Record Revenues
-
ఎంబసీ రీట్స్‌కు రూ.889 కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్ సెపె్టంబర్ క్వార్టర్‌కు 4 శాతం అధికంగా రూ.889 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.857 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.524 కోట్లను వాటాదారులకు పంపిణీ చేయాలని (ఒక్కో యూనిట్‌కు రూ.5.53 చొప్పున) ఎంబసీ రీట్ నిర్ణయించింది. రికార్డు స్థాయిలో 2 మిలియన్ చదరపు అడుగుల లీజును నమోదు చేసినట్టు ఎంబసీ రీట్ సీఈవో అరవింద్ మాయా తెలిపారు. ‘‘2023–24 మొదటి ఆరు నెలల్లో 3.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇచ్చాం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి పనితీరు పరంగా ఆశావహంగా ఉన్నాం’’అని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6 మిలియన్ చదరపు అడుగుల లీజ్ ఉంటుందన్న గత అంచనాలను, 6.5 మిలియన్ చదరపు అడుగులకు పెంచినట్టు తెలిపారు. -
మెరుగైన రాబడులకు హైబ్రీడ్ వ్యూహం..
ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాలు వారెన్ బఫెట్ కావచ్చు.. హోవార్డ్ మార్క్స్ కావచ్చు.. చౌకగా లభిస్తున్న విలువైన అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులు అందుకునేందుకు అధిక అవకాశాలు ఉంటాయని చెబుతారు. ఈ విషయంలో హైబ్రీడ్ ఫండ్స్‌కి మెరుగైన రికార్డు ఉంది. చౌకగా లభిస్తున్న విలువైన అసెట్స్‌ను గుర్తించి, ఇన్వెస్ట్ చేయడంలో ఇవి బాగా రాణిస్తున్నాయి. రిసు్కలకు తగ్గట్లుగా హైబ్రీడ్ వ్యూహాలు మంచి రాబడులు అందించగలుగుతున్నాయి. హైబ్రీడ్ ఫండ్స్‌లో ప్రధానంగా అయిదు రకాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్ధ్యాలను బట్టి వీటిని పరిశీలించవచ్చు. అవేంటంటే.. ► కన్జర్వేటివ్ హైబ్రీడ్: ఈ ఫండ్స్ 10–25 శాతం ఈక్విటీల్లోను, మిగతా 75–90 శాతం మొత్తాన్ని డెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్కు సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్నవారు, డెట్‌కు ప్రాధాన్యం ఇస్తూనే కాస్త అధిక రాబడుల కోసం ఈక్విటీల్లోనూ కొంత ఇన్వెస్ట్ చేయదల్చుకున్నవారికి ఇవి అనువైనవిగా ఉంటాయి. ► అగ్రెసివ్ హైబ్రీడ్: ఈ కేటగిరీ స్కీముల కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో, మిగతా 20–35 శాతాన్ని డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. అధిక రిస్కు సామర్ధ్యాలు ఉన్న ఇన్వెస్టర్లకు ఇవి అనువైనవి. ► బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్: ఈ ఫండ్స్‌లో అసెట్స్‌కు కేటాయింపులు డైనమిక్‌గా మారుతుంటాయి. కాబట్టి మార్కెట్ పరిస్థితులను బట్టి పోర్ట్‌ఫోలియోలోని 0–100 శాతం మొత్తాన్ని పూర్తిగా ఈక్విటీల్లోనైనా లేదా డెట్లోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక మోస్తరు రిస్కు సామరŠాధ్యలు ఉన్నవారికి ఇవి అనువైనవి. ► మలీ్ట–అసెట్ అలొకేషన్: ఈ కేటగిరీ ఫండ్లు ఈక్విటీ, డెట్, బంగారం/వెండి, రీట్స్, ఇని్వట్స్ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ అసెట్స్ అన్నీ పరస్పరం సంబంధం లేకుండా వివిధ రకాలైనవి కావడం వల్ల తగు విధమైన డైవర్సిఫికేషన్ వీలవుతుంది. రాబడులూ మెరుగ్గా ఉండగలవు. ఉదాహరణకు గతేడాది బెంచ్‌మార్క్ రాబడులు 5.8 శాతం స్థాయిలో ఉండగా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మలీ్ట–అసెట్ ఫండ్ గతేడాది 16.8 శాతం రాబడులు ఇచి్చంది. ► ఈక్విటీ సేవింగ్స్: ఈ ఫండ్స్ ఈక్విటీ, తత్సంబంధ సాధనాల్లో 65 శాతం వరకు, డెట్‌లో 10 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ విభాగంలో చాలా మటుకు ఫండ్స్ డెరివేటివ్స్‌ను ఉపయోగిస్తాయి. తద్వారా రిస్కును తగ్గించడంపై దృష్టి పెడతాయి. ఇన్వెస్టర్లకు డెట్కన్నా మెరుగ్గా, ఈక్విటీ కన్నా కాస్త తక్కువగా రాబడులను అందించేందుకు ఈ తరహా ఫండ్స్ ప్రయతి్నస్తాయి. రిస్కు సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్న వారు వీటిని పరిశీలించవచ్చు. మలీ్ట–అసెట్ విధానం పాటిస్తాయి కాబట్టి ఓపికగా ఉండే ఇన్వెస్టర్లకు రిసు్కలకు తగినట్లుగా మెరుగైన రాబడులను అందించేందుకు హైబ్రీడ్ ఫండ్స్ ప్రయతి్నస్తాయి. -
సంఘటిత ఆభరణాల పరిశ్రమకు స్వర్ణయుగం
ముంబై: సంఘటిత రంగంలోని జ్యుయలరీ వర్తకుల వ్యాపారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో 20 శాతం వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. నియంత్రణలు కఠినంగా మారుతుండడం, బ్రాండెడ్ జ్యుయలరీకి కస్టమర్ల ప్రాధాన్యం పెరగడం, కంపెనీల విస్తరణ ఈ వృద్ధికి దోహదపడే అంశాలుగా పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. మధ్య కాలానికి జ్యుయలరీ పరిశ్రమలో సంఘటిత రంగం వాటా మెరుగైన వృద్ధిని చూపిస్తుందని పేర్కొంది. అసంఘటిత రంగం నుంచి క్రమంగా మార్కెట్ సంఘటితం వైపు మళ్లుతోందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం జ్యుయలరీ పరిశ్రమ ఆదాయం 15 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని, ఇదే కాలంలో ఈ రంగంలోని సంఘటిత విభాగం 20 శాతం వృద్ధిని చూస్తుందని వివరించింది. బంగారం ఆభరణాల రిటైల్ విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 15 శాతం పెరుగుతాయని అంచనా వే సింది. మొదటి ఆరు నెలల్లో అక్షయ తృతీయ, పండుగలతో 35 శాతం వృద్ధిని చూడడం ఇందుకు దోహదం చేస్తుందని ఇక్రా పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో అధిక వృద్ధి కారణంగా, చివరి త్రైమాసికంలో (2023 జనవరి–మార్చి) డిమాండ్ స్తబ్ధుగా ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఆరోగ్యకరంగానే ఉందంటూ.. అధిక ద్రవ్యోల్బణం, గ్రామీణ ఆర్థిక రికవరీ నిదానంగా ఉండడం, వినియోగదారుల సెంటిమెంట్ బలంగా లేకపోవడం అవరోధాలుగా పేర్కొంది. 2023–24లో 5 శాతానికి పరిమితం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023–24) జ్యుయలరీ రంగంలో వృద్ధి కేవలం 5 శాతానికి పరిమితం అవుతుందని ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక విక్రయాల బేస్ నమోదు కావడం, స్థూల ఆర్థిక అంశాలను కారణంగా చూపించింది. అయినప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులతో సంఘటిత జ్యులయరీ విభాగం 10 శాతం ఆదాయం వృద్ధిని చూపిస్తుందని ఇక్రా అంచనా వేస్తోంది. జ్యుయలరీ స్టోర్ల విస్తరణను రుణాలతో చేపడుతున్నప్పటికీ, పెద్ద సంస్థల రుణ భారం సౌకర్యవంతంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘చాలా వరకు సంస్థాగత జ్యుయలరీ కంపెనీలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మార్కెట్ వాటాను సొంతం చేసుకునే విధంగా 2022–23 మొదటి ఆరు నెలల్లో అడుగులు వేశాయి. వచ్చే 12–18 నెలల్లో స్టోర్ల సంఖ్య 10 శాతం పెరగనుంది’’ అని ఇక్రా తన నివేదికలో వివరించింది. -
కాకినాడ యాంకరేజ్ పోర్టు.. కొత్త రికార్డులు
సాక్షి, అమరావతి: కరోనాతో ఒకపక్క అంతర్జాతీయ లావాదేవీలు నిలిచిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కాకినాడ యాంకరేజ్ పోర్టు రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. పోర్టు చరిత్రలో తొలిసారిగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.49.87 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి రికార్డు సృష్టించింది. యాంకరేజ్ పోర్టులో 100 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికే ఉండటంతో ఈ మొత్తం రాష్ట్ర ఖజానకు వచ్చి చేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆదాయంలో 37.61 శాతం వృద్ధి నమోదయ్యింది. 2019–20లో కాకినాడ యాంకరేజ్ పోర్టు రూ.36.24 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2019–20 కాలంలో కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి రూ.2,420 కోట్ల విలువైన 11,68,730 టన్నుల సరుకు ఎగుమతి కాగా 2020–21లో రికార్డు స్థాయిలో రూ.5,104 కోట్ల విలువైన 28,21,222 టన్నుల సరుకు ఎగుమతులు జరిగాయి. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే యాంకరేజ్ పోర్టు కార్గో నిర్వహణ సామర్థ్యంలో 141 శాతం వృద్ధి నమోదయితే, విలువ పరంగా 110 శాతం వృద్ధిని నమోదు చేసింది. బియ్యం ఎగుమతులకు భారీ డిమాండ్ లాక్‌డౌన్‌తో కొంతకాలం పోర్టు లావాదేవీలు నిలిచిపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా బియ్యానికి డిమాండ్ పెరగడంతో యాంకరేజ్ పోర్టుకు కలిసొచ్చింది. రాష్ట్రంలో పంటలు సంవృద్ధిగా పండటం, దక్షిణాఫ్రికా దేశాల నుంచి బియ్యానికి డిమాండ్ రావడంతో ఈ ఏడాది బియ్యం ఎగుమగుతులు బాగా జరిగినట్లు పోర్టు అధికారులు వెల్లడించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు ఏడు నుంచి 8 ఓడలు లోడింగ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటే పోర్టుకు వెలుపుల ఏకంగా 12 నుంచి 15 ఓడలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.82 మిలియన్ టన్నుల సరుకులు యాంకరేజ్ పోర్టు నుంచి ఎగుమతి కాగా అందులో 2.78 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతులు జరగడం గమనార్హం. -
అశోక్ లేలాండ్ అదరహా!
ముంబై: డీమానిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ హెవీ కమర్షియల్ వెహికల్స్ తయారీ సంస్థ అశోక్ లేలాండ్ మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని, నికర లాబాలను రిపోర్టు చేసింది. వాల్యూమ్స్ లో కూడా వేగం బాగా పుంజుకున్న ఈ హిందుజా ఫ్లాగ్ షిప్ అశోక్ లేలాండ్ నికర లాభం రూ.185. 88కోట్లను ఆర్జించింది. రూ 4.723 కోట్ల అమ్మకాలపై ఈ లాభాలను నమోదుచేసింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ రూ నికర లాభం రూ.213. 70 కోట్లగా వుంది. ఈ త్రైమాసికంలో అశోక్ లేలాండ్ రికార్డు వాల్యూమ్లను పోస్ట్ చేసింది. మీడియం అండ్ హెవీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు25,285 యూనిట్లుగా నిలిచాయి. ఈ త్రైమాసికంలో మెటీరయల్ కాస్ట్ బాగా పెరగడం సవాల్ గా మారిందని అశోక్ లేలాండ్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వినోద్ కె దాసరి తెలిపారు. డీమానిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ, ఇపుడిపుడే పరిశ్రమ కోలుకుంటోందన్నారు. ఆరోగ్యకరమైన ఆపరేటింగ్ మార్జిన్లు నిర్వహణ తరువాతి క్వార్టర్ లో చాలా సానుకూల ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నామన్నారు. భారీ వాణిజ్య వాహనాల డిమాండ్ పుంజుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో అశోక్ లేలాండ్ పాజిటివ్ గా ఉందనుందని ఐడిబిఐ క్యాపిటల్ మార్కెట్ & సెక్యూరిటీస్ హెడ్ ఎకె ప్రభాకర్ చెప్పారు. దీంతో నేటి మార్కెట్లో 7.16 శాతం వృద్ధిని సాధించి నిఫ్టీని అధిగమించింది.