Hybrid funds
-
రిస్క్ తక్కువ.. మెరుగైన రాబడి
పెట్టుబడులపై మెరుగైన రాబడులు అందరూ కోరుకుంటారు. కానీ, అస్థిరతల రిస్క్‌ను ఎదుర్కొనే గుండె ధైర్యం అందరికీ ఉండకపోవచ్చు. రిస్క్ తక్కువగా ఉండాలి, అదే సమయంలో అచ్చమైన డెట్‌తో పోల్చితే కాస్త మెరుగైన రాబడి కోరుకునే వారికి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలం. ఈ విభాగంలో నమ్మకమైన పనితీరు చూపిస్తున్న కొన్ని పథకాల్లో పరాగ్ పారిఖ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ ఒకటి. మధ్య, దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. బాండ్ల పట్ల బుల్లిష్ ధోరణితో ఉన్న వారికి కూడా ఈ విభాగం అనుకూలం.రాబడులుఈ పథకం ఏడాది కాలంలో 16.6 శాతం రాబడిని అందించింది. మూడేళ్లలో ఏటా11.49 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. 2021 మే నెలలో ఇది ప్రారంభమైంది. అంటే ఈ పథకానికి మూడేళ్ల చరిత్రే ఉంది. అయినప్పటికీ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు పనితీరు కంటే ఈ పథకమే మెరుగ్గా పనిచేసినట్టు తెలుస్తోంది. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగంలో వార్షిక రాబడి 13.91 శాతంగా ఉంటే, మూడేళ్లలో వార్షిక రాబడి 8.59 శాతంగానే ఉండడం గమనించొచ్చు.పెట్టుబడుల విధానంకన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ సాధారణంగా ఈక్విటీలకు 25–30 శాతం వరకు (పరిస్థితులు, అవకాశాలు) పెట్టుబడులు కేటాయిస్తుంటాయి. డెట్‌లో 70 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కానీ పరాగ్ పారిఖ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్మాత్రం నేరుగా ఈక్విటీల్లో 15 శాతం వరకే ఇన్వెస్ట్ చేస్తుంది. మరో 10–15 శాతం వరకు ఈక్విటీ ఆర్బిట్రేజ్ అవకాశాల్లో పెట్టుబడులు పెడుతుంటుంది.పరాగ్ పారిఖ్ మ్యూచువల్ ఫండ్ సాధారణంగా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. రాబడుల కోసం అధిక రిస్క్ తీసుకోవడానికి మొగ్గు చూపదు. ఈ పథకమనే కాకుండా ఈ సంస్థకు చెందిన అన్ని విభాగాల్లోనూ ఇదే విధానం అంతర్లీనంగా కొనసాగుతుంటుంది. అందులో ఇది కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ కనుక రిస్క్ ఇంకా తక్కువనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈక్విటీ కేటాయింపులను గమనించినట్టయితే ఎక్కువ పెట్టుబడులు డివిడెండ్ దండిగా పంపిణీ చేసే బ్లూచిప్ కంపెనీల్లోనే ఉన్నాయి. డివిడెండ్ స్టాక్స్‌లో అస్థిరతలు తక్కువగా ఉంటాయి. పోర్ట్ఫోలియోఈ పథకం నిర్వహణలో రూ.2,197 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 14.28 శాతం మేర ఈక్విట్లీలో ఇన్వెస్ట్ చేసింది. 75.71 శాతం డెట్ సాధనాలకు కేటాయించింది. రియల్ ఎస్టేట్ సాధానాల్లో 6.88 శాతం పెట్టుబడులు పెట్టింది. 3.13 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే ఈ నగదును ఉపయోగించి మెరుగైన అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 62 శాతం లార్జ్‌క్యాప్‌లోనే ఉన్నాయి. 32 శాతం మేర మిడ్‌క్యాప్‌లో, 6.18 శాతం మేర స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియోలో 14 స్టాక్స్ ఉన్నాయి. డెట్ పెట్టుబడులు గమనిస్తే 56 శాతం ఎస్‌వోవీ (సావరీన్ డెట్) రేటెడ్ పత్రాలు, 18.59 శాతం ఏఏఏ రేటెడ్ ఫండ్స్‌లోనే ఉండడం గమనించొచ్చు. అంటే డెట్‌లోనూ 74 శాతం పెట్టుబడులను రిస్క్ చాలా తక్కువ ఉన్న వాటినే ఎంపిక చేసుకుంది. -
హైబ్రిడ్ ఫండ్స్‌కు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు గత నెలలో భారీ డిమాండ్ నెలకొంది. దీంతో 2024 జనవరిలో పెట్టుబడులు 37 శాతం జంప్ చేశాయి. రూ. 20,634 కోట్లను తాకాయి. డెట్ ఫండ్స్‌పై పన్ను చట్టాలలో మార్పులరీత్యా ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశంగా నిలుస్తుండటంతో ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24) తొలి 10 నెలల్లో(ఏప్రిల్–జనవరి) హైబ్రిడ్ ఫండ్స్‌లో మొత్తం పెట్టుబడులు రూ. 1.21 లక్షల కోట్లకు చేరాయి. అయితే గతేడాది(2022–23) హైబ్రిడ్ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు వెనక్కి మళ్లిన సంగతి తెలిసిందే. హైబ్రిడ్ ఫండ్స్ అంటే హైబ్రిడ్ ఫండ్స్‌కు చెందిన మ్యూచువల్ ఫండ్ పథకాలు సాధారణంగా ఈక్విటీ, రుణ సెక్యూరిటీలు రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. కొన్ని సందర్భాలలో బంగారం తదితర ఆస్తులలోనూ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తుంటాయి. కాగా.. 2023 ఏప్రిల్ నుంచి హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడిదారులను తమవైపు తిప్పుకున్నాయి. ఇందుకు ప్రధానంగా ఏప్రిల్ నుంచి డెట్ ఫండ్స్ పన్ను చట్టాలలో నెలకొన్న సవరణలు ప్రభావం చూపుతున్నాయి. అంతక్రితం మార్చితో ముగిసిన ఏడాదిలో రూ. 12,372 కోట్ల పెట్టుబడులు తరలిపోవడం గమనార్హం! మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) తాజా గణాంకాల ప్రకారం జనవరిలో హైబ్రిడ్ పథకాలు రూ. 20,637 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు డిసెంబర్లో లభించిన రూ. 15,009 కోట్లతో పోలిస్తే భారీగా ఎగశాయి. ప్రధానంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌కు అత్యధిక పెట్టుబడులు ప్రవహించాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు రూ. 10,608 కోట్లు లభించగా.. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌కు రూ. 7,080 కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. గత ఆరు నెలల్లోనూ ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు 50–70 శాతాన్ని కేటాయించారు. ఇందుకు పన్ను మార్గదర్శకాలలో మార్పులు కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆర్బిట్రేజ్ ఫండ్స్ స్ప్రెడ్ సుమారు 8 శాతానికి చేరడం పెట్టుబడి అవకాశాలకు దారి చూపుతున్నట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ వెల్లడించారు. ఫోలియోలు ప్లస్ జనవరిలో హైబ్రిడ్ ఫోలియోలు 3.36 లక్షలు కొత్త గా జత కలిశాయి. దీంతో మొత్తం హైబ్రిడ్ ఫోలియోల సంఖ్య 1.31 కోట్లకు చేరింది. వెరసి మొత్తం 16.95 కోట్ల ఫోలియోలలో వీటి వాటా 7.7 శాతా న్ని తాకింది. తక్కువ రిస్క్ భరించే ఇన్వెస్టర్లకు హై బ్రిడ్ ఫండ్స్ ఉపయుక్తంగా ఉంటాయి. ఈక్విటీ మా ర్కెట్లలో పెట్టుబడులు ఆటుపోట్లకు లోనయ్యే సంగతి తెలిసిందే. అయితే ఫిక్స్డ్ ఆదాయంలో లభించే స్థిరత్వాన్ని ఇవి కల్పిస్తుండటంతో పెట్టుబడు లను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ ఆదా యం మార్గాలలో ఇన్వెస్ట్ చేయదలచినవారు హైబ్రి డ్ ఫండ్స్వైపు చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
తక్కువ రిస్క్.. స్థిరమైన రాబడికి బెస్ట్ ఆప్షన్..
ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు సర్వ సాధారణం. ఆటుపోట్లతో చలిస్తూ ఉంటాయి. కానీ, దీర్ఘకాలానికి నికర ప్రతిఫలం సానుకూలంగానే ఉంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఈ ఆటుపోట్లను తట్టుకునే సామర్థ్యం అందరు ఇన్వెస్టర్లలోనూ ఉండాలని లేదు. కొందరు రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారికి ఈక్విటీ, డెట్‌తో కూడిన హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ కూడా ఒకటి. రిస్క్ తక్కువ ఉండాలని కోరుకునే వారు ఈ పథకాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. గడిన ఏడాది కాలంలో ఈ పథకం 9 శాతం రాబడులను అందింంది. మూడేళ్ల కాలంలో రాబడి ఏటా 13.56 శాతంగా ఉంది. ఐదేళ్ల కాలంలో చూసుకుంటే 13 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 14 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. పెట్టుబడుల విధానం ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడులను ఈక్విటీ, డెట్ మధ్య వర్గీకరిస్తాయి. ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రెండు మార్కెట్లలోని ప్రయోజనాలను ఇన్వెస్టర్లు సొంతం చేసుకున్నట్టు అవుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్న సమయంలో డెట్ పెట్టుబడులు పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈక్విటీలు అధిక రాబడులకు, డెట్ పెట్టుబడులు రక్షణకు సాయపడతాయి. పైగా అచ్చం డెట్ పథకాల్లో చేసే దీర్ఘకాల పెట్టుబడులకు ద్రవ్యోల్బణం పరంగా ఉన్న పన్ను ప్రయోజనాన్ని ఇటీవల ఎత్తివేశారు. దీంతో హైబ్రిడ్ ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఈక్విటీకి ఉండే పన్ను మినహాయింపు ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఈ పథకం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 75 శాతం వరకు ఈక్విటీలకు, 25 శాతం వరకు డెట్‌కు కేటాయిస్తుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపుల్లో మార్పులు చేస్తుంటుంది. ఈక్విటీల్లోనూ 50 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌కే కేటాయిస్తుంది. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో అస్థిరతలు కొంత తక్కువగా ఉంటాయి. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో ర.59,302 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వీటిల్లో ఈక్విటీలకు 76.76 శాతం కేటాయింంది. డెట్ పెట్టుబడులు 20.32 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్‌లో 0.91 శాతం ఇన్వెస్ట్ చేయగా, 2 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈక్విటీలకు 75 శాతం మిం పెట్టుబడులు ఉండడాన్ని గమనించొచ్చు. డెట్ కంటే ఈక్విటీలు ఆకర్షణీయంగా మారినప్పుడు, ర్యాలీకి అవకాశం ఉన్నప్పుడు అధికంగా కేటాయింపులు చేయడం ద్వారా రాబడులు పెంచుకునే విధంగా ఫండ్ మేనేజ్మెంట్ బృందం పనిచేస్తుంటుంది. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లోన 85 శాతం మేర ప్రస్తుతం లార్జ్‌క్యాప్ కంపెనీలోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 14.56 శాతం మేర ఇన్వెస్ట్ చేయగా, స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేటాయింపులు 0.68 శాతంగానే ఉన్నాయి. డెట్‌లో రక్షణ ఎక్కువగా ఉండే ఎస్‌వోవీ, ఏఏఏ రేటెడ్ సాధనాల్లోనే అధిక పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 35 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 24 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. సేవల రంగ కంపెనీలకు 7.45 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 6.23 శాతం, ఆటోమొబైల్ కంపెనీలకు 6.12 శాతం, కమ్యూనికేషన్ కంపెనీలకు 5 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. -
మెరుగైన రాబడులకు హైబ్రీడ్ వ్యూహం..
ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాలు వారెన్ బఫెట్ కావచ్చు.. హోవార్డ్ మార్క్స్ కావచ్చు.. చౌకగా లభిస్తున్న విలువైన అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులు అందుకునేందుకు అధిక అవకాశాలు ఉంటాయని చెబుతారు. ఈ విషయంలో హైబ్రీడ్ ఫండ్స్‌కి మెరుగైన రికార్డు ఉంది. చౌకగా లభిస్తున్న విలువైన అసెట్స్‌ను గుర్తించి, ఇన్వెస్ట్ చేయడంలో ఇవి బాగా రాణిస్తున్నాయి. రిసు్కలకు తగ్గట్లుగా హైబ్రీడ్ వ్యూహాలు మంచి రాబడులు అందించగలుగుతున్నాయి. హైబ్రీడ్ ఫండ్స్‌లో ప్రధానంగా అయిదు రకాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్ధ్యాలను బట్టి వీటిని పరిశీలించవచ్చు. అవేంటంటే.. ► కన్జర్వేటివ్ హైబ్రీడ్: ఈ ఫండ్స్ 10–25 శాతం ఈక్విటీల్లోను, మిగతా 75–90 శాతం మొత్తాన్ని డెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్కు సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్నవారు, డెట్‌కు ప్రాధాన్యం ఇస్తూనే కాస్త అధిక రాబడుల కోసం ఈక్విటీల్లోనూ కొంత ఇన్వెస్ట్ చేయదల్చుకున్నవారికి ఇవి అనువైనవిగా ఉంటాయి. ► అగ్రెసివ్ హైబ్రీడ్: ఈ కేటగిరీ స్కీముల కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో, మిగతా 20–35 శాతాన్ని డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. అధిక రిస్కు సామర్ధ్యాలు ఉన్న ఇన్వెస్టర్లకు ఇవి అనువైనవి. ► బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్: ఈ ఫండ్స్‌లో అసెట్స్‌కు కేటాయింపులు డైనమిక్‌గా మారుతుంటాయి. కాబట్టి మార్కెట్ పరిస్థితులను బట్టి పోర్ట్‌ఫోలియోలోని 0–100 శాతం మొత్తాన్ని పూర్తిగా ఈక్విటీల్లోనైనా లేదా డెట్లోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక మోస్తరు రిస్కు సామరŠాధ్యలు ఉన్నవారికి ఇవి అనువైనవి. ► మలీ్ట–అసెట్ అలొకేషన్: ఈ కేటగిరీ ఫండ్లు ఈక్విటీ, డెట్, బంగారం/వెండి, రీట్స్, ఇని్వట్స్ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ అసెట్స్ అన్నీ పరస్పరం సంబంధం లేకుండా వివిధ రకాలైనవి కావడం వల్ల తగు విధమైన డైవర్సిఫికేషన్ వీలవుతుంది. రాబడులూ మెరుగ్గా ఉండగలవు. ఉదాహరణకు గతేడాది బెంచ్‌మార్క్ రాబడులు 5.8 శాతం స్థాయిలో ఉండగా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మలీ్ట–అసెట్ ఫండ్ గతేడాది 16.8 శాతం రాబడులు ఇచి్చంది. ► ఈక్విటీ సేవింగ్స్: ఈ ఫండ్స్ ఈక్విటీ, తత్సంబంధ సాధనాల్లో 65 శాతం వరకు, డెట్‌లో 10 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ విభాగంలో చాలా మటుకు ఫండ్స్ డెరివేటివ్స్‌ను ఉపయోగిస్తాయి. తద్వారా రిస్కును తగ్గించడంపై దృష్టి పెడతాయి. ఇన్వెస్టర్లకు డెట్కన్నా మెరుగ్గా, ఈక్విటీ కన్నా కాస్త తక్కువగా రాబడులను అందించేందుకు ఈ తరహా ఫండ్స్ ప్రయతి్నస్తాయి. రిస్కు సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్న వారు వీటిని పరిశీలించవచ్చు. మలీ్ట–అసెట్ విధానం పాటిస్తాయి కాబట్టి ఓపికగా ఉండే ఇన్వెస్టర్లకు రిసు్కలకు తగినట్లుగా మెరుగైన రాబడులను అందించేందుకు హైబ్రీడ్ ఫండ్స్ ప్రయతి్నస్తాయి. -
రిస్క్ తక్కువ.. రాబడి ఎక్కువ!
ఎక్కువ రిస్క్ వద్దు.. పెట్టుబడిపై రాబడి మెరుగ్గా ఉండాలి? ఈ రెండూ కోరుకునే వారికి హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలం. ఇవి ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటితో పోలిస్తే నూరు శాతం తీసుకెళ్లి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ రిస్క్ తగ్గించుకునేందుకు కొంత మొత్తాన్ని డెట్‌కు కేటాయించే హైబ్రిడ్ పథకాలు అందరికీ అనుకూలమే. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్.. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగం కిందకే వస్తుంది. ఈ పథకం ఈ విభాగంలో మెరుగైన రాబడులను ఇస్తోంది. మధ్య కాలం నుంచి (5 ఏళ్లు) దీర్ఘకాలానికి ఈ పథకంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ రివ్యూ రాబడులు ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 12% రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో చూసుకుంటే వార్షిక రాబడి రేటు 15.56 శాతంగా ఉంటే, ఐదేళ్లలో 12.28 శాతం, ఏడేళ్లలో 13 శాతం, 10 ఏళ్ల కాలంలో 16 శాతం చొప్పున రాబడులను అందించింది. కొంత భాగాన్ని డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది కనుక ఈ పథకం చూపిస్తున్న పనితీరు మెరుగ్గా ఉందని చెప్పుకోవాలి. ఏ కాలంలో చూసినా రాబడి 12 శాతం తగ్గలేదు. పైగా ఈ పథకం 1999లో ఆరంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే పెట్టుబడులపై ఏటా 14 శాతం కంటే ఎక్కువ రాబడి ఇచ్చింది. మెరుగైన పనితీరుకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. కానీ, బ్యాలన్స్డ్ టోటల్ రిటర్న్ ఇండెక్స్, అగ్రెస్సివ్ హైబ్రిడ్స్ ఫండ్స్ విభాగాలు గడిచిన ఏడాది కాలంలో సగటున నష్టాల్లో ఉండడం గమనించాలి. వీటితో పోలిస్తే ఐసీఐసీఐ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ పనితీరు అందనంత ఎత్తులో ఉంది. మిగిలిన కాలాల్లోనూ ఈ పథకమే 2–5 శాతం మేర అధికంగా ప్రతిఫలాన్నిచ్చింది. కనుక రాబడుల పరంగా స్థిరమైన, నమ్మకమైన పనితీరు ఈ పథకానికి ఉంది. పోర్ట్‌ఫోలియో ఈ పథకం ఈక్విటీల్లో 65 శాతం, డెట్‌లో 35 శాతం చొప్పున పెట్టుబడులు పెడుతుంటుంది. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.19,096 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 71.3 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. 28.5 శాతం డెట్ విభాగానికి కేటాయించింది. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 57 స్టాక్స్ ఉన్నాయి. టాప్–10 స్టాక్స్‌లోనే 52 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. డెట్‌లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉండే ఏఏ రేటెడ్ సాధనాల్లో సుమారు 7 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. మిగతా పెట్టుబడులన్నీ అధిక రక్షణ కలిగిన ఎస్‌వోవీ, ఏఏఏ రేటెడ్ సాధనాల్లోనే పెట్టింది. ఈక్విటీల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగానికి చెందిన కంపెనీలకు మొత్తం పెట్టుబడుల్లో 17.55 శాతం కేటాయించింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీల్లో 13.70 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 9.39 శాతం, నిర్మాణ రంగ కంపెనీల్లో 7.73 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 5.63 శాతం, మైనింగ్ కంపెనీల్లో 5 శాతానికి పైగా పెట్టుబడులు కలిగి ఉంది. -
Mirae Asset Hybrid Equity Fund: రిస్క్‌కు మించి రాబడులు
ఒమిక్రాన్ వేరియంట్ పై నెలకొన్న అనిశ్చితి, సులభ ద్రవ్య లభ్యత విధానాలకు సెంట్రల్ బ్యాంకులు స్వస్తి చెబుతుండడం ఇవన్నీ 2022లో మార్కెట్ల గమనాన్ని నిర్ధేశించనున్నాయి. అనిశ్చితి సమయాల్లోనూ, తాము చేసే పెట్టుబడులకు రిస్క్ మరీ ఎక్కువగా ఉండకూడదని భావించే వారికి హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఇవి ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ల వ్యాల్యూషన్ల ఆధారంగా రెండు విభాగాల మధ్య కేటాయింపులను మారుస్తుంటాయి. కనుక పోర్ట్‌ఫోలియో గురించి ఇన్వెస్టర్ ఎక్కువగా ఆందోళన పెట్టుకోవాల్సిన పని ఉండదు. పెట్టుబడుల విధానం.. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీల్లో 65 శాతం నుంచి 80 శాతం మధ్య (మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. దీర్ఘకాలం పాటు (ఐదేళ్లకు పైగా) ఇన్వెస్ట్ చేసే వారికి రిస్క్ ఉన్నా కానీ ఇవి మంచి రాబడులను ఇస్తాయి. 20–35 శాతం పెట్టుబడులను డెట్ సాధనాలకు కేటాయిస్తాయి. ఈ విభాగంలో మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ మంచి పనితీరు చూపిస్తోంది. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్. అచ్చమైన ఈక్విటీ ఫండ్ మాదిరే స్వల్పకాలానికి హైబ్రిడ్ ఫండ్స్‌లోనూ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇవి కూడా ఎక్కువ భాగాన్ని ఈక్విటీలకే కేటాయిస్తుంటాయి. మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం ఈక్విటీలకు 70–75 శాతం మధ్య పెట్టుబడులను కేటాయిస్తుంటుంది. వృద్ధికి మెరుగైన అవకాశాలు ఉండి, హేతుబ్ధమైన వ్యాల్యూషన్ల వద్ద లభించే స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటుంది. ఇందుకోసం బోటమ్ అప్ విధానాన్ని అనుసరిస్తుంది. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.6,229 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీలకు 74.9 శాతం పెట్టుబడులను కేటాయించింది. డెట్‌లో 18 శాతం ఇన్వెస్ట్ చేసి, మిగిలిన ఆస్తులను నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 62 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌లో 50 శాతం, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో 11 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 25 శాతం పెట్టుబడులను కేటాయించింది. ఆ తర్వాత పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, ఎనర్జీ, హెల్త్‌కేర్, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రాబడులు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగం గడిచిన మూడేళ్లలో సగటున 7.9 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. కానీ ఇదే విభాగంలోని మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ 16 శాతానికి పైనే సగటు వార్షిక రాబడిని (ట్రెయిలింగ్) ఇచ్చింది. ఐదేళ్లలో హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ విభాగం సగటు వార్షిక రాబడి 13.7 శాతం దగ్గర ఉంటే, ఈ పథకంలో రాబడులు 15 శాతానికి పైనే ఉన్నాయి. ఏ కాలంలో చూసినా కానీ ఈ పథకం పనితీరు పరంగా ముందుండడాన్ని గమనించొచ్చు. మార్కెట్ల దిద్దుబాటు సమయంలో నష్టాలను కూడా పరిమితంగా ఉండే విధానాలను అనుసరిస్తుంది. డెట్ విభాగంలో అధిక క్రెడిట్ రేటింగ్ ఉన్న సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, ఏఏఏ రేటింగ్ కలిగిన కార్పొరేట్ బాండ్లను ఎంచుకుంటుంది. డెట్‌లో రిస్క్ తీసుకోదు. చదవండి: Fund Review: స్థిరత్వంతో కూడిన రాబడులు.. మిరే అస్సెట్ లార్జ్‌క్యాప్ ఫండ్ -
మ్యూచువల్ ఫండ్స్ వల్ల కలిగే లాభాలేమిటి?
కరోనా మహమ్మారి తర్వాత తమ డబ్బును ఖర్చు చేయకుండా, మంచి రాబడి ఇచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. అయితే, ఎందులో పెట్టుబడి పెట్టాలని తెగ ఆలోచిస్తుంటారు. ఈ మధ్య పెట్టుబడికి మ్యూచువల్ ఫండ్ ఒక మంచి ఎంపిక అని నిపుణులు ఎక్కువగా చెబుతున్నారు. ఇందులో రాబడి కూడా స్థిరంగా వస్తుంది. అలాగే, స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అంతేకాదు, స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో పూర్తిగా తెలియని వారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. అందుకే, పెట్టుబడి పెట్టే ముందు మ్యూచువల్ ఫండ్ గురుంచి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి, దాని వల్ల కలిగే లాభాలేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి స్టాక్‌లు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి మొదలైన వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడి పెట్టే ఒక రకమైన పెట్టుబడి పథకం. ఫండ్ మేనేజర్లు అని పిలిచే ప్రొఫెషనల్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్లు మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తారు. మీ తరుపున మార్కెట్ గురించి మంచి జ్ఞానం ఉన్న ఆర్ధిక నిపుణులు మనకు లాభాలను తెచ్చిపెట్టే ఫండ్‌లో మీ డబ్బును పెట్టుబడి పెడతారు. ఈ నిపుణులు పెట్టుబడిదారుల తరఫున సెక్యూరిటీలను కొనుగోలు చేసి విక్రయిస్తాడు. ఈ కంపెనీలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారుల నుండి కమీషన్లు తీసుకుంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం గురించి పెద్దగా తెలియని వారికి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడికి మంచి ఎంపిక. మ్యూచువల్ ఫండ్స్ రకాలు ఫైనాన్షియల్ సంస్థలు వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. స్కీమ్ రకం, ఫండ్ లక్ష్యాలు, పెట్టుబడి పెట్టిన ఆస్తులు మొదలైన వాటి ఆధారంగా వీటిని అనేక కేటగిరీలుగా వర్గీకరించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్: ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టాక్స్‌లో పెట్టుబడి పెడుతుంటే దాన్ని ఈక్విటీ ఫండ్ అంటారు. వీటిపై మార్కెట్ రిస్క్‌తో పాటు రాబడి కూడా అధికంగా ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్: ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. డెట్ ఫండ్స్ విషయంలో కంపెనీలు కార్పొరేట్, ప్రభుత్వ బాండ్లు వంటి రిస్క్ తక్కువగా ఉండే మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ తక్కువగా ఉంటుంది. అయితే వీటిలో లాభాలు ఎక్కువగా ఉండవు. డెట్ ఫండ్స్‌లో ఫిక్స్డ్ రిటర్న్‌లతోపాటు డబ్బు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ తక్కువ సమయంలో సురక్షితమైన పెట్టుబడికి డెట్ ఫండ్స్ మంచి ఆప్షన్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్: కొన్ని కంపెనీలు షేర్లలో కొంత మొత్తాన్ని, డెట్ సెక్యూరిటీలలో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలాంటి పథకాలను హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. లిక్విడ్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇతర మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫండ్ కంపెనీ పెట్టుబడి పెట్టే షేర్ల రకాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లేదా మల్టీ క్యాప్ రకాలు కూడా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ వల్ల కలిగే ప్రయోజనాలు మ్యూచువల్ ఫండ్ వల్ల ప్రయోజనం ఏమిటంటే, ఇక్కడ మీ పెట్టుబడిని ఫండ్ మేనేజర్ నిర్వహిస్తారు, అతను మార్కెట్ గురించి మంచి అవగాహన కలిగి ఉంటాడు. అటువంటి పరిస్థితిలో, అతను మీ డబ్బును ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెడతాడు, అక్కడ రాబడి మంచిదని భావిస్తున్నారు. అదే సమయంలో, మీ పోర్ట్‌ఫోలియో మ్యూచువల్ ఫండ్ల ద్వారా వైవిధ్యభరితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ, కేవలం ఒక వాటాకు బదులుగా, డబ్బును వేర్వేరు వాటాలలో లేదా ఆస్తి తరగతిలో ఉంచారు. ఒకదానిలో ప్రమాదం ఉంటే, అది మరొకదాని ద్వారా భర్తీ చేస్తూ ఉంటుంది. మీ డబ్బు డెట్ ఫండ్లలో కూడా పెట్టుబడి పెట్టబడింది, కాబట్టి మార్కెట్ అస్థిరత ఉన్నప్పటికీ, డబ్బు ఇప్పటికీ సురక్షితంగా ఉంది. మీరు పెట్టుబడి పెట్టగల గరిష్ట మొత్తంపై పరిమితి లేనప్పటికీ, రూ. 500 కంటే తక్కువ మొత్తంతో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. అయితే ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడుల విషయంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు(ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం) మాత్రమే మీరు పన్ను ప్రయోజనాన్ని పొందుతారని గుర్తుంచుకోండి. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంలో గరిష్టంగా కమిషన్ 2.5%(సెబీ నిబంధనల ప్రకారం) వరకు తీసుకుంటాయి. -
ఫ్లెక్సీ, హైబ్రిడ్ ఫండ్స్‌లో ఏది మెరుగు?
ఐదేళ్ల నా కుమారుని భవిష్యత్తు అవసరాల కోసం రూ.లక్షను ఇన్వెస్ట్ చేద్దామన్నది నా ఆలోచన. ఇందుకోసం ఫ్లెక్సీక్యాప్ లేదా అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో ఏ విభాగాన్ని ఎంపిక చేసుకోవాలి? ఒక్కటే పథకాన్ని ఎంపిక చేసుకోవాలా లేక ఎక్కువ పథకాల్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవాలా? – సునీల్, వైజాగ్ రెండు రకాల విభాగాలూ మీ లక్ష్యానికి అనుకూలంగానే ఉంటాయి. గడిచిన మూడు, నాలుగేళ్లలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే.. మార్కెట్లలో ఉద్దాన, పతనాలను చూసే ఉంటారు. ముఖ్యంగా గతేడాది మార్చిలో మార్కెట్లు సగానికి కుప్పకూలినప్పుడు ఆందోళన చెంది ఉండకపోవచ్చు. ఇదే నిజమైతే అగ్రెస్సివ్ ఫండ్ విభాగంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐదేళ్ల కుమారుని ఉన్నత విద్యావసరాలకు ఇన్వెస్ట్ చేయాలన్నది మీ లక్ష్యం. కనుక కనీసం 10–15 ఏళ్ల పాటు మీ పెట్టుబడులను కొనసాగించగలరు. మార్కెట్ల అస్థిరతలను జీర్ణం చేసుకోగల శక్తి ఉంటే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ నుంచి అధిక రాబడులను అందుకోవచ్చు. అయితే, చాలా మంది ఇన్వెస్టర్లకు ఇది కష్టంగా అనిపించొచ్చు. కొత్తగా వచ్చే చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విలువ వేగంగా తగ్గిపోతుంటే ఆందోళనకు గురికావడం సహజం. అటువంటి ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో ఫ్లెక్సీక్యాప్‌ను కూడా పరిగణనలోకి తీసుకోరాదు. అటువంటి వారు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌కే పరిమితం కావడం మంచిది. మీ ప్రశ్నను పరిశీలిస్తుంటే అనుభవం కలిగిన ఇన్వెస్టర్ మాదిరే ఉన్నారు. అదే వాస్తవం అయితే ఫ్లెక్సీ క్యాప్ లేదా అగ్రెస్సివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయగలరు. అగ్రెస్సివ్ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుంటే కనీసం రెండు భిన్నమైన పథకాలను ఎంపిక చేసుకోండి. ఫ్లెక్సీక్యాప్ పథకం ఎంపిక చేసుకుంటే కనుక ఒక్క పథకం సరిపోతుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ వైవిధ్యంతో ఉంటాయి కనుక మీ అవసరాలకు ఒక్కటి సరిపోతుంది. ఫ్లెక్సీక్యాప్ విభాగంలో యాక్సిస్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్, పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అగ్రెస్సివ్ పథకాల్లో డీఎస్పీ మిడ్‌క్యాప్ ఫండ్లేదా ఎస్బీఐ స్మాల్‌క్యాప్ ఫండ్ లేదా కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్లను పరిశీలించొచ్చు. అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో 45–60 ఏళ్లలోని వారు తమ పెట్టుబడుల కేటాయింపులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా? క్రమం తప్పకుండా ఆదాయం కోసం (రెగ్యులర్) నాన్ పార్టిసిపేటింగ్ నాన్ లింక్డ్ సేవింగ్స్ పథకాలను పరిశీలించొచ్చా? – పాయల్, కడప రిటైర్మెంట్ (ఉద్యోగ, వృత్తి జీవితానికి విరామం పలకడం)కు మీరు ఎంత సమీపంలో ఉన్నారనేది ఇక్కడ ముఖ్యమైన అంశం అవుతుంది. రిటైర్మెంట్కు దగ్గరగా ఉంటే పెట్టుబడులను స్థిరాదాయ పథకాలవైపు ఎక్కువగా మళ్లించాలి. అయితే ఇతర అంశాలు కూడా ఇక్కడ ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆదాయం కోసం పెట్టుబడులపై ఆధారపడినట్టయితే భిన్నంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. స్థిరాదాయ పథకాలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. ఆదాయం కోసం పెట్టుబడులపై ఆధారపడాల్సిన అవసరం లేకపోతే అప్పుడు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవచ్చు. ఆదా యం కోసం పెట్టుబడులపై ఆధారపడరు కనుక ఈక్విటీల్లో పెట్టుబడుల గురించి ఆందోళన చెందా ల్సిన పరిస్థితి ఎదురుకాదు. అందుకే మీరు ఏ వయసులో ఉన్నారు, మీ అవసరాలకు అనుగుణంగా దీన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బీమా సంస్థ లు విక్రయించే నాన్ లింక్డ్ సేవింగ్స్ పథకాలను మీరు పరిశీలిస్తున్నట్టయితే వద్దన్నదే నా సూచన. ఈ ప్లాన్లు బీమా, పెట్టుబడులతో కలసి ఉంటా యి. కనుక గొప్ప సాధనం కాదు. తక్కువ వ్యయాలతో కూడిన డెట్ ఫండ్ లేదా తక్కువ వ్యయాలతో కూడిన ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను పెట్టుకోవచ్చు. దీనివల్ల మెరుగైన రాబడులు అందుకోగలరు. బీమా, పెట్టుబడులతో కూడిన సాధనానికి దూరంగా ఉండి.. మీ పరిస్థితులకు అనుగుణంగా అనువైన సాధనాన్ని ఎంపిక చేసుకోండి. ::ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
అటూ ఇటు లాభమే
సాధారణంగా షేర్లలోనూ, షేర్ల ఆధారిత ఫండ్స్‌లోనూ పెట్టుబడులంటే అధిక రాబడులకు అవకాశాలు ఉన్నా అందుకు తగ్గ స్థాయిలో రిస్కులూ ఉంటాయి. ఇక పెట్టుబడులకు పెద్ద రిస్కులు లేని సురక్షితమైన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేద్దామంటే ఫండ్స్ వైపు చూద్దామంటే రాబడులు ఓ మోస్తరు స్థాయిలోనే ఉంటాయి. అలా కాకుండా ఇటు అధిక రాబడులివ్వగలిగే ఈక్విటీలు, అటు సురక్షితమైన డెట్ సాధనాల ప్రయోజనాలను మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పొందాలనుకునే వారికి అనువైనవి హైబ్రీడ్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ ఆధారిత ఫండ్లు ప్రధానంగా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే.. డెట్ ఆధారిత ఫండ్స్ ప్రధానంగా డెట్ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ ఇస్ట్రుమెంట్స్, ట్రెజరీ బిల్లులు, కార్పొరేట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ రెండు అసెట్స్ ప్రయోజనాలను ఒకే సాధనం ద్వారా అందించగలిగే హైబ్రీడ్ ఫండ్స్‌పై అవగాహన పెంచేదే ఈ కథనం. హైబ్రీడ్ ఫండ్స్ స్వరూపం ఇదీ.. పెట్టుబడుల కేటాయింపు విధానం, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేష ద్వారా హైబ్రీడ్ ఫండ్స్ తక్కువ నష్టభయంతో ఎక్కువ ఫలితం పొందేందుకు అవకాశం కల్పిస్తాయి. తన కార్పస్ ఫండ్‌లో 65 శాతం నిధులను ఈక్విటీల్లోనూ, మిగతా మొత్తాన్ని డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్‌ను ఈక్విటీ ఆధారిత హైబ్రీడ్ మ్యూచువల్ ఫండ్‌గా వ్యవహరిస్తారు. దీనికి భిన్నంగా 65 శాతం భాగాన్ని డెట్ సాధనాల్లోనూ, మిగతా మొత్తాన్ని ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్‌ను డెట్ ఆధారిత హైబ్రీడ్ మ్యూచువల్ ఫండ్‌గా వ్యవహరిస్తారు. వీటినీ మరికొన్ని రకాలుగా వర్గీకరించారు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి.. సంప్రదాయ హైబ్రీడ్ ఫండ్స్ (10–25 శాతం ఈక్విటీల్లోను, మిగతాది డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేవి), బ్యాలె¯Œ ్సడ్ హైబ్రీడ్ ఫండ్స్ (40–60 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి), అగ్రెసివ్ హైబ్రీడ్ ఫండ్స్ (65–80 శాతం షేర్లలో ఇన్వెస్ట్ చేసేవి) మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఈ ఫండ్స్ ఎందుకంటే.. కొత్తగా ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటున్న వారు ఇలాంటి ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. మిగతా వాటితో పోలిస్తే పెట్టుబడికి కొంత ఎక్కువ భరోసానివ్వగలిగే హైబ్రీడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో వివిధ రకాల ఫండ్స్ ఉన్నందున తమ రిస్కు సామర్థ్యాన్ని బట్టి అనువైన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ అనుభవంతో ఫండ్స్‌లో పెట్టుబడులపై అవగాహన తెచ్చుకోవచ్చు. ఒకవేళ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే.. ఈక్విటీలకు అధిక కేటాయింపులు జరిపే ఫండ్స్ అనువైనవిగా ఉంటాయి. ఈక్విటీల్లో కనీసం 65 శాతం దాకా ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్నులపరమైన ప్రయోజనాలు కూడా లభించవచ్చు. కొత్త ఇన్వెస్టర్లకు, సమయానుకూలంగా ఇన్వెస్ట్ చేసేవారికి ఇవి అనువైనవిగా ఉంటాయి. కాగా ఆయా అంశాలపై మరింత అవగాహనకు అవసరమైతే నిపుణులను సంప్రదించాలి. -
పెట్టుబడుల్లో బ్యాలన్స్...
మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడులకు తక్కువ రిస్క్‌ను ఆశించే వారు, దీర్ఘకాలంలో సంప్రదాయ ఎఫ్డీలు, పోస్టాఫీసు పథకాల కంటే కాస్త అధికరాబడులు కోరుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో ఎస్బీఐ హైబ్రిడ్ ఈక్విటీ కూడా ఒకటి. గతంలో ఇది ఎస్బీఐ మ్యాగ్నం ఫండ్ పేరుతో నడిచింది. గతేడాదే సెబీ ఆదేశాల మేరకు పథకం పేరు మారింది. ఈ పథకం ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. కానీ, డెట్ సాధనాలకు మించి రాబడులను ఇవ్వగలదు. కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో పెడుతుంది. బుల్ మార్కెట్లో, బేర్ మార్కెట్లోనూ పనితీరు పరంగా ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. రాబడులు ఈ పథకం రాబడులు గడచిన ఏడాది కాలంలో మైనస్ 2 శాతంగా ఉన్నాయి. కానీ, మూడేళ్ల కాలంలో చూసుకుంటే సగటున ఏటా 10.46 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 15.39 శాతం, పదేళ్ల కాలంలో 16.19 శాతం చొప్పున రాబడులు ఇచ్చింది. 1995 డిసెంబర్ 31న ఈ పథకం ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 15.84 శాతంగా ఉన్నాయి. కనుక దీర్ఘకాలంలో ఓ బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఈ స్థాయి రాబడులు మెరుగైనవేనని చెప్పుకోవాలి. రిస్క్ ఎక్కువగా తీసుకోలేని వారికి ఈ తరహా బ్యాలన్స్డ్ ఫండ్స్ అనుకూలం. పెట్టుబడుల విధానం పెట్టుబడుల కేటాయింపును ఈ పథకం మేనేజర్లు తెలివిగా చేస్తుంటారు. ఆటుపోట్ల సమయాల్లో ఈక్విటీ ఎక్స్పోజర్ను తగ్గించుకుని నగదు నిల్వలు పెంచుకుంటారు. 2011 మార్కెట్ కరెక్షన్లో, 2015 ఒడిదుడుకుల సమయాల్లో ఈక్విటీలకు ఎక్స్పోజర్ తగ్గించుకోవడం వల్ల ఈ పథకంలో నష్టాలు పరిమితం అయ్యాయి. 2014 బాండ్ మార్కెట్ ర్యాలీ ప్రయోజనాలను సైతం పొందింది. 2018 మార్కెట్ల అస్థిరతల్లోనూ ఈక్విటీలో అధిక పెట్టుబడులను కాస్త తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలతో నష్టాలను పరిమితం చేయడం, లాభాలను ఒడిసిపట్టడం ఈ ఫండ్ మేనేజర్లు చేసే పని. ప్రస్తుతానికి ఈక్విటీల్లో 71.95 శాతం, డెట్‌లో 25.76 శాతం, నగదు నిల్వలు రూ.2.29 శాతం కలిగి ఉంది. ఈ పథకం ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో 58 స్టాక్స్ ఉన్నాయి. మూడు రంగాల కంపెనీల్లోనే 44 శాతం వరకు ఇన్వెస్ట్ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌కు 27 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఆ తర్వాత సేవల రంగానికి 9 శాతం వరకు కేటాయింపులు ఉన్నాయి. ఎనర్జీ, టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ రంగాలకు సుమారు ఐదు శాతం చొప్పున కేటాయింపులు ఉన్నాయి. ఈ పథకంలో కనీసం రూ.1,000 మొత్తంతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతీ నెలా సిప్ రూపంలో అయితే రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. టాప్ హోల్డింగ్స్ అంశం పెట్టుబడుల శాతం హెచ్డీఎఫ్సీ 5.85 ఎస్బీఐ 4.55 కోటక్ బ్యాంకు 3.95 బీపీసీఎల్ 2.99 ఆర్ఐఎల్ 2.74 ఇన్ఫోసిస్ 2.53 దివిస్ ల్యాబ్స్ 2.43 ఐసీఐసీఐ బ్యాంకు 2.39 ఐటీసీ 2.36 భారతీ ఎయిర్టెల్ 2.29 -
హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
హెచ్ఎస్బీసీ ఫ్లెక్సి డెట్ గ్రోత్ ఫండ్‌లో ఆర్నెల్ల క్రితం కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. కానీ ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. వేరే ఫండ్‌కు మారిపోవడం మంచిదా? దీంట్లోనే కొనసాగమంటారా? - ఆంజనేయులు, నరసాపురం మరీ దీర్ఘకాలానికి కాకుండా, మరీ స్వల్పకాలానికి కాకుండా కొంత కాలం పెట్టుబడులకు మాత్రమే డైనమిక్ బాండ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలి. జూన్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించడంతో ఈ ఫండ్స్‌పై ప్రభావం పడింది. రానున్న రెండేళ్లలో ఈ ఫండ్ పనితీరు బాగా ఉంటుంది. అప్పటివరకూ ఓపిక పట్టగలిగితే ఈ ఫండ్‌లోనే కొనసాగండి. అప్పటి వరకూ వేచి ఉండే వెసులుబాటు లేకపోతే, ఈ ఫండ్ నుంచి మీ పెట్టుబడులను ఉపసంహరించి, మీరు ఎంత కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఆ కాల పరిమితి ఉన్న డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎంపీ), లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్-టెర్మ్ ఫండ్స్, ఇతర షార్ట్‌టెర్మ్ ఫండ్లను కూడా పరిశీలించవచ్చు. డాబర్‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ నుంచి అవైవా సంస్థ వైదొలగాలని యోచిస్తున్నట్లు వార్త చదివాను. ఈ జేవీ నుంచి నేను అవైవా ఐ-లైఫ్ టెర్మ్ బీమా పాలసీ తీసుకున్నాను. వచ్చే నెలలో ఈ పాలసీని రెన్యూవల్ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ పాలసీని రెన్యూవల్ చేయమంటారా? లేక వేరే కంపెనీకి మారిపోమ్మంటారా? - శశికళ, నెల్లూరు భారత్‌కు చెందిన డాబర్ ఇండియా గ్రూప్, ఇంగ్లాండ్‌కు చెందిన అవైవా పీఎల్సీలు కలిసి అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేశాయి. ఈ జేవీలో అవైవాకు 26 శాతం వాటా ఉంది. ఈ జేవీ నుంచి అవైవా వైదొలుగుతున్న వార్తల పట్ల మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. గతంలో కూడా కొన్ని విదేశీ కంపెనీలు దేశీయ కంపెనీలతో ఏర్పాటు చేసిన జేవీల నుంచి వైదొలిగాయి. ఇలా వైదొలిగేటప్పుడు తమ వాటా ను ఇతర కంపెనీకో లేక జేవీలోని ఇతర భాగస్వామికో విక్రయించేవి. అందువల్ల మీ పాల సీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. మీ పాలసీ ఇంతకు ముందున్నట్లుగానే ఇప్పుడు కూడా ఉంటుంది. నియమ నిబంధనల్లో ఎలాంటి మార్పులుండవు. ఎలాంటి ఆందోళన చెందకుండా మీ పాలసీని రెన్యూవల్ చేయించండి. మీరు కొత్త పాలసీ తీసుకోవలసిన అవసరం లేదు. ఇటీవల మార్కెట్లోకి చాలా క్లోజ్డ్-ఎండ్ హైబ్రీడ్ ఫండ్స్ వచ్చాయి. వీటిల్లో అధిక భాగం రుణ పత్రాల్లోనూ, స్వల్పమొత్తంలో ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? - శేఖర్, విజయవాడ ఇలాంటి ఫండ్స్‌ల్లో ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్యాపిటల్ ప్రొటెక్షన్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టిపుల్ ఈల్డ్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు పెట్టడానికి వీలుంది. ఈ ఫండ్స్ ఇప్పుడు ఓపెన్‌గా ఉన్నాయి. ఇప్పటివరకూ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయనివారికి, ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ ఫండ్స్ అనుకూలం. ఈ ఫండ్స్‌లో అధిక భాగం స్థిర ఆదాయం వచ్చే సాధనాల్లో, 30-35 శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ వస్తున్నప్పటికీ, మీరు పొందే రాబడులపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎంపీ), షార్ట్ టెర్మ్ బాండ్ ఫండ్స్ కొంచెం మెరుగు. కానీ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని దానికి దీటుగా రాబడిని ఇవ్వలేవు. మీరు పేర్కొన్న హైబ్రీడ్ ఫండ్స్ 30 శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి స్థిర ఆదాయ సాధనాల కంటే మెరుగైన రాబడి వస్తుందని చెప్పవచ్చు. ఓపెన్ ఎండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ప్రతి రోజూ ఎన్ఏవీ ఎంత ఉంటుందో అని ఆందోళన చెందాల్సి ఉంటుంది. అలా కాకుండా నిర్దేశిత కాలపరిమితి ఉన్న క్లోజ్డ్-ఎండ్ ఫండ్స్‌లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఆ కాలపరిమితి తీరిన తర్వాతే ఆ ఫండ్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా మెరుగైన రాబడినే ఈ హైబ్రిడ్ ఫండ్స్ ఇస్తున్నాయి. అందుకని తొలిసారిగా ఇన్వెస్ట్ చేసేవారికి ఇలాంటి ఫండ్స్ ఉత్తమం. ఇవి క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్ కనుక క్రమం తప్పకుండా(నెలకొకసారి/రెండు నెలలకొకసారి కొంత కొంత మొత్తాల్లో) ఇన్వెస్ట్ చేసేవారికి ఈ ఫండ్స్ అనుకూలం కాదు. నేను బజాజ్ యూనిట్ గెయిన్ టూ, హెచ్డీఎఫ్సీ యంగ్స్టర్ల్లో ఇన్వెస్ట్ చేశాను. ఈ రెండు యులిప్స్లకు క్రిటికల్ ఇల్నెస్ రైడర్లున్నాయి. రైడర్లను కొనసాగించమంటారా? వద్దంటారా? - క్రిష్టోఫర్, సికింద్రాబాద్ రైడర్లను కొనసాగించాలో, వద్దో అనేది పాలసీదారు విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ మీరు రైడర్లు వద్దనుకుంటే, ఒక దరఖాస్తును నింపి సదరు బీమా సంస్థకు సమర్పించాలి. రైడర్ నుంచి ఒకసారి వైదొలిగితే, భవిష్యత్తులో దానిని పునరుద్ధరించే వీలు లేదన్న విషయాన్ని మాత్రం మరువకండి. ధీరేంద్ర కుమార్ సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్