Hybrid Funds for Better Returns - Sakshi
Sakshi News home page

మెరుగైన రాబడులకు హైబ్రీడ్‌ వ్యూహం..

Published Mon, Jul 24 2023 6:24 AM | Last Updated on Mon, Jul 24 2023 3:18 PM

Hybrid Funds for better returns - Sakshi

ఎస్‌ నరేన్, ఈడీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ

ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజాలు వారెన్‌ బఫెట్‌ కావచ్చు.. హోవార్డ్‌ మార్క్స్‌ కావచ్చు.. చౌకగా లభిస్తున్న విలువైన అసెట్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మెరుగైన రాబడులు అందుకునేందుకు అధిక అవకాశాలు ఉంటాయని చెబుతారు. ఈ విషయంలో హైబ్రీడ్‌ ఫండ్స్‌కి మెరుగైన రికార్డు ఉంది. చౌకగా లభిస్తున్న విలువైన అసెట్స్‌ను గుర్తించి, ఇన్వెస్ట్‌ చేయడంలో ఇవి బాగా రాణిస్తున్నాయి. రిసు్కలకు తగ్గట్లుగా హైబ్రీడ్‌ వ్యూహాలు మంచి రాబడులు అందించగలుగుతున్నాయి.  

హైబ్రీడ్‌ ఫండ్స్‌లో ప్రధానంగా అయిదు రకాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్ధ్యాలను బట్టి వీటిని పరిశీలించవచ్చు. అవేంటంటే..

► కన్జర్వేటివ్‌ హైబ్రీడ్‌: ఈ ఫండ్స్‌ 10–25 శాతం ఈక్విటీల్లోను, మిగతా 75–90 శాతం మొత్తాన్ని డెట్‌ సాధనాల్లోను ఇన్వెస్ట్‌ చేస్తాయి. రిస్కు సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్నవారు, డెట్‌కు ప్రాధాన్యం ఇస్తూనే కాస్త అధిక రాబడుల కోసం ఈక్విటీల్లోనూ కొంత ఇన్వెస్ట్‌ చేయదల్చుకున్నవారికి ఇవి అనువైనవిగా ఉంటాయి.  
► అగ్రెసివ్‌ హైబ్రీడ్‌: ఈ కేటగిరీ స్కీముల కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో, మిగతా 20–35 శాతాన్ని డెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. అధిక రిస్కు సామర్ధ్యాలు ఉన్న ఇన్వెస్టర్లకు ఇవి అనువైనవి.  
► బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌: ఈ ఫండ్స్‌లో అసెట్స్‌కు కేటాయింపులు డైనమిక్‌గా మారుతుంటాయి. కాబట్టి మార్కెట్‌ పరిస్థితులను బట్టి పోర్ట్‌ఫోలియోలోని 0–100 శాతం మొత్తాన్ని పూర్తిగా ఈక్విటీల్లోనైనా లేదా డెట్‌లోనైనా ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఒక మోస్తరు రిస్కు సామరŠాధ్యలు ఉన్నవారికి ఇవి అనువైనవి.  
► మలీ్ట–అసెట్‌ అలొకేషన్‌: ఈ కేటగిరీ ఫండ్‌లు ఈక్విటీ, డెట్, బంగారం/వెండి, రీట్స్, ఇని్వట్స్‌ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఈ అసెట్స్‌ అన్నీ పరస్పరం సంబంధం లేకుండా వివిధ రకాలైనవి కావడం వల్ల తగు విధమైన డైవర్సిఫికేషన్‌ వీలవుతుంది. రాబడులూ మెరుగ్గా ఉండగలవు. ఉదాహరణకు గతేడాది బెంచ్‌మార్క్‌ రాబడులు 5.8 శాతం స్థాయిలో ఉండగా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మలీ్ట–అసెట్‌ ఫండ్‌ గతేడాది 16.8 శాతం రాబడులు ఇచి్చంది.  
► ఈక్విటీ సేవింగ్స్‌: ఈ ఫండ్స్‌ ఈక్విటీ, తత్సంబంధ సాధనాల్లో 65 శాతం వరకు, డెట్‌లో 10 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఈక్విటీ విభాగంలో చాలా మటుకు ఫండ్స్‌ డెరివేటివ్స్‌ను ఉపయోగిస్తాయి. తద్వారా రిస్కును తగ్గించడంపై దృష్టి పెడతాయి. ఇన్వెస్టర్లకు డెట్‌కన్నా మెరుగ్గా, ఈక్విటీ కన్నా కాస్త తక్కువగా రాబడులను అందించేందుకు ఈ తరహా ఫండ్స్‌ ప్రయతి్నస్తాయి. రిస్కు సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్న వారు వీటిని పరిశీలించవచ్చు.
 

మలీ్ట–అసెట్‌ విధానం పాటిస్తాయి కాబట్టి ఓపికగా ఉండే ఇన్వెస్టర్లకు రిసు్కలకు తగినట్లుగా మెరుగైన రాబడులను అందించేందుకు హైబ్రీడ్‌ ఫండ్స్‌ ప్రయతి్నస్తాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement