భారత్‌లో అఫ్గాన్‌ ఎంబసీ మూసివేత | Afghanistan closes embassy in India citing lack of diplomatic support | Sakshi
Sakshi News home page

భారత్‌లో అఫ్గాన్‌ ఎంబసీ మూసివేత

Published Mon, Oct 2 2023 6:16 AM | Last Updated on Mon, Oct 2 2023 6:16 AM

Afghanistan closes embassy in India citing lack of diplomatic support - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో రాయబార కార్యాలయాన్ని అఫ్గానిస్థాన్‌ మూసివేసింది. ఆదివారం నుంచి కార్యకలాపాలన్నీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అఫ్గానిస్తాన్‌లో అష్రాఫ్‌ ఘనీ ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబన్లు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత భారత్‌లో దౌత్యపరమైన కార్యకలాపాలన్నీ నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీలోని అఫ్గాన్‌ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల  చేసింది. 

వనరుల కొరత, సిబ్బంది కొరతతో దౌత్య కార్యాలయాన్ని నిర్వహించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. పనిలో పనిగా భారత్‌పై కూడా ఆరోపణలు గుప్పించింది. భారత ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడం కూడా రాయ బార కార్యాలయాన్ని మూసివేయడానికి కారణమని ఆ ప్రకటనలో పేర్కొంది.  భారత్‌ సహా ఎన్నో దేశాలు అఫ్గాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వాన్ని ఇంకా గుర్తించడం లేదని వాపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement