
భారతదేశంలో బంగారం ధర రూ. లక్ష దాటేసింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 78వేలు (10 గ్రా) వద్ద ఉన్న గోల్డ్.. నాలుగు నెలలు పూర్తి కాకుండానే, భారీ పెంపును పొందింది. పసిడి రేటు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ధరలు భారీగా పెరగడంతో.. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియక కొంతమంది సతమతమవుతుంటారు. బంగారం మీద కాకుండా.. ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభదాయకంగా ఉంటుందో ఈ కథనంలో చూసేద్దాం..
రియల్ ఎస్టేట్
బంగారం మీద పెట్టుబడి వద్దనుకుంటే.. రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ డబ్బుకు అధిక మొత్తంలో లాభం రావాలంటే.. ఇల్లు, స్థలాల మీద ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఈ రంగంలో ముందస్తు పెట్టుబడిగా భారీ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఇది స్థిరమైన.. దీర్ఘకాలిక ఆస్తి. తప్పకుండా భవిష్యత్తులో మంచి లాభలను తెచ్చిపెడుతుంది.
గోల్డ్ ఈటీఎఫ్‌లు & సావరిన్ గోల్డ్ బాండ్‌లు
బంగారం కొనుగోలు వద్దనుకుంటే.. గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా సావరిన్ గోల్డ్ బాండ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGBs) భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసే ఒక రకమైన ప్రభుత్వ బాండ్. ఇందులో కూడా అధిక లాభాలు పొందవచ్చు.
ఇదీ చదవండి: ఒకేసారి రూ.3000 పెరిగిన గోల్డ్: లక్ష దాటేసిన రేటు
స్టాక్‌లు & మ్యూచువల్ ఫండ్‌లు
బ్లూ-చిప్ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం కూడా.. బంగారం మీద పెట్టుబడికి ప్రత్యామ్నాయమే. అయితే ఇందులో కాలక్రమేణా రాబడి పెరుగుతుంది. ఒక్కోసారి మార్కెట్లలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు & బాండ్లు
కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ బాండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి వాటిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక్కడ కొంత తక్కువ రిస్క్ ఉంటుంది. స్థిరమైన రాబడి లభిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా కూడా మంచి రాబడులు పొందవచ్చు.
డిజిటల్ గోల్డ్
ఎంఎంటీసీ-పీఏఎంపీ, ఆగ్మోంట్, సేఫ్ గోల్డ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో 24 క్యారెట్ల బంగారాన్ని డిజిటల్‌గా కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ గోల్డ్ వెయిట్ ప్రకారం లేదా ధర ప్రకారం కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసిన తర్వాత, మీరు దానిని నగదుకు విక్రయించవచ్చు లేదా భౌతిక బంగారంగా రీడీమ్ చేయవచ్చు.