న్యూఢిల్లీ: ఆగ్రోకెమికల్స్ తయారీ కంపెనీ సేఫెక్స్ కెమికల్స్ పెట్టుబడుల బాట పట్టింది. రానున్న మూడు, నాలుగేళ్లలో రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలున్నట్లు వెల్లడించింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అగ్రిటెక్ సంస్థ అగ్‌కేర్ టెక్నాలజీస్‌లో తాజా పెట్టుబడులు వెచ్చించనున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా ఇంటరాక్టివ్ టెక్ ప్లాట్‌ఫామ్‌కు తెరతీయడంతోపాటు.. తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది.
ఇందుకు నిధులను అంతర్గత వనరుల నుంచి సమీకరించనున్నట్లు గ్రూప్ డైరెక్టర్ పియూష్ జిందాల్ తెలిపారు. నిధుల సమీకరణను చేపట్టే యోచన లేదని స్పష్టం చేశారు. ప్రధానంగా రైతుల కు ఉపయుక్తమయ్యేలా వాతావరణ సమాచారం, నిపుణుల సలహాలు, మండి రేట్లు తదితరాలను టెక్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందించనున్నట్లు వివరించారు. తయారీ యూనిట్ ద్వారా భారీ డిమాండుగల పశువుల దాణా తదితర ప్రొడక్టులతోపాటు ఇతర సొల్యూషన్లు రూపొందించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment