embassy office
-
యూఎస్ వెళ్లేవారికి శుభవార్త! 2.5 లక్షల వీసా స్లాట్లు
భారత్ నుంచి యూఎస్ వెళ్లే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. 2024లో ఇప్పటివరకు 12 లక్షల మంది అమెరికా వచ్చినట్లు యూఎస్ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు. వీసాల కోసం పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతోందన్నారు. దాంతో భారతీయ ప్రయాణికుల కోసం అదనంగా 2,50,000 వీసా అపాయింట్మెంట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు.అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటక ప్రకారం..2024లో ఇప్పటివరకు 1.2 మిలియన్లకు(12 లక్షలు) పైగా భారతీయులు యుఎస్‌కు వచ్చారు. 2023లో ఇదే కాలంతో పోలిస్తే వీరి సంఖ్య 35 శాతం పెరిగింది. సుమారు 60 లక్షల మంది భారతీయులు యూఎస్‌ను సందర్శించడానికి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాను కలిగి ఉన్నారు. పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థుల నుంచి వీసాల కోసం భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. దాంతో భారతీయ ప్రయాణికుల కోసం అదనంగా 2,50,000 వీసా అపాయింట్మెంట్లను కేటాయించారు.ఈ సందర్భంగా యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ..‘ఇండియా-యూఎస్ మిషన్‌లో భాగంగా గడిచిన రెండేళ్లలో పది లక్షల మంది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది వేసవిలో స్టూడెంట్ వీసాలను రికార్డు స్థాయిలో ప్రాసెస్ చేశాం. ఇరు దేశాల మధ్య వ్యాపారాలను సులభతరం చేయడానికి, పర్యాటకాన్ని పెంపొందించడానికి దృష్టి సారిస్తున్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరు దేశాల మధ్య వీసా ప్రక్రియను మెరుగుపరచాలని, వేగవంతం చేయాలని నిర్దేశించారు. ఇండియా నుంచి అమెరికా రావాలనుకుంటున్న వారి డిమాండ్‌ను తీర్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: రూ.16 లక్షల కోట్ల మార్కు దాటిన ‘మార్క్’ సంపద!అమెరికా గతంలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం..అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు జారీ చేసిన మొత్తం 6,00,000 విద్యార్థి వీసాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు భారతీయులే ఉండడం విశేషం. సందర్శకుల వీసా అపాయింట్మెంట్ల కోసం వేచి ఉండే సమయాన్ని 75 శాతానికి తగ్గించారు. -
Wall Street Journal: ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధమైన ఇరాన్!
వాషింగ్టన్: సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడితో పట్టరాని ఆవేశంతో ఊగిపోతున్న ఇరాన్ వచ్చే 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడే ప్రమాదం పొంచి ఉంది. ఎంబసీపై దాడిలో ఆర్మీ జనరళ్లు, సైన్యాధికారుల మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. దాడి చేస్తే రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతొల్లా అలీ ఖమేనీ చెబుతున్నాసరే ఆ దేశం తన నిర్ణయంపై వెనకడుగు వేసే పరిస్థితి లేదని కథనం వెల్లడించింది. నిజంగా దాడి జరిగితే పశి్చమాసియాలో యుద్ధజ్వాలలు ఊహించనంతగా ఎగసిపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ దాడి చేస్తే ప్రతిదాడికి ఇజ్రాయెల్ ఇప్పటికే రెడీ అయిపోయిందని తెలుస్తోంది. యుద్ధ సంసిద్దతపై వార్ కేబినెట్, రక్షణ శాఖ అధికారులతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ శుక్రవారం సమావేశం నిర్వహించారు. హమాస్‌తో ఇప్పట్లో ఆగని యుద్ధంలో తలమునకలైన ఇజ్రాయెల్.. ఇరాన్‌తోనూ కయ్యానికి కాలు దువ్వడంపై పశి్చమదేశాలు ఆందోళన చెందుతున్నాయి. డమాస్కస్‌పై దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ చెబుతుండగా ఇంతవరకూ ఈ విషయంలో ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏప్రిల్ ఒకటోతేదీ నాటి ఆ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఇద్దరు సైనిక జనరళ్లు సహా ఏడుగురు అధికారుల మరణమే ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. యుద్ధవాతావరణం నెలకొనడంతో ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్‌కు వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా, ఫ్రాన్స్ దేశాలు హెచ్చరికలు జారీచేశాయి. ఉద్రిక్తతను మరింత పెంచొద్దని ఇరాన్‌కు నచ్చజెప్పాలని టర్కీ, చైనా, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫోన్సంభాషణలో కోరారు. ఇరాన్ విషయంలో మీకు పూర్తి మద్దతు ఇస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్‌తో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ఇజ్రాయెల్, ఇరాన్‌లకు వెళ్లకండి పౌరులకు భారత సర్కార్ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: తాము చెప్పే వరకూ ఇజ్రాయెల్, ఇరాన్‌లకు ప్రయాణాల పెట్టుకోవద్దని పౌరులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం అడ్వైజరీని విడుదలచేసింది. ఇప్పటికే ఆ దేశాల్లో ఉంటే భారతీయ ఎంబసీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. నిర్మాణరంగంలో కారి్మకులుగా భారత్ నుంచి ఇకపై ఎవరినీ ఇజ్రాయెల్‌కు పంపబోమని భారత్ శుక్రవారం స్పష్టంచేసింది. -
ఎంబసీ రీట్స్‌కు రూ.889 కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్ సెపె్టంబర్ క్వార్టర్‌కు 4 శాతం అధికంగా రూ.889 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.857 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.524 కోట్లను వాటాదారులకు పంపిణీ చేయాలని (ఒక్కో యూనిట్‌కు రూ.5.53 చొప్పున) ఎంబసీ రీట్ నిర్ణయించింది. రికార్డు స్థాయిలో 2 మిలియన్ చదరపు అడుగుల లీజును నమోదు చేసినట్టు ఎంబసీ రీట్ సీఈవో అరవింద్ మాయా తెలిపారు. ‘‘2023–24 మొదటి ఆరు నెలల్లో 3.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇచ్చాం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి పనితీరు పరంగా ఆశావహంగా ఉన్నాం’’అని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6 మిలియన్ చదరపు అడుగుల లీజ్ ఉంటుందన్న గత అంచనాలను, 6.5 మిలియన్ చదరపు అడుగులకు పెంచినట్టు తెలిపారు. -
భారత్‌లో అఫ్గాన్ ఎంబసీ మూసివేత
న్యూఢిల్లీ: భారత్‌లో రాయబార కార్యాలయాన్ని అఫ్గానిస్థాన్ మూసివేసింది. ఆదివారం నుంచి కార్యకలాపాలన్నీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అఫ్గానిస్తాన్‌లో అష్రాఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబన్లు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత భారత్‌లో దౌత్యపరమైన కార్యకలాపాలన్నీ నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీలోని అఫ్గాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వనరుల కొరత, సిబ్బంది కొరతతో దౌత్య కార్యాలయాన్ని నిర్వహించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. పనిలో పనిగా భారత్‌పై కూడా ఆరోపణలు గుప్పించింది. భారత ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడం కూడా రాయ బార కార్యాలయాన్ని మూసివేయడానికి కారణమని ఆ ప్రకటనలో పేర్కొంది. భారత్ సహా ఎన్నో దేశాలు అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని ఇంకా గుర్తించడం లేదని వాపోయింది. -
ఎంబసీ బాత్రూమ్లో స్పై కెమెరాల కలకలం
రాయబార కార్యాలయంలోని ఆడవాళ్ల బాత్రూమ్లో స్పై కెమెరాల గుర్తింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. బ్యాంకాక్(థాయ్‌లాండ్)లోని ఆస్ట్రేలియా ఎంబసీ ఛాంబర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు శనివారం కాన్బెర్రా నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఎంబసీలో పని చేసిన మాజీ ఉద్యోగి పనే ఇదని తెలుస్తోంది. రాయల్ థాయ్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి.. విచారిస్తున్నట్లు సమాచారం. గతేడాది చివర్లో ఓ అధికారిణి బాత్రూమ్ ఫ్లోర్ మీద మెమొరీ కార్డును గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి.. థాయ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి.. జనవరి 6వ తేదీనే ఫిర్యాదు నమోదు అయినట్లు తెలుస్తోంది. కెమెరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? అనే విషయంపై నిర్ధారణ కోసం దర్యాప్తు కొనసాగుతోంది. -
తాలిబన్లకు చైనా మరింత మద్దతు, కీలక హామీ
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను వశం చేసుకున్న తాలిబన్ల పట్ల మొదటినుంచీ సానుకూలంగా ఉన్న చైనా మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అఫ్గాన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని తెరిచి ఉంచుతామని చైనా హామీ ఇచ్చిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అలాగే సంక్షోభంతో నష్టపోయిన అఫ్గాన్‌కు అందించే మానవతా సహాయాన్ని పెంచుతామని చైనా హామీ ఇచ్చినట్లు తాలిబాన్ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. అయితే దీనిపై చైనా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మేరకు దోహాలో తాలిబన్ల ప్రతినిది అబ్దుల్ సలాం హనాఫీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా డిప్యూటీ విదేశాంగ మంత్రి వు జియాంగావోతో ఫోన్ ద్వారా సంభాషించినట్టు సుహైల్ షాహీన్ ట్వీట్ చేశారు. కాబూల్‌లో తమ రాయబార కార్యాలయాన్ని నిర్వహించడం తోపాటు, గతంతో పోలిస్తే సంబంధాలు మరింత బలపడతాయని వు జియాంగావో తెలిపారన్నారు. అలాగే కోవిడ్-19 చికిత్సకు సంబంధించి తన సాయాన్ని పెంచనుందని అబ్దుల్ సలాం వెల్లడించారు. కాగా అఫ్గాన్‌లో 20 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లతో తొలిసారిగా మద్దతు ప్రకటించింది చైనా మాత్రమే. ఆ తరువాత పాకిస్తాన్, రష్యా కూడా తాలిబన్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. భద్రత క్షీణించడంతో తమ పౌరులను తరలిస్తున్నప్పటికీ కాబూల్‌లోని చైనా రాయబార కార్యాలయం పనిచేస్తోంది. ప్రస్తుత భద్రతా ఆందోళన దృష్ట్యా తక్షణమే కాకపోయినా, విస్తారమైన రాగి, లిథియం గనులపై చైనా కంపెనీలు కూడా దృష్టి పెట్టనున్నాని నిపుణులు చెబుతున్నారు. అలాగే తాలిబన్లు చైనాను పెట్టుబడి, ఆర్థిక మద్దతుకు కీలకమైన వనరుగా పరిగణించవచ్చని భావిస్తున్నారు. అఫ్గాన్‌లో శాంతి స్థాపన సయోధ్యతోపాటు, ఆ దేశ పునఃనిర్మాణంలో ఇప్పటికే చైనా ప్రకటించిన సహకారాన్ని స్వాగతించిన తాలిబన్లు అఫ్గాన్ అభివృద్దిలో చైనాదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 1/3 Abdul Salam Hanafi, Deputy Director, PO held a phone conversation with Wu Jianghao, Deputy Foreign Minister of the People’s Republic of China. Both sides discussed the ongoing situation of the country and future relations. The Chinese Deputy Foreign Minister said that — Suhail Shaheen. محمد سهیل شاهین (@suhailshaheen1) September 2, 2021 -
‘వెంటనే అఫ్గానిస్తాన్ విడిచి అమెరికా వెళ్లండి’
కాబూల్: అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా, యూరప్ దేశాల సైన్యం ఉపసంహరణతో తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. తాలిబన్ దాడులతో అట్టడుకుతున్న ఆఫ్గానిస్తాన్ దేశాన్ని విడిచి తమ పౌరులు వెంటనే ఆమెరికాకు వెళ్లాలని పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లో పెరుగుతున్న హింస నేపథ్యంలో అమెరికన్లకు భద్రతాపరమైన రక్షణ కల్పించడం పరిమితంగా మారిందని కాబూల్‌లోని యుఎస్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా రాయబార కార్యాలయంలో అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల్లో అమెరికా పౌరులు అఫ్గానిస్తాన్ నుంచి అమెరికాకు బయలుదేరాలని కోరింది. వాణిజ్య విమానాల టికెట్లను కొనుగోలు చేయడానికి వీలుకాని వారికి లోన్ రూపంలో టికెట్లకు డబ్బులు అందజేస్తామని వెల్లడించింది. కాబూల్ నగరం వెలుపల దేశీయ విమానాలు, రోడ్డు మార్గాలు పరిమితంగా ఉన్నాయిని, కొన్ని రహదారులు మూసివేసినట్లు పేర్కొంది. తాలిబన్లు ఇప్పటికే అఫ్గానిస్తాన్‌లోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం అఫ్గానిస్తాన్ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ మీడియా సెంటర్ డైరెక్టర్‌ను తాలిబన్లు కాల్చి చంపి విధ్వంసం సృష్టించారు. -
ఇజ్రాయెల్ ఎంబసీ పేలుడు; ఎన్ఐఏ అదుపులో నలుగురు
ఢిల్లీ: ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద చోటుచేసుకున్న పేలుడు కేసులో నలుగురు యువకులను ఎన్ఐఏ గురువారం అదుపులోకి తీసుకుంది. కాగా జనవరి 29న ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. హై సెక్యూరిటీ జోన్‌లోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో సంభవించిన ఈ ఘటనలో అప్పట్లో ఎవరు గాయపడలేదు. కాగా ఆరోజు సాయంత్రం 5 గంటల సమయంలో దౌత్య కార్యాలయం సమీపంలోని ఓ పూలకుండీలో ఉంచిన ఐఈడీ పేలింది. దాని తీవ్రతకు దగ్గర్లో పార్కు చేసిన మూడు కార్ల అద్దాలు మాత్రం పగిలిపోయాయి. -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు: ప్రతీకారచర్యే!..
సాక్షి, న్యూఢిల్లీ : రాజధానిలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద శుక్రవారం సంభవించిన పేలుడు ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించారు. ప్రైవేట్ క్యాబ్‌లో ఎంబసీ వద్దకు వెళ్లిన నిందితులు.. అక్కడి ఓ పూల కుండీలో బాంబు పెట్టినట్లు కనుగొన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం వద్ద పేలుడు పదార్థాలకు ఉపయోగించే సామాగ్రి.. తీగలు, బాల్ బేరింగ్, ఇతర వస్తువులను, ఓ లేఖను కూడా గుర్తించారు. చదవండి : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు ఇజ్రాయెల్ రాయబారిని హెచ్చరిస్తూ లేఖ రాశారు నిందితులు. ఇరాన్ అణు శాస్త్రవేత్త, జనరల్ అధికారిని చంపిన విషయం లేఖలో ప్రస్తావించారు. అందుకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్ ఎంబసీని లక్ష్యంగా చేసుకున్నట్లు లేఖలో వెల్లడించారు. నిందితులు ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. -
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు
న్యూఢిల్లీ: ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఎదుట శుక్రవారం సాయంత్రం ఐఈడీ పేలుడు సంభవించింది. హై సెక్యూరిటీ జోన్‌లోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో సంభవించిన ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో దౌత్య కార్యాలయం సమీపంలోని ఓ పూలకుండీలో ఉంచిన ఐఈడీ పేలింది. దాని తీవ్రతకు దగ్గర్లో పార్కు చేసిన మూడు కార్ల అద్దాలు మాత్రం పగిలిపోయాయని పోలీసులు తెలిపారు. సంచలనాన్ని సృష్టించేందుకు చేసిన ప్రయత్నమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తినష్టం వాటిల్లలేదు. అయితే, అదే సమయంలో కొద్ది కిలోమీటర్ల దూరంలో రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ తదితరులు రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనడం గమనార్హం. ఘటన నేపథ్యంలో విదేశాంగ మంత్రి జై శంకర్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గబి అష్కెనాజీతో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందికి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామనీ, బాధ్యులను వదిలిపెట్టబోమని ప్రభుత్వం ట్విట్టర్లో తెలిపింది. విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రోతోపాటు ముఖ్యమైన, కీలక ప్రభుత్వ విభాగాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సీఐఎస్ఎఫ్కు ఆదేశాలు అందాయి. -
అమెరికా వీసాలకు అంతా రెడీ!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువు కోవాలనుకునే భారత విద్యార్థులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. స్టూడెంట్, అకడమిక్ ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసాల దరఖాస్తు ప్రక్రియను పరిమితంగా ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈనెల 17న హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాల్లోని యూఎస్ ఎంబసీల్లో ఈ ప్రక్రియ మొదలుకానుందని హైదరాబాద్‌లోని కాన్సులేట్ శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో పరిమిత స్థాయిలోనే ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు వివ రించింది. శీతాకాల సెమిస్టర్ (ఫాల్ సెమిస్టర్) ప్రారంభమయ్యే సమయానికి తమ వద్ద చాలా తక్కువ అపాయింట్మెంట్లు మాత్రమే ఉన్నందున.. వాటి కోసం వచ్చే అన్ని విజ్ఞప్తు లనూ పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. తరగతులు ఎప్పుడు మొదలవుతాయి? అపాయింట్మెంట్ల కోసం విజ్ఞప్తులు ఎప్పుడు అందాయనే ప్రాతిపదికన వాటిని పరిశీలిస్తామని, ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులు వేచి చూడాలని సూచించింది. తొలుత ఆగస్టు 12వ తేదీకి ముందు వచ్చిన అత్యవసర విద్యార్థి, ఎక్స్ఛేంజ్ విజిటర్ అభ్యర్థనలను పరిశీలించి వీసా అపాయింట్ మెంట్లను ఇస్తామని పేర్కొంది. ఆ తర్వాత అందుబాటులో ఉన్న అవకాశాలు, అవస రాన్ని బట్టి రెండు వారాల ముందు అపాయింట్మెంట్లు ఇస్తామని తెలిపింది. అమెరికాలో చదవాలనుకుంటున్న విద్యా ర్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్స్ తమ తరగతులు మొదలుకావడానికి 3 వారాల కంటే ముందు మాత్రమే అపాయింట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అపా యిం ట్మెంట్ వివరాలను ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్లో సరిచూసుకోవాలని పేర్కొంది. ఆ వీసా సర్వీసుల నిలిపివేత యథాతథం.. సాధారణ ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ వీసా సర్వీసుల నిలిపివేత మాత్రం యథాతథంగా కొనసాగుతుందని, వీలైనంత త్వరగానే సాధారణ వీసా సర్వీసులను మొదలుపెట్టే అవకాశాలున్నా.. దానికి సంబంధించిన తేదీని మాత్రం వెల్లడించలేమని కాన్సులేట్ తెలి పింది. గతంలో ఎమ్మార్వీ ఫీజు కట్టినవారు ఏడాదిలోగా దానిని ఇంటర్వూ్య అపాయింట్ మెంట్ షెడ్యూల్ కోసం ఉపయోగించు కోవచ్చునని స్పష్టం చేసింది. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారు ‘ఎమర్జెన్సీ అపాయింట్మెంట్’కోసం సూచించిన మార్గ దర్శకాలను పాటించాలని సూచించింది. ఇక హెచ్1బీ, హెచ్2బీ, హెచ్4, ఎల్, కొన్ని జే కేటగిరీల దరఖాస్తుదారులు తాము అపాయిం ట్మెంట్ పొందడానికి వీలుందో లేదో పరిశీ లించిన తర్వాత అందుకు విజ్ఞప్తి చేయాలని స్పష్టంచేసింది. అమెరికా వెళ్లేందుకు తమకు ఏ వీసా కేటగిరి సరిపోతుందని అనేది డైరెక్టరీలో సరిచూసుకోవాలని సూచించింది. కాగా, హైదరాబాద్ నుంచి దాదాపు 8వేల మంది విద్యార్థులకు అమెరికా వెళ్లే అవకాశం లభించ నుందని సమాచారం. వీసా అపాయింట్ మెంట్లు, ఇంటర్వూ్యలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 1 నుంచి వీసాల జారీకి అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. -
అమెరికా ఎంబసీపై రాకెట్ దాడి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీకి సమీపంలో రాకెట్ దాడి జరిగింది. మూడు కత్యూష రాకెట్లు ఎంబసీ హై సెక్యూరిటీ కాంపౌండ్ వద్ద పడ్డాయని ఒకరు చెప్పగా, దాదాపు 5 రాకెట్లు పడ్డాయని మరొక సాక్షి తెలిపారు. అయితే హై సెక్యూరిటీ గ్రీన్ జోన్ వద్ద 5 రాకెట్లు పడ్డాయని ఇరాక్ భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి. అయి తే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపాయి. ఈ ప్రాంతంలో ఇతర దేశాలకు సంబంధించిన ఎంబసీలు కూడా ఉన్నా యి. రెండు రోజుల క్రితమే బాగ్దాద్‌లో అమెరికా బలగాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. ఇరాన్ జనరల్ సులేమానీని అమెరికా హతమార్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో అస్థిరత నెలకొంది. -
నేడు ఒమన్‌లో ఓపెన్ హౌస్
సాక్షి : ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయంలో నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. ఆ దేశంలో నివసించే ఎన్నారైలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఇండియన్ ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను చర్చించే అవకాశం లభిస్తుంది. ఒమన్‌లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు ఎంబసీ హెల్పలైన్ నెంబర్ +968 2469 5981 టోల్‌ఫ్రీ నంబర్ 8007 1234కు సంప్రదించవచ్చు. ఎంబసీ ఇ-మెయిల్ cw.muscat@mea.gov.in మరియు inde mbassy.muscar@mea.gov.in ఇండియన్ ఎంబసీ వెబ్సైట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. -
కానిస్టేబుల్ పై చేయిచేసుకున్న మహిళపై కేసు
న్యూఢిల్లీ: ఓ కానిస్టేబుల్ పై అనవసరంగా చేయిచేసుకున్న జర్మన్ ఎంబాసీలో పనిచేస్తున్న భారతీయ మహిళపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన 2 వారాల అనంతరం ఆమెపై కేసు నమోదు కావడం గమనార్హం. మే 5 వ తేదీన నగరంలోని మహర్షి రమణ్ మార్గ్ లో విధుల్లో ఉన్న మహ్మద్ ఫరూఖ్ అనే కానిస్టేబుల్ పై ఆ మహిళ దుర్భాలాడటంతో పాటు, అతనిపై చేయి చేసుకుంది. ఆ మార్గంలో వెళ్లడానికి వాహనానికి పాస్ అనివార్యం కావడంతో ఆమెను కానిస్టేబుల్ ఆపడంతో వివాదం రాజుకుంది. పాస్ ఉండాల్సిందేనని తేల్చి చెప్పడంతో కారులోంచి వేగంగా దూసుకొచ్చిన ఆమె అతనిపై చేయి చేసుకుని బూతుల పంచాంగం అందుకుంది. అనంతరం అతనిపై దురుసుగా ప్రవర్తించింది. కాగా, ఆమె కారు నంబర్ ను నోట్ చేసినా.. వెంటనే ఆ వివరాలను సేకరించడంలో జాప్యం జరిగిందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆమె అడ్రస్ ను కనుగొన్న పోలీసులు వివరాలు వెల్లడించారు. ఆ మహిళ చాణక్యపురిలో ఉన్న జర్మన్ ఎంబాసీలో పని చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. అయినప్పటికీ ఆమెపై చర్యలు తీసుకోవడానికి ఎటువంటి మినహాయింపు ఉండదన్నారు. త్వరలోనే ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు.