం నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోదాంలో ముగ్గురు కార్మికులు రసాయనాలను మిక్సింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రసాయన చర్య జరిగి ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టాయి. దీంతో గోదాంలో ఉన్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. సుమీర్ అనే కార్మికునికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఐదు ఫైరింజన్లతో వచ్చిన సిబ్బంది నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. గోదాంను నిర్వహిస్తున్న వ్యక్తిపై పేట్‌బషీరాబాద్ సీఐ రమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో మేడ్చల్ జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ సైదులు, జీడిమెట్ల ఫైర్ ఆఫీసర్ సుభాష్‌రెడ్డి, కూకట్పల్లి ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఉండి.. మంటలు అదుపులోకి వచ్చే వరకు పరిస్థితిని పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున రసాయనాలు నిల్వ.. కేవలం 250 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా సదరు యజమాని గోదాంను నిర్వహిస్తున్నాడు. గోదాంలో దాదాపు 200 వరకు డ్రమ్ముల్లో రసాయనాలను నిల్వ ఉంచారు. దీంట్లో ఎక్కువగా మండే స్వభావం కలిగి ఉన్న రసాయనాలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. గోదాంకు ఆనుకుని ఉన్న 3 ఫ్యాబ్రికేషన్ పరిశ్రమలలో ఉన్న కార్మికులు పరుగులు తీయడంతో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకోగలిగారు. ఒక్కో డ్రమ్ము పేలుతూ గాల్లోకి 20 మీటర్ల మేర ఎగిరి కింద పడ్డాయి. ( చదవండి: Solar Power: హైదరాబాద్ నగరంలో పవర్ హౌస్ ) -
కాలకూటవిషాన్ని జనం పైకి చిమ్ముతున్నారు!
హైదరాబాద్: జీడిమెట్ల, కుత్భుల్లాపూర్ పరిసరాల్లో వంద వరకు బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇతర రసాయనిక, రీసైక్లింగ్ పరిశ్రమలున్నాయి. వాటిల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకర ఘన, ద్రవ రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టిబుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్లు(ఎంఈఈ), ఆర్ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాం టి ఏర్పాట్లే లేవు. గాఢత అధికంగా ఉన్న వ్యర్థాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నా.. ఆ ఊసే పట్ట డంలేదు. ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని యాజమాన్యాలు ఎప్పుడో గాలి కొదిలేశాయి. గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకర వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నారు. మరికొందరు అక్రమార్కులు పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి డ్రమ్ముల్లో నింపి శివారు ప్రాంతా ల్లోని ఖాళీ స్థలాలు, అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటల్లో డంప్ చేస్తున్నా రు. ఒక్కో డ్రమ్ముకు రూ.100 నుంచి రూ.200 వరకు దండుకుంటున్నారు. ఇంకొందరు పరిశ్రమల ప్రాంగణంలోనే గోతులు తీసి వ్యర్థాలను పారబో స్తున్నారు. వ్యర్థాల డంపింగ్‌తో కుత్భుల్లాపూర్, జీడిమెట్ల, తదితర పారిశ్రామికవాడ లు, వాటి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. భూగర్భజలాలు విషతుల్యం ఇలా.. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిపిన అధ్యయనంలో జీడిమెట్ల ప్రాంతంలో భూగర్భజలాలు విషతుల్యమైనట్లు తేలింది. ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలను ప్రయోగశాలలో పరిశీలించినప్పుడు ప్రమాదకరమైన ఆర్సెనిక్, నికెల్, కాడ్మియం తదితర ప్రమాదకర రసాయన, భార లోహాలు మోతాదుకు మించి భారీ స్థాయిలో ఉన్నట్లుగా తేలింది. జీడిమెట్ల, సుభాష్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని మట్టిలోనూ ప్రమాదకర భారలోహాలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రజలు కోరుతోందిది.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న, పారిశ్రామిక వ్యర్థజలాలను ఆరుబయట, బోరుబావుల్లోకి వదిలిపెడుతున్న పరిశ్రమలను మూసివేయాలి. పీసీబీ, టీఎస్ఐఐసీ, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖ లకు చెందిన అధికారులతో కలిసి ప్రత్యేక బృందా లను రంగంలోకి దించాలి. ఆయా బృందాలు 24 గంటలపాటు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉల్లంఘనుల ఆట కట్టించాలి. నాలాలు, చెరువులు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి వాటిని పీసీబీ, జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్ల కార్యాలయంలోని టీవీలకు అనుసంధానించాలి. పీసీబీ వివరణ ఇదీ.. జీడిమెట్ల ప్రాంతంలో పరిశ్రమల ఆగడాలపై ‘సాక్షి’పీసీబీ అధికారులను వివరణ కోరగా.. మా వద్దకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా పరిశ్రమలకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. నిబంధనల ప్రకారం నడుచుకోని పరిశ్రమలపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలపడం గమనార్హం. మేము పదేళ్లుగా సుభాష్‌నగర్‌లో ఉంటున్నం. మా నివాసాల మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా రీసైక్లింగ్ యూనిట్లను నిర్వహిస్తున్నరు. రసాయనాలు నిండిన డ్రమ్ములు, కవర్లను ఇక్కడకు తీసుకొచ్చి రీసైక్లింగ్ చేస్తుండటంతో ఇళ్లల్లోకి విపరీతమైన దుర్వాసన వస్తోంది. కడిగిన నీటిని నాలాలు, రోడ్లపై పారబోస్తున్నరు. దీంతో తరచూ అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలవుతున్నం. మా ఇళ్లలో బోరుబావుల్లోనూ విష రసాయనాలు నిండిన నీళ్లే వస్తున్నయ్. ఈ నీటిని తాగితే చర్మరోగాలు వస్తున్నయ్. లక్ష్మి మనోవేదన ఇది.. ఈ ఆవేదన వీరిద్దరిది మాత్రమే కాదు.. జీడిమెట్ల, కుత్భుల్లాపూర్ పరిసరాల్లో నివసిస్తున్న 60 కాలనీలు, బస్తీల్లోని వేలాది మందిది. ఆ ప్రాంతంలో సుమారు వంద వరకు ఉన్న బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష రసాయన వ్యర్థాలతో గాలి, నీరు, నేల కాలుష్య కాసారంలా మారాయి. జనంపైకి విషం చిమ్ముతున్న పరిశ్రమల ఆగడాలు శ్రుతిమించుతుండటంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను కట్టడిచేయడంలో పీసీబీ ప్రేక్షకపాత్రకే పరిమితమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ ‘మా మోడీ బిల్డర్స్ అపార్ట్మెంట్లో 450 కుటుంబాలు నివసిస్తున్నయ్. మా అపార్ట్‌మెంట్‌కు ఆనుకొని ఉన్న కోపల్లి ఫార్మా పరిశ్రమ నుంచి ఐదేళ్లుగా రాత్రిపూట విపరీతమైన దుర్వాసన వస్తోంది. గతంలో పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా జూలై 2019లో పరిశ్రమను మూసేశారు. తిరిగి 15 రోజుల్లోనే పరిశ్రమ మళ్లీ తెరుచుకుంది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా దుర్వాసన వస్తుండటంతో శ్వాస కోశవ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నం’ –లింగారావు ఆవేదన ఇది.. -
మగవారి కొంపముంచుతున్న కెమికల్స్, ఇలాగైతే కష్టమే!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా మానవజాతిలో ఫలదీకరణ సామర్ధ్యం క్రమంగా తగ్గిపోతోందా? అవునంటున్నారు షన్నా స్వాన్ అనే ఎన్విరానమెంటల్ ఎమిడమాలజిస్టు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న పలు రకాల రసాయనాలు క్రమంగా మగవాళ్లలో వీర్యకణాల సంఖ్య తగ్గేందుకు, అంగ పరిమాణం కుంచించుకుపోయేందుకు కారణమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. కౌంట్‌డౌన్ పేరిట తాజాగా విడుదల చేసిన పుస్తకం ప్రకారం మనుషుల్లో వీర్యకణాల సంఖ్య 1973తో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం మేర తగ్గిందని, ఇదే తరహా కొనసాగితే 2045 నాటికి స్పెర్మ్‌కౌంట్ జీరోకు చేరవచ్చని చెప్పారు. ఇదే నిజమైతే భవిష్యత్‌లో మానవ ప్రత్యుత్పత్తే ఉండదని హెచ్చరించారు. ఈ విపత్తుకు కారణమైన రసాయనాలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయని, రోజూవారీ ఫుడ్ర్యాపింగ్స్ మొదలు, ప్లాస్టిక్ కంటైనర్ల వరకు వాటర్‌ప్రూఫ్ బట్టల నుంచి రోజూవారీ డియోడరెంట్లు, సబ్బుల వరకు అన్ని చోట్ల ఈ రసాయనాల జాడ ఉందని వివరించారు. వీటిలో పీఎఫ్ఏఎస్గా పిలిచే ఫరెవర్ కెమికల్స్ ఎప్పటికీ ప్రకృతిలో బ్రేక్‌డౌన్ కావని, ఇవి శరీరంలో పర్మినెంట్‌గా ఉంటాయని చెప్పారు. ఇవి శరీరంలో పేరుకుపోయేకొద్దీ హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుందన్నారు. కెమికల్ ఇండస్ట్రీ ల్యాబీయింగ్ పీఎఫ్ఏఎస్ కెమికల్స్‌పై ఆయాదేశాలు స్పందించే తీరులో వ్యత్యాసాలున్నాయని, కొన్ని దేశాల్లో వీటిని పూర్తిగా నిషేధిస్తే, కొన్ని చోట్ల పరిమితంగా వాడుతున్నారని, కొన్ని చోట్ల ఎలాంటి నియంత్రణా లేదని స్వాన్ వివరించారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా నిషేధించకుండా కెమికల్ ఇండస్ట్రీ ల్యాబీలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. రసాయనాల ప్రభావం మహిళల్లో సైతం ఫెర్టిలిటీపై పెరిగిందని స్వాన్ చెప్పారు. ప్రస్తుత మహిళ తన ముత్తవ్వతో పోలిస్తే 35వ ఏట గర్భం దాల్చే శక్తి తగ్గిందన్నారు. అలాగే ఒక మగవాడి వీర్యకణాలు అతడి తాతతో పోలిస్తే సగమయ్యాయన్నారు. ఇది మానవాళి అంతానికి దారి తీసే విపత్తని చెప్పారు. కేవలం స్పెర్మ్ కౌంట్ తగ్గడమే కాకుండా ఈ కెమికల్స్ కారణంగా మగవారి అంగ పరిమాణం, వృషణాల్లో ఘనపరిమాణం కూడా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశాలు మేలుకొని ఈ కెమికల్ గండాన్ని ఎదుర్కోవాలని సూచించారు. -
మధుర ఫలం.. చైనా విషం!
సాక్షి, సిటీబ్యూరో: మామిడి పండ్ల రుచి మధురాతి మధురం. అన్ని వర్గాల ప్రజలూ దీని రుచి ఆస్వాదించేందుకు మక్కువ చూపుతుంటారు. కానీ.. వ్యాపారుల అత్యాశ కారణంగా ఈ మధుర ఫలం విషతుల్యంగా మారుతోంది. త్వరగా పండించి విక్రయించేందుకు రసాయనాలు వినియోగిస్తున్నారు. ఫలితంగా పైకి నిగనిగలాడుతున్న పండ్లు ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతున్నాయి. కరోనా ప్రభావంతో పండ్ల మార్కెట్లో మామిడి కాయలను కేవలం లారీల్లోనే ఉంచి విక్రయించడానికి అధికారులు అనుమతిస్తే వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు ఎల్బీనగర్ తదితర ప్రాంతాల ఫంక్షన్ హాళ్లు, కోహెడ వెళ్లే దారిలో ఉన్న గోడౌన్లను అద్దెకు తీసుకొని కాయలను మగ్గించడానికి విషపూరితమైన చైనా పౌడర్‌ను వాడుతున్నారు. మార్కెట్ల అనుమతులు లేకపోవడంతో స్థానికంగా, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి ఇక్కడే మామిడి కాయలను ప్యాకింగ్ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ప్యాకింగ్ ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతోంది. కాలుష్య కార్బైడ్ నిషేధం.. చైనా పౌడర్‌లో కార్బైడ్ ఉందని విషయం గతంలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల పరీక్షల్లో వెల్లడైంది. కార్బైడ్ ద్వారా మిగ్గించిన పండ్లను తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కార్బైడ్‌ను పూర్తి స్థాయిలో నిషేధించాలని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మామిడి ప్రియులు సంబరపడ్డారు. వ్యాపారులు రూట్ మార్చి కార్బైడ్‌కు బదులుగా చైనా పౌడర్‌తో మగ్గిస్తున్నారు. సహజసిద్ధంగా కాకుండా కృత్రిమ పద్ధతికి అలవాటు పడిన వ్యాపారులు త్వరితగతిన పండ్లను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈథలిన్ పౌడర్‌ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్‌తో కాయలను కొన్ని గంటల్లోనే పండ్లగా మార్చి విక్రయిస్తున్నారు. మామిడి కాయల్ని మగ్గించడానికి కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు నిషేధిత రసాయనాలను వినియోగిస్తున్నారనే విషయం బహిరంగ రహస్యం. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో ప్యాకింగ్ చేయడంలేదు.. మార్కెట్లో కేవలం మామిడి కాయల లారీల్లో ఉంచి విక్రయించడానికి అనుమతి ఉంది. అయితే.. మామిడికాయలను మార్కెట్ యార్డ్‌లో ప్యాకింగ్ చేయడం లేదు. వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు కొనుగోలు చేసిన కాయలను ఎల్బీనగర్తో పాటు తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లలో ప్యాకింగ్ చేస్తున్నారు. ఆహారభద్రత శాఖ నిబంధనల మేరకే కాయలను మగ్గించాలి. నిషేధిత రసాయనాలను వినియోగిస్తే చర్యలు తప్పవు. – వెంకటేశం, ఉన్నత శ్రేణి కార్యదర్శి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ -
ప్రత్యేక యంత్రాలతో రసాయనాల స్ప్రే
-
మామిడి మధురం.. చైనా నుంచి ఇథిలిన్ పౌడర్
వేసవిలో మామిడి పండ్ల కోసం ఎదురుచూసే వారుండరంటే అతిశయోక్తికాదు. ఆరోగ్యపరంగా తినాల్సిన సీజనల్ పండు కూడా ఇది. వ్యాపారుల అత్యాశ కారణంగా మధుర ఫలం విషతుల్యం అవుతోంది. త్వరగా పండించి విక్రయించేందుకు రసాయనాలను వినియోగిస్తున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఇథిలిన్‌తో మామిడి పండ్లను మగ్గిస్తూ ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదాన్ని కల్గిస్తున్నారు. సాక్షి సిటీబ్యూరో: కాలుష్యకారక కార్బైడ్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మామిడి ప్రియులు సంబరపడ్డారు. అయితే కృత్రిమ పద్ధతికి అలవాటు పడిన వ్యాపారులు త్వరితగతిన పండ్లను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఇథిలిన్ పౌడర్‌ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్‌తో కాయలను కొన్ని గంటల్లోనే పండించి విక్రయించేస్తున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ఇందుకు కేంద్ర బిందువుగా మారుతోంది. కోర్టు ఉత్తర్వులు బేఖాతర్... ఆరోగ్యానికి హాని చేకూర్చే రసాయనాలు, రసాయన పౌడర్లను వినియోగించి పండ్లను మగ్గించరాదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కొన్ని రోజులు మార్కెట్లలో హడావిడి చేసిన అధికారులు ఆ తర్వాత తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోవడంపై సర్వత్రా విమర్శలున్నాయి. చైనా, కొరియాల నుంచి దిగుమతి... కార్బైడ్‌కు ప్రత్యామ్నాయంగా చైనా, కొరియాల నుంచి ఇథిలిన్ పౌడర్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. దీనికి అనుమతి లేకపోయినా కాయలను 24 గంటల్లో నిగనిగలాడే పండ్లుగా మార్చేందుకు ఆపౌడర్‌ను దొడ్డిదారిన వినియోగిస్తున్నారు. పౌడర్‌ను 5 ఎంఎల్ ప్యాకెట్లుగా తయారు చేసి, ఒక్కో బాక్స్ (15 నుంచి 35 కిలోల మామిడికాయల పెట్టె)లో నీళ్లలో ముంచి మూడు నుంచి ఐదు ప్యాకెట్లు వేస్తున్నారు. ఇథిలిన్ ప్యాకెట్ల ద్వారా మగ్గబెట్టేందుకు తమకు అనుమతి ఉందని వ్యాపారులు పేర్కొంటుండటం గమనార్హం. మరోవైపు చైనా నుంచి తీసుకొచ్చి ఇథిలిన్ అని చేపడుతున్న పౌడర్‌లో కార్బైడ్ ఉన్నట్లు వ్యాపారులు అంటున్నారు. ఎందుకంటే రెండు రోజుల్లోనే కాయ కలర్ మారుతుంది. కార్బైడ్ వాడినప్పుడు ఏవిధంగానైతే వచ్చేదో అలానే పండు రంగు వస్తుంది. పౌడర్ విక్రయాల్లోనూ బ్లాక్ దందా... చైనా నుంచి దిగుమతి చేసిన ఇథిలిన్గా చేప్పే పౌడర్‌ను నాగ్‌పూర్ అడ్రస్ ముద్రించి రీప్యాకింగ్ చేస్తున్నారు. ఇథిలిన్ పౌడర్ ప్యాకెట్ల విక్రయంలోనూ మార్కెట్లో దందా చేస్తున్నారు. పౌడర్ ఒక్కో ప్యాకెట్ రూ. 1.72లకు కొనుగోలు చేస్తున్న ఓ కమిషన్ ఏజెంట్ ఆ ప్యాకెట్‌ను ఒక్కొక్కటి రూ. 5 ప్రకారం బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఇలా 4 రోజులు.. అలా 48 గంటల్లోపే... సహజసిద్ధంగా గడ్డిలో పెట్టి మగ్గించిన మామిడికాయలు ఆరోగ్యానికి మంచివి. ఇలా మగ్గించాలంటే కనీసం 90 నుంచి 96 గంటల సమయం పడుతుంది. ఇంత సమయం దాకా ఆగలేని వ్యాపారులు కాల్షియం కార్బైడ్, ఇథిలిన్ పౌడర్‌లాంటి మార్గాలను అనుసరిస్తున్నారు. వీటి ద్వారా 24 నుంచి 48 గంటల్లోపే కాయలు పండ్లుగా మారుతున్నాయి. గడ్డిఅన్నారం మార్కెట్లో సుమారు 200 నుంచి 300 మంది మహిళలు, బాల కార్మికులు, హమాలీలు ఇథిలిన్ పౌడర్ ప్యాకింగ్ నిమిత్తం పని చేస్తారు. రుచిలో తేడా... కాయలను సహజసిద్ధంగా బట్టీలలో పక్వానికి తెచ్చే పద్ధతులు పాటించేవారు. మధుర తీపి ప్రజలు రుచి చూసేవారు. కృతిమ పద్ధతులు, రసాయనాలతో మగ్గించడం వల్ల రుచిలో తేడాలొస్తున్నాయి. కఠిన చర్యలు తథ్యం నిబంధనల మేరకే కాయలను మగ్గించాలి. ఇందుకు మార్కెట్లో ఉన్న చాంబర్లను సద్వినియోగం చేసుకోవాలి. నిషేధిత రసాయనాలను వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. ఈ సంవత్సరం ఇప్పటికే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రసాయన పౌడర్లను వినియోగించరాదని స్పష్టం చేశాం. చైనా నుంచి దిగుమతి అయినా ఇథిలిన్ వినియోగించే వారిపై చర్యలు తీసుకుంటాం. మార్కెట్, ఆహార భద్రత, హెల్త్ డిపార్ట్మెంట్తో సమావేశం నిర్వహించనున్నాం. – లక్ష్మీబాయి, డైరెక్టర్, మార్కెటింగ్ శాఖ -
భారత్ ప్లాస్టిక్ కప్పులకు డబ్బు వాపస్: ఐకియా
న్యూఢిల్లీ: భారత్‌లో తయారయ్యే ప్లాస్టిక్ కప్పుల తయారీదారులకు రిటైల్ దిగ్గజం ఐకియా స్టోర్స్ షాకిచ్చింది. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 400 స్టోర్లలో ప్లాస్టిక్ కప్పులను సమీక్షించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కప్పులలో అత్యధిక స్థాయిలో కెమికల్స్ ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనిపై ఓ కంపెనీ అధికారి స్పందిస్తూ ఇప్పటి వరకు ఆరోగ్యానికి హానికరమైన అంశాలను గుర్తించలేదని.. కేవలం వినియోగదారుల శ్రేయస్సు దృష్యా సమీక్షిస్తున్నామని తెలిపారు. వ్యాపార వర్గాలు మాత్రం కప్పులలో కెమికల్స్ స్థాయిని తెలుసుకోవడానికి ఐకియా స్టోర్స్ యాజమాన్యం పరీక్షలకు పంపించిందని.. ఈ పరీక్షల అనంతరం కప్పుల్లో డై బ్యుటైల్ తాలేట్ అనే కెమికల్ అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించారని వ్యాపార వర్గాలు తెలిపాయి. ఐకియా స్టోర్లలో ప్లాస్టిక్ కప్పులను కొనుగోలు చేసిన వినియాగదారులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు తెలిపింది. వినియాగదారులు ఏ రకంగా కోనుగోళ్లు చేసినా డబ్బులను తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆన్లైన్లో చెల్లించినా, రశీదు లేకపోయినా కప్పులను స్టోర్స్‌కు తీసుకురాగలిగితే చెల్లించిన డబ్బు తిరిగి ఇస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో 400 ఐకియా రిటైల్ స్టోర్స్ ఉన్న విషయం తెలిసిందే. చదవండి: ఐకియా బంపర్ ఆఫర్ -
డబ్బులు డబుల్ చేస్తామని..
మల్లాపూర్: కరెన్సీ నోట్లకు రసాయనాలు పూసి వాటిని రెట్టింపు చేస్తామని దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులను బుధవారం మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్ మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ లింగయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విశాఖ పట్నం జిల్లాకు చెందిన బొక్క భరత్‌కుమార్ అలియాస్ మణి సరూర్‌నగర్ మీర్పేట్లో ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన స్క్రాప్ వ్యాపారి షేక్ ఖాజా వలి హుస్సేన్, ఆదినారాయణతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మల్కాజిగిరికి చెందిన కంప్యూటర్ల వ్యాపారి వెంకటేశ్‌యాదవ్‌తో భరత్‌కుమార్‌కు పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో అతడిని మోసం చేయాలని పథకం పన్నిన వీరు కరెన్సీ నోట్లకు రసాయనాలు పూసి రెట్టింపు చేస్తామని వెంకటేశ్‌యాదవ్‌ను నమ్మించారు. గత ఆగస్టు 3న వెంకటేశ్ యాదవ్ మూడు రూ. 500 వందల నోట్లను తీసుకురాగా నిందితులు వాటికి రసాయనాలు పూసి ఆరు నోట్లుగా చేశారు. దీంతో వారి మాటలు నమ్మిన వెంకటేశ్‌యాదవ్ రూ 8.16 లక్షలు తీసుకొచ్చాడు. ఇందులో రూ 50వేలు కమీషన్‌గా తీసుకున్న వీరు మిగతా రూ 7.66 లక్షలను ఒక గుడ్డలో చుట్టి వెంకటేశ్‌యాదవ్ ఇంట్లో ఒక ప్రదేశంలో ఉంచారు. మూడు రోజుల తర్వాత వాటిని తీస్తే రెట్టింపు అవుతాయని చెప్పి వెళ్లారు. మూడు రోజుల అనంతరం అతడి ఇంటికి వచ్చిన ముగ్గురు నోట్ల మూటను వేడి చేయాలని చెబుతూ వెంకటేశ్‌యాదవ్ దృష్టి మరల్చి వంట గదిలోకి వెళ్లారు. పాత చెత్త పేపర్ల మూటను అతడికి ఇచ్చి రూ 7.66 లక్షలతో అక్కడి నుంచి ఉడాయించారు. తాను మోసపోయినట్లు గుర్తించిన వెంకటేశ్‌యాదవ్ నేరేడ్మెట్ పోలీసులను ఆశ్రయించారు. బుధవారం నేరేడ్మెట్ చౌరస్తాలో సీసీఎస్ పోలీసులు భరత్‌కుమార్, ఖాజావలి హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి రూ1.20లక్షను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆదినారాయణను వారం రోజుల క్రితం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
భూగర్భం..హాలాహలం!
కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పారిశ్రామివాడ రసాయనాల నిల్వలకు అడ్డాగా మారింది. ఇక్కడ బోర్లు వేసినా ఎర్రటి నీరే వస్తుంది..దీంతో అధికారులే ఇక్కడ బోర్లు వేయడం మానేశారు. ఇంకేముంది కొంత మంది పరిశ్రమల యజమానులు రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా తమ వద్ద నిల్వ ఉన్న వ్యర్ధ రసాయన జలాలను నాలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వదిలి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. 1974లో ఇక్కడ పరిశ్రమలు రాగా ప్రజలు సంతోషించారు. ప్రస్తుతం రాను రాను బహుళ జాతి సంస్థలు ఇక్కడి నుంచి తరలించగా చిన్నా చితకా పరిశ్రమలు వెలిసి రసాయనాలకు అడ్డాగా మారాయి. దీంతో ప్రతి నిత్యం ఇక్కడ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వర్షం పడ్డా.. రాత్రయినా కెమికల్ మాఫియాకు పంట పండినట్లే. నిల్వ ఉన్న వ్యర్థాలను నాలాల్లోకి వదలడం ఇక్కడ పరిపాటిగా మారింది. కాలనీల్లో భూగర్బ జలాలు కలుషితం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామికవాడకు ఆనుకుని ఉన్న సుభాష్‌నగర్, గంపలబస్తీ, వెంకటేశ్వర సొసైటీ, రాంరెడ్డి నగర్, ఎస్ఆర్ నాయక్‌నగర్, అయోధ్యనగర్ ప్రాంతాల్లో ఎక్కడ 10 ఫీట్ల లోతు గుంత తవ్వినా ఎర్ర రంగులో నీరు బయటపడడం గమనార్హం. మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వదలడంతో పరిసర ప్రాంతాలు జల కాలుష్యంతో పాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రసాయన వ్యర్థ జలాల్లో విష రసాయనాలు ఉండడం వల్ల నీరు కలుషితమవుతుంది. వాస్తవానికి, ఈ వర్థ్యాలను నేరుగా కామన్ ఇంప్లిమెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్(సిఈటిపి)కి తరలించాలి. లేదా సొంత ఈటీపీ ద్వారా ఆయా రసాయన పరిశ్రమలు శుద్ధి చేయాలి. కానీ ఇక్కడ టోలిన్, మిథినాల్, ఎసిటోన్ వంటి సాల్వెంట్లతో కూడిన వ్యర్థ జలాలు నేరుగా శుద్ధి చేయకుండానే డ్రైనేజీ, నాలాల్లో కలపడం వల్ల ఇక్కడ భూగర్బ జలాలు కలుషితంగా మారాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు సైతం వర్షాకాలంలో పైన పేర్కొన్న కాలనీలతో పాటు నాలా పరివాహక ప్రాంతాల్లో బోర్లు వేయడం మానేశారు. ఎందుకంటే అక్కడ బోర్లు వేస్తే వాటిలో ఎర్రటి రంగులో రసాయనాలు బయటకు వస్తున్నాయి. వర్షం పడితే వీరి పంట పండినట్లే.. పారిశ్రామికవాడలో రసాయన పరిశ్రమల యాజమాన్యాలు తాము నిల్వ చేసుకున్న వ్యర్థ జలాలను ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించకుండా గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో నాలాల్లోకి వదలడం, లేదా అక్రమ మార్గాల్లో వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి డంపింగ్ చేయడం జరుగుతూ వస్తుంది. అంతే కాదు...వర్షం పడితే వీరి పంట పండినట్లే. చిన్న పాటి వర్షం పడ్డా.. భారీ వర్షం కురిసినా నిల్వ ఉన్న వ్యర్థ రసాయనాలు బహిరంగ ప్రదేశాల్లో వదలడం నిత్యకృత్యంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడమే కాకుండా జ్వరం, నీరసం, తలనొప్పి, శాస్వకోస, చర్మ సంబంధింత వ్యాధులతో బాధపడుతున్నారు. వ్యర్థ జలాలు బహిరంగ ప్రదేశాల్లో వదలడం చట్టరిత్యా నేరం. అయినప్పటికీ ఇక్కడ రసాయన పరిశ్రమల యజమానులు రెచ్చిపోతుండడంతో ప్రజలు బిత్తరపోతున్నారు. గతంలో కలకలం... రసాయన పరిశ్రమల యాజమాన్యాలు కెమికల్ మాఫియా ముఠాను తయారు చేసి వారి ద్వారా ట్యాంకర్లలో దూలపల్లి, గాజులరామారం ఫారెస్ట్ ప్రాంతాల్లో డంపింగ్ చేసి చేతులు దులుపుకోగా గతంలో కలకలం రేపింది. అంతే కాకుండా ఏదైనా పరిశ్రమ మూత పడినా ఆ పరిశ్రమను అడ్డాగా చేసుకుని రసాయన వ్యర్థాలను భూముల్లోకి ఇంకేలా పెద్ద పెద్ద గోతులు తవ్వి పూడ్చగా గతంలో పలు సందర్బాల్లో ఇవి బయట పడిన విషయం తెలిసిందే. కొంత మంది మరింత రెచ్చిపోయి చెరువులు, కుంటల్లో రసాయనాలను కల్పడం వల్ల లక్షలాది రూపాయాలు విలువ చేసే చేపలు మృత్యువాడ పడిన విషయం తెలిసిందే. అంతే కాకుండా గంపల బస్తీలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న గోదాముల్లో కెమికల్ డ్రమ్ములను శుద్ధి చేసి వాటి నుంచి వెలువడే రసాయన వ్యర్ధాలను భూమిలోకి ఇంకేలా చేస్తున్నారు. ఈ విషయం పలుమార్లు బయట పడింది. ఫిర్యాదులు వస్తే పీసీబీ హడావుడి జీడిమెట్ల పారిశ్రామికవాడలో స్థానికుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పీసీబీ అధికారులు ఇక్కడ భూమిలో నుంచి పైపులైన్లు వేసి నాలాలోకి రసాయనాలు వదులుతున్న మూడు పరిశ్రమలను గుర్తించారు. శ్రీపతి కెమికల్, కొపల్లి ఫార్మా, ఆర్కె మిస్ పరిశ్రమల నుంచి నేరుగా నాలాలోకి వదులుతున్న విషయంపై తవ్వకాలు చేపట్టి మరీ వాటిని సీజ్ చేశారు. మొత్తం ఈ ప్రాంతంలో 74కు పైగా రసాయన పరిశ్రమలు ఉండగా వాటి నుంచి లభించే వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారో అన్నది ఇక్కడ అంతు చిక్కని ప్రశ్నగా మారింది. పీసీబీ అధికారులు మాత్రం నెల వారి మామూళ్లకు అలవాటు పడి అటు వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తుంది. -
తుప్పుకిక ఓటమి తప్పదు...
మామిడి ఆకులను ఎందుకు వాడతారు? గుమ్మానికి తోరణంగా వాడొచ్చు.. యాగాలు, హోమాలు చేస్తూంటే ప్రోక్షణకు పనికొస్తుంది. అంతకుమించి దానివల్ల ఇంకేం ఉపయోగం అంటున్నారా? మీ ఆలోచనలకు కళ్లెం వేయండి. ఎందుకంటే.. ఇకపై ఈ మామిడాకులు ఏటా లక్షల కోట్లు ఆదా చేస్తాయి మరి! ఎలాగంటే.. ఇనుమును అలాగే వదిలిస్తే ఏమవుతుంది? కొంత కాలానికి తుప్పు పడుతుంది. సముద్రంలో ఎప్పుడూ ఉండే పెద్ద పెద్ద నౌకలు మరింత వేగంగా తుప్పుపడతాయి. ఈ తుప్పు వదిలించుకునేందుకు అవుతున్న ఖర్చు ఎంతో తెలుసా? ఏకంగా.. రెండున్నర లక్షల కోట్ల డాలర్లు! అయితే మామిడాకుల నుంచి తీసిన ఓ పదార్థం ఇనుముకు తుప్పు అసలే పట్టనివ్వదని తిరువనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఈ పదార్థాన్ని వాడటం ద్వారా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న కృత్రిమ రంగుల వాడకాన్ని నిలిపివేయవచ్చని అంచనా. మామిడాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, తుప్పు తట్టుకునే పాలీఫినాల్స్ ఎక్కువగా ఉంటాయని.. అందుకే తాము వీటిపై పరిశోధనలు ప్రారంభించామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త నిషాంత్ కె.గోపాలన్ తెలిపారు. ఎథనాల్ సాయంతో ఎండిపోయిన మామిడాకుల నుంచి పాలీఫినాల్స్ వంటి రసాయనాలను తొలుత వేరు చేశామని చెప్పారు. వేర్వేరు సాంద్రతలతో ఈ రసాయనాలను పరిశీలించగా ఇనుము లాంటి లోహాలతో బంధం ఏర్పరచుకున్న పాలీఫినాల్స్ తుప్పును సమర్థంగా అడ్డుకుంటుందని వివరించారు. గరిష్టమైన నిరోధకత కలిగిన పదార్థపు పూత పూసిన ఇనుమును ఉప్పునీటిలో ఉంచి పరీక్షించినప్పుడు తుప్పు పట్టడం 99 శాతం తగ్గిందని చెప్పారు. ఈ పదార్థంపై మరిన్ని పరిశోధనలు, ప్రయోగాలు చేయాల్సి ఉందని గోపాలన్ చెప్పారు. మార్కెట్లో తుప్పును నిరోధించే రసాయనాలు ఎన్నో ఉన్నా వాటి ఖరీదు చాలా ఎక్కు వని.. పైగా వాటితో మానవ ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంద న్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు తాము మొక్కల రసాయనాలను అన్వేషించామని చెప్పారు. మామిడాకులతో పాటు ఈత/ఖర్జూరపు గింజలు, అల్లం నుంచి వేరు చేసిన రసాయనాలు కూడా తుప్పును తట్టుకోగలవని తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని వివరించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
హెయిర్–డై వాడుతున్నారా?
నా వయసు 34 ఏళ్లు. నా జుట్టు ఇప్పుడిప్పుడే తెల్లబడుతోంది. అయితే ఇప్పటివరకు నేను జుట్టుకు రంగు వేయలేదు. ఇకపై హెయిర్–డై వాడదామని అనుకుంటున్నాను. దాని విషయంలో నా ఎంపిక ఎలా ఉండాలి? హెయిర్–డైతో ఏమైనా ప్రమాదాలు ఉంటాయా? దయచేసి నాకు హెయిర్–డై వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విపులంగా చెప్పండి. చాలామంది హెయిర్–డై లను చాలారకాల ప్రయోజనాల కోసం వాడుతుంటారు. హెయిర్–డై విషయంలో మీ ఎంపిక అన్నది అసలు మీరు హెయిర్ డైని ఎందుకు ఉపయోగిస్తున్నారన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. అంటే... కొందరు జుట్టు తెల్లబడ్డందున దాన్ని నల్లగా కనిపించేలా చేసుకోవడం కోసం రంగేసుకుంటారు. అయితే మరికొందరు జుట్టు నల్లగా ఉన్నప్పటికీ దాన్ని ఫ్యాషనబుల్‌గా గ్రూమ్ చేసుకోవడం కోసం రంగు వేసుకుంటుంటారు. ఉదాహరణకు కొందరు జుట్టు చివర్లు ఎర్రగా మార్చుకునేందుకు, మరికొందరు కొన్ని పాయలు ఎట్రాక్టివ్‌గా కనిపించేందుకు రకరకాల షేడ్స్‌లో హెయిర్–డైని వాడుతుంటారు. మీరు ఏ ప్రయోజనం కోసం హెయిర్–డై వాడుతున్నప్పటికీ మీ బడ్జెట్లోనే కాస్తంత నాణ్యమైనది ఎంచుకోవడం మంచిది. హెయిర్ డైతో వచ్చే సాధారణ ప్రమాదాలివే... ►హెయిర్ డైలో ఉండే రసాయనాలలో కొన్ని కెమికల్స్ మీకు, మీ చర్మానికి, మీ జుట్టుకు సరిపడకపోవచ్చు. దాని వల్ల కొందరిలో అలర్జీ రావచ్చు. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్), డై తగిలిన చోట కొద్దిగా వాపు వంటివి కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో తలకు రంగు పెట్టినా కళ్లు, పెదవులు లేదా మొత్తం శరీరం మీద వాపు రావడం వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలా జరిగితే వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్/డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి ►కొన్ని సందర్భాల్లో హెయిర్‌డైలో ఉండే రసాయనాలు కళ్లను మండించడం, కళ్ల నుంచి నీరుకారేలా చేయడం, గొంతులో ఇబ్బంది కలిగించడం, తుమ్ములు వచ్చేలా చేయడం వంటి ఇబ్బందులు కలగజేస్తాయి. ఇవి కొందరిలో శ్వాస తీసుకోవడంలోనూ తీవ్రమైన అవరోధాలకు దారితీస్తాయి. ఒక్కోసారి ఆస్తమాకూ దారితీయవచ్చు. చాలాసార్లు సురక్షితంగా వాడిన రసాయానాలే, చాలా ఏళ్లు గడిచాక కూడా మీకు ప్రమాదకరంగా, అలర్జిక్‌గా పరిణమించవచ్చు. అందుకే రంగు వేసుకునే ప్రతిసారీ అదే మొదటిసారి అయినట్లుగా జాగ్రత్తగా ఉండాలి ►అయితే మొదటిసారి హెయిర్–డై వాడేవారు అది మనకు సరిపడుతుందా లేదా అన్నది పరీక్షించుకొని, ఒకవేళ నిర్దిష్టంగా ఆ బ్రాండ్ హెయిర్–డైతో మీకు ఏవైనా అలర్జిక్ లక్షణాలు కనిపిస్తుంటే దానికి దూరంగా ఉండటం మేలు. హెయిర్–డై వేసుకునే పద్ధతి ఇలా... ►ఒక గిన్నెలో మీరు వేసుకోబోయే హెయిర్–డైని కలుపుకుని సిద్ధం చేసుకోండి. దాన్ని మీకు అనువైన బ్రష్‌తో హెయిర్ డైలో ముంచుతూ... కొద్ది కొద్ది మోతాదుల్లో తీసుకుంటూ తీసుకుంటూ జుట్టుకు రాయండి. బ్రష్ మీద పెద్దమొత్తంలో తీసుకోకండి. ఎందుకంటే పెద్దమొత్తంలో బ్రష్ మీదకు రంగును తీసుకుంటే అది కంటిలోకి కారే ప్రమాదం ఉంది. హెయిర్ డై లోని రసాయనాలు కంటికి హాని చేస్తాయి. హెయిర్‌డై కళ్లలోకి స్రవిస్తే... కళ్లు మండటం, కళ్లకు ఇన్ఫెక్షన్ రావడం కూడా జరగవచ్చు. ఆ రసాయనాలు ఒక్కోసారి అంధత్వానికీ దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి హెయిర్–డై వేసుకునే సమయంలో కంటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ►హెయిర్ డైలో ఉండే రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోతాయి. ఒక రసాయన చర్య జరిపి జుట్టును నల్లబారుస్తాయి. ఆ రసాయనాలు వెంట్రుకను బిరుసెక్కేలా చేస్తాయి. ఫలితంగా చాలాకాలం రంగువేసుకుంటూ ఉన్నవారిలో వెంట్రుక కాస్త రఫ్‌గానూ, తేలిగ్గా విరిగిపోయేలా (బ్రిటిల్గా) మారుతుంది. ఇక మహిళల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటూ రంగు వేసుకునేవారిలో ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది ►కృత్రిమంగా తయారు చేసే ప్రతి హెయిర్ డైలోనూ, కాలీ మెహందీలోనూ పీపీడీ (పారాఫినైలీన్ డై అమైన్– ఇదే రంగును కల్పించే ప్రధాన రసాయనం) వంటి రసాయనాలు ఉంటాయి. బ్లాక్ హెన్నా కూడా అంత సురక్షితం కాదు. వీటిలో ఉండే రసాయనాల వల్లనే రియాక్షన్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఒకింత సురక్షితమైన మెడికేటెడ్ హెయిర్ డైస్ దొరుకుతున్నాయి. మీ డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి వాటిని మీరు సురక్షితంగా వాడుకోవచ్చు ►కొంతమంది హెయిర్ డై ప్యాక్‌మీద అమోనియా ఫ్రీ అనే మాట చూసి అది సురక్షితమని వాడుకుంటుంటారు. కానీ అందులో కూడా పీపీడీ అనే రసాయనం లేనిదే వాడాలి. ఎందుకంటే అమోనియా ఫ్రీ అని ఉన్నప్పటికీ ఈ పీపీడీ కూడా అమోనియా నుంచి వచ్చే రసాయనమే కాబట్టి అమోనియా ఫ్రీ అనే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే... ►మీరు తొలిసారిగా తలకు రంగు వేసుకుంటున్నారా? అయితే మొదటిసారి మీరే ఇంటి దగ్గర వేసుకోకండి. ఒకటి రెండుసార్లు మంచి పార్లర్లో ప్రొఫెషనల్స్ సహాయంతో రంగు వేసుకోండి. వారెలా వేస్తున్నారో గమనించి, ఆ తర్వాత మీరు ఆ టెక్నిక్స్‌ను అనుసరించండి ►తొలిసారి రంగు వేసుకునే వారు నేరుగా దాన్ని తలకు పట్టించుకోవడానికి బదులు ముందుగా చెవి వెనక ఉండే ఒక పాయకు రంగు వేసి, కాసేపు ఉంచి, దాన్ని కడుక్కోవాలి. ఆ తర్వాత 48 గంటల పాటు పరిశీలించి చూసుకోవాలి. ఆ సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలూ (సైడ్ ఎఫెక్ట్స్) కనిపించపోతే... ఇక ఆ రంగును నిరభ్యంతరంగా వాడవచ్చు. ఒకవేళ ఏదైనా సైడ్ఎఫెక్ట్ కనిపిస్తే ఆ బ్రాండ్‌ను వదిలేసి, మరో బ్రాండ్ ఎంచుకోండి ►మీకు సురక్షితమని తేలిన బ్రాండ్‌నే ఎప్పుడూ కొనసాగించండి. కొత్త బ్రాండ్ వాడదలచుకున్నప్పుడు మళ్లీ చెవి వెనక ఉన్న వెంట్రుకలలో ఒక పాయకు రంగు వేసి మళ్లీ మరో 48 గంటలు వేచిచూసి, సురక్షితమని తేలాకే బ్రాండ్ మార్చండి ►మీరు రంగు అంటకూడదని అనుకుంటున్న శరీర భాగాల చర్మంపైన ముందుగా పెట్రోలియం జెల్లీని పూయండి ►రంగు అంటకూడదని భావించే మెడ వెనక భాగంపై పాత టవల్‌ను చుట్టండి ►రంగును ఒకే తరహాలో (యూనీఫామ్గా) అంటేలా బ్రష్‌ను ఉపయోగించండి. అంతే తప్ప ఒక్కచోట ఎక్కువ, మరోచోట తక్కువ పూయకండి. దీంతో తెరపలు తెరపలుగా రంగు కనిపించే ఆస్కారం ఉంది ►రంగు పూసే సమయంలో చేతులకు గ్లౌవ్స్ తప్పక ధరించండి ►వెంట్రుక పెరుగుతున్న కొద్దీ కుదుళ్ల వద్ద తెల్లగా కనిపించే చోట మాత్రమే రంగు పూయదలచినప్పుడు, మిగతా నల్లగా ఉన్న వెంట్రుకల వరకు కండిషనర్ పూసి, తెల్లని చోట టచప్ చేయండి ►మీరు ఎంపిక చేసుకున్న షేడ్ ఏదో అదే వేసుకోండి. అంతేగానీ... రెండు షేడ్ల రంగులు తీసుకొని ఈ రెండింటినీ కలపకండి ►రంగు వేసే సమయంలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కళ్ల మీదికి జారనివ్వకండి. ఈ జాగ్రత్తను తప్పక పాటించండి ►రంగు వాసన వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం లేదా ఆయాసం రావడం జరుగుతుంటే వాసన తగలకుండా ముక్కుపై శుభ్రమైన గుడ్డతో కవర్ చేసుకోండి ►హెయిర్‌డై కేవలం తలకు మాత్రమే వాడండి. కనుబొమలకూ, కనురెప్పలకూ ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్‌డై వాడకూడదు ►మీరు కొన్ని బ్రాండ్‌లోని జాగ్రత్తలను, అందులో ఉపయోగించిన పదార్థాలను ఒకసారి చదవండి. అందులో కోల్తార్, లెడ్ ఎసిటేట్, రెసార్సినాల్ వంటి రసాయనాలు ఉన్నట్లు రాసి ఉంటే దాన్ని వాడకండి ►ఒకవేళ మహిళలు గర్భం ధరించి ఉంటే... తాము గర్భవతిగా ఉన్న సమయంలో హెయిర్‌డై ఉపయోగించకపోవడమే మంచిది ►హెయిర్‌డై వల్ల యౌవనంగా కనిపిస్తాం. అలా కనిపించడం మనందరం కోరుకునేదే. అయితే ఆ చర్య వల్ల మనకు హాని జరగకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. రంగు వేసుకునే సమయంలో మీ గోళ్లు జాగ్రత్త... జుట్టుకు రంగు వేసుకునే సమయంలో మీరు సరైన జాగ్రత్త తీసుకోకపోతే... హెయిర్ డై గోళ్లకు అంటుకునే ప్రమాదం ఉంది. అది ఏ మాత్రం గోరుకు అంటుకున్నా పర్మనెంట్‌గా ఉండిపోతుంది. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గోరు పెరుగుతున్న కొద్దీ, పెరిగిన గోరును మనం కట్ చేసుకున్న కొద్దీ మూడు నెలల్లో గోరు రంగు పూర్తిగా తొలగిపోతుంది. మన గోరూ, జుట్టూ ఈ రెండూ కూడా కెరొటిన్ అనే పదార్థంతో తయారవుతాయి. కాబట్టి జుట్టుకు అంటుకున్న రంగు ఎప్పటికీ ఉన్నట్లే గోరుకూ ఉంటుంది. కింది నుంచి పెరుగుతున్న కొద్దీ ఆ ఫ్రెష్ గోరుగానీ, జుట్టుగానీ తెల్లగా వస్తుంది. డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
శవాలను గుర్తించకుండా కెమికల్స్ ప్రయోగం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ భారత సైన్యంపై సంచలన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో హతమార్చిన తరువాత వారి శవాలను గుర్తించడానికి వీల్లేకుండా కెమికల్స్ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాది అయినా.. ఇంకెవరైనా.. మనిషిగా పుట్టిన ప్రతీ వ్యక్తికి చావు తర్వాత గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలని గుర్తుచేశారు. సాయుధ దళాలు ఎన్కౌంటర్స్ తర్వాత మృతదేహాలపై కెమికల్స్ ప్రయోగించి.. శవాలను గుర్తుపట్టకుండా చేయడం అమానవీయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కశ్మీర్‌లోని శాంగస్ ప్రాంతంలో మెహబూబా ముఫ్తీ బుధవారం మీడియాతో మాట్లాడారు. నామరూపల్లేకుండా ముక్కలు ముక్కలైన సోదరుడి మృతదేహాన్ని చూసిన మరుక్షణం ఓ బాలుడి భావోద్వేగం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాలని మెహబూబా అన్నారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత.. అతను తుపాకీ పట్టుకుంటే ఆశ్చర్యపోతారా? అని ప్రశ్నించారు. ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ నేత కవీందర్ గుప్తా స్పందించారు. వార్తల్లో నిలవడానికే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ముఫ్తీ హయాంలోనే కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఎక్కువగా జరిగిందన్నారు. సైన్యం కెమికల్స్ ఉపయోగించిందా? లేదా? అన్నది ఆమెకే తెలియాలని అన్నారు. ముఫ్తీ కామెంట్స్‌ను ఎలక్షన్ జిమ్మిక్‌గా వర్ణించారు. కాగా, కశ్మీర్‌లోని సాయుధ దళాలు కెమికల్ ప్రయోగిస్తున్నాయన్న ఆరోపణలు గతకొంత కాలంగా వినిపిస్తున్నాయి. సైన్యం మాత్రం ఆరోపణలను ఖండిస్తూనే ఉంది. జెనీవా ఒప్పందం ప్రకారం ఉగ్రవాదులపై సాయుధ దళాలు కెమికల్స్ ఉపయోగించడం నిషిద్ధం. -
సూట్‌కేసులో డయాలసిస్ కేంద్రం...
‘స్పర్థయా వర్ధతే విద్య’ అని సామెత. పోటీ ఉంటేనే రాణింపు అని దీని అర్థం. హైదరాబాద్ వేదికగా 15 ఏళ్లుగా ఏటా జరుగుతున్న బయో ఆసియా సదస్సులోనూ ఇదే జరుగుతోంది. జీవశాస్త్ర రంగంలో వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు సదస్సు నిర్వాహకులు ఏర్పాటు చేసిన పోటీలో అనేక స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తూంటాయి. రెండు రోజుల క్రితమే ముగిసిన 16వ బయో ఆసియా సదస్సులో పదుల సంఖ్యలో స్టార్టప్‌లు పాల్గొనగా.. వాటిలో కీలకమైన, ఆసక్తికరమైన టెక్నాలజీలు, ఆవిష్కరణలు ఇలా ఉన్నాయి... కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్న వారు తరచూ డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుందని మనకు తెలుసు. ఈ కేంద్రాలు తక్కువగా ఉండటం, ఒకసారి ట్రీట్మెంట్కు బోలెడంత సమయం పడుతూండటం, ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల రోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్న వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ నేపథ్యంలో చెన్నైకు చెందిన పద్మసీతా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ చిన్న సూట్‌కేసులోనే ఇమిడిపోయే డయాలసిస్ యంత్రాన్ని సిద్ధం చేసింది. అయితే ఇది పూర్తిస్థాయి డయాలసిస్‌కు ప్రత్యామ్నాయం కాదని, పెరిటోనియల్ డయాలసిస్ మాత్రమే చేస్తుందని సంస్థ నిర్వాహకుడు గౌరీశంకర్ తెలిపారు. కిడ్నీ సక్రమంగా పనిచేయనివారికి ముందుగా ఈ రకమైన డయాలసిస్ చేస్తారని, పూర్తిస్థాయిలో దెబ్బతిన్న తరువాత మాత్రమే హీమో డయాలసిస్ అవసరమైనప్పటికీ మరోమార్గం లేక డాక్టర్లు రెండో రకం డయాలసిస్ చేయించుకోవాల్సిందిగా సూచిస్తూంటారని ఆయన వివరించారు. నెలకు పదివేల రూపాయల కంటే తక్కువ ఖర్చుతో ఈ యంత్రాన్ని వాడుకోవచ్చునని, రక్తశుద్ధికి వాడే రసాయనాలు తక్కువగా ఉండటమే కాకుండా, మళ్లీమళ్లీ వాడుకునే అవకాశం ఉండటం విశేషమని చెప్పారు. స్మార్ట్‌ఫోన్ యాప్ సాయంతో దీన్ని ఎక్కడి నుంచైనా పనిచేయించవచ్చునని, రోగి తన శరీరానికి అమర్చిన గొట్టంలోకి యంత్రం నుంచి వచ్చే గొట్టాన్ని కలుపుకుంటే చాలని చెప్పారు. సంప్రదాయ డయాలసిస్ యంత్రాలతో పోలిస్తే పదో వంతు తక్కువ ఖరీదు చేసే ఈ యంత్రాలను పీహెచ్‌సీలతోపాటు చిన్న చిన్న వైద్య కేంద్రాల్లోనూ వాడుకోవచ్చునని చెప్పారు. వరి పొట్టుతో ఐదు ఉప ఉత్పత్తులు... వరిపొట్టుతో కనీసం ఐదు ఉత్పత్తులను సిద్ధం చేసేందుకు ఒడిషాకు చెందిన ప్రో బయోకెమ్ ఇండియా ఓ వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ధాన్యం మర పట్టిన తరువాత మిగిలే తవుడుతో నూనెలు చేసుకుంటాం. మిగులును దాణాగా వాడుతూంటాం. వరిపొట్టు విషయానికి వచ్చేసరికి ఇలాంటి ఆప్షన్లు ఏవీ లేవు. వృథాగా కాల్చేయాల్సిందే. ఇప్పటివరకూ ఉన్న ఈ అంచనాలను మార్చేసింది ప్రో బయోకెమ్ ఇండియా. వరి పొట్టును కొన్ని ప్రత్యేకమైన రసాయనాలతో కలిపి, ప్రాసెస్ చేసి అనేక ఉపయోగకరమైన పదార్థాలను తయారు చేయవచ్చునని వీరు నిరూపించారు. ఈ ఉప ఉత్పత్తుల్లో మైక్రో క్రిస్టలీన్ సెల్యులోజ్, సిలికాజెల్, ఆల్ఫా సెల్యూలోజ్ పోషకాలతో కూడిన ఉప్పు, చిట్టచివరిగా ప్లైవుడ్ లాంటి ఫైబర్ బోర్డులు ఉన్నాయి. వీటన్నింటికీ వేర్వేరు చోట్ల ఉపయోగాలు ఉన్నాయని, రైతుకు అదనపు ఆదాయం అందివ్వడంతోపాటు పర్యావరణానికి మేలు చేసే ఈ టెక్నాలజీని ఇతర వ్యవసాయ వ్యర్థాలకూ మళ్లించవచ్చునని ప్రో బయోకెమ్ సీఈవో మహమ్మద్ గులేబహార్ షేక్ తెలిపారు. అరచేతిలో ఈసీజీ... ఫొటోలో కనిపిస్తున బుల్లి గాడ్జెట్ పేరు సంకేత్ లైఫ్. గుండె పనితీరును గమనించేందుకు ఆసుపత్రుల్లో వాడే ఈసీజీకి సూక్ష్మరూపం అన్నమాట. ఈసీజీతో మంచి ఫలితాలు రావాలంటే దాదాపు 12 తీగలను ఛాతీలోని వేర్వేరు భాగాలకు అతికించాల్సి ఉంటుంది. సంకేత్ లైఫ్‌తో ఆ అవసరం లేదు. గాడ్జెట్ పైన కనిపిస్తున్న రెండు సూక్ష్మ రంధ్రాలపై చేతి బొటనవేళ్లు రెండూ ఉంచితే చాలు... ఎంచక్కా ఈసీజీ రీడింగ్ స్మార్ట్‌ఫోన్ యాప్‌లో వచ్చేస్తుంది. ఒకవేళ పూర్తిస్థాయి 12 లీడ్‌ల ఈసీజీ కావాలన్నా దీని ద్వారా తీసుకోవచ్చు. సంప్రదాయ ఈసీజీలతో పోలిస్తే సంకేత్ లైఫ్ ఈసీజీ రీడింగ్స్ 96 శాతం వరకూ కచ్చితత్వంతో ఉంటాయట. ఈసీజీ కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. -
పేరెంట్స్కూ పరీక్షే!
బుర్రలో చాలా కెమికల్స్ ఉంటాయి. నిజానికి అదో కెమిస్ట్రీ ల్యాబ్! సరైన కెమికల్ రియాక్షన్లకి సరైన టెంపరేచర్ అవసరం. అలాగే... పరీక్షల సమయంలో పిల్లల బ్రెయిన్ లేబొరేటరీలో సరైన రిజల్ట్స్ కోసం సరైన పేరెంటింగ్ అంతే అవసరం. ఒత్తిడి పెట్టకుండా పిల్లలను పరీక్షలకు ఎలా తయారు చేయవచ్చో అవగాహన కలిగించేందుకే ఈ ప్రత్యేక కథనం. ముందుగా పెద్దలు తెలుసుకోవాల్సిన కథ ఒకటి ఉంది. అంతగా చదువుకోని అండర్గ్రాడ్యుయేట్కు ఒక కొడుకు ఉన్నాడు. అతడి పేరు రమేశ్. ఆ ఇంటికి కాస్త దూరంలోనే మరో అబ్బాయి కూడా చదువుతున్నాడు. ఈ కుర్రాడి పేరు శీతల్. శీతల్ వాళ్ల నాన్న పోస్ట్ గ్రాడ్యుయేట్. రమేశ్‌తో పోలిస్తే శీతల్ వాళ్లది కాస్తంత కలిగిన కుటుంబం. ఒకే స్కూల్ కాదుగానీ... రమేశ్, శీతల్ ఇద్దరూ పదో తరగతి చదువుతున్నారు. పైగా రమేశ్‌తో పోలిస్తే శీతలే చదువులో చురుకు. మంచి క్లవర్ స్టూడెంట్ అని పేరు. మున్ముందే కెరియర్ ప్లానింగ్లూ గట్రా తెలియని రమేశ్ వాళ్ల నాన్న అతడికి ఎప్పుడూ భరోసా ఇచ్చాడు. రమేశ్‌కు తనపై తనకు నమ్మకం కలిగేలా మాట్లాడుతుండేవాడు. కానీ శీతల్ వాళ్ల నాన్న కెరియర్ ప్లానింగ్ గురించీ, భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి, సాధించాల్సిన గోల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుండేవాడు. అందరూ ఊహించిన దానికి భిన్నంగా పదో తరగతి పరీక్షల్లో శీతల్‌తో పోలిస్తే రమేశ్ గ్రేడ్స్ బాగా వచ్చాయి. దీనికో కారణం ఉంది. ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో చాలా బాగా స్కోర్స్ సాధిస్తారనుకున్న పిల్లల్లోని మూడింట రెండు వంతుల మంది పిల్లలు అనుకున్న దానికంటే తక్కువ స్కోర్ సాధించారు. వారి స్కోర్ అలా తగ్గడానికి కారణం ఆ పిల్లలు కాదు. కేవలం వాళ్ల తల్లిదండ్రులే. భరించగలిగే ఒత్తిడి అంటే... ఒత్తిడి ఎప్పుడూ చెడ్డదేనా? కాదు... ఓ మోతాదుకు మించనంతవరకు ఒత్తిడి చాలా మంచిది. చిన్నారులపై కాస్తంత ఒత్తిడి కూడా లేదనుకోండి. అప్పుడు పిల్లలు ఎగ్జామ్‌ను లైట్ తీసుకుంటారు. చదవాల్సిన పోర్షన్‌ను చదవనే చదవరు. ఇది ఎంతమాత్రమూ తగదు. ఇలాంటి పిల్లలపై పేరెంట్స్ కాస్త ఒత్తిడి పెంచాల్సిందే. ఒకింత శ్రద్ధతో తమంతట తామే చదువుపై శ్రద్ధ చూపే పిల్లలుంటారు. వారి గుణం, వారు చదువు పట్ల చూపే శ్రద్ధాసక్తులు వంటివి తల్లిదండ్రులకు తెలిసే ఉంటాయి. ఇలాంటి పిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రులు అతిగా ఒత్తిడి పెంచేలా చేయకూడదు. చేస్తే ఏమవుతుందో చూద్దాం. అసలే తమకు ఉన్న శ్రద్ధతో తాము చదువుకునే దానికి తోడు... తమ కెరియర్ తల్లిదండ్రులు చూపుతున్న అతి శ్రద్ధను చూస్తున్న కొద్దీ ఆ పిల్లల్లో మరింత ఒత్తిడి పెరుగుతుంది. అది యాంగై్జటీకి దారితీస్తుంది. దీన్నే వైద్యపరిభాషలో ‘పెర్ఫార్మెన్స్ యాంగై్జటీ’ అంటారు. దీన్నే మరోలా చెప్పుకుందాం. ఎలాంటి ఒత్తిడి లేని సాధారణ పరిస్థితుల్లో వారు పుస్తకంలోని దాదాపు ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం రాయగలరు. కానీ పెర్ఫార్మెన్స్ యాంగై్జటీకి గురైనప్పుడు మాత్రం వారిలో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో తాము రాస్తున్నదంతా కరెక్టేనా, ప్రదర్శించాల్సినంత ప్రతిభను తాము ప్రదర్శిస్తున్నామా లేదా అనే సందేహాలు మొలకెత్తుతాయి. అలా మొలకెత్తిన సందేహాలు ఊడలమర్రిలా పెరిగి అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పరీక్షలకు చదువుతున్న పిల్లల విషయంలో తల్లిదండ్రుల శ్రద్ధ పిల్లల్లో అనుకూల ధోరణి పెంపొందేలా, ఆత్మవిశ్వాసం నింపేలా ఉండాలి. అంతేతప్ప పెర్ఫార్మెన్స్ యాంగై్జటీ కలిగించేలా ఉండకూడదు. ఒకటే మెదడు.. రెండు రకాల చర్యలు అందరిలో ఉండేదీ మెదడే. కానీ అదే మెదడు మనం వాడుకునే తీరును బట్టి రెండు రకాల ఫలితాలు ఇస్తుంది. మొదటిది చిన్నారికి మీరిచ్చే భరోసా, సాంత్వన, ఆత్మవిశ్వాసం నింపేలా మాట్లాడే మాటలు. ఇది అనుకూల ఫలితాలు ఇస్తుంది. కానీ అదే మరొక తండ్రి... తన కొడుకు/కూతురి కెరియర్ పట్ల ప్రదర్శించే అతి శ్రద్ధ, అతి జాగ్రత్త ఆ చిన్నారిలో పెర్ఫార్మెన్స్ యాంగై్జటీని పెంచితే అదే మెదడు ప్రతికూల ఫలితాలిచ్చేలా చేస్తుంది. పిల్లలిద్దరిలోనూ ఒకే లాంటి మెదడు... కాని అదిలా రెండు రకాలుగా ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం. భరోసాలో జరిగే ప్రక్రియ ఇదే... మీ అమ్మాయి పరీక్షల కోసం తయారవుతున్నదనుకుందాం. ఆమె స్వతహాగానే బాగా చదువుతుంది. శ్రద్ధ ఎక్కువే. అలాంటప్పుడు మీరు అమ్మాయిపై అదనంగా భారం వేయకండి. జస్ట్ భరోసా నింపండి చాలు. అదెలా? అమ్మాయి పరీక్షకు ప్రిపేర్ అవుతుంటుంది. ఎనిమిదింటికి భోజనం చేసి, తొమ్మిదిగంటలకల్లా పడుకునేది కాస్తా... రాత్రి పది దాటినా చదువుతోంది. తల్లి పాల గ్లాసుతో వెళ్లింది. ‘మరికాసేపు చదువుతావా? అలాగైతే ఈ పాలు తాగు’ అంది. ఇక్కడ ఆ తల్లి ధోరణీ, మాటలూ ఎలా ఉండాలంటే... ‘నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు. మేం హాయిగా ఏ టీవీ చూసుకుంటూనో ఎలా ఉండగలం. హాయిగా మా మానాన మేమెలా నిద్రపోగలం. కాబట్టి మావంతుగా నీకు తోడుగా ఉంటున్నాం’ అంటూ అమ్మాయిలో సాంత్వన నింపేలా ఉండాలి. అంతే తప్ప... ‘మరికాసేపు చదవడం కోసం టీ తాగు... అప్పుడు నిద్రరాకుండా ఉంటుంది’ అనో... లేదా ‘ఉండాలనుకున్న దాని కంటే మరో అరగంట ఎక్కువగా మేలుకొని చదువుకో’ అనేలాగో ఆ మాటలు ఉండకూడదు. ఇలాంటి మాటలు పెర్ఫార్మెన్స్ యాంగై్జటీని కలిగిస్తాయి. అలాగే మర్నాడు అమ్మాయిని తండ్రి ఎగ్జామినేషన్ సెంటర్‌కు తీసుకెళ్లే సమయంలో, ‘నువ్వెలాగూ ఈమాత్రం దూరం రాలేవని కాదు... కాకపోతే నేను నీకు తోడుగా వస్తే నీపై కాస్త ఒత్తిడి తగ్గడం కోసం వెంట వచ్చా’ లాంటి మాటలు వినిపించాలి. వెళ్లేప్పుడు ‘జాగ్రత్తగా రాయి... టెన్షన్ పడకు’ లాంటి మాటలను అనునయంగా చెప్పండి. ఆ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న పాడుచేశాననీ, పది మార్కులు తగ్గవచ్చని అమ్మాయి అందనుకోండి. వెంటనే... ‘అలా జరగదేమోలే. చూద్దాం. నువ్వు అనుకున్నంత సంతృప్తి పడకపోవడం వల్ల నీలో అలాంటి ఫీలింగ్ ఉందేమోలే’ అనండి. అంతే తప్ప... ‘పది మార్కులంటే మాటలా... మరో పేపర్లో కనీసం 20 అయినా ఎక్కువ సంపాదించేలా చూడు. అప్పుడే ఆ నష్టం కాంపెన్సేట్ అవుతుంది’ లాంటి మాటలు మాట్లాడకండి. సాంత్వన మాటలతో ఏం జరుగుతుంది? మనందరి మెదడులో మాట్లాడేలా చేసే స్పీచ్ సెంటర్, చూసిందేమిటో చెప్పే విజువల్ సెంటర్ లాగే మరో ప్రత్యేక ప్రాంతమూ ఉంటుంది. దాని పేరు రివార్డ్ సెంటర్. ఉదాహరణకు మీరో ఎగ్జామ్‌లో క్లాస్ ఫస్ట్ వచ్చారు. మీ టీచర్ మిమ్మల్ని ‘గుడ్’ అని మెచ్చుకుంది. అప్పుడు మీ మెదడులో ఎండార్ఫిన్ అనే సంతోషం కలిగించే ఒక జీవరసాయనం విడుదల అవుతుంది. టీచర్ ఇచ్చిన ఆ అభినందన రివార్డ్‌తో కలిగిన సంతోషాన్ని పదే పదే పొందడం కోసం మళ్లీ మళ్లీ మీరు క్లాస్ ఫస్ట్ వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అంటే ఆ రివార్డు సెంటర్ ఇచ్చే ప్లెజర్ కోసం ప్రయత్నిస్తుంటారన్నమాట. అలా ప్లెజర్ ఇస్తుంది కాబట్టే దాన్నే ప్లెజర్ సెంటర్ అని కూడా అంటారు. ఇక అలాగే తల్లి తాను నిద్రపోకుండా తన కోసం మేల్కొని ఉండి పాల గ్లాసు తెచ్చి ఇచ్చిందనే భావన కూడా అమ్మాయిలో ఒక కృతజ్ఞతను పెంపొందిస్తుంది. ఎదుటి వాళ్ల చర్య తమకు సంతోషం కలిగించిన భావన అనేది ‘ఫినైల్ ఇథలమైన్’ అనే మెదడులోని రసాయనం వల్ల కలుగుతుంది. అలాగే మర్నాడు ఉదయం ఎగ్జామ్ సెంటర్ దగ్గర తండ్రి మాటలూ, తండ్రి ఇచ్చే నమ్మకం, భరోసా అన్నవి అమ్మాయి మెదడులోని డోపమైన్ లాంటి హుషారు కలిగించే రసాయనాలను విడుదల చేస్తాయి. మన ఆరోగ్యకరమైన ఉద్వేగాలకు మూలం డోపమైన్. ఈ రసాయనం లోపిస్తే మన దృష్టి కేంద్రీకరణ శక్తి (కాన్సంట్రేషన్) తగ్గుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. ఇది తగ్గడం వల్ల ప్రేమరాహిత్యంతో బాధపడుతున్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అందుకే తండ్రి భరోసా డోపమైన్‌ను స్రవించేలా చేస్తుంది. కాస్త అటు ఇటు ప్రవర్తించినా మా నాన్న నన్ను అర్థం చేసుకుంటాడనే భావనను పెంచి ఆరోగ్యకరమైన ఉద్వేగాలకు కారణమవుతుంది. అలాగే ఎండార్ఫిన్ అనే మెదడులోని రసాయనం మనలో యాంగై్జటీని తొలగిస్తుంది. ఉదాహరణకు అమ్మాయి ఆ రోజు ఎగ్జామ్ బాగా రాసిందనుకుందాం. అప్పుడు స్రవించిన ఎండార్ఫిన్ అమ్మాయిలో ‘ఫీల్ గుడ్’ భావన పెంచుతుంది. అదే ఫీలింగ్‌ను మర్నాడు కూడా పొందడం కోసం ఇంకా బాగా చదువుతుంది. అంతే తప్ప... కేవలం తల్లిదండ్రుల ఒత్తిడి మేరకే పిల్లలు విజయాలు సాధిస్తారన్న మాట పూర్తిగా నిజం కాదు. ఇక ఆమె పరీక్షలు బాగా రాస్తున్న కొద్దీ తన మెదడులో ఇంకెన్నో రకాల సంతోష రసాయనాలు స్రవిస్తూ మరింత బాగా పెర్ఫార్మ్ చేసేలా ఆమెను ప్రోత్సహిస్తుంటాయి. వాటిలో ఎన్. ఆరాకిడోనోయల్ డోపమైన్ (ఎన్ఏడీఏ), నలడోయిన్, అరాకిడోనోయల్ గ్లెసెరాల్, వైరోడమైన్ వంటివి చాలానే ఉంటాయి. మరి పైన పేర్కొన్న దానికి ప్రతికూలంగా జరిగేదేమిటి? తల్లిదండ్రులు కేవలం పిల్లల్లో పరీక్షల ఒత్తిడిని మరింతగా పెంచే పనులే చేస్తున్నారనుకుందాం. అంటే ఉదాహరణకు... ‘బాగా చదువు. ఇప్పుడు చదవకపోతే భవిష్యత్తులో మట్టితట్టలు మోయడానికి తప్ప దేనికీ పనికిరావు. ర్యాంకులు రాకుండా కేవలం ఫస్ట్ క్లాస్ వస్తే... ఇప్పటి కాంపిటీషన్లో దిక్కూదివాణం ఉండదు. మీ మేనమామగారి అమ్మాయిలా నువ్వూ యూఎస్ వెళ్లాలి. మినిమమ్ ఐఐటీకి ప్రిపేర్ అయితేగానీ మామూలు బీటెక్ కూడా దక్కని రోజులివి’ లాంటి మాటలు పిల్లల్లో ఒత్తిడి పెంచేస్తాయి. ఓ మోస్తరుగా 70%, 80% పొందేవాళ్లు కూడా 60% లు లేదా ఏ సెకండ్ గ్రేడ్కో తగ్గినా తగ్గవచ్చు. ఇలాంటి మాటలతో మెదడులో ఏం జరుగుతుంది? ఒత్తిడిని పెంచి పెర్ఫార్మెన్స్ యాంగై్జటీ కలిగించే సందర్భంలో అమ్మాయిలో ఏం జరుగుతుందో చూద్దాం. మెదడులో ‘అమిగ్దలా’ అనే ఒక అవయవం ఉంటుంది. బాదాం షేపులో ఉండే ఈ అవయవం మనలో భయం, ఆందోళనా వంటి భావనలు ఉన్నప్పుడు కలిగే ఫీలింగ్స్‌ను వెదికి పట్టుకుంటుంది. అంతేకాదు... ఆ ఫీలింగ్స్ కలిగిన వెంటనే పక్కనే ఉండే హైపోథెలామస్ అనే అవయవానికి సిగ్నల్స్ ఇస్తుంది. అప్పుడది ఎదుట ఉన్న ఆ ప్రమాదాన్నీ, ముప్పునూ ఎదుర్కొనేందుకు అవసరమైన హార్మోన్లను విడుదల చేయమంటూ శరీరాన్ని ఆదేశిస్తుంది. అంతే... పెద్దపొత్తంలో హార్మోన్లూ, జీవరసాయనాలూ ఒంట్లో వెలువడుతాయి. ఉదాహరణకు పిల్లలు తీవ్రమైన ఉద్విగ్నతకు లోనైనప్పుడు పరిస్థితిని తప్పించుకునేందుకు ఎడ్రినల్ గ్రంథి నుంచి కార్టిసాల్స్, అడ్రినాలిన్, నార్–అడ్రినాలిన్ అనే హార్మోన్లు స్రవించాల్సిందిగా హైపోథెలామస్ అనే మెదడు భాగం... శరీరాన్ని ఆదేశిస్తుంది. దాంతో ఆమెలో రక్తపోటు పెరుగుతుంది. కాలేయం నుంచి చక్కెరలు వేగంగా విడుదలవుతాయి. ఒంటికి హాని చేసే కార్టిజోల్స్ అనే హానికర రసాయనాలు వెలువడుతాయి. ఇవి ఎముకల్ని బలహీనపరుస్తాయి. అయితే ఇలా రసాయనాలు వెలువడటం అన్నది ఏ కొద్దిసమయం పాటో జరిగితే పర్లేదు. కానీ పరీక్షలు కనీసం 20 రోజుల పాటు కొనసాగుతుంటాయి. ఇది పిల్లల ఒంటికీ, మెదడుకూ, భవిష్యత్తులో వాళ్ల కెరియర్‌కే హాని చేయవచ్చు. అందుకే పరీక్షల సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన సాంత్వననిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, తనపై తనకు నమ్మకం కలిగేలా ఉండాలి తప్ప... అతి ప్రవర్తనతో వాళ్లలో పలాయనభావాన్నీ, తల్లిదండ్రుల పట్ల ఏవగింపునూ కలిగించేలా ఉండకూడదు. పిల్లల్లో ఒత్తిడి పెరిగిన లక్షణాలు కనిపించినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు మరింత చేయూతనిస్తూ, ఆసరాగా నిలవాలి. అప్పుడే పిల్లల విజయాలనూ చవిచూడవచ్చు. వాళ్లలో ఆత్మహత్యల్లాంటి భావనలూ విజయవంతంగా నిరోధించవచ్చు. కేర్ అండ్ శ్రద్ధ అవసరమే... పై కథ చదివాక ‘పిల్లలపై శ్రద్ధ చూపకపోతే ఎలా?’ అనేది సగటు తల్లిదండ్రుల ప్రశ్న. మరీ ముఖ్యంగా పరీక్షల సమయంలో వారి పట్ల అదనపు శ్రద్ధ అవసరమే. కానీ అది పాయసంలో చక్కెర లేదా బెల్లం అంత మోతాదులో కావాలి. పాయసం రుచిగా ఉండాలంటే... అందులో మిగతా పదార్థాల రుచి కూడా తెలిసేలా... ఉండాల్సినంత తియ్యగానే ఉండాలి. చక్కెర అతిగా పడితే విపరీతమైన తీపి పెరిగి, పదార్థంపై మొహంమొత్తుతుంది. ఇదే ఉదాహరణ పెద్దలు తమ పిల్లల పట్ల ప్రదర్శించాల్సిన శ్రద్ధకూ వర్తిస్తుంది. ఇక్కడ పిల్లలపై తామెంత ఒత్తిడిని కలిగిస్తున్నారు, అది వారు భరించే స్థాయిలో ఉందా లేదా అన్నది తెలుసుకోగలగడమే మంచి పేరెంట్ తాలూకు విజ్ఞత. పిల్లల్లో ఒత్తిడి పెరుగుతోందని గ్రహించడం ఎలా? పరీక్షల కారణంగా పిల్లల్లో ఒత్తిడి పెరుగుతుందని గ్రహించడానికి వీలుగా వాళ్ల శరీరం కూడా తల్లిదండ్రులకు కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంది. ఉదాహరణకు... ∙పిల్లల్లో నిర్ణయం తీసుకునే శక్తి తగ్గుతుండటం ∙ఏదైనా అంశం పట్ల దృష్టికేంద్రీకరణ/ఏకాగ్రత తగ్గడం ∙గోళ్లు కొరుక్కుంటూ టెన్షన్‌గా కనిపించడం ∙త్వరగా విసుగు, నిర్లిప్తత, కోపం వంటి భావనలకు లోనుకావడం వంటి ప్రవర్తనాపూర్వకమైన లక్షణాలు కనిపించవచ్చు. అలాగే శారీరక లక్షణాల్లో భాగంగా కనిపించేవి... ∙వికారం, వాంతి వచ్చినట్లుగా ఉండటం ∙మాటిమాటికీ చెమటలు పడుతూ ఉండటం ∙ఛాతీ పట్టేసినట్లు ఉండటం ∙వేగంగా శ్వాసతీసుకుంటూ ఉండటం వంటివీ కనిపించవచ్చు. ∙పిల్లల్లో మైగ్రేన్ తలనొప్పుల వంటివి కనిపిస్తే... ఈ సీజన్లోనైతే దానికి కారణం పరీక్షల ఒత్తిడే కావచ్చని ఊహించడం తేలికే. అలాగే మరికొందరిలో తీవ్రమైన ఒత్తిడి ఆస్తమాకూ దారితీయవచ్చు. ∙ఇక బాలికల్లో అయితే వారి మెదడులోని హైపోథెలామస్ గ్రంథి ఆదేశాల మేరకు గొనాడోట్రాఫిన్ వంటి హార్మోన్లు స్రవించడం వల్ల రుతుస్రావం క్రమం తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తూ, వాళ్ల హార్మోన్లలో అసమతౌల్యత ఏర్పడినట్లు స్పష్టంగా తెలియజేస్తుంది. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
కెమికల్స్ కేంద్రం కార్బానియో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ రోజుల్లో ఆన్లైలో దొరకనిదంటూ ఏదీ లేదు. కెమికల్స్‌తో సహా! అలాగని, ఆన్లైన్లో రసాయనాలను విక్రయించడం తేలికేమీ కాదు. ఎవరు విక్రయిస్తున్నారు? ఎవరు కొంటున్నారు? ఇవన్నీ కీలకమే. లేకుంటే చాలా అనర్థాలొస్తాయి. దీన్నో సవాలుగా తీసుకుని... కెమికల్స్ పరిశ్రమను సంఘటిత పరిచి.. ఆన్లైన్లో విక్రయిస్తోంది హైదరాబాద్‌కు చెందిన కార్బానియో! క్రయవిక్రయాలే కాకుండా అకడమిక్ స్థాయిలో విద్యార్థుల పరిశోధనలకు ఉచితంగా కెమికల్స్‌ను అందిస్తోంది కూడా. మరిన్ని వివరాలను కార్బానియో.కామ్ ఫౌండర్ డాక్టర్ రఫీ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు. ఎస్వీ యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ.. పాండిచ్చేరి సెంట్రల్ వర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశా. తర్వాత తైవాన్‌లోని నేషనల్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో (ఎన్‌హెచ్‌ఆర్‌ఐ), ఇటలీలోని బొలోగ్నా యూనివర్సిటీలో పదేళ్లు రీసెర్చర్‌గా పనిచేశా. అకడమిక్, పరిశ్రమ రంగాల్లో గమనించిందొక్కటే.. మన దేశంలో వినియోగించేందుకు సిద్ధంగా ఉన్న రసాయనాల లభ్యత కష్టమని!. దీనికి పరిష్కారంగా కెమికల్స్ అమ్మటం, కొనడం రెండింటికీ ఒకే వేదికపైకి తేవాలనుకున్నా!! టెక్నాలజీ మిత్రుడు విజయ్ ఎస్ దేవరకొండతో కలిసి 2017 అక్టోబర్‌లో రూ.20 లక్షల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా కార్బానియో.కామ్‌ను ప్రారంభించాం. కార్బన్ లేనిదే ఏ రసాయన చర్యా జరగదు. దీన్నే ఇటాలియన్లో కార్బానియో అంటారు. అందుకే కంపెనీకి ఈ పేరు పెట్టాం. 4.5 లక్షల రసాయనాలు.. రసాయన తయారీ సంస్థలు, రిటైలర్లు కెమికల్స్‌ను కార్బానియోలో ధరలతో సహా లిస్ట్ చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3 వేల మంది నమోదయ్యారు. ఆగ్రో, పాలిమర్, పెట్రో వంటి అన్ని రంగాల కెమికల్స్ ఉంటాయి. మొత్తం 4.5 లక్షల కెమికల్స్ ఉన్నాయి. నెలకు 30 వేల కొత్త రసాయనాలు జతవుతున్నాయి. వచ్చే ఏడాది కాలంలో 10 లక్షల కెమికల్స్‌ను అందుబాటులోకి తేవాలన్నది మా లక్ష్యం. రూ.85 నుంచి రూ.7.5 లక్షల ధరల వరకూ రసాయనాలున్నాయి. బయటి మార్కెట్‌తో పోలిస్తే కార్బానియోలో ధరలు 65 శాతం వరకు తక్కువగా ఉంటాయి. ఏడాదిలో రూ.200 కోట్ల ఆదాయం.. విద్యా సంస్థలు, ఫార్మా కంపెనీలకు మాత్రమే రసాయనాలను విక్రయిస్తాం. ప్రస్తుతం 5 వేల మంది కస్టమర్లున్నారు. వీరిలో 700 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉంటారు. మా మొత్తం ఆర్డర్లలో 40 శాతం విద్యా సంస్థలు, 60 శాతం ఫార్మా కంపెనీల నుంచి వస్తున్నాయి. అహ్మదాబాద్, ముంబై వంటి నగరాల నుంచి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం నెలకు 2,700 ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాం. వీటి విలువ రూ.40 లక్షల వరకూ ఉంటుంది. ప్రతి ఆర్డర్‌పై 10 శాతం కమీషన్ ఉంటుంది. ఏడాది కాలంలో రూ.200 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. త్వరలోనే సెంట్రల్ యూనివర్సిటీలతో ఎక్స్‌క్లూజివ్ ఒప్పందం చేసుకోనున్నాం. 8 నెలల్లో అమెరికాలోకి ఎంట్రీ.. కెమికల్స్‌ను యూనివర్సిటీ విద్యార్థులకు పరిశోధన కోసం ఉచితంగా అందిస్తున్నాం. సుమారు 7,500 కిలోల బరువు గల కెమికల్స్‌ను ఉచితంగా అందించాం. 8 నెలల్లో అమెరికా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాం. అక్కడి కెమికల్స్‌ను ఇండియాలో విక్రయిస్తాం. ప్రస్తుతం మా కంపెనీలో 9 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో ఈ సంఖ్యను 25కి చేరుస్తాం. 2 నెలల్లో రూ.20 కోట్ల నిధులను సమీకరించాలన్నది లక్ష్యం’’ అని రఫీ వివరించారు. -
సిరి ధాన్యాలను ఎందుకు తినాలి?
ఆధునిక రోగాల నివారణలో సిరిధాన్యాలు ఎంతో కీలక పాత్ర వహిస్తున్నాయి. మనకు, మన ముందు తరాల వారికీ, మన భూములకూ, వాతావరణానికి, మన ఆరోగ్యాలకూ ఇవి ఒక వరం. ప్రపంచానికే మార్గదర్శకంగా తిరిగి పరిచయం అవుతున్నాయి ఈ సిరిధాన్యాలు. సిరి ధాన్యాలు ఎందుకు తినాలి ... తరతరాల సంకరం తర్వాత వరి, గోధుమ పంటల్లో పీచు పదార్థం(ఫైబర్) తక్కువైపోయింది. ఎరువులూ, పురుగు మందులూ లేని వరి అన్నం, గోధుమలూ కరవయ్యాయి. వాటికి తోడు విషపూరితమైన కలుపు మందుల వాడకం పెరిగిపోయింది. మన ఆహారంలో ఉన్న సహజపీచు పదార్థమే (డైటరీ ఫైబర్) ఆహారం నుంచి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది. ఒకేసారిగా అధిక మొత్తంలో గ్లూకోజ్‌ను విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది. ఒకేసారిగా అధిక మొత్తంలో గ్లూకోజ్‌ను విడుదల చేయాలా లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది.ప్రస్తుతం వరి, గోధుమ ఆహారపదార్థాలలో పీచు పదార్థం 0.25 శాతం– 0.5 శాతానికి తగ్గిపోయింది. అందుకే ఇవి తిన్న 15–35 నిమిషాలలో గ్లూకోజ్ (చక్కెరగా–అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా)గా మారిపోయి, 100 గ్రాముల ఆహారం తింటే 70 గ్రాముల గ్లూకోజ్ (చక్కెర)గా ఒక్కసారిగా రక్తంలోకి వచ్చి చేరుతోంది. ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు జరిగితే ఎలా? వీటికి తోడుగా స్వీట్లు తింటే? బర్గర్, పిజ్జాలు మైదాతో చేసిన నాన్ రొట్టె కూడా తోడైతే? అధిక మొత్తాలలో గ్లూకోజు ఒకేసారిగా రక్తంలోకి చేరుకొని చేటు చేస్తుంది. కొవ్వు పెంచుతుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్లని కష్టపెడుతుంది. అనేక రోగాలకు దారి తీస్తుంది. మైదాతో చేసిన పదార్థాలు మరీ ఘోరంగా 10 నిమిషాలలో గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తాయి. మైదా తయారీలో వాడే రసాయనాలు కూడా మన క్లోమ గ్రంధికి ఎంతో హానికరం. మన దేహంలోని రక్తంలో ఉండే గ్లూకోజ్ 6–7 గ్రాములే. ఆహారం తిన్న తరువాత అది జీర్ణమై, చివరికి గ్లూకోజ్‌గా మారి, రక్తంలోకి రావటం, దేహమంతా సరఫరా అవటం మామూలే. కానీ ఒక్కసారిగా 10 నిమిషాల్లో లేదా 30–40 నిమిషాలలో అధిక మొత్తంలో రావటం ఎవరి ఆరోగ్యానికీ మంచిది కాదు. పెద్దలకూ, మధుమేహం ఉన్న వారికీ, ఇతర రోగగ్రస్తులకూ (మలబద్దకం, ఫిట్స్, మొలలు, మూల శంక, ట్రైగ్లిసరైడ్స్, అధిక రక్తపీడనం అంటే బీపీ, మూత్రపిండాల రోగులు, హృద్రోగులు వగైరా అందరికీ) మరింత చేటు.అందుకే పీచు తక్కువగా ఉన్న లేదా పీచు అసలు లేని మైదా వంటి వాటిని దూరం పెట్టాలి. సిరిధాన్యాలు అలవాటు చేసుకోవాలి. ఇవి 5 నుంచి 7 గంటల పాటు కొద్ది కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోజ్‌ను రక్తంలోకి వదులుతుంటాయి. కొర్ర బియ్యం, అరిక బియ్యం, ఊద బియ్యం, సామ బియ్యం, అండు కొర్ర బియ్యం 8 నుంచి 12 శాతం పీచు పదార్థం కలిగినవి. పూర్తిగా సేంద్రియమైనవి. ఈ ఐదూ ‘పంచరత్న సిరి ధాన్యాలు’గా ‘పాలిష్ చేయబడనివి’గా మరింత శ్రేష్ఠమైనవి. వీటితో అన్నం వండుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస, బిర్యానీ, బిసిబేళ బాత్ కూడా చేసుకోవచ్చు. సిరి ధాన్యాలు ఎందుకు తినాలి ... మూడు పూటలా తిన్నప్పుడు ఆ రోజుకు మనిషికి అవసరమైన 25–30 గ్రాముల ఫైబర్ (ప్రతి మానవుడికీ రోజుకు 38 గ్రాముల ఫైబర్ కావాలి) ఈ ధాన్యాల నుంచే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములూ కూరగాయల నుండి, ఆకుల కూరల నుంచి పొందవచ్చు.ఒక్కొక్క సిరిధాన్యం కొన్ని రకాల దేహపు అవసరాలనూ, ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తినీ కలిగి ఉన్నాయి. వరి, గోధుములలో పీచు పదార్థం 0.2 నుంచి 1.2 వరకూ ఉన్నప్పటికీ, అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలతో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపు కేంద్రం నుండి బయటి వరకూ, పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తి దోహదం చేస్తాయి. ఉదాహరణకి కొర్ర బియ్యం– సమతుల్యమైన ఆహారం. 8 శాతం ఫైబర్‌తో పాటు 12 శాతం ప్రోటీన్ కూడా కలిగి ఉంది. గర్భిణులకు సరైన ఆహారంగా సూచించవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి. వాటిని పోగొట్టగలిగే లక్షణం, నరాల సంబంధమైన బలహీనతకు సరైన ఆహారం కొర్ర బియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్ ,పార్కిన్సన్, ఆస్తమాను నివారించడంలో కూడా కొర్రబియ్యం దోహదపడుతుంది.పాశ్చాత్య దేశాల్లో, వారి ఆహారంలో ఫైబర్ లేదని గ్రహించి, 2–3 ఫైబర్ టాబ్లెట్లను నీటిలో వేసుకుని సేవిస్తూ ఉంటారు. అది శాస్త్రీయమైనది కాదు. సహజంగా ఆహారంలోనే ఫైబర్ ఇమిడి ఉండటం మాత్రమే రక్తంలోకి గ్లూకోజు విడుదలని సమర్థవంతంగా నియంత్రించగలదు.ఇలాగే అరికలు బియ్యం.... రక్త శుద్ధికీ, ఎముకల మజ్జ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకూ, అస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడ్, గొంతు క్లోమ గ్రంధుల, కాలేయపు క్యాన్సర్లూ తగ్గించుకోవడానికి అరికలు ఎంతో మేలు చేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్, వైరస్ జ్వరం వగైరాల తర్వాత నీరసించిన వారి రక్త శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికలు. సామ బియ్యం మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులను బాగుచేస్తాయి. ఆడవారిలో pఛిౌఛీ తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. ఇవి కాక మానవుడి లింఫు మండలపు శుద్ధికి సామలు ఎంతో పనికి వస్తాయి. ఊద బియ్యం థైరాయిడ్, క్లోమ గ్రంధులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి కూడా ఇవి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయం, గర్భాశయ క్యాన్సర్లను తగ్గించడానికి పనిచేస్తాయి. ఊద బియ్యం జీర్ణ మండలంలోని కష్టాలను తీసివేస్తాయి. మొలలూ, భగన్దరం, మూల శంక, జజీటటuట్ఛటఅల్సర్లు, మెదడు, రక్త, స్తనాలు, ఎముకల, ఉదర, ప్రేగుల, చర్మ సంబంధమైన క్యాన్సర్... మొదలైన సమస్యలను పోగొట్టడంలో తమ పాత్రను అద్భుతంగా పోషిస్తాయి. (మరింత సమాచారం లోపలి పేజీల్లో) డాక్టర్ ఖాదర్ వలి ఆరోగ్య–ఆహార నిపుణులు -
ఫార్మా హబ్ వైట్ అప్రాన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మసీ స్టూడెంట్స్‌కు ఎదురయ్యే ప్రధాన సమస్య... ల్యాబ్స్, రసాయనాలు అందుబాటులో ఉండకపోవటం. గ్రామీణ, పట్టణాల్లోని కాలేజీల్లో అయితే మరీనూ! నెల్లూరులో బీ–ఫార్మసీ చదివిన బ్రహ్మం పెద్దపోతులకూ ఇదే సమస్య. కానీ, తాను మాత్రం అక్కడితో ఆగిపోకుండా దీనికో పరిష్కారం చూపించాడు. రసాయనాలు, ల్యాబ్ పరికరాలు, వైద్య ఉపకరణాలను విక్రయించేందుకు ‘వైట్‌అప్రాన్. ఇన్’ ప్రారంభించాడు. మరిన్ని వివరాలు ‘స్టార్డప్ డైరీ’తో ఆయన మాటల్లోనే... ‘‘మాది వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల. నెల్లూరులో బీఫార్మసీ పూర్తయ్యాక.. చదువుకునేటపుడు నాకెదురైన ఇబ్బందులను పరిష్కారం చూపించాలని నిర్ణయించుకున్నా. కానీ, సొంతంగా కంపెనీ పెట్టే ఆర్థిక స్థోమత లేకపోవటంతో ఉద్యోగంలో చేరా. జువెంటస్ లైఫ్ సైన్సెస్‌లో ఏడాది పాటు ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశా. తర్వాత 104లో చేరా. అక్కడి నుంచి సొంతంగా కంపెనీ పెట్టాలని ఈ ఏడాది జనవరిలో రూ.2 లక్షల పెట్టుబడితో తిరుపతి కేంద్రంగా వైట్‌అప్రాన్ ఈ–ఎడ్యు కామర్స్ ప్రై.లి. ప్రారంభించాం. మాది ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ (ఏపీఐఎస్) ఇంక్యుబేట్ స్టార్టప్. ఫార్మా విద్యార్థులు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, ల్యాబ్స్‌కు రసాయనాలు, ల్యాబ్, వైద్య పరికరాలను విక్రయించడం మా ప్రత్యేకత. హైదరాబాద్ వాటా 20 శాతం.. వైట్అప్రాన్లో రసాయనాలు, ల్యాబ్, వైద్య పరికరాలుంటాయి. అల్యూమినియం అమ్మోనియం, కాల్షియం కార్బైడ్, గ్లూకోమీటర్స్, ఈసీజీ కేబుల్స్, టెస్ట్ ట్యూబ్స్, హెచ్పీఎల్సీ, సర్జికల్ సెట్స్ వంటి సుమారు 10 వేల వరకు ఉత్పత్తులన్నాయి. వీటి ప్రారంభ ధర రూ.100. ప్రస్తుతం నెలకు రూ.30 లక్షల విలువ చేసే ఆర్డర్లు వస్తున్నాయి. ప్రతి ఆర్డర్‌పై 7–12 శాతం వరకు కమిషన్ ఉంటుంది. మా మొత్తం ఆర్డర్లలో 20 శాతం హైదరాబాద్ వాటా. తెలుగు రాష్ట్రాలతో పాటూ బిహార్, హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. రూ.50 కోట్ల ఆదాయం లక్ష్యం.. ప్రస్తుతం రసాయనాలు, ల్యాబ్, వైద్య పరికరాల విభాగంలో 60 మంది వర్తకులు నమోదయ్యారు. వచ్చే ఏడాది నాటికి వెండర్స్ సంఖ్యను వెయ్యికి చేరుస్తాం. బిట్స్ పిలానీ, గీతం, నైపర్, ఎస్వీఎస్ వంటి 25 యూనివర్సిటీలు, కాలేజీలు మా కస్టమర్లుగా ఉన్నాయి. గత నెలలో రూ.12 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది కాలంలో రూ.50 కోట్ల ఆదాయాన్ని లకిష్యంచాం. రూ.15 లక్షల సమీకరణ.. ప్రస్తుతం తిరుపతి, హైదరాబాద్‌లో కార్యాలయాలున్నాయి. వచ్చే ఏడాది కాలంలో లక్ష ఉత్పత్తులతో పాటూ కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముంబై మార్కెట్లలో విస్తరించాలన్నది లక్ష్యం. ఆర్డర్ల డెలివరీ కోసం బెంగళూరుకు చెందిన షిప్కరో లాజిస్టిక్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే పోస్టల్ విభాగంతోనూ ఒప్పందం చేసుకుంటాం. ప్రస్తుతం మా కంపెనీలో ఆరుగురు ఉద్యోగులున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఇన్వెస్టర్ నుంచి రూ.15 లక్షల నిధులను సమీకరించాం’’ అని బ్రహ్మం వివరించారు. -
వేడినీటి స్నానంతోనూ వ్యాయామ లాభాలు...
రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించుకునేందుకు మధుమేహులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటారు. ఈ జాబితాలోకి వేడినీటి స్నానం కూడా చేర్చుకుంటే మేలని అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు.. దీనివల్ల శరీరంలో ఏర్పడే మంట/వాపు తీవ్రత కూడా తగ్గుతుందని అమెరికన్ ఫిజియలాజికల్ సొసైటీ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా తేల్చారు. సాధారణంగా వ్యాయామం చేసినప్పుడు శరీరంలో మంట/వాపుకు సంబంధించిన కొన్ని రసాయనాలు ఎక్కువవుతాయి. అయితే తాజా పరిశోధనల ప్రకారం శరీర ఉష్ణోగ్రత పెరిగితే ఈ మంట/వాపు తగ్గుతాయి. ఈ నేపథ్యంలో వ్యాయామానికి ప్రత్యామ్నాయాలు ఏమిటో తెలుసుకునేందుకు అమెరికన్ ఫిజియాలజీ సొసైటీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొంతమంది ఊబకాయులు, వ్యాయామం చేయని వ్యక్తులను ఎన్నుకుని ప్రయోగాలు చేశారు. వీరిని రెండు గుంపులుగా విడగొట్టారు. ఒక వర్గాన్ని వేడిగా ఉండే గదిలో.. ఇంకో వర్గం వారిని వేడినీటిలో కొద్దిసేపు ఉండేలా చేశారు. మూడు రోజుల గ్యాప్‌తో గుంపులు తాము చేసే పనిని మార్చుకున్నాయి కూడా. దశలవారీగా సేకరించిన రక్తనమూనాలను పరిశీలించినప్పుడు మంట/వాపులకు సంబంధించిన ఐఎల్–6 రసాయనం తగ్గినట్లు తెలిసింది. అంతేకాకుండా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మోతాదులు కూడా నియంత్రణలోకి వచ్చినట్లు స్పష్టమైంది. -
పండులో..విషముండు
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో పీల్చే గాలి, తాగే నీరే కాదు.. ఆకుకూరలు, కూరగాయలతో పాటు నిగనిగలాడుతూ నోరూరించే పండ్లు సైతం విషతుల్యమవుతున్నాయి. మార్కెట్‌కు ప్రతిరోజు దేశ, విదేశాలకు చెందిన ఎన్నో రకాల పండ్లు దిగుమతి అవుతుంటాయి. అయితే, వాటిని మగ్గించేందుకు ఇక్కడి వ్యాపారులు రసాయనాలు వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని ప్రధాన పండ్ల మార్కెట్లు, బహిరంగ మార్కెట్లలో విక్రయిస్తున్న వివిధ రకాల పండ్లను చైనా పౌడర్, ఇతరరసాయనాలతో కృత్రిమంగా మగ్గబెడుతున్నారని, దాంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ తాజా అధ్యయనంలో గుర్తించింది. కాయలను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న రసాన పౌడర్‌తో పాటు ఎసిటలిన్ గ్యాస్, కార్బైడ్ వంటి పదార్థాలు వాడుతున్నారని తేల్చింది. ఈ పండ్లలో ఆర్సినిక్, ఫాస్పరస్ వంటి మూలకాల ఆనవాళ్లున్నట్లు ప్రకటించింది. ఈ రసాయనాలున్న పండ్లు తిన్నవారికి మెదడు, నరాలు, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు, చర్మవ్యాధులు, కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడతారని హెచ్చరించింది. మోతాదు మించితే ప్రమాదం మార్కెట్లో పండ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఇప్పుడు పలువురు వ్యాపారులు చైనా పౌడర్, ఎసిటలిన్ గ్యాస్, ఫాస్పరస్, ఆర్సెనిక్ తదితర మూలకాలున్న రసాయనాలను వాడుతున్నారు. పైగా ఆయా రసాయనాలను అతిగా వినియోగిస్తుండడంతో పరిస్థితి చేయిదాటుతోంది. పండ్లను కృత్రిమంగా మగ్గబెట్టేందుకు ఇథిలిన్ గ్యాస్‌ను పెద్దమొత్తంలో వినియోగిస్తున్నారు. పండ్లను మగ్గబెట్టే ఛాంబర్లో ఈ గ్యాస్ మోతాదు 100 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) యూనిట్లకు మించరాదన్నది ప్రభుత్వ నిబంధన. కానీ చాలామంది వ్యాపారులు ఈ నిబంధనను పాటించడంలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి గ్యాస్‌ను నేరుగా పండ్లకు తగలకుండా పేపర్లో చుట్టిన తరవాతనే గ్యాస్‌ను ప్రయోగించాలి. అయితే ఈ నిబంధనకు కూడా చాలామంది వ్యాపారులు నీళ్లొదిలి నేరుగా వాడుతున్నట్టు గుర్తించారు. ఇంకొందరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా కంప్రెస్డ్ ఇథిలిన్ గ్యాస్, ఇథనాల్, ఇథోపాన్ వంటి రసాయనాలను అవసరాన్ని మించి వినియోగిస్తున్నారని, ఇది నేరుగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరించింది. అమ్మో చైనా పౌడర్ హానికారక రసాయనాలు, మూలకాలున్న చైనా పౌడర్‌ను చెన్నై, ముంబై పోర్టుల నుంచి నేరుగా నగరంలో పలువురు దళారులు, వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. దీన్ని పండ్ల వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు ఇటీవల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థ దాడుల్లో బయటపడింది. ఐపీఎం అధికారుల దాడులతో అప్రమత్తమవుతోన్న వ్యాపారులు గోడౌన్ల బయట కొన్ని పండ్లను నిబంధనల ప్రకారం మగ్గబెట్టి రసాయనాల ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గోడౌన్ లోపల భారీగా నిల్వ ఉంచిన పండ్లను మాత్రం రసాయనాలతో పండిస్తున్నారు. ఈ పండ్లలోనే ప్రమాదకర రసాయన ఆనవాళ్లు అధికంగా ఉంటోందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చింది. కొనే ముందు పరిశీలించాలి.. ♦ మార్కెట్లో కొనుగోలు చేసే పండ్లపై అధిక సంఖ్యలో నల్లటి మచ్చలుంటే వాటిపై రసాయనాల ఆనవాళ్లున్నట్లు గుర్తించాలి. ♦ యాపిల్, ఆరెంజ్, దానిమ్మ వంటి పండ్లు బాగా నిగనిగలాడుతుంటే వాటిపై రసాయనాల పూత ఉన్నట్టు. ♦ పండ్లను తినేముందు బాగా కడిగి తినాలి. ♦ సహజసిద్ధంగా పక్వానికి వచ్చే పండ్లను తింటేనే ఆరోగ్యానికి మంచిదని, ఆయా పండ్లలో ఆవశ్యక పోషకాలుంటాయని గుర్తించాలి. -
కృత్రిమ రసాయనాలకు చెల్లు!
తినుబండారాలు, పానీయాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు కృత్రిమ రసాయనాలను వాడతారన్నది అందరికీ తెలిసిందే. రెడీమేడ్ ఫుడ్‌ను తింటే జబ్బులొస్తాయని అనేదీ ఇందుకే. అయితే నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివఉఇటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇకపై కృత్రిమ ప్రిజర్వేటివ్స్ వాడాల్సిన అవసరం లేదు. వీటికంటే మెరుగైన, సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన ప్రిజర్వేటివ్స్‌ను తాము అభివృద్ధి చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలవిలియం ఛెన్ తెలిపారు. కాయగూరలు, పండ్లలో ఉండే ఫైటో న్యూట్రియంట్స్, ఫ్లేవనాయిడ్లు ఆహారాన్ని నిల్వ చేసేందుకు వాడుకోవచ్చునని వీరు నిరూపించారు. అంతేకాదు.. ఫ్లేవనాయిడ్లతో బ్యాక్టీరియాను నాశనం చేసేందుకు కూడా వీరు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. పండ్ల రసాలు, మాంసం ఉత్పత్తుల్లో ఈ కొత్త రకం ప్రిజర్వేటివ్స్‌ను వాడి మెరుగైన ఫలితాలు సాధించామని కృత్రిమ ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహార పదార్థంలో ఆరు గంటల్లోనే బ్యాక్టీరియా కనిపిస్తే సహజ ప్రిజర్వేటివ్స్ రెండు రోజులపాటు ఆహారాన్ని తాజాగా ఉంచగలిగాయని ఛెన్ వివరించారు. ఈ కొత్త ప్రిజర్వేటివ్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు తాము పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నామని చెప్పారు. పరిశోధన వివరాలు ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
నేనూ మరచిపోతానా?
నా ఫ్రెండ్ ఒకరికి మంచి జ్ఞాపకశక్తి ఉండేది. అలాంటి వ్యక్తి ప్రెగ్నెన్సీ తరువాత చిన్న చిన్న విషయాలను సైతం మరిచిపోతోంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. నాకు కూడా మా ఫ్రెండ్‌లాగే అవుతుందా? గర్భిణి స్త్రీలకు డెమన్షియ రిస్క్ ఎక్కువగా ఉంటుందని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి తెలియజేయగలరు. – పి.సుమ, సికింద్రాబాద్ గర్భం దాల్చిన తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. మానసిక మార్పులు, హార్మోన్స్‌లో మార్పులు కూడా దానికి తోడవుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమంది మానసికంగా ఒత్తిడికి గురవుతారు. వారిలో ప్రెగ్నెన్సీకి సంబంధించి ఆలోచనలు, సందేహాలు, పని ఒత్తిడి, తమ జీవితంలోకి కొత్తగా వచ్చే బిడ్డ గురించిన ఆలోచనలతో సతమతమవుతుంటారు. ఈ మార్పుల వల్ల కొందరిలో ఏకాగ్రత కోల్పోవటం, కొద్దిగా మతిమరుపు రావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనినే డెమన్షియ అంటారు. ఇది అందరి గర్భవతులలోను ఉండాలని లేదు. అది ఒక్కొక్కరి జీవనశైలిని బట్టి, వారి మనస్తత్వాన్ని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి కొందరిలో ఉండవచ్చు. ముఖ్యంగా గర్భం దాల్చిన వారికి కుటుంబ సభ్యుల అండ చాలా అవసరం. వారిచ్చే ధైర్యం, తోడ్పాటు వల్లనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే, ఈ సమయంలో జరిగే మార్పులు, ఇబ్బందులకు వీరు ఆందోళన చెందకుండా సంతోషంగా ఉండగలుగుతారు. దానివల్ల డెమన్షియ లక్షణాలు పెద్దగా ఉండవు. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కొద్దిగా వాకింగ్, ధ్యానం, ప్రాణాయామం వంటి చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను చేపలు తింటానుగానీ, మరీ ఎక్కువగా తినను. అయితే... ఎర్లీ స్టేజీలో తగినంత పరిమాణంలో చేపలను ఆహారంగా తీసుకోకపోవడం వల్ల నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? చేపల్లో కూడా రసాయనాలు వాడుతున్నారనే వార్తలు చదివాక...తినాలంటే భయమేస్తోంది. దీనికి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? – ఆర్.నీరజ, జంగారెడ్డిగూడెం చేపలు తినకపోవటం వల్ల నెలలు నిండకుండా డెలివరీలు అవుతాయని ఎక్కడా లేదు. నెలలు నిండకుండా పుట్టడానికి గర్భాశయంలో సమస్యలు, కొన్నిరకాల ఇన్ఫెక్షన్స్, బీపీ, సుగర్ వంటివి ఎన్నో కారణాలు కావచ్చు. కాకపోతే చేపలలో ఈఏఅ, ఉ్కఅ∙అనే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే కొద్దిగా ప్రొటీన్స్, విటమిన్ డి ఉంటాయి. ఈ ఒమేగ ఫ్యాటీ యాసిడ్స్ మిగతా ఆహారంలో పెద్దగా లభించదు. ఇవి బిడ్డ మెదడు, కళ్లు ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. అలా అని బాగా ఎక్కువగా చేపలు తినాలని ఏం లేదు. వారానికి రెండు సార్లు తీసుకోవచ్చు. కొన్ని పరిశోధనలలో చేపలు తినటం వల్ల కొందరిలో నెలలు నిండకుండా జరిగే కాన్పులను తగ్గించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేయడం జరిగింది. అలాగే పిల్లల బరువు కూడా మరీ తక్కువగా లేకుండా ఉంటారని అంచనా వేయడం జరిగింది. చేపలు నీటిలో ఉండే మెర్క్యురీని పీల్చుకుంటాయి. కొన్నింటిలో ఇది తక్కువగా, మరికొన్నింటిలో ఎక్కువగా ఉంటుంది. అది ఆ నీటిలో విడుదలయ్యే పదార్థాలు, విషవాయువులను బట్టి ఉంటుంది. సముద్రపు చేపలలో మెర్క్యురీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. బయట మంచినీటిలో పెంచే చేపలలో పెద్దగా మెర్క్యురీఉండదు. కొద్దిగా మెర్క్యురీ ఉండటం వల్ల బిడ్డకు ఇబ్బంది ఉండదు. మెర్కురి అధిక శాతం ఉన్న చేపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, బిడ్డలో నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి రోజుకొకటి చొప్పున తీసుకోవచ్చు. బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? అనేదాని గురించి వివరంగా తెలియజేయగలరు. – కె.రూప, పార్వతీపురం గర్భంతో ఉన్నప్పటి కంటే కాన్పు తరవాత బాలింతకు ఆహారం ఎక్కువ అవసరం. గర్భంతో ఉన్నప్పుడు, తల్లి కడుపులో పెరిగే బిడ్డకు మామూలుగా కంటే ఆహారంలో 300 కేలరీల శక్తి అవసరం ఉంటుంది. అదే బాలింతకు 600 కేలరీల శక్తి అవసరం ఉంటుంది. ఈ కేలరీల బలం, తల్లిలో తొమ్మిది నెలల తర్వాత వచ్చిన శరీర మార్పులను, బలహీనతల నుండి తేరుకోవడానికి అలాగే తల్లి పాల ద్వారా బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదలకు అవసరం. ఇది తల్లి తీసుకునే పౌష్టికాహారం ద్వారా లభిస్తుంది. మన దేశంలో బాలింత అది తినకూడదు, ఇది తినకూడదు, వాటి వల్ల చీము పడుతుంది, పప్పు తింటే కుట్లు మానవు, నీళ్లు ఎక్కువగా తాగితే పొట్ట వస్తుంది, పెరుగు, పండ్లు తింటే బిడ్డకు జలుబు చేసే అవకాశం ఉంటుంది అనే ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలతో చాలా మంది పెద్దవాళ్లు.. బాలింతకు ఆహారం సరిగా ఇవ్వకుండా కారంపొడులు వంటి వాటితో సరిపెడుతుంటారు. నిజానికి ఇది ఎంత మాత్రం సరికాదు. ఆహారంలో అన్నం, పప్పులు, అన్ని రకాల కూరగాయలు, మాంసాహారులైతే మాంసం తీసుకోవడం వల్ల, వాటిలో ఉండే కార్బోహైడ్రేౖట్స్, ప్రొటీన్స్ కుట్లను తొందరగా మానిపోయేటట్లు చేస్తాయి. తల్లిలో అలసటను దూరం చేస్తుంది. బిడ్డకు సరిపడా పాలు పడతాయి. నీళ్లు బాగా తాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది. మలబద్ధక సమస్య పూర్తిగా తగ్గుతుంది. పాలు బాగా వస్తాయి. బిడ్డ తల్లి పాలు తాగడం వల్ల, తల్లిలోని పోషకాలు తీసేసుకోవడం వల్ల తల్లి బలహీనంగా తయారవుతుంది. అందుకే బాలింతల ఆహారంలో తప్పనిసరిగా రెండు గ్లాసుల పాలు, రెండు లీటర్ల నీళ్లు, అన్నం, చపాతీ, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లతో పాటూ పెరుగు, రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా మెంతులు లేదా మెంతికూర వంటివి తీసుకోవడం వల్ల పాలు బాగా పడతాయి. అలాగే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఆహారంలో నూనె, కారం, మసాలా వంటివి తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్ వంటివి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో ,హైదర్‌నగర్ హైదరాబాద్ -
కలుపుతోనే కలుపు నిర్మూలన!
ఏ పంటకైనా కలుపు సమస్యే. కలుపు నివారణకు సంప్రదాయకంగా కూలీలతో తీయించడం లేదా గుంటక తోలటం చేస్తుంటారు. అయితే, కొద్ది సంవత్సరాలుగా కూలీల కొరత నేపథ్యంలో కలుపు నిర్మూలనకు రసాయనిక కలుపు మందుల పిచికారీ పెరిగిపోయింది. గ్లైఫొసేట్ వంటి అత్యంత ప్రమాదకరమైన కలుపు మందుల వల్ల కేన్సర్ వ్యాధి ప్రబలుతోందని నిర్థారణ కావడంతో ప్రభుత్వాలు కూడా దీని వాడకంపై తీవ్ర ఆంక్షలు విధించడం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో కొందరు ప్రకృతి వ్యవసాయదారులు సేంద్రియ కలుపు మందులపై దృష్టిసారిస్తున్నారు. కలుపుతోనే కలుపును నిర్మూలించవచ్చని ఈ రైతులు అనుభవపూర్వకంగా చెబుతుండటం రైతాంగంలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఒక పొలంలో ఏవైతే కలుపు రకాలు సమస్యగా ఉన్నాయో.. ఆ కలుపు మొక్కలు కొన్నిటిని వేర్లు, దుంపలతో సహా పీకి, ముక్కలు చేసి, పెనం మీద వేపి, బూడిద చేసి దానికి పంచదార, పాలు కలిపి మురగబెడితే తయారయ్యే ద్రావణాన్ని ‘గరళకంఠ ద్రావణం’ అని పిలుస్తున్నారు. ఈ ద్రావణాన్ని పొలం అంతటా పిచికారీ చేస్తే.. చల్లిన 12 రోజుల నుంచి 30 రోజుల్లో కలుపు మొక్కలు ఎండిపోతున్నాయని చెబుతున్నారు. ఈ ద్రావణంలో కలపని మొక్కలకు అంటే.. పంటలకు ఈ ద్రావణం వల్ల ఏమీ నష్టం జరగక పోవడం విశేషం. సీజన్లో రెండుసార్లు ఇలా కలుపు మొక్కల బూడిద నీటిని చల్లితే కలుపు తీయాల్సిన లేదా కలుపు మందులు చల్లాల్సిన అవసరమే ఉండదని ఈ రైతులు నొక్కి చెబుతున్నారు. ఇది తాము కనిపెట్టిన పద్ధతి కాదని, 6వ శతాబ్దం నాటి ‘వృక్షాయుర్వేదం’లో పేర్కొన్నదేనంటున్నారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి, భూసారానికి హాని కలిగించని ‘కలుపుతోనే కలుపును నిర్మూలించే పద్ధతి’పై రైతుల అనుభవాలు వారి మాటల్లోనే.. ‘సాగుబడి’ పాఠకుల కోసం..! ఇరవై రోజుల్లో కలుపు మాడిపోతుంది! నా పేరు మర్కంటి దత్తాద్రి (దత్తు). ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ఎన్.ఐ.ఆర్.డి. ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లి సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇచ్చి వస్తూనే.. నా వ్యవసాయం నేను చేసుకుంటున్నాను. ఈ ఏడాది పత్తి చేనులో కలుపు బాగా పెరిగింది. వృక్షాయుర్వేదంలో చెప్పినట్టు ఆచరించి ఫలితాలు పొంది సీనియర్ రైతులు మేకా రాధాకృష్ణమూర్తి, కొక్కు అశోక్ కుమార్ సూచించిన విధంగా నేను కలుపు మొక్కల బూడిద ద్రావణంతో నా ఎకరం పత్తి చేనులో కలుపును విజయవంతంగా నిర్మూలించుకుంటున్నాను. జూలై 15న ఈ ద్రావణాన్ని పత్తి పంటలో పిచికారీ చేశాను. నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి. అలాగే జూలై 15వ తేదీన పిచికారీ చేశాను. ఫలితాలు చాలా బాగున్నాయి. గడ్డి జాతి కలుపు మొక్కలు తొందరగా మాడిపోతున్నాయి. వెడల్పు ఆకులు/ వేరు వ్యవస్థ బలంగా ఉన్న మొక్కలు కొంచెం నెమ్మదిగా చనిపోతున్నాయి. మామూలుగా గరిక పీకినా రాదు. ఈ ద్రావణం చల్లిన ఆరో రోజు తర్వాత పట్టుకొని పీకగానే వస్తుంది. అప్పటికే దాని వేరు వ్యవస్థ మాడిపోయి ఉంది. 8–12 రోజుల నుంచి మొండి జాతుల కలుపు మొక్కలు చనిపోతాయి. కలుపు మొక్కల బూడిద ద్రావణం తయారీ ఇలా.. ఎకరం పత్తి చేను కోసం నేను ద్రావణం తయారు చేసుకున్న విధానం ఇది.. గరిక, బెండలం, వయ్యారిభామ, గూనుగ అనే నాలుగు రకాల కలుపు మొక్కలను.. రకానికి కిలో చొప్పున వేర్లు, దుంపలతో సహా పచ్చి మొక్కలను పీకి, మట్టిని కడిగేయాలి. నీటి తడి ఆరిపోయే వరకు కొద్దిసేపు ఆరబెట్టి.. ముక్కలు చేసి.. పెనం మీద వేసి.. బూడిద చేశాను. ఇలా తయారు చేసిన బూడిద 200 గ్రాములు, చక్కెర 200 గ్రాములు, లీటరు ఆవు పాలు కలిపితే.. నల్లటి ద్రావణం తయారవుతుంది. దీన్ని రెండు రోజులు బాగా, అనేకసార్లు కలియదిప్పాలి. మిక్సీలో పోసి.. తిప్పాలి. లేదా కవ్వంతో బాగా గిలకొట్టాలి. మూడో రోజు ఈ ద్రావణాన్ని.. ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల నీటిలో ఈ ద్రావణాన్ని కలిపి.. 2 రోజులు బాగా కలియబెడుతూ మురగబెట్టాలి. నీరు నీలి రంగుకు మారుతుంది. 3వ రోజు ఈ నీటిని నేరుగా కలుపుతో నిండిన పొలంలో పవర్ స్ప్రేయర్‌తో కలుపు మొక్కలు నిలువెల్లా బాగా తడిచి వేర్లలోకి కూడా ద్రావణం నీరు చేరేలా పిచికారీ చేయాలి. దీన్ని పిచికారీ చేసేటప్పుడు కచ్చితంగా భూమిలో తేమ ఉండాలి. తేమ లేనప్పుడు పిచికారీ చేస్తే దీని ప్రభావం ఉండదు. పంట కాలంలో రెండు సార్లు పిచికారీ చేసుకుంటే.. ఏయే రకాల కలుపు మొక్కలను పీకి మసి చేసి ద్రావణం తయారు చేసి వాడామో.. ఆయా రకాల కలుపు జాతుల నిర్మూలన అవుతుంది. ఇంకా మిగిలిన రకాలేమైనా ఉంటే.. వాటితో మరోసారి ద్రావణం తయారు చేసి చల్లితే.. అవి కూడా పోతాయి. ఆ భూమిలో పంటలకు ఎటువంటి హానీ ఉండదు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రధాన, అంతర పంటల మొక్కలను ఈ ద్రావణంలో వాడకూడదు. ఒక్కోసారి కలుపు మొక్కల విత్తనాలు గాలికి కొట్టుకు వచ్చి పడినప్పుడు, ఆ రకాల కలుపు మళ్లీ మొలవొచ్చు. అలాంటప్పుడు మరోసారి ద్రావణం తయారు చేసి వాడాలి. ప్రమాదకరమైన రసాయనిక కలుపు మందులు చల్లకుండానే కలుపు సమస్య నుంచి ఈ గరళకంఠ ద్రావణంతో నిస్సందేహంగా బయటపడొచ్చు. ఇది నా అనుభవం. ఒకసారి ఏవైనా తప్పులు జరిగితే, ఫలితాలు పూర్తిగా రావు.. అలాంటప్పుడు మళ్లీ ప్రయత్నించండి. చల్లిన తర్వాత ఫలితాలు పూర్తిగా కంటికి కనపడాలంటే.. కనీసం 20 రోజులు వేచి ఉండాలి. గరళకంఠ ద్రావణంతో కలుపు నిర్మూలన అద్భుతంగా జరుగుతుంది. లేత కలుపు మొక్కలను త్వరగా నిర్మూలించవచ్చు. ముదిరిన కలుపు మొక్కల నిర్మూలనకు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. బాగా ముదిరి విత్తనం వచ్చిన కలుపు మొక్కల నిర్మూలన కష్టం. – మర్కంటి దత్తాద్రి (దత్తు) (80084 84100), సేంద్రియ పత్తి రైతు, విఠోలి, ముదోల్ మండలం, నిర్మల్ జిల్లా (ఫొటోలు: బాతూరి కైలాష్, సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్) వయ్యారి భామ, తుంగ, గరిక నిర్మూలన! ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అరెకరంలో ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ.. కలుపు నిర్మూలనకు గరళకంఠ ద్రావణం పిచికారీ చేశాను. ఏ కలుపు రకాలను తీసుకొని, బూడిద చేసి చల్లానో ఆ రకాల కలుపు మొక్కలన్నీ నూటికి నూరు శాతం చనిపోయాయి. తుంగ, గరికతోపాటు వయ్యారిభామ కూడా చనిపోయాయి. అయితే, కలుపు మొక్కలను పీకి బూడిద చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పంటకు సంబంధించిన మొక్కలు కలవకుండా చూసుకోవాలి. అవి కూడా కలిస్తే ఈ ద్రావణం చల్లినప్పుడు పంట కూడా చనిపోతుంది. పిచికారీ చేసిన 48 గంటలు దాటాక.. వేర్ల దగ్గర నుంచి ప్రభావం కనిపించింది. కలుపు ఎదుగుదల అప్పటి నుంచే ఆగిపోయింది. 20–30 రోజుల్లో కలుపు మొక్కలు చనిపోయాయి. ఆ పంట కాలంలో ఆ కలుపు మళ్లీ పుట్టదు. – తుపాకుల భూమయ్య (96767 18709), జూలపల్లి, పెద్దపల్లి జిల్లా చిన్న, పెద్ద రైతులెవరైనా అనుసరించవచ్చు! కలుపు మొక్కలతో తయారు చేసిన గరళకంఠ ద్రావణంతో ప్రధాన పంట మొక్కలకు ఎటువంటి హానీ జరగదు. కలుపు మొక్కలు వేర్ల నుంచి మురిగిపోతాయి. కొద్ది రోజుల్లోనే పెరుగుదల ఆగిపోయి.. కలుపు మొక్కలు ముట్టుకుంటే ఊడిపోతాయి. తర్వాత కొద్ది రోజులకు ఎండిపోతాయి. ఎన్ని ఎకరాలకైనా బెల్లం వండే బాండీల్లో/పాత్రల్లో ఒకేసారి భారీ ఎత్తున కలుపు బూడిదను తయారు చేసుకొని.. దానితో ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది చిన్న, పెద్ద రైతులు ఎవరైనా ఆచరించదగిన ఖర్చులేని, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని లేని కలుపు నిర్మూలన పద్ధతి అని అందరూ గుర్తించాలి. కలుపు మొక్కల బూడిదను ఎప్పటికప్పుడు వాడుకోవాలన్న నియమం ఏమీ లేదు. ఈ బూడిదను నిల్వ చేసుకొని.. ఆ తర్వాతయినా వాడుకోవచ్చు. – కొక్కు అశోక్‌కుమార్ (98661 92761), సేంద్రియ రైతు, జగిత్యాల తుంగ వేర్లు 3 రోజుల్లో మాడిపోతాయి! 2011 నుంచి ప్రకృతి వ్యవసాయంలో వరి, తదితర పంటలు పండిస్తున్నాను. వరిలో తుంగ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. వృక్షాయుర్వేదంలో చెప్పిన ప్రకారం.. కలుపును కలుపుతోనే నిర్మూలించడం సాధ్యమేనని అనుభవపూర్వకంగా మేం తెలుసుకున్నాం. తుంగ, గరిక వంటి కలుపును సమర్థవంతంగా నిర్మూలించాను. కిలో తుంగ గడ్డలతో సహా వేర్లు, మొక్కలు మొత్తం పీకి.. వేర్ల మట్టిని కడిగి.. పెనం మీద కాల్చి బూడిద చేయాలి. 100 గ్రా. కలుపు మొక్కల బూడిద, 100 గ్రా. పంచదార, అర లీటరు నాటావు పాలు కలిపి.. రెండు రోజులు తరచూ కలియదిప్పుతూ ఉండాలి. 2 రోజుల తర్వాత ఆ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి మరో రెండు రోజులు పులియబెట్టాలి. తరచూ కలియదిప్పుతూ ఉండాలి. మూడో రోజున ఆ ద్రావణాన్ని వరి పొలంలో అంతటా పిచికారీ చేయాలి. ఈ ద్రావణం కలుపును దుంపను నాశనం చేస్తుంది. మొదట దుంపను, వేర్లను ఎండిపోయేలా చేస్తుంది. క్రమంగా మొక్క కాండం, ఆకులు కూడా ఎండిపోతాయి. తుంగ మొక్కను పట్టుకొని పీకితే తేలిగ్గా రాదు. నేను ద్రావణం చల్లిన తర్వాత మూడో రోజు తుంగ మొక్కను పట్టుకుంటే చాలు ఊడి వస్తుంది. దుంప, వేర్లు మాడిపోయాయి. ఇలా నిర్మూలించిన తర్వాత మా పొలంలో మళ్లీ ఇంత వరకు తుంగ రాలేదు. వరి మొక్కలకు ఎటువంటి హానీ జరగలేదు. గరికను పెనం మీద మాడ్చి ద్రావణం తయారు చేసి చల్లితే 10 రోజులకు వడపడింది. పీకి చూస్తే వేరు ఎండిపోయింది. సాధారణంగా రసాయనిక కలుపు మందులు పిచికారీ చేసిన తర్వాత 48 గంటల్లో మొదట ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు.. పై నుంచి కిందకు ఎండిపోతాయి. ఈ ద్రావణం చల్లితే ఇందుకు భిన్నంగా.. మొదట వేర్లు, గడ్డలు, కాండం, కొమ్మలు, ఆకులు చివరగా ఎండుతాయి. అయితే, భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు నిర్మూలన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చల్లిన ద్రావణం వేరు ద్వారా కిందికి దిగాలంటే భూమిలో పదును ఉండాలి. అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రైతులంతా రసాయనిక కలుపు మందులు వాడి భూములను నాశనం చేసుకోకుండా, స్వల్ప ఖర్చుతో ఈ ద్రావణం తయారు చేసుకొని వాడుతూ కలుపు నిర్మూలన చేసుకుంటున్నారు. – మేకా రాధాకృష్ణమూర్తి (84669 23952), మంత్రిపాలెం, నగరం మండలం, గుంటూరు జిల్లా. -
నయా ఏసీలతో భలే మేలు..!
ఈ రోజుల్లో ఇళ్లల్లో.. షాపింగ్‌మాల్స్‌లో.. రెస్టారెంట్లలో.. ఎక్కడకు వెళ్లినా ఏసీలు తప్పనిసరి! చల్లదనం మాటెలా ఉన్నా.. వీటిల్లో వాడే రసాయనాల పుణ్యమా అని.. పర్యావరణానికి కలుగుతున్న నష్టం ఇంతింత కాదు! మరి తరుణోపాయం..? కార్బన్ డయాక్సైడ్ అంటోంది ఐఐటీ మద్రాస్! పర్యావరణ కాలుష్యానికి విరుగుడుగా కార్బన్ డయాక్సైడ్ వాడకం ఎలాగో తెలుసుకునే ముందు కొన్ని విషయాలను అర్థం చేసుకోవా ల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం రిఫ్రిజరేటర్లు, భారీస్థాయి ఏసీల్లోనూ హైడ్రోఫ్లోరో కార్బన్స్ (హెచ్ఎఫ్సీ) అనే శీతలీకరణ రసాయనాలను వాడుతున్నాం. ఓజోన్ పొరకు నష్టం కలుగుతోందన్న కారణంతో ఒకప్పుడు వాడిన క్లోరోఫ్లోరో కార్బన్స్ స్థానంలో ఈ కొత్త రసాయనాలు వచ్చాయి. మొదట్లో అంతా బాగుందని అనుకున్నా.. ఈ హెచ్ఎఫ్సీలు కార్బన్ డయాక్సైడ్ కంటే కొన్ని వందల, వేల రెట్లు ఎక్కువ ప్రమాదకరమని పరిశోధనల ద్వారా స్పష్టమైంది. వాతావరణంలోకి చేరే కార్బన్ డయాక్సైడ్ సహజసిద్ధంగా నాశనమయ్యేందుకు వంద సంవత్సరాలు పడుతుందని అనుకుంటే.. హెచ్ఎఫ్సీలు కొన్ని వేల సంవత్సరాలు అలాగే ఉండిపోతాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2100 నాటికి ఒక్క హెచ్ఎఫ్సీల కారణంగానే భూమి ఉష్ణోగ్రత 0.5 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరుగుతుందని అంచనా. సమస్య ఇంత తీవ్రంగా ఉన్న కారణంగానే ఈ హెచ్ఎఫ్సీల వాడకాన్ని 2050 నాటికల్లా కనీసం 90 శాతం తగ్గించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. ఇందుకు తగ్గట్టుగానే హెచ్ఎఫ్సీలకు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలూ ఊపందుకున్నాయి. ఇప్పటికే కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేసినప్పటికీ లోటుపాట్లు ఎక్కువగా ఉన్న కారణంగా అవేవీ విస్తృతంగా వాడకంలోకి రాలేదు. గతంలో వాడిందే మళ్లీ.... రిఫ్రిజిరేటర్లలో శీతలీకరణ కోసం ఒకప్పుడు కార్బన్ డయాక్సైడ్నే వాడేవారు. అయితే అధిక ఒత్తిడికి గురిచేసి వాడాల్సి ఉండటం.. మరమ్మతుల సమయంలో ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. 19వ శతాబ్దపు చివరినాటికి కృత్రిమంగా తయారు చేసిన క్లోరో ఫ్లోరో కార్బన్స్ వాడకం మొదలైంది. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్‌లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం శాస్త్రవేత్త ప్రకాశ్ మయ్యా కార్బన్ డయాక్సైడ్ రిఫ్రిజరేషన్పై ప్రయోగాలు మొదలుపెట్టారు. నార్వే సంస్థతో కలసి చేపట్టిన ఈ ప్రయోగాల ఫలితంగా ఓ నమూనా రిఫ్రిజరేటర్ సిద్ధమైంది. రెండు ప్రయోజనాలు... కార్బన్ డయాక్సైడ్ శీతలీకరణ రసాయనంగా వాడే ఏసీల వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. భవనాల్లోపలి భాగాలకు చల్లదనం అందించడం ఒక ప్రయోజనమైతే.. ఈ క్రమంలో వెలువడే వేడిని కూడా ఒడిసిపట్టుకోగలగడం రెండోది. ఆసుపత్రులతోపాటు కొన్ని ఇతర చోట్ల ఒకపక్క చల్లదనం పొందుతూనే ఇంకోపక్క వేడినీటిని సిద్ధం చేసుకోవచ్చునన్నమాట. థర్మల్ పవర్ స్టేషన్లు మొదలుకొని చాలా ఫ్యాక్టరీల ద్వారా వెలువడే కార్బన్ డయాౖక్సైడ్ను అక్కడికక్కడే సేకరించి శీతలీకరణ కోసం వాడుకోవచ్చు కాబట్టి ఈ కొత్త ఏసీలకయ్యే ఖర్చు చాలా తక్కువగానే ఉంటుందని అన్నారు. స్పెయిన్‌లోని వెలంసియాలో ఇటీవల జరిగిన ఒక సదస్సులో ఈ కొత్త టెక్నాలజీకి మంచి ఆదరణ లభించింది. ఆ సదస్సులో పాల్గొన్న ప్రకాశ్ మయ్యా మాట్లాడుతూ ‘‘పర్యావరణ అనుకూల శీతలీకరణ రసాయనాల తయారీకి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తోంది. సూపర్ మార్కెట్లు, ఆసుపత్రుల్లోనూ తక్కువ ఖర్చుతో చల్లదనాన్ని కల్పించేందుకు అనువైన టెక్నాలజీ ఇది’’అని అన్నారు. విద్యుత్ వినియోగంలో 20 శాతం తగ్గుదల సాధారణ ఏసీలతో పోలిస్తే 20 శాతం తక్కువ విద్యుత్తును వాడుకుంటూనే ఈ నమూనా ఏసీ ఎక్కువ చల్లదనాన్ని కూడా అందిస్తుందని, ఏడాదిగా తాము దీన్ని విజయవంతంగా నడుపుతున్నామని ప్రకాశ్ మయ్యా బృందంలోని శాస్త్రవేత్త సిమర్‌ప్రీత్ సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. యూరప్‌లోనూ కార్బన్ డయాక్సైడ్ సాయంతో పనిచేసే ఏసీలు ఉన్నప్పటికీ అధిక ఉష్ణోగ్రత ఉన్న వాతావరణాల్లో అవి పనిచేయవని చెప్పారు. తాము తయారు చేసిన నమూనా మాత్రం 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న పరిస్థితుల్లోనూ చక్కగా పనిచేసిందని.. పరిసరాలను చల్లబరిచిందని వివరించారు. అయితే ప్రస్తుతానికి పది టన్నులు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యమున్న ఏసీలతోనే వాడాల్సి ఉంటుందని.. వ్యక్తిగత స్థాయిలో తయారీకి మరికొంత కాలం పడుతుందని వివరించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చేపలు కొంటున్నారా.. ఇది చదవండి!
నాన్‌వెజ్ ప్రియులకు ఇప్పుడు ఫార్మలిన్ భయం పట్టుకుంది. చేపలను ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు హానికారక ఫార్మలిన్‌ను వాడుతున్నారనే వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీంతో చేపలంటేనే వినియోగదారులు భయపడిపోతున్నారు. దేశ వ్యాప్తంగా భయాందోళనలు ఏపీ, కేరళ నుంచి వస్తున్న చేపలు త్వరగా పాడైపోకుండా వాటిని తాజాగా ఉంచేందుకు ఫార్మలిన్ పూస్తున్నారనే అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గోవా అసెంబ్లీని సైతం ఈ అంశం కుదిపేసింది. దీంతో కేరళ, ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి చేపల దిగుమతిని 15 రోజుల పాటు నిలిపివేస్తు గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేరళలోనూ పలు ఆంక్షలు విధించారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న చేపలను చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేస్తున్నారు. తాజాగా ఫార్మలిన్ అవశేషాలు ఉన్నాయంటూ ఏపీ నుంచి వెళ్లిన ఆరు వేల కేజీల చేపలను డంప్‌యార్డుకు పంపేశారు. ఫార్మలిన్ భయంతో తాజా(బతికివున్న) చేపలనే కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఏమిటీ ఫార్మలిన్ మనుషుల మృతదేహాలను దీర్ఘకాలం పదిల పరిచేందుకు వినియోగించే రసాయనం ఫార్మాలిన్. ఈ రసాయనం ప్రయోగించడంతో మృతదేహాలు త్వరగా కుళ్లిపోకుండా ఉంటాయి. ఇలా చేయడంతో వారాల తరబడి చేపలు తాజాగా ఉంటాయి. ఫార్మాలిన్ ప్రయోగించిన చేపలు సాధారణ చేపల కంటే గట్టిగా ఉంటాయి. దీనిపై పొలుసు సాధారణ చేపల కంటే రాటుదేలి ఉంటుంది. ఫార్మాలిన్ రసాయనం ప్రయోగంతో చేపమొప్పలు ఎర్రగా నిగనిగలాడతాయి. ఈ చేపల్ని వండే సమయంలో భిన్నమైన వాసన వస్తుంది. ఫార్మలిన్ మానవ శరీరంలో చొరబడితే కేన్సర్ సంభవించే ఆస్కారం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. కడుపులో నొప్పి, వాంతులు అయి ఒక్కోసారి కోమాలోకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కిట్‌తో పరీక్ష ఇలా.. చేపలు తాజావా కావా? వాటిలో ఏమైనా విషపూరిత రసాయనాలు ఉన్నాయా? అనేవి చాలా సులభంగా తెలుసుకోవచ్చంటోంది... సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సీఐఎఫ్టీ) డిపార్ట్మెంట్. వినియోగదారులు సులభంగా పరీక్షించి చేపల తాజాదనాన్ని, అందులో ఫార్మలిన్ అవశేషాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు వీలుగా ఐసీఏఆర్సీఐఎఫ్టీ ఈ కిట్‌ను రూపొందించాయి. ఇందులో 25 స్ట్రిప్‌లు ఉంటాయి. కెమికల్ పూసిన ఈస్ట్రిప్లను చేపలపై మూడు నాలుగు సార్లు రుద్దాలి. ఈ స్ట్రిప్‌పై ఉన్న పేపర్‌పై డ్రాపర్ సహాయంతో కిట్‌లో ఉన్న సొల్యూషన్‌ను వేయాలి. లేత పసుపు రంగు కలర్లోకి పేపర్ మారుతోంది. తక్కువ మోతాదులో ఫార్మలిన్ ఉంటే లేత ఆకుపచ్చ రంగులోకి మారుతోంది. ఎక్కువ మోతాదులో ఉంటే ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. రెండు నిమిషాల వ్యవధిలోనే ఈ రంగులను గుర్తించవచ్చు. ప్రతీ కిట్‌లోనూ ఓ కలర్ కార్డు ఉంటుంది. ఒక్కో టెస్టుకు సుమారు రెండు రూపాయలు ఖర్చవుతుంది. ఇప్పటికే ఈ కిట్లను కేరళలోని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నామని, జులై 29 నుంచి వీటిని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇలా చేయాలి.. చేపలను నీటితో పరిశుభ్రంగా కడగాలి. కుళాయి కింద చేపలు ఉంచి నీటిని వదిలి శుభ్రం చేయాలి... నీటితో కడిగినా చెడువాసన వస్తుంటే అవి తాజా చేపలు కాదని గుర్తించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. అలాగే 75 డిగ్రీల సెంటీ గ్రేడ్ వద్ద కూరను ఉడికించాలి. ఇలా చేయడం ద్వారా కొంత వరకు విషపూరిత రసాయనాలను కొంత వరకు తగ్గించవచ్చు. -
ఇవి తింటే.. రోగాలు వెంటే..
ఆసిఫాబాద్‌క్రైం : ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ మొదలైం ది. చూడగానే నీళ్లూరించే మామిడి పండ్లను ఎం త ధర ఉన్నా కొనేందుకు జనం మొగ్గుచూపుతా రు. కాని వీటి వెనుక దాగి ఉన్న పచ్చి మోసాన్ని మాత్రం పసిగట్టలేక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. సంపాదనే ధ్యేయంగా వ్యాపారులు మార్కెట్లోకి వచ్చే పచ్చి కాయలను కృత్రి మంగా మాగబెడుతున్నారు. కాల్షియం కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను వినియోగించి ఒక్కరోజులోనే కాయల రంగు, రుచి మార్చేస్తున్నారు. జిల్లాలో 750 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ సారి ఈదురుగాలులు అధికంగా రావడంతో కాయలు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో జిల్లాలో మామిడి కాయలు దొరకక ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాలో సుమారు 15 వరకు మామిడి పండ్ల గోదాములు ఉండగా వివిధ రకాల కాయలను అందులో నిల్వ చేస్తూ నిషేధిత రసాయనాలతో మాగపెట్టి పండ్లుగా మారుస్తున్నారు. ప్రధానంగా మామిడి సీజన్లో ఈ దందా జోరుగా నడుస్తున్నా అధికార యం త్రాంగం చోద్యం చూస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రికి రాత్రే పండుతున్నాయి మార్కెట్లో సీజనల్ పండ్లకు డిమాండ్ బాగా పెరిగింది. కాయలను సహజసిద్ధమైన పద్ధతుల్లో మాగబెట్టి పండ్లుగా మార్చే వరకు వినియోగదారులు, వ్యాపారులు ఓపిక పట్టే పరిస్థితి లేదు. దీంతో నిషేధితమైనా విషపూరిత కార్బైడ్, ఇథిలిన్ వంటి రసాయనాలను వినియెగించి రాత్రికి రాత్రే పండ్లుగా మార్చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి రసాయనాలను ఉపయోగించి పండించిన పండ్లు తినడం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండు సహజ సిద్ధంగా పక్వానికి వచ్చినపుడు తింటే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రమాదకర రసాయనాలు వినియోగించిన పండ్లు తినడం ద్వారా అజీర్తి, కడుపు నొప్పి, దురద, జీర్ణాశయం దెబ్బతింటుదని వైద్యులు చెబుతున్నారు. కొత్త పంథాను ఎంచుకున్న వ్యాపారులు జిల్లాలోని కొన్ని గోదాముల్లో కాయలను పండించేందుకు వ్యాపారులు సరికొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. కొత్తగా స్ప్రే ద్వారా మామిడి పండ్లపై రసాయనాలు చల్లుతున్నారు. గోదాముల్లో కాకుండా ఇళ్లలో మగ్గించి అవి పండిన తర్వాత గోదాములకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. జిల్లాలో ఎక్కడా సహజ సిద్ధమైన పండ్లు లేవనేది జగమెగిరిన సత్యమే అయినా అధికారుల మాత్రం తనిఖీలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ‘మామూళ్ల’ మత్తులో అధికారులు జిల్లాలో పెద్ద మొత్తంలో పండ్లను మగ్గించడం దందా నడుస్తున్నా అధికారులు మాత్రం ఇటువైపు చూడకుండా మూమూళ్ల మత్తులో మునిగిపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు నిదర్శనం జిల్లాలోని ఒక్క గోదాముల్లో కూడా ఇప్పటి వరకు తనిఖీలు చేయకపోవడమే. పదిహేను, నెల రోజులకు ఒకసారి అధికారులు వ్యాపారుల వద్దకు వచ్చి చేతులు తడుపుకుంటున్నట్లు సమాచారం. కృత్రిమంగా పండించిన పండ్లు ఇలా ఉంటాయి.. æ కృత్రిమంగా పండించిన పండ్లు చూడగానే ఆకట్టుకుంటాయి. æ సహజ పండ్లకు, కృత్రిమ పండ్లకు రుచిలో తేడా ఉంటుంది. æ మామిడి పండ్లు పండినా రుచి పుల్లగా ఉంటే రసాయనాలు వినియోగించినట్లుగా గుర్తించాలి. æ అరటి పండ్లు సైతం పైన పసుపు రంగులో ఉండి లోపల మగ్గకపోగా రుచిలో కూడా తేడా ఉంటుంది. æ ఈ పండ్లను పరిశీలిస్తే తెల్లటి మిశ్రమం ఉంటుంది. æ నీటిలో వేస్తే రంగు మారుతుంటుంది. -
బియాస్ నదిలో భారీగా చేపల మృత్యువాత
-
బియాస్ నదిలో ఘోరం
ధర్మశాల, హిమాచల్‌ప్రదేశ్ : బియాస్ నదిలో జీవజాలం భారీగా మృత్యువాత పడింది. నీటి కాలుష్యం వల్లే ఈ దుర్ఘటన సంభవించినట్లు తెలుస్తోంది. నది పరివాహక ప్రాంతంలోని ఓ చక్కెర ఫ్యాక్టరీ నుంచి విడుదలైన రసాయనాలు నీటిలో కలవడం వల్ల ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. గురుదాస్ పూర్ జిల్లాలోని కిరి అఫ్‌గనా గ్రామానికి చేరువలో గల చధా షుగర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి విడుదలైన రసాయనాలు బియాస్ నదిలో నీటిలో కలిశాయి. దీనిపై స్పందించిన కంపెనీ యాజమాన్యం ప్రమాదవశాత్తు రసాయనాలు నీటిలో కలిశాయని పేర్కొంది. నది పరివాహక ప్రాంతంలో నివసించే వారు నీరు ఎరుపు రంగులోకి మారడం చూసి షాక్‌కు గురయ్యారు. వేల సంఖ్యలో చేపలు, జలచరాలు మరణించి తేలుతూ ఒడ్డుకు కొట్టుకురావడాన్ని గమనించి అధికారులకు సమాచారం చేరవేశారు. ముఖ్యంగా అమృతసర్, తరణ్, కపుర్తలా జిల్లాల్లో జలచరాలు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. షుగర్ ఫ్యాక్టరీలో మొలాసిస్ తయారుచేసే బాయిలర్ పేలుడు వల్ల రసాయనాలు నది నీటిలో కలిసినట్లు అమృతసర్ డిప్యూటీ కమిషనర్ కమల్‌దీప్ సింగ్ సంఘా వెల్లడించారు. రసాయనాల కలయికతో నీటిలో కరిగే ఆక్సిజన్ శాతం తగ్గిపోయి జలచరాలు మరణించాయని పేర్కొన్నారు. నదిలో కలుషితమైన నీటిని తొలగించేంతవరకూ ప్రజలు నీటిని వినియోగించొచ్చదని కోరారు. -
ఫుడ్ ఫ్యాక్ట్స్
పంచదారను అధికంగా తీసుకోకూడదు. మనం తీసుకునే పదార్థాలలో ఏ పదార్థంలోనూ లేనన్ని కెమికల్స్ ఒక్క పంచదారలోనే అధికంగా ఉన్నాయని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. పంచదార బదులు బెల్లం వాడటం మంచిది. పంచదారను అధికంగా తీసుకుంటే... ♦ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి, గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది ♦ శరీర బరువు పెరిగి, లావుగా అయిపోతారు ♦ బ్లడ్ ప్రెషర్ వచ్చి, బ్రెయిన్‌కి నష్టం కలిగించే బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి ♦ పంచదారలో ఉండే సుక్రోజు శరీరంలో జీర్ణం కాదు ♦ పంచదారలో దాదాపు 23 రకాల హానికారక కెమికల్స్ ఉంటాయి. ♦ డయాబెటిస్ రావడానికి ముఖ్య కారణం పంచదార. ♦ శరీరంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్‌ని అమాంతం పెంచేస్తాయి. ♦ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. -
ఉత్తుంగ తరంగ గంగ
తన పితరులకు మోక్షం కలిగించడం కోసం భగీరథుడనే మహారాజు ఎన్నో ప్రయత్నాలు చేసి, దివినున్న గంగను భువికి రప్పించాడు. అయితే, అలా కిందికి వచ్చే క్రమంలో గంగ తన మార్గంలో వున్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని తన ఉత్తుంగ తరంగాలతో ముంచెత్తింది. కుపితుడైన జహ్నుమహర్షి తన ఆశ్రమాన్ని ధ్వంసం చేసిన గంగానదిని తన యోగశక్తితో ఔపోసన పట్టాడు. మహర్షి ద్వారా జరిగింది తెలుసుకున్న భగీరథుడు గంగను విడువమని పరిపరి విధాలా ప్రార్థించాడు. మహర్షి గంగను తన కుడిచెవి నుండి విడిచిపెట్టాడు. జహ్నుమహర్షి నుండి ఉద్భవించినది కాబట్టి గంగ జాహ్నవి అయింది. గంగ భగీరథుని అనుసరించి పాతాళలోకం చేరి అతని పూర్వీకుల భస్మరాశులపై ప్రవహించి వారికి ఉత్తమగతులను ప్రసాదించింది. గంగను భువికి రప్పించే క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, వెనక్కు తగ్గకుండా, ఏమాత్రం చలించకుండా తన ప్రయత్నంలో సఫలీకృతుడైన భగీరథుడి పేరు ప్రయత్న రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. పవిత్రమైన గంగలో మునిగితే ఎంతటి పాపమైనా తొలగిపోతుందన్నది ప్రగాఢ విశ్వాసం. అయితే, అంతటి పవిత్రమైన గంగను కూడా కలుషితం చేసి, నిర్మలమైన గంగాజలాలను విషపూరితం చేసేస్తున్నాయి పరిశ్రమల వ్యర్థాలు, కర్మాగారాల నుంచి వెలువడే విషరసాయనాలు. దాంతో గంగలో స్నానం చేస్తే సంక్రమించే పుణ్యం సంగతి ఎలా ఉన్నా, చర్మవ్యాధులు సంక్రమిస్తాయేమోనని భయపడ వలసి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే గంగాప్రక్షాళన జరగాలి. అందుకు చిత్తశుద్థితో చెత్తశుద్ధి జరగాలి. గంగ అంటే నదే కాదు, నీరు కూడా. నీటితో మనం శుభ్రపరచుకోవడమే కాదు, నీటిని కలుషితం చేయడం మానాలి. నీళ్ల సీసాలు, చెత్తాచెదారాన్ని నీళ్లలో పడేయడం మానాలి. గంగాప్రక్షాళన్ పేరుతో ప్రధాని ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ప్రధానమైన మార్పు రావలసింది ముందుగా మనలోనే. – డి.వి.ఆర్. -
ప్రొటీన్ పౌడర్లతో జాగ్రత్త!
శక్తి కోసం, కండలు పెంచుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రొటీన్ పౌడర్లు వాడుతున్నారు. కండపుష్టి కోసం సహజసిద్ధమైన ఆహారపదార్థాలే మేలైనవని, ప్రొటీన్ పౌడర్లు సహజమైన ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయం కాలేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, వివిధ బ్రాండ్ల పేర్లతో ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ప్రొటీన్ పౌడర్లలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియం వంటి ప్రమాదకరమైన భార లోహాలు ఉంటున్నాయని హెచ్చరిస్తున్నారు. ప్రొటీన్ పౌడర్లు వాడటం వల్ల కండపుష్టి సమకూరడం సంగతి అలా ఉంచితే, వాటిలో మోతాదుకు మించి ఉంటున్న భార లోహాల వల్ల తలెత్తే దుష్పరిణామాలు దీర్ఘకాలంలో చాలా తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రొటీన్ పౌడర్లలో సీసం, ఆర్సెనిక్ వంటి భార లోహాలతో పాటు పురుగుమందులు తదితర 130 రకాల ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నట్లు అమెరికాలోని ‘క్లీన్ లేబుల్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన పరీక్షల్లో తేలింది. -
మంజీరా కాలుష్య ధార
పారిశ్రామిక జలాలను శుద్ధి చేయకుండానే విడుదల చేస్తుండడంతో మంజీర నది కాలుష్య కాసారంగా మారుతోంది. మంజీర పరీవాహక ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, వాటి నుంచి వెలువడే కాలుష్యాన్ని మాత్రం అరికట్టలేక పోతోంది. తరచూ తనిఖీలు నిర్వహిస్తూ, నీటి నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. మంజీర పరిసర గ్రామాల్లో మాత్రం పశు, మత్స్య సంపదతో పాటు పచ్చని పొలాలు కాలుష్య భూతం బారిన పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. -- సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండల్లో పుడుతున్న మంజీర కర్ణాటక మీదుగా సంగారెడ్డి జిల్లా మనూరు మండలం గౌడ్గావ్ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది. మంజీర ప్రవహించే మార్గంలో కాలుష్య వ్యర్థాలు వచ్చి చేరుతుండడంతో నదీ జలాలు హానికరంగా మారుతున్నాయి. మహారాష్ట్రలో థేర్నా వాగు ద్వారా ఉస్మానాబాద్, లాతూరు ప్రాంతాల పారిశ్రామిక వ్యర్థాలు మంజీరాలోకి చేరుతున్నాయి. కర్ణాటకలోని బీదర్ పరిసరాల్లోని చక్కెర కర్మాగారాలు సైతం మంజీరలోకి వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత హుగెల్లి చక్కెర కర్మాగారాం, దిగ్వాల్ ఔషధ కంపెనీల రసాయన వ్యర్థాలు చిల్కపల్లి చెరువు మీదుగా సింగూరు ఎగువన మంజీరలోకి చేరుతున్నాయి. గంగకత్వ పరీవాహక ప్రాంతంలో ఉన్న పలు రసాయన కంపెనీల ద్వారా కూడా నది కలుషితమవుతోంది. మంజీర బ్యారేజీ దిగువన చక్కెర, బీరు కర్మాగారం నుంచి వెలువడే కాలుష్య జలాలు నిశ్శబ్దంగా మంజీరా ప్రవాహంలో కలిసిపోతున్నాయి. వందల సంఖ్యలో రసాయన, బల్క్‌డ్రగ్ పరిశ్రమలు కలిగిన పటాన్చెరు, పాశమైలారం, గడ్డపోతారం పారిశ్రామిక వాడల నుంచి విడుదలవుతున్న విషపూరిత రసాయనలు నక్కవాగు ద్వారా మంజీరలో కలుస్తున్నాయి. ఫార్మా, పెట్రో కెమికల్, రంగులు, అద్దకం, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం నేరుగా భూ గర్భంలోకి వెళ్లి స్థానికంగా పశు, మత్స్య సంపదతో పాటు పచ్చని పొలాలు, మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మిషన్ భగీరథ పథకంతో పాటు సింగూరు, ఘణపురం, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు కూడా ఇస్తుండడంతో కాలుష్య ప్రభావం విస్తరించే అవకాశం ఉంది. విషం చిమ్ముతున్న నక్కవాగు.. పటాన్చెరు, గడ్డపోతారం, పాశమైలారం పారిశ్రామిక వాడల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు ఉసికెవాగు నుంచి నక్కవాగులోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట శివారు గౌడిచర్ల వద్ద మంజీరలోకి వ్యర్థాలు చేరుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసి వదిలేందుకు పటాన్చెరు ఎన్విరోటెక్ లిమిటెడ్ (పీఈటీఎల్) ఆధ్వర్యంలో కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటు చేశారు. పీఈటీఎల్ పనితీరుపై విమర్శలు రావడంతో 2009లో పటాన్చెరు నుంచి మూసీ ఒడ్డున ఉన్న అంబర్‌పేట ట్రీట్మెంట్ ప్లాంటు వరకు పైప్‌లైన్ వేసి, రసాయన వ్యర్థాలను తరలిస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం పీఈటీఎల్‌కు వ్యర్థాలను నామమాత్రంగా తరలిస్తూ.. అవకాశం చిక్కినప్పుడల్లా వివిధ చెరువుల ద్వారా నక్కవాగులోకి విడుదల చేస్తున్నాయి. ట్యాంకర్ల ద్వారా అక్రమంగా నక్కవాగు, మంజీరలో రసాయన వ్యర్థాలు డంప్ చేస్తున్న ఘటనలు పలుమార్లు వెలుగు చూశాయి. వర్షాకాలంలో విడుదలైన వ్యర్థాలతో గండిగూడెం, గడ్డపోతారం చెరువుల్లో చేపలు మృత్యువాత పడగా, పరిశ్రమల నుంచి రూ.1.30 కోట్ల పరిహారం మత్స్యకారులకు చెల్లించారు. నక్కవాగులో చేరుతున్న వ్యర్థాలతో పరిసర గ్రామాల్లో భూగర్భ జలం కలుషితమవుతోంది. పరిసర గ్రామాలవాసులు తీవ్ర దుర్గంధం పీల్చుకుంటుండగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం మంజీర పరీవాహక ప్రాంతంలో ఉన్న హత్నూర మండలం గుండ్ల మాచునూరులో రసాయన పరిశ్రమలు ప్రత్యేక ఔట్లెట్లు ఏర్పాటు చేసి రసాయన వ్యర్థాలను వదులుతున్నాయి. ఇవి భూగర్భంలోకి చేరుకుని తాగు, సాగునీటిని కాలుష్యం చేస్తున్నాయి. దిగువన ఉన్న మంజీరలోకి కాలుష్య జలాలు చేరుకుంటుండడంతో పరిసర గ్రా మాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొ లా లను నష్టపోతున్నా పరిహారం అందించడంలో అటు అధికారులు, ఇటు పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. – కే.భద్రేశ్, వ్యవస్థాపకుడు, మెదక్ పర్యావరణ పరిరక్షణ సమితి నమూనాలు సేకరిస్తున్నాం నక్కవాగు మంజీరలో కలిసే చోట గౌడిచర్ల, బచ్చుగూడెం తదితర గ్రామాల్లో తరచూ నీటి నమూనాలు సేకరిస్తున్నాం. పుల్కల్ మండలం శివ్వంపేటలోని ఓ బ్రూవరేజెస్ ఫ్యాక్టరీ నదిలోకి కాలుష్య జలాలను వదులుతుందనే ఫిర్యాదులు రావడంతో గతంలో మూసివేతకు నోటీసులు కూడా జారీ చేశాం. దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో తిరిగి తెరిచేందుకు అనుమతులు ఇచ్చాం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహిస్తూ.. కాలుష్యాన్ని కట్టడి చేస్తున్నాం. – భద్రగిరీష్, ఈఈ, టీఎస్‌పీసీబీ, సంగారెడ్డి జిల్లా జన్మస్థానం : బాలాఘాట్ కొండలు (మహారాష్ట్ర) ప్రవహించే మార్గం : మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మంజీర నది పొడవు : 724 కి.మీ పరివాహక ప్రాంతం : 30,844 చ.కి.మీ ప్రధాన ప్రాజెక్టులు : సింగూరు, ఘణపురం, నిజాంసాగర్ గోదావరిలో కలిసే చోటు : కందకుర్తి (నిజామాబాద్ జిల్లా) -
ఆహహ్హహారం
బాధ అన్నది ఆకలైతే ఫుడ్ అన్నది ఆనందం ఇస్తుంది. ఆనందం అన్నది దుఃఖం లాగే మన శరీరంలో కలిగే ఒక రసాయనిక చర్య. మనం ఆనందంగా ఉండాలనుకుంటే పాజిటివ్‌గా ఉండాలనుకుంటే సంతోష రసాయనాలు స్రవిస్తాయి. సో... ఆనందం అన్నది మన చేతుల్లోనే ఉంది. ఏదీ... చెయ్యి చాపండి ఒక హ్యాపీ పీస్ అందుకోండి. సంతోషం సగం బలం మాత్రమే కాదు... ఇప్పుడు సంతోషం సంపూర్ణ బలం. ఈ రోజుల్లో రకరకాల ఆర్థిక, సామాజిక కారణాలతో సంతోషం దొరకడం చాలా కష్టమైపోతోంది. పైగా న్యూ ఇయర్ వచ్చి జస్ట్ నాలుగు రోజులే. మిగిలిన 360 రోజులూ... ఆపైన బతికి ఉన్న మిగతా రోజుల్లోనూ కావాల్సింది కూడా సంతోషమే. అప్పుడు బతుకు ఆనందమానందమానందమే అనిపిస్తుంది. మరి అలాంటి ఆనందం పొందేదెలా? చాలా సింపుల్. ఈ కథనం చదివితే చాలు. ఆనందం అనేది మరెక్కడో లేదు. మన మెదడులోనే ఉంటుంది. ఇదేదో వ్యక్తిత్వ వికాస ఉపన్యాసంలోని గంభీరమైన మాటో లేదా ఆధ్యాత్మిక ప్రవచనంలోని బ్రహ్మాండమైన వాక్యమో కాదు. అవును ఆనందం అన్నది అక్షరాలా మన మెదడులోనే ఉంటుంది. అక్కడ కొన్ని స్రావాలు రూపంలో సంతోషం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ స్రావాల ఊరుతూ, పెరుగుతున్నకొద్దీ సంతోషం కట్టలు తెంచుకుంటుంది. సంతోషాన్ని కలిగించే ఆ మెదడు స్రావాల్లో కొన్ని సెరిటోనిన్, ఎండార్ఫిన్, డోపమైన్, ఫినైల్ ఇథిలమైన్ అనే రసాయనాలు. అవి స్రవించడానికి దోహదపడేవి మనం దాదాపుగా రోజూ తీసుకునే ఆహార పదార్థాలు. అవేమిటో తెలుసుకుంటే సంతోషాన్ని హ్యాపీగా కొనుగోలు చేయవచ్చు కదా. అవేమిటో ఎక్కడ దొరుకుతాయో చూద్దాం. ఆనందాన్ని ఇచ్చే ఈ ఆహారాలన్నీ కేవలం సంతోషం కోసం మాత్రమే గాక పక్షవాతం, గుండెపోటు, మతిమరపు (డిమెన్షియా) వచ్చే ముప్పును 30 శాతానికి పైగా తగ్గిస్తాయని అనేక అధ్యయనాల్లో తేలింది. ఎండార్ఫిన్ ప్రధాన సోర్స్ పాయింట్ వ్యాయామం. మనం బాగా వ్యాయమం చేశాక మనలో ఒక సంతోషం నెలకొన్న భావన కలుగుతుంది. సాధారణంగా వ్యాయామం చేసే వాళ్లు, అంతా పూర్తయ్యాక ఒక తృప్తికరమైన, సంతోషకరమైన ఫీలింగ్‌లోనే ఉంటారు. అలా అనుభూతి కలిగించేది ఈ ఎండార్ఫినే! ఈ రకంగా చూస్తే సంతోషానికి మరో సోర్స్ ఎండార్ఫిన్ రూపంలో ప్రధానంగా జిమ్‌లో ఉంటుందన్నమాట. ఒక సంతోష స్రావం సెరిటోనిన్ పొద్దున్నే గిన్నెలో కాచీ కాచగానే... జాయ్ అనేది చాయ్ రూపంలోనో లేదా కాఫీ అనే మారువేషంలోనో మొదట గ్లాసులోకి జర్రున జారుతుంది. తర్వాత చుర్రున కాలుతూ నోట్లోకి చేరుతుంది. అక్కణ్నుంచి మెల్లగా హాయిగా గొంతులోకి దిగుతుంది. దాంతో మెదడులో సంతోషం సర్రున పారుతుంది. అది పాల రూపంలో. దీనికి సోర్స్ పాయింట్ మన పాలపార్లర్లు. ఇక మన కాలనీలోకి వచ్చే తోపుడు బండి మీద కూడా సంతోషం గుట్టలు గుట్టలుగా పేర్చి ఉంటుంది పైనాపిల్ రూపంలో! అరటిపండ్ల రూపంలో గెలలుగా వేలాడుతూనూ ఉంటుంది. ఎలాగంటారా? ఈ అన్నిట్లో సెరిటోనిన్ ఉంటుంది. ఏంటా సెరిటోనిన్... ఏమా కథ: మనకు సంతోష భావనను ఇచ్చే రసాయనాల్లో ముఖ్యమైనది సెరిటోనిన్. అందుకే దీన్ని ‘హ్యాపీనెస్ హార్మోన్’ అని కూడా అంటారు. ఎక్కడెక్కడ దొరుకుతుంది: పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. అది సెరిటోనిన్ స్రావం పెరిగేలా చేస్తుంది. ద్రాక్ష, నారింజల్లోనూ ట్రిప్టోఫాన్ ఎక్కువే. వెన్నలో, విటమిన్ బి6 లభించే పొట్టుతో ఉండే ఆహారధాన్యాలు, బఠాణీలు, కాలీఫ్లవర్, అవకాడోలో, గుమ్మడిగింజల్లో సెరిటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఉచితంగా ప్రతిరోజూ ప్రతి ఒక్కరికీ సెరిటోనిన్ లభించే మార్గం సూర్మరశ్మి. ఎక్కువగా నవ్వేవాళ్లలో సెరిటోనిన్ అధికంగా విడుదలవుతుంది. ఇక కాలేయం, కిడ్నీ, తాజామాంసం, కోడిమాంసంతో పాటు ఇటు క్యాబేజీ, బ్రకోలీ వంటివి కూడా సెరిటోనిన్ స్రవించేందుకు దోహదపడతాయి. ఇక ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే అవకాడో, వాల్‌నట్లూ సెరిటోనిన్కు సోర్స్లే. ఇంకో సంతోష స్రావం డోపమైన్ మీరు చాలాకాలం తర్వాత కలిసిన ఆ ఫ్రెండ్‌ను చూసి ఆనందోద్వేగాలకు లోనవుతున్నారా? దానికి కారణం మన మెదడులో స్రవించే డోపమైన్. ఏమిటా డోపమైన్ : ఇది మన మెదడు చురుగ్గా ఉంచేలా చేసే రసాయనం. ఏదైనా సంతోషం కలిగినప్పుడు దాంతోపాటు మనలోకి ప్రవేశించే ఆ చురుకుదనానికి కారణం డోపమైన్. అలాగే ఏదైనా వేదన లేదా బాధ కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోడానికి తగిన చురుకుదనాన్ని ఇచ్చేది కూడా ఇదే. ఎక్కడెక్కడ దొరుకుతుంది: ఇది కూడా అరటిపండ్ల బండి మీదే దొరుకుతుంది! పక్వానికి వచ్చిన అరటిపండులో టైరోసిన్ అనే అమైనో యాసిడ్ పాళ్లు ఎక్కువ. ఈ అమైనోఆసిడ్... డోపమైన్ రసాయనాన్ని స్రవించేలా చేస్తుంది. బీట్రూట్ డోపమైన్‌తో పాటు సెరిటోనిన్నూ స్రవించేలా చేస్తుంది. నువ్వులు, స్ట్రాబెర్రీలలో టైరోసిస్ చాలాఎక్కువ కావడంతో ఇవీ డోపమైన్‌ను విడుదలయ్యేలా చేస్తాయి. తాజా చికెన్ కూడా నార్ఎపీనెఫ్రిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్తో పాటు డోపమైన్ స్రావానికి దోహదపడుతుంది. వెన్నలోని ప్రొటీన్‌లో ఉండే అమైనో ఆసిడ్స్ సైతం డోపమైన్‌ను స్రవించేలా చేస్తాయి. వెజిటేరియన్లను మినహాయిస్తే నాన్–వెజ్ ప్రియులకు ఇది మాంసం దుకాణాల్లోనూ, పెద్ద పెద్ద మాల్స్‌లోని నాన్–వెజ్ ఆహారాలు విక్రయించే కార్నర్లోనూ దొరుకుతుంది. ఎందుకంటే ఇది మాంసాహారం, గుడ్లు, చేపలు, సీఫుడ్స్‌లో ఉంటుంది. మరో ఆనంద స్రావం ఎండార్ఫిన్ సపోజ్... ఏదో సమస్య మీలో బోల్డంత ఒత్తిడి కలుగుతూ మీకు బాధ కలిగిస్తోందనుకుందాం. అకస్మాత్తుగా ఒక పరిష్కారం దొరికి ఆ ఒత్తిడంతా తొలగిపోయినప్పుడు కలిగే సంతోషాన్ని గుర్తుతెచ్చుకోండి. హాౖయెన ఆ భావన కలగజేసే రసాయనమే ఎండార్ఫిన్. మనలో ఒత్తిడి కొండలా పేరుకుపోయిన ఉన్నప్పుడు ఆ గుట్టను పక్కకు తీసిన భావననిస్తూ మనలో యాంగై్జటీని తొలగించే రసాయనం ఇది. దాంతో ఇది స్రవించినప్పుడు మనలో ఒక ‘ఫీల్ గుడ్’ భావన కలుగుతుంది. ఏదైనా నొప్పి కలిగినప్పుడు దాని నుంచి ఉపశమనం కలగడానికి దోహదం చేసేది ఎండార్ఫినే. ఎక్కడెక్కడ దొరుకుతుంది: నిజానికి ఎండార్ఫిన్ ప్రధానంగా లభించేది వ్యాయామంతోనే. అయితే వ్యాయామం తర్వాత ఆహారాల్లో చూస్తే దాని ప్రధాన వనరు చాక్లేట్లు. ఆ తర్వాత విటమిన్–సి ఎక్కువగా ఉండే స్ట్రాబెర్రీస్ ఎండార్ఫిన్ స్రావానికి బాగా ఉపయోగపడతాయి. ఇక తియ్యటి ద్రాక్షలో కూడా ఎండార్ఫిన్స్ స్రవించేలా చేసే సామర్థ్యం ఉంది. విటమిన్–సి ఎక్కువగా ఉండే నారింజ, నిమ్మ జాతి పండ్లు సైతం ఎండార్ఫిన్స్‌ను ఎక్కువగా స్రవించేలా చేయగలవు. ఒక్కమాట గుర్తుంచుకోవాలి. ఎండార్ఫిన్ స్రవించాలంటే విటమిన్–సి కావాలి. కాబట్టి నిమ్మజాతి పండ్లు తింటే ఎండార్ఫిన్‌ను తీసుకున్నట్లే. ఇలా చాక్లెట్ల దుకాణంతో పాటు మళ్లీ పండ్ల బండిపైనే ఎండార్ఫిన్ పుష్కలంగా దొరుకుతుంది. మరో సంతోష రసాయనం ఫినైల్ ఇథిలమైన్ : మీ ఆత్మీయులను చూడగానే మీ ముఖం ఆనందంతో ఎందుకు వికసిస్తుంది? మీలో చాలా ఉల్లాసపూరితమైన సంతోషభావన ఎందుకు కలుగుతుంది? ఇందుకు కారణం ‘ఫినైల్ ఇథిలమైన్’ అనే మరో మెదడు రసాయనం. ఎక్కడెక్కడ దొరుకుతుంది: చాక్లెట్ అనేది ఒక సంతోషసాగరం. చాలా ఆనందాలకు చాక్లెట్ మూలం. అలాగే ఫినైల్ ఇథమైన్కు కూడా ప్రధాన వనరు చాకోలెటే. అందుకేనేమో... కొత్తగా ఫ్రెండ్షిప్ ఏర్పడినప్పుడు చాకోలెట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. చాకోలెట్‌లో ఉండే ఫినైల్ ఎథిలమైన్ మూడ్స్‌ను చక్కదిద్దుతుంది. మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. అందులోని కెఫిన్ మనసును ఉత్తేజ పరుస్తుంది. అలాగే న్యూరోట్రాన్స్మిటర్ అయిన సెరిటోనిన్ను కూడా చాకోలెట్ స్రవింపజేస్తుంది. డార్క్ చాక్లెట్స్ వల్ల ఈ ప్రయోజనాలు ఒనగూరుతాయి. అలాగే విషాదాహారాలూ ఉన్నాయి. అవి ఇవే... సంతోషాలను ఇచ్చే ఆహారాల్లాగే విషాదాలను కలగజేసే ఆహారాలూ ఉంటాయి. అవి సెరిటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్ స్రావాల్ని తగ్గిస్తాయి. అవేమిటో చూద్దాం. కాఫీ మొదట్లో కాస్తంత ఉత్తేజం కలిగించినా అందులోని మితిమీరిన కెఫిన్ క్లేశాన్ని కలిగిస్తుంది. సిగరెట్‌లోని నికోటిన్. ఆల్కహాల్‌లు కూడా అంటే. నిషేధిత మాదకద్రవ్యాలైతే అకస్మాత్తుగా సెరిటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్ పాళ్లను మొదట ఎక్కువయ్యేలా చేసి, ఆ తర్వాత అవి ఎంత మోతాదులో విడుదల కావాలో అంత మోతాదులో కాకుండా... నియంత్రణ లోపించినట్లుగా విడుదలయ్యేలా చేస్తాయి. దాంతో ఆయా రసాయనాల మధ్య ఉండాల్సిన సమతౌల్యం లోపిస్తుంది. అందుకే ఇవన్నీ తొలుత తాత్కాలికంగా ఆహ్లాదం కలిగించినా... తీవ్రమైన విచారంలో ముంచి, తర్వాత ఆరోగ్యానికీ హాని చేస్తాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లోని మోనోసోడియమ్ గ్లుటామేట్, ఐస్‌క్రీమ్స్, డోనట్స్, ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్, వైట్బ్రెడ్లు విషాదం కలిగించే ఆహారాలే. డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి సీనియర్ న్యూరోఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12 బంజారాహిల్స్, హైదరాబాద్ -
పక్షులు కోసం వెళ్లి.. మృత్యువు కౌగిట్లోకి..!
సెలవు రోజున సరదాగా గడిపేందుకు వెళ్లిన నలుగురు బాలమిత్రులు కన్నవారికి కడుపు కోత మిగిల్చారు. ఆదివారం సాయంత్రం నుంచి కనబడకపోతే ఉదయాన్నే వస్తారనుకున్న ఆ తల్లిదండ్రులను కన్నీటి సంద్రంలో ముంచేశారు. పక్షులు పట్టడానికి వెళతామని ఇంట్లో చెప్పి కావేరి నదిలో మృతదేహాలుగా కనిపించారు. ఈత కొట్టేందుకు వెళ్లి ఆ బాలురు మునిగిపోయారా.. లేక రసాయన వ్యర్థాల ప్రభావంతో చనిపోయారా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. సాక్షి, సేలం: మెట్టూరు డ్యాం వద్ద కావేరి నదిలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు సహా నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. వివరాలు.. సేలం జిల్లా మేట్టూరు సమీపం సేలం క్యాంప్ అన్నానగర్ ప్రాంతానికి చెందిన కూలీ ధనపాల్. ఇతని కుమారులు రాజా (12), తమిళలగన్ (9) అదే ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి, నాలుగో తరగతి చదువుతున్నారు. అదే పాఠశాలలో మణి కుమారుడు మోహన్ రాజ్ (7) రెండో తరగతి, బాలాజీ కుమారుడు మణికంఠన్ (17) పదో తరగతి వరకు చదువుకుని ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ నలుగురు స్నేహితులు ఆదివారం సెలవు కావడంతో పక్షులను పట్టడానికి వెళుతున్నామని తెలిపి బయటకు వెళ్లారు. అయితే పొద్దుపోయినా వారు నలుగురు ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు అనేక ప్రాంతాల్లో గాలించినా వారి ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో మెట్టూరులో 16 గేట్ల ఉపరి నీరు వెలువడే ప్రాంతంలో రసాయన వ్యర్థపు నీరు నిల్చి ఉంటుంది. ఈ ప్రాంతంలో సోమవారం ఉదయం నలుగురి మృత దేహాలు తేలుతూ కనిపించాయి. విషయం తెలుసుకున్న వారి కుటుంబీకులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న కరుమలైకూడల్ పోలీసులు, మెట్టూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురి మృత దేహాలను వెలికి తీసి శవపంచనామా నిమిత్తం మేట్టూరు జీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ప్రాథమిక విచారణలో సరదాగా ఈత కొట్టడానికి నీటిలో దిగి ఉంటారని తెలిసింది. అయితే విద్యార్థుల మృతదేహాలు లభించిన ప్రాంతంలో లోతుగా లేకపోవడంతో చిన్నారుల మృతికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ నిలిచిఉన్న రసాయన వ్యర్థపు నీటి వల్ల మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడకు రసాయన వ్యర్థపు నీరు ఏఏ సంస్థల నుంచి వచ్చి చేరుతుంది. రసాయనాల కారణంగానే నలుగురు బాలురు మృతి చెందారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
విషవాయువులతో ఇద్దరు కార్మికులు మృతి
హైదరాబాద్: బాలానగర్‌లోని బయోకెమికల్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో విషాదం చోటుచేసుకుంది. విషవాయువు కారణంగా ఇద్దరు కార్మికులు మృతిచెందారు. కంపెనీలోని డ్రైనేజీని శుభ్రం చేయడానికి మ్యాన్హోల్లోకి ముగ్గురు కార్మికులు దిగారు. అయితే అందులోని విషవాయువుల కారణంగా ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మృతులను మూసాపేట్ జనతానగర్‌కు చెందిన అల్లాడి రామారావు(50), అల్లాడి సీతారామ్(30) (బాబాయ్, అబ్బాయ్)గా గుర్తించారు. -
నిత్యం విషం తింటున్నాం..
సాక్షి, హైదరాబాద్: ‘నిత్యం విషమే తింటున్నాం. మన పిల్లలూ ఈ విషాన్నే తినాల్సి వస్తోంది. రసాయనాలతో పండించిన, మగ్గబెట్టిన ఫలాలే కాదు.. పాలు, పెరుగు, పంచదార, ఉప్పు, బియ్యం.. ఇలా అన్నీ కల్తీనే. కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏం యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయి? తనిఖీలు ఏమైనా చేస్తున్నారా? కోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు మాత్రం అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం.. అని చెబుతారు. లేదంటే దాని గురించే పట్టించుకోరు. అయినా మీ బాధ్యతల గురించి మేం ఎందుకు చెప్పాలి? మీ అంతట మీరు మీ బాధ్యతలను నిర్వర్తించలేరా? మేం చెబితే పాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటారు. చెప్పకపోతే మీరంతట మీరు చేయరు. కాల్షియం కార్బైడ్ ఉపయోగించి పళ్లను మగ్గబెడుతున్న వారికి సంబంధించి ఇటీవలి కాలంలో ఎన్ని తనిఖీలు చేశారు? ఎన్ని కేసులు పెట్టారు? ఎంత మందిని ప్రాసిక్యూట్ చేశారు? ఈ వివరాలన్నీ తదుపరి విచారణ నాటికి కోర్టు ముందుంచండి. లేనిపక్షంలో కోర్టులంటే ఏమిటో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి’ అని హైకోర్టు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలకు తేల్చిచెప్పింది. కాల్షియం కార్బైడ్‌ను ఉపయో గించి పండ్ల వ్యాపారులు కాయల్ని మగ్గబెట్టి అమ్మకాలు చేస్తుండటంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు పిల్‌గా పరిగణించింది. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. అధికారులు నామమాత్రంగానే ఉన్నారు... ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీ) నియమితులైన సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదిస్తూ..ప్రతీ ఒక్కటి కల్తీ అవుతున్నాయని, కల్తీలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. తనిఖీలు నిర్వహించే అధికారుల సంఖ్య నామమాత్రంగా ఉందని తెలిపారు. ఎఫ్‌ఎస్‌వోలు ఏపీలో 28, తెలంగాణలో 20 మందే ఉన్నారని, అండమాన్‌లోనూ 28 మంది ఉన్నారని, తమిళనాడులో ఏకంగా 554 మంది ఉన్నారని వివరించారు. తనిఖీ అధికారుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టు ఆదేశించినప్పుడో, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పుడో అధికారులు తనిఖీలు చేసి ఊరుకుంటున్నారని, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంటేనే ఫలితాలు ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక తనిఖీలు ఎన్ని చేశారు, ఎంతమందిపై కేసు నమోదు చేశారు, కోర్టుల్లో శిక్షలు పడ్డాయా, లేదా పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని 2 రాష్ట్రాలను ధర్మాసనం ఆదేశించింది. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. -
వేడివేడి గరళం
సాక్షి, అమరావతి: చాలా మందికి నిద్ర లేవగానే కాస్తంత టీ తాగితే కానీ తెల్లారదు. సమయానికి ఇంట్లో లేకుంటే బయటైనా సరే సింగిల్ ఛాయ్ పడాల్సిందే. వేడివేడిగా నాలుగు చుక్కలు గొంతులోకి దిగితేగానీ బద్ధకం వదలదు మరి! కొంతమంది ఎంత దూరమైనా అలవాటైన చోటకే వెళుతుంటారు. ఇక నుంచి బయట దుకాణాల్లో టీ తాగాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. మనం తాగే టీ నీళ్లు ఆవిరితోపాటు వేడివేడిగా విషం కక్కుతున్నాయి. ఒకసారి వాడిన టీ పొడి వ్యర్థాలతో పాటు ప్రమాదకరమైన రసాయనాలను అందులో కలిపి జనం గొంతుల్లోకి దించుతున్నారు. చిక్కగా, రుచిగా కల్తీ టీ... ఇన్నాళ్లూ పాలూ నీళ్లూ ఆహార పదార్థాలకే పరిమితమైన నకిలీ మాఫియా ఇప్పుడు కోట్లలో వ్యాపారం జరిగే టీ పొడి మీద కన్నేసింది. కల్తీ టీ పొడిని క్వింటాళ్లకు క్వింటాళ్లే తయారు చేసి హోటళ్లకు సరఫరా చేస్తున్న తీరు జలదరింపు కలిగిస్తోంది. మరింత చిక్కగా, రుచిగా ఉండే ఈ కల్తీ టీ పొడికి అలవాటుపడ్డ వినియోగదారులు పదేపదే అక్కడకే వెళ్తున్నారు. ఒకటికి రెండు సార్లు తాగి ఆస్వాదిస్తున్నారు. దీని వెనకాల కల్తీని ఎవరూ గుర్తించలేనంతగా రూపొందిస్తున్న నకిలీ మాఫియా జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతూ సొమ్ము చేసుకుంటోంది. ధర తక్కువ.. రుచి ఎక్కువ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని పట్టణ కేంద్రాల్లో కల్తీ టీపొడినే వాడుతున్నారు. దీనికి కారణం రేటు చాలా తక్కువగా ఉండటం. ప్రముఖ బ్రాండ్లకు చెందిన పావు కిలో టీ పొడి రూ.130 వరకు ఉండగా కల్తీ టీపొడి మాత్రం కిలో రూ. 120కే అందుబాటులో ఉంది. దీంతో టీ షాపుల యజమానులు లేబుల్ టీ ప్యాకెట్ల వైపే మొగ్గుచూపుతున్నారు. రసాయనాలు కలపడంతో వినియోగదారులు ఆకర్షితులు అవుతున్నందున కల్తీ టీపొడి వైపే మొగ్గుచూపుతున్నారు. కల్తీకి సంబంధించి దుకాణదారులకు సైతం అంతుచిక్కని రీతిలో ఉండేలా తయారీదారులు జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణ కూ సరఫరా రాష్ట్రంలోని ప్రధాన టీ స్టాళ్లన్నిటిలోనూ కల్తీ టీ పొడినే వాడుతున్నట్టు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. లేబుల్ లేకుండా డబ్బాల్లో, ప్యాకెట్లలో సరఫరా అవుతున్న కల్తీ టీ పొడి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడైంది. గతంలో నెల్లూరు జిల్లా పొదలకూరులో ఒక్కరోజే 200 క్వింటాళ్ల కల్తీ టీపొడిని సీజ్‌చేసి నిర్వీర్యం చేశారు. కల్తీకారం తయారవుతున్న గుంటూరు, విజయవాడలో నకిలీ టీ పొడి భారీగా ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడైంది. విశాఖపట్నం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. -
పా‘పాలు’
ప్రైవేటు పాల ఉత్పత్తుల్లో రసాయనాలు ఉన్నట్టు ధ్రువీకరణ అయ్యిందని పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ స్పష్టంచేశారు. రెండు సంస్థల పాల ఉత్పత్తుల్లో గ్యాస్ట్రిక్, బ్లీచింగ్ పౌడర్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు తెలిపారు. కల్తీ వ్యవహారంపై తాను పెదవి విప్పితే చాలు విదేశాల నుంచి కూడా బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, పాలల్లోకల్తీ వ్యవహారంలో మంత్రి వ్యాఖ్యలను తప్పుబడుతూ, అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వైగై సెల్వన్విరుచుకుపడటం గమనార్హం. ♦ పాలలో రసాయనం కల్తీ ధ్రువీకరణ ♦ అన్నింటా కాదు.. కొన్ని మాత్రమేనని వివరణ ♦ పరిశోధనలో తేటతెల్లమైనట్టు మంత్రి స్పష్టం ♦ ఇంటి వద్దకే ఆవిన్ ఉత్పత్తులు ♦ బెదిరింపులు పెరిగినట్టు ఆందోళన ♦ డోర్ డెలివరీకి శ్రీకారం ♦ రెండు సంస్థల గుట్టురట్టు చేసినట్టు ధీమా ♦ మంత్రిపై విరుచుకుపడ్డ అధికార ప్రతినిధి సాక్షి, చెన్నై: ప్రయివేటు పాలల్లో రసాయనాలు కలుపుతున్నట్టుగా మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పాల నమూనాలను పరిశోధనలకు పంపించినట్టు, నివేదిక రాగానే, చర్యలు తప్పదన్న హెచ్చరికలు చేశారు. అయితే, పాలల్లో కల్తీ లేనట్టుగా ఆరోగ్య శాఖ ఓవైపు స్పందిస్తుంటే, మరోవైపు పాలల్లో రసాయనాలు ఉన్నాయంటూ మంత్రి స్పష్టంచేస్తూ రావడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. అసెంబ్లీలోనూ చర్చ సాగింది. తాను మాత్రం ఆ ప్రకటనకు కట్టుబడే ఉన్నట్టు, ప్రైవేటు పాల సంస్థలపై చర్యలు తప్పవని మంత్రి రాజేంద్ర బాలాజీ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆయన మరో ప్రకటన చేశారు. పరిశోధనల్లో రెండు సంస్థల ఉత్పత్తుల్లో రసాయనాలు ఉన్నట్టు ధ్రువీకరణ అయ్యిందని స్పష్టం చేశారు. రసాయనాల గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆవిన్ సంస్థ పాల ఉత్పత్తులను డోర్ డెలివరీ చేసే విధంగా ‘ఇంటి వద్దకే ఆవిన్’ నినాదంతో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డోర్ డెలివరీ వాహనాలను జెండా ఊపి మంత్రి రాజేంద్ర బాలాజీ సాగనంపారు. అలాగే, ఆవిన్ ఒక లీటరు పెరుగు, ఒక లీటరు రసగుల్లా బాక్స్‌లను పరిచయం చేశారు. ఈసందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ, పాల కల్తీ వ్యవహారం గుట్టురట్టు అవుతున్నట్టు వివరించారు. తమకు అందిన ఫిర్యాదులు, తాము సేకరించిన వివరాల మేరకు కొన్ని పాల సంస్థల ఉత్పత్తులపై నిఘా వేశామని, వాటి నమూనాలను పరిశోధనలకు పంపించినట్టు గుర్తు చేశారు. ప్రస్తుతం రెండు సంస్థల ఉత్పత్తుల్లో గ్యాస్ట్రిక్, బ్లీచింగ్ పౌడర్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. చెడిపోయిన పాలను రిలయన్స్, నెస్లే సంస్థలు పౌడర్లుగా మార్చి మార్కెట్లోకి పంపుతున్నట్టు ఆరోపించారు. చెడిపోయిన పాలల్లో ఆమ్లం ప్రభావం కనిపించకుండా గ్యాస్ట్రిక్, బ్లీచింగ్ పౌడర్లు కలుపుతున్నట్టు పరిశోధనలో నిర్ధారించామని తెలిపారు. చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలో తాము జరిపిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. ఈ గ్యాస్ట్రిక్, బ్లీచింగ్‌తో కూడిన పాల పౌడర్లను వాడడం వల్ల కడుపు నొప్పి, గుండె మీద ప్రభావం చూపించే సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. మరికొన్ని సంస్థల ఉత్పత్తుల మీద పరిశోధన జరుగుతోందన్నారు. అన్ని సంస్థలు కాదని, కొన్ని సంస్థల్లోనే ఈ కల్తీ సాగుతున్నట్టు స్పష్టం అవుతోందని చెప్పారు. ఆయా సంస్థల్లో కల్తీ విషయంగా తనిఖీల్లో తాము పట్టుకుంటే, రూ.1,500 జరిమానా చెల్లించి తప్పించుకుంటున్నట్టు పేర్కొన్నారు. అందుకే ఈసారి జరిమానాతో కాకుండా, కఠిన చర్యలతో ముందుకు సాగనున్నామన్నారు. పెదవి విప్పితే బెదిరింపులు పాలల్లో రసాయనల ప్రస్తావన తాను తీసుకొచ్చినప్పుడల్లా తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. విదేశాల నుంచి కూడా బెదిరింపులు వస్తున్నట్టు, వీటికి తాను తలొగ్గే ప్రసక్తే లేదని, కల్తీకి పాల్పడుతున్న ఆయా సంస్థలపై చర్యలు తీసుకునే వరకు ఉపక్రమించబోనని స్పష్టంచేశారు. ప్రస్తుతం రెండు సంస్థల గుట్టురట్టు చేశామని, అయితే, దీనిని ఎవరూ నమ్మడం లేదని పేర్కొనడం గమనార్హం. కాగా, మంత్రి వ్యాఖ్యలను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వైగై సెల్వన్ తీవ్రంగా తప్పుబట్టారు. పాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించాల్సిన మంత్రి, రోజుకో సంచలన ప్రకటనతో కాలం నెట్టుకువస్తున్నారని విరుచుకుపడ్డారు. మంత్రి పనిగట్టుకుని చేస్తున్నట్టు అనుమానం కల్గుతోందని, పద్ధతి మార్చుకోని పక్షంలో కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం. -
ఆ పాలు విషపూరితం
► రిలయన్స్, నెస్లే పాల ఉత్పత్తులపై మంత్రి సంచలన ఆరోపణలు చెన్నై: రిలయన్స్, నెస్లే పాల పౌడర్లలో రసాయనాలు ఉన్నాయని తమిళనాడు పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్రబాలాజీ ఆరోపించారు. ప్రైవేటు పాలల్లో రసాయనాలు ఉన్నట్లుగా ఇటీవల మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం చర్చకు దారి తీసిన నేపథ్యంలో బుధవారం చెన్నైలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ పరిశోధనలో రిలయన్స్, నెస్లే పాల పౌడర్లలో గ్యాస్ట్రిక్ , బ్లీచింగ్ పౌడర్లు ఉన్నట్టు నిర్ధారించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ రెండు సంస్థలు చెడిపోయిన పాలను పౌడర్లుగా మార్చే క్రమంలో పౌడర్లను కలుపుతున్నట్లు నిర్ధారించామన్నారు. అలాగే ప్రైవేటు పాలల్లోని రసాయనాల నిర్ధారణకు పరిశోధనలు సాగుతున్నాయని వివరించారు. మిగిలిన సంస్థల పాల ఉత్పత్తుల నమూనాలు పరిశోధనలో ఉన్నాయని, వాటి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. -
‘పాల’ల్లో భిన్న వాదం
► రసాయనాలు లేవన్న ప్రభుత్వం ► నాణ్యత తగ్గినా ప్రాణహాని లేదని ప్రకటన ► కోర్టుకు ఆరోగ్య శాఖ నివేదిక ► మంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా వివరణ ► సర్వత్రా విమర్శలు ప్రైవేటు డెయిరీల పాలలో రసాయనాల మిశ్రమం వ్యవహారం భిన్న స్వరానికి దారితీసింది. ఆ పాలల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్టుగా పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సంచలన ప్రకటన చేస్తే, అందుకు భిన్నంగా అబ్బే.. అలాంటివి ఏవీ లేవు అని ఆరోగ్య శాఖ కోర్టుకు నివేదించడం చర్చకు దారితీసింది. సాక్షి, చెన్నై : ప్రైవేటు పాలలో రసాయనాలు కలుపుతున్నట్టుగా పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ పదిరోజుల క్రితం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ రసాయనాలతో క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆరోపించారు. ప్రైవేటు పాలను పరిశోధనకు పంపించామని, రసాయనాలు ఉన్నట్టుగా ధ్రువీకరించిన పక్షంలో ఆయా ప్రైవేటు సంస్థలపై కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. ఈ విషయంగా సీఎం పళని స్వామితో పలుమార్లు చర్చలు జరిపిన మంత్రి, తన వాదనకు కట్టుబడే ఉన్నట్టు స్పష్టంచేశారు. అదే సమయంలో మంత్రి సంచలన ఆరోపణల్ని అస్త్రంగా చేసుకున్న న్యాయవాది సూర్యప్రకాష్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రధాన న్యాయమూర్తి ఇందిర బెనర్జీ, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. తమిళనాడులో సరఫరా అవుతున్న ప్రైవేటు పాలు అత్యధికంగా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నట్టు, ఆయా సంస్థల్లో ఏం జరుగుతోందో ఎవరీకి తెలియదని కోర్టుకు సూర్య ప్రకాష్ నివేదించారు. కేసును సీబీఐకి అప్పగించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని బెంచ్ సైతం అభిప్రాయ పడింది. ఈ రసాయనాల మిశ్రమం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారోనని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. నిగ్గు తేల్చేందుకు ఓ కమిటీని రంగంలోకి దించతున్నట్టుగా గత వారం జరిగిన వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఈ వారం వ్యవధిలో ఏం జరిగిందో ఏమోగానీ, పాడి, డెయిరీ మంత్రి మౌనం వహించడం మొదలెట్టినట్టున్నారు. అందుకే కాబోలు ఆరోగ్యశాఖ రంగంలోకి దిగి, అబ్బే రసాయనాలు ఏవీ పాలల్లో లేవంటూ కోర్టుకు నివేదించడం గమనార్హం. మంత్రి సంచలన ప్రకటనకు భిన్నంగా ఆరోగ్య శాఖనివేదిక సోమవారం హైకోర్టుకు చేరడం చర్చకు దారితీసింది. నాణ్యత తగ్గినా ప్రాణ హాని లేదు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి తరపున కోర్టుకు చేరిన నివేదికలో 2011–17 మధ్య కాలంలో తాము జరిపిన పరిశీలన, పరిశోధనల్లో ప్రాణానికి హని కల్గించే రసాయనాలు లభించ లేదని వివరించారు. 888 చోట్ల జరిపిన పరిశోధనల్లో , 137 చోట్ల మాత్రం నీళ్లు, విజిటబుల్ ఆయిల్ మిశ్రమం మాత్రం గుర్తించినట్టు పేర్కొన్నారు. అలాగే, మరికొన్ని చోట్ల పాల ప్యాకెట్ల మీద తేదీలు పేర్కొన లేదని, కాలం చెల్లినవి ఉన్నట్టుగా గుర్తించామని వివరించారు. అలాగే, పాల ఉత్పత్తుల్లో 338 చోట్ల జరిపిన పరిశీలనలో 196 చోట్ల సురక్షితం అని, 132 చోట్ల కాలం చెల్లిన వాటిని మళ్లీ కొత్తగా తయారు చేయడం, కొన్ని రకాల మిశ్రమాలు ఉండటాన్ని గుర్తించామని పేర్కొన్నారు. పాలలో, పాల ఉత్పత్తుల్లో నాణ్యత తగ్గినా, ప్రాణానికి హాని కల్గించే రసాయనాలు లేవు అని కోర్టుకు స్పష్టంచేశారు. ఇక, తాము జరిపిన తనిఖీల్లో పట్టుబడ్డ వారి నుంచి జరిమానాల రూపంలో రూ.10.26 లక్షలు వసూలు చేసినట్టు నివేదించారు.. అయితే, మంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా ఆరోగ్య శాఖ నివేదిక ఉండటంతో తదుపరి సాగే విచారణలో కోర్టు ఏమేరకు స్పందించనుందో వేచి చూడాలి. -
ఎద్దు పాయె.. ఎరువు పాయె ఎవుసాయం తీరే మారె!
నాగేటి సాళ్లలో ట్రాక్టర్ల పరుగులు - కానరాని జోడెడ్ల జోరు - వ్యవసాయంలో పెరిగిన యాంత్రీకరణ - చేనూచెలకా పనులన్నీ మెషీన్లతోనే - పల్లెల్లో కానరాని పశుసంపద.. - సేంద్రియ ఎరువుల స్థానంలో విచ్చలవిడిగా రసాయనాలు - జీవం కోల్పోతున్న నేల.. పెరిగిపోతున్న పెట్టుబడి ఖర్చులు - పల్లెకు వెళ్లి ‘సాగు’ను పరిశీలించిన ‘సాక్షి’ సాక్షి నెట్వర్క్ ‘నాగేటి సాళ్ల తెలంగాణ’మాగాణి భూములను ట్రాక్టర్లు ఎడాపెడా దున్నేస్తున్నాయి. యాంత్రీకరణతో వ్యవసాయంలో ఎద్దుల పాత్ర క్రమంగా తగ్గిపోతోంది. నాడు పశువుల కొట్టంలోని సేంద్రియ ఎరువుతో నేలకు జీవం అందేది. నేడు ఆ ఎరువులకు దూరమై విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందులు చల్లుతున్నారు. దీంతో నేల జీవం కోల్పోయి నిస్సారమవుతోంది. ఖరీఫ్ ప్రారంభంలో రైతులు అవలంబిస్తున్న సాగు పద్ధతులు, కొనసాగిస్తున్న సంప్రదాయాలను పరిశీలించేందుకు ‘సాక్షి’ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో ఒక్కో గ్రామానికి వెళ్లింది. దాదాపు అన్నిచోట్లా యాంత్రీకరణ జాడలే వెలుగుచూశాయి. కానరాని కాడెడ్లు.. రైతు ఇంటి ముందు కాడెడ్ల స్థానంలోకి ట్రాక్టర్ వచ్చి చేరింది. ఉదాహరణకు కామారెడ్డి జిల్లా ఆరెపల్లి గ్రామాన్నే తీసుకుంటే.. ఇక్కడ 840 ఎకరాల సాగు భూమి ఉంది. 335 మంది రైతులు ఉన్నారు. పదేళ్ల కిందట దాదాపు 300 జతల ఎడ్లు ఉండేవి. ఇప్పుడు ఎడ్ల సంఖ్య 3 జతలకు పడిపోయింది. గ్రామంలో 18 మంది రైతుల వద్ద ట్రాక్టర్లు ఉన్నాయి. దున్నకాలు, ఇతర వ్యవసాయ పనులకు వీటినే వినియోగిస్తున్నారు. వీరి పనులు అయిపోగానే గ్రామంలోని మిగతా రైతులు వాటిని అద్దెకు తీసుకుని పనులు చేయించుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా వరికోలు పేరుకు తగ్గట్టే వరి పంటకు ప్రసిద్ధి. ఇక్కడి 1,800 మంది రైతుల వద్ద ఐదేళ్ల క్రితం వరకు 60 జతల ఎద్దులుండేవి. ఇప్పుడు భూమి దున్నాలంటే అందరూ ట్రాక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. మెదక్ జిల్లా అవుపులపల్లిలో మచ్చుకు జత కాడెడ్లు కూడా కనిపించలేదు. ఈ గ్రామంలో 400 వ్యవసాయ భూమి ఉంటే.. దాదాపు 35కిపైగా ట్రాక్టర్లు ఉన్నాయి. 15 ఏళ్ల కిందట ఈ గ్రామంలో 150కి పైగా జతల ఎద్దులు ఉండేవని రైతులు చెప్పారు. ఇప్పుడవి 5 జతలకు పడిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా నిజాలాపూర్‌లో 500 కుటుంబాలు సాగుపై ఆధారపడి ఉన్నాయి. వీరిలో 12 మంది రైతులకు సొంత ట్రాక్టర్లు ఉన్నాయి. 11 మంది వద్ద 11 జతల ఎద్దులు ఉన్నాయి. వీరు కూడా ట్రాక్టర్లతో దున్నించడానికే మొగ్గు చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్లవెల్లిలో మాత్రం కాస్త భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. ఇక్కడ దాదాపు 3 వేల వరకు సాగు భూమి ఉంది. ఇప్పటికీ 60 శాతం మంది రైతులు కాడెడ్లతోనే వ్యవసాయం పనులు చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో నాచినపల్లిలో 13 మంది రైతులకు సొంత ట్రాక్లర్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడులో 2,308 ఎకరాల భూమి ఉంది. 705 మంది రైతులుంటే 38 ట్రాక్టర్లు, 300 వరకు ఎద్దులు ఉన్నాయి. సాగు సన్నద్ధ ఖర్చే రూ.10 వేలు.. ఎడ్ల కొరత, సమయం ఎక్కువ తీసుకోవడం వంటి కారణాలతో ఎక్కువ మంది ట్రాక్టర్లతోనే భూములను దున్నుతున్నారు. జత ఎద్దుల అద్దె రోజుకు రూ.500గా ఉంది. ఎకరం భూమిని ఎడ్లతో దున్నిస్తే కనీసం రెండ్రోజులు పడుతుంది. ట్రాక్టర్‌కు గంటకు రూ.700 అద్దె వసూలు చేస్తున్నారు. ఎకరం నేల దున్నడానికి కనీసం 2–3 గంటలు పడుతుందని అంచనా. ఇంకా కలుపు తీత, ఎరువులు, విత్తనాల కొనుగోళ్లు, ట్రాక్టర్ అద్దె, కూలీలకు కలిపి ఖరీఫ్ సన్నద్ధతకే రూ.10 వేలకు పైగా ఖర్చవుతోంది. ఇది వరి ఇతర పంటల వరకే. అదే పత్తి అయితే ఖర్చు రూ.25 వేలు దాటుతోంది. చేతిలో పైసల్లేవు.. ఖరీఫ్ పనుల్లో తలమునకలై ఉన్న రైతులు చేతిలో పైసల్లేక అల్లల్లాడుతున్నారు. ఎరువులు, విత్తనాల కొనుగోలుకు నగదు సర్దుబాటు చేసుకునేందుకు తిప్పలు పడుతున్నట్టు ‘సాక్షి విజిట్’లో కనిపించాయి. ప్రస్తుతం రైతులంతా రబీ ఉత్పత్తులను ఐకేపీ కేంద్రాల్లో విక్రయించారు. మరికొందరు ఇప్పటికీ విక్రయానికి పడిగాపులు కాస్తున్నారు. అమ్మిన ధాన్యానికి 48 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయనే అధికారుల మాటలు ఎక్కడా అమలు కావడం లేదు. ఆ డబ్బులు వస్తే ఖరీఫ్‌లో పెట్టుబడుల కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు. ఖర్చులిలా.. ట్రాక్టర్ దుక్కి అద్దె (గంటకు): రూ.700 నాట్ల సమయంలో కేజ్‌వీల్స్‌తో బురదలో దున్నడానికి (గంటకు): రూ.1,600 ఎకరం గొర్రు కొట్టడానికి కూలీ(రోజుకు): రూ.1,000 ఎకరం దున్నడానికి ఎద్దు కూలీ (రోజుకు): రూ.500 పత్తి అచ్చు కొట్టుడు వ్యయం(రోజుకు): రూ.200 నుంచి రూ.500 వరకు ఎకరం భూమి దున్నడానికి ప్లవుకు(గంటకు):రూ.2 వేలు రోటోవీటర్ (గంటకు)–1,200 రెండు జతల ఎడ్లుండే..: మాకు రెండు జతల ఎడ్లుండే. వాటితోనే దున్నకాలు చేసేటోళ్లం. ఎడ్లను ఎప్పుడో అమ్మేసినం. ట్రాక్టర్ ఉంది. దాంతోనే గెరెలు కొట్టి విత్తనం పెడుతున్నం. పదెకరాల భూమి ఉంది. ఏటా కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నం. లాగోడి అస్తలేదు. – గడ్డం రాంరెడ్డి, రైతు, ఆరెపల్లి -
వారు నిరూపిస్తే ఉరికైనా సిద్ధం- మంత్రి
► రాజీనామాకు ఒత్తిడి ►మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ►పాలల్లో ఫార్మా డిలైట్ గుర్తింపు ►సిట్టింగ్ జడ్జి విచారణకు స్టాలిన్ డిమాండ్ చెన్నై : ప్రైవేటు పాలలో రసాయనాలు లేవు అని నిరూపిస్తే, ఉరి కంభంలో వేలాడేందుకైనా తాను సిద్ధం అని పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ స్పష్టం చేశారు. పాలల్లో పలు మిశ్రమాలతో కూడిన ఫార్మా డిలైట్ అన్న రసాయనాన్ని గుర్తించామన్నారు. ప్రైవేటు పాలల్లో రసాయనాలు కలుపుతున్నట్టుగా మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ప్రైవేటు సంస్థలు ఖండిస్తున్నాయి. ప్రైవేటు పాల వ్యాపారం దెబ్బ తినే ప్రమాదంతో ఏజెంట్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్ లాంటి వాళ్లు ఒకరిద్దరు మంత్రి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. మరి కొందరు ఇన్నాళ్లు ఎందుకు మౌనం వహించారోనని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ అయితే, తాజా పరిణామాలు, వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణించారు. గతంలో ప్రభుత్వ రంగం సంస్థ ఆవిన్‌లో సాగిన అవినీతి మాయాజాలాన్ని గుర్తు చేస్తూ, ఆ విచారణ ఏమైనట్టో ప్రశ్నించారు. ప్రైవేటు పాల విషయంగా సాగుతున్న మిక్సింగ్ గురించి మంత్రి ఆలస్యంగానైనా నోరు మెదిపి ఉండడం అనుమానాలకు దారి తీస్తున్నాయని శనివారం తూత్తుకుడిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో శివకాశిలో మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్ వ్యాఖ్యలను మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఆహ్వానించడం గమనార్హం. ఉరికి సిద్ధం : రసాయనాల వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని స్టాలిన్ డిమాండ్ చేయడాన్ని తాను ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు. ప్రైవేటు పాలలో రసాయనాలు ఉన్న విషయం నిర్ధారణ అయిందన్నారు. గిండి, మాధవరంలలోని ప్రభుత్వ పరిశోధనా కేంద్రంలో సాగిన పరిశీలనలో కొన్ని రకాల మిశ్రమాలతో ఫార్మా డిలైట్ అన్న రసాయనాన్ని గుర్తించడం జరిగిందన్నారు. మైసూర్‌లోని కేంద్ర ప్రభుత్వ పరిశోధనా కేంద్రానికి సైతం శాంపిల్స్ పంపించామని, అక్కడి నుంచి నివేదిక రాగానే, ప్రైవేటు పాల సంస్థల భరతం పట్టే విధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. విజయకాంత్ లాంటి వాళ్లు ప్రైవేటు పాల సంస్థలకు మద్దతుగా వ్యాఖ్యానిస్తుండడం, మరి కొందరు అయితే, తనను పదవికి రాజీనామా చేయించే విధంగా ఒత్తిడికి దిగడం శోచనీయమని విమర్శించారు. తాను ఎన్నడూ ప్రైవేటు పాల సంస్థల వద్ద చేతులు చాచ లేదని, అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రైవేటు పాలలో రసాయనాలు లేవు అని నిరూపిస్తే, పదవికి తానే రాజీనామా చేస్తానని, ఉరి కంబంలో వేలాడేందుకు కూడా సిద్ధం అని స్పష్టం చేశారు. గత ఏడాది ఈ శాఖ మంత్రిగా తాను పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లోనే రసాయనాల వ్యవహారం ఫిర్యాదు రూపంలో చేరిందని, రహస్యంగా విచారించి, నిర్ధారించుకున్న అనంతరం ప్రస్తుతం బయట పెట్టానంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రాజీనామాకు ఒత్తిడి తెచ్చినా, ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా, ప్రైవేటు పాల రసాయనాల భరతం పట్టే విషయంలో తాను వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
పండే కదా అని తినేస్తే..!
-
మధురఫలంలోమతలబు
-
రంగు చూసి కొంటే రోగాలే
- నిషేధిత కార్బైడ్‌తో మామిడి పండ్లను మాగబెడుతున్న వ్యాపారులు - పట్టించుకోని అధికారులు - ఇలాంటి పండ్లను తింటే అనారోగ్యం ఖాయమంటున్న వైద్యులు చూసేందుకు చక్కగా ఉంటాయి. సువాసననూ వెదజల్లుతూ నోరూరించేస్తాయి. అలాగని ఏవి పడితే అవి తిన్నామో అసలుకే ఎసరొస్తుంది. ఇదంతా చెబుతోంది మామిడిపళ్ల గురించే. కాల్షియం కార్బైడ్ గుళికలతో మాగబెట్టిన మామిడి పళ్లను కొందరు వ్యాపారులు స్వలాభం కోసం యథేచ్ఛగా మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు. అనంతపురం అగ్రికల్చర్ : మళ్లీ మామిడి పళ్ల సీజన్ వచ్చేసింది. కలర్ఫుల్గా కనిపించే పండ్లను జనం కూడా బాగానే కొనేస్తున్నారు. అయితే కొనేముందు, తినే ముందు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఎక్కువ మంది వ్యాపారులు నిషేధిత కాల్షియం కార్బైడ్ అనే రసాయన గుళికలు వేసి మామిడి పళ్లను మాగబెట్టేస్తున్నారు. ఇలాంటి వాటిని తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. మార్కెట్లోకి చైనా పౌడర్ ప్రభుత్వం జీఓ జారీ చేసినా, అధికారులు హెచ్చరికలు చేస్తున్నా వ్యాపారులు మాత్రం తమ పంథా మార్చుకోవడం లేదు. తోటల్లోనూ, రహస్య ప్రాంతాల్లో మామిడి పళ్లను కార్భైడ్‌తో మాగబెడుతున్నారు. కార్భైడ్పై నిఘా ఉండటంతో ఇటీవల చైనా నుంచి మరో రకం పౌడర్ అందుబాటులోకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇపుడు చాలామంది చైనా పౌడర్‌తో మామిడి పండ్లను మాగబెట్టి మార్కెట్లోకి వదులుతున్నట్లు సమాచారం. అధికారుల మధ్య సమన్వయ లోపం ఉద్యానశాఖ, మార్కెటింగ్ శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో యథేచ్చగా కార్భైడ్ పండ్లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై అధికారులు సమావేశం ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం మాగబెట్టని వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 39 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి తోటలు ఉండగా అందులో కాపుకు వచ్చినవి 20 వేల హెక్టార్లలో ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలా మాగబెడతారు మండీలు, తోటల్లో కాయలను కుప్పగా పోసి రాళ్లు మాదిరిగా ఉండే కాల్షియం కార్బైడ్‌ను చిన్నపాటి గుళికలు చేసి చిన్న చిన్న పాలిథీన్ కవర్లలో పెట్టి పైన పేపర్లు, గడ్డి లాంటివి కప్పుతారు. కాల్షియం కార్బైడ్ వల్ల ప్రమాదకరమైన అసిటలీన్ అనే వాయువును విడుదలవుతుంది. పక్వానికి రాని మామిడికాయలను ఒక రోజులోనే మాగేటట్లు చేస్తుంది. అసిటలీన్ అనే వాయువు చాలా ప్రమాదకరమైంది. మాములుగా అసిటలీన్ను వెల్డింగ్ ప్రక్రియలో ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో కాల్షియం కార్బైడ్ అనే రసాయనం అతి తక్కువ ధరకు లభిస్తుంది. కాల్షియం కార్బైడ్ కాకుండా మరికొందరు క్రిమిసంహారక ముందులు కూడా పిచికారి చేస్తున్నారు. ఆరోగ్యంపై ప్రభావం కాల్షియం కార్బైట్‌తో మాగబెట్టిన పండ్లను తింటే నోటి అల్సర్, గ్యాస్ట్రిక్, డయేరియా, క్యాన్సర్, నాడీ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అనేకమైన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువ రంగుతో లభించే పండ్లను కొనకూడదనీ, పండ్ల పై భాగంలో రసాయనాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్న తర్వాత ఉప్పు కలిపిన నీటితో బాగా శుభ్రం చేసి తినాలని చెబుతున్నారు. కార్బైడ్ పండ్లలో పోషకాలు కూడా ఉండవని వైద్యులు చెబుతున్నారు. సహజ పద్ధతులే మేలు వరిగడ్డి లేదా బోధగడ్డి లాంటి సహజ పద్ధతులతో పాటు రైపనింగ్ ఛాంబర్లలో మాగబెట్టిన మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచిదని వైద్యులు, ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పండ్లు మాగడానికి ‘ఇథలీన్’ వాయువు చాలా అవసరం. ఇథలీన్ వాయువు ఉత్పత్తి కావడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఒకటన్ను మాగబెట్టడానికి 1 మి.లీ ఇథరిల్ ద్రావణం, 1 గ్రాము సోడియం హైడ్రాక్సైడ్ అవసరమని చెబుతున్నారు. మార్కెట్‌యార్డులో భూమిపుత్ర రైపనింగ్ ఛాంబర్ (58వ షాపు) గత నాలుగేళ్ల నుంచి అందుబాటులో ఉన్నా మాగడం ఆలస్యమవుతుందని చాలా మంది వ్యాపారులు, రైతులు ఇటువైపు మొగ్గు చూపడం లేదు. అయితే ఇటీవల మార్కెట్‌యార్డులో కార్బైడ్ నివారణకు కొంత వరకు చర్యలు చేపట్టడంతో ఇప్పుడిప్పుడే రైపనింగ్ ఛాంబర్‌కు మామిడికాయలు రావడం ప్రారంభమయ్యాయి. రోజుకు ఐదారు టన్నుల మామిడిని మాగబెడుతున్నట్లు రైపనింగ్ ఛాంబర్ నిర్వాహకులు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, నల్లపరెడ్డి తెలిపారు. -
నేలల్లో తగ్గుతున్న సారం
రసాయనిక ఎరువులు వాడకమే కారణం పడిపోతున్న పంటల దిగుబడి సేంద్రియంతో ఈ దుస్థితికి అడ్డుకట్ట గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సలహాలు, సూచనలు గజ్వేల్: రసాయనిక ఎరువులు విచక్షణ రహితంగా వాడటం వల్ల భూముల్లో సారం తగ్గిపోయి పంటల దిగుబడి కూడా పడిపోతున్నది. రసాయనిక ఎరువుల వాడటంతో వాతావరణ కాలుష్యం తలెత్తి రసాయనిక ప్రమేయమున్న పంటల ఉత్పత్తి జరుగుతున్నది. ఈ దుస్థితికి అడ్డుకట్ట వేయడానికి రైతులు సేంద్రియ ఎరువుల వాడకంపై దష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ అంశంపై గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ (సెల్: 7288894469) అందించిన సలహాలు, సూచనలు ఇవి... 1. పంటకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలను సేంద్రియ ఎరువుల ద్వారా అందించవచ్చు. 2. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నపుడు సేంద్రియ ఎరువులు... భూమి పొరల్లో ఉండే నీటిని మొక్కలకు అందేవిధంగా చేస్తాయి. 3. సేంద్రియ ఎరువులు భౌతిక లక్షణాలను ప్రభావితం చేస్తాయి. ఇసుక నేలల్లో మెత్తని మట్టి శాతాన్ని పెంచడానికి, నీటిని పట్టి ఉంచే శక్తిని పెంపొందించడానికి దోహదపడతాయి. ఫలితంగా మొక్కలు పరిస్థితులకు తట్టుకొని పెరగడానికి వీలవుతుంది. 4. వివిధ రకాల ఎరువుల వల్ల కలిగే సమస్యలను సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పరిష్కరించుకోవచ్చు. 5. నేలల్లో మొక్కలకు మేలు చేసే అనేక రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల వద్ధికి సేంద్రియ ఎరువులు ఆహారంగా ఉపయోగపడతాయి. సేంద్రియ ఎరువుల లభ్యత 1. పశువుల పెంటను, పేడను కంపోస్ట్ అనే పద్ధతి ద్వారా నిల్వ చేయడం ద్వారా పోషకపదార్థాలు నష్టంకాకుండా కాపాడుకోవచ్చును. 2. కోళ్ల ఎరువును, బాతుల ఎరువును, పందుల పేడను, గొర్రెల పెంటను పోగుచేసి కుళ్లిపోయేలా చేసి ఉపయోగించవచ్చు. 3. గృహ సంబంధమైన వ్యర్థ పదార్థాలలో, కొయ్యబొమ్మల తయారీలో లభించే వ్యర్థ పదార్థాలు, తినడానికి ఉపయోగించిన ఆకులు, ఆయిల్కేక్ మొదలగునవి. సేంద్రియ ఎరువుల రకాలు కంపోస్ట్ ఎరువులు సాధారణంగా గ్రామాల్లో వివిధ పంటల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలతో కంపోస్ట్‌ను తయారు చేస్తారు. కలుపు మొక్కలు, తాలు, చెరకు ఆకులు, వేరుశనగ పొట్టు, పేడ మొదలైనవి కంపోస్ట్ తయారీకి ఉపయోగపడతాయి. కంపోస్ట్ తయారీకి ముందుగా ఆరు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతుగల గుంతలను తవ్వాలి. ఈ గుంతలలో పంటల అవశేషాలను 30సెం.మీ మందం పొరలుపొరలుగా నింపాలి. నేల మట్టం నుంచి 4.5ఎత్తు వరకు నింపి ఆపై మట్టిపొర గుంతను పూడ్చాలి. మూడు నెలల్లో గుంతలోని ఎరువు పంటలకు ఉపయోగపడేవిధంగా మారుతుంది. పచ్చిరొట్ట ఎరువులు పచ్చి రొట్ట ఎరువులు సస్యజాతికి చెందిన జనుము, పిల్లిపిసరా, జీలుగా లాంటి పంటలను పొలంలో వేసి పూత సమయంలో కోసి కలియదున్నడం, పచ్చి ఆకు లభించని చోట రైతులు పచ్చి రొట్టలు పెంచి కలియదున్నుతారు. పచ్చిరొట్ట ఎరువు వరుసగా 5సంవత్సరాలు చౌడుభూముల్లో వాడితే చౌడు ప్రభావం తగ్గి పంటల దిగుబడి పెరుగుతుంది. బయో ఫర్టిలైజర్స్ పప్పుజాతికి చెందిన మొక్కలలో వేరు బుడిపెలు ఉంటాయి. వీటిలో రైజోబియం అనే బాక్టీరియా గాలిలోని నత్రజని తీసుకొని మొక్కలకు అందించడానికి ఉపయోగపడుతుంది. -
రసాయన విగ్రహాలు హానికరం:జనార్ధన్ రెడ్డి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మానవాళికి హాని కల్గించే వినాయక విగ్రహాన్ని తయారుచేసి పూజించటం సరికాదని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్థన్‌రెడ్డి అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రసాయన వినాయకుడు వద్దు – మట్టి వినాయకుడే ముద్దు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ.. ఏ పండగనైనా పర్యావరణానికి అనుకూలంగా నిర్వహించుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ కనబరచాలని, బాడ్మింటన్ క్రీడాకారిణి సింధు ఆత్మ విశ్వాసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సభకు ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీగేటు నుంచి సుందరయ్య పార్కు వరకు మట్టి విగ్రహాల ప్రయోజనాలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ కళాశాల విద్యార్థులు కమిషనర్‌కు మట్టి విగ్రహాలను బహూకరించారు. జేవీవీ నగర అధ్యక్షులు నాగేశ్వర్రావ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, జేవీవీ జాతీయ కార్యదర్శి టి. రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు నెమళ్లు మృత్యువాత
కల్హేర్: పంట పొలాల్లో పిచికారి చేసిన రసాయనిక మందుల నీరు తాగి నాలుగు నెమళ్లు మృత్యువాత పడ్డాయి. అంతర్గాం శివారులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు వెంకట్రాంరెడ్డి వ్యవసాయ పొలం వద్ద నాలుగు నెమళ్లు మృతి చెంది ఉన్నాయి. మరో నాలుగు అస్వస్థతకు గురయ్యాయి. గోపాలమిత్ర శ్రీనివాస్ అస్వస్థతకు గురైన వాటికి ప్రాథమిక చికిత్స చేశారు. పొలాల్లోని రసాయనిక మందుల నీరు తాగడం వల్లే మృతి చెంది ఉంటాయని తెలిపారు. అటవీ శాఖ అధికారులకు అస్వస్థతకు గురైన నెమళ్లను అప్పగించారు. -
దానిమ్మతో ఎన్నెన్నో మేళ్లు!
పరి పరిశోధన ఏజింగ్‌తో కనిపించే శరీరక పరిణామాలు కనపడకూడదని కోరుకుంటున్నారా? కాలం గడుస్తున్న అదే యౌవనంతో ఉండాలని భావిస్తున్నారా? దానిమ్మపండు తినండి. ఇందులో ఉన్న అద్భుతమైన రసాయనాలు చాలా మేలు చేస్తాయి. వయసు పెరుగుతున్నప్పుడు కండరాల బలాన్ని సడలనివ్వకూడా చూస్తాయి. అదే కండరాల బిగువును చాలా కాలం కొనసాగనిస్తాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. దానిమ్మలో ఉండే ‘యురోలిథిన్-ఏ’ అనే మాలెక్యూల్ వయసు పెరుగుతున్నప్పుడు కలిగే దుష్పరిణామాలను నివారిస్తుంది. అంతేకాదు అంతేకాదు కణాల పనితీరు కాస్త తగ్గిన మొదట ఉన్నట్లే వాటిని రీఛార్జ్ చేస్తాయి. అంతేకాదు దానిమ్మలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే గుణం కూడా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాల్లో రోజూ దానిమ్మను తినేవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల క్యాన్సర్లు నివారితమవుతుందని తెలిసింది. ‘యురోలిథిన్-ఏ’ క్యాన్సర్ కణాలను అడ్డగించడానికి కూడా ఉపయోగపడుతుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. దానిమ్మలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణం ఉందనీ, పార్కిన్సన్స్ వ్యాధిని సైతం మరో అధ్యయనంలో తేలింది. అంతేకాదు... అది గుండెజబ్బుల ముప్పులనూ నివారిస్తుందన్న విషయం గతేడాది ప్రచురితమైన అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో నమోదైంది.