
న్యూఢిల్లీ: ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్ సెపె్టంబర్ క్వార్టర్‌కు 4 శాతం అధికంగా రూ.889 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.857 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.524 కోట్లను వాటాదారులకు పంపిణీ చేయాలని (ఒక్కో యూనిట్‌కు రూ.5.53 చొప్పున) ఎంబసీ రీట్ నిర్ణయించింది.
రికార్డు స్థాయిలో 2 మిలియన్ చదరపు అడుగుల లీజును నమోదు చేసినట్టు ఎంబసీ రీట్ సీఈవో అరవింద్ మాయా తెలిపారు. ‘‘2023–24 మొదటి ఆరు నెలల్లో 3.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇచ్చాం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి పనితీరు పరంగా ఆశావహంగా ఉన్నాం’’అని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6 మిలియన్ చదరపు అడుగుల లీజ్ ఉంటుందన్న గత అంచనాలను, 6.5 మిలియన్ చదరపు అడుగులకు పెంచినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment