
న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి 2024–25లో రూ.1.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2023–24లో వచ్చిన పెట్టుబడులు రూ.1.45 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 18 శాతం తగ్గాయి. అయినప్పటికీ గణనీయంగా పెట్టుబడులు రావడం గమనించొచ్చు. అంతేకాదు, ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలతో (ఫోలియోలు)పాటు, హైబ్రిడ్ ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు (ఏయూఎం) అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే వృద్ధి చెందడం గమనార్హం. ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 1.35 కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరం చివరికి 1.56 కోట్లకు పెరిగాయి.
ఇక వీటి నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.7.23 లక్షల కోట్ల నుంచి రూ.8.83 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఏయూఎంలో 22 శాతం వృద్ధి నమోదైంది. ఈక్విటీ మార్కెట్లో అనిశి్చతులు పెరిగిపోవడం, కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం వంటి పరిణామాలు పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు నిపుణులు చెబుతున్నారు.
హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయని తెలిసిందే. హైబ్రిడ్ పథకాల్లో డెట్ పెట్టుబడులకు ఉండే రక్షణ దృష్ట్యా అవి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించినట్టు ట్రేడ్‌జినీ సీవోవో త్రివేష్ తెలిపారు. అచ్చమైన ఈక్విటీలతో పోలి్చతే ఈ పథకాల్లో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు అంత ఆందోళన చెందక్కర్లేదన్నారు. 2022–23లో ఇదే విభాగం నికరంగా రూ.18,813 కోట్లను కోల్పోవడం గమనార్హం.